అంగారకుడు

సూర్యుడి దగ్గర నుంచి నాలుగో గ్రహం

అంగారకుడు సౌరవ్యవస్థలోని గ్రహాలలో నాలుగవ గ్రహం. దీనికి కుజుడు అనే పేరు కూడా ఉంది. దీని రంగు కారణంగా 'అరుణ గ్రహం' అని కూడా పేరు వచ్చింది. ఇది సౌర కుటుంబం సూర్యుని చుట్టూ పరిభ్రమించే 9 గ్రహాలలో నాలుగో స్థానంలో ఉంటుంది. ఈ గ్రహం సూర్యుడు నుంచి 14 కోట్ల పది లక్షల మైళ్ళ దూరంలో ఉంది ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు పడుతుంది ఆగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 14 గంటల   30 నిమిషాల సమయం పడుతుంది.ఈ గ్రహంలో ఎర్ర రాళ్లు  ఉండటం వలన ఎర్రగా ఉంటుంది సూర్యుని చుట్టూ తిరిగే దీనికి కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది అందువలన ఇది పరిభ్రమించే టప్పుడు కొన్ని సమయాల్లో దగ్గరగానే మరి కొన్ని సమయాల్లో దూరంగానే ఉంటుంది దీని పరిమాణం భూ పరిమాణాల్లో 1/9  వంతు.

అంగారకుడు ♂
అంగారక గ్రహం
అంగారక గ్రహం

హబుల్ టెలీస్కోపు నుండి 'అంగారకుడు'
కక్ష్యా లక్షణాలు[1]
Epoch J2000
అపహేళి: 249,209,300 km
1.665861 AU
పరిహేళి: 206,669,000 km
1.381497 AU
Semi-major axis: 227,939,100 km
1.523679 AU
అసమకేంద్రత (Eccentricity): 0.093315
కక్ష్యా వ్యవధి: 686.971 day

1.8808 Julian years

668.5991 sols
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: 779.96 day
2.135 Julian years
సగటు కక్ష్యా వేగం: 24.077 km/s
వాలు: 1.850°
5.65° to సూర్యుని మధ్యరేఖ (నడిమి గీఁత)
Longitude of ascending node: 49.562°
Argument of perihelion: 286.537°
దీని ఉపగ్రహాలు: 2
భౌతిక లక్షణాలు
మధ్యరేఖ వద్ద వ్యాసార్థం: 3,396.2 ± 0.1 km[2][3]
0.533 Earths
ధ్రువాల వద్ద వ్యాసార్థం: 3,376.2 ± 0.1 km[2][3]
0.531 Earths
ఉపరితల వైశాల్యం: 144,798,500 km²
0.284 Earths
ఘనపరిమాణం: 1.6318×1011 km³
0.151 Earths
ద్రవ్యరాశి: 6.4185×1023 kg
0.107 Earths
సగటు సాంద్రత: 3.934 g/cm³
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 3.69 m/s²
0.376 g
పలాయన వేగం: 5.027 km/s
సైడిరియల్ రోజు: 1.025957 day
24.62296 h
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: 868.22 km/h
అక్షాంశ వాలు: 25.19°
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: 21 h 10 min 44 s
317.68143°
డిక్లనేషన్: 52.88650°
అల్బిడో: 0.15
ఉపరితల ఉష్ణోగ్రత:
   Kelvin
   సెల్సియస్
కనిష్ఠసగటుగరిష్ఠ
186 K227 K268 K[4]
−87 °C−46 °C−5 °C
Apparent magnitude: +1.8 to -2.91[5]
Angular size: 3.5" — 25.1"[5]
విశేషాలు: 'అంగారకుని'
వాతావరణం
ఉపరితల పీడనం: 0.7–0.9 kPa
సమ్మేళనం: 95.72% కార్బన్ డై ఆక్సైడ్

2.7% నైట్రోజన్
1.6% ఆర్గాన్
0.2% ఆక్సిజన్
0.07% కార్బన్ మోనాక్సైడ్
0.03% నీటి ఆవిరి
0.01% నైట్రిక్ ఆక్సైడ్
2.5 ppm నియాన్
300 ppb క్రిప్టాన్
130 ppb ఫార్మాల్డిహైడ్
80 ppb క్జినాన్
30 ppb ఓజోన్

10 ppb మిథేను

అంగారకుడి పుట్టుక గుఱించి హిందూ పురాణాల్లో మూడు కథలు వాడుకలో ఉన్నాయి.

1. భూదేవికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకే అంగారకుడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.

2. ఒకసారి, నేల మీద పడ్డ విష్ణువు చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుట్టాడు. అతను తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారాడు. ఆ గ్రహమే 'కుజ గ్రహం' అని పద్మ పురాణం చెబుతుంది.

3. దాక్షాయణి దూరమైన ఎడబాటులో ఉన్న శివుడి శరీరం లోంచి రాలిన ఓ చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుడితే, భూదేవి అతన్ని తన సొంత కొడుకుఁగా చేరదీసిందనీ, అతనే కుజుఁడని మరో కథ కూడా నానుడిలో ఉంది.

కుజ గ్రహానికి రెండు సహజసిద్ధ ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫోబోస్, డెయిమోస్, ఇవి చిన్నవిగాను, గుండ్రతనం కొఱవడి అనాకారంగాను ఉన్నాయి.[5]

భౌతిక లక్షణాలు

అంగారకుడు లేదా కుజ గ్రహము, భూమి వ్యాసార్ధంలో సగం, గరిమ పదోవంతు మాత్రమే కలిగిఉన్నాడు. భూమిపై గల భూభాగం కంటే కొద్దిగా తక్కువ ఉపరితలాన్ని కలిగి ఉన్నాడు. భూమి కడలులని మినహాయించితే మిగిలిన నేల అంత కంటెను కొంచెం తక్కువ కలిగి యున్నాడు. [5] బుధగ్రహం కంటే ఎక్కువ గరిమ గలిగి ఉన్నాడు. కుజ గ్రహ ఉపరితలం 'ఎర్ర-నారింజ' రంగులో అగుపించడానికి కారణం దానిపై 'ఐరన్ (III) ఆక్సైడ్, లేదా హెమటైట్ లేదా త్రుప్పు ఉండడమే.[6]

వాతావరణం

అంగారకునిపై ఉండే బాగా పలుచని వాతావరణం, నిమ్నకక్ష్య నుండి చూచినపుడు.

అంగారకునిపై 'మాగ్నెటోస్ఫియర్' నాలుగు బిలియన్ల సంవత్సరాల క్రితమే అంతమైంది, అందులకే, సౌరవాయువు (సోలార్ విండ్), అంగారకుని అయనో ఆవణం పై నేరుగా తాఁకఁగలిగి దెబ్బ తీయగలుగుతోంది, ప్రభావం చూపుతుంది. ఇందులకు, అంగారకునిపై గల వాతావరణం, అంగారకుని వెనుక భాగాన అంతమైంది.[7][8]

ఉపగ్రహాలు (గ్రహ శకలాలు)

ఫోబోస్ (ఎడమ), డెయిమోస్ (కుడి).

అంగారకునికి, రెండు ఉపగ్రహాలు గలవు. అవి ఫోబోస్, డెయిమోస్. వీటిని ఉపగ్రహాలు అనడం కంటే గ్రహశకలాలు (ఏస్టరాయిడ్లు) అనడం సబబు. వీటికి నిర్దిష్టమైన ఆకారం లేదు. ఈ గ్రహానికి దగ్గరలో, ఉపగ్రహాలకు కావలసిన కొన్ని లక్షణాలు పుచ్చుకొని పరిభ్రమిస్తున్నాయి.[9]

యాత్రలు

వైకింగ్ లాండర్ 1 ప్రదేశం

డజన్ల కొద్దీ ఈ, అంతరిక్ష నౌకలు, ఆర్బిటార్లు, ల్యాండర్లు,, రోవర్లు, అంగారకునిపై ప్రయోగింపబడ్డాయి. వీటిని సోవియట్ యూనియన్, నాసా, ఈసా. ఐరోపా, జేఎఎక్స్‌ఏ-జపాన్ మున్నగు వారు, అంగారకుని ఉపరితలం పై వాతావరణం,గ్రహగర్భశాస్త్రం మొదలగు పరిశోధనల కొరకు ప్రయోగించారు.

జరిగిన కార్యక్రమాలు

1964 లో నాసా వారు మొదటి సారిగా అంగారకునిపై విజయవంతంగా మార్టినర్ 4 ను ప్రయోగించారు. కుజుఁడి ఉపరితలంపై మొదటిసారిగా విజయవంతంగా సోవియట్ యూనియన్ వారు1971 లో తమ మార్స్ 2, మార్స్ 3 యాత్రలను ప్రయోగించారు. కానీ ఈ రెండు ప్రయోగాలలో, ఉపరితలంపై చేరిన మరుక్షణమే సంబంధాలు తెగిపోయాయి. తరువాత 1975 లో నాసా వైకింగ్ కార్యక్రమం ప్రారంభించి, వీటిలో గల రెండు ఆర్బిటర్లను సంధించారు. ప్రతిదీ ఒక ల్యాండర్ కలిగివున్నది. ఈ కార్యక్రమం మొదటిసారిగా అంగారకుని రంగుచిత్రాలు భూమిపైకి పంపగలిగినది,[10] మ్యాపులను,ఉపరితల విషయాలను భూమికి పంపింది. మరలా సోవియట్ యూనియన్ తన రెండు ప్రోబ్ లను పంపింది, మొదటిది విజయవంతం కాలేదు. రెండవది విజయవంతమైనది, అంగారకునికి చెందిన చిత్రాలను భూమికి పంపింది.

అంగారకునిపై తరువాత కార్యక్రమం, 'డాన్ మిషన్', సెరిస్ పై పరిశోధనా యాత్ర, '4 వెస్తా',, 'ఫినిక్స్ అంతరిక్ష నౌక' యాత్ర. దీనిని 2007 ఆగస్టు 4 న ప్రయోగించారు, ఇది మే-25 2008 న, అంగారకుని ఉత్తర ధృవం పైకి చేరుకుంటుంది. దీనిలో గల సూక్ష్మ కెమెరాలు, వెంట్రుకవాసి లోని వెయ్యవ వంతు సూక్ష్మమైన వస్తువుల చిత్రాలు తీయగలవు.[11]

2001 లో నాసా, మార్స్ ఒడిస్సీను విజయవంతంగా ప్రయోగించింది, ఇది ఇప్పటికీ తన నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతున్నది. దీని నిర్ధారిత సమయం మార్చి 2008 లో ముగిస్తున్నపటికీ దీనిని సెప్టెంబరు 2008 వరకూ పొడిగించారు. అంగారకునిపై హైడ్రోజన్, నీటి ఆనవాళ్ళు కనుగొనడమే దీని పని.[12]

వర్తమాన కార్యక్రమాలు

అంగారకునిపై స్పిరిట్ రోవర్ ల్యాండర్.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA, 2011 నవంబరు 26 న అట్లాంటిస్-5 రాకెట్ ద్వారా ప్రయోగించిన క్యురియాసిటి రోవర్ (శోధక నౌక ) 2012 ఆగస్టు 6 న అంగారక గ్రహం మీద ల్యాండ్ అయింది.

భారతదేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్), మంగల్యాన్ 2014 సెప్టెంబరు 24న అంగాకరక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. దాని లిక్విడ్ దూర బిందువు మోటార్ (లామ్) 24 నిమిషాల 16 సెకన్లు మండించబడిన తరువాత ఉదయం 07:17:32 గంటల షెడ్యూల్ సమయానికి ప్రవేశించింది. అంగారక గ్రహం మీద మీథేన్ ఉనికిని కనుగొనడం కోసం ఇది ప్రయోగింపబడింది.

దీంతో, భారతదేశం, మొదటి ప్రయత్నంలోనే అంగాకరక గ్రహ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్రకెక్కింది. (మంగల్యాన్), ఇస్రో యొక్క మొట్టమొదటి గ్రహాంతర ప్రయోగం. PSLV-C25 ద్వారా 5-11-13 న మామ్ ని ప్రయోగించారు.మామ్, 24-9-14 న అంగారకిడి దగ్గరకు చేరుకుంది. మంగల్యాన్ తన కలర్ కేమేరా ద్వారా అద్భుతమైన అంగారకుని చిత్రాలు తీసింది.

ఇప్పటివరకు వివిధ దేశాలు 51 మిషన్లను అంగారక కక్ష్యలోకి పంపగా 21 మాత్రమే విజయవంతమయ్యాయి. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడంతో భారత్ ప్రపంచవ్యాప్తంగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకోగలిగింది.

భవిష్యత్తు కార్యక్రమాలు

అంగారకునిపై గల 'డెత్ వ్యాలీ' మృతలోయ' పై గల పరీక్షా ప్రాంతంపై, పోలార్ ల్యాండర్

భారత్ మంగల్‌యాన్‌-2 ను 2022-2023 న ప్రాయోగించనుంది.

2003 లో అంగారకుడు భూమికి అతిదగ్గరగా

హబుల్ టెలీస్కోపు నుండి 1999 లో, ఉత్తర పైభాగం పైనుండి చూస్తే అంగారకుని చిత్రం

ఆగస్టు 27, 2003 న, 9:51:13 UT, సమయాన, అంగారకుడు, భూమికి అతిదగ్గరగా వచ్చాడు. ఈ విశేషం ప్రతి 60,000 సంవత్సరాలకోసారి జరుగుతుంది. అంగారకుడు భూమికి అతి దగ్గరగా 55,758,006 కి.మీ. వచ్చాడు. ఈ విశేషం దాదాపు సెప్టెంబరు 12 క్రీ.పూ. 57,617 లో జరిగినది, ఇంకోసారి ఈ ఘటన 2287 లో జరిగే అవకాశగలదు.

ప్రపంచ సంస్కృతిలో అంగారకుడు

చారిత్రాత్మక లంకెలు

మార్స్ అనే పేరు, అలనాఁటి రోమన్ల మతానికి చెందెడి వారు కొలుఁచుకొనెడి 'పోరాటముల యొక్క దేవత' పేరే . బాబిలోనియా లోని ఖగోళ శాస్త్రంలో 'నెర్గల్' లేదా అగ్నిదేవత,, యుద్ధ, వినాశ దేవత.[13] అరబ్బీలో 'అల్-మిరీఖ్' مریخ, టర్కిష్లో "మెరీహ్". పర్షియన్లో బహ్రామ్ ఉర్దూ, పర్షియన్ లలో مریخ. ప్రాచీన తురుష్కులు సాకిత్ అని అంటారు.చైనీయులు, జపనీయులు, కొరియన్లు, వియత్నామీయులు 'అగ్ని తార' 火星, అని సంబోధిస్తారు.మనిషి తెలివైన జీవి అని మనం గర్వంగా చెప్పుకుంటాం.

కాని మనిషి కంటే తెలివైన జీవులు అరుణగ్రహం (అంగారకుడు)లో జీవించాయని కొందరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. అంగారకుడిపై ఆనాడు కనిపించిన మానవ ముఖ రూపం నుంచి నిన్నా మొన్నటి గాంధీజీ ఆకృతి వరకు... కేవలం చిత్రాలు కావని... ఒకనాటి సంపన్న నాగరికతకు చెందిన సూచన ప్రాయమైన గుర్తులని అంటున్నారు. ఆ కథేమిటో తెలుసుకుందాం...

మన చిన్నప్పటి ఆకాశం పెద్ద కాన్వాస్. ప్రతి మేఘం చేయి తిరిగిన చిత్రకారుడి చిత్రమై మనల్ని గిలిగింతలు పెట్టేది. ‘ఆకాశంలో నేను గుర్రాన్ని చూశాను’ అని ఒకరంటే ‘నేను ఏనుగును చూశాను’ అని ఒకరు అనేవారు. మేఘాల్లో కనిపించే ‘చిత్ర’విచిత్రాలు అంగారక గ్రహంలోనూ ఎప్పటి నుంచో కనిపిస్తున్నాయి. తేడా ఏమిటంటే... మేఘాలు మన ఆనందానికి, ఆశ్చర్యానికి మాత్రమే పరిమితం. కానీ అంగారకగ్రహంలో కనిపించే ప్రతి చిత్రం ఎప్పటికప్పుడు చర్చను రేకెత్తిస్తోంది.

1976లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా )కు చెందిన వైకింగ్-1 స్పేస్‌క్రాఫ్ట్ అంగారకుడి చిత్రాలను భూమి మీదకు పంపింది. ఆ చిత్రాల్లో సైడోనియ అనే ప్రాంతంలో మానవ ముఖ రూపం బయటి పడింది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన భౌగోళిక ఆకారం అని కొద్దిమంది అంటే అలా ఏర్పడింది కాదని కొందరన్నారు.

ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమంటే, వైకింగ్ చిత్రాల కంటే ముందుగానే...1958 సెప్టెంబర్‌లో ‘ది ఫేస్ ఆన్ మార్స్’ పేరుతో కామిక్‌బుక్ వచ్చింది. విలియమ్‌సన్ రాసిన ఈ పుస్తకానికి జాక్ కిర్బే బొమ్మలు గీశాడు. ఈ కథలో అంగారకుడిపై వెళ్లిన అంతర్జాతీయ అంతరిక్షశాస్త్రవేత్తల బృందానికి అక్కడి కొండల్లో చెక్కిన మానవరూపం కనిపిస్తుంది!హైరిజుల్యుషన్ ఉన్న వైకింగ్ చిత్రాలు అందరికీ అందుబాటులో లేక పోవడంతో ఎవరి ఊహలకు అనుగుణంగా వారు వ్యాఖ్యానించుకునే పరిస్థితి ఏర్పడింది.

1998లో నాసాకు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ స్పేస్‌క్రాఫ్ట్ అతి దగ్లర్లో నుంచి తీసిన అంగారకుడి చిత్రాలను భూమి మీదికి పంపింది. వైకింగ్ చిత్రాల కంటే ఇవి ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయి. మానవ ముఖరూపం, కళ్లు, పెదాలు, ముక్కు... కొంత స్పష్టంగా గుర్తించడానికి వీలైంది.

మార్స్ ఆర్బిటర్ కెమెరా (ఎంఒసి) చిత్రించిన చిత్రాల ద్వారా అంగారకుడిపై మరి కొన్ని ఆకారాలను గుర్తించారు. ‘‘అంగారకుడిపై ఏర్పడిన ధూళిమేఘాలు వివిధరూపాలు ధరించి చెట్ల రూపాన్ని గుర్తుకు తెస్తున్నాయి తప్ప అక్కడ ఎలాంటి చెట్లు లేవు’’ అన్నారు వాళ్లు.

కొన్ని సంవత్సరాల క్రితం అంగారుకుడిపై మిథేన్ వాయువు ఆనవాళ్లు కనుగొనడంతో అంగారకుడిపై జీవుల గురించి ఆసక్తి మళ్లీ తాజాగా మొదలైంది. అంగారకుడికి సంబంధించిన సమాచారంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ప్రొఫెసర్ కోలిన్ (బ్రిటన్) ‘అంగారకుడిపై జీవుల ఉనికిని నిర్ధారించడానికి మీథేన్ వాయువు బలమైన నిదర్శనం’ అని చెప్పారు. అంగారకుడిపై వాతావరణం లేని కారణంగా పగటి ఊష్ణోగ్రతకు, రాత్రి ఊష్ణోగ్రతకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఫలితంగా అక్కడ జీవులు మనుగడకు అవకాశాలు తక్కువ అని కొందరు శాస్త్రవేత్తలు కోలిన్ నమ్మకాన్ని తోసిపుచ్చారు.

అంగారకుడిపై ఆశ్చర్యం గొలిపే ఆకారాలపై ఆసక్తి ఈనాటిది కాదు. 1784లో బ్రిటీష్ ఆస్ట్రానమర్ సర్ విలియమ్ హర్‌స్కెల్ ‘అంగారకుడిపై చీకటిగా కనిపించే ప్రాంతాలు సముద్రాలు, చీకటి తక్కువగా ఉన్న ప్రాంతాలు భూభాగం’ అని రాశారు. 1895లో పెర్సివల్ లోవెల్ అనే ఆస్ట్రానమర్ ‘మార్స్’ అనే పేరుతో రాసిన పుస్తకంలో అంగారకుడిపై కాలువలు ఉన్న విషయాన్ని రాశాడు. అయితే ఆ తరువాతి కాలంలో ఇది అవాస్తవంగా రుజువైంది. తక్కువ నాణ్యత ఉన్న టెలిస్కోప్‌ల కారణంగా ఆనాటి శాస్త్రవేత్తలు అంగారకుడిలోని ఆకారాలను రకరకాలుగా అర్థం చేసుకున్నారు. దర్పణభ్రమకు గురయ్యారు.

‘‘అంగారక గ్రహానికి ప్రత్యేకత ఉంది. అది ఎప్పటికప్పుడు మన భూమిని గుర్తుకు తెస్తుంది. ఏదో ఒక రోజు మనం అక్కడికి వెళ్లే వాళ్లమే’’ అన్నారు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్. మన భూమికి పొరుగు గ్రహమైన అంగారకుడితో ఒకప్పుడు మనకు బీరకాయపీచు బంధుత్వం ఉండేది. ఆ తరువాత అది దూరపు బంధుత్వంగా మారింది. ఇప్పుడు మాత్రం అంగారకుడితో మనకు దగ్గరి చుట్టరికం. చుట్టపు చూపుగా రేపో మాపో మనం అక్కడికి వెళ్లొచ్చు. సీతకోక చిలకతో చెలిమి చేయవచ్చు. గాంధీతాతతో మాట్లాడవచ్చు! అక్కడ సుసంపన్నమైన నాగరిత వెలిగి ఉంటే ఆ వెలుగు జాడలు వెదికి చూడవచ్చు. వేచి చూద్దాం!- యాకూబ్ పాషా

ఆర్థర్ సి. క్లార్క్ రాసిన తొలి సైన్స్ ఫిక్షన్ నవల ‘ది సాండ్స్ ఆఫ్ మార్స్’. 1951లో ప్రచురించబడిన ఈ నవల మంచి ఆదరణ పొందింది. మార్టిన్ గిబ్బన్ అనే సుప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ రచయిత అంగారక యాత్ర చేస్తాడు. అంగారక గ్రహం ప్రధానాధికారిని కలుస్తాడు. ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అంగారకుడిపై కంగారులను పోలిన జీవులను చూస్తాడు. అక్కడ మొక్కలను పెంచుతారనే విషయాన్ని తెలుసుకుంటాడు...ఇలా అంగారకుడికి సంబంధించి చిత్రవిచిత్ర విషయాలన్నీ ఈ నవలలో ఉన్నాయి. అంగారకుడిపై నీటి కాలువలు ఉన్నాయనే ఊహ ఆధారంగా క్లార్క్ ఈ నవల రచించాడు.

రోవర్ తీసిన చిత్రం, విక్టోరియా క్రేటర్, మూడు వారాలు తీసిన చిత్రం,అక్టోబరు 16 నుండి - నవంబరు 6, 2006.

వేదాలలో అంగారకుడు

తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది. సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.

సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము.గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.

అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.

చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.

గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామం కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.

అంగారము అనగా నిప్పు.అంగారకుడు అగ్నికి వికేశి కడుపున పుట్టెనని లింగపురాణం చెపుతుంది.అగ్నికి సంబంధిచిన ఇతర పేర్లన్నియు ఇతనికి ఉన్నాయి.ఇతనికి కుజుడని, వక్రుడని పెర్లు.వానికి సంబంధించిన జ్యోతిః కథను పరాశరుడు ఇట్లు చెప్పెను: "తొల్లి ప్రజాపతి సృష్టి చేయగోరి తన తేజమునుండి పుట్టిన అగ్నిలో హోమము చేసెను. ఆతేజము నుండి పుట్టిన అగ్నిలో హోమము చేసెను. ఆ తేజము అగ్నినుండి భూమికి ప్రాకెను. అది అచటి అగ్నితో కలసి ఉప్పర మెగసెను. దానజేసి అంగారకునకు ప్రాజాపత్యుడనియు, భౌముడనియు పేరు వచ్చెను. బ్రహ్మపనుపున నా భౌముడు భూచక్రమున తిరిగి తిరిగి వక్రగతి గలవాడాయెనుఇతనికి మంగళుడని మరియొక పేరు. ఇతనికి ఉష్ణ-అశ్రుముఖ-వ్యాల-రుధిరానన-నిస్త్రీంశముసల అను 5 ముఖములు కలవని సిద్ధాంతం.

ఇవీ చూడండి

మూలాలు , నోట్స్

బయటి లింకులు

  • Be on Mars – Anaglyphs from the Mars Rovers (3D)

వనరులు