రోజర్ ఫెడరర్

స్విస్స్ టెన్నిస్ క్రీడాకారుడు

రోజర్ ఫెడరర్ (Roger Federer) స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. ఇతడు 1981, ఆగస్ట్ 8 వ తేదీన స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జన్మించాడు. 2004, ఫిబ్రవరి 2 నుంచి వరుసగా 237 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు.[1] టెన్నిస్ క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఫెదదర్ ఒకడు.[2] ఇతడు ఇప్పటి వరకు 20 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను కైవసం చేసుకొన్నాడు. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 6 సార్లు, వింబుల్డన్ టెన్నిస్ టైటిళ్ళను 8 సార్లు, అమెరికన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 5 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్ 1 సారి గెలుపొందినాడు. డబుల్స్‌లో కూడా ఇప్పటి వరకు 8 టైటిళ్ళను సాధించాడు.

రోజర్ ఫెడరర్

బాల్యం

రోజర్ ఫెడరర్ స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో 1981 ఆగస్టు 8 న జన్మించాడు.[3] చిన్నతనంలో ఫుట్‌బాల్ క్రీడలో మంచి ప్రావీణ్యం సంపాదిచాడు. ఫుట్‌బాల్ ఆటలో మంచి ప్రొఫెషనల్ ఆటగాడు కావాలని అనుకున్నప్పటికీ టెన్నిస్ వైపు దృష్టిసారించి రాకెట్ చేతపట్టాడు.

క్రీడాజీవితం

6 సంవత్సరాల ప్రాయంలోనే ఫెడరర్ టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు.[4] 9 సంవత్సరాల వయస్సులో గుంపు పాఠాలు వినడానికి హాజరయ్యేవాడు. మరో సంవత్సరం గడిచే నాటికి వారం వారం ప్రైవేటు కోచింగ్ వెళ్ళడ ఆరంభించాడు. 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఫుట్‌బాల్ ఆట కూడా ఆడేవాడు. కేవలం టెన్నిస్ మాత్రమే ఆడాలని ఆ సమయంలోనే నిర్ణయించుకున్నాడు.[5] 14 ఏళ్ళ వయస్సులో టెన్నిస్‌లో జాతీయ చాంపియన్ అయ్యాడు. 1998లో ఫెడరర్ వింబుల్డన్ జూనియర్ టైటిల్ సాధించాడు. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళినాడు.

2001 : ఫెడరర్ మిలాన్‌లో మొదటి ఏటిపి టోర్నమెంటులో నెగ్గినాడు. ఫిబ్రవరిలో జరిగిన డేవిస్ కప్‌లో 3 మ్యాచులలో నెగ్గి అమెరికాపై విజయం సాధించడంలో తన దేశానికి తోడ్పడ్డాడు. అదే ఏడాది వింబుల్డన్ టెన్నిస్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు ప్రవేశించాడు. నాల్గవ రౌండ్‌లో 4 సార్లు డిఫెండింగ్ చాంపియన్ అయిన పీట్ సంప్రాస్‌ను ఓడించాడు.

2002 : ఫెడరర్ తన తొలి ఏటిపి మాస్టర్స్ సీరీస్‌లో ప్రవేశించి ఫైనల్లో ఆండ్రీ అగస్సీ చేతిలో పరాజయం పొందినాడు. ఆ తరువాత హాంబర్గ్‌లో ఏ.ఎం.ఎస్. ఫైనల్స్ గెలుపొందినాడు. డేవిస్ కప్‌లో కూడా రెండు మ్యాచ్‌లను గెల్చాడు.

2003 : 2003లో ఫెడరర్ పురుషుల టెన్నిస్‌లో టాప్ ర్యాంకింగ్‌ను సవాలు చేసాడు. ఇదే ఏడాది తన గ్రాండ్ స్లాం టెన్నిస్ పోరాటాన్ని ఆరంభించాడు. నాలుగవ రౌండ్‌లో పరాజయం పొందిననూ ఆ తరువాత మార్సెల్లీ, దుబాయిలలో జరిగిన హార్డ్‌కోర్ట్ టోర్నమెంట్లలో విజయం సాధించాడు. మ్యూనిచ్‌లో జరిగిన క్లే కోర్ట్ టోర్నమెంటులో కూడా విజయం సాధించాడు. ఆ తరువాత ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. జూలైలో హాలేలో జరిగిన టోర్నమెంటులో గెలుపొందినాడు. లండన్‌లో జరిగిన వింబుల్డన్ టెన్నిస్‌ను గెల్చి తన క్రీడా జీవితంలోనే తొలి గ్రాండ్‌స్లాం టైటిల్ సాధించాడు. ఈ టోర్నమెంటులో అతడు కోల్పోయినది ఒకేఒక్క సెట్టు మాత్రమే. అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ వలె 4 వ రౌండ్‌లోనే పరాజయం పొందినాడు.

2004 : ఫెదరర్‌కు 2004 అత్యంత ఫలప్రథమైన సంవత్సరంగా చెప్పవచ్చు.[6] ఈ సంవత్సరంలో 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళతో పాటు పలు ఇతర సింగిల్స్ టైటిళ్ళు కైవసం చేసుకున్నాడు. మొదట ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మారట్ సఫిన్‌ను ఓడించి 2004లో తొలి గ్రాండ్‌స్లాం సాధించాడు. దీనితో ప్రపంచ నెంబర్ 1 గా ఉన్న ఆండీ రోడిగ్‌ను వెనక్కి నెట్టి తను ఆ స్థానాన్ని పొందినాడు. అప్పటి నుంచి వరుసగా ఇన్ని వారాలు గడిచిననూ ఫెదరర్ నెంబర్ 1 స్థానాన్ని వదలలేడు. వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఆండీ రోడిగ్ పైనే ఫైనల్లో విజయం సాధించాడు. ఆ తరువాత అమెరిక ఓపెన్‌లో ల్యూటన్ హెవిట్ పై గెలిచి టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం 3వ రౌండ్ వరకు మాత్రమే వెళ్ళగలిగాడు.

2005 : 2005లో 2 గ్రాండ్‌స్లాంలు సాధించి మరో రెండింటిలో సెమీఫైనల్స్ వరకు చేరినాడు. మొదటగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో సఫిన్ చేతిలో 5 గంటలపాటు జరిగిన పోరులో పరాజయం పొందినాడు.[7] ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా సెమీఫైనల్లో నాదల్ చేతిలో ఖంగుతిన్నాడు. ఆ తరువాత వింబుల్డన్ లో ఆండీ రోడిగ్‌ను ఓడించి టైటిల్ సాధించాడు. అమెరికన్ ఓపెన్‌లో కూడా ఆండ్రీ అగస్సీని ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది మొత్తం 15 టోర్నమెంట్లలో పాల్గొని 11 టైటిళ్ళు సాధించాడు.

2006 : 2006లో కూడా ఫెదరర్ 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగితా అన్ని గ్రాండ్ స్లాంలు అతని ఖాతాలో వచ్చాయి. ఆస్త్రేలియన్ ఓపెన్‌ ఫైనల్లో మార్కొస్ బాగ్దాటిస్ను ఓడించి టైటిల్ పొందగా, వింబుల్డన్‌లో రాఫెల్ నాదల్‌ను పరాజయం చేసి టైటిల్ 4 వ సారి సాధించాడు. అమెరికన్ ఓపెన్‌లో ఆండీ రోడిక్‌ను ఓడించి 3వ సారి టైటిల్ పొందినాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ చేతిలో దెబ్బతిన్నాడు.

2007 : 2007లో కూడా ఫెదరర్ 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించి మరో దానిలో ఫైనల్స్ వరకు వెళ్ళినాడు. ఈ విధంగా ఒకే సంవత్సరంలో 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించడం ఫెదరర్‌కు ఇది 3 వ పర్యాయం. 2004, 2006లో వలె ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగితా అన్ని గ్రాండ్‌స్లాంలు అతని ఖాతాలో చేరినవి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లో ఫెర్నాండో గొంజాలెజ్‌ను వరుస సెట్లలో ఓడించాడు. ఈ టోర్నమెంటులో ఒక్క సెట్టు కూడా కోల్పోకుండా టైటిల్ సాధించి 1980లో జాన్ బోర్గ్ తరువాత ఈ ఘనత సాధించిన తొలి టెన్నిస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[8] వింబుల్డన్‌లో రాఫెల్ నాదల్‌ను పరాజయం చేశాడు. అమెరిక ఓపెన్‌లో నొవాక్ డొకోవిక్‌ను వరుస సెట్లలో ఓడించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్ళి 2006లో వలె రాఫెల్ నాదల్ చేతిలో ఓడిపోయాడు.

2008 : 2008లో తొలి గ్రాండ్‌స్లాం టోర్నమెంటు అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్ వరకు మాత్రమే వెళ్ళినాడు. సెమీస్‌లో నోవాక్ డొకోవిక్ చేతిలో 7-5, 6-3, 7-6 (5) స్కోరుతో పరాజయం పొందినాడు.

రికార్డులు

  • జాన్ బోర్గ్ నెలకొల్పిన 5 వరుస వింబుల్డన్ టైటిళ్ళ రికార్డును సమం చేసాడు.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా 4 టైటిళ్ళు సాధించాడు.
  • వరుసగా 237 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా ఉండి కొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకు పూర్వం జిమ్మీ కానర్స్ 160 వారాలపాటు నెంబర్‌వన్ గా ఉన్నాడు. మహిళలలో స్టెఫీ గ్రాఫ్ 186 వారాలపాటు నెంబర్‌వన్‌గా ఉండి రికార్డు నెలకొల్పింది.
  • ఇప్పటీకి 302 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా ఉనాడు.
  • 20 మాస్టర్ 1000 టైటిళ్ళు సాధింఛిన రికార్డును సమం చేసాడు.
  • 7 వింబుల్డన్ టైటిళ్ళను,5 అమెరికన్ టైటిళ్ళను సాధించాడు.
  • అన్ని మాస్టర్ 1000 టైటిళ్ళు ఫైనల్ చేరి కొత్త రికార్డు సృష్టించాడు.

సాధించిన గ్రాండ్‌స్లాం టైటిళ్ళు

YearChampionshipOpponent in FinalScore in Final
2003వింబుల్డన్ టెన్నిస్ మార్క్ ఫిలిప్పోసిస్7-6, 6-2, 7-6
2004ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మారట్ సఫిన్7-6, 6-4, 6-2
2004వింబుల్డన్ టెన్నిస్ (2వ సారి) ఆండీ రోడిక్4-6, 7-5, 7-6, 6-4
2004అమెరికన్ ఓపెన్ టెన్నిస్ ల్యూటన్ హెవిట్6-0, 7-6, 6-0
2005వింబుల్డన్ టెన్నిస్ (3వ సారి) ఆండీ రోడిక్6-2, 7-6, 6-4
2005అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) ఆండ్రీ అగస్సీ6-3, 2-6, 7-6, 6-1
2006ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) మార్కొస్ బాగ్దాటిస్5-7, 7-5, 6-0, 6-2
2006వింబుల్డన్ టెన్నిస్ (4వ సారి) రాఫెల్ నాదల్6-0, 7-6, 6-7, 6-3
2006అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) ఆండో రోడిక్6-2, 4-6, 7-5, 6-1
2007ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) ఫెర్నాండో గొంజాలెజ్7-6, 6-4, 6-4
2007వింబుల్డన్ టెన్నిస్ (5వ సారి) రాఫెల్ నాదల్7-6, 4-6, 7-6, 2-6, 6-2
2007అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (4వ సారి) నోవక్ డొకోవిక్7-6, 7-6, 6-4
2008అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (5వ సారి) ఆండీ murray6-4, 7-5, 6-1
2009ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ రాబిన్ సోడర్లింగ్6-1, 7-6, 6-4
2009వింబుల్డన్ టెన్నిస్ (6వ సారి) ఆండీ రోడిక్5-7, 7-6,7-6, 3-6, 16-14
2010ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (4వ సారి) ఆండీ murray6-4, 6-3, 7-6
2012వింబుల్డన్ టెన్నిస్ (7వ సారి) andy murry4-6, 7-5,7-6, 6-3, 6-4
2017ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (5వ సారి) రాఫెల్ నాదల్6-3, 3-6, 6-1, 3-6, 6-3

సింగిల్స్‌లో ఫలితాల విశ్లేషణ

టోర్నమెంటు19981999200020012002200320042005200620072008200920102011కేరీర్ గెలుపు వాటావిజయాలు-ఓటమిలు
గ్రాండ్‌స్లాంలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ALQ3R3R4R4RWSFWWSFFWSF3 / 941-6
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్A1R4RQF1R1R3RSFFFFWQFF0 / 926-9
వింబుల్డన్ టెన్నిస్A1R1RQF1RWWWWWFWQFQF5 / 938-4
అమెరిక ఓపెన్ టెన్నిస్ALQ3R4R4R4RWWWWWFSFSF4 / 838-4
విజయాల వాటా0 / 00 / 20 / 40 / 40 / 41 / 43 / 42 / 43 / 43 / 40 / 112 / 35N/A
గెలుపు-ఓటములు0-00-27-413-46-413-322-124-227-126-15-1N/A143-23
ఒలింపిక్ క్రీడలు
ఒలింపిక్ క్రీడలుNHNHSFNHNHNH2RNHNHNH0 / 25-3
క్రీడాజీవితం గణాంకాలు
సంవత్సరం19981999200020012002200320042005200620072008Career
ఆడిన టొర్నమెంట్లు31428222523171517161N/A180
టైటిళ్ళు00013711111280N/A53
రెండోస్థానం00222201440N/A17
విజయాల శాతం40%43%55%70%73%82%93%95%95%88%N/A80%
సంవత్సరం అంతానికి ర్యాంకు301642913621111N/AN/A

A = టోర్నమెంటులో పాల్గొనలేడు
WR = విజయాల శాతం
NH = నిర్వహించలేదు
LQ = అర్హత డ్రాలో ఓటమి.

మూలాలు