థేరవాదం

థేరవాదం అనేది బౌద్ధమతంలో ఒక శాఖ. థేరవాదం అనగా పెద్దల సిద్ధాంతం.[1][2] ఈ వాదాన్ని అనుసరించే థేరవాదులు గౌతమ బుద్ధుడు స్వయంగా బోధించినట్లుగా తాము నమ్ముతున్న సూత్రాలను పాళీ భాషలో గ్రంథస్తం చేశారు. థేరవాదులు ఒక సహస్రాబ్ది పాటు ఈ సూత్రాలు అలాగే కాపాడుతూ వచ్చారు. మహాయానం, వజ్రయానంతో పోలిస్తే థేరవాదం సిద్ధాంతాల పరంగా, సన్యాసి ధర్మాల పరంగా కఠినమైన నియమ నిబంధనలు కలిగిఉంది.[3]

థేరవాద బౌద్ధమతం తరువాత ప్రారంభ స్థూపం అయిన తుపారామయ స్థూపం. శ్రీలంకలో అధికారిక మతంగా మారింది.

ఈ ధర్మము త్రిపిటకములను ఆధారముగా చేసుకొని రూపుదిద్దుకొనినది. మిగతా బౌద్ధ విభాగ పాఠశాలతో పోల్చితే థేరవాదమే బుద్ధుని బోధనలకు దగ్గరగా ఉంటుందని ప్రతీతి. బుద్ధుని బోధనలు తప్పక పాటించే ఈ ధర్మములో సృష్టికర్త దేవుడు అనే అపోహలు ఉండవు. బౌద్ధములో సృష్టికర్త అనేవాడు లేడని నిర్ధారిస్తారు. సర్వాంతర్యామి దేవుడు అనే వాదనను బుద్ధుడు కొట్టిపారవేశాడు.

చాలా శతాబ్దాలుగా థేరవాదము ఆగ్నేయాసియా ఖండము(థాయిలాండ్, మయన్మార్, కంబోడియా, లావోస్, శ్రీలంక)లో ప్రధానమైన ధర్మముగా ఉన్నది. ఈ ధర్మమును ఆచరించే వారి జనాభా 10 కోట్లకు పైనే. ఈ మధ్య కాలములో పశ్చిమ దేశాలైన అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాలలో కూడా థేరవాదమును ఆచరిస్తున్నారు.

మూలాలు