ఫిబ్రవరి

<<ఫిబ్రవరి>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
123
45678910
11121314151617
18192021222324
2526272829
2024

ఫిబ్రవరి (February), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో రెండవ నెల.ఫిబ్రవరి నెలను రోమన్ క్యాలెండర్‌లో సా.శ.పూ.713 లో చేర్చబడింది. నెల పొడవు కాలక్రమేణా మారిపోయింది.ఒక సమయంలో దీనికి 23 రోజులు మాత్రమే ఉన్నాయి.భారతదేశంలో, ఫిబ్రవరి నెల శీతాకాలపు చివరి చల్లని నెల.[1] జూలియస్ సీజర్ రోమన్ క్యాలెండర్‌ను పునర్నిర్మించినప్పుడు, సాధారణ సంవత్సరాల్లో ఈనెలకు 28 రోజులు,ప్రతి నాలుగు సంవత్సరాలకు వచ్చే లీపు సంవత్సరాల్లో 29 రోజులు ఉంటాయి.[2]

February, from the Très riches heures du Duc de Berry

చరిత్ర

కొన్నివేల యేండ్లకుముందు ఫిబ్రవరినెల కడపటి నెలగా ఉండేది. ఆతరువాత కొంతకాలనికి రెండవనెలగా మారింది. సా.శ. 450 పూర్వం అది తిరిగి కడపటినెలగా మారి, మరల కొంత కాలానికి రెండవనెలగా మారిందట. రోమనులు లూపర్కస్ (Lupercus) అనే ఒక దేవత పేరిట ఒక పండుగ చేసుకుంటారు. ఆ పండుగ పేరు ఫెబ్రువా (Februa). అది ఈనెలలోనే జరుగుతూ ఉంటుంది గాబట్టి ఈనెలకు ఫెబ్రువరి అని పేరువచ్చింది.ఈనెల అంతా ఆదేశీయులు రాత్రిళ్ళు ఉపవాసం ఉండి పూజలు చేస్తూ ఆత్మశుద్ధి చేసుకుంటారు.

ఫిబ్రవరి మాసం ప్రాముఖ్యత

జాతీయ,అంతర్జాతీయ దినోత్సవాలు

ఫిబ్రవరి మాసంలో దిగువ వివరింపబడిన తేదీలలో కొన్ని ముఖ్యమైన దినోత్సవాలుగా,వారోత్సవాలుగా పరిగణింపబడుతున్నాయి.[3][1]

వారోత్సవాలు

  • 1 ఫిబ్రవరి నుండి 9 ఫిబ్రవరి వరకు - కాల ఘోడా పండుగ
  • ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 8 వరకు - అంతర్జాతీయ అభివృద్ధి వారం
  • 18 ఫిబ్రవరి నుండి 27 ఫిబ్రవరి వరకు - తాజ్ మహోత్సవ్

మూలాలు

వెలుపలి లంకెలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు