మేరీ క్యూరీ

ఫ్రెంచ్ -పోలిష్ ఫ్య్సిసిస్ట్ మరియు కెమిస్ట్

మేరీ క్యూరీ, Maria Salomea Skłodowska-Curie (నవంబర్ 7, 1867జూలై 4, 1934) ఒక ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు[1]. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సోర్‌బోన్‌లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలండ్‌లో జన్మించి తరువాత ఫ్రెంచి పౌరసత్వం తీసుకొన్న ఈమెకు రెండు దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది.

మారియా స్క్లొడొస్క-క్యూరీ
మేరీ క్యూరీ
జననం(1867-11-07)1867 నవంబరు 7
వార్సా, పోలండ్
మరణం1934 జూలై 4(1934-07-04) (వయసు 66)
Sancellemoz, ఫ్రాన్సు
జాతీయతపోలిష్, ఫ్రెంచి
రంగములుభౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము
వృత్తిసంస్థలుసోర్‌బోన్
చదువుకున్న సంస్థలుసోర్‌బోన్, ESPCI
పరిశోధనా సలహాదారుడు(లు)హెన్రీ బెకరెల్
డాక్టొరల్ విద్యార్థులుఆంధ్రీ లూయిస్ డెబీర్న్ ()
మార్గరెట్ కాతరిన్ పెరీ
ప్రసిద్ధిరేడియో ధార్మికత
ముఖ్యమైన పురస్కారాలు భౌతిక శాస్త్రంలో నోబుల్ పురస్కారం (1903)
రసాయన శాస్త్రంలో నోబుల్ పురస్కారం (1911)
గమనికలు
రెండు వేరు వేరు శాస్త్రీయ విభాగాలలో నోబెల్ బహుమతి గెల్చుకున్న ఒకే ఒక వ్యక్తి. భర్తపియరీ క్యూరీ (1895); వారి సంతానం ఐరీన్ జోలియట్-క్యూరీ and ఈవ్ క్యూరీ.

ఈమె భర్త, సహ పరిశోధకుడు అయిన పియరీ క్యూరీ వారి మొదటి నోబెల్ బహుమతిని ఈమెతో కలసి అందుకొన్నాడు. ఈమె కుమార్తె ఇరీన్ జూలియట్ క్యూరీ మరొక నోబెల్ బహుమతి గ్రహీత. ఇలా వీరి కుటుంబంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు లభించాయి.

జీవితం

వార్సా లోని మారియా స్క్లొడొస్క జన్మించిన ప్రదేశం

మారియా స్క్లొడొస్క పోలండ్ రాజధాని నగరమైన వార్సాలో నివసిస్తున్న బ్రోనిస్లావా, వ్లాడిస్లా స్క్లొడొస్కి అనబడే పోలిష్‌ దంపతులకు జన్మించింది. వీరు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తి చేసేవారు. మారియా వారికి కలిగిన ఐదుగురి సంతానంలో చిన్న అమ్మాయి. మారియా చిన్న వయసులోనే సోదరి హెలెనా, తల్లి చనిపోయారు.[2]చిన్నతనంలో అత్యధిక శ్రద్ధతో చదువు కొనసాగించింది. ఒక్కోసారి చదువులో నిమగ్నమయ్యి అన్నం తినడం కూడా మరచిపోయేది. 15 సంవత్సరాల వయస్సులో ఆమె చదువుతున్న తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులతో ఉన్నత పాఠశాల పరీక్షల్లో ఉత్తీర్ణురాలైనది.[3]

Dołęga coat-of-arms, hereditary in Skłంdowska's family.

అమ్మాయి అవడం వల్లనూ, ఇంకా రష్యా, పోలండ్‌ల మధ్య ఉన్న గొడవల వల్ల అప్పట్లో ఆమెకు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకలేదు. బోధనలు చేస్తూ సంపాదించిన డబ్బులతో ఆమె వార్సాలోని ఫ్లోటింగ్ యూనివర్సిటిలో చదువుకొనసాగిస్తూ పారిస్‌లో వైద్యాన్ని అభ్యసిస్తున్న సోదరికి అండగా నిలిచింది. 1891 లో కూడబెట్టుకున్న ధనంతో ఆవిడ పారిస్ చేరుకున్నది.

పారిస్‌లో ఈమె ఉన్నత విద్యను అభ్యసించి తన పరిశోధనలను ప్రారంభించింది. సార్బోన్‌లో గణితం, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రాలను అభ్యసించింది (అక్కడే తరువాత 1909లో సార్బోన్‌లో ప్రొఫెసర్ అయిన మొట్టమొదటి స్త్రీగా చరిత్రలో నిలిచిపోయింది). 1893 ప్రారంభంలో అండర్ గ్రాడ్యుయెషన్ ప్రథమస్థానంలో పూర్తి చేసింది. ఒక సంవత్సరం తరువాత అదే యూనివర్సిటీలో, గణితంలో ఆవిడ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. 1903లో హెన్రి బెకెరెల్ పర్యవేక్షణలో ESPCI (École Supérieure de Physique et de Chimie Industrielles de la Ville de Paris) నుండి DSc పొందడంతో ఫ్రాన్సులో డాక్టరేటు పూర్తి చేసిన మొట్టమొదటి స్త్రీగా మళ్ళీ చరిత్ర సృష్టించారు. సార్బోన్‌లో తోటి ఇన్‌స్ట్రక్టర్ అయిన పియరి క్యూరీని పెళ్ళాడారు. మారియా తన పరిశోధనలను వివిధ రకాలైన స్టీల్‌ల అయస్కాంతత్వంతో ప్రారంభించారు. ఈ పరిశోధనల వల్లనే మారియా, పియరి దగ్గరయ్యారు.

పారిస్‌లోని తమ పరిశోధనాలయంలో పియరి, మేరీ క్యూరీ

వారిరువురూ తరువాత వారి పరిశోధనలని రేడియోధార్మికతపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు పిచ్‌బ్లెండ్ అనబడే ఖనిజంపై సాగాయి. ఈ ఖనిజంనుండి వారు యురేనియాన్ని వేరుచేసారు. 1898 కల్లా వారు పిచ్‌బ్లెండ్‌లో యురేనియం కన్నా ఎక్కువ రేడియోధార్మికతను కలిగియున్న పదార్థం ఉందని నిర్దారించారు. 1898 డిసెంబరు 26న వీరు ఈ పరిశోధనను బయలు పరిచారు.పారిస్‌లోనూ, వార్సాలోనూ క్యూరీ ఇన్స్టిట్యూట్‌లను ప్రారంభించింది.

బహుమతులు

వివరాలకు

  • Naomi Pasachoff, Marie Curie and the Science of Radioactivity, New York, Oxford University Press, 1996.
  • క్యూరీ, ఈవ్. Madame Curie: A Biography. ISBN 0-306-81038-7.
  • క్విన్, సుసాన్ (1996). Marie Curie: A Life. ISBN 0-201-88794-0.
  • గోల్డ్‌స్మిత్, బర్బారా (2005). Obsessive Genius: The Inner World of Marie Curie. ISBN 0-393-05137-4.

మూలాలు

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.