యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఉపసంహరణ

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఉపసంహరణ, లేదా మరింత తరచుగా వాడే బ్రెగ్జిట్ (బ్రిటన్ లేదా బ్రిటీష్, ఎగ్జిట్ అన్న రెండు పదాల కలయికతో ఏర్పడ్డ ప్రత్యేక పదం),[1][2] పలువురు వ్యక్తులు, రాజకీయ పార్టీలు, సైద్ధాంతిక సమూహాలు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) పూర్వరూపమైన సంస్థలో 1973లో చేరిన నాటి నుంచీ ప్రచారం చేస్తున్న రాజకీయ లక్ష్యం. ఈ రాజకీయ లక్ష్యం ప్రయత్నం ప్రకారం బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి సభ్యత్వాన్ని ఉపసంహరించుకోవాలి. యూరోపియన్ యూనియన్ ఒప్పందపు 50వ అధికరణం ప్రకారం 2007 నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి ఉపసంహరించుకునే హక్కు సభ్యదేశాలకు ఉంది. 1975లో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (ఈఈసీ) (తర్వాతికాలంలో దీన్నే యూరోపియన్ యూనియన్ గా వ్యవహరిస్తున్నారు)లో సభ్యత్వం గురించి చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 67శాతం మంది బ్రిటన్ ఈఈసీలో కొనసాగడానికి అనుకూలంగా ఓటువేశారు.

యునైటెడ్ కింగ్ డమ్ ఓటర్లు ఈ ప్రశ్నను మళ్ళీ 23 జూన్ 2016న దేశం యూరోపియన్ యూనియన్ లో ఉండాలా వద్దా అన్న మరో రెఫరెండంలో పరిశీలించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణను దేశ పార్లమెంట్ యూరోపియన్ యూనియన్ రెఫరెండం చట్టం 2015ను ఆమోదిస్తూ ఏర్పరిచింది.

జూన్ 2016లో జరిగిన ఈ రెఫరెండంలో 51.9 శాతం మంది మద్దతు ఉపసంహరణ (1,74,10,742 ఓట్లు)కు, 48.1 శాతం (1,61,41,241 ఓట్లు) మద్దతు కొనసాగడానికి లభించింది.[3]

కారణాలు

  • ఓటింగ్ కు ముందు యూనియన్ లో కొనసాగడానికి మద్ధతిచ్చే వారు ఓటర్లనుద్దేశించి చేసిన అతి హెచ్చరికలు
  • యూనియన్ నుంచి బయటకి వస్తే బ్రిటన్ కు పెద్ద మొత్తంలో డబ్బు మిగులుతుందనే ప్రచారం.
  • ఐరోపా తదితర దేశాల నుంచి తరలివస్తున్న వారి వల్ల ఉపాధి అవకాశాలు లభించటం లేదని సగటు బ్రిటన్‌ వాసులు భావన.

[4]

మూలాలు