లావా

భూమి వంటి కొన్ని గ్రహాల గర్భం నుండి బయటికి ఎగజిమ్మిన శిలాద్రవాన్ని లావా అంటారు. గ్రహగర్భంలో ఉండే వేడి వల్ల శిలాద్రవం (మాగ్మా) ఏర్పడుతుంది. గ్రహ గర్భంలో ఉండే రాతి ద్రవాన్ని (మాగ్మా) విపరీతమైన వేడిమి, వత్తిడితో, ఉపరితలంపై ఉన్న చీలికల ద్వారా గానీ, అగ్నిపర్వత ముఖద్వారాల గుండా గానీ బయటకు చిమ్ముతుంది. ఈ మాగ్మానే వాతావరణంలో వచ్చినపుడు లావా అని పిలుస్తారు. ఈ లావా గాఢమైన ద్రవము. దీని ఉష్ణోగ్రత 700 నుండి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు వుంటుంది. ఈ లావాయే చల్లబడి శిలలుగా రూపాంతరం చెందుతుంది. శిలలుగా మారిన తరువాత కూడా దాన్ని లావా అనడం కద్దు.

10 మీటర్ల ఎత్తు నుండి పొంగుతున్న లావా, హవాయ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
లావా

పేలుడులా కాకుండా కారుతూ బయటికి వచ్చే లావా భూమిపై ప్రవహిస్తూ విస్తరిస్తుంది. దీన్ని లావా ప్రవాహం అంటారు. ప్రవాహం ఆగినపుడు అది చల్లబడి ఇగ్నియస్ శిలలను ఏర్పడతాయి. లావా ప్రవాహాన్నే లావా అంటారు. లావా నీటి కంటే లక్ష రెట్లు చిక్కగా ఉన్నప్పటికీ, దానికున్న ప్రత్యేక లక్షణాల వల్ల అది చల్లబడి గడ్దకట్టే లోపు చాలా దూరం ప్రవహిస్తుంది.[1][2]

విస్ఫోటనం ద్వారా ఎగజిమ్మినపుడు లావా ప్రవాహం వెలువడదు. బూడిద, ఇతర చిన్నచిన్న శకలాల మిశ్రమం వెలువడుతుంది దీన్ని టెఫ్రా అంటారు. లావా అనే పదం ఇటాలియన్ నుండి వచ్చింది. 1737 లో జైరిగిన విసూవియస్ విష్ఫోటనం గురించి రాసే సందర్భంలో ఫ్రాన్సెస్కో సెరావో ఈ మాటను వాడినట్లు తెలుస్తోంది.[3]

ఇవీ చూడండి

మూలాలు