డొమినికా

కరిబ్బియన్ దేశం

డోమనికా (/ˌdɒmɪˈnkə/ DOM-i-NEE-kə;[6]

Commonwealth of Dominica

Flag of Dominica
జండా
Coat of arms of Dominica
Coat of arms
నినాదం: "Apres Bondie, C'est La Ter"[1] (Dominican Creole French)
"Post deum terra est " (Latin)
"After God is the earth"
గీతం: Isle of Beauty, Isle of Splendour
Location of  డొమినికా  (circled in red) in the Caribbean  (light yellow)
Location of  డొమినికా  (circled in red)

in the Caribbean  (light yellow)

Location of Dominica
రాజధానిRoseau
15°18′N 61°23′W / 15.300°N 61.383°W / 15.300; -61.383
అధికార భాషలుEnglish
Vernacular
languages
Dominican Creole French
జాతులు
(2001[2])
  • 86.6% Black
  • 9.1% Mixed
  • 2.9% Indigenous
  • 1.3% other
  • 0.2% unspecified
మతం
94.4% Christians
3% Folk Religion
0.5% Irreligious
0.1% Muslims
2.0% Other[3]
పిలుచువిధంDominican or Dominiquais
ప్రభుత్వంUnitary parliamentary republic
• President
Charles Savarin
• Prime Minister
Roosevelt Skerrit
శాసనవ్యవస్థHouse of Assembly of Dominica
Independence
• Associated Statehood Act 1967
1 March 1967
• from the United Kingdom
3 November 1978
విస్తీర్ణం
• మొత్తం
750 km2 (290 sq mi) (184th)
• నీరు (%)
1.6
జనాభా
• July 2009 estimate
72,660 (195th)
• 2016 census
72,324
• జనసాంద్రత
105/km2 (271.9/sq mi) (95th)
GDP (PPP)2016 estimate
• Total
$808 million[4]
• Per capita
$11,429[4]
GDP (nominal)2016 estimate
• Total
$521 million[4]
• Per capita
$7,362[4]
హెచ్‌డిఐ (2014)Increase 0.724[5]
high · 94th
ద్రవ్యంEast Caribbean dollar (XCD)
కాల విభాగంUTC–4 (Eastern Caribbean)
వాహనాలు నడుపు వైపుleft
ఫోన్ కోడ్+1-767
ISO 3166 codeDM
Internet TLD.dm

French: Dominique;ఐలాండ్ కరీబ్: [Wai‘tu kubuli] Error: {{Lang}}: text has italic markup (help)),అధికారికంగా " కామంవెల్ట్ ఆఫ్ డొమనికా " సార్వభౌమాధికారం కలిగిన ద్వీప దేశం.[7] జమైకా రాజధాని " రొసైయు " ద్వీపం లీవార్డ్ (గాలి తక్కువగా వీస్తున్న వైపు) సైడుగా ఉంది. కరీబియా సముద్రంలోని లెసర్ ఆంటిల్లెస్ ఆర్చిపెలాగొలోని ద్వీపాలలోని విండ్ వర్డ్ ఐలాండులలో జమైకా ఒకటి. డొమినికా గుయాడే లౌపే దక్షిణం- ఆగ్నేయ భాగం, మార్టింక్యూ వాయవ్యభాగంలో ఉంది.ద్వీపం వైశాల్యం 750చ.కి.మీ. 1447 మీ ఏత్తైన మొర్నే డియాబ్లొటింస్ దేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతుంది. 2014 గణాంకాలను అనుసరించి దేశం జనసంఖ్య 72,301.ఆరంభకాలంలో ద్వీపంలో కలినాగొ ప్రజలు నివసించారు. తరువాత యురేపియన్లు ఈ ద్వీపాన్ని కాలనీగా మార్చుకున్నారు.1494 నవంబరు 3న ఆదివారం రోజు క్రిస్టోఫర్ కొలంబస్ ఈదీవిని దాటి వెళ్ళాడు.దీర్ఘకాలం తరువాత 1690లో ఫ్రెంచి సైన్యం ఈద్వీపానికి చేరుకుని స్వాధీనం చేసుకుని "కొలంబస్ ద్వీపానికి చేరుకున్న ఆదివారం గుర్తుగా ద్వీపానికి " డోమినికన్ " (ఆదివారం) అని నామకరణం చేసింది.1763 లో ఏడుసంవత్సరాల యుద్ధం తరువాత గ్రేట్ బ్రిటన్ ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది. క్రమంగా ఆగ్లభాషను ద్వీపంలో అభివృద్ధి చేసింది.1978లో ద్వీపానికి స్వతంత్రం లభించింది.ఫ్రెంచి భాషలో ఈద్వీపాన్ని " డోమినిక్యూ " అంటారు. ఈద్వీపానికి ఉన్న సహజసౌందర్యం కారణంగా డోమినికా ద్వీపానికి " నేచుర్ ఇస్లే ఆఫ్ ది కరీబియన్ " అని మారుపేరు ఉంది.[8] లెసర్ అంటిల్లెస్‌లో ఇది చివరి ద్వీపం. ఇది జియోధర్మల్- వాల్కనిక్ ప్రభావాల కారణంగా ఉద్భవించిందనడానికి ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద " హాట్ స్పింగ్ ", " బాయింగ్ లేక్ " ఉన్నాయి.ద్వీపంలో సుసంపన్నమైన పర్వతమయమైన వర్షారణ్యాలు ఉన్నాయి.ద్వీపంలో అరుదైన మొక్కలు, జంతువులు , పక్షిజాతులు ఉన్నాయి. ద్వీపంలో అత్యధికమైన వర్షపాతం సంభవిస్తుంటుంది. సిస్సెరౌ పెరాట్(ఇంపీరియల్ అమెజాన్) డొమినికా ద్వీపంలో మాత్రమే కనిపిస్తుంది. ఇది డొమినికా జాతీయపక్షిగా డొమినికా జంఢాలో చేర్చబడింది. డోమనికా ఆర్ధికరగం పర్యాటకం , వ్యవసాయరంగం మీద ఆదారపడి ఉంది.

చరిత్ర

ఆరంభకాల యురేపియన్ ఒప్పదం

డొమనికాలో కాలనీకాలం కంటే ముందుగా " ఐలాండ్ కరీబియన్లు " నివసించారు. డొమనికా పేరుకు మూలం " డియెస్ డొమనికా " (ఆదివారం అని అర్ధం). 1493న క్రిస్టోఫర్ కొలమబస్ ఈదీవిని సందర్శించిన ఆదివారం అనేపదం ఈదీవికి పెట్టబడింది. కొంబియన్ కాలానికి ముందు ఈదీవిని " వై తు కుంబిలి " అంటే ఆమె శరీరం పొడవు (టాల్ ఈస్ హర్ బాడీ) అని అర్ధం.[9] యురేపియన్ అన్వేషకులు , సెటిలర్లు ఈద్వీపంలో ప్రవేసించిన తరువాత పొరుగున ఉన్న ద్వీపాలనుండి వచ్చి డొమనికాలో స్థిరపడిన స్థానిక ప్రజలు స్పెయిన్ సెటిలర్లను వెలుపలకు తరిమారు. వారు అధికమైన వనరులు ఉండి తాము నియంత్రించతగిన ఇతర ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్ళారు.

ఫ్రెంచి కాలని

డోమనికాను కాలనైజేషన్ చేయడానికి స్పెయిన్ కొంత ప్రయత్నించింది. 1632లో ఫ్రెంచి " కాంపాజిన్ డెస్ ఇలెస్ డీ ఐ అమెరిక్యూ " డొమనికా , పెటైట్ అంటిల్లెస్ " లను ఫ్రెంచి తరఫున స్వాధీనం చేసుకున్నాడు. అయినప్పటికీ ఈప్రాంతంలో భౌతికంగా ఆక్రమణలు జరపలేదు.1642, 1650 ఫ్రెంచి ఫ్రెంచి మిషన్‌కు చెందిన " రేమండ్ బ్రెటన్ " ఈద్వీపాన్ని తరచుగా సందర్శించడం ద్వారా ద్వీపానికి మొదటి రెగ్యులర్ యురేపియన్ సందర్శకుడయ్యాడు. 1660లో ఫ్రెంచి, ఇంగ్లీష్ డొమనికా, సెయింట్ విన్సెంట్‌లలో సెటిల్మెంటులు స్థాపించకుండా ఉంటామని కరీబియన్లకు సహజసంపదను వదిలిపెడతామని అంగీకరించారు. అయినప్పటికీ ద్వీపం సహజసంపదచేత ఆకర్షించబడిన ఇంగ్లీష్, ఫ్రెంచి ఫారెస్టర్లు టింబర్ హార్వెస్టింగ్ ఆరంభించారు.[10] 1690లో ఫ్రెంచి తమ శాశ్వత సెటిల్మెంటును స్థాపించింది.మార్టిన్‌క్యూకు, గుయాడిలొక్యూ చెందిన ఫ్రెంచి వుడ్‌కటర్స్ టింబర్ కేంపులు ఏర్పాటుచేయడం ప్రారంభించి ఫ్రెంచి ద్వీపాలకు వుడ్‌సరఫరాచేస్తూ క్రమంగా శాశ్వత సెటిల్మెంట్లు స్థాపించారు.వారు మొదటిసారిగా పశ్చిమాఫ్రికా నుండి బానిసలను డొమనిక్యూకు (అప్పుడి ఈప్రాంతం ఇలా పిలువబడింది) తీసుకువచ్చారు. 1775లో ఉత్తర మార్టింక్యూలోని పేదశ్వేతజాతీయులు చిన్నచిన్న వ్యవసాయదారులు (లా గుయాలె) ఒక తిరుగుబాటు ఆరంభించారు.[11] పర్యవసానంగా వారిలో చాలామంది దక్షిణ డొమనికా చేరుకుని అక్కడ చిన్నచిన్న వ్యవసాయక్షేత్రాలు ఏర్పరచుకున్నారు.గుయాడెలెక్యూ నుండి వచ్చిన ఫ్రంచి కుటుంబాలు, ఇతరులు ఉత్తర డొమనికాలో స్థిరపడ్డారు. 1727లో ఫ్రెంచి కమాండర్ " ఎం.లె.గ్రాండ్ " ఫ్రెంచి ప్రభుత్వం తరఫున ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాడు. డొమినిక్యూ అధికార పూర్వకంగా ఫ్రెంచి కాలనీగా మారింది. ద్వీపం జిల్లాలు, క్వార్టర్స్‌గా విభజించబడింది.[12] మార్టింక్యూ, గుయాడెలొక్యూలలో అప్పటికే చెరకు అభివృద్ధి చేసిన కారణంగా ఫ్రెంచి డొమనిక్యూ ద్వీపాన్ని కాఫీ పంటను అభివృద్ధి చేయడానికి ఎంచుకున్నది.శ్రామికశక్తిని పూరించడానికి ఫ్రెంచి ఆఫ్రికన్ బానిసలను ద్వీపానికి తీసుకుని వచ్చింది.క్రమంగా డొమనికా ఆఫ్రికన్ సంప్రదాయ ఆధిక్యత కలిగిన ప్రాంతంగా మారింది.1761లో ఐరోపా‌లో " ఏడు సంవత్సరాల యుద్ధం" సమయంలో డొమనికాకు వ్యతిరేకంగా " ఆండ్ర్యూ రొల్లొ " నాయకత్వంలో బ్రిటిష్ దాడిచేసి పలు ఇతర కరీబియన్ ద్వీపాలతో చేర్చి డొమనికా ద్వీపాన్ని మీద కూడా విజయం సాధించింది.1763లో " ట్రీటీ ఆఫ్ పారిస్ " ఆధారంగా ఫ్రెంచి ద్వీపాన్ని గ్రేట్ బ్రిటన్‌కు స్వాధీనం చేసింది.అదే సంవత్సరం బ్రిటిష్ యురేపియన్ కాలనీవాసులు మాత్రమే ప్రతినిధులుగా చేసి అసెంబ్లీని ఏర్పాటుచేసింది.ఫ్రెంచి అధికారభాషగా మిగిలినప్పటికీ ప్రజలలో ఆంటిల్లియన్ క్రియోల్ వాడుకభాషాగా ఉంది. 1778లో ఫ్రెంచి ప్రజల సహకారంతో డోమనికా దాడిని కొనసాగించింది. యుద్ధం " 1778 ట్రీటీ ఆఫ్ పారిస్ " అనుసరించి యుద్ధం ముగింపుకు వచ్చింది. 1795, 1805 ఫ్రెంచి దాడులు విఫలం అయ్యాయి.[10]

బ్రిటిష్ కాలనీ

A linen market in 1770s Dominica

1805లో గ్రేట్ బ్రిటన్ ఒక చిన్న కాలనీ స్థాపించబడింది. 1831లో అధికారిక బ్రిటిష్ జాతివివక్ష నుండి బ్రౌన్ చట్టం నల్లజాతీయులకు[13], మిశ్రితవర్ణ జాతీయులకు సాంఘిక, రాజకీయ హక్కులను కల్పించింది. 1833లో బ్రిటిష్ సామ్రాజ్యం అంతటా బానిసత్వం (భారతదేశం మినహాయింపుగా) నిర్మూలించబడింది.

ఆఫ్రికన్ ప్రాతినిధ్యం

1835లో మొదటిసారిగా ఆఫ్రికన్ సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పొరుగున ద్వీపాలలో ఉన్న అనేకమంది బానిసలు గ్యాడేలొక్యూ, మార్టినిక్యూ మొదలైన ద్వీపాల నుండి పారిపోయి డొమనికా ద్వీపానికి చేరుకున్నారు. 1838లో బ్రిటిష్ వెస్టిండీస్ దీవులలో డోమనికన్ సంప్రదాయ ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రతినిధులు కలిగిన అసెంబ్లీగా ప్రత్యేకత సంతర్రించుకుంది.ప్రతినిధులలో పలువురు బానిసత్వం రద్దుచేయడానికి ముందు చిన్నచిన్న వ్యవసాయక్షేత్రాల యజమానులుగా, వ్యాపారులుగా ఉన్నారు. వారి సాంఘిక, ఆర్థిక దృష్టి సంపన్న తోటల యజమానుల కంటే భిన్నంగా ఉండేది.తోట్ల యజమానులు వారి అధికారానికి భంగం కలుగుతున్న భీతితో బ్రిటిష్ ప్రభుత్వంతో సన్నిహితమైన ప్రత్యక్షసంబంధాలు ఏర్పరచుకున్నారు.[10] 1865లో కలవరం, ఆందోళన తరువాత సంగం మంది నియమిత సభ్యులు, సంగం మంది ఎన్నికచేయబడిన సభ్యులతో కాలనియల్ కార్యాలయం తరలించబడింది. తోటలయజమానులు కాలనియల్ నిర్వాహకులతో సంకీర్ణం ఏర్పరుచుకుని ఎన్నిక చేయబడిన సభ్యులను నిర్లక్ష్యం చేసారు. 1871లో డొమనికా " బ్రిటిష్ లీవర్డ్ ఐలాండ్స్ " భాగంగా మారింది. సంప్రదాయ ఆఫ్రికన్ల అధికారం తుడిచిపెట్టబడింది. 1896లో క్రౌన్ కాలనీ ప్రభుత్వం తిరిగి స్థాపించబడింది.సంఖ్యాపరంగా ఆధిక్యత కలిగిన మిశ్రిత వర్ణాలకు చెందిన ప్రజలకు, నల్లజాతీయులకు రాజకీయ హక్కులు అడ్డగించబడ్డాయి.సంప్రదాయ ఆఫ్రికన్ ప్రజల అభివృద్ధి పనులు నిర్లక్ష్యం చేయబడ్డాయి[10]

తరువాతి చరిత్ర -1900

మొదటి ప్రపంచయుద్ధంలో అనేకమంది డోమనికన్ ప్రజలు ప్రధానంగా కురువ్యవసాయదారుల కుమారులు బ్రిటిష్ తరఫున తరఫున ఐరోపా‌లో పోరాడడానికి స్వంచ్ఛందంగా ముందుకు వచ్చారు. యుద్ధం తరువాత కరీబియన్ అంతటా విస్తరించిన రాజకీయ అశాంతి డోమనికన్ స్వయంప్రతిపత్తి సాధించడానికి దారితీసింది.[10] రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కొంతమంది డొమనికన్ బ్రిటిష్, కరీబియన్ సైన్యంతో కలిసి పోరాడడానికి స్వచ్ఛందగా ముందుకు వచ్చారు. వేలాదిమంది ఫ్రెంచి ఆశ్రితులు మార్టినిగ్యూ, గుయాడెలోగ్యూ నుండి డోమనికా చేరుకున్నారు. 1958వరకు డోమనికా బ్రిటిష్ విండ్వర్డ్ ఐలాండ్స్‌లో భాగంగా ఉంది. 1958 నుండి 1962 వరకు కరీబియన్ ద్వీపాలు స్వతంత్రం కోరి పోరాడినప్పటికీ డోమనికా మాత్రం స్వల్పకాలం ఉనికిలో ఉన్న " వెస్ట్ ఇండీస్ ఫెడరేషన్‌ "లో భాగంగా ఉంది.[10] ఫెడరేషన్ రద్దుచేయబడిన తరువాత డోమనికా 1967 వరకు యునైటెడ్ కింగ్డం అసోసియేట్ దేశంగా మారింది.అయినప్పటికీ అధికారపూర్వకంగా అంతర్గతవ్యవహారాల బాధ్యతవహించింది.1978 నవంబరు 3న కామంవెల్ట్ డోమనికాకు స్వతంత్రం మంజూరు చేదింది.[10] డోమనికా రిపబ్లిక్ అయింది.[14] బ్రిటిష్ క్రౌన్ తరువాత అధికంగా దేశానికి నాయకత్వం వహించలేదు.1979 లో మొదలైన రాజకీయ అశాంతి కారణంగా మద్యంతర ప్రభుత్వం ఏర్పడింది. 1980 ఎన్నికల తరువాత కరీబియన్ మొదటి మహిళా ప్రధానమంత్రి " యుజెనియా కార్లెస్ " నాయకత్వంలో డోమనికన్ ఫ్రీడం పార్టీ అధికారం స్వంతం చేసుకుంది. 1981లో డోమనికా కూలీసైన్యం ఆక్రమణ జరగవచ్చని భీతి చెందింది.[15] 1979, 1980 లలో సంభవించిన హరికేన్‌లు తీవ్రమైన విధ్వంసం సృష్టించాయి.పర్డ్యూ (హ్యూస్టన్) నాయకత్వంలో ఆపరేషన్ రెడ్ డాగ్, వూల్ఫ్ డ్రొయెజ్ యుజెనియా చార్లెస్ ప్రభుత్వం పడగొట్ట్డానికి ప్రయత్నించారు.గత ప్రధానమంత్రి " పాట్రిక్ జాన్ "కు అమెరికన్ కూలీసైన్యం సహకారం అందించింది.పాట్రిక్ డోమనికా డిఫెంస్ ఫోర్స్ ద్వీపం తమ నియంత్రణలోకి తీసుకుంది. ప్రతిగా ద్వీప అభివృద్ధి పనులు అమెరికాకు అందించబడింది.కూలీసైన్యం ద్వీపంలో నిలిచింది.[16] 1980 నాటికి ఆర్థికరంగం కోలుకుంది.1990లో అరటి ధరలు పతనం అయినందున ఆర్థికరంగం తిరిగి బలహీనపడింది.[10] 2000 జనవరిలో " రూజ్వెల్ట్ పి.డగ్లస్ " నాయకత్వంలో డోమనికన్ పార్టీ విజయం సాధించింది.పదవీస్వీకారంచేసిన స్వల్పకాలంలో డగ్లస్ మరణించాడు.తరువాత అధికారపీఠం అధిష్టించిన పియర్రే చార్లెస్ 2004లో అధికారంలో ఉండగానే మరణించాడు. తరువాత రూజ్వెల్ట్ స్కెర్రిట్ పదవీ బాధ్యత వహించాడు. ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెర్రిట్ నాయకత్వంలో 2005 నిర్వహించబడిన ఎన్నికలలో రూజ్వెల్ట్ స్కెర్రిట్ విజయం సాధించాడు.[10]

భౌగోళికం , వాతావరణం

Dominica is an island in the Eastern Caribbean Sea, located about halfway between the French islands of Guadeloupe (to the north) and Martinique (to the south)
Map of Dominica.

కరీబియన్ సముద్రంలోని ద్వీపదేశాలలో డొమనికా ఒకటి. ఇది విండ్వర్డ్ ద్వీపాలలో ఉత్తరతీరంలో అలాగే లీవర్డ్ ద్వీపాలలో దక్షిణతీరంలో ఉంది.డొమనికా వైశాల్యం 289.5 చ.కి.మీ. డోమనికా దట్టంగా వర్షారణ్యాలతో నింపబడి ఉంది. ఇక్కడ ప్రపంచం అతిపెద్ద ఉష్ణగుండాలలో ద్వీతీయస్థానంలో ఉన్న ఉష్ణగుండం (మరుగుతున్న సరోవరం) ఉంది.[17] డోమనికాలో పలు జలపాతాలు, జలగుండాలు, నదులు ఉన్నాయి. దేశం ఈశాన్యభాగంలోని కాలిబిషీ ప్రాంతంలో ఇసుకతో కూడిన సముద్రతీరాలు (శాండీ బీచ్‌లు) ఉన్నాయి.[18] పొరుగున ఉన్న ద్వీపాలలో ఇప్పటికీ ఉనికిలో ఉన్న జంతువులు డొమనికా అరణ్యాలలో కనిపిస్తుంటాయి.[19] ద్వీపంలో పలు అభయారణ్యాలు, 365 నదులు ఉన్నాయి.ఉష్ణమండల అరణ్యంతో నిండి ఉన్న " మొర్నె ట్రాయిస్ నేషనల్ పార్క్ "లో అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి.[20] 1995 ఏప్రిల్ 4న డొమనికా నాలుగు కరీబియన్ ద్వీపాలతో కలిసి " ప్రపంచ వారసత్వ సంపద "గా గుర్తించబడింది.[21] " ఏవ్స్ " (సాధారణంగా బర్డ్ ఐలాండ్ అంటారు డొమనికా దీనిని బర్డ్ రాక్ అని పేర్కొంటుంది) సమీపంలోని సముద్రభూభాగం విషయంలో డోమనికా, వెనుజులా మద్య దీర్ఘకాల వివాదాలు కొనసాగుతున్నాయి.[22] డొమనికా పశిమంలో 140చ.మై (225 చ.కి.మీ) వైశాల్యం కలిగిన అతిచిన్న ద్వీపం ఉంది.డొమనికా ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెరిట్ వెనుజులా సందర్శించిన సమయంలో ఏవ్స్ ద్వీపం వెనుజులాకు స్వతం అని వెల్లడించిన తరువాత ఇరు దేశాల నడుమ ఉన్న భాభాగ వివాదం ముగింపుకు వచ్చినప్పటికీ సముద్రసరిహద్దు వివాదం పరిష్కరించబడలేదు.డొమినికాలో జనసంఖ్య అధికంగా కలిన ప్రంతాలలో రొసీయు (14,725)ప్రథమస్థానంలో, పోర్ట్స్ మౌత్ (4,167) ద్వితీయ స్థానంలో ఉన్నాయి.

జంతుజాలం , వృక్షజాలం

డోమనికా సుసంపన్నం, వైవిధ్యమైన వృక్షజాలం, జంతుజాలం కారణంగా " ది నేచుర్ ఆఫ్ ది కరీబియన్ "గా గుర్తించబడుతుంది. ఇవి విస్తారమైన నేచురల్ పార్క్ సిస్టం ద్వారా సంరక్షించబడుతున్నాయి. పర్వతమయంగా ఉన్న లెస్సర్ అంటిల్లెస్ ప్రాంతం లోని అగ్నిపర్వత శిఖరాలు లావా కోంస్, ఉష్ణగుండాలతో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఉష్ణగుండం మరుగుతున్న నీటితో సజీవంగా ఉంటుంది.[23] డొమనికా ఎత్తైన పర్వతప్రాంతమయమైన భూభాగం యురేపియన్లకు ఇక్కడ కోటలు నిర్మించడానికి, వ్యవసాయక్షేత్రాలు రూపొందించడానికి అనుకూలంగా ఉంది.పయాటకం ఇతర కరీబియన్ ప్రాంతాలలో సహజప్రాకృతిక ప్రాంతాలకు కలిగించిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని డొమనికా ప్రజలు సమీపకాలంలో ఎగువభూభాగాలలో పర్యాటకాన్ని నిరుత్సాహపరుస్తున్నారు. [ఆధారం చూపాలి]పర్యాటకులు ఉష్ణమండల అరణ్యాలు (యునెస్కో ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించిన ప్రాంతం ఒకటి ఇందులో ఉంది), వందలాది సెలయేరులు, సముద్రతీరాలు, పగడపు దిబ్బలు ఉన్నాయి.డొమనికాలో పర్యాటకులను ఆకర్షిస్తున్న పలువురు కళాకారులు ఉన్నారు.[ఆధారం చూపాలి]డొమినికా జాతీయపక్షి ఇంపీరియల్ అమెజాన్ (అమెజోనా ఇంపీరియల్స్)పక్షి అంతరించిపోతున్న పక్షిజాతులలో ఒకటి.ది జాకో (రెడ్ నెక్డ్ పెరాట్) కూడా అంతరించిపోతున్న డొమనికన్ పక్షిజాతులలో ఒకటిగా ఉంది. అరుదైనవి, సంరక్షించబడుతున్నవి రెండు పక్షులు కనిపిస్తున్న అరణ్యాలు లాగింగ్ కారణంగా క్షీణించి పోతున్నాయి. తుఫానుల భీతి కూడా ఇవి అంతరించడానికి ఒక కారణంగా ఉంది.

కరీబియన్ సముద్రం పలు సెటాసీన్ లకు నిలయం. ఈప్రాంతంలో సంవత్సరమంతా స్పెర్మ్‌ వేల్స్ గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి.ఇతర సెటాసిన్లలో స్పిన్నర్ డాల్ఫిన్, పాంట్రొపికల్ స్పాటెడ్ డాల్ఫిన్, బాటిల్ నోస్ డాల్ఫిన్‌లు ప్రత్యేకమైనవి.సాధారణంగా తక్కువగా కనిపించే జంతువులలో కిల్లర్ వేల్స్, ఫేల్స్ కిల్లర్ వేల్స్, పిగ్మీ స్పెర్మ్‌ వేల్, డ్వార్ఫ్ స్పెర్మ్‌, రిస్సొ డాల్ఫిన్, కామన్ డాల్ఫిన్, అట్లాంటిక్ స్పాటెడ్ డాల్ఫిన్, హంబ్యాక్ వేల్స్, బ్రైడ్ వేల్ ప్రధానమైనవి. వేల్ వాచింగ్ పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులకు డోమినికా ఆకర్షణీయమైనదిగా ఉంది.

ప్రకృతి విపత్తులు

డొమినికా తుఫాను బాధిత ప్రాంతాలలో ఒకటి. 1979లో డొమినికాను నేరుగా చేరిన కేటగిరి 5 హరికేన్ డేవిడ్ దేశమంతటా తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించింది.2007 ఆగస్టు 17న కేటగిరి 1 హరికేన్ డీన్ ద్వీపాన్ని చేరింది. అధికవర్షపాతం కారణంగా సంభవించిన భూకంపం కారణంగా ఇల్లుకూలి తల్లి కుమారులు మరణించారు.[24] మరొకసంఘటనలో చెట్టు ఇంటి మీద పడిన కారణంగా ఇద్దరు మనుష్యులు మరణించారు.[25] ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెర్రిట్ అంచనాలను అనుసరించి 100-125 నివాసగృహాలు దెబ్బతిన్నాయి, వ్యవసాయరంగం దారుణంగా నష్టపోయింది.ప్రత్యేకంగా అరటిపంట తీవ్రంగా దెబ్బతిన్నది.[26] 2015లో ఉష్ణమండల తుఫాను ద్వీపం అంతటా ఎరిక అపారమైన వరదలకు, భూమికోతలకు కారణం అయింది. అనేక మంది ప్రజలు ఎగువభూభాగానికి తరలి వెళ్ళారు. 30 మంది మరణించారు.[27] వరల్డ్ బ్యాంక్ తయారు చేసిన వివరణలో డోమినికా తుఫాను కారణంగా $484.82 మిలియన్లు (90% జి.డి.పి) నష్టం సంభవించిందని తెలియజేసింది.[28]

ఆర్ధికం

Graphical depiction of Dominica's product exports in 28 colour-coded categories.

డొమనికాలో " ఈస్ట్ కరీబియన్ డాలర్ " చెలామణిలో ఉంది. 2008లో ఈస్ట్ కరీబియన్ దేశాలలో అత్యంత తక్కువ జి.డి.పి. కలిగిన దేశాలలో డోమనికా ఒకటి.[29][30] 2003-2004 మద్య డొమనికా ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అయినప్పటికీ ఒక దశాబ్ధకాలం బలహీనంగా ఉన్న ఆర్థికస్థితి తరువాత 2005 నుండి డొమనికా ఆర్థికరంగం 3.5% అభివృద్ధి చెందింది, 2006 లో 4% అభివృద్ధి చెందింది. 2006 లో డోమినికాకు పర్యాటకరంగం, నిర్మాణరంగం, సేవారంగం, అరటి పరిశ్రమల నుండి తగినంత ఆదాయం లభించింది. సమీపకాలంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డొమినికా ప్రభుత్వం విజయవంతంగా నెరవేర్చిన మైక్రొ ఎకనమిక్ సంస్కరణలను ప్రశంసించింది.అలాగే ఐ.ఎం.ఎఫ్. డొమనికా ఎదుర్కొంటున్న ప్రభుత్వఋణం తగ్గించడం, ఫైనాంషియల్ సెక్షన్ క్రమబద్ధీకరణ మార్కెట్ డైవర్సిఫికేషన్ మొదలైన సవాళ్ళను చక్కదిద్దాలని సూచించింది.[10] డొమనికా ఆర్థికరంగాన్ని అరటి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఆధిక్యత చేస్తున్నాయి. శ్రామికశక్తిలో మూడింట ఒక వంతు వ్యవసాయరంగంలో పనిచేస్తుంది. అయినప్పటికీ వాతావరణ పరిస్థితుల వలన వ్యవసాయం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాది. ఎక్స్టర్నల్ ఈవెంట్లు అత్యావసర వస్తువుల ధరల మీద ప్రభావం చూపుతుంది.2007లో డీన్ హరికెన్ వ్యవసాయరగం, ఇంఫ్రాస్ట్రక్చర్‌ (ప్రత్యేకంగా రహదారులు) విపరీతంగా నష్టపడడానికి కారణంగా ఉంది. యురేపియన్ యూనియన్‌తో అరటి వ్యాపారం తగ్గినలోటు భర్తీచేయడానికి ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని అరటి నుండి మరలించి కాఫీ, పత్చౌలి, కలబంద, కత్తిరించిన పూలు, మామిడి,జామ, బొప్పాయి పటలు పండించడానికి ప్రయత్నిస్తుంది. డొమనికా " సిటిజన్‌షిప్ బై ఇంవెస్ట్‌మెంట్ " (పెట్టుబడి ఆధారిత పౌరసత్వం) అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.[31]

అంతర్జాతీయ వాణిజ్యం

డోమినికా కరీబియన్ బేసిన్ ఇంషియేటివ్ "కు బెనిఫిషియరీగా ఉంది. ఇది యునైటెడ్ స్టేట్స్ లోకి పలు వస్తువులు ప్రవేశించడానికి డ్యూటీ ఫ్రీ (పన్ను రహితం) సౌకర్యాన్ని కలిగిస్తుంది. డొమనికా కరీబియన్ కమ్యూనిటీ , కరికొం సింగిల్ మార్కెట్ అండ్ ఎకనమీలో సభ్యత్వం కలిగి ఉంది.[10]

ఆర్ధికసేవారంగం

ది కామంవెల్త్ ఆఫ్ డొమినికా సమీపకాలంలో డొమికా ప్రధాన అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. డొమినికాలో అతిపెద్ద ఫైనాంషియల్ సంస్థలలో ఆఫ్‌షోర్ బ్యాంకింగ్, పేమెంట్ ప్రొసెసింగ్ కపెనీలు , జనరల్ కార్పొరేట్ జనరల్ యాక్టివిటీస్ ప్రధానమైనవి.మినిస్టరీ ఆఫ్ ఫైనాంస్ ఆధ్వర్యంలో " హైనాంషియల్ సర్వీస్ యూనిట్ ఆఫ్ ది కామంవెల్త్ ఆఫ్ డొమినికా " ఫైనాంషియల్ సేవల పర్యవేక్షణ , క్రమబద్ధీకరణలకు బాధ్యత వహిస్తుంది. ఫైనాంషియల్ సంస్థలలో స్కాటియా బ్యాంక్, రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా, కాథడ్రల్ ఇంవెస్ట్‌మెంట్ బ్యాంక్, ఫస్ట్ కరీబియన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ , ఇంటరొసియానిక్ బ్యాంక్ ఆఫ్ ది కరిబ్బీన్ ప్రధానమైనవి.1990లో డొమినికా ప్రభుత్వం ఒ.ఇ.సి.డి. బ్లాక్ లిస్టులో కామంవెల్త్ ఆఫ్ డొమినికాను చేర్చింది.తరువాత కామంవెల్త్ ఆఫ్ డొమినికా ఒ.ఇ.సి.డి.బ్లాక్ లిస్ట్ నుండి విజయవంతంగా వెలుపలికి వచ్చింది.[32]

ఆర్ధిక పౌరసత్వం

కామంవెల్త్ ఆఫ్ డొమనికా రెండవ పాస్ పోర్ట్ కోరేవారికి చట్టబద్ధమైన , అధికారిక " ఆర్థిక పౌరసత్వం " సౌకర్యం కలిగిస్తుంది. డొమినికా అధికార జాతీయ చట్టం ఏడుసంవత్సరాల చట్టబద్ధమైన పౌరసత్వం కోరినట్లైతే తగిన రుసుము తీసుకుని పౌరసత్వం మంజూరు చేయబడుతుంది. ఒక అభ్యర్ధికి మొత్తం రుసుము దాదాపు $1,00,000 డాలర్లు రుసుము చెల్లించాలి, భార్యా బిడ్డల పౌరసత్వ అభ్యర్ధనలో రుసుము మినహాయింపు ఇవ్వబడుతుంది. 2014 నుండి రియల్ ఎస్టేట్ రంగంలో $ 2,00,000 పెట్టుబడి పెట్టిన అభ్యర్ధులకు $ 50,000 డాలర్ల రుసుముతో పౌరసత్వం మంజూరు చేయబడుతుంది.[33] డొమినికాలో సంభవించిన ఎరికా ఉష్ణమండల తుఫాను తరువాత ఈ కార్యక్రమాన్ని డొమినికా అధికారులు " లైఫ్ లైన్ " అని పేర్కొంటున్నారు. 2016 లో డొమనికా ప్రత్యక్ష విదేశీద్రవ్య అభివృద్ధికి ఈకార్యక్రమం ప్రధానవనరుగా ఉంది.[34] డొమినికా పాస్ పోర్ట్ కలిగి ఉన్న వారు వీసా లేకుండా 100 దేశాలు, టెర్రిటరీలకు (యునైటెడ్ కింగ్‌డం, స్చెంజన్ జోన్‌లతో చేర్చి) ప్రయాణం చేయవచ్చు. డొమినికా ఆర్థిక పౌరసత్వం కోరుతున్న సభ్యులు ప్రభుత్వం అంగీకరించిన ఎకనమిక్ సిటిజన్‌షిప్ ఏజంట్లను సంప్రదించవచ్చు.[35]ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆర్థిక పౌరసత్వం కార్యక్రమం పారదర్శకత లోపం, పౌరసత్వం మంజూరు చేయడం కారణంగా లభిస్తున్న ఆదాయం ఉపయోగిస్తున్న విధానం తరచుగా రాజకీయవివాదాలకు దారితీస్తున్నాయి.[36] యునైటెడ్ వర్కర్స్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు లెనాక్స్ లింటన్ తాను ఎన్నికలలో విజయం సాధిస్తే ఆర్థిక పౌరసత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తానని మరింత దాని ద్వారా లభించే ఆదాయవినియోగం పారదర్శకత ఉండేలా చేస్తానని ప్రకటించాడు.[37]

పర్యాటకం

డొమినికా అధికంగా అగ్నిపర్వమయంగా ఉండి స్వల్పంగా సముద్రతీరాలను కలిగి ఉంటుంది. అందువలన పొరుగున ఉన్న ద్వీపాల కంటే డొమినికాలో పర్యాటకం నిదానంగా అభివృద్ధి చేయబడింది.అయినప్పటికీ డొమనికా పర్వతాలు, వర్షారణ్యాలు, మంచినీటి చెరువులు, ఉష్ణగుండాలు, జలపాతాలు, డైవింగ్ క్రీడలు డొమినికాను ఆకర్షణీయమైన పర్యావరణ పర్యాటక గమ్యంగా మార్చింది. రాజధాని రొసౌలో డాకింగ్, వాటర్ ఫ్రంట్ సౌకర్యాలు అభివృద్ధి చేసిన తరువాత క్రూసీ నౌకాయాత్రలలో డొమినికాను భాగంగా చేయడం అభివృద్ధి చెందింది.[10] 22 కరీబియన్ దీవులలో డొమనికా అతి తక్కువ పర్యాటకులను మాత్రమే ఆకర్షిస్తుంది. 2008 లో మొత్తం 55,800 (0.3%) పర్యాటకులు డొమినికాను సందర్శించారు. హైతీని సందర్శించిన పర్యాటకుల సంఖ్యలో ఇది సగం.[38] స్కూబా డైవర్లను అగ్నిపర్వత శిఖరాలు కలిగిన ప్రకృతి ఆకర్షిస్తుంది.

గణాంకాలు

డొమినికాలో అత్యధిక సంఖ్యలో ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు. సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతున్న మిశ్రితవర్ణాలకు చెందిన ప్రజలలో ఫ్రెంచ్, బ్రిటిష్ కాలనిస్టులు, ఐరిష్ సంతతికి చెందిన యురేపియన్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు. డొమినికాలో స్వల్పసంఖ్యలో లెబనీస్, సిరియన్లు, ఆసియన్లు ఉన్నారు.తూర్పు కరీబియన్ ద్వీపాలలో కొలంబియన్ కాలానికి ముందు కాలానికి చెందిన కలినాగొ (వీరిని కరీబ్ అంటారు) ప్రజలు నివసిస్తున్న ప్రాంతం డొమనికా మాత్రమే అనిభావిస్తున్నారు.ఇతర ద్వీపాల నుండి వీరు నిర్మూలించబడడం, తరిమివేయబడడం సంభివించిందని భావిస్తున్నారు.As of 2014డొమినికాలో ఇప్పటికీ 3,000 మంది కలినాగొ ప్రజలు నివసిస్తున్నారు. వీరు డొమినికా తూర్పుతీరంలో 8 గ్రామాలలో నివసిస్తున్నారు.1903 లో బ్రిటిష్ క్రౌన్ కలినాగో ప్రజలకు ఈప్రాంతాన్ని మంజూరు చేసింది.[39] పోర్ట్స్మౌత్ లోని రాస్ యూనివర్శిటీ లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగంలో యునైటెడ్ స్టేట్స్, కెనడాలకు చెందిన 1,000 మంది విద్యార్థులు ఉన్నారు.

విదేశాలవలసలు అధికరించిన కారణంగా డొమినికా జసంఖ్యాభివృద్ధి శాతం చాలా తక్కువగా ఉంది. 21 వ శతాబ్దం ఆరంభకాలంలో డొమినికా నుండి యునైటెడ్ స్టేట్స్ (8,560), యునైటెడ్ కింగ్డంకు (6,739), కెనడా (605), ఫ్రాన్స్ (394) వలసలు కొనసాగాయి. డొమినికాలో పెద్ద సంఖ్యలో సెంటెనరియన్లు ఉన్నారు.2007లో 70,000 మంది డొమినికన్ ప్రజలలో 22 మంది సెంటెనరియన్లు ఉన్నారు.[40] ఇందుకు తగిన కారణాలను రాస్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విద్యార్థులు పరిశోధనాంశంగా స్వీకరించారు.

1832లో డొమికా ఫెడరల్ కాలనీ ఆఫ్ ది లీవార్డ్ ఐలాండ్‌లో పాక్షికంగా విలీనం చేయబడింది. 1871లో డొమినికా పూర్తిస్థాయిలో ఫెడరల్ కాలనీ ఆఫ్ ది లీవార్డ్ ఐలాండ్‌లో విలీనం చేయబడింది. 1902 మే 8న మౌంట్ పెలే అగ్నిపర్వతం బ్రద్ధలై సెయింట్ పియర్రే నగరాన్ని ధ్వంసం చేసింది. మార్టిక్యూ నుండి వచ్చిన ఆశ్రితులు డొమినికా దక్షిణప్రాంతంలోని గ్రామాలకు చేరుకున్నారు. వీరిలో కొందరు ఇక్కడే స్థిరపడ్డారు.

భాషలు

డోమినికా అధికారభాష ఇంగ్లీష్. ఇంగ్లీష్ భాష అందరికీ వాడుకలో ఉంది అలాగే అందరూ అర్ధం చేసుకోగలరు. అదనంగా డొమికన్ క్రియోల్ ఫ్రెంచి, ఆంటిల్లియన్ క్రియోల్ (ఫ్రెంచి ఆధారితం) దేశంమంతా వాడుకలో ఉంది.ఫ్రెంచి వారు ఈఈద్వీపాన్ని పాలించడం, ఫ్రెంచి మాట్లాడే మార్టినిక్యూ, గుయాడెలొక్యూ ద్వీపాల మద్య ఉన్నందున డొమినికా మీద ఫ్రెంచి భాషాప్రభావం అధికంగా ఉంది. 1979 నుండి డొమినికా " లా ఫ్రాంకొఫోనీ " సభ్యదేశంగా ఉంది. డొమనికన్ క్రియోల్ ప్రత్యేకంగా వయోజనులకు వాడుకలో ఉంది.వయోజనులకు పటోయి భాషకూడా వాడుకలో ఉంది.యువతలో క్రియోల్ వాడుక క్రమంగా తగ్గు ముఖం పడుతున్న కారణంగా డొమినికన్ చరిత్ర, సంస్కృతిని రక్షించడంలో భాగంగా క్రియోల్ భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది.క్రియోల్ భాషతో డొమినికాలో కొకొయ్ భాషకూడా వాడుకలో ఉంది.[41] లీవర్డ్ ద్వీపాలలో వాడుకలో ఉన్న ఇంగ్లీష్ క్రియోల్, డోమినికన్ క్రియోల్ భాషల మిశ్రితమైన పిడ్జిన్ ఇంగ్లీష్ భాషకూడా వాడుకలో ఉంది.[42] మొంట్సెర్రట్, ఆంటిక్వా నుండి వలసవచ్చి చేరిన ప్రజల సంతతికి చెందిన ప్రజలు నివసిస్తున్న ఈశాన్య గ్రామాలలో నివసిస్తున్న ప్రజలలో పిడ్జిన్ ఇంగ్లీష్ భాష వాడుకలో ఉంది.[43] మిశ్రిత భాషావాడకం, వారి పూర్వీకత కారణంగా డొమినికా ఫ్రెంచి మాట్లాడే " ఫ్రాంకొఫోనీ ", ఇంగ్లీష్ మాట్లాడే కామంవెల్త్ దేశాల సభ్యత్వం కలిగి ఉంది.అరవాకన్ భాష అయిన ఐలాండ్ కరీబ్ (ఇగ్నరీ) చారిత్రకంగా ఐలాండ్ కరీబ్ ప్రజలలో వాడుకలో ఉంది.ఈభాష ఐలాండ్ కరీబ్ ప్రజలు డొమినికా, సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్, ట్రినిడాడ్, టొబాగో లలో వాడుకలో ఉంది.

మతం

డొమినికా ప్రజలలో 80% రోమన్ కాథలిక్కులు ఉన్నారు[ఆధారం చూపాలి] సమీపకాలంలో పలు ప్రొటెస్టెంట్ చర్చీలు నిర్మించబడ్డాయి. [ఆధారం చూపాలి] డొమినికాలో స్వల్పంగా ముస్లిములు ఉన్నారు. సమీపకాలంలో రాస్ విశ్వవిద్యాలయం ఒక మసీదు నిర్మించబడింది.10%-12% ప్రజలు సెవెంత్ డే (శనివారం) డినామినేషంస్ ఉన్నారు. వీరికి చర్చి ఆఫ్ గాడ్ (సెవెంత్ డే), సెవెంత్ డే డినామినేషంస్ చర్చి ఉన్నాయి.[44]

విద్య

డొమినికాలో మాధ్యమిక పాఠశాల వరకు నిర్భంధవిద్య అమలులో ఉంది.ప్రీ స్కూల్ తరువాత విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించి 6-7 సంవత్సరాల విద్యాభ్యాసం పూర్తి చేస్తారు. తరువాత కామన్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులై సెకండరీ పాఠశాలలోంప్రవేశించడానికి అర్హత సాధిస్తారు. ఐదు సంవత్సరాల సెకండరీ చదువు పూర్తి చేసిన తరువాత విద్యార్థులు " ది జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎజ్యుకేషన్ " పత్రం అందుకుంటారు. తరువాత రెండుసంవత్సరాల కమ్యూనిటీ కాలేజి పూర్తిచేసిన తరువాత సి.ఎ.పి.ఇ. సర్టిఫికేషన్ అందుకుంటారు. ద్వీపంలో " డొమనికన్ స్టేట్ కాలేజ్ " (క్లిఫ్టన్ డుపింగ్ కమ్యూనిటీ కాలేజ్ ) ఉంది. కొంతమంది డొమినికన్లు క్యూబాలో విశ్వవిద్యాలయలకు హాజరౌతుంటారు. వీరికి క్యూబా ప్రభుత్వం స్కాలర్ షిప్పులు అందిస్తుంది. ఇతరులు " యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్ " లేక యునైటెడ్ కింగ్డం యూనివర్శిటీలు, యునైటెడ్ స్టేట్స్ యూనివర్శిటీలకు, ఇతర యూనివర్శిటీలకు హాజరౌతుంటారు. రాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ [45] పోర్ట్ మౌత్‌లో ఉంది. ఇది డోమినికాలో 1980లో స్త్యాపించబడింది. అర్చ్బోల్డ్ ట్రాపికల్ రీసెర్చి అండ్ ఎజ్యుకేషన్ సెంటర్[46] బయోలాజికల్ ఫీల్డ్ స్టేషన్ " క్లెంసన్ యూనివర్శిటీకి " సవంతమైనది.[47] ఇది కేంఫీల్డ్, పాండ్ కేసెస్ మద్య ఉన్న స్ప్రింగ్‌ఫీల్డ్ వద్ద ఉంది. 2006లో ఆల్ సెయింట్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్[48] తాత్కాలిక సౌకర్యాలతో లౌబియరీ వద్ద ప్రారంభించబడింది. మాహౌట్‌లో మారిన్ బయాలజీ ఇంస్టిట్యూట్ ఉంది. ఐ.టి.ఎం. ఇంస్టిట్యూట్ ఫర్ ట్రాపికల్ మారిన్ ఎకాలజీ 2009లో మూసివేయబడింది.

సంస్కృతి

Dominica's east coast Carib Territory

డోమినికా వైవిధ్యమైన సంప్రదాయాలకు చెందిన ప్రజలకు నిలయంగా ఉంది. చారిత్రకంగా ఈదీవి పలు స్థానికజాతి ప్రజలచేత ఆక్రమితమై ఉంది. యురేపియన్ సెటిలర్లు ఈదీవికి రావడానికి ముందు అరవాకన్ ప్రజలు (టైనోస్), కరీబియన్లు (కలింగొ) గిరిజనప్రజలు ఈదీవిలో నివసిస్తూ ఉన్నారు.ఫ్రెంచ్, బ్రిటిష్ సెటిలర్లు ఈద్వీపంలో నివసుస్తున్న స్థానిక ప్రజలను మూకుమ్మడి హత్యలకు గురిచేసి ఈద్వీపాన్ని ఆక్రమించుకున్నారు. స్థానికప్రజల రక్తంతో నదీజలాలు ఎరుపువర్ణంతో ప్రవహించాయి. తరువాత గ్రామస్థులు ఈ నదికి " మాస్‌క్రీ " అని నామకరణం చేసారు. ఫ్రెంచి, బ్రిటిష్ సెటిలర్లు ద్వీపాన్ని ఆక్రమించుకున్న తరువాత శ్రామికపనులు చేయించడానికి ఆఫ్రికా నుండి బానిసలను దిగుమతి చేసుకున్నారు. మిగిలిన కరీబియన్లు ప్రస్తుతం ద్వీపం తూర్పుతీరంలోని 3700 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూభాగంలో నివసించారు. వారు వారి ప్రతినిధిని ఎన్నుకున్నారు. సస్కృతుల కలయికతో ప్రస్తుత డోమినికా సంస్కృతి రూపొందింది.

డోమినికా సస్కృతిలో సంగీతం, నృత్యం అంతర్భాగంగా ఉన్నాయి. వార్షిక స్వాతంత్ర్య ఉత్సవాలలో వైవిధ్యమైన పాటలు, నృత్యాలు చోటుచేసుకుంటాయి.1997 నుండి వారం రోజులు సాగే " క్రియోల్ ఇన్ ది పార్క్ ", " వరల్డ్ క్రియోల్ మ్యూసిక్ ఫెస్టివల్ " వంటి క్రియోల్ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.డోమినికా 1973లో అంతర్జాతీయ సంగీత వేదిక మీద ప్రాముఖ్యత సంతరించుకుంది.గార్డెన్ హెండర్సన్ " ఎక్సైల్ ఒన్ " బృందాన్ని స్థాపించాడు. ఇది ఆధునిక క్రియోల్ సంగీతానికి మార్గం సుగమం చేసింది.ఇతర సంగీతబాణీలలో జింగ్ పింగ్, కాడెంస్ ప్రాధాన్యత వహించాయి. జింగ్ పింగ్ స్థానిక ప్రజలకు చెందినదని పరిశోధకులు భావిస్తున్నారు.డొమినికా సంగీతం హైతియన్, ఆఫ్రొ - క్యూబన్, ఆఫ్రికన్, యురేపియన్ సంగీతాల మిశ్రితరూపంగా ఉంటుంది. గాయకులలో చబ్బీ, మిడ్‌నైట్ గ్రూవర్స్, బెల్స్ కొంబొ, ది గేలార్డ్స్, విండ్వర్డ్ కరీబియన్ కల్చర్, ట్రిపిల్ కే ప్రాధాన్యత కలిగి ఉన్నారు.

2007లో డొమినికా స్వతంత్రోత్సవాలలో భాగంగా 11వ " క్రియోల్ మ్యూసిక్ " ఉత్సవం నిర్వహించబడింది. 30 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాల ఆరంభంగా 2008 జనవరిలో ఒకసంవత్సరకాలం రియునియన్ ఉత్సవం ఆరంభించబడింది.

సాహిత్యం

ప్రఖ్యాత నవలా రచయిత్రి " జియాన్ రీస్ " డొమినికాలో పుట్టిపెరిగింది. ఆమె వ్రాసిన నవల " వైడ్ సర్గస్సొ సీ "లో ద్వీపం చక్కగా వర్ణించబడింది.జియాన్ స్నేహితురాలు రాజకీయవాది, రచయిత్రి ఫిల్లిస్ షండ్ అల్ఫ్రే 1954లో " ది ఆర్చిడ్ హౌస్ " వ్రాసింది.

పలు వాల్ట్ డిస్నీ చిత్రాలు,2006లో విడుదల చేయబడిన రెండవ సీరీస్‌కు చెందిన పైరేట్ ఆఫ్ ది కరీబియన్ డొమినికాలో చిత్రీకరించబడ్డాయి. చిత్రంలో ఈదీవికి " పెలెగొస్టొ " అని ఊహాజనిత నామకరణం చేయబడింది.2007లో విడుదలైన పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ మూడవ సిరీస్ లోని కొన్నిభాగాలు చిత్రీకరించబడ్డాయి.

ఆహారం

డొమినికా ఆహార విధానం జమైకా,సెయింట్ లూసియా, ట్రినిడాడ్, టుబాగో మొదలైన ఇతర కరీబియన్ ఆహారసంస్కృతిని పోలి ఉంటుంది.అలాగే ఇతర కరీబియన్ కామన్‌వెల్త్ ద్వీపాలలా డొమినికా వారి అహారవిధానానికి వారి ప్రత్యేకతను అదనగా కలగలిపి అందిస్తుంది. డొమినికా దినసరి ఉదయకాల ఉపాహారంలో ఉప్పుచేపలు, ఉప్పుచేర్చి ఎండపెట్టిన కాడ్‌ఫిష్, రొట్టెలు ఉంటాయి. రొట్టెలు, ఉప్పుచేపలు చిరుతిండిలా దినమంతా స్వీకరిస్తుంటారు. డొమినికా లోని వీధి వ్యాపారులు పాదచారులకు వీటిని విక్రయిస్తుంటారు. వీటితో కోడిమాంసం, చేపలు, యోగర్ట్ స్మూతీలు చేర్చి విక్రయిస్తుంటారు. ఇతర అల్పాహారాలలో గంజి, కాల్చిన చేపలు, వండిన అరటి పండ్లు ప్రధానమైనవి.

కూరగాయలలో అరటి, టానియాస్, కంద, ఉర్లగడ్డ, బియ్యం, బఠాణీలు ప్రధానమైనవి. మాసం, పౌల్ట్రీ కోడిమాంసం, గొడ్డు మాసం,, చేపలతో చేర్చి స్వీకరించబడుతుంది. ఇవి తరచుగా ఎర్రగడ్డలు, కేరట్లు, తెల్లగడ్డలు, అల్లం, తిం మొదలైన మూలికలతో చేర్చి స్ట్యూగా తయారు చేయబడుతుంది.రుచికరమైన డార్క్ సాస్ చేయడానికి కూరగాయలు, మాంసం ఎర్రగా కాల్చబడతాయి.ఇష్టమైన ఆహారాలలో బియ్యం, బఠాణీలు, బ్రౌన్ స్ట్యూ చికెన్, స్ట్యూ బీఫ్, కేరట్లు, నలుగకొట్టిన పదార్ధాలు ప్రధానమైనవి.

క్రీడలు

డొమికాలో క్రికెట్ అభిమాన క్రీడగా ఉంది. డొమినికా వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీంతో టెస్ట్ క్రికెట్ క్రీడలలో పాల్గొంటున్నది. వెస్ట్ ఇండీస్ డొమెస్టిక్ ఫస్ట్ - క్లాస్ క్రికెట్ క్రీడలలో డొమినికా విండ్వర్డ్ క్రికెట్ టీం పాల్గొంటుంది. తరచుగా ఇది లీవార్డ్ ఐలాండ్‌గా భావించబడుతున్నప్పటికీ 1940లో స్వతంత్రం లభించేవరకు ఇది బ్రిటిష్ ప్రభుత్వంలో భాగంగా ఉండేది. క్రికెట్ ఫెడరేషన్ విండ్వర్డ్ ఐలాండ్స్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లో భాగంగా ఉంది.

2007 అక్టోబరు 24న 8,000 సీట్ల సామర్ధ్యం కలిగిన " విండ్సర్ క్రికెట్ స్టేడియం " నిర్మాణం పూర్తిచేసుకుంది.

ఇతరక్రీడలు

డొమినికా అభిమాన క్రీడలుగా రగ్బీ, నెట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, అస్ఫ్సియేషన్ ఫుట్‌బాల్ ఉన్నాయి.2014 వింటర్ ఒలింపిక్స్‌లో సమయంలో గారీ డీ సిల్వెస్టరి, ఏంజిలా డీ సిల్వెస్టరీ 175,000 అమెరికన్ డాలర్లను వ్యయంచేసి డోమినికన్ పౌరసత్వంతీసుకుని 2014 వింటర్ ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొన్నారు.ప్రస్తుతానికి వీరు ఇద్దరు మాత్రమే డొమినికా వింటర్ ఒలింపిక్ అథ్లెట్లుగా ఉన్నారు.[49]

మాధ్యమం

డొమినికాలో ది సన్, ది క్రోనికల్ ప్రధానపత్రికలుగా ఉన్నాయి. దేశంలో రెండు టెలివిజన్ స్టేస్టేషన్లు, కొన్ని రేడియో స్టేషన్లు ఉన్నాయి. జెడ్.బి.సి.-ఎ.ఎం.590 (మొదటి ప్రైవేట్ రేడియో స్టేషన్) ఉన్నాయి.[50] డొమినికా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, ఎఫ్.ఎం. ఉన్నాయి.[51] 2004 ముందు డొమినికాలో రెండు టెలీకమ్యూనికేషన్ కంపెనీలు ఉన్నాయి;కేబుల్ అండ్ వైర్లెస్, మార్పిన్ టి.వి.[52] డొమినికాలో పలు మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఉన్నాయి.వీటిలో లైం, డిజిసెల్ వాడకందార్లను ఆకర్షించడంలో ప్రధాన్యత వహిస్తున్నాయి.2010లో ఆరెంజ్ సంస్థ మూసివేయబడింది.

చిత్రమాలిక

వెలుపలి లింకులు


మూలాలు