శాకాహారం

మాంసహార వినియోగం నుండి దూరంగా ఉండే అభ్యాసం

శాకాహారం (Vegetarianism) అనేది ఏ రకమైన మాంసం ఆహారంగా తీసుకోకుండా ఉండే ఆహార విధానం. శాకాహారాన్ని అవలంబించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది సృష్టిలో సాటి జీవుల పట్ల ప్రేమ. ఇటువంటి నైతికపరమైన నియమాలు చాలా మతవిశ్వాసాల్లోనూ, జంతుహక్కుల సంఘాల ప్రతిపాదనల్లోనూ క్రోడీకరించబడ్డాయి. శాకాహారం అలవాటు చేసుకోవడానికి ఆరోగ్యమైన జీవనం, రాజకీయ, పర్యావరణ, ఆర్థిక పరమైన, రుచికి సంబంధించిన, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన అనేక కారణాలు ఉన్నాయి.

శాకాహారం
Descriptionమొక్కల నుంచి సేకరించిన ఆహారం, డైరీ ఉత్పత్తులతో కలిసి, డైరీ ఉత్పత్తులు లేకుండా
వెరైటీలుఓవో, లాక్టో, ఓవో-లాక్టో, వీగనిజం, రా వీగనీజం, ఫ్రూటేరియనిజం, బౌద్ధ శాకాహారం, జైన శాకాహారం, యూదుల శాకాహారం, క్రైస్తవ శాకాహారం, సాత్వికాహారం

చరిత్ర

సా.శ.పూ 9వ శతాబ్దానికి చెందిన జైనుడు పార్శ్వనాథుడు జైనుల శాకాహార పద్ధతిని ప్రతిపాదించాడు. దీన్ని చాలామంది మొట్టమొదటి ప్రణాళికా బద్ధమైన శాకాహార పద్ధతిగా భావిస్తారు.

శాకాహారాన్ని గురించిన మొట్టమొదటి లిఖిత పూర్వక ఆధారాలు సా.శ.పూ 9 వ శతాబ్దం[1] నుంచి అన్ని జీవాల పట్ల ఆదరణ అనే భావన రూపంలో లభిస్తున్నాయి.[2][3] జైనమతం లో 23, 24 వ తీర్థంకరులైన పార్శ్వనాథుడు, మహావీరుడు సా.శ.పూ 8 నుంచి 6 వ శతాబ్దాల మధ్యలో అహింస, జైన శాకాహారాన్ని పునరుద్ధరించి వాటిని సమర్ధించారు. ఇది చాలా సమగ్రమైన, కట్టుదిట్టమైన శాకాహార పద్ధతి.[4][5][6] భారతీయ సంస్కృతిలో శాకాహారం అనేది సాటి జీవుల పట్ల అహింసను పాటించడం అనే భావనతో ముడిపడి ఉంది. దీన్నే వివిధ మతవర్గాలు, తత్వవేత్తలు కొన్ని వేల ఏళ్ళుగా ప్రబోధిస్తూ వస్తున్నారు.[7]

మూలాలు