కురితీబా

కురిటీబా బ్రెజిల్ రాష్ట్రం పరానాకు రాజధాని. ఆ రాష్ట్రంలో ఇది అతిపెద్ద నగరం. 2015 లో నగర జనాభా 18,79,355. కురిటీబా మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 32 లక్షలు. [1]

కురిటీబా లోని జార్డిమ్ బొటానికో

నగరం సముద్ర మట్టానికి 932 మీటర్ల ఎత్తున ఉంది. 1700 ల్లో పశువుల వ్యాపారానికి కేంద్రంగా ఉంటూ కురిటీబా, అభివృద్ధి చెందింది. తరువాత 1850, 1950 మధ్య కలప వ్యాపారం, వ్యవసాయ విస్తరణ కారణంగా విస్తరించింది. 1850 ల్లో, ఐరోపా వలస వాదులు తరంగాలుగా నగరానికి వలస వచ్చారు. వీరు ప్రధాన్ంగా జర్మన్లు, ఇటాలియన్లు, పోలిషు ప్రజలు, ఉక్రేనియన్లు ఉన్నారు. వీరు నగర ఆర్థికాభివృద్ధికి దోహద పడ్డారు .[2] వర్తమాన కాలంలో వలసలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అవి ముఖ్యంగా మధ్య ప్రాచ్యం నుండి జరుగుతున్నాయి. [3] 1960 ల తరువాత కురిటీబా జనాభా బాగా పెరిగింది.[4]

కురిటీబా ఆర్థక వ్యవస్థ పరిశ్రమలపై ఆధారపడి ఉంది. కార్ల తయారీ రంగంలో బ్రెజిల్‌లో రెండవ స్థానంలో ఉంది.

ఏటా 20 లక్షల మంది పర్యాటకులు నగరానికి వస్తూంటారు. ఇక్కడి విమానాశ్రయంలో ఏటా 60,000 విమానాలు దిగుతాయి.

2006 లో నగర జిడిపి 32 బిలియన్ల రియాల్‌లు. ఇందులో పరిశ్రమల వాటా 34.13% కాగా, వాణిజ్య, సేవల రంగాల వాటా 65.84%. నిస్సాన్, రెనో, వోక్స్‌వాగన్, ఫిలిప్ మోరిస్, ఆడి, వోల్వో, HSBC, సీమెన్స్, ఎక్సాన్‌మోబిల్, ఎలక్ట్రోలక్స్, క్రాఫ్ట్ ఫుడ్స్ వంటి బహుళ జాతి సంస్థలు నగరంలో ఉన్నాయి.

చూడదగ్గ ప్రదేశాలు

  • మునిసిపల్ మార్కెట్టు: నగర కేంద్ర బస్ స్టేషను వద్ద ఉంది.
  • ఇటాలియన్ వుడ్స్: స్థానిక ఉత్సవాలు జరుగుతాయి.[5]
  • వైర్ ఒపేరా హౌస్.[6]
  • ఆస్కార్ నేమేయర్ మ్యూజియమ్ [7]
  • పానొరామిక్ టవర్: 360 అడుగుల ఎత్తున్న టవరు.[7]
  • పోర్చుగల్ వుడ్
  • కురిటీబా అంతర్జాతీయ మారథాన్: ఏటా నవంబరులో ఇది జరుగుతుంది.[8]
  • పర్యాటక శ్రేణి.[9]

మూలాలు