భారతదేశ చరిత్ర

భారతదేశం చరిత్ర కాలక్రమం

భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది.[1] హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం [2][3] అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు;[4][5] యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.[6]

సా.శ. 1 వ శతాబ్దంనాటి సాంచీలో ప్రవేశద్వారం

భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల[7] నాటిదిగా అంచనా వేయబడింది. సుమారుగా 5,00,000 సంవత్సరాల క్రితం నాటి ప్రారంభ మానవులకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి.[8][9] దీన్ని "నాగరికతకు ఉయ్యాల"గా భావిస్తున్నారు.[10] దక్షిణ ఆసియాలోని మొదటి అతిపెద్ద నాగరికత అయిన సింధు లోయ నాగరికత 3300 నుండి 1300 వరకు భారత ఉపఖండంలోని ఉత్తర-పశ్చిమ భాగంలో వ్యాప్తి చెందింది.[11] క్రీ.పూ 2600 నుండి 1900 వరకు ప్రౌఢ హరప్పా కాలంలో ఆధునిక, సాంకేతిక అధునాతన పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందింది.[12] ఈ నాగరికత క్రీ.పూ. రెండవ సహస్రాబ్ధి ప్రారంభంలో పతనమైంది. తరువాత ఇనుప యుగం వేద సంస్కృతి కొనసాగింది. ఈ కాలం హిందూమత పవిత్ర గ్రంథాలైన వేదాల కూర్పును చూసింది. ఇది జనపదాలకు (రాచరిక, రాజ్య-స్థాయి విధానాలు) కులాల ఆధారంగా సామాజిక విభజనకు అనుసంధానించబడింది. తరువాత వేద నాగరికత ఇండో-గంగాటిక్ మైదానానికి వరకు అలాగే భారత ఉపఖండంలో చాలా వరకు విస్తరించింది. అలాగే మహాజనపదాలు అని పిలవబడే ప్రధాన రాజకీయాల పెరుగుదలను చూసింది. ఈ సామ్రాజ్యాలలో ఒకటైన మగధ, గౌతమ బుద్ధుడు, మహావీరుడు క్రీ.పూ. 5 వ, 6 వ శతాబ్దాలలో వారి ధారావాహిక తత్వాలు ప్రచారం చేశారు.

క్రీ.పూ 4 వ - 3 వ శతాబ్దాలలో భారతీయ ఉపఖండంలో అధిక భాగాన్ని మౌర్య సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. క్రీ.పూ. 3 వ శతాబ్దం నుండి ఉత్తరాన ప్రాకృత, పాలి సాహిత్యం, దక్షిణ భారతదేశంలో తమిళ సంగం సాహిత్యం వృద్ధి చెందాయి.[13][14] 3 వ శతాబ్దంలో వూట్జ్ స్టీల్ దక్షిణ భారతదేశంలో ఉద్భవించి విదేశాలకు ఎగుమతి చేయబడింది.[15][16][17] సాంప్రదాయ కాలములో భారతదేశంలోని వివిధ ప్రాంతాలను తరువాతి 1,500 సంవత్సరముల వరకు అనేక రాజవంశాలు పాలించాయి. వాటిలో గుప్త సామ్రాజ్యం అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలాన్ని హిందూ మతానికి, మేధాసంపత్తి పునరుద్ధరణకు సాక్ష్యంగా చెప్పవచ్చు. దీనిని "భారతదేశం శాస్త్రీయ" లేదా " స్వర్ణ యుగం " అని వర్ణిస్తారు. ఈ కాలంలో భారతీయ నాగరికత, పరిపాలన, సంస్కృతి, మతం (హిందూమతం, బౌద్ధమతం) అంశాలు ఆసియాలో చాలా వరకు వ్యాపించాయి. అయితే దక్షిణ భారతదేశంలోని రాజ్యాలు మధ్యప్రాచ్య, మధ్యధరా ప్రాంతాలతో సముద్ర సంబంధ వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సాంస్కృతిక ప్రభావం విస్తరించింది. ఇది ఆగ్నేయ ఆసియాలో (గ్రేటర్ ఇండియా) భారతదేశ రాజ్యాలను స్థాపించడానికి దారితీసింది.[18][19]

7 - 11 వ శతాబ్దాల మధ్య కన్నౌజ్ కేంద్రంగా ఉన్న త్రిపాఠి పోరాటం అత్యంత ముఖ్యమైన సంఘటనగా భావించబడుతుంది. ఇది పాల సామ్రాజ్యం, రాష్ట్రకూట సామ్రాజ్యం, గురురా-ప్రతీహరా సామ్రాజ్యం మధ్య రెండు శతాబ్దాల వరకు కొనసాగింది. దక్షిణ భారతదేశం 5 వ శతాబ్దం మధ్యకాలంలో బహుళ సామ్రాజ్య శక్తుల అభివృద్ధిని చూసింది. వీటిలో చాళుక్య, చోళ, పల్లవ, చేరా, పాండ్యన్, పశ్చిమ చాళుక్య సామ్రాజ్యాలు చాలా ముఖ్యమైనవి. 11 వ శతాబ్దంలో చోళ రాజవంశం దక్షిణ భారతదేశాన్ని జయించి విజయవంతంగా ఆగ్నేయ ఆసియా, శ్రీలంక, మాల్దీవులు, బెంగాల్ [20] ప్రాంతాలను ఆక్రమించింది.[21][22] మధ్యయుగ ప్రారంభకాలం భారతీయ గణితశాస్త్రం అరబ్బు ప్రపంచంలో గణిత, ఖగోళశాస్త్రం అభివృద్ధిని ప్రభావితం చేసి హిందూ సంఖ్యలు ప్రవేశపెట్టబడ్డాయి.[23]

క్రీ.శ. 1206 లో మద్య ఆసియా టర్కులు ఢిల్లీ సుల్తానేట్ స్థాపించబడడంతో 13 వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమైంది.[24] అంతకు పూర్వమే ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్లలో 8 వ శతాబ్దం ప్రారంభంలో ముస్లిం దండయాత్రలు పరిమితమైన చొరబాట్లు సృష్టించాయి.[25] 14 వ శతాబ్దం ఆరంభంలో ఢిల్లీ సుల్తానేట్ ఉత్తర భారతంలో ప్రధాన భాగం పాలించినప్పటికీ 14 వ శతాబ్దం చివరిలో అది తిరస్కరించబడింది. ఈ కాలంలో ముఖ్యంగా కాకతీయ, ముసునూరి, విజయనగర, గజపతి, అహోం, అలాగే మేవార్ వంటి అనేక శక్తివంతమైన హిందూ రాజ్యాలు ఆవిర్భావించాయి. విజయనగర సంరక్షణకు పెమ్మసాని, రావెళ్ళ, సూర్యదేవర, వాసిరెడ్డి, సాయపనేని, మేదరమెట్ల తదితర రాజ్యాలు అండగా నిలవటం విజయనగర సామ్రజ్యం దక్షిణ భారతములో కాకతీయ, ముసునూరి తరువాత గొప్ప శక్తిగా ఏర్పడినది. 15 వ శతాబ్దం సిక్కుల ఆగమనాన్ని చూసింది. మొఘలులు భారత ఉపఖండంలో అధిక భాగం స్వాధీనం చేసుకున్న 16 వ శతాబ్దంలో ఆధునిక కాలం ప్రారంభం మొదలైంది.[26] 18 వ శతాబ్దం ప్రారంభంలో మొఘలులు క్రమంగా క్షీణతను ఎదుర్కొన్నారు. దీంతో భారత ఉపఖండంలోని పెద్ద ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు మరాఠాలు, సిక్కులు, మైసూరియన్లు అవకాశాలను అందించారు.[27][28]

18 వ శతాబ్దం చివరి నుండి 19 వ శతాబ్దం వరకు బ్రిటీష్ సామ్రాజ్యం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే భారతదేశంలోని పెద్ద ప్రాంతాలు అనుసంధానించబడ్డాయి. కంపెనీ పాలనతో అసంతృప్తి 1857 నాటి భారతీయ తిరుగుబాటుకు దారితీసింది. దాని తరువాత బ్రిటీషు రాజ్యాలు నేరుగా బ్రిటీషు క్రౌన్ ద్వారా నిర్వహించబడ్డాయి. బ్రిటుషు పాలనా కాలం మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక తిరోగమనం, ప్రధాన కరువులు సంభవించడానికి సాక్ష్యంగా నిలిచింది.[29][30][31][32]ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు.[note 1] ఇక్కడ లభించిన ఆధారాలు 5,00,000 సంవత్సరాల నాటి హోమో ఎరెక్టసు వంటి ఆరంభకాల హోమోనిడ్ వని భావిస్తున్నారు.[8][9] మధ్య భారతదేశంలోని నర్మదా లోయలోని హత్నోరాలోని హోమో ఎరేక్టసు అవశేషాలు కనీసం 5,00,000 - 2,00,000 సంవత్సరాల మధ్యప్రాచ్య పాలిస్టోసీను కాలం నుండి భారతదేశప్రాంతం మానవ నివాసిత ప్రాంతంగా ఉంటుందని సూచిస్తున్నాయి.[35][36] భారతీయ ఉపఖండంలోని వాయువ్య భాగంలో రెండు మిలియన్ల సంవత్సరాల క్రితం కనుగొనబడిన ప్రోటో-మానవులు రూపొందించిన ఉపకరణాలు కనుగొనబడ్డాయి.[37][38] ఈ ప్రాంతం పురాతన చరిత్రలో దక్షిణ ఆసియాలోని పురాతన స్థావరాలు,[39] కొన్ని ప్రధాన నాగరికతలు భాగంగా ఉన్నాయి. [40][41]

సోయాను నదీలోయలోని పాలియోలిథికు హోమినిదు ప్రాతం భారత ఉపఖండంలోని తొలి పురావస్తు ప్రదేశాలు,[42][43][44] సోనియను పురాతత్వ ప్రాంతాలు భారతదేశం, పాకిస్థాను, నేపాలు దేశాలలో కనిపిస్తాయి.[45][46][47] భారతీయ ఉపఖండంలో మెసోలిథికు కాలం తరువాత నవీన శిలా యుగం (నియోలిథికు) కాలం మొదలైంది. 12,000 సంవత్సరాల క్రితం చివరి మంచు యుగము ముగిసిన తరువాత భారతీయ ఉపఖండంలో విస్తృతమైన మానవస్థావరాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని ఆధునిక మధ్యప్రదేశం లోని భీమ్‌బేట్కా శిలా గుహలు లో 9,000 సంవత్సరాల క్రితం నాటి మొట్టమొదటి ధ్రువీకరించిన పాక్షికస్థిర స్థావరాలు కనిపించాయి. ఎడక్కల్ గుహలు ఇప్పటికి క్రీ.పూ 6,000 నాటి [48][49]నవీన శిలా యుగం మానవులకు చెందినవని, కేరళ లోని స్థావరాలు, నాగరికత చరిత్రపూర్వం నాటివని భావిస్తున్నారు.[50] దక్షిణ భారతదేశం ఎడక్కల్ రాతియూం చెక్కడాలు చాలా అరుదైన ఉదాహరణలుగా ఉన్నాయి.[51]

నియోలిథిక్ సంస్కృతికి చెందిన జాతిప్రజలు భారతదేశంలోని ఖంబాట్ గల్ఫులో క్రీ.పూ. 7500 నాటి రేడియోకార్బన్ కాలానికి చెందిన ప్రజలతో విలీనం అయ్యారని భావిస్తున్నారు.[52] భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, హర్యానాలో, లాహూరాడెవా ప్రాంతాలలో కనుగొన్న (క్రీ.పూ. 7000) భారతదేశంలోని భిర్రానా (క్రీ.పూ. 7570-6200) కనుగొన్న భిరానా పరిశోధనలు, (క్రీ.పూ.3000 ) దిగువ గంగాతక్ లోయలో క్రీ.పూ. 5000 కాలంలో సింధూ లోయ ప్రాంతాలలో నియోలిథిక్ వ్యవసాయ సంస్కృతులు ఏర్పడ్డాయి [53] పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలలో,[39][54][55] దక్షిణ భారతదేశంలో మెహర్గర్ పరిశోధనలు(క్రీ.పూ.7000-5000 BCE) దక్షిణప్రాంతంలో వ్యాపించాయి. తరువాత ఇది క్రీ.పూ. 1800 లో మాల్వాలో ఉత్తరంవైపు వ్యాపించింది. ఈ ప్రాంతం మొదటి పట్టణ నాగరికత సింధు నాగరికతతో ప్రారంభమైంది.[56]

పాతరాతి యుగం

భింబెట్కా లోని రాతి-రంగుచిత్రాలు.

మధ్య భారతదేశము లోని నర్మద నదీ పరివాహ ప్రాంతము లోని హత్నోరా లోని హోమినిని అవశేషాల వల్ల భారతదేశ భూభాగమునందు ప్రాచీన శిలా యుగం నుండే జనావాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అవశేషాల యొక్క సరియైన కాలము తెలియకున్నప్పటికినీ, పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం ఇవి కనీసం రెండు నుండి ఏడు లక్షల సంవత్సరాల కాలము నాటి క్రిందవని తెలియుచున్నది. ఈ శిలాజాలు దక్షిణ ఆసియా లోనే లభించిన తొలి మానవ అవశేషాలు. దక్షిణ భారతదేశము లోని కలడ్గి ప్రాంతంలో ఓ క్వారీలో ఇటీవల కొన్ని అవశేషాలు కనుగొన్నారు. వీటిని బట్టి ఆధునిక మానవులు ఈ ప్రాంతంలో సుమారు 12,000 సంవత్సరాల నాటి చివరి మంచు యుగము నుండే ఉన్నట్లు తెలియుచున్నది. మధ్య ప్రదేశ్ లోని భీమ్‌బేట్కా శిలా గుహలు అను ప్రదేశములోని ఆధారాలను అనుసరించి 9,000 సంవత్సరాల క్రితము ఇక్కడ మనుషులు ఉన్నట్లు పూర్తి ఆధారాలతో నిర్ధారణ అవుచున్నది.

కొత్తరాతి యుగం

దక్షిణాసియా ప్రాంతంలో, కొత్తరాతి యుగపు తొలి సంస్కృతి మెహర్‌గఢ్లో క్రీ.పూ.7000 లో వర్ద్ధిల్లింది. ఈ ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్‌ లోని బలూచిస్తాన్‌లో ఉంది. మెహర్గఢ్‌ ప్రజలు ముఖ్యంగా పశువుల కాపరులు, మట్టి ఇళ్ళలో నివసించేవారు. బుట్టలు అల్లుతూ, గొర్రెలను పెంచుతూ ఉండేవారు. క్రీ.పూ.5500 నాటికి, వీరు కుండలు చెయ్యడము మొదలు పెట్టినారు. అలాగే రాగి పనిముట్ల వాడకం కూడా మొదలైంది. క్రీ.పూ.2000 నాటికి వీరు అదృశ్యం అయినారు.

కంచుయుగం

మొదటి నగరీకరణ (క్రీ.పూ.3300 – క్రీ.పూ.1500)

సింధూలోయ నాగరికత

సింధు లోయ నాగరికత

భారత ఉపఖండంలో కాంస్య యుగం క్రీ.పూ. 3300 ప్రారంభంలో సింధు లోయ నాగరికత ప్రారంభమైంది. ఇది సింధూ నది, దాని ఉపనదీ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఘగ్గర్- హర్కా నదీ లోయల వరకు విస్తరించింది.[40] గంగా, యమునా దోయాబ్,[58] గుజరాతు [59] ఆగ్నేయ ఆఫ్గనిస్తాన్ వరకు విస్తరించింది. [60] మెసొపొటేమియా, ఫారోనిక్ ఈజిప్టులతో పాటు ప్రాచీన ప్రపంచంలో నాగరికత జన్మస్థానంగా ఉన్న 'ప్రాచీన తూర్పు' లో విలసిల్లిన మూడు ప్రాచీన నాగరికతలలో సింధు నాగరికత ఒకటి. ఇది భూభాగవైశాల్యం, జనాభా పరిగణలోకి తీసుకుంటే అత్యంత విస్తృతమైనదిగా భావిస్తున్నారు.[61][62]

ఈ నాగరికత ప్రాధమికంగా ఆధునిక భారతదేశంలో (గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్ము, కాశ్మీర్ రాష్ట్రాలు),[63] పాకిస్తాన్ (సింధ్, పంజాబు, బలూచిస్తాన్ రాష్ట్రాలు) లో ఉంది.[63] చారిత్రాత్మకంగా ప్రాచీన భారతదేశంలో భాగంగా ఇది మెసొపొటేమియా, ప్రాచీన ఈజిప్టులతో పాటు ప్రపంచపు మొట్టమొదటి పట్టణ నాగరికతలలో ఒకటి.[63] పురాతన సింధు నదీ లోయలో నివసించేవారు, హరాప్పన్లు లోహపు పనిముట్లు, హస్తకళ (కర్నేల్ ఉత్పత్తులు, సీల్ బొమ్మలు) లో కొత్త పద్ధతులను అభివృద్ధి చేశారు. రాగి, కాంచు, సీసం, టిన్లను ఉత్పత్తి చేశారు.

పరిణతి చెందిన సింధు నాగరికతలో భాగంగా సుమారు క్రీ.పూ. 2600 - 1900 వరకు భారత ఉపఖండంలో పట్టణ నాగరికత ప్రారంభమయింది. ఆధునిక నాగరికతలో పరిణితి చెందిన ధోలావిరా, కాలిబాన్గన్, రోపార్, రాఖిగరి, ఆధునిక భారతదేశంలోని లోతల్, అలాగే హరప్పా, గణేరివాలా, మోహెంజో-దారో వంటి ఆధునిక పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ నగరం నాగరికత ఇటుకలు, రహదారులు, నీటిపారుదల వ్యవస్థ, మురుగునీటి కాలువలు, పలు అంతస్థుల ఇళ్ళను నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ నగరాలకు ఒకవైధమైన పురపాలక సంస్థలను కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు.[64] మొత్తం 1,022 నగరాలు, స్థావరాలు కనుగొనబడ్డాయి.[63] ముఖ్యంగా సింధు, ఘగ్గర్-హక్ర నదులు, వారి ఉపనదులు; వీటిలో 406 ప్రదేశాలు పాకిస్తాన్లో, భారతదేశంలో 616 సైట్లు,[63] వీటిలో 96 ప్రాంతాలలో తవ్వకాలు జరిగాయి.[63]

ఈ నాగరికత చివరి కాలంలో క్రమంగా క్షీణతకు సంకేతాలు కనిపించడం మొదలైంది. సుమారుగా క్రీ.పూ. 1700 నాటికి చాలా నగరాలు వదలివేయబడ్డాయి. ఏదేమైనా సింధు నాగరికత హఠాత్తుగా అదృశ్యమయింది. సింధు నాగరికత కొన్ని అంశాలు ముఖ్యంగా చిన్న గ్రామాలు, పొలాలు ఉన్నాయి. చరిత్రకారుడు ఉపేందర్ సింగ్ ప్రకారం "చివరి హరప్పన్ దశలో సమర్పించబడిన సాధారణ చిత్రం పట్టణ నెట్వర్క్ల విచ్ఛిన్నమై గ్రామీణ ప్రాంతాల విస్తరణ" జరిగిందని భావిస్తున్నారు.[65] డోయాబ్ ప్రాంతంలోని ఓచెర్ రంగు పూసిన మృణ్మయలతో సంబంధం కలిగివున్న ఈ సమయంలో భారతీయ రాగి హోయార్డ్ సంస్కృతి అభివృద్ధి చెందింది.

ఆదిమవాసీ ద్రావిడులు

ఆర్యులు భారతీయ ఉపఖండానికి వరుసగా వలసలు సాగించడానికి ముందు భారతీయ ఉపఖండం అంతటా ద్రావిడాభాషలను మాట్లాడే ప్రజలు విస్తరించి ఉండేవారని భాషాపరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆరంభకాల సింధూనాగరికత తరచుగా ద్రావిడ నాగరికతగా భావించబడుతుంది.[66] హెంరీ హెరాస్, కమిల్ జ్వెలెబిల్, అస్కొ పర్పొలా, ఇరావతం మహాదేవన్ వంటి పరిశోధకులు ఈ భాషా, నాగరికతల పోలికలు చూసి వీరు సింధూనాగరికతకు చెందిన ప్రోటో ద్రావిడ ఆదిమవాసులు అని భావిస్తున్నారు.[67][68] భాషాపరిశోధకుడు అస్కొ పార్పోలా వ్రాతలు సిధూ లిపి, హరప్పన్ లిపి అనేకంగా ద్రావిడభాషా కుటుంబానికి చెందినవని తెలియజేస్తున్నాయి.[69] పార్పోలా ఫిన్నిషు బృందానికి నాయకత్వం వహించి కంప్యూటర్ ఉపయోగించి శిలాశాసనాల పరిశోధన సాగించాడు. ప్రోటో ద్రావిడభాషా విధానంలో పలు చిహ్నాలను అధ్యయనం చేసి హెరాస్, నొరొజోవ్ (చేప గుర్తు ద్రావిడ భాషలో చేప (మీన్))అవి ద్రావిడభాషా కుటుంబానికి చెందినవని అంగీకరించినప్పటికీ ఇతర అధ్యయనాలు ఇదుకు వ్యతిరేకంగా ఉన్నాయి.1994 వరకూ పర్పోలా పరిశోధనల సారాంశం " డిసిఫరింగ్ ది ఇండస్ స్క్రిఫ్టు " లో వివరించబడింది.[70] తమిళనాడులో సాగించిన పరిశోధనలు నియోలిథిక్ చివరి భాగం (క్రీ.పూ. 2000 హరప్పన్ నాగరికత పతనం తరువాత)సింధూ నగరికత చిహ్నాలు కలిగిన రాతి ఉపకరణాలు చూసి కొంత మంది ద్రావిడియన్ గుర్తింపును అంగీకరించారు.[71][72] యూరి నొరొజొవ్ ఈ చిహ్నం లోగోసైలబిక్ లిపిగా ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. కంప్యూటర్ విశ్లేషకులు ఈ అభిప్రాయాన్ని బలపరిచారు.[73] నొరొజొవ్ సలహాలకు హెంరీ హెరాస్ (ద్రావిడ సాంకేతిక లిపి పరిశోధకుడు)పరిశోధనల ఆధారంగా ఉన్నాయి.[74] జె.బ్లొచ్ వంటి కొంతమంది పరిశోధనా విద్యార్ధులు అప్పటికే ఋగ్వేదం రూపుదిద్దుకున్న ద్రావిడ భూభాగాలలో సింధూనాగరికతకు చెందిన ప్రజలు వలసగా వచ్చి చేరారని అభిప్రాయపడ్డారు.[75] బలూచిస్తానుకు చెందిన బ్రహుయి ప్రజలు భాషాసనానతలు ఉన్న ప్రాంతాలకు తీసుకుని రాబడ్డారని ప్రాంతం అంతటా వ్యాపించిన ద్రావిడభాషలను సింధూభాషలు భర్తీ చేసాయని భావిస్తున్నారు.[76]

సరస్వతీ, సింధూ నదీ లోయల నాగరికత

ఇది ఇటుకలతో కట్టబడిన కట్టడాలకూ, రోడ్లకూ, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజి పద్ధతికీ, బహుళ అంతస్తుల భవనాలకూ, పేరుగాంచింది. సుమేరియను రికార్డులలో పేర్కొన్న మేలుహ్హా అంటే భారతదేశమే కావచ్చని భావిస్తున్నారు. చరిత్రలో మొట్టమొదటి సారిగా భారతదేశపు ప్రస్తావన వచ్చింది ఇక్కడే. సమకాలీన నాగరికతలైన సుమేరియను, ఈజిప్టు లతో పోలిస్తే ఇది భౌగోళికంగా చాలా పెద్దదీ, చక్కని ప్రణాళీకాబద్దమైనదీ అని భావిస్తున్నారు. ఇక్కడి చాలా వాటికి ఏక ప్రమాణాలు పాటించబడినాయి కనుక (ఉదాహరణకు ఇటుకల కొలత, మొత్తము అన్ని ఒకే మాదిరి ఉన్నాయి) కనుక ఇది ఒకే రాజు పాలలో ఉండవచ్చని భావిస్తున్నారు.

మొహెంజో దారో ఈ నాగరికతకు కేంద్రం. దక్షిణాన బొంబాయి వరకూ, ఉత్తరాన ఢిల్లీ వరకూ, పశ్చిమాన ఇరాన్ ఎల్లల వరకూ, ఉత్తరాన హిమాలయాల వరకూ ఈ నాగరికత వ్యాపించింది. హరప్పా, దొలవీర, గన్వేరివాలా, లోథాల్‌, అనునవి ఇక్కడి ముఖ్యమైన కనుగొన్న పట్టాణాలు. సుమారుగా యాబై లక్షల జనాభా వరకూ ఉండి ఉండవచ్చు అని ఓ అభిప్రాయము. ఇప్పటివరకూ 2,500 నగరాలు కనుగొనబడ్డాయి! ముఖ్యముగా లుప్తమైన సరస్వతీ నదీ పరివాహ ప్రదేశమున ఎక్కువగా కనుగొనబడ్డాయి. ఈ సరస్వతీ నది మరణమే ఈ నాగరిత మరణానికి కారణమని చాలా మంది నమ్ముతున్నారు.

వైదిక నాగరికత

వేదాలతో ముడిపడ్డ ఇండో-ఆర్యన్‌ నాగరికతే వైదిక నాగరికత. వైదిక సంస్కృత భాషలో ఉన్న వేదాలు ఇండో-యూరోపియను రచనలోకెల్లా పురాతనమైనవి. ఈ పుస్తకాల " ఆర్యుల ఆగమన సిద్దాంతము " పై భిన్నాభిప్రాయాలున్నాయి. వైదిక నాగరికులు తొలుత పశువుల కాపరులు. తరువాతి కాలంలో వీరు వ్యవసాయంపై ఆధారపడ్డారు. సమాజం నాలుగు వర్ణాలుగా వర్గీకరించబడింది. అనేక చిన్న చిన్న రాజ్యాలు, జాతులు విలీనమై కొన్ని పెద్ద రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఈ రాజ్యాల మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి. ఆ తరువాత వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు.

వేదాలతో పాటు రామాయణము, భారతము కూడా ఈ కాలంలోనే వ్రాయబడినాయని చెప్పబడుచున్నది. భగవద్గీత కూడా ఈ కాలములోనే వ్రాయబడింది.

కురు వంశం సామ్రాజ్యము వేదిక నాగరికత కాలానికి చెందినదే! ఇదే మహాభారతము లోని పోరాట భూమికను పోషించింది. క్రీ.పూ.7 వ శతాబ్దానికి భారతదేశము చాలా వరకు పట్టణీకరింపబడింది. ఆ కాలం నాటి సారస్వతంలో 16 మహా జనపదాల ప్రస్తావన ఉంది.

వేదకాల సమాజం

వేదకాల సమాజం

చరిత్రకారులు వేద సంస్కృతి పంజాబు ప్రాంతం, ఎగువ గంగా మైదానంలో విలసిల్లిందని వేదాంశాలను ఉదహరిస్తూ విశ్లేషించారు.[78] చాలామంది చరిత్రకారులు కూడా ఈ కాలాన్ని వాయువ్య నుండి భారత ఉపఖండంలోకి ఇండో-ఆర్యన్ వలసలు కొనసాగిన కాలంగా వశ్వసిస్తున్నారు.[79][80] అధర్వ వేదకాలం నాటికి రావి చెట్టు, ఆవులను పవిత్రం అయినవిగా భావించబడ్డాయి.[81] భారతీయ తత్వశాస్త్రం వేద పూర్వకాలానికి ముందున్న ధర్మం వంటి మూలాలను గుర్తించాయి.[82] భారత ఉపఖండం వాయవ్యభూభాగంలో ౠగ్వేదంలో ఆరంభకాల వేదసమాజం గురించి వర్ణించబడింది. అతి పురాతన వేదసాహిత్యం క్రీ.పూ 2 వ సహస్రాబ్ధానికి చెందినదని భావిస్తున్నారు.[83][84][85] ఈ సమయంలో ఆర్య సమాజంలో ఎక్కువగా గిరిజన, మతసంబంధమైన సమూహాలు ఉన్నాయి. హరప్పా పట్టణీకరణకు ఇది విభిన్నమైనది.[86] ప్రారంభ ఇండో-ఆర్యన్ ఉనికి బహుశా ఓచర్ రంగు కుమ్మరి సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది పురావస్తుశాస్త్ర వివరణలు తెలియజేస్తున్నాయి.[87]

ఋగ్వేద కాలం ముగిసిన తరువాత ఆర్యసమాజం భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతం నుండి పశ్చిమ గంగా మైదానానికి విస్తరించడం ప్రారంభించింది. తరువాత ఇది వ్యవసాయసమాజంగా మారి ఈ సమాజం నాలుగు వర్ణాల సాంఘిక వర్గాల సోపానక్రమం కలిగిన సామాజికంగా నిర్వహించబడింది. ఉత్తర భారతదేశ స్థానిక సంస్కృతులతో సాంఘికనిర్మాణం అనుసంధానితమైంది. [88] కానీ చివరికి కొన్ని స్థానిక ప్రజలను వారి వృత్తులను మినహాయించారు.[89] ఈ కాలంలో మునుపటి చిన్న గిరిజన విభాగాలు, ప్రధానగురువులు జనపదాలలో (రాచరిక, రాష్ట్ర-స్థాయి విధానాలు) కలిసిపోయాయి.[90]క్రీ.పూ. 14 వ శతాబ్దంలో [91] వేదంలోని ఆర్యన్ గిరిజన సామ్రాజ్యాలతో పురు, భరత గిరిజన రాజ్యాలు వాయవ్య గిరిజన సమూహాలతో మైత్రి చేసుకుని విశ్వామిత్రుని మార్గదర్శకత్వం స్వీకరించాయి. పురు రాజు సుదాసు, భరతగిరిజన సమూహాలతో వేదసమూహాలతో యుద్ధంచేసి విజయం సాధించి కురు సాంరాజ్యస్థాపన చేసారు. ఇది వేదకాలం నాటి మొదటి రాజ్యంగా భావించబడుతుంది.[92]

జనపదాలు

జనపదాలు
ఉత్తర భారతదేశంలో జనపదలతో ఆర్యావర్త సరిహద్దులను చూపుతున్న వేద యుగం ఆఖరి దశలోని పటం, భారతదేశంలోని ఇనుప యుగం రాజ్యాలు- కురు, పంచాల, కోసల, విదేహ.
ఉత్తర పంచాల పురాతన రాజధాని అహిచంద్ర (లేదా అహి-క్షేత్ర). ఈ నగరం యొక్క అవశేషాలు బరేలిలో కనుగొనబడ్డాయి.

సుమారు క్రీ.పూ. 1200 నుండి క్రీ.పూ. 6 వ శతాబ్దం వరకు భారత ఉపఖండంలో రిపబ్లిక్లు, సామ్రాజ్యాలు - ఇనుప యుగం రాజ్యాలుగా భావిస్తున్నారు. జనపదాల పెరుగుదల కారణంగా కురు, పాంచాల, కోసల, విదేహ వంటి ఇనుప యుగం రాజ్యాలు ఏర్పడ్డాయి.[93][94]

వాయువ్య భారతదేశంలో ఇనుపయుగ ఆరంభంలో సుమారు క్రీ.పూ. 1200 - 800 లో వేద కాలం నాటి మొదటి రాజ్య-స్థాయి సమాజంగా కురు సామ్రాజ్యం వెలసింది.[95] ఈ కాలంలోనే అథర్వవేదం కూర్చబడింది. (ఇది మొట్టమొదటి భారతీయ లిఖిత సాహిత్యం).[96] కురు ప్రభుత్వం కాలంలో వేద శ్లోకాల సేకరణ జరిగింది. సాంఘిక క్రమాన్ని సంస్కరిస్తూ సనాతన సంప్రదాయాలను అభివృద్ధి చేసింది.[96] కురు రాజ్యానికి చెందిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల రాజు పరిక్షిత్తు, ఆయన వారసుడైన జానమేజయుని పాలనలో ఈ భూభాగం ఉత్తర ఇనుపయుగ భారతదేశంలో ఆధిపత్య రాజకీయ, సాంస్కృతిక శక్తిగా మార్చబడింది.[96] కురు రాజ్యం క్షీణించిన సమయంలో వేద సంస్కృతి కేంద్రం తూర్పు పొరుగున ఉన్న పంచాల రాజ్యంలోకి మారింది.[96] క్రీ.పూ. 1100 నుండి 600 వరకు ఉత్తర భారతదేశంలోని హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో వృద్ధి చెందిన పెయింటెడ్ గ్రే వేర్ సంస్కృతి అభివృద్ధి చెందింది.[97] కురు, పంచాల రాజ్యాలకు అనుగుణంగా ఉన్నాయని విశ్వసిస్తున్నారు.[96][98]

వేద కాలం చివరిలో విదేహరాజ్యం వేద సంస్కృతికి నూతన కేంద్రంగా ఉద్భవించింది. ఇది తూర్పు వైపుకు (భారతదేశంలో నేడు నేపాల్, బీహార్ రాష్ట్రంలో) ఇప్పటికీ ఉంది.[87] జనకరాజు సభ, బ్రాహ్మణ ఋషులు, యజ్ఞవల్క్య, అరునీ, గార్గి వచక్నవి వంటి తత్వవేత్తలకు ప్రాధాన్యం ఇచ్చింది.[99] ఈ కాలంలో తరువాతి భాగంలో అభివృద్ధి చెందిన పెద్ద సాంరాజ్యాలు, రాజ్యాలు, ఉత్తరప్రదేశ్ అంతటా మహేజనపదాలు అని పిలువబడ్డాయి.

మహాజనపదములు

సా.శ. 1వ శతాబ్దం నాటి నిలిచివున్న బుద్ధ విగ్రహము, గాంధారము.

క్రీ. పూ. 600నాటికి భారతదేశము లోని గంగా పరీవాహక ప్రదేశములో మరియూ సింధూ పరీవాహక ప్రదేశములలో పదహారు రాజ్యాలు విస్తరించినాయి. వీటిని మహా జనపదాలు అని పిలవడం కద్దు. ఇందులో ముఖ్యమైనవి, కురు, కోసల, మగధ, గాంధార. ఇవి ఎంత ముఖ్యమైనవంటే ఇప్పటికీ చందమామ కథలలో మనము ఈ పేర్లే చూస్తుంటాము! ఉపనిషత్తులు ఈ కాలములోనే వ్రాయబడినాయని ఓ అభిప్రాయము. ఈ కాలములో రాజ భాష సంస్కృతము. సాధారణ జన భాష మాత్రము ప్రాకృతము. గౌతమ బుద్ధుడు ఈ కాలము నాటి వాడే. జైన మతము స్థాపించిన మహా వీరుడు కూడా ఈకాలము వాడే. ఈ రెండు మతాలూ సులభంగా ఉండి ప్రాకృత భాషలో బోధించినాయి, అందువల్ల సామాన్యులు వీటిని ఎక్కువగా ఆదరించారు. జైన మతము భౌగోళికంగా ఎక్కువ వ్యాపించకపోయినప్పటికీ, బౌద్ధ మతము మాత్రము టిబెట్, జపాన్, శ్రీలంక దక్షిణ ఆసియా దేశాలుకు వ్యాపించింది.

క్రీ. పూ. 500 సంవత్సరమున ఈ ప్రాంతమును పర్షియన్లు ఆక్రమించారు. వీరు ప్రభువైన డేరియస్ 1 ఇందుకు ఆద్యుడు. పర్షియన్లు తక్షశిలను తమ రాజధానిగా చేసుకున్నప్పటికీ వీరి ప్రభావము నామ మాత్రమే. వీరు 150 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత అలెగ్జాండరు వీరిని ఓడించాడు.

ద్వితీయ నగరీకరణ (క్రీ.పూ 600 – 200)

క్రీస్తుపూర్వం 500 లో కూసీనగర యొక్క ప్రధాన ద్వారం యొక్క ఊహాత్మక పునర్నిర్మాణం, సాంచి వద్ద నున్న కళాఖండం నుండి తీసుకోబడింది.
సాంచి స్థూపం 1 దక్షిణ ద్వారం, క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దం ప్రకారం క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దంలో కూసినగరం.

క్రీ.పూ. 800 నుండి 200 మధ్య కాలములో ఏర్పడిన శ్రమణ ఉద్యమం నుండి జైనమతం, బౌద్ధమతం ప్రారంభం అయ్యాయి. అదే కాలంలో మొదటి ఉపనిషత్తులు వ్రాయబడ్డాయి. "రెండవ పట్టణీకరణ" గా పిలువబడిన క్రీ.పూ. 500 తర్వాత కాలంలో ప్రత్యేకంగా మద్య గంగా మైదానంలో కొత్త పట్టణ స్థావరాలు ఏర్పడ్డాయి. [100] రెండో పట్టణీకరణ పునాదులు క్రీ.పూ 600 కు ముందు ఘాగర్-హక్రా, ఎగువ గంగా మైదానానికి చెందిన పెయింటెడ్ గ్రే వేర్ సంస్కృతిలో ఉన్నాయి. చాలా పి.జి.డబల్యూ. ప్రాంతాలు చిన్న వ్యవసాయ గ్రామాలుగా ఉన్నప్పటికీ "అనేక డజన్ల" పి.జి.డబల్యూ. ప్రాంతాలు చివరకు పట్టణాలుగా గుర్తించదగిన పెద్ద స్థావరాలుగా ఉద్భవించాయి.[101] [102] క్రీ.పూ. 500 తర్వాత ఏర్పడిన కొత్త రాజ్యాలైన "రెండో పట్టణీకరణ" సమయంలో మగధ సామ్రాజ్యం విలసిల్లిన మద్య గంగా మైదానంలో ప్రత్యేక సంస్కృతితో మౌర్యసామ్రాజ్యం పునాది వేయబడింది.[web 1][103][note 2] ఇది వేద సంస్కృతి చేత ప్రభావితమైంది,[104] కానీ ఇది కురు-పంచల ప్రాంతం నుండి వేరుగా ఉండిపోయింది. [102] ఇది "దక్షిణాసియాలో మొట్టమొదటి వరి సాగు చేసిన ప్రాంతం క్రీ.పూ. 1800 నాటికి చిరోండ్, చెచార్ల ప్రాంతాలతో అనుబంధితమైన ఆధునిక నియోలిథిక్ జనాభాకు ఇది స్థానంగా ఉంది".[105] ఈ ప్రాంతంలో ధారావాహిక ఉద్యమాలు అభివృద్ధి చెంది జైనమతం, బౌద్ధమతం మొదలైంది. [100]

ఉపనిషత్తులు, శ్రమణ ఉద్యమాలు

ఉపనిషత్తులు, శ్రమణ ఉద్యమం
ఈశోపనిషత్తు ప్రతిలోని ఒక పుట.
24వ ఆఖరి జైన తీర్థంకరుడైన మహావీరుడు.
కూశీనగరలోని గౌతమబుద్ధుడి సమాధి స్తూపం.

క్రీ.పూ. 800 నుండి క్రీ.పూ 400 వరకు ఉపనిషత్తుల కూర్చబడ్డాయి.[106][107][108] ఉపనిషత్తులు సాంప్రదాయ హిందూయిజానికి సిద్ధాంతపరమైన ఆధారాన్ని ఏర్పరుస్తాయి. ఇవి వేదసారాలు(వేదాంతాలు) గా పిలువబడతారు.[109] పాత ఉపనిషత్తులు కర్మపై తీవ్ర దాడిచేయడానికి ప్రారంభించారు. బ్రిహదరాన్యకలో ఒక దైవత్వాన్ని పూజించే ఎవరైనా ఉపనిషత్తులోని దేవతల పెంపుడు జంతువు అని చెప్పబడింది. ముండకా వృద్ధాప్య, మరణం ఒక సురక్షితం కాని పడవలో ప్రయాణించే వారిగా పేర్కొనడంద్వారా ఆచారంపై అత్యంత భీకరమైన దాడిని ప్రారంభించింది.[110]

క్రీ.పూ. 7 వ - 6 వ శతాబ్దాల్లో భారతదేశంలో అధికరించిన పట్టణీకరణ కొత్త సన్యాసమార్గం రూపుదిద్దుకుంటున్న తరుణంలో శ్రమణ ఉద్యమాల అభివృద్ధికి దారితీసింది. ఇది సనాతన ఆచారాలను సవాలు చేసింది.[107] బౌద్ధమత స్థాపకుడు ఈ ఉద్యమానికి అత్యంత ప్రముఖమైన చిహ్నంగా మహావీరుడు (క్రీ.పూ.549-477), జైనమతం స్థాపకుడుగా, గౌతమ బుద్ధుడు (క్రీస్తుపూర్వం 563-483)బౌద్ధమత స్థాపకుడుగా అవతరించారు. శ్రమణ జనన మరణ చక్రానికి సరికొత్త అర్ధాన్ని చెప్పి సంసార భావన నుండి విమోచన భావన అనే భావనకు దారితీసింది.[111] బుద్ధుడు ఒక మధ్యమార్గాన్ని కనుగొన్నాడు. ఇది ఆధ్యాత్మికంగా తీవ్రమైన సన్యాసిజాన్ని సంతృప్తిపరిచింది.[112]

అదే సమయంలో మహావీర (జైనమతంలో 24 వ తీర్థంకరం) జైనమతం ఒక వేదాంతశాస్త్రాన్ని ప్రచారం చేసింది.[113] అయినప్పటికీ తీర్ధంకరుల సమయం అందరికీ తెలిసిన దానికంటే ముదుకాలానికి చెందినవని భావిస్తున్నారు. పర్ష్వంత (క్రీ.పూ 872 - క్రీ.పూ. 772) పరిశోధకులు విశ్వసిస్తున్నారు. రిషభనత మొదటి తీర్ధంకరని భావిస్తున్నారు. [114] వేదాలలో వర్ణించిన తీర్ధంకరులు శ్రమణా ఉద్యమానికి చెందిన వారని భావిస్తున్నారు.[115]

మహాజనపదాలు

మహాజనపదాలు
ప్రాచీన భారతదేశంలో మహాజనపదాలు ఆ కాలంలోని పదహారు అత్యంత శక్తివంతమైన, విస్తారమైన రాజ్యాలు, గణతంత్ర రాజ్యాలు, ఇవి ప్రధానంగా సారవంతమైన ఇండో-గంగా మైదానాలలో ఉన్నాయి, ఇవి కాక అనేక చిన్న రాజ్యాలు కూడా ఉన్నాయి.
కోసల మహాజనపదానికి సంబంధించిన వెండి నాణేలు, c. 525 BCE.
అవంతి మహాజనపద వెండి నాణెం క్రీ.పూ. 400.

క్రీ.పూ. 600 నుండి క్రీ.పూ. 300 లో మహాజనుపాదాల అభివృద్ధి సాగింది. 16 శక్తిమంతమైన, విస్తారమైన రాజ్యాలు, గణతంత్రాలు అభివృద్ధి చెందాయి. ఈ మహాజనపదాలు వాయువ్యంలో గాంధారం నుండి భారత ఉపఖండంలో తూర్పు భాగంలో బెంగాల్ వరకు విస్తరించాయి. ఇందులో ట్రాన్స్-విన్ధ్యాయ ప్రాంతం భాగాలు ఉన్నాయి.[116] అంగుత్తారా నికాయ [117] వంటి పురాతన బౌద్ధ గ్రంథాలలో ఈ పదహారు గొప్ప రాజ్యాలు, గణతంత్రాలు-అంగ, అస్కాకా, అవంతి, చెడి, గాంధార, కషి, కంబోజ, కోసల, కురు, మగధ, మల్లా, మత్స్య (లేదా మచ్చ) , పాంచాల, సురసేన, వెర్జి, వాట్సా ప్రస్తావన ఉంది. ఈ కాలంలో సింధు నాగరికత తర్వాత భారతదేశంలో పట్టణీకరణ రెండవ అతిపెద్ద పెరుగుదల కనిపించింది.[118]

ప్రపంచంలో తొలి గణతంత్రంగా పరిగణించబడుతున్న వజ్జి రాజధాని వైశాలి నగరంలో లిచ్చవి వంశస్థులు నిర్మించిన ఆనంద స్తూప.[119]

ప్రారంభ "గణతంత్రాలు" (గానా సాంఘా)[119] షాకియస్, కొలియస్, మల్లాస్, లిచ్చవియస్లు గణతంత్ర ప్రభుత్వాలను కలిగి ఉన్నాయి.[119]

క్రీ.పూ. 6 వ శతాబ్దం నాటికి వైశాలి నగరంలో కేంద్రీకృతమై ఉన్న వల్జియాన్ గణతంత్రం (వాజ్జి), క్రీ.పూ. 4 వ శతాబ్దం వరకు కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. మల్లాస్ కౌసింగరా నగరంలో కేంద్రీకరించబడిన [120] వజ్జి గణతంత్ర రాజ్యాలలో లచ్చావి రాజవంశం అత్యధికంగా ప్రఖ్యాతి గడించింది.[121]

ఈ కాలము " నార్తర్న్ బ్లాక్ పాలిషింగ్ వేర్ " సంస్కృతికి సంబంధించి ఉన్నట్లు ఒక పురావస్తు పుస్తకం పేర్కొన్నది. ఈ సంస్కృతి ప్రత్యేకంగా మద్య గంగాస మైదానంలో కేంద్రీకరించి ఉత్తర, మధ్య భారత ఉపఖండంలో ప్రాంతాలలో కూడా విస్తారంగా వ్యాప్తి చెందింది. ఈ సంస్కృతిలో బృహత్తర రక్షణవలయాలతో నిర్మించబడిన భారీ నగరాలు, పెద్ద జనాభా పెరుగుదల, సాంఘిక జీవితం ఆరంభం, విస్తృత వర్తక వాణిజ్య నెట్వర్కులు, ప్రజా కూడళ్ళు, నీటి కాలువలు, ప్రత్యేకమైన కళాఖండాల రూపకల్పన (ఉదా. ఐవరీ, రత్నాల చెక్కడాలు), బరువుల విధానం, పంచ్-మార్క్ నాణేలు, బ్రహ్మి లిపితో వ్రాతలు, ఖరోస్టీ స్క్రిప్ట్స్ రూపంలో వ్రాయడం ప్రవేశపెట్టబడ్డాయి.[122][123] ఆ సమయంలో పందితభాషగా సంస్కృతం, ఉత్తర భారతదేశంలోని సాధారణ ప్రజల భాషగా ప్రాకృతం అభివృద్ధి చెందాయి.

క్రీ.పూ. 400-500 మద్య గౌతమ బుద్ధుని కాలంలో 16 గణతంత్రాలు వత్స, అవంతి, కోసల, మగధ అనే 4 ప్రధాన రాజ్యాలుగా సంఘటించబడ్డాయి. గౌతమబుద్ధుని జీవితంతో ప్రధానంగా ఈ నాలుగు రాజ్యాలకు సంబంధం ఉంది.[118]

సాంచీ లోని శిలా చిత్రం మల్ల దేశీయులు కూశీనగరం రక్షించుట. మల్ల, అంగుత్తుర నికాయ లో పేర్కొన్న 16 మహాజనపదాలలో ఒక పురాతన గణతంత్ర రాజ్యం .[124]

మగధ రాజవంశాలు

మగధ వంశాలు
హర్యాంక, శిశునాగ వంశాల పరిపాలనలో ముఖ్యపట్టణం రాజగృహ నుండి విస్తరించడానికి ముందు మగధ సామ్రాజ్యం ( c. 600 BCE)
మగధ రాజైన బింబిసారుడు రాజగృహములోని వేణువనాన్ని సందర్శించడం, సాంచిలోని చిత్రకళ.

మగధ రాష్ట్రం క్రీ.పూ. 600 దాని రాజధాని రాజ్య గ్రంథం నుండి హారీకా వంశీయులు, వారసుడు షిషునాగ వంశీయులు కింద విస్తరించే ముందు.

మగధ రాజుకు చెందిన కింగ్ బింబిసర రాజగిరిలో వెదురున వెదురును సందర్శిస్తుంది; సాంచి నుండి కళాత్మకత.

పదహారు మహా-జనపదలలో (ప్రాచీన భారతదేశంలో రాజ్యాలుగ) గంగానగరానికి దక్షిణాన బీహార్ ప్రాంతం; దాని మొదటి రాజధాని రాజగ్రిహ (ఆధునిక రాజగిర్), తరువాత పాలిటిపుత్రా (ఆధునిక పాట్నా) ఉండేవి. బీహారులో అత్యధికభాగాన్ని జయించిన తరువాత లచ్చావి, అంగదేశాలను జయించి బెంగాలు వరకు విస్తరించింది.[125] తరువాత తూర్పు ఉత్తరప్రదేశ్, ఒరిస్సాలో ఎక్కువ భాగం వరకు విస్తరించింది. ప్రాచీన సామ్రాజ్యం మగధ జైన, బౌద్ధ గ్రంథాలలో ఎక్కువగా ప్రస్తావించబడింది. ఇది రామాయణ, మహాభారత, పురాణాలలో కూడా పేర్కొనబడింది.[126] మగధ ప్రజలకు మొట్టమొదటి సూచన అధర్వవేదంలో ఉంది. ఇక్కడ అవి అంగ, గాంధార, ముజావతు రాజ్యాలతో పాటు జాబితాలో ఉన్నట్లు కనుగొన్నారు. మగధ జైనమతం, బౌద్ధమతం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతదేశంలోని రెండు గొప్ప సామ్రాజ్యాలు మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం మగధ నుండి పుట్టాయి. ఈ సామ్రాజ్యాల పాలనాకాలంలో ప్రాచీన భారతదేశ శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, ఆధ్యాత్మికత, తత్త్వ శాస్త్రంలో పురోగతి సాధించి ఈ కాలం భారతీయ "స్వర్ణయుగం" గా భావించబడింది. మగధ రాజ్యంలో రాజకుమారా సమాజం వంటి గణతంత్ర సమూహాలు ఉన్నాయి. గ్రామాలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో స్వంత సభాసమావేశాలు ఉన్నాయి. వారి పాలనా యంత్రాంగం కార్యనిర్వాహక, న్యాయ, సైనిక కార్యకలాపాల వారీగా విభజించబడింది.

మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన శిశునాగ వంశపు కాలం నాటి నాణేలు.

హిందూ ఇతిహాసం మహాభారతం బృహద్రధుడు మగధ మొదటి పాలకుడు అని తెలియజేస్తుంది. బౌద్ధ పాలి కానన్, జైన ఆగామాస్, హిందూ పురాణశాస్త్రాల నుండి ప్రారంభ మూలాల ఆధారంగా 200 సంవత్సరాల కాలం హర్యాంక రాజవంశం మగధను పాలించినట్లు క్రీ.పూ 600 - 413 వరకు. హర్యంక రాజవంశం రాజు బిబిసారుడు చైతన్యవంతమైన, విస్తారమైన విధానంతో అంగ (ప్రస్తుత తూర్పు బీహారు, పశ్చిమ బెంగాలు ప్రాంతాలు) దేశాన్ని జయించాడు. రాజు బిబిసారుడు తన కుమారుడు రాజకుమారుడు అజాతశత్రు చేత పదవీచ్యుతుడై చంపబడ్డాడు. తరువాత ఆయన మగధ విస్తరణ విధానాన్ని కొనసాగించాడు. ఈ కాలంలో బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు మగధ రాజ్యంలో చాలాకాలం జీవించాడు. అతను బుద్ధ గయాలో జ్ఞానోదయం పొందాడు. సర్నాథ్లో తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. రాజ్గ్రహలో మొదటి బౌద్ధ మండలిని నిర్వహించారు.[127] హర్యాంక రాజవంశం శిశునాగ వంశీకులచే పడగొట్టింది. చివరి శిశునాగ పాలకుడు కలోసోకా క్రీ.పూ. క్రీ.పూ 345 లో మహాపాద్మనాందుడిచే హతమార్చబడ్డాడు. మహాపద్మ నందుడు ఆయన ఎనిమిది మంది కుమారులైన నవనందులు అని పిలవబడ్డారు. నందసామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో చాలా భాగం వరకు వ్యాపించింది.

పర్షియన్లు, గ్రీకులు

క్రీ.పూ 530 లో పర్షియా అకేమెనిడ్ సామ్రాజ్యానికి చెందిన రాజు హిందూకుషు పర్వతాలను దాటి కాంభోజ, గాంధార, ట్రాన్స్-ఇండియా ప్రాంతం (ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్) గిరిజనులను కప్పం ఇవ్వాలని నిర్బంధించాడు.[128] 520 నాటికి పర్షియా మొదటి డారియస్ పాలనా కాలంలో ఉత్తర-పశ్చిమ భారత ఉపఖండం (ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్థాన్ పాకిస్థాన్) చాలావరకు పెర్షియన్ అకేమెనిడ్ సామ్రాజ్య ఇది తూర్పు సరిహద్ది ప్రాంతాలలో భాగంగా ఉంది. తరువాత రెండు శతాబ్దాలు ఈ ప్రాంతం పర్షియన్ నియంత్రణలో ఉంది.[129] ఈ సమయంలో గ్రీసు రెండవ పర్షియను దాడి చేయడానికి (క్రీ.పూ. 480-479) భారతదేశం పర్షియను సైన్యానికి కిరాయి సైనికులను సరఫరా చేసింది.[128] పర్షియను పాలనలో పురాతన వేద విశ్వవిద్యాలయం, అకేమెనిడ్ అధ్యనాలు రెండింటినీ కలిపిన కేంద్రంగా మారింది.[130] క్రీ.పూ 327 లో అలెగ్జాండర్ ది గ్రేట్ విజయంతో ఉత్తర పాశ్చాత్య దక్షిణాసియాలో పర్షియను అధిరోహణం ముగిసింది.[131]

326 నాటికి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆసియా మైనర్, అకేమెనిడ్ సామ్రాజ్యాన్ని జయించి భారత ఉపఖండంలోని వాయువ్య సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడ హైడెస్పెస్ (ప్రస్తుత పాకిస్తాన్ జీలం సమీపప్రాంతం) యుద్ధంలో రాజు పోరస్ను ఓడించి పంజాబులో ఎక్కువ భాగం గెలిచాడు.[132] అలెగ్జాండరు దండయాత్రలో తూర్పు మగధ నందా సామ్రాజ్యం, బెంగాలు గంగారిదిలను ఎదుర్కొన్నాడు. అతని సైన్యాన్ని గంగా నది వద్ద పెద్ద భారతీయ సైన్యం ఎదుర్కొని హైఫాసిస్ (ఆధునిక బీస్ నది) వద్ద తిరుగుబాటు పోరాటం చేసి మరింత తూర్పుకు చొచ్చుకు పోకుండా నిర్భంధించింది. అలెగ్జాండరు తన అధికారి, కోనస్తో సమావేశం తరువాత నందా సామ్రాజ్యబలాన్ని గురించి తెలుసుకుని తిరిగి పోవడం మంచిది అని విశ్వసించాడు.

పర్షియన్, గ్రీక్ దండయాత్రలు భారత ఉపఖండంలోని ఉత్తర-పశ్చిమ ప్రాంతాలలో ప్రతిఘటనలు ఎదుర్కొన్నాయి. గాంధారం (ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాన్, వాయువ్య పాకిస్తాన్ ప్రాంతం) భారతీయ, పర్షియన్, మద్య ఆసియన్, గ్రీకు సంస్కృతుల మిశ్రమంతో గ్రీకో బుద్ధిజం అభివృద్ధి కావడానికి దారితీసింది. గ్రెకో-బౌద్ధమతం, సంస్కృతి 5 వ శతాబ్దం వరకు కొనసాగి మహాయాన బౌద్ధమతం కళాత్మక అభివృద్ధిని ప్రభావితం చేసింది.

మౌర్య సామ్రాజ్యం

మౌర్య సామ్రాజ్యం
అశోకుడి పరిపాలనలోని మౌర్య సామ్రాజ్యం.
సా.పూ మూడవ శతాబ్దానికి చెందిన వైశాలి లోని అశోక స్థంభం.

మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ. 322-185) భారతదేశాన్ని ఒకేరాజ్యంగా ఏకం చేసిన మొట్టమొదటి సామ్రాజ్యంగా గుర్తించబడుతుంది. ఇది భారత ఉపఖండంలో అతి పెద్దది. మౌర్య సామ్రాజ్యం గొప్ప విస్తరణలో ఉత్తరప్రాంతంలో హిమాలయాల సహజ సరిహద్దుల వరకు, తూర్పు వైపు అస్సాం వరకు వ్యాపించింది. పశ్చిమప్రాంతంలో ఆధునిక పాకిస్తాన్ దాటి ప్రస్తుతం హిందూ కుషు పర్వతాలకు చేరింది. మగధలో (ఆధునిక బీహార్లో) చాణక్య (కౌటిల) సహాయంతో మౌర్యచంద్రగుప్త నంద రాజవంశాన్ని పడగొట్టి మౌర్య సామ్రాజ్యం స్థాపించాడు.[135] చంద్రగుప్తుడి కుమారుడు బిందుసారుడు క్రీ.పూ. 297 లో సింహాసనాన్ని అధిష్టించాడు. క్రీ.పూ 272 ఆయన మరణించే సమయానికి భారత ఉపఖండంలో అధిక భాగం మౌర్య సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఉంది. అయితే కళింగ (ఆధునిక ఒడిషా చుట్టూ) ప్రాంతం మౌర్య నియంత్రణకు వెలుపల ఉంది. బహుశా దక్షిణాన వారి వాణిజ్య ఆధిఖ్యం విస్తరించింది.[136]

లోమాస్ సన్యాసుల మౌర్య బొమ్మలు, బరాబర్ గుహలలో ఒకటి క్రీ.పూ. 250

బిందుసారుడి తరువాత ఆయన కుమారుడు అశోకుడు మౌర్య సిహాసనం అధిష్టించాడు. ఆయన మరణం వరకు (సుమారు క్రీ.పూ 232 లో) ఆయన పాలన కొనసాగింది.[137] క్రీస్తుపూర్వం 260 లో కళింగులకు వ్యతిరేకంగా ఆయన పోరాటం విజయవంతం అయినప్పటికీ యుద్ధం అపారమైన నష్టానికి దారితీసింది. ఇది అశోకుడిని పశ్చాత్తాపపడేలా చేసి హింసను అడ్డగించటానికి దారితీసింది. తదనంతరం ఆయనను బౌద్ధమతం ఆలింగనం చేసుకుంది.[136] అతని మరణం తరువాత మౌర్యసామ్రాజ్యం క్షీణించి ఆయన చివరి మౌర్య పాలకుడయ్యాడు. బ్రీహద్రాత మర్యుడిని పుష్యమిత్ర శుంగ హత్యచేసి శుంగ సామ్రాజ్యం స్థాపించాడు.[137]

అశోకుడి వ్రాతలు, అర్థశాస్త్రం మౌర్య కాలంలోని ప్రాధమిక లిఖిత పత్రాలు. పురావస్తుశాస్త్రపరంగా ఈ కాలము " నార్తన్ బ్లాక్ పోలిష్డ్ వేర్ " యుగంలో ఉంది. మౌర్య సామ్రాజ్యం సమర్థవంతమైన ఆధునిక ఆర్థిక వ్యవస్థ, సమాజం మీద ఆధారితంగా ఉంది. అయినప్పటికీ వాణిజ్య విక్రయాలను ప్రభుత్వం కనుసన్నలలో జరిగేలా నియంత్రించింది.[138] మౌర్య సమాజంలో ఎటువంటి బ్యాంకింగు వ్యవస్థ లేనప్పటికీ వడ్డీ విధానం ఆచరించబడింది. బానిసత్వం పై వ్రాసిన రచనలు గణనీయమైన సంఖ్యలో కనుగొనబడడం బానిసత్వం ప్రాబల్యాన్ని సూచిస్తుంది.[139] ఈ సమయంలో దక్షిణభారతంలో వూట్జ్ ఉక్కు అనే ఒక అధిక నాణ్యత కలిగిన ఉక్కును అభివృద్ధి చేశారు. తర్వాత ఇది చైనా, అరేబియాకు ఎగుమతి చేయబడింది.[15]

సంగకాలం

సంగం కాలంలో దక్షిణ భారతదేశంలో చివరన వున్న తమిళకం దేశం. దీనిని చేర, చోళ, పాండ్య వంశాలు పరిపాలించాయి.,
తమిళ సాహిత్యంలోని ఐదు గొప్ప పురాణాలలో ఒకటైన శిలప్పటీకరం రచయిత ఇలాంగో అదిగళ్ [140]

క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దం నుండి 4 వ శతాబ్దం వరకు సంగం కాలములో తమిళ సాహిత్యం అభివృద్ధి చెందింది. ఈ కాలంలో మూడు తమిళ వంశాలు కలసి తమిళం మూడు తమిళ సింహాసనాలుగా పిలవబడ్డాయి: చేరా వంశీయులు, చోళ రాజవంశం, పాండ్య రాజవంశం దక్షిణ భారతదేశ భాగాలను పాలించారు.[141]

ఈ కాలం నాటి తమిళ ప్రజల చరిత్ర, రాజకీయాలు, యుద్ధాలు, సంస్కృతితో సంఘం సాహిత్యంలో భాగం అయ్యాయి.[142] ప్రధానంగా సాధారణ ప్రజలు నుండి వచ్చిన సంగం కాలపు పండితులు తమిళ రాజుల పోషణలో రచనలు సాగిస్తూ సాధారణ ప్రజలగురించి రచనలు సాగించారు.[143] ఎక్కువగా బ్రాహ్మణులయిన సంస్కృత రచయితలు కాకుండా, సంగం రచయితలలో విభిన్న వర్గాల నుండి, సాంఘిక నేపథ్యాల నుండి వచ్చినవారు, ఎక్కువగా బ్రాహ్మణులు కాని వారు ఉన్నారు. వారు రైతులు, కళాకారులు, వర్తకులు, సన్యాసులు, పూజారులు, ప్రసంగాలు వంటి వేర్వేరు విశ్వాసాలకు, వృత్తులకు చెందినవారు, వీరిలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు.[143]

క్రీ.పూ. 300 - క్రీ.పూ. 200 " పత్తుపాట్టు " సంఘం సాహిత్యంలో భాగంగా పరిగణించబడే పది మధ్య-పొడవు కలిగిన పుస్తక సంపుటి; కవితా రచన " ఎట్టూతోగీ " ఎనిమిది సంకలనాల కూర్పు, అలాగే పద్దెనిమిది చిన్న కవిత్వ రచనలు పదునెంగిల్ కణక్కు అర్థం; అయితే తమిళ భాషలోని తొలి గ్రామీణ రచన అయిన తోల్పాప్పియం అభివృద్ధి చేయబడ్డాయి.[144] సంగం కాలంలో తమిళ సాహిత్యంలోని ఐదు గొప్ప ఇతిహాసాలలో రెండు రచింపబడ్డాయి. ఇళంగో ఆడిగల్ వ్రాసిన సిలప్పదికారం ఒకటి. ఇది మత ఆధారిత రచన కానప్పటికీ ఇది ఇతిహాస స్థాయి గౌరవాన్ని అందుకున్నది. అన్యాయతీర్పును ఎదుర్కొని తన భర్తను కోల్పోయిన కణ్ణకి పాండియన్ రాజవంశం సభలో తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి వాదాడి నిరూపించి రాజవంశాన్ని రాజధాని నగరాన్ని మంటలకు ఆహితి చేసిన కథ ఆధారితంగా ఇది రచించబడింది.[145] సిలప్పదికారం రచనకు తరుతాతి భాగంగా సైతలై సత్తానర్ కోవలన్, మాధవి కుమార్తె బౌద్ధభిక్షుకి అయిన మణిమేఖలై కథను రచించాడు.[146][147]

సంప్రదాయ కాలం నుండి మధ్యయుగ కాలం (క్రీ.పూ.200 – క్రీ.పూ. 1200)

క్రీ.పూ. 3 వ శతాబ్దంలో ప్రారంభమైన మౌర్య సామ్రాజ్యం క్రీ.పూ. 6 వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం ఆరంభం ముగింపు మధ్యకాలం భారతదేశం "క్లాసికల్" కాలంగా సూచించబడింది.[150] కాలవ్యవధిని బట్టి వివిధ ఉప-కాలాలుగా విభజించబడవచ్చు. సాంప్రదాయిక కాలం ముగింపులో మౌర్య సామ్రాజ్యం క్షీణత ప్రారంభమై శుంగ రాజవంశం, శాతవాహన రాజవంశం అభివృద్ధి మొదలైంది. గుప్త సామ్రాజ్యం (4 వ -6 వ శతాబ్దం) హిందూ మతం "స్వర్ణయుగం" గా పరిగణించబడుతుంది. అయితే ఈ శతాబ్దాల్లో ఉత్తరభారతదేశంలో సామ్రాజ్యాలు పాలనకొనసాగుతున్న కాలంలో క్రీ.పూ.3 వ శతాబ్దం నుండి సా.శ. 3 వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలో సంగం సాహిత్యం అభివృద్ధి చెందింది.[14] ఈ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉన్నట్లు అంచనా వేయబడింది. ప్రపంచ సా.శ. 1 నుండి 1000 వరకు భారతీయ సంపద ప్రపంచ సంపదలో మూడింట ఒక వంతుల మధ్య ఉంటుంది.[151][152]

ఆరంభకాల సంప్రదాయ కాలం (క్రీ.పూ 200 – క్రీ.పూ 320 )

శుంగ సామ్రాజ్యం

శుంగ సామ్రాజ్యం

187 నుండి 78 మధ్య తూర్పు భారతీయ ఉపఖండంలోని మగధ, నియంత్రిత ప్రాంతాల నుండి శుంగప్రభుత్వ పాలన ఉద్భవించింది. చివరి మౌర్య చక్రవర్తి పదవీచ్యుతుడిని చేసి పుష్యమిత్ర శుంగాతో ఈ రాజవంశం స్థాపించబడింది. ముదుగా రాజధాని పతలిపుత్ర నుండి పాలన సాగినప్పటికీ తరువాత భాగాభద్ర వంటి చక్రవర్తులు విదిష (తూర్పు మాల్వాలోని ఆధునిక బెస్నగర్) కూడా రాజసభ నిర్వహించబడింది.[153]

పుష్యమిత్ర శుంగా 36 సంవత్సరాల పాటు పాలించిన తరువాత ఆయన కుమారుడు అగ్నీమిత్ర రాజ్యపాలన చేసాడు. శుంగా పాలకులు పదిమంది ఉన్నారు. అయినప్పటికీ అగ్నిమిత్ర మరణం తరువాత సామ్రాజ్యం వేగంగా విచ్ఛిన్నమైంది;[154] శుంగ సామ్రాజ్యం బలహీనమైన తరువాత ఉత్తర, మధ్య భారతదేశంలో చాలా వరకు చిన్న రాజ్యాలు, నగర-రాజ్యాలుగా శుంగ ఆధిపత్యం నుండి స్వతంత్రంగా ఉండేవని శాసనాలు నాణేలు సూచిస్తున్నాయి.[155] శుంగ సామ్రాజ్యం విదేశీ, స్వదేశీ శక్తులతో సాగించిన అనేక యుద్ధాలు ఈ సామ్రాజ్యం గుర్తింపు పొందింది. వారు కళింగను పాలించిన మహామేఘవాహన రాజవంశం, దక్కను పీఠభూమిని పాలించిన శాతవాహన రాజవంశంతో, ఇండో గ్రీకులు, మధుర పాలకులు పాంచాల పాలకులతో, మిత్రా రాజవంశంతో పోరాడారు.

ఈ సమయంలో కళ, విద్య, తత్వశాస్త్రం, ఇతర టెర్రకోట చిత్రాలు, పెద్ద రాతి శిల్పాలు, భర్‌హుత్ స్తూపం, సాంచి వద్ద ఉన్న ప్రఖ్యాత గ్రేట్ స్తూపం వంటి ఇతర రకాల స్మారక నిర్మాణాలు అభివృద్ధి చెందాయి. శంగ పాలకులు కళలకు, విద్యాభ్యాసానికి పోషకులుగా ఉండి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సామ్రాజ్యం ఉపయోగించిన బ్రాహ్మి లిపి వైవిధ్యమైనదిగా ఉండి సంస్కృత భాష అక్షరబద్ధం చేయడానికి ఉపయోగించబడింది. హిందూ చింతనలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఆ సమయంలో శుంగ సామ్రాజ్యం భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది ఈ సామ్రాజ్యం అభివృద్ధి చెందడానికి, అధికారాన్ని సంపాదించడానికి దోహదపడింది.

శాతవాహన సామ్రాజ్యం

శాతవాహన సామ్రాజ్యం

ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నుండి పాలన సాగించారు. పూనా, పూతిన్ (పైథాన్)లు శాతవాహనుల పాలనా కేంద్రాలుగా ఉన్నాయి. సామ్రాజ్యం భూభాగం క్రీ.పూ. 1 వ శతాబ్దం నుండి భారతదేశం పెద్ద భాగాలను స్వాధీనం చేసుకుని పాలించింది. శాతవాహనులు ముందుగా మౌర్యవంశీయులకు సామంతులుగా ఉంటూ మౌర్యసాంరాజ్య పతనం తరువాత స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు.

శాతవాహనులు హిందూమతం, బౌద్ధమతం ప్రాచుర్యానికి ప్రసిద్ధి చెందారు. ఇది ఎల్లోరా (యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం) నుండి అమరావతి వరకు బౌద్ధ స్మారక చిహ్నాలు అభివృద్ధి చేయడానికి దారితీసింది. పాలకుల చిత్రాలు చిత్రించబడిన నాణేలు జారీ చేసిన మొట్టమొదటి భారతీయ రాజ్యంగా ఇది గుర్తించబడింది. వారు ఒక సాంస్కృతిక వంతెనను ఏర్పరుచుకుని, వాణిజ్యంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఇండో-గంగా మైదానం నుండి భారతదేశం దక్షిణ కొన వరకు చింతనలు, సంస్కృతుల విస్తరణకు కారణమయ్యారు.

వారు శుంగ సామ్రాజ్యంతో పోటీపడ్డారు. తరువాత మగధ కణ రాజవంశం పాలనను స్థాపించబడింది. తరువాత సాకాలు, యవనలు, పల్లవుల వంటి విదేశీ ఆక్రమణదారుల నుండి భారతదేశం లోని అతిపెద్ద భూభాగాన్నింరక్షించడంలో ముఖ్యపాత్ర పోషించారు. పెద్ద భాగాన్ని రక్షించడానికి వారు కీలక పాత్ర పోషించాప్రత్యేకించి పాశ్చాత్య క్షాత్రపాలతో వారి పోరాటాలు సుదీర్ఘకాలం కొనసాగాయి. శాతవాహన రాజవంశ చక్రవర్తి పాలకులలో గౌతమీపుత్ర శాతకర్ణి, శ్రీ యజ్ఞ శాతకర్ణి పాశ్చాత్య క్షత్రాలు వంటి విదేశీ ఆక్రమణదారులను ఓడించి వారి విస్తరణను నిలిపివేశారు. క్రీ.పూ. 3 వ శతాబ్దంలో సామ్రాజ్యం చిన్న రాష్ట్రాలుగా విభజించబడింది.

వాయవ్య రాజ్యాలు, హైబ్రీడు సంస్కౄతులు

హీలియోడోరస్ స్థూపం
మధుర సింహ రాజధాని
ఎడమట: హీలియోడోరస్ స్థూపం, తొలిగా హిందూమతంలోకి మారిన భారత గ్రీకు రాయభారి హీలియోడోరస్ స్థాపించినది. ఇది వైష్ణవానికి సంబంధించిన తొలి గుర్తు.[156]
కుడి: మధుర సింహరాజధాని,క్రీ,.శ. 1వ శతాబ్దం. మధుర సత్రాపు రాజువల భారత స్కైథియన్ రాజు మహారాణి ఆయేసియా బహకరించిన బుద్ధుని అవశేషాలుగల స్తూప దానం వివరిస్తుంది..

భారతీయ ఉపఖండంలోని వాయువ్య రాజ్యాలు, హైబ్రిడ్ సంస్కృతులలో ఇండో-గ్రీకులు, ఇండో-సిథియన్లు, ఇండో-పార్థియన్లు, ఇండో-సస్సినిదులు ఉన్నారు.

  • ఇండో-గ్రీకులు:-వీరు అనేక ఇండో-గ్రీక్ రాజ్యాల అంతటా వ్యాపించిన సంకరజాతి సంస్కృతి జాతికి చెందిన ప్రజలు. సుమారు రెండు శతాబ్దాలపాటు కొనసాగిన ఈ రాజ్యాలను 30 కంటే ఎక్కువ ఇండో-గ్రీకు రాజుల వారసులు పాలించారు. వారు తరచూ ఒకరితో ఒకరు కలహించుకున్నారు. గాంధారం నుండి హిందూ కుషు పర్వతాల మీదుగా గ్రీకో-బాక్టీరియన్లను నడిపించి విజయం సాధించి తరువాత కొంతకాలం రాజుగా మారిన మొదటి మెనాండరు పాలనలో (క్రీ.పూ. 155-130 పాలించినవారు) ఇండో-గ్రీకులు శిఖరాగ్రం చేరుకున్నారు. ఆధునిక భూభాగంలో ఆయన ప్రాంతాలను ఆధునిక ఆఫ్ఘన్ స్థానంలోని పంజాషీర్, కపిసాల వరకు విస్తరించి తరువాత భారత ఉపఖండంలోని పంజాబు ప్రాంతం వరకు విస్తరించాడు. ఆయన సామ్రాజ్యంలో అనేక దక్షిణ, తూర్పు సామంతరాజ్యాలు ఉన్నాయి.

మొదటి మెనాండరు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇది బౌద్ధమత గ్రంథం మిలిన్దా పన్హాలో వివరించబడింది. అతని మార్పిడి తరువాత అతను బౌద్ధమత ప్రముఖ పోషకునిగా గుర్తింపు పొందాడు.[157]

  • క్రీ.పూ 2 వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీస్తు పూర్వం 1 వ శతాబ్దం మద్య కాలంలో సకాలు (సిధియన్లు) దక్షిణ సైబీరియా నుండి పాకిస్తాన్, అరచోసియాకు నుండి వలస వచ్చారు. తరువాత వారు ఇండో-గ్రీకులను స్థానభ్రంశం చేసి గాంధారా నుండి మధుర వరకు విస్తరించి ఉన్న రాజ్యాన్ని పాలించారు. శాతవాహన రాజవంశం దక్షిణ భారత చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి సిథియన్ పాశ్చాత్య సత్రాపులను ఓడించిన తరువాత క్రీ.పూ 2 వ శతాబ్ధంలో సాకాల పతనం ప్రారంభం అయింది.[158][159] 4 వ శతాబ్దంలో తూర్పు భారతదేశానికి చెందిన గుప్త సామ్రాజ్యం చక్రవర్తి రెండవ చంద్రగుప్త సాకా సామ్రాజ్యం పూర్తిగా నాశనం చేసాడు.[160]
  • ఇండో-పార్థియన్లను గోండోఫరిడ్ వంశీయులచే పాలించారు. దీనికి మొదటి పాలకుడు గోండోపెర్స్ పేరు పెట్టారు. వారు ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, వాయువ్య భారత దేశాలను దాదాపు సా.శ. మొదటి శతాబ్ధం వరకు పాలించారు.[161] ప్రముఖ గోండోఫరిడ్ రాజులు వారి చరిత్రలో ఎక్కువ భాగం తక్షశిలను (ప్రస్తుతం పాకిస్థాన్ లోని పంజాబు రాష్ట్రంలో ఉంది) నివాసంగా చేసుకుని అక్కడ నుండి పాలన సాగించారు. అయితే వారి ఆఖరి కొన్ని సంవత్సరాలలో రాజధాని కాబూలు, పెషావర్ మధ్య మార్చబడింది. ఈ రాజులు సాంప్రదాయకంగా ఇండో-పార్థియన్లుగా పేర్కొనబడ్డారు. అరాసిదు రాజవంశం ప్రభావితం వారి నాణాలను ప్రభావితం చేసినప్పటికీ వారు అధికంగా పార్థియాకు తూర్పుగా నివసిస్తున్న ఇరానిక్ తెగలకు సమూహాలకు చెందినవారై ఉన్నారు. రాజులందరూ గొండోఫరు బిరుదుతో పాలించ లేదు. ఇండో-పార్థియన్లు బౌద్ధ మఠం తఖ్త్-ఇ-బాహి నిర్మాణం కొరకు ప్రసిద్ది చెందారు.
  • ఇండో-సస్సనిదులకు పర్షియా సస్సనిద్ సామ్రాజ్యం మూలంగా ఉంది. ఇది గుప్త సామ్రాజ్యానికి సమకాలీనంగా భారతీయ సంస్కృతి, ఇరాన్ సంస్కృతి కలయిక ఒక హైబ్రీడు సంస్కృతికి (ఇండో-ససానిదు సంస్కృతి) జన్మనిచ్చిన ప్రస్తుత బలూచిస్తాన్, పాకిస్థాన్ ప్రాంతం వరకు విస్తరించింది.

భారతదేశ వాణిజ్యం, పర్యాటకం

  • కేరళలో సుగంధ వాణిజ్యం ప్రంపంచం అంతటి నుండి వ్యాపారులను భారతదేశానికి ఆకర్షించింది. క్రీ.పూ. ప్రారంభ రచనలు, నియోలిథిక్ యుగం రాతి యుగం చెక్కడాలు, సుమేరియన్ రికార్డుల ఆధారంగా భారతదేశంలోని నైరుతి తీరప్రాంత కేరళలోని ముజిరిస్ నౌకాశ్రయం క్రీ.పూ. 3000 నుండి మసాలాదినుసుల ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నదని విశ్వసించబడుతుంది. క్రీ.పూ. 562 లో కేరళలోని కొచ్చిప్రాంతానికి యూదయ యూదువర్తకులు వచ్చారు. సా.శ. 70 లో రెండవ ఆలయం నాశనమైన తరువాత బహిష్కరణకు గురైన యూదు వర్తకులు అధిక సంఖ్యలో కేరళాకు చేరుకున్నారు.[162] కేరళా భారతదేశ మసాలా దినుసుల తోటగా వర్ణించబడింది. క్రిస్టోఫర్ కొలంబసు, వాస్కోడిగామా వంటి వర్తకులు, ఎగుమతి దారులకు ఇది చేరవలసిన గమ్యంగా భావించబడింది.[163]
  • థామస్ ది అపోస్టిల్ క్రీ.పూ 1 వ శతాబ్దంలో నౌకామార్గంలో భారతదేశానికి చేరుకున్నాడు. అతను భారతదేశంలోని కేరళలో ముజిరిస్లో అడుగుపెట్టాడు. యెజ్ (సెవెన్) అరా (సగం) పల్లిగల్ (చర్చిలు) (సెవెన్ అండు హాఫ్ చర్చీలను స్థాపించాడు.
  • 1 వ లేదా 2 వ శతాబ్దంలో బౌద్ధమతం సిల్క్ రోడ్ ట్రాన్స్మిషన్ ద్వారా చైనాలోకి ప్రవేశించింది. సంస్కృతుల మిశ్రమం అనేక మంది చైనా ప్రయాణికులు, సన్యాసులు భారతదేశంలోకి ప్రవేశించేందుకు దారితీసింది. అత్యంత ప్రముఖమైనవి ఫాక్సియన్, యిజింగ్, సాంగ్ యున్, జువాన్జాంగ్. ఈ పర్యాటకులు భారత ఉపఖండంలోని వివరణాత్మక సమాచారం వ్రాశారు. వారి వ్రాతలలో ఈ ప్రాంతం రాజకీయ, సామాజిక అంశాలు ఉన్నాయి.[164]
  • ఆగ్నేయ ఆసియా హిందూ, బౌద్ధ మతాచార సంస్థలు ఆర్ధిక కార్యకలాపాలు, వాణిజ్యంతో అనుబంధం కలిగివున్నాయి. తరువాత పోర్చుగల్ పెద్ద నిధులను అప్పగించటంతో ఎస్టేట్ నిర్వహణ, హస్తకళ, వాణిజ్య కార్యక్రమాల ద్వారా స్థానిక ఆర్ధికవ్యవస్థకు లబ్ది చేకూరింది. ముఖ్యంగా బౌద్ధమతం నావికాదళ వాణిజ్యంతో, నాణేలు, కళ, అక్షరాస్యతలను ప్రోత్సహించింది.[165] మసాలా వ్యాపారంలో పాల్గొన్న భారతీయ వ్యాపారులు భారతదేశ వంటకాలు ఆగ్నేయాసియాకు తీసుకువెళ్ళారు. అక్కడ స్థానిక నివాసితులలో మసాలా మిశ్రమాలు, కూరలు బాగా ప్రాచుర్యం పొందాయి.[166]
  • గ్రీకో-రోమన్ ప్రపంచం మసాలాదినుసులు, సుగంధద్రవ్యాల వ్యాపారమార్గాన్ని రోమన్-ఇండియా అనుసరించడం మొదలైంది.[167] పోసిడోనియస్ వ్రాతల ఆధారంగా క్రీ.పూ 2 వ శతాబ్దంలో గ్రీకు, భారతీయ నౌకలు అడెన్ పోర్టులలో (గ్రీకులచే యూడేమోన్ అని పిలువబడేవి)వాణిజ్యం కొరకు కలుసుకునేవని భావిస్తున్నారు.[168] తరువాత స్ట్రాబో రచన " జియాగ్రఫీ " లో దీని ప్రస్తావన చోటుచేసుకుంది.[169] క్రీ.పూ. 118 లేదా 116 లో " మాన్‌సూన్ విండ్ సిస్టం " హిందూ మహాసముద్రంలో పయనించింది. మాన్‌సూన్ విండ్ సిస్టంను సిజికాస్ యుడోక్సస్ నడపాడు. భారతదేశానికి చెందిన నౌకాదిగ్గజ నావికుడు పోసీడోనియస్ నౌకాప్రమాదంలో చిక్కుకుని ఎర్ర సముద్రంలో కాపాడబడి అలెగ్జాండ్రియాలోని 8 వ టోలెమికి చేరుకున్నట్లుగా చెప్పాడు. స్ట్రాబో " జియాగ్రఫీ " లో వ్రాయబడిన సముద్రప్రమాదం నుండి బ్రకిబయట పడిన ఈ కథనం ఒక మూలంగా ఉంది. ఆధునిక పరిశోధకులలో ఈ కథనం సందేహాస్పదంగా ఉంది. ఇంకొక గ్రీకు నావికుడు అయిన హిప్పాలస్, కొన్నిసార్లు భారతదేశంకు రుతుపవనాల ఆధారిత మార్గాన్ని కనుగొన్న ఘనత సాధించాడు. అతను కొన్నిసార్లు యుడోక్సస్ దండయాత్రలలో భాగంగా ఉన్నాడని ఊహిస్తున్నారు.[170] మొదటి సహస్రాబ్ది కాలంలో భారతీయులకు సముద్ర మార్గాలను భారతీయులు, ఇథియోపియన్లు నియంత్రించారు. ఇది సముద్రపు వాణిజ్య వర్తక శక్తిగా మారింది.

కుషాన్ సామ్రాజ్యం

కుషాణు సామ్రాజ్యం

కుషాన్ సామ్రాజ్యం మొదటి చక్రవర్తి కుజుల కద్ఫేసేస్ నాయకత్వంలో భారత ఉపఖండంలోని వాయువ్యంలో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది. కుషాన్లు బహుశా టోచారియన్ మాట్లాడే తెగకు చెందినవారని భావిస్తున్నారు.[171] యూజి సమాఖ్యలోని ఐదు శాఖలలో ఇది ఒకటి.[172][173] అతని మనవడు కనిష్క మహారాజు పాలనలో సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తానులో చాలా భాగం వరకు విస్తరించింది.[174] తరువాత ఇది భారత ఉపఖండంలోని ఉత్తర భాగాలైన వారణాసి (బనారస్) సమీపంలోని సాకేత, సారనాథ్ వరకు విస్తరించింది.[175]

చక్రవర్తి కనిష్కుడు బుద్ధిజాన్ని అత్యధికంగా పోషించాడు. అయితే కుషాన్లు దక్షిణానికి విస్తరించడంతో వారి తరువాత నాణేలలో చోటు చేసుకున్న దేవతలు చిత్రాలు నూతన హిందూ ఆధుఖ్యాన్ని ప్రతిబింబించాయి.[176][177] వారు భారతదేశంలో బౌద్ధమతం స్థాపించడంలో అది మధ్య ఆసియా, చైనా లకు విస్తరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ ఖానీకా గురించి మాట్లాడుతూ:

ఆయన బుద్ధిజం చరిత్రలో రెండవ అశోకుని పాత్రను పోషించాడు.[178]

ఈ సామ్రాజ్యం సిల్క్ రోడ్ వాణిజ్యాన్ని సింధూ లోయ ద్వారా హిందూ మహాసముద్ర సముద్ర వాణిజ్యంతో అనుసంధానించింది. చైనా, రోమ్ల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించింది. కుషాన్ పాలనలో శిఖరాగ్రానికి చేరుకుని వికసించిన గాంధార కళ, మధుర కళలకు సరికొత్త పోకడలు తీసుకుని రాబడ్డాయి.[179]

హెచ్.జి. రౌలిసన్ వ్యాఖ్యానించారు:

కుషాణుల కాలం గుప్తుల యుగంకు సరైన ప్రసంగం.[180]

3 వ శతాబ్దం నాటికి భారతదేశంలో కుషాణుల సామ్రాజ్యానికి విఘాతం కలిగింది. మొదటి వాసుదేవ కుషాణుల చివరి చక్రవర్తి అయ్యాడు.[181][182]

సంప్రదాయ కాలం (క్రీ.పూ 320 – క్రీ.పూ 650)

గుప్త సామ్రాజ్యం - స్వర్ణయుగం

గుప్తుల కాలం - స్వర్ణయుగం

భారత ఉపఖండం చాలావరకు గుప్త సామ్రాజ్యం (సా.శ.320-550) ఆధ్వర్యంలో సమైఖ్యం చేయబడిన కాలం " క్లాసికల్ ఇండియా " గా పేర్కొనబడింది.[183][184] ఈ కాలం భారతదేశ స్వర్ణయుగం అని పిలువబడింది;[185] సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, కళ, మాండలికం, సాహిత్యం, తర్కశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, మతం, తత్వశాస్త్రం (హిందూ సంస్కృతి మూలాలతో) విస్తృతంగా విజయాలు సాధించాయి.[186] హిందూ-అరబిక్ సంఖ్యా వ్యవస్థ, పొజిషనల్ న్యూమరల్ సిస్టం, భారతదేశంలో ఉద్భవించాయి. తర్వాత అరబ్బుల ద్వారా పశ్చిమదేశాలకు బదిలీ చేయబడింది. 600 నుండి 800 ల మధ్యకాలంలో సంఖ్యావిధానంలో సున్నా అభివృద్ధి చేయబడే వరకు పురాతన హిందూ సంఖ్యావిధానంలో కేవలం తొమ్మిది చిహ్నాలు ఉన్నాయి.[187] గుప్తులు నాయకత్వంలో సృష్టించబడిన శాంతి, శ్రేయస్సు భారతదేశంలో శాస్త్రీయ, కళాత్మకతను ఉద్దీపింపజేసాయి. అనుసరించింది.[188]

అద్భుతమైన వాస్తు శిల్పకళ, శిల్పం, చిత్రలేఖనం ఈ సాంస్కృతిక సృజనాత్మకత అధిక అంశాలుగా ఉన్నాయి.[189] గుప్తా కాలంలో కాలిదాసు, ఆర్యభట్ట, వరాహమిహిర, విష్ణు శర్మ, వాట్సయన వంటి అనేకమంది విద్యా రంగాలలో గొప్ప పురోగతిని సంపాదించారు. గుప్తుల కాలం భారతీయ సంస్కృతి పరీవాహక కాలంగా గుర్తించబడింది: గుప్తులు వారి పరిపాలనను చట్టబద్ధం చేసేందుకు వేదాలను అనుసరించినా వారు బౌద్ధమతానికి మద్దతునిచ్చారు. ఇవి బ్రాహ్మణిక సంప్రదాయానికి ప్రత్యామ్నాయాన్ని అందించాయి. మొదటి ముగ్గురు పాలకులు - మొదటి చంద్రగుప్త, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు సైనిక అత్యుపయోగంతో వారి నాయకత్వంలో భారతదేశం లోని అధిక భాగాన్ని ఆధిఖ్యతలోకి తీసుకువచ్చాయి.[190] సైన్సు, రాజకీయ పరిపాలన గుప్త యుగంలో కొత్త ఎత్తులను చేరుకున్నాయి. బలమైన వాణిజ్య సంబంధాలతో ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా మారింది. బర్మా, శ్రీలంక, మారిటైమ్ ఆగ్నేయ ఆసియా, ఇండోచైనాలో సమీప రాజ్యాలు, ఇతర ప్రాంతాలను ప్రభావితం చేసే ఒక స్థావరంగా మారింది.

5 వ శతాబ్దం మొదటి భాగంలో ఆఫ్ఘనిస్తానులో బమియానును తమ రాజధానిగా చేసుకుని తమను తాము స్థాపించుకున్న ఆల్కాన్ హన్స్ వచ్చే వరకు మొట్టమొదటి గుప్తులు వాయువ్య రాజ్యాలను విజయవంతంగా అడ్డుకున్నాయి.[191] అయినప్పటికీ ఈ సంఘటనలు దక్షిణ భారతదేశంలో ఎక్కువభాగాన్ని ప్రభావితం చేయలేదు.[192][193]

వకతక సామ్రాజ్యం

వాకాటకాల పాలనలో రాయిని తొలచి నిర్మించిన 30 స్మారకాలు అజంతా గుహలు లో వున్నాయి.

క్రీ.పూ. 3 వ శతాబ్దం మధ్యలో దక్కనులో వకతక సామ్రాజ్యం ఉద్భవించింది. వారి సామ్రాజ్యం మాల్వా, గుజరాతు దక్షిణ అంచుల నుండి దక్షిణప్రాంతంలో తుంగభద్ర నది వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున ఛత్తీస్గఢ్ అంచుల వరకు వారి రాజ్యం విస్తరించిందని విశ్వసిస్తున్నారు. దక్కనుప్రాంతంలో శావాహనుల తరువాతి రాజవంశంగా, ఉత్తర భారతదేశంలో గుప్తులకు సమకాలీనులుగా ఉన్న వకతక రాజవంశీయుల తరువాత దక్కను ప్రాంతం విష్ణుకుండినుల వశం అయింది.

వకతకాలు కళలు, వాస్తుశిల్పం, సాహిత్య పోషకులకు ప్రసిద్ధి చెందారు. వారు ప్రజోపయోగ పనులు చేపట్టారు. వారి స్మారక చిహ్నాలు వారి వారసత్వానికి సాక్ష్యంగా ఉన్నాయి. వకతక చక్రవర్తి హరిషేనా పోషణలో అజాంతా గుహల (యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద) బౌద్ధ విహరాలు, చైతనాల వంటి రాతిచెక్కడాలు నిర్మించబడ్డాయి.[194][195]

కామరూప సామ్రాజ్యం

మదన్ కామదేవి అవశేషాలలోకామరూప రాజుల రాగి పళ్లెపు ముద్ర

సమాద్రగుప్తుడు స్థాపించిన 4 వ శతాబ్దపు అలహాబాద్ స్తంభాల శాసనంలో కామరూప (పశ్చిమ అస్సాం),[196] దావకా (మధ్య అస్సాం) లలో ప్రస్తావన చోటుచేసుకుంది.[197] ఇది గుప్త సామ్రాజ్యం సరిహద్దు రాజ్యంగా పేర్కొనబడింది. తరువాత దావకా కామరూపలో విలీనం అయ్యింది. ఇది కరటోయ నది నుండి (ప్రస్తుత సాదియా) మొత్తం బ్రహ్మపుత్ర లోయ, ఉత్తర బెంగాల్, బంగ్లాదేశ్ భాగాలు, పూర్ణ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో విస్తరించింది.[198]

ఈ ప్రాంతాన్ని పాలించిన మూడు రాజవంశాలు వర్మనస్ (క్రీ.పూ. 350-650 CE), మెల్చా రాజవంశం (క్రీ.పూ. 655-900), కామరూప-పాలాస్ (సుమారుగా సా.శ. 900-1100) రాజవంశాలు వరుసగా ప్రస్తుత గౌహతి (ప్రాగ్జిజ్యోతిష్పురా), తేజ్పూర్ (హరుప్పేశ్వర), ఉత్తర గౌహతి (దుర్జయ) రాజధానిగా చేసుకుని పాలించాయి. మూడు రాజవంశాలు ఆరివార్ట్ నుండి వలస వచ్చిన నారకాసురుని సంతతికి చెందినవి. [199]వర్మన్ రాజు భాస్కర్ వర్మన్ (క్రీస్తుపూర్వం 600-650) పాలనలో చైనా ప్రయాణికుడు జువాన్జాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి తన ప్రయాణాలను నమోదు చేసుకున్నాడు. తరువాత బలహీనమై విచ్చిన్నమైన తరువాత (కామరుప-పాలాస్), కామరుప సంప్రదాయం క్రీ.పూ 1255 మొదటి లూనారు (1120 - 1185 CE), రెండవ లూనారు (క్రీస్తు 1155 - 1255 CE) రాజవంశాల పాలనలో కొంత వరకు విస్తరించింది.[200] 13 వ శతాబ్దం మధ్యకాలంలో కామరుప సామ్రాజ్యాన్ని ముస్లిం తుర్కులను ఆక్రమించిన తరువాత కామాతోపూర్ (నార్త్ బెంగాల్) నుండి రాజధానిని కామరూపనగారా (ఉత్తర గౌహతి)కు మార్చి కెన్ రాజవంశం ఆధ్వర్యంలో కమట రాజ్యాన్ని స్థాపించారు.[201]

పల్లవ సామ్రాజ్యం

నరసింహవర్మ II మహాబలిపురం లో నిర్మించిన తీర దేవాలయం (ప్రపంచ వారసత్వసంపద)

4 వ శతాబ్దం నుండి 9 వ శతాబ్ధం మద్యకాలంలో పల్లవులు, ఉత్తర ఉప గుప్తులతో పాటు, భారత ఉపఖండంలోని దక్షిణప్రాంతంలో సంస్కృత అభివృద్ధికి గొప్ప పోషకులుగా ఉన్నారు. పల్లవ పాలన గ్రాన్థా అని పిలిచే లిపిలోని మొదటి సంస్కృత శాసనాలు ఉన్నాయి.[202] తొలి పల్లవులు ఆగ్నేయాసియా దేశాలతో విభిన్న సంబంధాలను కలిగి ఉన్నారు. పల్లవులు మామల్లపురం, కాంచీపురం, ఇతర ప్రాంతాలలో ద్రవిడ నిర్మాణశైలిలో కొన్ని ముఖ్యమైన హిందూ దేవాలయాలు, అకాడమీలను నిర్మించారు. వారి పాలనలో కవులు గొప్ప అభివృద్ధి సాధించారు. దేవాలయాలను వేర్వేరు దేవతలకు దేవాలయాలు నిర్మించడం ఆచరణలోకి వచ్చింది. ఆగమశాస్త్రాలను అనుసరించి దేవాలయనిర్మాణం జరిగింది.[203]

మొదటి మహేంద్రవర్మ (క్రీ.పూ. 571 - 630 ), మొదటి నరసింహవర్మ (క్రీ.పూ.630 - 668 ) పాలనలో పల్లవులు అధికారంలోకి వచ్చారు. 9 వ శతాబ్దం చివరి వరకు 600 సంవత్సరాలుగా తమిళ ప్రాంతపు ఉత్తర ప్రాంతం, తెలుగు ప్రాంతాలలో ఆధిపత్యం చేసారు.[204]

కదంబ సామ్రాజ్యం

దొడ్డగద్దవల్లి దగ్గర కదంబ శిఖరం పై కలస తో కూడినది.

క్రీస్తుపూర్వం 345 లో మయూరశర్మ కర్ణాటక ప్రాంతంలో కదంబ రాజ్యం స్థాపించాడు. తరువాత కాలంలో దానిని సమర్ధతతో సామ్రాజ్యంగా అభివృద్ధి చేసాడు. రాజు మయూరశర్మ కొన్ని స్థానిక గిరిజనుల సహాయంతో కంచికి చెందిన పల్లవుల సైన్యాన్ని ఓడించాడు. కాకుత్సవర్మ పాలనలో కాదంబ ఖ్యాతి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఉత్తర భారతదేశంలోని గుప్త రాజవంశం రాజుకుటుంబంతో వివాహం సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. కదంబాలు పాశ్చాత్య గంగ రాజవంశం సమకాలీకులుగా ఉన్నారు. వారు భూమిని పరిపూర్ణ స్వయంప్రతిపత్తితో పరిపాలించే ప్రారంభ స్థానిక రాజ్యాలను ఏర్పరచారు. ఈ రాజవంశం తరువాత కన్నడ సామ్రాజ్యాలు, చాళుక్య, రాజపుత్ర సామ్రాజ్యాలకు సామతరాజ్యంగా ఐదు వందల సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది గోవా కదంబాలు, హలాసీ కదంబాలు, హంగల్ కదంబాలు వంటి చిన్న వంశాలుగా విభజించబడింది.

అల్చాన్ హంస్

ఆల్కాన్ హన్లు

నోమాడిక్ సమాఖ్య పురాతన ఆదివాసీ కాలంలో మద్య ఆసియాలో ఇండో-హెఫ్తాలిటీస్ లైట్లు ( ఆల్కాన్ హున్స్)గా ఉండేది. ఆల్కాన్ హన్స్ 5 వ శతాబ్దం మొదటి అర్ధ భాగంలో ఆధునిక-ఆఫ్ఘనిస్తాన్‌లో తమ స్థావరాలు స్థాపించారు. హన్ సైనిక నాయకుడు టోరమానా నేతృత్వంలో భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాలను అధిగమించారు. టొరమనా కుమారుడు మిహిరాకుల, ఒక పాశ్చాత్య హిందూవుతో తూర్పున పాలిటిపుత్రకు, మధ్య భారతదేశంలోని గ్వాలియరుకు వెళ్లారు. హ్యూయెన్ త్సాంగ్ బౌద్ధుల మిహిరాకుల కనికరంలేని బౌద్ధులను హింసించడం, మఠాలను విధ్వంసం చేయడం తన వ్రాతలలో వివరించాడు. అయినప్పటికీ ఆ వివరణ ప్రామాణికతకు సంబంధించినంత వరకు వివాదాస్పదంగా ఉంది.[205] 6 వ శతాబ్దంలో భారత పాలకులు, మహారాష్ట్రా మహారాజు యశోధరన్ (మాల్వా), గుప్త చక్రవర్తి నరసింహగుప్తా నరసింహగుప్తాలు కలిసి హన్సును ఓడించారు. వారిలో కొందరు భారతదేశం నుండి బయటికి వెళ్ళారు. ఇతరులు భారతీయ సమాజంలో కలిసిపోయారు.[206]

హర్ష సామ్రాజ్యం

హర్షుడు 606 నుండి 647 వరకు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. ఆయన వర్ధన రాజవంశానికి చెందిన ప్రభాకర్వర్ధనుడి కుమారుడు, రాజ్యవర్ధనుడి తమ్ముడు. వర్ధన రాజవంశ రాజులు ప్రస్తుత హర్యానాలో ఉన్న తానేసర్ను పాలించారు.

హర్ష చక్రవర్తి నాణెం, క్రీ.పూ. 606-647 [207]

6 వ శతాబ్దం మధ్యకాలంలో పూర్వ గుప్త సామ్రాజ్యం పతనమైన తరువాత ఉత్తర భారతదేశం చిన్న గణతంత్రాలు, రాచరిక రాజ్యాలుగా విడిపోయింది. ఫలితంగా తనేసర్ వర్ధనల అభివృద్ధి చెందుతూ పంజాబ్ నుండి కేంద్ర భారతదేశానికి గణతంత్రాలు, రాచరిక రాజ్యాలను ఏకం చేయడం ప్రారంభించారు. హర్షుడి తండ్రి, సోదరుడు మరణించిన తరువాత 606 లో సామ్రాజ్యం ప్రతినిధులు ఏప్రిల్లో సమావేశం జరిపి హర్షడిని చక్రవర్తి చేసారు. కేవలం 16 ఏళ్ళ వయసులో ఆయనకు మహారాజా బిరుదు ఇవ్వబడింది.[208] తన అధికారంలో ఆయన సామ్రాజ్యం ఉత్తర, వాయవ్య దేశాలన్నింటినీ స్వాధీనం చేసుకుని సంరాజ్యాన్ని కామరూప వరకు, దక్షిణాన నర్మదా నది వరకు విస్తరించాడు. చివరికి కన్నౌజ్ (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో) తన రాజధానిగా చేసుకుని క్రీ.పూ. 647 వరకు పాలించాడు.[209]

అతని న్యాయస్థానం కాస్మోపాలిటినిజం కేంద్రంగా మారి పండితులు, కళాకారులు, మతపరమైన సందర్శకులను దీర్ఘకాలం ఆకర్షించింది. [209] ఈ సమయంలో హర్షుడు సూర్య ఆరాధన నుండి బౌద్ధమతంలోకి మారాడు.[210] చైనీస్ యాత్రికుడు జువాన్జాంగ్ హర్షుడి న్యాయస్థానాన్ని సందర్శించి ఆయన న్యాయాన్ని, దాతృత్వాన్ని ప్రశంసిస్తూ ఆయన గురించి చాలా అనుకూలంగా వ్రాశాడు.[209] సంస్కృత కవి బాణభట్టు రచించిన ఆయన జీవితచరిత్ర హర్షచరిత ("హర్షీ డీడ్స్") తనేసరుతో ఆయనకున్న అనుబంధం, అలాగే రక్షణ గోడ, కందకం, రెండు అంతస్థుల ధవళగ్రిహా (వైట్ మాన్షన్) తో ఉన్న రాజభవనం గురించి వర్ణించాడు.[211][212]

ఆరంభకాల మధ్యయుగ కాలం (క్రీ.పూ 650 –క్రీ.పూ 1200 )

ఆరంభ మధ్యయుగపు భారతదేశంలోని సూర్యదేవాలయాలు
కర్కోట వంశపు మూడవ రాజు లలితాదిత్య ముక్తపీడ సా.శ. 8 వ శతాబ్దంలో నిర్మించిన మార్తాండ సూర్యదేవాలయం. భారత ఉపఖండంలో పెద్ద ప్రాంగణం గల దేవాలయాలలో ఒకటి.
చాళుక్య వంశపు భీమ 1 నిర్మించిన మోధెర సూర్య దేవాలయం. దిగుడు మెట్లు గల చెరువు మధ్యలో వుంది. గుజరాతిలో దిగుడుమెట్లు గల నిర్మాణాలలో ప్రముఖమైనది.
తూర్పు గంగ వంశానికి చెందిన నరసింహదేవ(1238–1264 CE) నిర్మించిన కోణార్క సూర్య దేవాలయం, ఒడిషా లోని కోణార్క దగ్గరవుంది. ఇది యునెన్స్కో వారి ప్రపంచ వారసత్వసంపద స్థలం.

సా.శ. 6 వ శతాబ్దంలో గుప్తుల సామ్రాజ్యం ముగిసిన తరువాత భారతదేశం మద్యయుగం ప్రారంభమైంది.[150] ఈ కాలం హుందూయిజానికి " సంప్రదాయ యుగం ద్వితీయార్ధం " అని భావించబడుతుంది.[213]సా.శ. 7 వ శతాబ్దంలో హర్ష సామ్రాజ్యం పతనం తరువాత ఇది మొదలైంది.[213][213] ఇంపీరియల్ కన్నౌజ్ ప్రారంభం త్రిపాఠి పోరాటానికి దారితీసింది.[214]1279 లో దక్షిణ భారతదేశంలో మూడవ రాజేంద్ర చోళడి మరణంతో తర్వాతి చోళుల ముగింపుతో 13 వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానేటు ముగిసింది; అయినప్పటికీ 17 వ శతాబ్దంలో దక్షిణాన విజయనగర సామ్రాజ్యం పతనం సాంప్రదాయిక కాలంలోని కొన్ని అంశాలు కొనసాగాయి.

5 వ శతాబ్ధం నుండి 13 వ నాటికి వేద సంస్కృతి క్షీణించి బౌద్ధమతం, జైనమతం అభివృద్ధి మొదలైంది. రాజ న్యాయస్థానాల్లో శైవిజం, వైష్ణవిజం, శక్తివిజం విస్తరించాయి.[3] ఈ కాలం భారతదేశంలో అత్యుత్తమ కళా సాంప్రదాయిక అభివృద్ధి కొనసాగింది. హిందూ మతం, బౌద్ధమతం, జైన మతంలో ప్రధానంగా ఆధ్యాత్మిక, తాత్విక వ్యవస్థలు అభివృద్ధి చెందాయి.

ఆల్కాన్ హున్స్ ఆక్రమణ తరువాత 6 వ శతాబ్దంలో వాయవ్య భారతదేశంలో బౌద్ధమతం బలహీనపడింది. అల్కాన్ హుంస్ ప్రజలు ప్రారంభంలో వారి స్వంతమతం తెంగ్రి మతాలను అనుసరించి తరువాత భారత మతాలను అనుసరించారు. క్రీ.పూ 711 లో సింధు ప్రాంతం నుండి (ఆధునిక పాకిస్తాన్) ముహమ్మదు బిన్ ఖాసిం ముట్టడి తరువాత బౌద్ధమతం మరింత క్షీణించింది. అనేక స్థూపాలు నెనూన్ (పాకిస్థాన్ లోని హైదరాబాదు) వంటి మసీదులుగా మార్చబడ్డాయని చౌచ్ నామా నమోదు చేసాడు.[215]

7 వ శతాబ్దంలో కుమారీల భట్టు మిమాంస తత్వశాస్త్ర పాఠశాలను రూపొందించాడు. బౌద్ధ దాడులకు వ్యతిరేకంగా వేదఆచారాలకు మద్దతుగా నిలిచాడు. కుమారీలభట్టు భారతదేశంలో బౌద్ధమతం పతనానికి కృషి చేసిన వ్యక్తిగా పండితులు గుర్తించాడు.[216] బౌద్ధులకు వ్యతిరేకంగా అతని వైవిధ్య విజయాన్ని బౌద్ధ చరిత్రకారుడు తథాగత ధృవీకరించాడు. ఆయన బుద్ధపాల్కిత, భవ్య, ధర్మదాసా, దిగ్నగా, ఇతరు శిష్యులను వాదంలో ఓడించాడని పేర్కొన్నారు.[217]

8 వ శతాబ్దంలో అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు, విస్తరించడానికి భారత ఉపఖండం అంతటా ఆది శంకరాచార్యుడు ప్రయాణించాడు. హిందూమతంలో ప్రస్తుత ఆలోచనలు ముఖ్య లక్షణాలను ఏకీకృతం చేయటానికి శకరాచార్యుని కృషి సహకరించింది.[218][219][220] ఆయన బౌద్ధమతం, హిందూయిజ మీమాంసా పాఠశాలలను విమర్శించాడు.;[221][222][223][224] భారత ఉపఖండంలోని నాలుగు మూలల్లో అద్వైత వేదాంత విస్తరణ, అభివృద్ధి కోసం మఠాలు (మఠాలు) స్థాపించారు.[225]

క్రీ.పూ.8 వ శతాబ్దం నాటికి సామ్రాజ్య కేంద్రం, కాస్మో-రాజకీయ వ్యవస్థలలో బుద్ధుడికి బదులుగా హిందూ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. హిందూ దేవతలకు ఆలయాలు నిర్మించబడి రాజరిక ఆరాధన చేయబడింది.[226] ఎనిమిదవ శతాబ్దం తరువాత బౌద్ధ మతం భారతదేశం నుండి అదృశ్యమైంది. విష్ణు, శివ ఆరాధన రాజప్రసాదాలు, సామాజిక సాంఘిక నేపధ్యంలో బౌద్ధమత స్థాయిని బలహీనపరిచి క్షీణించజేయడానికి సహాయపడింది.[227]

కన్నోజ్ చాలా సామ్రాజ్యాలకు ముఖ్య కేంద్రం — దక్కన్ లోని రాష్ట్రకూటులు, మల్వా లోని గుర్జార ప్రతీహారులు, బెంగాలు పాలులు మధ్య ఘర్షణలకు లోనైంది.
తేలి కామందిర్, గ్వాలియర్ కోట దగ్గర శిల్పాలు.

7 వ శతాబ్దంలో గుప్త రాజవంశం పతనం తరువాత కన్నౌజ్ చక్రవర్తి హర్ష తన పాలనాకాలంలో ఉత్తర భారతదేశాన్ని తిరిగి సమైఖ్యం చేసాడు. అతని మరణం తరువాత అతని సామ్రాజ్యం కూలిపోయింది. 8 నుంచి 10 వ శతాబ్దం వరకు ఉత్తర భారతదేశ నియంత్రణకు మూడు రాజవంశాలు పోటీ పడ్డాయి: మాల్వా గుర్జర ప్రతిహారులు, బెంగాల్ పాలా రాజవమ్శం, దక్కనుకు చెందిన రాష్ట్రకూటులు. సేనా రాజవంశం తరువాత పాల సామ్రాజ్యంపై నియంత్రణను చేపట్టింది; గుర్జరా ప్రతిహారులు చిన్న రాజ్యాలుగా విడిపోయారు.ఆరంభకాల రాజపుత్ర రాజ్యస్థాపకులలో మాల్వా పరమరాలు, చండేలాలు, బుండేల్ ఖండు ప్రజలు, మహాకోసల కలాచురీలు, హర్యానా తోమరాలు, రాజపుతానా చౌహానులు ఉన్నారు.[228] పాశ్చాత్య చాళుక్యులు రాష్ట్రాకుటాను విలీనం చేసుకున్నారు.[229]

11 వ శతాబ్దం లో మొదటి రాజరాజ చోళుని కాలంలో చోళ సామ్రాజ్యం ప్రధాన శక్తిగా ఉద్భవించింది. మొదటి రాజరాజచోళుడు 11 వ శతాబ్ధంలో ఆగ్నేయ ఆసియా, శ్రీలంక భాగాల మీద విజయవంతంగా దాడి చేసాడు.[230]

వాయవ్య భారతంలో సాధిచిన ఆధిఖ్యత సా.శ.625 నుండి సా.శ. 1003 వరకు కొనసాగించిన కాశ్మీరీ కరకోట వంశలో చక్రవర్తి లలితాదిత్యా ముక్తపీడ (సా.శ.724 సా.శ. 760) ప్రఖ్యాతి గడించాడు. కరకోటా తరువాత లోహార వంశం అధికారంలోకి వచ్చింది. రాజతరంగిణిలో కలహానా ఉత్తర భారతదేశంలో, మధ్య ఆసియాలో తీవ్రమైన సైనిక పోరాటాలకు రాజు లలితాదిత్య ప్రతీకగా ఉన్నాడని కల్హనా రాజతరంగిణిలో పేర్కొన్నాడు.[231][232][233]

తూర్పు గంగ రాజవంశం మహారాజా అనంతవర్మన్ చోడగంగా దేవ నిర్మించిన పూరీలోని జగన్నాథ ఆలయం

7 వ శతాబ్దం మధ్యకాలం నుండి 11 వ శతాబ్దం మొదలు వరకు హిందూ షాహి రాజవంశం తూర్పు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర పాకిస్థాన్, కాశ్మీర్ ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని పాలించారు. ఒరిస్సాలో తూర్పు గంగా సామ్రాజ్యం అధికారంలోకి వచ్చింది; హిందూ శిల్పకళ అభివృద్దికి ప్రసిద్ధి చెందిన జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య ఆలయం నిర్మించబడ్డాయి. అలాగే కళ, సాహిత్య పోషకులుగా ప్రసిద్ధి చెందారు.

చాళుక్య సామ్రాజ్యం

బాదామి గుహాలయాలలో విష్ణు బొమ్మ. సా.శ. 6 వ శతాబ్దంలో బాదామి చాళుక్య శైలిగల కొండలు తొలచిన నిర్మాణాలకు ప్రధాన ఉదాహరణ.

6 వ, 12 వ శతాబ్దాల మధ్య కాలంలో దక్షిణ, మధ్య భారతదేశ ప్రాంతాలో అధిక భాగాన్ని చాళుఖ్యవంశం పాలించింది. ఈ కాలంలో వారు మూడు వ్యక్తిగత రాజవంశాలుగా పరిపాలించారు. 6 వ శతాబ్దం మధ్యకాలం నుండి వాతాపి (ఆధునిక బాదామి) "బాదామి చాళుక్యులు" అని పిలవబడిన మొట్టమొదటి రాజవంశం చేత పాలించబడింది. బనవాసి కదంబ సామ్రాజ్యం క్షీణత తరువాత బాదామి చాళుక్యులు స్వాతంత్ర్యం చాటుకోవడం ప్రారంభించారు. రెండవ పులకేశి పాలనా సమయంలో వీరు ప్రాచుర్యంలోకి వచ్చారు. దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్యుల పాలన ముఖ్యమైన మైలురాయిగా ఉండి కర్ణాటక చరిత్రలో ఒక స్వర్ణ యుగానికి చిహ్నంగా ఉంది. బాదామి చాళుక్యుల ఆధిపత్యంతో దక్షిణ భారతదేశంలో రాజకీయ వాతావరణం చిన్న సామ్రాజ్యాల నుండి పెద్ద సామ్రాజ్యంగా మారింది. కావేరి, నర్మదా నదుల మధ్య ఉన్న మొత్తం ప్రాంతాన్ని ఒక దక్షిణ భారతదేశ-ఆధారిత సామ్రాజ్యం నియంత్రించి ఏకీకృతం చేసింది. ఈ సామ్రాజ్యం అభివృద్ధి సమర్థవంతమైన పరిపాలన, విదేశీ వాణిజ్యం అభివృద్ధి, నూతన శైలి వాస్తు శిల్పం ("చాళుక్యుయన్ ఆర్కిటెక్చర్" అని పిలువబడింది)అభివృద్ధి చేయబడ్డాయి. సా.శ. 550 - సా.శ. 750 మధ్య కాలంలో చాళుక్య చక్రవర్తులు దక్షిణ, మధ్య భారతదేశంలోని కర్నాటకలోని బాదామి నుండి, తరువాత సా.శ. 970 - సా.శ. 1190 మధ్య కల్యాణి నుండి పాలించారు.

గుజరాతులోని చౌళుక్య రాజవంశం చాళుక్యుల శాఖలలో ఒకటి. వారి రాజధాని అనీల్వర (ఆధునిక పటాన్, గుజరాత్) సా.శ. 1000 లో 1,00,000 జనసంఖ్యతో సంప్రదాయకాల భారతదేశంలో ఇది అతిపెద్ద నగరాలలో ఒకటిగా ఉండేది.

రాష్ట్రకూట సామ్రాజ్యం

ఎల్లోరా గుహలోని పురాతన హిందూ దేవాలయాలలో పెద్దదైన కొండ తొలచి నిర్మించిన కైలాస దేవాలయం, ఎల్లోరా

753 చుట్టూ దంతిదుర్గా స్థాపించబడింది.[234] రాష్ట్రాకుట సామ్రాజ్యం మన్యఖేటను రాజధాని చేసుకుని దాదాపు రెండు శతాబ్దాల కాలం పాలించింది.[235] రాష్ట్రకూటులు ఉత్తరాన గంగా నది, యమునా నది డోబ్ నుండి దక్షిణాన కేప్ కొమొరిన్ వరకు రాజ్య విస్తరణ చేసి నిర్మాణాలు, ప్రసిద్ధ సాహిత్య రచనల అభివృద్ధి చేసారు.[236][237]

ఈ రాజవంశం ప్రారంభ పాలకులు హిందూమతాన్ని ఆచరించి తరువాత జైనమతంచే బలంగా ప్రభావితమయ్యారు.[238] రాజవంశం ఉత్పత్తి చేసిన సుదీర్ఘకాల రాజపరంపరలో 64 సంవత్సరాలు పాలన సాగించిన అమోఘవర్ష కవిరజమార్గ రచన చేసాడు. ఇది ప్రారంభ కన్నడ కవిత్వంగా ప్రశంశించబడింది.[235][239] ద్రవిడ శైలిలో వాస్తుశిల్పం ఒక మైలురాయికి చేరుకుంది. ఎల్లోరాలోని కైలాసనాథ్ ఆలయంలో ఇది అత్యుత్తమ ఉదాహరణగా నిలిచింది. ఇతర ముఖ్యమైన నిర్మాణాలలో కాశీవిష్వనత ఆలయం, కర్ణాటకలోని పట్టడకల్ వద్ద ఉన్న జైన నారాయణ ఆలయం ప్రాధాన్యత వహిస్తున్నాయి.

రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని నాలుగు గొప్ప సామ్రాజ్యాలలో ఒకటిగా అరబ్ యాత్రికుడు సులేమాన్ వర్ణించాడు.[240] రాష్ట్రకూట కాలంలో దక్షిణ భారత గణిత శాస్త్రంలో స్వర్ణ యుగం ప్రారంభమైంది. గొప్ప దక్షిణాది భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు మహావీర రాష్ట్రకూట సామ్రాజ్యంలో నివసించాడు. ఆయన రచనలు అతని తర్వాత నివసించిన మధ్యయుగ దక్షిణ భారతీయ గణిత శాస్త్రవేత్తలపై భారీ ప్రభావం చూపింది.[241] రాష్ట్రకూట పాలకులు ఉత్తరాలు వ్రాయడంలో ప్రసిద్ధి చెందారు. వీరు సంస్కృతం, అపబ్రంశ వంటి వివిధ భాషలలో లేఖలు వ్రాసారు.[235]

గుర్జర- ప్రతిహారా సామ్రాజ్యం

గుర్జార ప్రతీహార సామంతులైన చండేలాలు నిర్మించిన ఖజురహో దేవాలయ సముదాయంలో కండరీయ మహదేవ ఆలయం. ఇది గుర్జార -ప్రతీహార దేవాలయ నిర్మాణ శైలికి, కామపూరిత శిల్పాలకు పేరొందింది.[242]
ప్రతీహర చక్రవర్తి మిహిర భోజ[243] నిర్మించిన తేలి కా మందిర్ కు గల నాలుగు ప్రవేశ ద్వారాలలో ఒకటి.

ఇండస్ నదికి తూర్పు వైపు అరబ్ సైన్యాలను నిలిపి ఉంచడంలో గుర్జర ప్రతీహారులు ముఖ్యపాత్ర పోషించారు.[244] భారతదేశంలోని కాలిఫెట్ పోరాటాలలో నాగభట్ట అరబ్ సైన్యాన్ని ఓడించాడు. రెండవ నాగభట్టు పాలనలో ఉత్తర భారతదేశంలో గుర్జర-ప్రతీహార వంశం అత్యంత శక్తివంతమైన రాజవంశంగా మారింది. అతని కొడుకు రామభద్ర కొంతకాలం పాలించిన తరువాత ఆయన కుమారుడు మిహిర భోజుడు పాలనా బాధ్యతలు స్వీకరించాడు. భోజా ఆయన వారసుడు మొదటి మహేంద్రపాళి పాలనలో ప్రతీహారా సామ్రాజ్య శక్తి శిఖరాగ్రం చేరుకుంది. మహేంద్రాపల కాలం నాటికి పశ్చిమ సరిహద్దులో సింధు నుండి తూర్పున బెంగాలు, ఉత్తరాన ఉన్న హిమాలయాలు, దక్షిణాన నర్మదా వరకు ఉన్న ప్రాంతాలకు గుప్త సామ్రాజ్యం విస్తరించింది.[245][246] ఈ విస్తరణ భారతీయ ఉపఖండంలో నియంత్రణ కొరకు రాష్ట్రకూట, పాల సామ్రాజ్యాలతో ఒక త్రైపాక్షిక శక్తి పోరాటాన్ని ప్రేరేపించింది. ఈ కాలంలో ఇంపీరియల్ ప్రతీహర రాజులు ఆర్యవాత మహారాజధీరా (భారతదేశంలోని గొప్ప రాజుల రాజు) బిరుదాలకృతులయ్యారు.

10 వ శతాబ్దం నాటికి గుజరా-ప్రతీహరాస్ యొక్క తాత్కాలిక బలహీనతలను ఉపయోగించుకుని మాల్వా పారామరాలు, బుందేల్ఖండ్లోని చందేలలు, మహాకోసల కలాచూరీలు, హర్యానాలోని టోమరస్లు, చౌహానులు వంటి రాపుపుత్ర రాజులు స్వంతంత్రం ప్రకటించారు.

పాలా - సామ్రాజ్యం

పాలుల ఆదరణ పొందిన పురాతన విశ్వవిద్యాలయాలు
పాలుల పరిపాలనలో పేరొందిన నలందా విశ్వవిద్యాలయం. ఇది బౌద్ధ మత శిక్షణ, పరిశోధన కేంద్రంగా 450 నుండి 1193 CE ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.
ధర్మపాల చక్రవర్తి నిర్మించిన విక్రమశీల విశ్వవిద్యాలయపు ధ్యాన ప్రాంతపు అవశేషాలు.

మొదటి గోపాలా పాలా సామ్రాజ్యాన్ని స్థాపించాడు.[247][248][249] ఇది బౌద్ధ రాజవంశంగా భారత ఉపఖండంలోని తూర్పు ప్రాంతంలోని బెంగాలు నుండి పాలించింది. శశాంకా గౌడా రాజ్యం పతనం తరువాత పాలాలు బెంగాలును తిరిగి సమైఖ్య పరిచారు.[250]

పాలాలు బౌద్ధమతంలోని మహాయాన, తాంత్రిక పాఠశాలలను అనుసరించారు.[251] ఇవి శైవిజం, వైష్ణవిజాన్ని కూడా ప్రోత్సహించాయి.[252] పాలా అనే పదానికి "రక్షకుడు" అని అర్ధం. పాలా చక్రవర్తులందరి పేర్లకు ముగింపుగా పాలా ఉపయోగించబడింది. ధర్మపాల, దేవపాలా క్రింద ఈ సామ్రాజ్యం శిఖరాగ్రానికి చేరుకుంది. ధర్మపాలా కనౌజును జయించి వాయవ్య భారతదేశంలో సామ్రాజ్యాన్ని విస్తరించాడు.[252]

పాలా సామ్రాజ్యం అనేక విధాలుగా బెంగాలు స్వర్ణయుగం పరిగణించబడుతుంది.[253] ధర్మపాలా విక్రమాశీల నందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. చరిత్రలో నమోదైన మొదటి గొప్ప విశ్వవిద్యాలయాలలో నలందావిశ్వవిద్యాలయం ఒకటి.[252] పాలా సామ్రాజ్య పోషణలో పతాకస్థాయికి చేరుకుంది.[253][254] పాలా చక్రవర్తులు అనేక బౌద్ధవిహారలను కూడా నిర్మించారు. వారు ఆగ్నేయాసియా, టిబెట్ దేశాలతో సన్నిహిత సాంస్కృతిక, వ్యాపార సంబంధాలను కొనసాగించారు. పాలా సామ్రాజ్యం సంపదకు సముద్ర వాణిజ్యం జోడించబడింది. అరబ్బు వ్యాపారి సులేమాన్ తన జ్ఞాపకాలలో పాలా సైన్యం అపారమైన వివరాలను పేర్కొన్నాడు.[252]

మైత్రేయ, బుద్ధుని జీవితపు ఘట్టాల చిత్రాలు. పాల వంశపు గొప్ప రాజు రామపాల కాలంలో చిత్రించినవి.

చోళ సామ్రాజ్యం

చోళ సామ్రాజ్యం
సా.శ.1030 లో చోళ సామ్రాజ్య చక్రవర్తి రాజేంద్ర చోళ దేశపు పరిధి పటం
క్రీ.,శ. 1010 కాలపు బృహదీశ్వర ఆలయం యొక్క గ్రానైటి శిలతో నిర్మించిన గోపురం

సా.శ. 9 వ శతాబ్దం మధ్యకాలంలో మధ్యయుగ చోళులు ప్రాచుర్యంలోకి వచ్చారు. వారు దక్షిణ భారతదేశంలో గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించారు. [255] వారు తమ పాలనలో దక్షిణ భారతదేశాన్ని సమైఖ్యపరచడంలో విజయంసాధించారు. వారి శక్తివంతమైన నౌకా దళంతో శ్రీవిజయ వంటి ఆగ్నేయ ఆసియా దేశాలలో వారి ప్రభావాన్ని విస్తరించారు.[230] మొదటి రాజరాజ చోళుడు, అతని వారసులైన మొదటి రాజేంద్ర చోళుడు, రాజాధిరాజ చోళుడు, వీరరాజేంద్ర చోళుడు, మొదటి కులోత్తుంగ చోళుడు పాలనలో రాజవంశం దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాలో సైనిక, ఆర్థిక, సాంస్కృతిక శక్తిగా మారింది.[256][257] మొదటి రాజేంద్ర చోళుని నౌకాదళాలను మరింత విస్తరించి బర్మా నుండి వియత్నాం వరకు ఉన్న సముద్రతీర ప్రాంతాలతో [258] అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్ ద్వీపాలు, సుమత్రా, ఆగ్నేయాసియా, మాలేషియా ద్వీపకల్పం వంటి సముద్ర తీరాలను ఆక్రమించాడు. నూతన సామ్రాజ్య మొదటి రాజేంద్ర చోళుని నాయకత్వంలో తూర్పు ఆసియాలోని శ్రీవేజయ సముద్రతీరప్రాంత సామ్రాజ్య నగరాల ఆక్రమణ చేసి చైనాతో రాయబార కార్యాలయాలను కొనసాగించాడు.[259]

శ్రీలంక రాజకీయ వ్యవహారాల్లో వారు రెండు శతాబ్దాల పాటు ఆధిపత్యం చెలాయించారు. పశ్చిమాన అరబ్బులు, తూర్పున చైనీయుల సామ్రాజ్యంతో వారు వ్యాపార సంబంధాలు కొనసాగించారు.[260] మొదటి రాజారజ చోళుడు తరువాత ఆయనతో సమానంగా విశిష్టత సాధించిన కుమారుడు రాజేంద్ర చోళుడు దక్షిణ భారతదేశం మొత్తానికి రాజకీయ సమైఖ్యత సాధించి చోళ సామ్రాజ్యాన్ని గౌరవనీయమైన సముద్ర శక్తిగా స్థాపించారు.[261] చోళుల ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశం కళ, మతం, సాహిత్యంలో ఉన్నత స్థాయికి చేరుకుంది. దేవాలయాల నిర్మాణంలో రాతి, కాంస్యాల శిల్పకళ భారతదేశంలో మునుపెన్నడూ సాధించనంత ఎత్తుకు చేరుకుంది.[262]

పశ్చిమ చాళుక్య సామ్రాజ్యం

ఇటగీ లోని మహదేవ ఆలయం
హవేరి లోని సిద్ధేశ్వర ఆలయం
పశ్చిమ చాళుక్యుల నిర్మాణ శైలి ప్రతీకలు

10 వ - 12 వ శతాబ్దాల మధ్యకాలంలో పాశ్చాత్య చాళుక్య సామ్రాజ్యం దక్షిణ భారతదేశం, పశ్చిమ దక్కను ప్రాంతాలను పాలించింది.[263] చాళుక్య నియంత్రణలో ఉత్తరాన నర్మదా నది, దక్షిణాన కావేరి నది మధ్య విస్తారమైన ప్రాంతాలు ఉన్నాయి.[263] ఈ కాలంలో దక్కన్, హొయశిలలు, దేవగిరి సీనా యాదవులు, కాకతీయ రాజవంశం, దక్షిణ కలాచురీలు ఇతర పెద్ద పాలకులు పాశ్చాత్య చాళుక్యుల అనుచరులుగా ఉండేవారు. 12 వ శతాబ్దంలో ద్వితీయార్ధంలో చాళుక్య శక్తి క్షీణించిన తరువాత మాత్రమే వారు స్వతంత్రులయ్యారు.[264]

పాశ్చాత్య చాళుక్యులు శిల్పకళ శైలిని అభివృద్ధి చేశారు. ప్రారంభ చాళుక్య రాజవంశం శైలి, తరువాత హొయసల సామ్రాజ్య శైలి మధ్య ఒక నిర్మాణ సంబంధం ఉంది. మద్య కర్నాటకాలో తుంగభద్ర నదీ తీరప్రాంతాలలో అనేక చోళ కట్టడాలు ఉన్నాయి. లకుండి వద్ద ఉన్న కాశీవిశ్వేశ్వర దేవాలయం, కురువాటిలోని మల్లికార్జున దేవాలయం, బాగాలి లోని కాలేశ్వర ఆలయం, హవేరీలోని సిద్దేశ్వర దేవాలయం, ఇటాగిలోని మహాదేవ దేవాలయం ఇందుకు ఉదాహరణగా ఉన్నాయి.[265] దక్షిణ భారతదేశంలో జరిగిన సున్నితమైన కళాభివృద్ధిలో ఇది ముఖ్యమైనది. ప్రత్యేకించి పశ్చిమ చాళుక్య రాజులు కన్నడ భాషలో, సంస్కృతం భాషలలో రచయితలకు, తత్వవేత్తలకు, బసవ వంటి రాజనీతిజ్ఞుడు, రెండవ బాస్కర వంటి గొప్ప గణిత శాస్త్రజ్ఞులకు ప్రోత్సహం అందించారు.[266][267]

భారతీయ ఉపఖండంలో ఆరంభకాల ఇస్లాం దాడులు

భారత ఉపఖండాన్ని ఆక్రమించడం ముస్లింల ప్రారంభ ఆకాంక్షలలో ఒకటి అయినప్పటికీ తరువాత అది కష్టతరమైనదిగా గుర్తించిందని ప్రారంభ ఇస్లామిక్ సాహిత్యం సూచిస్తుంది.[268] పర్షియాను ఆక్రమించిన తరువాత అరబు ఉమయ్యదు కాలిఫేటు 720 లో ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో భాగంగా చేసాడు.

క్రీ,శ.1869 కాలపు సోమనాథ దేవాలయం.
ప్రస్తుత సోమనాథ దేవాలయం ప్రవేశద్వారపు వీక్షణ
మొదటిసారి మహమ్మద్ గజనీ దాడికి గురైన సోమనాథ దేవాలయం, హిందూ రాజులు పునర్నిర్మించిన ప్రతిసారి మహమ్మదీయ దురాక్రమణ దారుల చేత కూల్చుటకు గురైంది.

క్రీ.పూ. 712 లో ముస్లిం సైన్యాధ్యక్షుడు ముహమ్మదు బీన్ ఖాసిం అత్యధికమైన ఇండస్ ప్రాంతాన్ని (ప్రస్తుత పాకిస్తాన్) ఉమయ్యదు సామ్రాజ్యం కొరకు జయించి అస్- సిధు ప్రొవింసుగా రూపొందించి దానికి అల్- మంసురాను రాజధానిగా చేసాడు.72 km (45 mi) అనేక దురాక్రమణల తరువాత ఇండస్కు తూర్పున ఉన్న హిందూ రాజులు ఉమాయ్యదు పోరాటాల ద్వారా అరబ్బులను ఓడించి వారి విస్తరణను పాకిస్తాన్ సింధ్ వద్ద నిలిపారు. 8 వ శతాబ్దం ప్రారంభంలో రెండవ చాళుక్య సామ్రాజ్యానికి చెందిన రెండవ విక్రమాదిత్య, ప్రతీహారా రాజవంశానికి చెందిన మొదటి నాగభట్ట, గుహిలాట్ రాజవంశానికి చెందిన బాప్ప రావల్ అరబ్బు ఆక్రమణదారులను తిప్పికొట్టారు.[269]

శతాబ్దాల కాలంలో ఉత్తర ఉపఖండం (ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్) ప్రాంతాల్లో విదేశీ, కొత్తగా మతమార్పిడి చెందిన రాజపుత్రులు పలు సుల్తానేట్లు స్థాపించారు. 10 వ శతాబ్దం నుంచి సింధును రాజపుత్ సోమ్రా రాజవంశం పాలించారు. తరువాత 13 వ శతాబ్దం మధ్యకాలంలో రాజపుత్ సామ్రా రాజవంశం చేత పాలించబడింది. అదనంగా ముస్లిం వర్తకులు దక్షిణభారతీయ పశ్చిమసముద్రతీర ప్రాంతాలలో సుసంపన్నత సాధించారు. ప్రధానంగా వీరు చిన్న సంఖ్యలో అరేబియా ద్వీపకల్పం నుండి వచ్చారు. జుడాయిజం, క్రైస్తవ మతం తరువాత మూడవ మతంగా అబ్రహమిక్ మధ్య ప్రాచ్య మతం పరిచయం చేయబడింది. 11 వ శతాబ్ద ప్రారంభంలో గజని మహమూద్ ప్రధానంగా ఉత్తర భారతీయ ఉప ఖండం మీద 17 సార్లు దాడి చేసినప్పటికీ ప్రాంతాలలో "శాశ్వత రాజ్యమును" స్థాపించటానికి ప్రయత్నించలేదు.[270] 11 వ శతాబ్దం ప్రారంభంలో శ్రావస్తి సుహల్దేవ్ ఘజ్నావిద్ జనరల్ ఘజి సాయియాద్ సలార్ మసూద్ను ఓడించి, చంపాడు.[271][272]

హిందూ షాహి

కాబూలో లోయ, గాంధార ను పరిపాలించిన హిందూ షాహీలు
కాబూల్ షాహి రాజు ఖింగల( గార్దెజ్, ఆఫ్ఘనిస్తాన్) చే పవిత్రం చేయబడిన హిందూ దేవుడు గణేషుని బొమ్మ (సా.శ. 6 వ శతాబ్దం)
మధ్యతూర్పు ప్రాంతపు అబ్బాసిడ్ నాణేలకు స్ఫూర్తినిచ్చిన హిందూషాహీల నాణేలు [273]

3 వ శతాబ్దం తొలినాటికి కుషాన్ సామ్రాజ్యం పతనం తరువాత కాబూల్ షాహీలు కాబూల్ లోయ, గాంధరా (ఆధునిక పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్)ను పాలించారు.[274] షాహిస్ కాలం సాధారణంగా రెండు కాలాలుగా విభజించబడింది. బౌద్ధ షాహీలు, హిందూ షాహీలు, సుమారుగా క్రీ.పూ. 870 సమయంలో మార్పు సంభవించినదని భావిస్తున్నారు. క్రీ.పూ. 565 - క్రీ.పూ. 670 వరకు కాబూల్ షహన్ ( రత్బేల్‌షాహన్) అని పిలుస్తారు. వీటి రాజధానులు కాపిసా, కాబూలలో తరువాత ఉదభందపురా (హండ్)[275] కొత్త రాజధానులుగా ఉన్నాయి.[276][277][278]

జయపాల ఆధ్వర్యంలోని హిందూ షహీస్ ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ ప్రాంతంలో ఘజనావిడ్సు నుండి సామ్రాజ్యాన్ని కాపాడడానికి సాగించిన పోరాటాలకు ప్రసిద్ధి చెందారు. జయపాలా గజ్నావిదుల ఏకీకరణలో ప్రమాదము గ్రహించి వారి రాజధాని నగరమైన గజ్ని మీద సెబుక్టిజిన్ పాలనలో ఒకసారి, ముస్లిం ఘజ్నావిదు, హిందూ షాహీ పోరాటాలను ప్రారంభించిన అతని కొడుకు మహ్మూద్ పాలనలో ఒకసారి దాడి చేసాడు.[279] అయితే సెబుక్ టైగిన్ అతనిని ఓడించాడు ఫలితంగా ఆయన నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.[279] జయపాలా చెల్లింపు రద్దుచేసి మరోసారి యుద్ధభూమికి చేరుకున్నాడు.[279] అయితే జయపాలా కాబుల్ లోయ, సింధు నది మధ్య మొత్తం ప్రాంతంపై నియంత్రణను కోల్పోయాడు.[280]

హిందూ షాహి సామ్రాజ్య పాలనలో 7 వ, 9 వ శతాబ్దాల మధ్యకాలంలో అంబా హిందూ దేవాలయ సముదాయం నిర్మించబడింది.[281]

జయపాలుల పోరాటానికి ముందు ఆయన పంజాబీ హిందువుల పెద్ద సైన్యాన్ని అభివృద్ధి చేసాడు. జయపాల పంజాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన సైన్యంలో 1,00,000 అశ్వదళం, అనేక మంది పదాతి దళాన్ని అభివృద్ధి చేసాడు. సైనికులను పెంచింది. ఫెరిష్టా అభిప్రాయంలో:

లుమ్గాన్ పరిమితులపై రెండు సైన్యాలు కలుసుకున్నాయి. జయపాల దళాలను వీక్షించడానికి సుబుక్తుజిన్ ఒక కొండను అధిరోహించాడు. ఇది అనంత సముద్రం వంటి విస్తారంగా, అరణ్యంలోని చీమలు, మిడుతల దండులా కనిపించింది. కానీ సుబుకుత్జిన్ తనను తాను తోడేలు గొఱ్ఱెల మీద దాడి చేస్తున్నట్లు భావిస్తున్నాడు: అందువల్ల అతని నాయకులకు పిలుపునిచ్చారు. ఆయన వారిని ప్రేరణ కలిగిస్తూ ఆదేశాలను జారీచేసాడు. అతని సైనికులు కొద్ది సంఖ్యలో ఉన్నప్పటికీ ఐదు వందల మంది వ్యక్తుల బృందాలుగా విభజించబడ్డారు. వీరు వరుసగా హిందూ సైనిక వరుసపై ఒక నిర్దిష్ట అంశంపై దాడి చేయడానికి ఉద్దేశించారు. అందువలన ఇది ఎల్లప్పుడూ తాజా దళాలను ఎదుర్కోవలసి ఉంటుంది.[280]

ఏది ఏమయినప్పటికీ పాశ్చాత్య దళాల మీద ముఖ్యంగా గజ్ని యువ మహ్మూదు వైపు సైన్యం నిరాశకు గురైంది.[280] 1001 సంవత్సరంలో సుల్తాన్ మహమూద్ అధికారంలోకి వచ్చి హిందూ కుష్కి ఉత్తరాన ఉన్న క్వారఖనిధులను స్వాధీనం చేసుకున్న వెంటనే జయపాలా మరోసారి ఘజ్నిపై దాడి చేసి పెషావర్ సమీపంలోని శక్తివంతమైన గజ్నావిద్ దళాలచే మరో ఓటమిని ఎదుర్కొన్నాడు. పెషావర్ యుద్ధం తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే షాహిసులకు ఆయన విపత్తు, అవమానం తెచ్చిపెట్టాడని ప్రజలు భావించడం అందుకు కారణం.[279][280]

జయపలా తరువాత ఆయన కుమారుడు ఆనందపాల పాలనా బాధ్యతలు చేపట్టాడు.[279] తరువాత వచ్చిన ఇతర షాహీలు ఘజనవిదులకు వ్యతిరేకంగా చేసిన పలు పోరాటాలు అపజయం పొందాయి. హిందూ పాలకులు చివరకు కాశ్మీర్ శివాలిక్ పర్వతాలకు తరలి వెళ్ళారు.[280]

మధ్యయుగ ద్వితీయార్ధం (క్రీ.పూ 1200 – 1526)

రాజస్థాన్ కొండకోటలు
సా.శ. 15వ శతాబ్దంలో రాణా ఖుంభ నిర్మించిన కుంబల్ఘర్ కోట గోడలు 38 కిమీపైగా విస్తరించివున్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తరువాత ఎక్కువపొడవైన గోడలు గలదిగా చెప్పబడింది.
జోధ్పూర్ లోని మేహ్రంఘర్ కోట 1459 లో జోధారావు నిర్మించాడు. దీనికి ఏడు ప్రవేశద్వారాలుండగా, ఫతే పోల్ అనే ప్రవేశ ద్వారం మొఘలులపై రాజపుట్ గెలుపుకి గుర్తుగా వుంది.

మధ్యయుగ ద్వీతీయార్ధకాలంలో మధ్య ఆసియా జాతీయుల ముస్లిం వంశాల కారణంగా ప్రాంతీయ ప్రముఖులు ఎదుర్కొన్న సమస్యలకు ప్రతీకగా ఉంది.[282][283]ఇది ములిం ఆక్రమణలను రాజపుత్రులు అడ్డగించడానికి దారితీసింది. ఇది హిందూ, ముస్లిం రాజవంశాలు, సామ్రాజ్యాల అభివృద్ధి కొత్త సైనిక సాంకేతికత వ్యూహాల అభివృద్ధికి దారితీసింది.[284] భక్తి ఉద్యమం, సిక్కిజం అభివృద్ధి చెందాయి.

ముస్లిం జనసఖ్యాభివృద్ధి

సంపాదకుడు జేమ్స్ మెస్టన్ గా వెలువడిన 'హచిన్సన్ స్టోరీ ఆఫ్ ది నేషన్స్' లో భారతదేశ అధ్యాయంలో బొమ్మ

టర్కీ ముస్లిం సైనికాధికారి " ముహమ్మదు బఖ్తియార్ ఖిల్జి " బీహారులో బౌద్ధసన్యాసుల సామూహిక హత్యాకాండ చేయించాడు. ఖిల్జీ సాగించిన ఉత్తర ఇండియా దాడులలో నలందా, విక్రమషీలా విశ్వవిద్యాలయాలు ధ్వంశం చేయబడ్డాయి. ఇందులో బ్రాహ్మణ, బౌద్ధ విద్యార్ధులు సామూహికంగా హత్యచేయబడ్డారు.[285]]]

చరిత్రలో స్థిరపడిన ఇతర వ్యవసాయ సమాజాలలాగా భారత ఉపఖండంలో ఉన్నవారి సుదీర్ఘ చరిత్రలో వారి మీద సంచార తెగలవారు దాడి చేశారు. ఉప-ఖండంలో ఇస్లాం ప్రభావాన్ని విశ్లేషిస్తూ వాయువ్య భారతీయ ఉపఖండం తరచుగా మధ్య ఆసియా నుండి దాడులకు లక్ష్యంగా ఉందని వివరించబడింది. ఆ కోణంలో ముస్లింల చొరబాట్లు, ముస్లిం దండయాత్రలు 1 వ సహస్రాబ్ది సమయంలో జరిగిన ముట్టడికి భిన్నంగా ఉన్నాయి.[286] అయితే ముస్లింల చొరబాట్లను, తరువాత ముస్లిం దండయాత్రలను భిన్నమైనదిగా చెప్పాలంటే ముందటి ఆక్రమణదారుల వలె కాకుండా ముస్లిం విజేతలు సామాజిక వ్యవస్థలో తమ ఇస్లామిక్ గుర్తింపును నిలుపుకున్నారు. నూతనంగా చట్టపరమైన, పరిపాలనా వ్యవస్థలను సృష్టించారు. ఇది సాధారణంగా అనేక సందర్భాల్లో ముస్లిం-యేతర ప్రజల సొంత చట్టాలు, ఆచారాలకు వదిలివేయబడినప్పటికీ, ముస్లిం-వ్యతిరేక ప్రత్యర్థులను, సామూహిక ప్రజానీకాన్ని ఇది ప్రభావితం చేసింది. [282][283] వారు ప్రవేశపెట్టిన కొత్త సాంస్కృతిక సంకేతాలు అప్పటికే ఉన్న సాంస్కృతిక సంకేతాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇది ఒక నూతన భారతీయ సంస్కృతి పురోగతికి దారి తీసింది. ఇది ప్రాచీన భారత సంస్కృతి, ఆధునిక పాశ్చాత్యీకరణ చెందిన భారతీయ సంస్కృతికీ భిన్నంగా ఉంది. అదే సమయంలో భారతదేశంలో ఉన్న ముస్లింలు అధికంగా మతంమార్చుకున్న భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. ఈ అంశం సంస్కృతుల సంశ్లేషణలో కూడా ముఖ్య పాత్ర పోషించింది.[287]

ముస్లిం సామ్రాజ్యం అభివృద్ధి శత్రువుల రాజ్యాల రాజకీయ ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు విధ్వంశం చేయబడ్డాయి.[288] ప్రజలు ఇస్లాం మతానికి బలవంతంగా మార్చబడ్డారు.[289] జిజియా పన్ను చెల్లింపు,[290] ముస్లిం-కాని జనాభా ప్రాణలు కోల్పోయే పరిస్థితి ఎదురైంది.[291] అలైన్ డానియేలు గుర్తించారు:

సుమారు క్రీ.పూ. 632 సమయంలో ముస్లింలు రావడం మొదలుపెట్టారు. భారతదేశం చరిత్ర, దీర్ఘ కాల హత్యలు, సామూహిక హత్యాకాండలు, విధ్వంసాలు సంభవించాయి. 'పవిత్ర యుద్ధం' అనే పేరుతో అనాగరికులందరూ నాగరికతలను నాశనం చేశారని మొత్తం జాతులన్నింటినీ తుడిచిపెట్టింది.[292]

ముస్లిములను రాజపుత్రులు అడ్డగించుట

కీర్తి స్తంభం
భారత ఉపఖండంలో పెద్దదైన చిత్తోర్ కోట. ఆరు రాజస్థాన్ కొండ కోటలలో ఇది ఒకటి
విజయ స్తంభం

భారత ఉపఖండంలో ముస్లిం దండయాత్రల ముందు ఉత్తర, పశ్చిమ భారతదేశంలో అధిక భాగాన్ని రాజపుత్ రాజవంశాలు పాలించాయి. భారతదేశంలోని ఉమాయ్యదు పోరాటంతో అరబ్ ముస్లిం విస్తరణను అడ్డుకోవడంలో రాజపుత్రులు, దక్షిణ భారత చాళుక్య రాజవంశం విజయవంతమయ్యాయి. తరువాత మధ్య ఆసియా ముస్లిం టర్కులు ఉత్తరప్రదేశ్ హిందూ మతంలోకి రాజ్పుట్ రక్షణను చీల్చుకుని కేంద్రస్థానానికి ప్రవేశించారు. అయినప్పటికీ రాజపుత్రులు అనేక శతాబ్దాలుగా ముస్లిం టర్కిక్ సామ్రాజ్యాలపై దాడి కొనసాగించారు. సాంప్రదాయంగా బలమైన కట్టుబాట్లలో పాతుకుపోయిన ధైర్యమైన ప్రవర్తన విధానాలను పాటిస్తూ వారు పోరాటం కొనసాగించారు.[293]10 వ శతాబ్దంలో రాజపుత్ర చౌహాన్ రాజవంశం ఢిల్లీ, అజ్మీరుల మీద నియంత్రణను నెలకొల్పింది. ఈ రాజవంశంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్. అతని పాలన భారత చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటిగా గుర్తించబడింది. ఆయన ముస్లిం సుల్తాన్ ముహమ్మద్ ఘోరితో పోరాడాడు. మొదటి తారియన్ యుద్ధంలో గోరీ భారీ నష్టంతో ఓడిపోయాడు. అయినప్పటికీ తరువాతి తారియన్ యుద్ధం రాజ్ పుట్ సైన్య ఓటమి భారతదేశంలో ముస్లిం పాలనకు పునాది వేసింది.[294]

మహారాజా హమీర్ ఆధ్వర్యంలో మేవార్ రాజవంశం ముఘల్ తుగ్లకును, అతని ప్రధాన మిత్రరాజులైన బర్గుజరాతులతో ఓడించి ఆయనను ఖైదు చేసాడు. తుగ్లక్ విదుదలకు చెల్లించిన భారీ మూల్యంలో మేవారు భూములు ఉన్నాయి. ఈ ఘటన తరువాత ఢిల్లీ సుల్తానేటు కొన్ని వందల సంవత్సరాలు చిత్తూరుపై దాడి చేయలేదు. రాజపుత్రులు వారి స్వాతంత్రాన్ని తిరిగి స్థాపించారు. బెంగాలు, ఉత్తరాన పంజాబులో చాలా రాజపుత్ర రాజ్యాలు స్థాపించబడ్డాయి. టోమర్లు గ్వాలియర్లో రాజ్యం స్థాపించారు. మాన్ సింగ్ తోమార్ తిరిగి నిర్మించిన గ్వాలియర్ కోట ఇప్పటికీ ఉంది.[295] ఈ కాలంలో మేవారు ప్రముఖ రాజపుత్ర రాష్ట్రంగా ఉద్భవించింది. రాణా కుంభా మాల్వా, గుజరాత్ సుల్తానేట్స్ ఖర్చుతో తన రాజ్యాన్ని విస్తరించారు.[295][296] తదుపరి గొప్ప రాజపుత్ర పాలకుడు (మేవారు) రానా సంగా ఉత్తర భారతదేశంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతని లక్ష్యాలు పరిధి వృద్ధి చెందాయి - అతను ఆ సమయంలో ఢిల్లిని పాలిస్తున్న ముస్లిం పాలకులను జయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఖాన్వా యుద్ధంలో అతని ఓటమి భారతదేశంలో కొత్త మొఘల్ రాజవంశాన్ని సమైఖ్యం చేసింది.[295]

మహారాణా ఉదయ్ సింగు ఆధ్వర్యంలో మేవారు రాజవంశం ముఘలు చక్రవర్తి అక్బరు చేతిలో ఓడిపోయి వారి రాజధాని చిత్తోరులో పట్టుబడ్డాడు. ఈ సంఘటన కారణంగా రెండవ ఉదయ్ సింగు ఉదయపూరును స్థాపించాడు. ఇది మేవార్ రాజ్యానికి కొత్త రాజధానిగా మారింది. అతని కుమారుడు మేవారు మహారాణా ప్రతాపు మొఘలులను గట్టిగా వ్యతిరేకించారు. అక్బరు అతనికి వ్యతిరేకంగా అనేక మార్లు సైన్యాలను పంపించాడు. చివరికి చిట్టోర్ కోట మినహాయించి మేవారు లోని అన్ని ప్రాంతాలపై నియంత్రణ సాధించాడు.[297]

చిత్తోరు కోట భారత ఉపఖండంలో అతిపెద్ద కోటగా పరిగణించబడుతుంది. ఈ కోట 15 వ - 16 వ శతాబ్దాలలో ముస్లిం సైన్యాల దాడులను మూడు సార్లు ఎదుర్కొన్న రాజపుత్ర నిరోధకతకు చిహ్నంగా మారింది. 1303 లో అల్లావుద్దిన్ ఖల్జీ రాణా రతన్ సింగును ఓడించాడు. 1535 లో గుజరాతు సుల్తానేటు బహదూర్ షా బిక్రమ్జీత్ సింగును ఓడించాడు. 1567 లో అక్బరు మహారాణా రెండవ ఉదయ్ సింగును ఓడించాడు. ఆయన కోటను వదిలి ఉదయపూరును స్థాపించాడు. ప్రతిసారీ పురుషులు శత్రువులను పోరాడుతూ కోట గోడల నుండి శత్రువులను పరుగెత్తిస్తూ ధైర్యంగా పోరాడి చివరకు ఓడిపోయారు. ఈ ఓటమి తరువాత చిత్తోరు ఘడ్ కోటలో యుద్ధాల్లో చనిపోయిన రాజపుత్ర సైనికులకు భార్యలు, పిల్లలు అనేకమంది జౌహర్ కట్టుబడి ఆత్మాహుతి చేసుకున్నారు. మొదటిసారిగా 1303 లో జరిగిన యుద్ధంలో చంపబడిన రారంసింగు భార్య రాణి పద్మిని, ఆ తరువాత 1537 లో రాణి కర్ణనావతి ఆత్మాహుతి చేసుకున్నారు.[298]

ఢిల్లీ సల్తనత్ - (సల్తనత్  = సుల్తానుల పరిపాలన రాజ్యము)

ఢిల్లీ సల్తనత్
ఢిల్లీ సల్తనత్ టర్కో-ఇండియన్ తుగ్లక్ వంశీయుల పాలనలో అత్యున్నత స్థాయికి చేరుకుంది.[300]
బానిస రాజవంశం కుతుబ్-ఉద్-దిన్ అబాక్ చే ప్రారంభించబడిన కుతుబ్ మినార్ ప్రపంచంలోని ఎత్తైన ఇటుక మినారు

చరిత్రకారుడు డాక్టర్. ఆర్.పి. త్రిపాఠి ఇలా పేర్కొన్నాడు:

భారతదేశంలో ముస్లింల సార్వభౌమత్వ చరిత్ర ఇల్-తుత్-మిష్ తో సరిగా తెలియడం మొదలవుతుంది.[301]

ఢిల్లీ కేంద్రంగా పాలించిన ఢిల్లీ సల్తనత్ లు ముస్లిం సల్తనత్ లుగా పలు టర్కో-ఇండియను రాజవంశాలు,[302] పఠాను సంతతికి చెందిన అనేక రాజవంశాలు పాలించాయి.[303] 13 వ శతాబ్దం నుండి 16 వ శతాబ్దం వరకు భారత ఉపఖండంలోని అధిక భూభాగాన్ని పాలించింది.[304] భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ సల్తనత్ దక్షిణాసియా, పశ్చిమాసియాలతో చేరిన ఆసియా ఖండాన్ని విస్తృతంగా ప్రభావితం చేసింది. మధ్య ఆసియా సోఫాన భూభాగం నుండి సంచారజాతులకు చెందిన టర్కిక్ ప్రజల ప్రవాహం మొదలైంది. మధ్యప్రాచ్యంలో ఇస్లామిక్ కాలిఫ్రేట్ ప్రత్యర్థి రాజ్యాలలోని ముస్లిం పాలకులు ముస్లిమేతరులైన సంచార టర్కీలను బానిసలుగా మార్చడం మొదలుపెట్టినప్పుడు వారిలో చాలా మంది నమ్మకమైన సైనిక బానిసలుగా (మామ్లులు) మారడం మొదలైంది. 9 వ శతాబ్దానికి మామ్లులు అని పిలువబడిన వీరు త్వరలోనే ముస్లిం భూములకు వలస వచ్చి ఇస్లామీయ రాజ్యంలో భాగంగా మారారు. అనేక టర్కీ మమ్లుకు బానిసలు చివరికి పాలకులుగా ఎదిగి ముస్లిం ప్రపంచం పెద్ద భాగాలను స్వాధీనం చేసుకున్నారు. భారత ఉపఖండం మీద తమ దృష్టిని మరల్చటానికి ముందు ఈజిప్టు నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు మమ్లుక్ సల్తనత్ లను స్థాపించారు.[305]

12 వ - 13 వ శతాబ్దాలలో మద్య ఆసియా టర్కులు ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో దాడి చేసి హిందూ చక్రవర్తుల ఆధీనంలో ఉన్న ఢిల్లీని స్వాధీనం చేసుకుని ఢిల్లీ సల్తనత్ ను స్థాపించారు.[306] తరువాతి బానిస రాజవంశం ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను జయించగలిగారు. ఖఇల్జీ రాజవంశం చాలావరకు మధ్య భారతదేశాన్ని స్వాధీనం చేసుకుంది. దక్షిణ భారతదేశంలోని ప్రధాన హిందూ సామ్రాజ్యాలు సామంతరాజ్యాలుగా మారడానికి ఇది దారితీసింది.[304] అయినప్పటికీ వారు భారత ఉపఖండాన్ని జయించి సమైక్యం చేయడంలో విజయవంతం కాలేదు. సల్తనత్ భారతీయ సాంస్కృతిక పునరుద్ధరణకు కొంతకాలం ఉపయోగపడింది. ఫలితంగా "ఇండో-ముస్లిం" సంస్కృతుల కలయికతో నిర్మాణం, సంగీతం, సాహిత్యం, మతం, వస్త్రాలలో శాశ్వతమైన సింక్రోనిక్ స్మారక చిహ్నాలను ఏర్పరచబడ్డాయి. ఢిల్లీ సుల్తానుల కాలంలో పర్షియన్లు, టర్కిక్, జర్మనీ భాష మాట్లాడే వలసదారులు స్థానిక సంస్కృత, ప్రాకృతం స్థానిక మాట్లాడేవారితో కలిసిన ఫలితంగా ఉర్దూ భాష (వివిధ టర్కిక్ మాండలికాలలో "గుంపు" లేదా "శిబిరం" అని అర్ధం) జనించింది. రజియా సుల్తానా (1236-1240) వంటి మహిళా పాలకులు ఉన్న ఏకైక ఇండో-ఇస్లామిక్ సామ్రాజ్యంగా ఢిల్లీ సల్తనత్ ప్రత్యేకత సంతరించుకుంది. ఏదేమైనా, ఢిల్లీ సుల్తానేట్ కూడా భారతీయ ఉపఖండంలో పెద్ద ఎత్తున విధ్వంసం, ఆలయాల అపవిత్రతపరచడానికి కారణంగా నిలిచింది.[288]

ఢిల్లీ సల్తనత్ కాలంలో భారతీయ నాగరికత, ఇస్లామిక్ నాగరికత మధ్య ఒక సంశ్లేషణ జరిగింది. తరువాతి బహుళ-సాంస్కృతిక సమాజం విస్తృత అంతర్జాతీయ నెట్వర్కులు సామాజిక, ఆర్థిక వ్యవస్థలతో సహా, ఆఫ్రో-యురేషియా భూభాగాలను విస్తరించింది. ఇది వస్తువులు, ప్రజలు, సాంకేతికతలు, ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకోడానికి సహకరించింది. భారతీయ కులీనుల నుండి టర్కిక్ ముస్లిం కులీనులకు అధికారం బదిలీ చేయబడింది. పెరుగుతున్న ప్రపంచ వ్యవస్థకు భారతీయ ఉపఖండాన్ని అనుసంధానించడానికి ఢిల్లీ సల్తనత్ బాధ్యత వహించింది. ఇది భారతీయ సంస్కృతిని గణనీయమైన స్థాయిలో ప్రభావితం చేసి విస్తృత అంతర్జాతీయ నెట్వర్కుగా రూపొందింది. [307]

13 వ శతాబ్దంలో మంగోలు సామ్రాజ్యం ఆసియా, తూర్పు ఐరోపాలోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకుని స్వాధీనం చేసుకుంది. అయితే భారతదేశ ఢిల్లీ సల్తనత్ మంగోలు దండయాత్రను విజయవంతంగా తిప్పికొట్టింది. టర్కిక్ మమ్లుక్ బానిస సైన్యం వారి విజయానికి ముఖ్య కారణంగా ఉంది. మంగోల వంటి సంచార అశ్వికదళ యుద్ధనైపుణ్యంలో టర్కీ మమ్లుకులు ఆరితేరిన వారు కనుక ఈ విజయం సాధ్యం అయింది. మంగోలులను ఢిల్లీ సల్తనత్ ను తిప్పికొట్టకుండా ఉంటే మంగోలు సామ్రాజ్యం భారతదేశంలో విస్తరించడానికి అవకాశం ఉంది. [308]

మధ్య ఆసియాలోని టర్కో-మంగోన్ విజేత తైమూరు (టమేర్లేన్) ఉత్తర ఢిల్లీ నగరం లోని తుగ్లకు రాజవంశం సుల్తాన్ నాసిర్-యు దిన్ మెహ్ముదు మీద దాడి చేశాడు.[309] 1398 డిసెంబరు 17 న సుల్తాను సైన్యం ఓడిపోయింది. తైమూరు ఢిల్లీకి చేరుకుని మూడు రోజులు పగలు, రాత్రులు దోపిడీ చేసి నగరంలో విధ్వంసం సృష్టించి శిథిలాలను వదిలివేశారు. సాయిసైదు విద్వాంసులు, "ఇతర ముస్లింలు" (కళాకారులు) తప్ప మిగిలిన మొత్తం నగరాన్ని దోచుకోవాలని తైమూరు ఆదేశించాడు. ఒక్క రోజులో 100,000 యుద్ధ ఖైదీలు చంపబడ్డారు.[310] ఢిల్లీ తొలగింపు తరువాత సల్తనత్ ను గణనీయంగా బాధించబడి లోడి రాజవంశ పాలనలో కొంతకాలం పునరుద్ధరించబడింది.

భక్తి ఉద్యమం, సిక్కిజం, హిమాలయన్ బుద్ధిజం

సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ రచించిన దశం గ్రంథ. 24 అవతారాలు గల విష్ణు, రుద్ర, బ్రహ్మ, హిందూ యుద్ధ దేవత చండీ, బచ్చితర్ నాటక్ లో రాముని కథ ముఖ్యమైన అంశాలు.[312]

మధ్యయుగ హిందూ మతం నుండి భక్తి ఉద్యమం తలెత్తింది.[313] తరువాత ఇది సిక్కు మతంలో విప్లవాత్మకంగా మారింది.[314] ఇది దక్షిణ భారతదేశంలో (ప్రస్తుతం తమిళనాడు, కేరళ ప్రాంతాలలో)7 వ శతాబ్దంలో ఉద్భవించి ఉత్తరంవైపు వ్యాపించింది.[313] 15 వ నుండి 17 వ శతాబ్దం మధ్యకాలంలో తూర్పు, ఉత్తర భారతదేశాల్లో ఇది విస్తరించింది.[315]

  • భక్తి ఉద్యమం వైష్ణవిజం (విష్ణు), శైవిజం (శివ), శాక్తేయం (శక్తి దేవతల), స్మార్టిజం వంటి వేర్వేరు దేవుళ్ళు, దేవతల చుట్టూ ప్రాంతాలవారీగా అభివృద్ధి చెందింది.[316][317][318] ఈ కదలిక అనేక మంది కవి-సన్యాసుల కృషితో మరింత స్ఫూర్తి పొందింది. వీటిలో విస్తృత స్థాయిలో ద్వైత, అద్వైత వేదాంత సిద్ధాంతాలు ఉన్నాయి.[319][320]
  • సిక్కుమతానికి మొదటి గురు నానకు ప్రసంగాలు ఆధారంగా ఉన్నాయి.[321] సిక్కుమతం పదిమంది సిక్కు గురువుల ఆధ్యాత్మిక బోధనల మీద ఆధారపడింది. 10 వ గురువు మరణం తరువాత గురు గోవింద్ సింగు సిక్కు గ్రంథం " గురు గ్రంథ్ సాహిబు " సిక్కులకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా పనిచేసే శాశ్వతమైన, వాస్తవిక గురు సాహిత్య స్వరూపంగా మారింది.[322][323][324]
  • భారతదేశంలో బౌద్ధమతం హిమాలయ రాజ్యాలైన నామ్గ్యాలు రాజ్యం (లఢక్), సిక్కిం రాజ్యం (సిక్కిం), మధ్యయుగ కాలం నాటి చుటియా రాజ్యంలో (అరుణాచల్ ప్రదేశ్) అభివృద్ధి చెందింది.

విజయనగర సామ్రాజ్యం

1336 లో మొదటి హరిహారా, అతని సోదరుడు మొదటి బుక్క రాయా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.[327] ఇది హొయసల సామ్రాజ్య, కాకతీయ సామ్రాజ్యం,[328] పాండియన్ సామ్రాజ్యాల రాజకీయ వారసత్వంగా ఉద్భవించింది.[329] 13 వ శతాబ్దం ముగిసేనాటికి దక్షిణ భారతాన్ని ఇస్లామీయ దండయాత్రల నుండి రక్షించే శక్తిగా ఈ సామ్రాజ్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. 1565 లో దక్కను సుల్తానేట్ల మిశ్రమ సైన్యాల చేతిలో భారీ సైనిక ఓటమి తర్వాత దాని శక్తి క్షీణించినప్పటికీ కూడా ఇది 1646 వరకు కొనసాగింది. ఈ సామ్రాజ్యానికి దాని రాజధాని నగరమైన విజయనగరం పేరు పెట్టబడింది. దీని శిథిలాలు ప్రస్తుతం హంపిని చుట్టూ కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇది కర్ణాటక రాష్ట్రంలో " ప్రపంచ వారసత్వ సంపద "గా గుర్తించబడుతుంది.[330]

సింహంతో యోద్ధుడు ("సాలా ఫైటింగ్ ది లయన్") హొయసల సామ్రాజ్య చిహ్నం. హొయసాల పరిపాలన వాస్తుశిల్పం, వారి తరువాత పాలకులైన విజయనగర సామ్రాజ్యంపై ముద్రవేశాయి.
చెన్నకేశవ ఆలయం హొయసల వాస్తుకళ నమూనాకు ఉదాహరణగా ఉంది, తరువాత 16 వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తుల ఆర్థిక మద్దతు, నిధుల ద్వారా మరమ్మతులు చేశారు.[331]

సామ్రాజ్యం స్థాపించిన మొదటి రెండు దశాబ్దాలలో మొదటి హరిహరరాయలు తుంగభద్ర నదికి దక్షిణంలో అత్యధిక భూభాగం మీద నియంత్రణ సాధించాడు. పుర్వాపశ్చిమ సమూద్రిధిస్వార ("తూర్పు, పశ్చిమ సముద్రాల అధిపతి") పేరును సంపాదించాడు. 1374 నాటికి మొదటి హరిహారరాయుడి వారసుడు ఆర్కోట, కొండవీడు రెడ్డి, మధుర సుల్తాను, పశ్చిమంలో గోవాపై నియంత్రణ సాధించి, ఉత్తరాన తుంగభద్ర-కృష్ణా నది డోయబులను అధిగమించాడు.[332][333]

విజయనగర సామ్రాజ్యం తరువాత సామ్రాజ్యంగా మారింది. మొదటి బుక్కరా రాయుని రెండవ కుమారుడు రెండవ హరిహరరాయుడు కృష్ణా నదిని అధిగ మించి రాజ్యాన్ని మరింత విస్తరించి దక్షిణ భారతదేశం మొత్తాన్ని విజయనగర చ్ఛత్రపు నీడలోకి తీసుకుని వచ్చాడు.[334] తదుపరి పాలకుడు మొదటి దేవ రాయాడు ఒరిస్సా గజపతులకు వ్యతిరేకంగా విజయం సాధించి కోటలను నిర్మించి, నీటిపారుదల వంటి ముఖ్యమైన పనిని చేపట్టాడు.[335] ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కొంటి ఆయనను భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పాలకునిగా పేర్కొన్నాడు.[336] రెండవ దేవా రాయ (గజబెటికార అని పిలిచేవారు)[337] సింహాసనం 1424 లో సంగమ రాజవంశం పాలకులు అత్యంత సామర్థ్యతతో పాలన చేసారు.[338] ఆయన తిరుగుబాటు చేసిన ఛాందసవాస ప్రభువులను, అలాగే కాలికట్ జామోరిన్ దక్షిణాన క్విలాన్లను తిరస్కరించాడు. అతను శ్రీలంక ద్వీపాన్ని ఆక్రమించి పెగూ, తనస్సేరిమ్ వద్ద ఉన్న బర్మా రాజుల మీద ఆధిపత్యం సాధించాడు.[339][340][341]

సామ్రాజ్యం వారసత్వంగా దక్షిణ భారతదేశం అంతటా విస్తరించిన అనేక స్మారకనిర్మాణాలు ఉన్నాయి. వీటిలో హంపిలోని నిర్మాణ సమూహం ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో పూర్వపు ఆలయ నిర్మాణ సంప్రదాయాలు విజయనగర శిల్ప శైలిలో కలిసిపోయాయి. అన్ని విశ్వాసాలు, మాండలికాలు కలిసిపోవటం హిందూ దేవాలయ నిర్మాణంలో నూతన ఆవిష్కరణను ప్రోత్సహించింది. మొదట దక్కనులో, తర్వాత స్థానిక గ్రానైట్ ఉపయోగించి ద్రావిడ సంప్రదాయంలో ఆలయాలు నిర్మించబడ్డాయి. కేరళలో విజయనగర సామ్రాజ్యం రక్షణలో దక్షిణ భారతీయ గణిత శాస్త్రం అభివృద్ధి చెందింది. 14 వ శతాబ్దంలో సంగ్రామమాగ్రామాకు చెందిన దక్షిణ భారత గణిత శాస్త్రజ్ఞుడు మాధవ ప్రసిద్ధ " కేరళ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్సును " స్థాపించాడు. ఇది మధ్యయుగ దక్షిణ భారతదేశంలో పరమేశ్వర, నీలకంఠ సోమయాజి, జ్యేష్ఠదేవ వంటి గొప్ప దక్షిణ భారతీయ గణిత శాస్త్రవేత్తలను సృష్టించింది.[342] సమర్ధవంతమైన పరిపాలన, బలమైన విదేశీ వాణిజ్యం, నీటిపారుదల, నీటి నిర్వహణ వ్యవస్థలు వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలను తీసుకువచ్చాయి. [343] కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతంలో క్రొత్త ఎత్తులను చేరుకున్నాయి. సున్నితమైన కళలు, సాహిత్యాలను సామ్రాజ్యం పోషించింది. కర్ణాటక సంగీతం ప్రస్తుత రూపం సంతరించుకుంది.[344]

విజయనగర సామ్రాజ్యం హిందూయిజం ప్రోత్సహించడం ద్వారా ప్రాంతీయవాదాన్ని అధిగమించింది దక్షిణభారతదేశాన్ని సమైక్యం చేసింది. శ్రీ కృష్ణదేవరాయ పాలనలో సామ్రాజ్యం దాని శిఖరానికి చేరుకుంది. విజయనగర సైన్యాలు నిరంతరాయంగా విజయం సాధించాయి. ఉత్తర దక్కను తూర్పు దక్కను ప్రాంతాలలోని కాళింగతో సహా సుల్తానేట్ల క్రింద ఉన్న ప్రాంతాలు సామ్రాజ్యంతో కలపబడ్డాయి. అదేసమయంలో దక్షిణప్రాంతాలన్నింటి మీద నియంత్రణను కొనసాగించింది.[345] కృష్ణదేవరాయల కాలంలో అనేక ముఖ్యమైన స్మారక కట్టడాలు నిర్మాణాపు పునులు పూర్తి చేసుకున్నాయి.

తాలికోట యుద్ధం (1565) లో ఓటమి తరువాత విజయనగర తిరోగమనం మొదలైంది. తళ్ళికోటా యుద్ధంలో అలియ రామరాయ మరణం తరువాత తిరుమల దేవ రాయుడు అరవీడు రాజవంశంని ప్రారంభించి నాశనం చేయబడిన హంపీని వదిలి ఒక నూతన రాజధానిగా పెనుగొండను స్థాపించి విజయనగర సామ్రాజ్యం అవశేషాలను పునఃస్థాపించేందుకు ప్రయత్నించారు.[346] 1572 లో తిరుమల మిగిలిన రాజ్యాన్ని తన ముగ్గురు కుమారులకు పంచియిచ్చి మరణించే వరకు (1578 లో ) ఆయన ఆధ్యాత్మికతను ఆచరించాడు. అరవీడు రాజవంశం వారసులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ సామ్రాజ్యం బీజాపూర్ సుల్తానేటు, ఇతరులతో కొనసాగిన యుద్ధాల కారణంగా 1614 లో పతనావస్థకు చేరుకుని 1646 లో ముగిసింది.[347][348][349] ఈ కాలంలో దక్షిణ భారతదేశంలో ఎక్కువ రాజ్యాలు విజయనగర నుండి విడిపోయి స్వతంత్రంగా మారాయి. వీటిలో మైసూర్ కింగ్డమ్, కలాడీ నాయక, మధుర నాయక్లు, తంజోర్ నాయక్లు, చిత్రదుర్గ నాయకులు, జిన్గే నాయక్ రాజ్యం - వీటన్నింటికీ స్వాతంత్ర్యం ప్రకటించాయి. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత దేశ చరిత్రలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది.[350]

దక్షిణ గోపురం నుండి ఉత్తరంవైపు వీక్షిస్తున్నప్పుడు మీనాక్షి ఆలయం. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో మరల నిర్మించబడింది.

ప్రాంతీయ శక్తులు

ప్రాంతీయ రాజ్యాలు
15 వ శతాబ్దంలో మేవార్ రాజ్ పుట్ ల తోడ్పాటుతో నిర్మించిన రాణక్పూర్ జైన్ ఆలయం.
హేజీయా సోఫియా తరువాత ప్రపంచంలో పెద్దదైన గోళం గల గోల్ గుంబజ్ నిర్మాణం బిజాపూర్ సుల్తానులు నిర్మించారు.

13 వ శతాబ్దం మధ్య నుండి రెండున్నర శతాబ్దాల కాలం ఉత్తర భారతదేశంలో రాజకీయాలను ఢిల్లీ సుల్తానేటు, దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం ఆధిపత్యం వహించాయి. అయినప్పటికీ ఇతర ప్రాంతీయ శక్తులు కూడా బలోపేతంగా ఉన్నాయి. రెడ్డి రాజవంశం ఢిల్లీ సుల్తానేటును ఓడించడంలో విజయం సాధించి ఉత్తరభారతంలో కటక్ నుండి దక్షిణభారతంలో కంచి వరకూ తమ పాలనను విస్తరించి చివరకు విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేయబడింది.[351] ఉత్తరభారతంలో రాజపుత్ర రాజ్యాలు పశ్చిమ, మధ్య భారతదేశంలో ఆధిపత్య శక్తిగా మిగిలిపోయాయి. మేవారు రానా రాజపుతానాలో శక్తివంతమైన హిందూ రాజపుత్ర సమాఖ్య ఆధిపత్యంలో రాజపుత్ర రాజ్యాలు సమైక్యశక్తిగా నిలిచాయి. ఈ సమయంలో రాజపుత్ర సైన్యాలు ఢిల్లి సుల్తాను సైన్యంపై నిరంతరం విజయం సాధించాయి.[352]

దక్షిణాభారతంలో స్థాపించబడిన " బహుమనీ సుల్తానేటు "ను ఒక మతంమారిన బ్రాహ్మణుడు లేదా బ్రాహ్మణత్వం పట్ల గౌరవాదరాలు ఉన్న వ్యక్తిచేత స్థాపించబడినందున దానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు.[353] ఇది విజయనగర ప్రధాన ప్రత్యర్థిగా విజయనగర సామ్రాజ్యానికి తరచూ కష్టాలు సృష్టించింది.[354] 16 వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయలు బహ్మానీ సుల్తానేటు చివరి శక్తిశేషాన్ని ఓడించారు. దీని తరువాత బహ్మానీ సుల్తానేటు పతనం అయింది.[355] తరువాత ఇది 5 చిన్న డక్కను సుల్తానేట్లుగా విభజించబడింది.[356] 1490 లో అహ్మదు నగర స్వాతంత్ర్యం ప్రకటించింది. తరువాత సంవత్సరంలో బీజాపూరు, బెరార్లు స్వతంత్రం ప్రకటించారు. గోల్కొండ 1518 లో స్వతంత్రం పొందింది. 1528 లో బిదారు స్వతంత్రం ప్రకటించింది.[357] సాధారణంగా ప్రత్యర్థులు అయినప్పటికీ 1565 లో విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మిత్రపక్షాలుగా సమైక్యమై " తాళ్ళికోట యుద్ధం " విజయనగర సామ్రాజ్యం శాశ్వతంగా బలహీనపడింది.

తూర్పు భాగంలో గజపతి సామ్రాజ్యం ప్రాంతీయ సంస్కృతి, వాస్తుశిల్పం వృద్ధితో బలమైన ప్రాంతీయ శక్తిగా మిగిలిపోయింది. కపిలేంద్రదేవుని ఆధిపత్యంలో గజపతులు సామ్రాజ్యాన్ని ఉత్తరభారతంలో గంగా నుండి దక్షిణభారతంలో కావేరీ వరకు విస్తరించారు.[358] ఈశాన్య భారతదేశంలో 6 శతాబ్దాలుగా అహోం రాజ్యం ఒక ప్రధాన శక్తిగా ఉంది.[359][360] లచిత్ బోర్ఫుకన్ నేతృత్వంలో అహోమ్స్ " అహోమ్-మొఘల్ ఘర్షణల " సమయంలో సతీఘాట్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని వంచనతో ఓడించారు.[361] ఈశాన్య భారతదేశంలో, తూర్పు భారతదేశంలో ఉన్న మణిపూరు రాజ్యం కాంగ్లా ఫోర్టును అధికార కేంద్రంగా చేసుకుని పాలించింది. ఇది అధునాతన హిందూ గవుడియా వైష్ణవ సంస్కృతిని అభివృద్ధి చేసింది.

[362][363][364]

ఆరంభకాల ఆధునిక కాలం (సా.శ.1526 – 1858)

భారత చరిత్రలో తొలి ఆధునిక కాలం మొఘల్ వంశ విస్తరణ,పతన కాలంగా ( 1526–1858 CE) పరిగణిస్తారు. ఈ కాలంలో హిందూ, మహమ్మదీయ సాంస్కృతిక కలగలుపుగా భారత-ఇస్లామీయ వాస్తుశిల్పం రూపు దిద్దుకొంది. ;[365][366] మరాఠా సామ్రాజ్యం, సిఖ్ సామ్రాజ్యం విస్తరణ, బ్రిటీషు పరిపాలన ప్రారంభంతో అంతమైంది.[26]

మొఘలు సామ్రాజ్యం

మొఘల్ సామ్రాజ్యం

1526 లో ఫెర్గానా లోయ (ఆధునిక ఉజ్బెకిస్తాన్) నుండి తైమూరు వారసుడైన తైమూరిదు బాబరు, చెంఘిస్ ఖాన్ వారసుడు బాబర్, ఖైబర్ పాస్ గుండా పయనించి వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇందులో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ భాగంగా ఉండేవి.[367] అతని కుమారుడు హుమాయును 1540 లో ఆఫ్ఘన్ యోధుడు షేర్ షా సూరి చేతిలో ఓడిపోయాడు. ఫలితంగా హుమయూన్ కాబూల్ వైపు తిరుగుబాటు చేయవలసి వచ్చింది. షేర్ షా మరణించిన తరువాత అతని కుమారుడు ఇస్లాం షా సూరి, ఆయన హిందూ సైన్యాధ్యక్షుడు హేము విక్రమాదిత్య 1556 లో ఢిల్లీ కేంద్రంగా ఉత్తర భారతదేశంలో లౌకిక పాలనను స్థాపించారు. ఢిల్లీ యుద్ధంలో విజయం సాధించిన తరువాత అక్బర్ దళాలు 1556 నవంబరు 6 న రెండవ పానిపట్టు యుద్ధంలో హేమును ఓడించాయి.

బాబరు మనవడు అయిన గొప్ప చక్రవర్తి అక్బర్ ది గ్రేట్ హిందువులతో మంచి సంబంధాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించాడు. జైనమతం పవిత్ర దినాల్లో అక్బర్ "అమరీ" లేదా జంతువులను చంపకూడదు అని ప్రకటించాడు. అతను ముస్లిమేతరుల కోసం జిజియా పన్నును వెనక్కి తీసుకున్నాడు. మొఘల్ చక్రవర్తులు స్థానిక రాజకుటుంబాలతో వివాహ సంబంధం ఏర్పరుచుకుని స్థానిక మహారాజాలతో రాజకీయ మైత్రిని సాధించాడు. పురాతన భారతీయ శైలులతో వారి టర్కో-పెర్షియన్ సంస్కృతిని అనుసంధానించడానికి ప్రయత్నించాడు. ఇది ఒక ప్రత్యేక ఇండో-పర్షియన్ సంస్కృతి, ఇండో-సార్సెనిక్ నిర్మాణాన్ని సృష్టించింది. అక్బర్ రాజపుత్ర యువరాణి మరీయమ్-జుమానీని వివాహం చేసుకున్నాడు. వారికి జన్మించిన జహంగీర్ రాజ్పుత్, మొగల్ వారసత్వంతో భవిష్యత్తు మొఘల్ చక్రవర్తి అయ్యాడు.[368] జహంగీర్ తన తండ్రి విధానాన్ని అనుసరించాడు. 1600 నాటికి మొఘల్ రాజవంశం భారత ఉపఖండంలో అధిక భాగాన్ని పాలించింది. షాజహాన్ పాలన మొఘల్ నిర్మాణకళకు స్వర్ణ యుగం. ఆయన నిర్మించిన స్మారక కట్టడాలలో అత్యంత ప్రసిద్ధమైన తాజ్ మహల్ (ఆగ్రా), మోతీ మసీదు, (ఆగ్రా), ఎర్ర కోట, జమా మసీదు (ఢిల్లీ), లాహోర్ ఫోర్ట్ ఉన్నాయి.

గుజరాత్ సుల్తానుల మీద విజయానికి గుర్తుగా అక్బర్ నిర్మించిన బులంద్ దర్వాజా.
1856 నుంచి సుమారు 200 ఏళ్ళపాటు ఎర్రకోట మొఘలాయి చక్రవర్తులకు నివాసస్థలంగా వర్ధిల్లింది.[369]

మొఘల్ యుగం "భారతదేశం చివరి స్వర్ణ యుగం"గా పరిగణించబడింది.[370] ఇది భారత ఉపఖండంలో ఉనికిలో ఉన్న రెండవ అతిపెద్ద సామ్రాజ్యంగా ఉంది.[371] ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 24.4% నియత్రిస్తూ చైనాను వెనుకకు నెట్టింది.[372] తయారీలో ప్రపంచ ప్రథమస్థానంలో ఉంది.[373] ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా చైనాను అధిగమించింది. ఇది ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో 25% ఉత్పత్తి చేస్తుంది.[374] మొఘల్ సామ్రాజ్యం చేపట్టిన వ్యవసాయభూముల సంస్కరణలు వ్యవసాయ ఉత్పత్తికి సహకరించాయి.[375] ప్రారిశ్రామిక విధానాల పనితీరు పారిశ్రామిక ఉత్పాదకత అభివృద్ధికి సహకరించింది.[376] అధిక స్థాయి పట్టణీకరణ వైపు మొగ్గుచూపడానికి ఇది దారితీసింది.[370]

మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు పాలనలో ప్రాదేశిక విస్తరణలో అత్యున్నత స్థానానికి చేరుకుంది. శివాజీ క్రింద మరాఠా సైన్యం పునరుజ్జీవనం కారణంగా అతని పాలనలో క్షీణత ప్రారంభమైంది. చరిత్రకారుడు సర్. జె.ఎన్. J.N. శంకరు " అన్ని ఔరంగజేబు సాధించినట్లు కనిపించినప్పటికీ వాస్తవంగా అన్ని పోగొట్టుకున్నాడు " అని వ్రాసాడు.[377] విన్సెంటు స్మిత్ ఈ విధంగా ప్రతిస్పందించాడు: "దక్కను ఔరంగజేబు శరీరానికే కాకుండా అతని సామ్రాజ్యానికి కూడా శ్మశానంగా మరిందని నిరూపించబడింది.[178] ఔరంగజేబ్ భారతదేశపు అత్యంత వివాదాస్పద రాజుగా పరిగణించబడుతున్నాడు.[378] ఆయన తన పూర్వీకుల కన్నా తక్కువ సహనంతో జిజాయా పన్నును పునఃప్రారంభించి అనేక చారిత్రక దేవాలయాలను నాశనం చేసాడు. అదే సమయంలో అతను నాశనం చేసిన దానికంటే ఎక్కువ హిందూ దేవాలయాలను నిర్మించాడు.[379] తన పూర్వీకుల కంటే తన సామ్రాజ్య అధికార పదవులలో హిందువులు అధికంగా ఉన్నారు. సున్ని ముస్లింలు హిందువులు, షియా ముస్లింలకు వ్యతిరేకంగా ధ్వజమెత్తారు.[380] ఏది ఏమయినప్పటికీ తన పూర్వీకుల కంటే అసహనం ప్రదర్శించి సాంప్రదాయం అణచివేతకు, క్రూరత్వం ప్రదర్శిస్తూ, అధికార కేంద్రీకరణను అధికరిస్తూ తరచూ విమర్శలను ఎదుర్కొన్నాడు. పూర్వపు చక్రవర్తుల వలె కాకుండా ఔరంగజేబ్ తరువాత రాజవంశం పతనానికి పెద్ద పాత్ర పోషించి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇది అధిక సంఖ్యలో హిందూ జనాభాను ప్రభావితం చేసింది.

తరువాత సామ్రాజ్యం క్షీణించింది. మరాఠాలు, జాట్లు, ఆఫ్ఘన్ల నుండి ఎదురైన దండయాత్రల కారణంగా మొఘలులు అనేక దెబ్బలను ఎదుర్కొన్నారు. మొఘల్ సామ్రాజ్యం పతనం సమయంలో అనేక చిన్న రాజ్యాలు అధికార శూన్యతను పూరించడానికి ప్రయత్నించి తరుగుదలకు మరింత దోహదపడ్డాయి. 1737 లో మరాఠా సామ్రాజ్యం మరాఠా సైన్యాధ్యక్షుడు బాజిరావ్ ఢిల్లీ మీద దాడి చేసి ఢిల్లీని దోచుకుంది. సైన్యాధ్యక్షుడు అమీర్ ఖాన్ ఉమ్రావ్ అల్ ఉదాత్ నాయకత్వంలో మొఘల్ చక్రవర్తి 5,000 మరాఠా అశ్వికదళ సైనికులను తరమడానికి 8,000 దళాలను పంపించాడు. అయితే బాజీ రావు అనుభవం లేని మొఘల్ సైన్యాన్ని సులభంగా అధిగమించాడు. మిగిలిన సామ్రాజ్య మొఘల్ సైన్యం పారిపోయారు. 1737 లో మొఘల్ సామ్రాజ్యం ఆఖరి ఓటమిలో మొఘల్ సైన్యం కమాండర్-ఇన్-చీఫ్, నిజామ్-ఉల్-ముల్క్, భోపాల్ వద్ద మరాఠా సైన్యం చేతిలో ఓడిపోయాడు. ఇది ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యం ముగిపు అయింది. జాట్ పాలకుడు సూరజ్ మల్ ఆగ్రా వద్ద మొఘల్ సైన్యాలను తరిమికొట్టి నగరాన్ని దోచుకుని తాజ్ మహల్ ప్రవేశం ద్వారంలో ఉన్న రెండు గొప్ప వెండి తలుపులను తమతో తీసుకుని వెళ్ళాడు. తరువాత 1763 లో సూరజ్ మాల్ ఈ తలుపులను కరిగించాడు.[381] 1739 లో ఇరాన్ చక్రవర్తి నాదర్ షాహ్ కర్నాల్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించాడు.[382] ఈ విజయం తర్వాత నాదిర్ షా ఢిల్లీని స్వాధీనం చేసుకుని మయూర సింహాసనంతో సహా అనేక సంపదలను మోసుకెళ్ళాడు.[383]

మొఘల్ పాలనకు నిరంతరం స్థానిక భారతీయ అడ్డగింత కారణంగా సామ్రాజ్యం మరింత బలహీనపడింది. మొఘల్ మతపరమైన అణచివేతకు వ్యతిరేకంగా బండా సింగు బహదూరు సిక్కు ఖల్సాను నడిపించాడు. బెంగాల్ హిందూ రాజులు, ప్రతాపాదిత్య, రాజా సీతరం రే తిరుగుబాటు చేశారు. బుండేలా రాజపుత్రుల మహారాజా చత్రాసాల్, మొఘలులతో పోరాడి పన్న రాజ్యాన్ని స్థాపించాడి.[384] మొఘల్ రాజవంశం 1757 నాటికి తోలుబొమ్మ పాలకులకు పరిమితమైంది. 1762 నాటికి లాహోర్లోని ముస్లిం ప్రాదేశిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో సిక్కులను తుడిచివేయడానికి జరిగింది. ఇందులో 30,000 మంది సిక్కులు చంపబడ్డారు. 1746 లో మొఘలులతో ప్రారంభమైన సిక్కు ధ్వంసం,[385] దాని ముస్లిం వారసుల రాజులు అనేక దశాబ్దాలు కొనసాగించారు.[386] 1857 నాటి భారతీయ తిరుగుబాటు సమయంలో మొఘల్ రాజవంశం అవశేషాలు చివరకు ఓడించబడ్డాయి. దీనిని 1857 స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు. సామ్రాజ్యం అవశేషాలు అధికారికంగా బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు.

మరాఠీ సామ్రాజ్యం

మరాఠా సామ్రాజ్యం

18 వ శతాబ్దం ప్రారంభంలో మరాఠా సామ్రాజ్యం భారతీయ ఉపఖండంలో అత్యంత బలమైన రాజకీయశక్తిగా అభివృద్ధి చెందింది. పేష్వా ఆధీనంలో మరాఠాలు సమైక్యమై దక్షిణాసియాలో అధిక భూభాగాన్ని పాలించారు. మరాఠాలు భారతదేశంలో మొఘల్ పరిపాలనను ముగింపుకు తీసుకువచ్చిన రాజకీయ శక్తిగా గుర్తింపు పొందారు.[387][388][389]

తంజావూరు మరాఠా రాజ్యంలోని తంజావూరు మరాఠా ప్యాలెసు దర్బారు హాలు అంతర్గత నిర్మాణం

మరాఠా సామ్రాజ్యం హిందవి స్వరాజ్య స్థాపనకు నిశ్చయించిన భోంస్లె వంశానికి చెందిన ఛత్రపతి శివాజీచే స్థాపించబడి సంఘటితం చేయబడింది. సర్ జె.ఎన్.సర్కారు శివాజీని "హిందూ జాతి ఉత్పత్తి చేసిన చివరి గొప్ప నిర్మాణాత్మకమైన మేధావి, జాతీయ నిర్మాత "గా వర్ణించాడు.[390] అయితే శివాజీ సోదరసమానుడు వెంకోజీ తంజావూరు మరాఠా రాజ్యాన్ని స్థాపించారు.[391] ఏదేమైనా మరాఠాల బలమైన శక్తిని సంపాదించిన ఘనత జాతీయంగా పేష్వా మొదటి బాజిరావోకు చేరుతుంది. చరిత్రకారుడు కె.కె. మొదటి బాజీరావ్ "మరాఠా సామ్రాజ్యం రెండవ స్థాపకుడిగా పరిగణించబడుతుందని" దత్తా రాశారు.[392]

18 వ శతాబ్దం ప్రారంభంలో మరాఠా ప్రాంతం పేష్వా పాలన (ప్రధాన మంత్రులు)లో సామ్రాజ్యంగా మారింది. 1737 లో మరాఠాలు ఢిల్లీ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించారు. మరాఠాలు మొఘలులు, నిజాం, బెంగాలు నవాబు, దుర్రాని సామ్రాజ్యాల మీద దండెత్తి వారి సరిహద్దులను మరింత విస్తరించడానికి తమ సైనిక పోరాటాలను కొనసాగించారు. 1760 నాటికి మరాఠాల సామ్రాజ్యం భారత ఉపఖండంలో అంతటా విస్తరించింది.[393] మరాఠాలు కూడా మొఘల్ సింహాసనాన్ని నిర్మూలించి, ఢిల్లీలోని మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై విశ్వస్వాష్ పెష్వాను ఉంచడం గురించి చర్చించారు.[394]

సామ్రాజ్యం శిఖరాగ్రానికి చేరుకున్న దశలో దక్షిణప్రాంతంలో తమిళనాడు [395] నుండి ఉత్తరప్రాంతంలో పెషావర్ (ఆధునిక ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, పాకిస్తాన్),[396] [note 3]) తూర్పున బెంగాలు వరకు విస్తరించింది. మూడవ పానిపట్టు యుద్ధం మరాఠాల వాయవ్య విస్తరణ నిలిపివేయబడింది. అయినప్పటికీ పేష్వా మొదటి మాధవరావు ఆధ్వర్యంలో ఉత్తరప్రాంతంలో మరాఠా అధికారం ఒక దశాబ్దంలో తిరిగి స్థాపించబడింది.[398]

గ్వాలియర్ కోటను మరాఠా సైన్యాధ్యక్షుడు మహాదాజీ షిండే (సింధియా) స్వాధీనం చేసుకున్నాడు. తరువాత సింధియాలు మరాఠా సామ్రాజ్యం పాక్షిక స్వతంత్ర గ్వాలియర్ రాజ్యపాలకులుగా మారారు

మొదటి మాధవరావు పాక్షిక స్వయంప్రతిపత్తితో బలమైన వీరులతో మరాఠా రాజ్యాల సమాఖ్య సృష్టించబడింది. సమాఖ్యలో బరోడా గైక్వాడ్సు, ఇండోరు, మాల్వా హోల్కర్సు, గ్వాలియరు, గ్వాలియరు సింధియాలు, నాగపూర్ భోంస్లేలు, ధారు పూరాలు, దేవసు రాజ్యాలు ఉన్నాయి. 1775 లో ఈస్ట్ ఇండియా కంపెనీ పుణెలోని పేష్వా కుటుంబ వారసత్వ పోరాటంలో జోక్యం చేసుకుంది. ఇది మొట్టమొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధానికి దారి తీసింది. యుద్ధంలో మరాఠా విజయం సాధించింది.[399] రెండవ, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధాలు (1805-1818) లో ఓటమి వరకు భారతదేశంలో మరాఠాలు ప్రబలమైన శక్తిగా మిగిలిపోయారు. ఇవి తూర్పు భారతదేశం కంపెనీను భారతదేశం అధిక భాగాన్ని ఈస్టు ఇండియా కంపెనీకి వదిలివేసాయి. గవర్నర్-జనరల్ వ్యవహరించిన చార్లెస్ మెట్క్లాల్, 1806 లో ఈ విధంగా పేర్కొన్నారు:

భారతదేశంలో బ్రిటిషు, మరాఠీ అనే రెండు శక్తులు మాత్రమే ఉన్నాయి. ఇతర రాజ్యాలు అన్నీ ఈ రెండింటిలో ఒకదాని ఆధీనంలో ఉన్నాయి. మేము వెనుకకు తీసుకున్న ప్రతి అంగుళం భూమిని మరాఠీలు స్వాధీనం చేసుకున్నారు.[400][401]

1660 నాటికి మరాఠాలు కూడా ఒక శక్తివంతమైన నౌకాదళాన్ని అభివృద్ధి చేశాయి. ఇది భారతదేశ పశ్చిమ తీరప్రాంత భూభాగ ప్రాంతంలో ముంబాయి నుండి సావంత్వాడి వరకు ఆక్రమించింది.[402] కొంతకాలం పాటు మరాఠా నావికాదళం బంగాళాఖాతం లోని అండమాను ద్వీపాలలో కూడా స్థావరాన్ని స్థాపించింది.[403] ఇది బ్రిటీషు, పోర్చుగీసు, డచ్చి, సిద్దీ నౌకాదళ ఓడలను దాడి చేస్తూ వారి నౌకాదళ లక్ష్యాలను పరిశీలించేది. 1730 నాటికి మరాఠా నౌకా దళం ఆధిపత్యంతో కొనసాగి 1770 నాటికి క్షీణించిన స్థితికి చేరి 1818 నాటికి నిలిచిపోయింది.[404]

సిక్కు సామ్రాజ్యం

రంజిత్ సింగ్ పాలనలోని సిక్కు సామ్రాజ్యం
హరమందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) సిక్కుల ప్రముఖ దేవాలయం.1809 లో మహారాజ రంజితి సింగ్ హరమందిర్ సాహిబ్ చలువరాయి, రాగితో మరల నిర్మించాడు. గర్భగోపురానిపై బంగారుతొడుగు 1830లో చేర్చారు. [405]
1835 లో,మహారాజ రంజిత్ సింగ్ కాశీ విశ్వనాధ ఆలయ గోపురానికి బంగారు తొడుగు కొరకు ఒకటన్ను బరువుగల బంగారాన్ని కానుకగా ఇచ్చాడు.[406][407]

భారత ఉపఖండంలోని వాయవ్య ప్రాంతాలను పాలించే ఒక రాజకీయ సంస్థగా సిక్కు మతం సభ్యులు పాలించిన సిక్కు సామ్రాజ్యం అభివృద్ధి చెందింది. పంజాబు ప్రాంతం మీద ఆధారపడిన సామ్రాజ్యం 1799 - 1849 వరకు ఉనికిలో ఉంది. ఇది స్వతంత్రప్రతిపత్తి కలిగిన పంజాబీ మిలిస్ మహారాజా రంజిత్ సింగ్ (1780-1839) నాయకత్వంలో ఖల్సా కేంద్రంగా అభివృద్ధి చేయబడింది.

మహారాజా రంజిత్ సింగ్ ఉత్తర భారతదేశం అనేక భాగాలను సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. ఆయన ప్రాథమికంగా తన సిక్కు ఖల్సా సైన్యాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన ఐరోపా సైనిక విధానంలో శిక్షణ పొంది ఆధునిక సైనిక సాంకేతిక పరిజ్ఞానాలను కలిగి ఉన్నాడు. రంజిత్ సింగు తనను తాను ఒక మాస్టర్ వ్యూహాకర్తగా నిరూపించుకున్నాడు. తన సైన్యానికి బాగా అర్హత గల అధికారిగా ఎన్నిక చేయబడ్డాడు. అతను నిరంతరంగా ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించి ఆఫ్ఘగనిస్తాన్-సిక్కు యుద్ధాలను విజయవంతంగా ముగించాడు. ఆయన పంజాబ్, ముల్తాన్, కాశ్మీర్ రాజ్యాలు, పెషావర్ లోయలను తన సామ్రాజ్యంలో చేర్చాడు.[408][409]

19 వ శతాబ్దంలో పశ్చిమప్రాంతంలో ఖైబర్ పాస్ నుండి, ఉత్తరప్రాంతంలో కాశ్మీర్ వరకు, దక్షిణప్రాంతంలో సింధు వరకు, తూర్పుప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ సట్లేజ్ నది వరకు సామ్రాజ్యం విస్తరించింది. రంజిత్ సింగు మరణం తరువాత సామ్రాజ్యం బలహీనపడడం బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీతో సంఘర్షణలకు దారి తీసింది. తీవ్రంగా సాగిన మొట్టమొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం, రెండవ ఆంగ్లో-సిక్కు యుద్ధం సిక్కు సామ్రాజ్యం పతనానికి దారితీసింది. ఇది భారత ఉపఖండంలో బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్న చివరి ప్రాంతం ఇదే.

అమృత్ సర్, పంజాబులో అకల్ తఖ్త్, స్వర్ణ దేవాలయం దగ్గర గురు గ్రంథ సాహిబ్ ను ఆలకిస్తున్న మహారాజ రంజిత్ సింగ్ .

ఇతర రాజ్యాలు

మైసూరు సైన్యం బ్రిటీషు సేనలతో మైసూరు రాకెట్లతో యుద్ధం చేస్తున్న చిత్రం.[410]

బ్రిటీషు ఆక్రమణకు పూర్వం మధ్యయుగ ద్వితీయార్ధంలో భారతభూభాగాలను అనేక ఇతర రాజ్యాలు పాలించాయి. వారిలో చాలామంది మరాఠాలకు కప్పం చెల్లించారు.[393]

సుమారు 1400 లో దక్షిణ భారతదేశంలో వడయార్ రాజవంశపాలకుడు మైసూర్ రాజ్యాన్ని స్థాపించాడు. 18 వ శతాబ్దపు చివరి భాగంలో హైదర్ ఆలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్ కారణంగా మైసూరు రాజ్యపాలనకు అంతరాయం కలిగింది. వారి పాలనలో మైసూరు వీరులు మరాఠాలు, బ్రిటీషు, వారి మిశ్రమ దళాలతో వరుస యుద్ధాలలో పోరాడారు. 1787 ఏప్రెలులో మరాఠా-మైసూరు యుద్ధం ఏప్రిల్ గజేంద్రాగాడ్ ఒప్పందం ఆధారంగా టిప్పు సుల్తాన్ మరాఠాలకు కప్పం చెల్లించే బాధ్యత వహించడంతో మైసూరు - మరాఠీ యుద్ధం ముగిసింది. ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో మైసూరు వీరులు మైసూర్ రాకెట్లు ఉపయోగించారు. నాలుగో ఆంగ్లో-మైసూరు యుద్ధంలో (1798-1799) టిప్పు సుల్తాను మరణం మైసూరు భూభాగం మరింత క్షీణదశకు దారితీసింది. ఫ్రెంచితో మైసూరు పొత్తును బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ముప్పుగా భావించి నాలుగు వైపుల నుండి మైసూరు మీద దాడి చేశారు. హైదరాబాదు నిజాం, మరాఠాలు ఉత్తరం నుండి దండయాత్రను ప్రారంభించారు. బ్రిటీష్ శ్రీరంగపట్నం (1799) లో నిర్ణయాత్మక విజయం సాధించింది. నగరం రక్షణ సమయంలో టిప్పు చంపబడ్డాడు. మిగతా మైసూరు భూభాగం బ్రిటీషు నిజాం, మరాఠాలు భూభాగాలలో కలపబడింది. మైసూరు, శ్రీరంగపట్నం మిగిలిన ప్రాంతాన్ని ఉడయారు రాజవంశంకి చెందిన రాజకుటుంబం చేత పునరుద్ధరించబడింది. వాస్తవానికి హైదర్ ఆలీ పాలకుడు కావడానికి ముందు వీరి పూర్వీకులు అసలు పాలకులుగా ఉన్నారు. 1799 లో మైసూర్ రాజ్యం బ్రిటిష్ ఇండియా రాచరిక రాజ్యంగా మారింది.

సెయింట్ పీటర్స్ బర్గ్ లోని హెర్మిటేజ్ ప్రదర్శనశాలో 18వ శతాబ్దపు తొలికాలంనాటి మరాఠా శిరస్త్రాణం, శరీర కవచం.

1591 లో గోల్కొండ కుతుబ్ షాహి వంశీయులచే హైదరాబాదు స్థాపించబడింది. ఒక సంక్షిప్త మొఘల్ పాలన తరువాత మొఘలు అధికారి అయిన ఆసిఫ్ జాహ్ హైదరాబాదు నియంత్రణను స్వాధీనం చేసుకుని 1724 లో హైదరాబాదులో నిజామ్-అల్-ముల్కుగా ప్రకటించాడు. పాలఖాడు యుద్ధం వంటి అనేక యుద్ధాల కారణంగా తిరోగమించిన తరువాత నిజాంలు గణనీయమైన భూభాగాన్ని కోల్పోయి మరాఠీ సామ్రాజ్యానికి కప్పం చెల్లించారు.[411] ఏదేమైనా మరాఠాలకు కప్పం కట్టడం ద్వారా తరువాత బ్రిటిషు వారికి సామంతరాజులుగా ఉండి 1724 నుండి 1948 వరకు నిజాములు తమ సార్వభౌమత్వాన్ని నిలుపుకున్నారు. హైదరాబాదు రాజ్యం బ్రిటీష్ ఇండియాలో 1798 లో రాచరిక రాజ్యంగాగా మారింది.

మొఘలు సామ్రాజ్య పతనం తరువాత బెంగాలు నవాబులు బెంగాలు పాలకులుగా మారారు. అయినప్పటికీ బెంగాల్లోని 1741 నుండి 1748 మరాఠీలు వరకు 6 దాడులు నిర్వహించిన వారి స్వతంత్ర పాలనకు అంతరాయం కలిగి ఫలితంగా బెంగాలు మరాఠీల సామంత రాజ్యంగా మారింది. 1757 జూను 23 న బెంగాలు చివరి స్వతంత్ర నవాబ్ సిరాజ్ ఉద్-దౌలా మీర్ జాఫర్ చే ప్లాస్సీ యుద్ధంలో మీరు ఫాహిరు చేత మోసగించబడ్డాడు. ఆయన 1757 లో బ్రిటిషు చేతిలో ఓడిపోయిన తరువాత బెంగాలు బాధ్యతను బ్రిటీషు ప్రభుత్వం చేపట్టి మీరు జాఫరును మస్నాదు (సింహాసనం) లో నియమించి బెంగాలులో తమ రాజకీయ శక్తిని స్థాపించింది.[412] 1765 లో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ స్థాపించబడింది. ఫలితంగా నవాబులు బ్రిటీషు తరపున పాలిస్తూ బ్రిటీషువారికి తోలుబొమ్మలుగా మారారు. 1772 లో ఈ వ్యవస్థ రద్దుచేయబడి బెంగాలును బ్రిటీషువారి ప్రత్యక్ష నియంత్రణలో ఉంచింది. 1793 లో నవాబు నిజామాత్ (పాలనాధికారి) కూడా వారి నుండి తీసివేయబడిన తరువాత వారు బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ పెన్షనర్లుగా మాత్రమే ఉన్నారు.[413][414]

18 వ శతాబ్దంలో రాజపుతానా మొత్తం మరాఠాల చేత నియంత్రించబడింది. రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం (1807 నుండి 1809) వరకు మరాఠాలు దృష్టి యుద్ధంమీద కేద్రీకరించిన తరువాత రాజపుతానా మీద మరాఠా ఆధిపత్యాన్ని తిరిగి ప్రారంభం అయింది. 1817 లో మరాఠా భూభాగంలో నివసించే పిండారీల మీద యుద్ధానికి బ్రిటీషువారు యుద్ధానికి వెళ్ళడంతో అది మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం అయింది. బ్రిటీషు ప్రభుత్వం పిండారీలు, మరాఠాల నుండి రాజపుత్ర పాలకులకు తమ రక్షణను అందించింది. 1818 చివరి నాటికి ఇతర రాజపుత్ర రాజ్యాలు, బ్రిటన్ల మధ్య ఇలాంటి ఒప్పందాలు జరిగాయి. గ్వాలియరు మరాఠా సింధియా పాలకుడు బ్రిటీష్కు అజ్మీర్-మెర్వరా జిల్లాను విడిచిపెట్టడంతో రాజస్థానులో మరాఠా ప్రభావం ముగిసింది.[415] 1857 తిరుగుబాటులో బ్రిటనుకు చాలా మంది రాజపుత్రులు విశ్వసనీయంగా ఉన్నారు. 1947 లో భారత స్వాతంత్రం వరకు రాజపుతానాలో కొన్ని రాజకీయ మార్పులు చేయబడ్డాయి. రాజపుత్రా ఏజెన్సీలో 20 రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో చాలా ముఖ్యమైనవి ఉదయపూరు రాజ్యం, జైపూరు రాజ్యం, బికానెరు రాజ్యం, జోధ్పూరు రాజ్యం ఉన్నాయి.

మరాఠా సామ్రాజ్యం పతనం తరువాత అనేక మరాఠా రాజ్యాలు బ్రిటీషువారి అనుబంధ కూటమిలో సామతరాజ్యాలుగా అవతరించాయి. ఇవి జనాభా ప్రాతిపదికగా బ్రిటీషు రాజులో అతిపెద్ద భూభాగంగా ఏర్పడ్డాయి.[416] 1846 లో మొట్టమొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం తరువాత అమృతసర్ ఒప్పందం ప్రకారం బ్రిటీషు ప్రభుత్వం కాశ్మీరును మహారాజా గులాబు సింగుకు జమ్మూ-కాశ్మీరును విక్రయించడంతో జమ్మూ కాశ్మీరు రాజ్యం బ్రిటిషు రాజు ప్రభుత్వంలో అతిపెద్ద రాచరిక రాజ్యాలలో ద్వితీయ స్థానంలో నిలిచింది. బ్రిటిష్ ఇండియాలో డోగ్ర రాజవంశం సృష్టించబడింది.[417][418] తూర్పు, ఈశాన్య భారతదేశంలో హిందూ, బౌద్ధ కూచ్ బెహార్ రాజ్యాలలోని త్రిప్ర రాజ్యం, సిక్కిం రాజ్యాలను బ్రిటీషు వారు స్వాధీనం చేసుకుని సామంతరాజ్యాలుగా చేసుకున్నారు.

విజయనగరసామ్రాజ్యం పతనం తరువాత దక్షిణభారతంలో పాలెగార్ల రాజ్యం తలెత్తింది. అది పాలెగార్ల యుద్ధంలో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీతో పోరాడి ఓడిపోయే వరకు దాడులను ఎదుర్కొంటూ సుసంపన్నంగా ఉంది.[419] 18 వ శతాబ్దంలో రాజపుత్రులు నేపాలు రాజ్యం స్థాపించారు.[420]

ఆరంభకాల ఆధునిక భారతీయ వ్యాపారులు

బాకు యెక్క అతేషగరు
అతేషగరు వద్ద సంస్కృత లిపిలో శివ ప్రార్ధన శాసనం
అతేషగరు వద్ద పంజాబీలో ఆది గ్రంథానికి ఒక లిఖిత ప్రార్థన.
అట్తాగర్ 1745 లో భారతదేశ వ్యాపారులచే నిర్మించబడిన ఆలయం ఇది కాస్పియన్ సముద్రం పశ్చిమాన ఉంది..

14 - 18 వ శతాబ్దాల మద్యకాలంలో పశ్చిమ ఆసియా, తూర్పు ఐరోపాకు చెందిన ఆధునిక భారతీయ వ్యాపారులు చురుకుగా ఉన్నారు. [421][422][423] అజర్‌బైజాన్కు చెందిన బాకు శివారు ప్రాంతం అయిన ఈ కాలంలో భారతీయ వర్తకులు సురాఖానిలో స్థిరపడ్డారు. ఈ వర్తకులు ఇక్కడ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఇది వాణిజ్యం చురుకుగా ఉండి 17 వ శతాబ్దం నాటికి భారతీయుల సంపన్నతను తెలియజేస్తుంది.[424][425][426][427]

ఉత్తర సరిహద్దులో సౌరాష్ట్ర, బెంగాలు తీరాలు సముద్ర వాణిజ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. గంగా మైదానాలు, సింధు లోయ ప్రాంతాలలో అనేక వాణిజ్య అనేక కేంద్రాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తానుతో పాటు మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా ప్రాంతంతో పంజాబు ప్రాంతాన్ని కలిపే ఖైబర్ పాస్ ద్వారా చాలా భూభాగ వాణిజ్యం జరిగింది.[428] పలు రాజ్యాలు, రాజులు నాణాలను చెలామణి చేసినప్పటికీ బార్టరుకు ప్రాధాన్యత ఉండేది. వ్యవసాయదారులు వారి వ్యవసాయ ఉత్పత్తులలో కొంత భాగం ప్రభుత్వానికి సుంకంగా చెల్లించేవారు. పంట సమయంలో పనివారు పండిన పంటలో కొంతభాగం అందుకునేవారు.[429]

యురేపియన్ల అంవేషణ, కాలనీ పాలన

పశ్చిమ దేశాల అంవేషకులు, వ్యాపారులు

1498 లో వాస్కో డా గామా ఆధ్వర్యంలో పోర్చుగీసు బృందం ఐరోపా నుండి భారతదేశానికి ఒక కొత్త సముద్ర మార్గాన్ని విజయవంతంగా కనుగొన్నది. అది ప్రత్యక్ష ఇండో-యూరోపియన్ వాణిజ్యానికి మార్గం సుగమం చేసింది. పోర్చుగీసు త్వరలో గోవా, డామన్, డయ్యు, బొంబాయిలలో వాణిజ్య స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. 1961 లో భారతదేశానికి స్వాధీనం అయ్యే వరకు గోవా ప్రధాన పోర్చుగీసు స్థావరంగా మారింది.[430]

తరువాత శ్రీలంకలో వారి ప్రధాన స్థావరం ఉన్న డచ్చి వారు వచ్చారు. వారు మలబార్లో ఓడరేవులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కోలచెల్ యుద్ధంలో ట్రావెకోర్క్ సామ్రాజ్యం వారిని ఓడించిన తరువాత భారతదేశంలో వారి విస్తరణ నిలిచిపోయింది. డచ్చి ఓటమి నుండి కోలుకోలేదు. అది భారతదేశానికి పెద్ద కాలనీల భీతిని కలిగించలేదు.[431][432] ప్రఖ్యాత చరిత్రకారుడు " ఎ.శ్రీధర మేనన్ " మాటలలో:

డచ్చి మొదటి విపత్తు, కోల్చెల్ యుద్ధం కేరళను జయించిన వారి కలలన్నింటికీ కలత చెందించింది.

భారతీయ రాజ్యాల మధ్య అంతర్గత విభేదాలు క్రమంగా రాజకీయ ప్రభావాన్ని, తగిన భూములను స్థాపించడానికి యూరోపియన్ వ్యాపారులకు అవకాశాలు కల్పించాయి. 1619 లో డచ్చిని అనుసరించి బ్రిటిషు - సూరత్ పశ్చిమ తీర నౌకాశ్రయం స్థాపించింది. ఫ్రెంచి వారు భారతదేశంలో రెండు వాణిజ్య స్థావరాలను ఏర్పాటు చేశారు. తరువాత ఈ ఖండాంతర ఐరోపా శక్తులు దక్షిణ, తూర్పు భారతదేశంలోని అనేక తీర ప్రాంతాలను తరువాత శతాబ్దంలో నియంత్రించగలిగినప్పటికీ చివరికి వారు భారతదేశంలో పోండిచేరి, చందరునాగోరు మినహా మిగిలిన తమ భూభాగాలను బ్రిటీషువారి ఆధీనంలోకి వదిలారు.[433][434] ఫ్రెంచి సైనికులు గోవా, డామన్, డయ్యూ పోర్చుగీసు కాలనీలు కూడా మినహాయించబడ్డాయి.[435]

బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ పాలన, విస్తరణ

ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో భారతదేశం
1765, 1805 లలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ప్రాంతాలు (గులాబీ రంగులో)
1837, 1857 లలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ప్రాంతాలు (గులాబీ రంగులో) , ఇతర ప్రాంతాలు

1617 లో భారతదేశంలో వాణిజ్యానికి మొఘల్ చక్రవర్తి జహంగీర్ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతినిచ్చారు.[437] క్రమంగా వారి పెరుగుతున్న ప్రభావం 1717 లో బెంగాలులో పన్ను-రహిత వాణిజ్యం చేయడానికి వారికి ముస్లిం చక్రవర్తి ఫరూఖ్ సయారు దస్తావేజులు రూపమ్లో అనుమతి ఇవ్వటానికి దారితీసింది.[438]

బెంగాలు రాష్ట్రంలోని పాలకుడు సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిషు ఈ అనుమతిలను ఉపయోగించడానికి చేసిన ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఇది 1757 జూను 23 న ప్లాస్సీ యుద్ధానికి దారి తీసింది. దీనిలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాలు సైన్యం ఫ్రెంచి-మద్దతు గల నవాబు దళాలను ఓడించింది. ప్రాదేశిక పరిణామాలతో భారతదేశంలో బ్రిటీష్వారు స్వాధీనం చేసుకున్న మొట్టమొదటి నిజమైన రాజకీయ స్థావరం ఇది. 1757 లో క్లైవ్ దాని మొట్టమొదటి 'బెంగాలు గవర్నర్' గా నియమించబడ్డాడు.[439] మద్రాసు, వందవాసి, పాండిచెరీలలో ఫ్రెంచి మీద బ్రిటీషు విజయాలతో కలిపి సెవెన్ ఇయర్స్ వార్‌లో బ్రిటీష్ విజయాలతో భారతదేశంలో ఫ్రెంచి ప్రభావం తగ్గింది. బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ బెంగాలు మొత్తం మీద తన నియంత్రణను విస్తరించింది. 1764 లో బుక్సారు యుద్ధం తరువాత బెంగాలులోని జుర్ మొఘల్ చక్రవర్తి షా రెండవ ఆలం నుండి పరిపాలనా హక్కులను కంపెనీ సొంతం చేసుకుంది. ఇది తరువాతి శతాబ్దంలో భారతదేశంలో ఎక్కువ భాగాన్ని బ్రిటిషు ఈ స్టిండియా కంపెనీ స్వాహాచేయడానికి సంకేతంగా మిగిలింది.[440] బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ బెంగాలు వర్తక గుత్తాధిపత్యం చేసింది. వారు బెంగాలులో శాశ్వత స్థావరాలు పేరిట భూస్వామ్య-సుంకం వ్యవస్థ ప్రవేశపెట్టి తులూకాదార్లు, జమీందార్లను ఏర్పాటు చేశారు.

3 కర్నాటకా యుద్ధాల ఫలితంగా బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ కర్నాటకా ప్రాంతం అంతటి మీద నియంత్రణ సాధించింది.[441] కంపెనీ వెంటనే బొంబాయి, మద్రాసులలో దాని స్థావరాలను విస్తరించింది. ఆంగ్లో-మైసూరు యుద్ధాలు (1766-1799), ఆ తరువాత ఆంగ్లో-మరాఠా యుద్ధాలు (1772-1818) భారతదేశం విస్తార ప్రాంతాల నియంత్రణకు దారి తీసింది. ఈశాన్య భారతదేశం అహోం సామ్రాజ్యం మొదట బర్మీసు దండయాత్రతో క్షీణదశకు చేరుకుని తరువాత 1826 లో యండోబో ఒప్పందం తరువాత బ్రిటీషు ఆధీనంలోకి వచ్చింది. ఏకకాలంలో బర్మా దండయాత్రలు మణిపూర్ రాజ్యాన్ని 1824 లో బ్రిటీషు కోరడానికి ప్రేరణ కలిగించాయి. అయినప్పటికీ 1891 లో ఆంగ్లో-మణిపూర్ యుద్ధం తరువాత మణిపూరు బ్రిటిషు సామ్రాజ్యంలో భాగం అయింది.[436]

1849 లో రెండవ ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత పంజాబు, వాయవ్య సరిహద్దు ప్రాంతం, కాశ్మీర్లను స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్ వెంటనే అమృత్సర్ ఒప్పందం కింద జమ్మూలోని డోగ్రా రాచరికానికి విక్రయించబడి రాచరిక రాజ్యంగా మారింది. నేపాలు, బ్రిటిషు మధ్య సరిహద్దు వివాదం, 1801 తర్వాత తీవ్రమై 1814-16 నాటి ఆంగ్లో-నేపాలు యుద్ధం గుర్ఖాల ఓటమితో ముసింది. 1854 లో బెరారు అనుసంధానించబడింది. రెండు సంవత్సరాల తరువాత ఓద్ద్ రాజ్యం చేర్చబడింది.

19 వ శతాబ్దం ప్రారంభంలో గవర్నర్-జనరల్ రిచర్డ్ వెల్లెస్లీ రెండు దశాబ్దాలపాటు సంస్థ భూభాగాల విస్తరణ వేగంపుంజుకుంది.[442] ఇది సంస్థ, స్థానిక పాలకులు లేదా ప్రత్యక్ష సైనిక అనుబంధం మధ్య పొత్తుల ద్వారా సాధించబడింది. అనుబంధ కూటములు హిందూ మహారాజాల, ముస్లిం నవాబుల రాచరిక రాజ్యాలను సృష్టించాయి.

1850 ల నాటికి, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత ఉపఖండంలో అధికభాగాన్ని నియంత్రించింది. వారి విధానాలు కొన్నిసార్లు విభజించి పాలించు విధానంగా పరిగణించబడింది. వివిధ రాచరిక రాజ్యాలు, సాంఘిక, మత సమూహాల మధ్య శత్రుత్వం అభివృద్ధి చేయబడింది.[443]

భారతీయ ఒప్పంద కూలీ విధానం

భారతీయ ఒప్పంద కూలీ విధానం ఒక రుణ బానిసత్వం. దీని ద్వారా 3.5 మిలియన్ల మంది భారతీయులు (ముఖ్యంగా చెరకు) తోటల కోసం కార్మికులను ఐరోపా శక్తుల వివిధ కాలనీలకు రవాణా చేశారు. ఇది 1833 లో ప్రపంచవ్యాప్తంగా బానిసత్వం రద్దైన తరువాత ప్రారంభించి 1920 వరకు కొనసాగింది. ఇది భారతీయ మహాసముద్రం (అనగా రియూనియన్, మారిషస్) నుండి పసిఫిక్ మహాసముద్రం (అంటే ఫిజి) వరకు వ్యాపించింది. ఇది అలాగే పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయ అభివృద్ధికి దారితీసింది. ఇండో-కరేబియన్, ఇండో-ఆఫ్రికన్ జనాభాను అభివృద్ధి చేసింది.

ఆధునిక కాలం, స్వతంత్రం (సా.శ. 1850 తరువాత)

సిపాయీల తిరుగుబాటు 1857, పర్యవసానం

1857 లో బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ పాలనకి వ్యతిరేకంగా ఉత్తర, మధ్య భారతదేశంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది. స్పార్క్ ఎన్ఫీల్డ్ రైఫిల్ కోసం కొత్త గన్పౌడర్ కార్ట్రిడ్జి సమస్య తిరుగుబాటుకు దారితీసిన చెప్పవచ్చు. ఇది స్థానిక మతపరమైన నిషేధంగా భావించబడింది. మంగాల్ పాండే ఇందులో కీలకపాత్ర ధరించాడు.[444] అంతేకాక బ్రిటీషు పన్నుల మీద ఆధారపడిన ఆందోళనలు, బ్రిటీషు అధికారులు, వారి భారతీయ దళాల మధ్య అధికమైన జాతి అఖాతం, భూభాగ విలీనాలు తిరుగుబాటులో ముఖ్యమైన పాత్ర పోషించాయి. పాండే తిరుగుబాటు తరువాత కొన్ని వారాలలో తిరుగుబాటులో భాగంగా భారత సైన్యం డజన్ల సంఖ్యలో రైతు సైన్యాల్లో చేరడంతో తిరుగుబాటు దేశవ్యాప్తం అయింది. సైనికులు తరువాత భారతీయ ప్రముఖులకు మద్దతు ఇచ్చారు. వీరిలో చాలామంది " డాక్టర్ ఆఫ్ లాప్సు " ద్వారా శీర్షికలు, పదవులు కోల్పోయారు. కంపెనీ సంప్రదాయ వారసత్వ వ్యవస్థతో జోక్యం చేసుకుందని భావించారు. నానా సాహిబు, ఝాన్సీ రాణి వంటి తిరుగుబాటు నాయకత్వం వహించారు.[445]

మీరట్లో తిరుగుబాటు ప్రారంభం అయిన తరువాత తిరుగుబాటుదారులు చాలా త్వరగా ఢిల్లీకి చేరుకున్నారు. తిరుగుబాటుదారులు వాయవ్య భూభాగాలు, అవధ్ (ఔద్) మార్గాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా అవధ్‌లో తిరుగుబాటు బ్రిటీషు ఉనికికి వ్యతిరేకంగా దేశభక్తి లక్షణాలను తీసుకువచ్చింది.[446] బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ స్నేహపూర్వక రాజ్యాలలో సహాయంతో తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రయత్నించింది. 1857 లో మొదలైన తిరుగుబాటు అణిచివేత 1858 వరకు కొనసాగింది. తిరుగుబాటుదారులు పేలవమైన ఆయుధాలను కలిగి ఉండటం వెలుపల మద్దతు లేదా నిధుల కారణంగా వారిని బ్రిటీషు వారు దారుణంగా స్వాధీనం చేసుకున్నారు.[447]

అనంతరం బ్రిటీషు ఈస్టు ఇండియా కంపెనీ నుండి బ్రిటీష్ క్రౌన్కు అన్ని అధికారాలు బదిలీ అయ్యాయి. ఇది భారతదేశాన్ని అనేక రాజ్యభాగాలుగా విభజించి పాలించడానికి దారితీసింది. కింగ్డమ్ సంస్థ భూములను ప్రత్యక్షంగా నియంత్రించింది. భారతదేశంలోని ఇతర ప్రాంతాలపై గణనీయమైన పరోక్ష ప్రభావాన్ని చూపింది. రాజవంశ రాజ కుటుంబాలచే పాలించబడే రాజస్థాన్ రాజ్యాలు ఇందులో భాగం అయ్యాయి. 1947 నాటికి అధికారికంగా 565 రాచరిక రాజ్యాలు ఉన్నాయి. అయితే కేవలం 21 రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో మైసూర్, హైదరాబాదు, కాశ్మీరు మూడు మాత్రమే పెద్ద రాజ్యాలు ఉన్నాయి. ఇవి అన్నీ 1947-48లో స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయబడ్డాయి.[448]

బ్రిటిషు రాజు (సా.శ. 1858 – 1947)

బ్రిటీషు రాజ్యము

1857 తర్వాత వలసరాజ్య ప్రభుత్వం కోర్టు వ్యవస్థ, చట్టపరమైన ప్రక్రియలు, శాసనాల ద్వారా న్యాయవ్యస్థలో సరికొత్త విధానాలు ప్రవేశపెట్టింది. ఇది ఇండియన్ పీనల్ కోడ్ అయ్యింది.[449] 1835 ఫిబ్రవరిలో విద్యావిధానంలో థామస్ బాబింగ్టన్ మకాలే రాజులో విద్యకుప్రాధాన్యం ఇచ్చి బోధన మాధ్యమంగా ఇంగ్లీష్ ఉపయోగించే విధానం అమలు చేయడంలో విజయం సాధించారు. 1890 నాటికి దాదాపు 60,000 మంది భారతీయులు మెట్రిక్యులేట్ చేశారు.[450] 1880 నుండి 1920 వరకు భారతీయ ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 1% అధికరించింది. జనాభా కూడా 1% అధికరించింది. 1910 నుండి భారత ప్రైవేట్ పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందింది. 19 వ శతాబ్దం చివరలో భారతదేశం ఆధునిక రైల్వే వ్యవస్థను నిర్మించింది. ఇది ప్రపంచ రల్వే వ్యవస్థలలో 4 వ స్థానంలో ఉంది.[451] [455] రైల్వేలు, తంతి తపాలా, రోడ్లు, ఓడరేవులతో పాటుగా కాలువలు, నీటిపారుదల వ్యవస్థలతో సహా బ్రిటీష్ రాజ్ మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టింది.[452] చరిత్రకారులు ఆర్థిక చరిత్ర విషయంలో తీవ్రంగా అభిప్రాయపంగా విభజింపబడ్డారు. బ్రిటిషు రాజు పాలన ప్రారంభం కంటే బ్రిటీషు పాలన చివరిలో భారతదేశం పేదదేశంగా మారిందని, బ్రిటీషు కారణంగా ఈ దారిద్య్రం ఏర్పడిందని " నేషనలిస్టు స్కూలు " వాదించింది.[453]

న్యూఢిల్లీలో బ్రిటిష్ వైస్రాయ్ కొరకు నిర్మించిన రాష్టప్రతి భవనం ఇది ప్రస్తుత రాష్ట్రపతి నివాసంగా ఉంది.

1905 లో లార్డ్ కెర్జోన్ అతి పెద్ద బెంగాలు ప్రావింసును హిందూ ఆధిక్యత కలిగిన పశ్చిమ భాగాన్ని పశ్చిమ బెంగాలుగా, ముస్లిం ఆధిక్యత కలిగిన తూర్పు భూభాగాన్ని "తూర్పు బెంగాలు, అస్సాం"గా విభజించాడు. సమర్ధమైన పాలనా యంత్రాంగంగా మార్చడం బ్రిటిషు లక్ష్యంగా చెప్పబడినప్పటికీ ఇది విభజించి పాలించడం వ్యూహంలో చేయబడిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. వ్యవస్థీకృత వలసవాద వ్యతిరేక ఉద్యమానికి ఇది ప్రారంభమైంది. బ్రిటనులో లిబరల్ పార్టీ 1906 లో అధికారంలోకి వచ్చిన తరువాత లార్డు కెర్టోన్ తొలగించబడ్డాడు. 1911 లో బెంగాలును తిరిగి సమైక్యం చేశారు. కొత్త వైస్రాయి గిల్బర్టు మింటో, భారత విదేశాంగ కార్యదర్శి జాన్ మార్లే రాజకీయ సంస్కరణ గురించి కాంగ్రెసు నాయకులతో సంప్రదించాడు. 1909 మోర్లీ-మినో సంస్కరణలు ప్రావిన్షియల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్సు భారతీయ సభ్యత్వం కొరకు వైస్రాయి కార్యనిర్వాహక మండలికి అందించబడ్డాయి. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిలు 25 నుండి 60 మంది సభ్యుల వరకు విస్తరించబడింది. ముస్లింల కోసం ప్రత్యేకమైన మతపరమైన ప్రాతినిధ్యం ఏర్పాటు చేయబడింది. [454] ఆ సమయంలో అనేక సామాజిక-మతపరమైన సంస్థలురావడం మొదలైంది. 1906 లో ముస్లింలు ఆల్ ఇండియా ముస్లిం లీగును స్థాపించారు. ఇది ఒక సామూహిక పార్టీగా కాకుండా అది కులీన ముస్లింల ప్రయోజనాలను కాపాడటానికి రూపొందించబడింది. ఇది ఇస్లాం, బ్రిటీషు, భారతదేశం, హిందువుల అవిశ్వాసంతో విరుద్ధమైన భావజాలంతో అంతర్గతంగా విభజించబడింది.[455] అఖిల భారతీయ హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) హిందూ అభిరుచులకు ప్రాతినిధ్యం వహించాయి. అయితే తరువాతి కాలంలో అది "సాంస్కృతిక" సంస్థగా పేర్కొంది.[456] 1920 లో సిక్కులు షిరోమణి అకాలీ దళును స్థాపించారు.[457] 1885 లో స్థాపించబడిన అతి పెద్ద, పురాతన రాజకీయ పార్టీ " ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ". ఇది సామాజిక-మత ఉద్యమాలు, గుర్తింపు రాజకీయాల దూరంగా ఉండటానికి ప్రయత్నించింది.[458]

హిందువులు తిరుగుబాటు

హిందూ పునరుద్ధరణ [464][465][466] 10-20 వ శతాబ్ధాలలో బ్రిటిషు పరిపాలనను అధిగమించి బెంగాలీ హిందువులు ఆధిపత్యం వహించిన భారత ఉపఖండంలోని బెంగాలు ప్రాంతంలో ఒక సాంఘిక సంస్కరణ ఉద్యమం కొనసాగినట్లు భావిస్తున్నారు. హిందూ పునరుద్ధరణ రాజా రామ్ మోహన్ రాయ్ (1772-1833) తో మొదలై రవీంద్రనాథ్ ఠాగూర్ (1861-1941) తో ముగిసింది. ఈ ప్రాంతం మేధోపరమైన, సృజనాత్మక కలిగిన వ్యక్తులు పరంపర కొనసాగిందని చాలామంది నిపుణులు అంగీకరిస్తున్నారు.[464] 19 వ శతాబ్దపు బెంగాలు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన వారికి, సాంఘిక సంస్కర్తలు, విద్వాంసులు, సాహిత్య దిగ్గజాలు, పాత్రికేయులు, దేశభక్తులు, శాస్త్రవేత్తల సమ్మేళనం పునరుద్ధరణోద్యమ రూపాన్ని ఏర్పరచారు. ఈ కాలం మద్య యుగం నుండి ఆధునిక కాలంగా మార్పుచెందడానికి చిహ్నంగా ఉంది.[465][467][468]

ఈ కాలంలో మేధో చైతన్యానికి బెంగాలు సాక్ష్యంగా ఉంది. ఈ ఉద్యమం ముఖ్యంగా మహిళలు, వివాహం, కట్నం వ్యవస్థ, కుల వ్యవస్థ, మతం సంబంధించిన పురాతన సంప్రదాయాలను ప్రశ్నించింది. ఈ సమయంలో ఉద్భవించిన మొట్టమొదటి సాంఘిక ఉద్యమాలలో ఒకటి యువ బెంగాలు ఉద్యమం.[469] భారతీయ ఉపఖండంలో భారతీయ మేధస్సులో చైతన్యం చేయడంలో ఈ ఉద్యమం ప్రధానపాత్ర పోషించింది.

కరువులు

బ్రిటీషు కంపెనీ పాలన, బ్రిటిషు రాజు పరిపాలనా సమయంలో బ్రిటిషు వలసరాజ్య ప్రభుత్వ విధాలు విఫలమైనందుకు చిహ్నంగా భారతదేశంలో మునుపెన్నడూ నమోదు చేయని కరువులు సంభవించాయి. సమయంలో " 1876-78 నాటి గ్రేట్ ఫామైన్ " కారణంగా 6.1 మిలియన్ల నుండి 10.3 మిలియన్ల మంది మరణించారని భావిస్తున్నారు.[470] 1770 నాటి మహా బెంగాలు కరువులో 10 మిలియన్ల మంది మరణించారు.[471] 1899-1900 నాటి భారతీయ కరువులో 1.25 నుండి 10 మిలియన్ల మంది ప్రజలు మరణించారు.[472] బెంగాల్ కరువు (1943) నాటికి 3.8 మిలియన్ల ప్రజలు మరణించారు.[473] 19 వ శతాబ్దం మధ్యకాలంలో " మూడో ప్లేగు పాండమిక్ " భారతదేశంలో 10 మిలియన్ల మంది మరణానికి కారణంగా ఉంది.[474] నిరంతర వ్యాధులు, కరువులు ఉన్నప్పటికీ భారత ఉపఖండంలోని జనాభా 1750 నాటికి 200 మిలియన్లకు చేరింది.[475] 1941 నాటికి 389 మిలియన్లకు చేరింది.[476]

భారతీయ స్వాతంత్ర ఉద్యమం

భారతదేశంలో బ్రిటీషు ప్రజల సంఖ్య చిన్నదిగా ఉన్నప్పటికీ,[478] వారు భారత ఉపఖండంలో 52% ప్రాంతాన్ని నేరుగా పాలించగలిగారు. 48% రాచరిక దేశాలపై గణనీయమైన పరపతిని సాధించారు.[479]

19 వ శతాబ్దంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలలో భారతీయ జాతీయవాదం అభివృద్ధి,[480] భారతీయులు మొదటి "స్వీయ పాలన" తరువాత "పూర్తి స్వాతంత్ర్యం" కోరుకున్నారు. అయితే చరిత్రకారులు దాని పెరుగుదల కారణాలను విభజించారు. కారణాలలో "బ్రిటీషు, భారత ప్రజల ప్రయోజనాల ఘర్షణ",[480] "జాతి వివక్షలు",[481] "భారతదేశం గతం సంఘర్షణలు".[482]

1861 లో బ్రిటీష్ వైస్రాయికి సలహా ఇవ్వడానికి కౌన్సిలర్ల నియామకం భారతీయ స్వీయ-పాలనకు మొదటి అడుగు మొదలైంది. వీరిలో 1909 లో మొట్టమొదటి భారతీయుడు నియమితుడయ్యాడు. భారత సభ్యులతో కూడిన ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు నియామకం తరువాత భారతీయుల నియామకం శాసన మండలి వరకు విస్తరించబడింది. బ్రిటీషు వారు పెద్ద బ్రిటీష్ ఇండియన్ ఆర్మీను నిర్మించారు, ఇందులో సీనియర్ అధికారులుగా బ్రిటిషు వారు ఉండగా నేపాలు గుర్ఖాలు, సిక్కుల వంటి చిన్న మైనారిటీ సమూహాల నుండి సైనిక బృందాలు భాగస్వామ్యం వహించారు.[483] పౌర సేవను తక్కువ స్థాయిలో ఉన్న స్థానికులతో నింపి బ్రిటీషు అధికంగా సీనియరు హోదాను కలిగి ఉంది.[484]

భారతీయ జాతీయవాద నాయకుడు బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ దేశపు విధిగా ప్రకటించారు. అతని ప్రసిద్ధ వాక్యం "స్వరాజ్ నా జన్మహక్కు, నేను కలిగి ఉంటాను"[485] ఇది భారతీయులకు ప్రేరణగా మారింది. బిపిన్ చంద్ర పాలు, లాలా లజ్పాత్ రాయి లాంటి ప్రభుత్వ నాయకులు తిలకుకు మద్దతు ఇచ్చారు. అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్న వారు విదేశీ వస్తువుల బహిష్కరణ, భారత-వస్తువులను ఉపయోగించడం వంటి స్వదేశీ ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. ఈ త్రిముఖ ఉద్యమాన్ని లాల్ బాల్ పాల్ అని పిలిచేవారు. వారి ఆధ్వర్యంలో భారతదేశం మూడు పెద్ద రాష్ట్రాలు - మహారాష్ట్ర, బెంగాలు, పంజాబు ప్రజల డిమాడులను, భారత జాతీయవాదాన్ని రూపొందించింది. 1907 లో కాంగ్రెసు రెండు విభాగాలుగా విభజించబడింది. బ్రిటీషు సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి, బ్రిటీషు వస్తువులన్నింటిని విడిచిపెట్టాలని సూచిస్తూ తిలక్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు పౌర ఆందోళన, ప్రత్యక్ష విప్లవం చేయాలని పిలుపు ఇచ్చాడు. మరోవైపు, దాదాభాయ్ నౌరోజీ, గోపాల్ కృష్ణ గోఖలే వంటి నాయకుల నేతృత్వంలోని మితవాదులు, బ్రిటీష్ పాలన యొక్క పరిధిలో సంస్కరణను కోరుకున్నారు.[486]1905 బెంగాలు విభజన స్వంతత్రపోరాటాన్ని మరింత తీవ్రం చేసింది. సహాయనిరాకణోద్యమం హింసాత్మకంగా మారింది. ఖుర్దీరాంబోసు బ్రిటిషు రాజు ప్రభుత్వకార్యాలయం సమీపంలో బాంబులు పాతి పెట్టి ఖైదు చేయబడి 18 సంవత్సరాల వయసులో ఉరితీయబడ్డాడు.[477]

ఊచకోత సమయంలో జలియంవాలాబాగ్ ప్రాంగణంలో వందల మంది నిరాయుధులైన భారత పౌరులు మీద బ్రిటిషు బలగాలు కాల్పులు సగించిన గుర్తుగా గోడలపై ఏర్పడిన బుల్లెటు గుర్తులు

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశం మద్దతును గుర్తించి పునఃప్రారంభించబడిన జాతీయవాద డిమాండ్లకు ప్రతిస్పందనగా బ్రిటీషు ప్రభుత్వం "క్యారట్ అండ్ స్టిక్" విధానాన్ని స్వీకరించింది. ప్రతిపాదిత ప్రమాణాలు తరువాత భారత ప్రభుత్వ చట్టం 1919 లో పొందుపరచబడ్డాయి. ఇది ద్వంద్వ పరిపాలన సూత్రాన్ని ప్రవేశపెట్టింది, లేదా భారతీయ శాసనసభ్యులను ఎన్నుకుని బ్రిటీషు అధికారులను నియమించేలా అధికారా పంఫిణీ చేయబడింది.[487] 1919 లో కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ శాంతియుత నిరసనకారులపై కాల్పులు చేయమని అధికారులను ఆదేశించాడు. ఇందులో నిరాయుధ మహిళలు, పిల్లలు ఉన్నారు. ఫలితంగా జలియన్ వాలా బాఘ్ ఊచకోత సంభవించింది. ఇది 1920-22 లో సహాయరనిరాకరణోద్యమానికి దారితీసింది. ఈ ఊచకోత భారతదేశంలో బ్రిటీష్ పాలన ముగింపులో నిర్ణయాత్మక పాత్ర వహించింది.[488]

1920 నుండి మహాత్మా గాంధీ వంటి నాయకులు ఎక్కువగా శాంతియుతమైన పద్ధతులను ఉపయోగించి బ్రిటీషు రాజుకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం అత్యంత ప్రజాదరణ పొందింది. సహాయనిరాకరణ, శాసనోల్లంఘన, ఆర్థిక ప్రతిఘటన వంటి అహింసా పద్ధతులను ఉపయోగించి బ్రిటీషు పాలనను గాంధీ నేతృత్వంలోని స్వాతంత్ర ఉద్యమం వ్యతిరేకించింది. అయితే భారతీయ ఉపఖండం అంతటా బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు జరిగాయి. మరికొందరు చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్ ఇతరులు స్థాపించిన హిందూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ వంటి తీవ్రవాద విధానాన్ని స్వీకరించారు. ఇది బ్రిటీషు పాలనను సాయుధ పోరాటంలో పడగొట్టడానికి ప్రయత్నించింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చట్టం 1935 ఒక ప్రధాన విజయం సాధించింది.[486]

మొదటి ప్రపంచ యుద్ధం

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైన్యంలో స్వచ్ఛందంగా 8,00,000 మంది, 400,000 కంటే ఎక్కువ మంది యుద్ధరహిత సేవలకు స్వచ్ఛందంగా స్వచ్ఛన్నంగా నమోదుచేసుకున్నారు యుద్ధానికి ముందు నియామకసభ్యులు వార్షికంగా 15,000 మంది ఉండేవారు.[489] యుపిరెస్ యుద్ధం ప్రారంభమైన నెలలోనే సైన్యం " వెస్టర్న్ ఫ్రంట్ " తరఫున మొదటిసారిగా యుద్ధంలో పాల్గొన్నది. పాశ్చాత్య సంకీర్ణ దళంలో ఒక సంవత్సరం పాల్గొన్న తరువాత అనారోగ్యం, హేతుబద్ధమైన కొన్ని కారణాల వలన అది ఉపసంహరించుకునే సమయానికి భరతీయ సైన్యం సంఖ్యాపరంగా కుదించబడింది. మెసొపొటేమియా పోరాటంలో దాదాపు 700,000 మంది భారతీయులు టర్కులతో పోరాడారు. భారతీయ సైనికులు తూర్పు ఆఫ్రికా, ఈజిప్టు, గల్లిపోలీలకు కూడా పంపబడ్డారు.[490]

1915 లో ఇంపీరియల్ సైనిక బృందాలతో " సినై - పాలస్తీనా యుద్ధంలో, 1916 లో రోమానీలో, 1917 లో జెరూసలెంలో భారతీయ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. భారతదేశ విభాగాలు జోర్డాన్ లోయను ఆక్రమించాయి. స్ప్రింగ్ అఫెంసివ్ తరువాత ఈజిప్టు దాడిలో (మెగిడ్డో యుద్ధంలో), డిసర్టు మౌంటెడ్ క్రాప్స్ 'దమస్కుకు, అలెప్పోకు వెళ్ళే సమయంలో వారు ప్రధాన శక్తిగా మారారు. ఇతర వర్గాలు భారతదేశంలో వాయవ్య సరిహద్దులను కాపాడటం, అంతర్గత భద్రతా బాధ్యతలను నిర్వర్తించాయి.

యుద్ధంలో ఒక మిలియన్ మంది భారతీయ దళాలు విదేశాల్లో పనిచేశారు. మొత్తం 74,187 మంది మరణించారు.[491] 67,000 మంది గాయపడ్డారు.[492] మొదటి ప్రపంచ యుద్ధం, ఆఫ్ఘన్ యుద్ధాలలో తమ ప్రాణాలను పోగొట్టుకున్న సుమారు 90,000 మంది సైనికుల కొరకు భారత్ గేట్ స్మారక చిహ్నం నిర్మించబడింది.

రెండవ ప్రపంచ యుద్ధం

రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945) సమయంలో భారతదేశాన్ని యునైటెడ్ కింగ్డం నియంత్రించింది. భారతదేశంలో బ్రిటీషు భూభాగాలలో 500 రాజరిక రాజ్యాలు ఉన్నాయి. 1939 సెప్టెంబరులో బ్రిటిషు ఇండియా నాజీ జర్మనీపై అధికారికంగా యుద్ధం ప్రకటించింది. [493] సంకీర్ణ దేశాలలో భాగంగా ఉన్న బ్రిటిషురాజు 2.5 మిలియన్ల స్వచ్ఛంద సైన్యాలను పంపి బ్రిటిషు కమాండు ఆధ్వర్యంలో ఆక్సిస్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడింది. అదనంగా యుద్ధంలో పోరాడడానికి పలు భారతీయ సంస్థానాలు అధికమొత్తంలో నిధులు అందించి సహకరించాయి. భారతదేశం చైనా మద్దతుతో అమెరికన్ సైన్యానికి మిలటరీ బేసుగా ఉండి సహకరించింది.

జర్మనీకి వ్యతిరేకంగా యూరోపియన్ థియేటరు, జర్మనీ, ఇటలీకి వ్యతిరేకంగా ఉత్తర ఆఫ్రికా, జపాన్, ఇటలీకి వ్యతిరేకంగా, ఇటలీకి వ్యతిరేకంగా తూర్పు ఆఫ్రికా, విచీ ఫ్రెంచికి వ్యతిరేకంగా మిడిల్ ఈస్టు, జపానుకు వ్యతిరేకంగా బర్మా యుద్ధాలలో భారతీయ సైనికులు వీరోచితంగా పోరాడారు. 1945 ఆగస్టులో జపాన్ లొంగిపోయిన తరువాత సింగపూరు, హాంకాంగు వంటి బ్రిటీషు వలసరాజ్యాలు స్వాతంత్ర్యం పొందడంలో భారతీయులు సాయపడ్డారు. 87,000 మంది భారతీయ సైనికులు (ఆధునిక పాకిస్తాన్, నేపాలు, బంగ్లాదేశ్ ) రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించారు.

మోహన్ దాసు కరంచందు గాంధీ, సర్దారు వల్లభాయి పటేలు, మౌలానా ఆజాదు నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెసు, నాజీ జర్మనీని బహిష్కరించినప్పటికీ ఇది భారతదేశం స్వతంత్రం వచ్చే వరకు ఇతరులతో పోరాడలేదు. 1942 ఆగస్టులో కాంగ్రెసు క్విటు ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. స్వాతంత్ర్యం మంజూరు అయ్యే వరకు ప్రభుత్వానికి ఏ విధంగానైనా సహకరించడానికి నిరాకరించింది. ఈ చర్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది వెంటనే 60,000 జాతీయ, స్థానిక కాంగ్రెసు నాయకులను అరెస్టు చేసింది. తరువాత కాంగ్రెసు మద్దతుదారుల హింసాత్మంగా అణిచివేసేందుకు ప్రయత్నించింది. గాంధీ తన ఆరోగ్యం కారణంగా 1944 మే మాసంలో విడుదలైనప్పటికీ నాయకులు 1945 జూను వరకు జైలులో ఉంచబడ్డారు. ముస్లిం లీగు క్విట్ ఇండియా ఉద్యమాన్ని తిరస్కరించి రాజు అధికారులతో కలిసి పనిచేసింది.

సుభాష్ చంద్రబోస్ (నేతాజీ అని కూడా పిలుస్తారు) కాంగ్రెసును విడిచి స్వాతంత్ర్యం పొందేందుకు జర్మనీ లేదా జపానులతో ఒక సైనిక సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. ఇండియన్ లెజియన్ స్థాపనలో జర్మన్లు ​​బోసుకు సహాయం చేసారు.[494] అయితే మోహన్ సింగు ఆధ్వర్యంలో మొట్టమొదటి భారత జాతీయ సైన్యం రద్దుచేసిన తరువాత భారత జాతీయ సైన్యం (ఐఎన్ఎ) పునరుద్ధరించడానికి జపాను సహకరించింది. ఐ.ఎన్.ఏ జపనీయుల మార్గదర్శకంలో మర్మాలో పోరాడారు, [495] బోసు ఆజాద్ హిందుకు నాయకత్వం వహించి సింగపూరు నుండి నడిపించబడిన తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాడు. ఆజాదు హిందు ప్రభుత్వం దాని సొంత కరెన్సీ, కోర్టు పౌర చట్టాలను రూపొందించింది. బ్రిటీషు వారి మీద స్వాతంత్ర్య పోరాటానికి అధిక చట్టబద్ధత ఇచ్చిందని కొంతమంది భారతీయులు భావించారు.[496][497]

1942 నాటికి పొరుగునున్న బర్మా మీద జపాను దాడి చేసింది. అప్పటికే జపాను అండమాను, నికోబార్ ద్వీపాలను స్వాధీనం చేసుకుంది. జపాను 1943 డిసెంబరు 21 న ఉచిత భారతదేశ తాత్కాలిక ప్రభుత్వానికి ద్వీపాల మీద నామమాత్రపు నియంత్రణను ఇచ్చింది. తరువాత మార్చిలో జపాను సహాయంతో భారత జాతీయ సైన్యం భారతదేశంలోకి ప్రవేశించి నాగాలాండులో కోహిమా వరకు అధికార పరిధిని విస్తరించింది. భారత ఉపఖండంలోని ప్రధాన భూభాగంలో ఈ పురోగమనం సుదూర స్థానానికి చేరుకుంది.

1940-43లో భారతదేశంలో బెంగాలు ప్రాంతం వినాశకరమైన కరువును ఎదుర్కొంది.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత (సా.శ. 1946 – 1947)

1946 లో భారతదేశానికి స్వాతంత్ర్యానికి ముందు కలకత్తాలో హిందూ ముస్లిముల మధ్య జరిగిన ఘర్షణల్లో భాగంగా మృతులు, గాయపడిన వారు.

1946 లో లేబరు ప్రభుత్వం భారతదేశంలో బ్రిటీషు పాలనను ముగించాలని నిర్ణయించింది. 1947 ప్రారంభంలో బ్రిటను 1948 జూను లోపల అధికారాన్ని బదిలీ చేయాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పర్చడంలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.

స్వాతంత్ర్యం కావాలన్న కోరికతో హిందువులు, ముస్లింల మధ్య ఉద్రిక్తతలు కూడా అభివృద్ధి చెందాయి. ముస్లింలు ఎల్లప్పుడూ భారతీయ ఉపఖండంలో ఒక మైనారిటీగా ఉండేవారు. ప్రత్యేకంగా హిందూ ప్రభుత్వ ఏర్పాటు వారిని కలవరానికి గురిచేసింది. వారిలో హిందూ ప్రభుత్వం పట్ల అవిశ్వాసం అభివృద్ధి చెందింది. రెండు సంఘాల మధ్య ఐక్యత కోసం గాంధీ పిలుపునిచ్చినప్పటికీ హిందూ పాలనను నిరాకరించారు.

1946 ఆగస్టు 16 న బ్రిటీషు ఇండియాలో ఒక ముస్లిం దేశం కావాలని ముస్లిం లీగ్ నాయకుడు ముహమ్మద్ ఆలీ జిన్నా శాంతియుతంగా డిమాండు చేసాడు. ఫలితంగా మొదలైన హింసాకాండ "గ్రేట్ కలకత్తా కిల్లింగ్ ఆగస్టు 1946"గా అభివర్ణించబడింది. హింసాకాండ బీహారుకు (హిందువులు ముస్లిముల మీద దాడి చేసార్), బెంగాల్లోని నోహాకిలీకి (హిందూలను లక్ష్యంగా చేసుకుని ముస్లింలు దాడి చేసారు), యునైటెడ్ ప్రొవిన్సులలోని గార్ముక్తేశ్వర్ ( హిందువులు ముస్లిముల మీద దాడి చేశారు) 1947 మార్చిలో రావల్పిండి వద్ద (దీనిలో హిందువులు ముస్లింలచే దాడి చేయబడ్డారు) వరకు విస్తరించింది.

దేశవిభజన, స్వతంత్రం (సా.శ.1947–)

భారతదేశం, పాకిస్తాన్ విభజన కారణంగా 1947లో సుమారు కోటి 45 లక్షల మంది నిర్వాసితులయ్యారు.

1947 లో యూనియన్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ ఆఫ్ డొమినియన్ల విభజన తరువాత బ్రిటిషు నుండి భారత భూభాగాలు స్వాతంత్ర్యం పొందాయి. పంజాబు, బెంగాలు వివాదాస్పద ముందస్తు విభజన తరువాత ఈ ప్రాంతాలలోని సిక్కులు, హిందువులు, ముస్లింల మధ్య కలహాలు చెలరేగాయి. ఇది భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. కలహాలలో సుమారు 5,00,000 మంది మరణించారు. [498] అలాగే ఈ కాలంలో ఆధునిక చరిత్రలో ఇప్పటివరకు నమోదు చేయబడని అతిపెద్ద ప్రజా వలసలు జరిగాయి. కొత్తగా సృష్టించిన భారతదేశం, పాకిస్తాన్ (వరుసగా 15 - 1947 ఆగస్టు 14 లో స్వాతంత్ర్యం పొందాయి) మద్య దాదాపు 12 మిలియన్ల హిందువులు, సిక్కులు, ముస్లింల వలసలు సంభవించాయి.[498] 1971 లో బంగ్లాదేశ్ (గతంలో తూర్పు పాకిస్థాన్, తూర్పు బెంగాల్) పాకిస్థాన్ నుంచి విడిపోయింది.

14 వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహంలో శివుడు ఎడమవైపున, ఉమ కుడివైపున కూర్చున్నారు. వాషింగ్టన్ డి. సి లోని స్మిత్సోనియన్ ఇన్ స్టిట్యూషన్ లో ఉంది.
రాబర్ట్ క్లైవు, బ్రిటిష్ వారి, బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ గా.

చరిత్ర అధ్యయనం

ఇటీవల దశాబ్దాల్లో చరిత్రకారులు భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడానికి 4 స్కూల్స్ ఆధారంగా ఉన్నాయి. కేంబ్రిడ్జి, నేషనలిస్టు, మార్క్సిస్టు, సుబాల్టర్ను. ఒకేసారి సాధారణమైన "ఓరియంటలిస్ట్" విధానం, అవగాహన, అవ్యక్తంగా, పూర్తిగా ఆధ్యాత్మిక భావంతో అధ్యయనం జరిగింది.[499] కేబ్రిడ్జి స్కూలు అనిల్ సీల్,[500] గార్డన్ జాంసన్,[501] రీచర్డ్ గార్డ్సన్,డేవిడ్ వాష్‌బ్రూక్ చేత నిర్వహించబడింది.[502][503] అయినప్పటికీ " ది స్కూల్ ఆఫ్ హిస్టారియో గ్రఫీ " పాశ్చాత్యులు విమర్శించారు.[504]

జాతీయవాద పాఠశాల కాంగ్రెస్, గాంధీ, నెహ్రూ, ఉన్నత స్థాయి రాజకీయాలలో దృష్టి సారించింది. ఇది 1857 లో తిరుగుబాటు యుద్ధం విముక్తికి కారణమని, 1942 లో ప్రారంభమైన గాంధీ 'క్విట్ ఇండియా', చారిత్రక సంఘటనలను నిర్వచించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. చరిత్ర ఈ పాఠశాల కూడా విమర్శలను ఎదుర్కొంది.[505]

మార్క్సిస్టులు ఆర్థిక అభివృద్ధి, భూస్వామ్య విధానం, వలసపాలనకు పూర్వం భారతదేశంలో నెలకొన్న వర్గ పోరాటం, కాలనీల కాలంలో పరిశ్రమల కొరత గురించి అధ్యయనం చేశారు. మార్కిజ వాదులు గాంధీ ఉద్యమాన్ని బూర్జువా శ్రేణుల సాధనంగా చిత్రీకరించారు. ప్రజల విప్లవ శక్తులను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారని బోధించింది. మార్కిజవాదులు "ఎక్కువగా" భావజాల ప్రభావితమైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.[506]

1980 లలో "ఉపల్టన్ పాఠశాల" రంజజిత్ గుహ, గియాన్ ప్రకాష్లు ప్రారంభించారు.[507] అది ప్రముఖులు, రాజకీయ నాయకుల మీద దృష్టి కేంద్రీకరించింది. జానపద కథలు, కవిత్వం, చిక్కులు, సామెతలు, పాటలు, మౌఖిక చరిత్ర, ఆంత్రోపాలజీ స్ఫూర్తితో "చరిత్ర"కు రూపకల్పన చేయడం మీద దృష్టి కేంద్రీకరించారు. ఇది 1947 కి ముందు కాలనీల శకంలో దృష్టి సారించింది.[508]

ఇటీవలే హిందూ జాతీయవాదులు భారతీయ సమాజంలో "హిందూత్వ" ("హిందుత్వం") కొరకు తమ డిమాండ్లకు మద్దతుగా చరిత్ర సృష్టించారు. ఈ పాఠశాల ఆలోచన ఇంకా అభివృద్ధి ప్రక్రియలో ఉంది.[509] 2012 మార్చిలో హర్వార్డ్ యూనివర్శిటీలోని కంపరటివ్ రిలీజియన్ ప్రొఫెసర్, డయానా ఎల్. ఎక్ తన పుస్తకం "భారతదేశం: ఎ సేక్రేడ్ జియోగ్రఫీ"లో ఇలా వ్రాశారు, భారతదేశం బ్రిటీషు లేదా మొఘలుల కంటే చాలా ముందుగానే ఉంది. ఇది కేవలం ప్రాంతీయ గుర్తింపుల సమూహం కాదు, ఇది సంప్రదాయ లేదా జాతి ఆధారితం కాదు.[510][511][512][513]

వనరులు

మూలాలు

గమనికలు

మూలాలజాబితా

ఉపయుక్త గ్రంథ సూచి

జాలమూలాలు

ఇంకా చదువుటకు

సాధారణం

  • Basham, A.L., ed. The Illustrated Cultural History of India (Oxford University Press, 2007)
  • Buckland, C.E. Dictionary of Indian Biography (1906) 495pp full text
  • Chakrabarti D.K. 2009. India, an archaeological history : palaeolithic beginnings to early historic foundations
  • Dharma Kumar and Meghnad Desai, eds. The Cambridge Economic History of India: Volume 2, c. 1751 – c. 1970 (2nd ed. 2010), 1114pp of scholarly articles
  • Fisher, Michael. An Environmental History of India: From Earliest Times to the Twenty-First Century (Cambridge UP, 2018)
  • Guha, Ramachandra. India After Gandhi: The History of the World's Largest Democracy (2007), 890pp; since 1947
  • James, Lawrence. Raj: The Making and Unmaking of British India (2000)
  • Khan, Yasmin. The Raj At War: A People's History Of India's Second World War (2015)
  • Majumdar, R.C. : An Advanced History of India. London, 1960. ISBN 0-333-90298-X
  • Majumdar, R.C. (ed.) : The History and Culture of the Indian People, Bombay, 1977 (in eleven volumes).
  • Mcleod, John. The History of India (2002) excerpt and text search
  • Mansingh, Surjit The A to Z of India (2010), a concise historical encyclopedia
  • Metcalf, Barbara D. and Thomas R. Metcalf. A Concise History of Modern India (2006)
  • Peers, Douglas M. India under Colonial Rule: 1700–1885 (2006), 192pp
  • Richards, John F. The Mughal Empire (The New Cambridge History of India) (1996)
  • Riddick, John F. The History of British India: A Chronology (2006) excerpt
  • Riddick, John F. Who Was Who in British India (1998); 5000 entries excerpt
  • Rothermund, Dietmar. An Economic History of India: From Pre-Colonial Times to 1991 (1993)
  • Sharma, R.S., India's Ancient Past, (Oxford University Press, 2005)
  • Sarkar, Sumit. Modern India, 1885–1947 (2002)
  • Senior, R.C. (2006). Indo-Scythian coins and history. Volume IV. Classical Numismatic Group, Inc. ISBN 978-0-9709268-6-9.
  • Singhal, D.P. A History of the Indian People (1983)
  • Smith, Vincent. The Oxford History of India (3rd ed. 1958), old-fashioned
  • Spear, Percival. A History of India. Volume 2. Penguin Books. (1990) [First published 1965]
  • Stein, Burton. A History of India (1998)
  • Thapar, Romila. Early India: From the Origins to AD 1300 (2004) excerpt and text search
  • Thompson, Edward, and G.T. Garratt. Rise and Fulfilment of British Rule in India (1934) 690 pages; scholarly survey, 1599–1933 excerpt and text search
  • Tomlinson, B.R. The Economy of Modern India, 1860–1970 (The New Cambridge History of India) (1996)
  • Wolpert, Stanley. A New History of India (6th ed. 1999)

చరిత్రకారులు రచనలు

  • Bannerjee, Gauranganath (1921). India as known to the ancient world. London: Humphrey Milford, Oxford University Press.
  • Bayly, C.A. (నవంబరు 1985). "State and Economy in India over Seven Hundred Years". The Economic History Review. 38 (4): 583–596. doi:10.1111/j.1468-0289.1985.tb00391.x. JSTOR 2597191.
  • Bose, Mihir. "India's Missing Historians: Mihir Bose Discusses the Paradox That India, a Land of History, Has a Surprisingly Weak Tradition of Historiography", History Today 57#9 (2007) pp. 34–. online Archived 2011-09-15 at the Wayback Machine
  • Elliot, Henry Miers; John Dowson (1867–77). The History of India, as told by its own historians. The Muhammadan Period. London: Trübner and Co.
  • Kahn, Yasmin. "Remembering and Forgetting: South Asia and the Second World War' in Martin Gegner and Bart Ziino, eds., The Heritage of War (Routledge, 2011) pp. 177–193.
  • Jain, M. The India They Saw : Foreign Accounts (4 Volumes) Delhi: Ocean Books, 2011.
  • Lal, Vinay, The History of History: Politics and Scholarship in Modern India (2003).
  • Palit, Chittabrata, Indian Historiography (2008).
  • Arvind Sharma, Hinduism and Its Sense of History (Oxford University Press, 2003) ISBN 978-0-19-566531-4
  • E. Sreedharan, A Textbook of Historiography, 500 B.C. to A.D. 2000 (2004)
  • Warder, A.K., An introduction to Indian historiography (1972).

అధికారిక వనరు

  • The Imperial Gazetteer of India (26 vol, 1908–31), highly detailed description of all of India in 1901. online edition

జాలవనరులు

ఇంకా చూడండి