జోన్ ఆఫ్ ఆర్క్

జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ ఫ్రాన్సు వీరవనిత

జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ ఒక అతి సామాన్య కుటుంబంలో ఫ్రాన్సులో లోరేన్‌ రాష్ట్రానికి దగ్గరలో ఉన్న డొయ్రెమీ అనే గ్రామంలో 1412లో జన్మించింది. తండ్రి ఒక వ్యవసాయ కూలి. కుటుంబసభ్యులు గొడ్లకాపరులు. కుటుంబం అంతా నిరక్షరాస్యులు. ఫ్రాన్సులో పుట్టిన ఆమె, తన కళ్ళ ఎదుటే విశాల ఫ్రాన్సు భూభాగాన్ని బ్రిటీషు రాజు జయించి దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలని చేస్తున్న ప్రయత్నం ఆమెను కలచివేసి, కర్తవ్యోన్ముఖురాలును చేసింది. మగవాడి రూపంలో సైన్యాన్ని నడిపించి శత్రుసేనలను గడగడ లాడించింది. మతం చేతిలో సజీవ దహనానికి గురైన జోన్ 500 సంవత్సరాల తర్వాత అదే మతంచేత దేవదూతగా కీర్తింపబడింది.

Joan of Arc
Painting, c. 1485. An artist's interpretation, since the only known direct portrait has not survived. (Centre Historique des Archives Nationales, Paris, AE II 2490)
Saint
జననం6 January c. 1412[1]
Domrémy, Duchy of Bar, France[2]
మరణం30 May 1431 (aged approx. 19)
Rouen, Normandy
(then under English rule)
గౌరవాలుRoman Catholic Church
Anglican Communion[3]
దైవత్వం18 April 1909, Notre Dame de Paris by Pope Pius X
కెనానైజ్డ్16 May 1920, St. Peter's Basilica, Rome by Pope Benedict XV
విందు30 May
పోషక ఋషిత్వంFrance; martyrs; captives; military personnel; people ridiculed for their piety; prisoners; soldiers, women who have served in the WAVES (Women Accepted for Volunteer Emergency Service); and Women's Army Corps

బాల్యం

జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ ఒక అతి సామాన్య కుటుంబంలో ఫ్రాన్సులో లోరేన్‌ రాష్ట్రానికి దగ్గరలో ఉన్న డొయ్రెమీ అనే గ్రామంలో 1412లో జన్మించింది. తండ్రి ఒక వ్యవసాయ కూలి. కుటుంబసభ్యులు గొడ్లకాపరులు. కుటుంబం అంతా నిరక్షరాస్యులు. అయినా నీతి, నిజాయితీ కుటుంబంగా పరోపకారం చేసే వ్యక్తులుగా పేరొందారు.ఆ కాలంలో మూఢనమ్మకాలు, అజ్ఞానం దశ దిశలా వ్యాపించి ఉన్నాయి. అతీత శక్తుల్లో నమ్మకం అధికంగా ఉండేది. ఫ్రాన్సును ఆక్రమించాలని ఇంగ్లండు రాజు ఒక శతాబ్దంపాటు ప్రయత్నించినా, అది పూర్తిగా సాధ్యంకాలేదు. ఫ్రెంచి ప్రజలు కొంపా, గోడు కోల్పోయి నిర్వాసితులుగా మారారు. నిరాశా, నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్న సామాన్యప్రజలకు, సైనికులకు జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ ఆశాజ్యోతిగా కనబడింది. బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించడం, వారిని దేశం నుండి తరిమివేయడం ఆ నవ యువతి తన కర్తవ్యంగా భావించింది. సైన్యం నిర్వీర్యమైన ఆ వాతావరణంలో రాజుకు ఆమె ఒక మార్గదర్శకు రాలిగా కనబడింది. దానికి కారణం ఆమెలో ఉన్న వాదనా పటిమ, కర్తవ్యదీక్ష, కార్యకుశలత. తనకు సైన్యాన్ని ఇచ్చినట్లయితే, ఫ్రాన్సు దేశం నుండి బ్రిటీష్‌ వారిని తరిమి వేస్తానని శపథం చేసింది. ముందు ఆమె మాటను నమ్మకపోయినా, మార్గాంతరం లేని రాజు 10వేల సైన్యాన్ని ఆమె ఆధిపత్యంలో ఉంచాడు. ఆమె ధైర్య సాహసాలు అపూర్వం. ప్రజలలో కర్తవ్యదీక్షను పెంపొందించడం ఆమె ప్రత్యేకత. దానితో నిద్రాణమైన, దిక్కుతోచని ఫ్రెంచి సైన్యానికి ఒక పురుషునిలాగా వేషం వేసుకొని, ఆధిపత్యం వహించి విజయపతాకాన్ని ఎగురవేసింది. ఇది ఎంతో చారిత్రాత్మకమైన విషయం. తనకు అండగా నిలిస్తే మొత్తం ఫ్రెంచి భూభాగం విముక్తి చేస్తానని ఆమె చెప్పినా, ఒక ప్రక్క మతం, మరోప్రక్క రాజా స్థానంలో వున్న విరోధులు ఆమె మాటను లెక్కపెట్ట లేదు. అయినా అధైర్యపడకుండా ఎన్నో యుద్ధాలలో ఆమె విజయాన్ని సాధించింది.

మతం చేతిలో శిక్షించబడటం

రాజాస్థానంలో కుట్రవల్ల ఆమెకు వ్యతిరేకంగా రాజుకు చాడీలు చెప్పారు. రాజు సరైన సహకారం అందించలేదు. చివరికి యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడిన ఆ నవయువతి బ్రిటీష్‌ వారికి బందీగా చిక్కింది. ఆ నారీ ప్రతాపాన్ని సహించలేని చర్చి ఆమెను బ్రిటీష్‌ వారికి బందీగా చేయడమేకాక 10వేల పౌండ్లకు ఆ వీరవనితను ఇంగ్లీషువారి నుండి రోమన్‌ కేథలిక్‌ చర్చి కొనుక్కొంది.క్రైస్తవ మతం 5 నెలలు జైలులో పెట్టి, ఆమెను చిత్రహింసలపాలు చేసింది. ఆమె తరఫున లాయర్‌ లేదు. కోర్టులో తానే వాదించుకుంది. అప్పుడు ఆమె వయస్సు 19 సంవత్సరాలు. కేథలిక్కు చర్చి ఆమెకు ఉరిశిక్ష విధించింది. ఆమెను సజీవంగా దహనం చేయాలని నిశ్చయించింది.మతం ఆమెను ఒక మంత్రకత్తెగా, సాతాను ప్రతినిధిగా అభివర్ణించింది. ఎంత ప్రయత్నం చేసినా, తనకు ప్రత్యేక శక్తులు వున్నాయని ఆమె ఒప్పుకోలేదు. గొలుసులతో బంధించారు. తనకు దేవుడు తప్ప మరెవ్వరూ సహాయం చేయలేదని ఆమె స్పష్టం చేసింది. 1431 మే 13న ఆమెను మార్కెట్‌ ప్లేస్‌లో సజీవంగా దహనం చేసి, అస్తికలను సైన్‌ నదిలో పారేశారు.

దేవదూతగా గుర్తింపు

సైతాను సహాయంతో ఆమె ఇంగ్లీషు సైన్యంపై విజయం సాధించింది అని మతం అనబట్టి, రాజు కూడా జోక్యం చేసుకోలేదు. ఫ్రెంచి ప్రజలు నిర్ఘాంతపోయారు. 500 సంవత్సరాలపాటు జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ వీరోచిత గాథ ఫ్రెంచి ప్రజలకు ఎంతో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని కలిగించింది. కాని, ఫ్రాన్సులో నానాటికీ పెరుగుతున్న హేతువాద భావాలు రోమన్‌ కేథలిక్‌ చర్చి చేసిన దురాగతాన్ని వేలెత్తి చూపించడం ప్రారంభించాయి.జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ మరణానంతరం 500 సంవత్సరాలకు చర్చికి జ్ఞానోదయం అయింది. తాను చేసిన తప్పు ఎంత పెద్దదో గుర్తించి ఆమెను దైవదూతగా వర్ణించి, సెయింట్‌గా 19వ శతాబ్దంలో ప్రకటించింది.

మహిళలా శక్తికి ఒక ప్రతీక

మూలాలు

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.