పిట్‌కెయిర్న్ దీవులు

పిట్‌కెయిర్న్ దీవులు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న నాలుగు చిన్నదీవుల సముదాయం. ఈ దీవులు బ్రిటీషు ఓవర్సీస్ టెర్రిటరీకి చెందుతాయి (ఇది పూర్వపు బ్రిటీషు సామ్రాజ్యములో భాగం). ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రములో బ్రిటిషు పాలనలో ఉన్న ఏకైక ప్రాంతం. అధికారికముగా పిట్‌కెయిర్న్, హెండర్సన్, డూచీ, ఓయెనో దీవులు అని దీనికి పేరు.[4][5][6][7] ఈ నాలుగు దీవులు వందల మైళ్ళ దూరంలో సముద్రంలో విసిరేసినట్లు ఉంటాయి. వీటి మొత్తం విస్తీర్ణం 47 చ.కి.మీ. ఇందులో హెండర్సన్ దీవి 86% ఉంటుంది. ఈ సముదాయంలో రెండవ పెద్ద దీవైన పిట్‌కెయిర్న్ దీవిలో మాత్రమే జనావాసం ఉంది.

పిట్‌కెయిర్న్ దీవులు

పిట్‌కెయిర్న్ అల్లెన్
బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ
పిట్‌కెయిర్న్, హెండర్‌సన్, డూచీ, ఓనో దీవులు
Flag of పిట్‌కెయిర్న్ దీవులు
Flag
Official seal of పిట్‌కెయిర్న్ దీవులు
Coat of arms
Anthem: "గాడ్ సేవ్ ది క్వీన్"
Unofficial anthems: "Come Ye Blessed"
"We From Pitcairn Island"[1]
Location of  పిట్‌కెయిర్న్ దీవులు  (circled in red)
సార్వభౌమిక రాజ్యంయునైటెడ్ కింగ్‌డమ్
వలస1790 జనవరి 15
బ్రిటిషు వలస1838 నవంబరు 30
Capitalఆడమ్స్‌టౌన్
25°04′S 130°06′W / 25.067°S 130.100°W / -25.067; -130.100
Largest అతిపెద్ద ఆవాసంరాజధాని
Official languagesఇంగ్లీషు, పిట్‌కెర్న్
Ethnic groups
పిట్‌కెయిర్న్ ఐలాండర్లు
Demonym(s)పిట్‌కెయిర్న్ ఐలాండరు
Governmentరాఅజ్యాంగ రాచరికం కింద ఉన్న స్థానిక పరిపాలనలో ఉన్న సామంత రాజ్యం
• రాజు
ఎలిజబెత్ 2
• గవర్నరు
లరా క్లార్క్
• పాలకుడు
నికోలస్ కెన్నడీ
• మేయరు
చార్లీన్ వారెన్ ప్యూ
Legislatureఐలాండ్ కౌన్సిల్
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం
• మంత్రి
లిజ్ సగ్
Area
• Total
47 km2 (18 sq mi) (not ranked)
• Water (%)
0
Highest elevation
705 మీ (2,313 అ.)
Population
• 2020 estimate
50[2] (not ranked)
• Density
1.19/km2 (3.1/sq mi) (ర్యాంకు లేదు)
GDP (nominal)2005 estimate
• Total
NZ$217,000[3]
Currencyన్యూజీలాండ్ డాలర్ (NZ$) (NZD)
Time zoneUTC-08:00
Date formatdd/mm/yyyy
Driving sideఎడమ
Calling code+64
UK postcode
PCRN 1xx
ISO 3166 codePN
Internet TLD.pn

దీనికి దగ్గరిలోని దీవులు పశ్చిమాన మంగరేవా, తూర్పున ఈస్టర్ ఐలాండ్ ఉన్నాయి. పిట్‌కెయిర్న్ ప్రపంచంలో అతి తక్కువ జనాభా ఉన్న దేశం.[8] 2014 నాటికి ఈ దేశంలో 50 మంది శాస్వ్త నివాసులు ఉన్నారు.వీరంతా నాలుగు కుటుంబాలకు చెందినవారు.[9]

చరిత్ర

పిట్‌కెయిర్న్ దీవుల పశ్చిమ వైపున

పిట్‌కెయిర్న్ దీవుల్లో తొలి ఆవాసాలను ఏర్పరచుకున్నది పాలినేసియన్లు అని భావిస్తున్నారు. 15 వ శతాబ్దం నాటికే వారు అక్కడ ఉంటున్నారని పురాతత్వవేత్తలు భావిస్తున్నప్పటికీ, ఐరోపా వాసులు ఈ దీవులను గుర్తించేటప్పటికి అక్కడ నిఒవాసులెవరూ లేరు.[10]

డూచీ, హెండర్సన్ దీవులను 1606 జనవరి 26 న పోర్చుగీసు వారు కనుగొన్నారు.[11] పిట్‌కెయిర్న్ దీవిని 1767 జూలై 3న బ్రిటిషు నౌక ఒకటి కనుగొంది. నౌకాధికారి రాబర్ట్ పిట్‌కెయిర్న్ పేరిట ఈ దీవికి ఆ పేరు పెట్టారు.

బ్రిటిషు వలస

1838 నవంబరు 30 న తమ దీవులు బ్రిటిషు వలస రాజ్యంగా మారిపోయాయని ఇక్కడి ప్రజలు భావిస్తారు.

అర్థిక వ్యవస్థ

వ్యవసాయం

పిట్‌కెయిర్న్ దీవుల్లో అరటి, బొప్పాయి, పైనాపిల్, మామిడి, పుచ్చ, పాషన్‌ఫ్రూట్, బ్రెడ్‌ఫ్రూట్, కొబ్బరి, అవొకాడో, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లను పండిస్తారు. చిలగడదుంపలు, కారట్, మొక్కజొన్న, రామములగ, యాం, టారో, బఠాణీ, చిక్కుళ్ళు వంటి కూరగాయలు కూడా పండిస్తారు. చెరకు కూడా పండిస్తారు. ఈ దీవుల్ల్లోని భూమి సారవంతమైనది. అనేక రకాల పంటలు పండుతాయి.[12] ఇక్కడి భూమి వినియోగం ప్రభుత్వం అదుపులో ఉంటుంది. దిగుబడి ఎక్కువగా ఉందనిపిస్తే భూమిపై పన్నులు పెంచవచ్చు. దిగుబడి తక్కువగా ఉందని భావిస్తే, ఏ పరిహారమూ ఇవ్వకుండా భూమిని జప్తు చేసి ఇతరులకు పంచవచ్చు.[13]

చేపల వేట ఈ దీవుల్లోని మరొక వ్యాపకం.

ఖనిజాలు

ఈ దీవుల ఆర్థిక మండలంలో మాంగనీసు, ఇనుము, రాగి, బంగారం, వెండి, తుత్తునాగం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ మండలం తీరం నుండి 370 కి.మీ. సముద్రం లోకి ఉంటూ 8,80,000 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది.[14]

ఆడమ్‌స్‌టౌన్, దీవుల్లోని ఏకైక జనావాసం

తేనె

ఏ జబ్బూ లేని తేనెటీగలకు పిట్‌కెయిర్న్ దీవులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే తేనె అత్యుత్తమ నాణ్యతకు చెందినది. ఇక్కడి తేనెటీగలు మిగతా చోట్ల కంటే సాధు స్వభావం కలిగినవి. కొద్ది కాలం లోనే పెంపకం దారులు తేనెటీగలకు అలవాటు పడిపోయి, పెద్దగా రక్షక కవచాలు లేకుండ్నే పని చేసేందుకు అలవాటు పడతారు.[15] ఇక్కడి తేనెను న్యూజీలాండ్, ఇంగ్లాండులకు ఎగుమతి చేస్తారు.[16] అరటి, బొప్పాయి, పైనపిల్, మామిడి పండ్లను ఎండబెట్టి ఎగుమతి చేస్తారు.[17]

పర్యాటకం

పిట్‌కెయిర్న్ దీవుల ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం ముఖ్యమైనది.చిన్నచిన్న సమూహాల్లో పర్యాటకులు వచ్చి ఇక్కడి హోమ్‌స్టేల్లో ఉండడాన్ని వీరు స్వాగతిస్తారు. ఏడాదికి దాదాపు పది సార్లు క్రూయిజ్ ఓడల్లో ప్రయాణీకులు ఇక్కడికి వచ్చి ఒకరోజు ఇక్కడ ఉంటూంటారు.[18][19] 2019 నాటికి ప్రభుత్వం ఒక స్వంత ప్రయాణీకుల ఓడను నడుపుతోంది. పర్యాటకులు స్థానిక కుటుంబాలతో కలిసి ఉంటారు. వీరికి వసతి కల్పించడం ఆదాయ వనరుల్లో ఒక భాగం.

14 రోజుల వరకు ఈ దీవుల్లో ఉండేందుకు వీసా అవసరం లేదు. అంతకంటే ఎక్కువ ఉండాలంటే ముందే అనుమతులు ఉండాలి.[20][21] 16 ఏళ్ళ లోపు వయసున్న వారు ఎన్నిరోజులకైనా అనుమతి తీసుకోవడం తప్పనిసరి.[22]


జనాభా వివరాలు

1940 నుండి దీవుల జనసంఖ్య తగ్గిపోతూ వచ్చింది. దీవుల్లో ప్రజల నివాసం విలసిల్లుతుందా అనేది సందేహాస్పదంగా ఉంది. బయటినుండి ప్రజల వలసలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ దాని వల్ల ఫలితాలు అంతగా కనిపించలేదు.[23] 2012 కు ముందు 21 ఏళ్ళలో ఇద్దరే పిల్లలు ఈ దీవుల్లో జన్మించారు.[24]

భాష

పిట్‌కెర్న్ భాషను ప్రాథమిక భాషగా మాట్లాడుతారు.[25][26] దీవుల్లో ఉన్న ఒకే ఒక్క పాఠశాలలో ఇంగ్లీషుతో పాటు దీన్ని కూడా నేర్పిస్తారు.

మతం

1954 లో నిర్మించిన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి ఇక్కడ ఉంది.[25] దీవుల్లో ఉన్న 40 మందిలో 8 మంది మాత్రం చర్చికి క్రమం తప్పకుండా వెళ్తూంటారు. మిగతా వారు పండుగ రోజుల్లో వెళ్తూంటారు. [27]

మూలాలు