సెల్యులోజ్

సెల్యులోజ్ ఒక సేంద్రియ సమ్మేళనం. ఇది కొన్ని వందల నుంచి వేలకొద్దీ గ్లూకోస్ యూనిట్లు సుదీర్ఘ శ్రేణిగా ఏర్పడ్డ పాలీశాకరైడ్.[3][4] పచ్చటి మొక్కల్లోనూ, కొన్ని రకాల శైవలాల కణాల గోడల్లో ప్రధానమైన నిర్మాణ భాగం. కొన్ని రకాలైన బ్యాక్టీరియా సెల్యులోజ్ ని స్రవించి జీవపొర (Biofilm) ని ఏర్పరుస్తాయి.[5] సెల్యులోజ్ భూమి మీద అత్యంత విస్తారంగా లభించే సేంద్రియ అణుపుంజం.[6]పత్తినార లో 90 శాతం, కలపలో 40-50 శాతం, ఎండబెట్టిన జనుములో సుమారు 57 శాతం సెల్యులోజ్ ఉంటుంది.[7][8][9]

సెల్యులోజ్[1]
Cellulose, a linear polymer of D-glucose units (two are shown) linked by β(1→4)-glycosidic bonds
Three-dimensional structure of cellulose
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[9004-34-6]
పబ్ కెమ్14055602
కెగ్C00760
ధర్మములు
(C
12
H
20
O
10
)
n
మోలార్ ద్రవ్యరాశి162.1406 g/mol per glucose unit
స్వరూపంwhite powder
సాంద్రత1.5 g/cm3
ద్రవీభవన స్థానం 260–270 °C; 500–518 °F; 533–543 K Decomposes[2]
నీటిలో ద్రావణీయత
none
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−963,000 kJ/mol[విడమరచి రాయాలి]
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−2828,000 kJ/mol[విడమరచి రాయాలి]
ప్రమాదాలు
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 15 mg/m3 (total) TWA 5 mg/m3 (resp)[2]
REL (Recommended)
TWA 10 mg/m3 (total) TWA 5 mg/m3 (resp)[2]
IDLH (Immediate danger)
N.D.[2]
సంబంధిత సమ్మేళనాలు
సంబంధిత సమ్మేళనాలు
Starch
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

సెల్యులోజ్ ని ప్రధానంగా కాగితం, కాగితపుబోర్డులు తయారు చేయడానికి వాడతారు. తక్కువ పరిమాణంలో సెల్యులోజ్ ని సెల్లోఫేన్, రేయాన్ ఉత్పత్తికి కూడా వినియోగిస్తారు. శక్తి నిచ్చే పంటల నుండి సెల్యులోజ్‌ను సెల్యులోసిక్ ఇథనాల్ వంటి జీవ ఇంధనంగా మార్చడం ద్వారా ప్రత్యామ్నాయ పునరుత్పాదక ఇంధనం అభివృద్ధి చెందుతోంది. పారిశ్రామిక ఉపయోగం కోసం సెల్యులోజ్ ప్రధానంగా కలప గుజ్జు, పత్తి నుండి తయారుచేస్తున్నారు.

కొన్ని జంతువులు, ముఖ్యంగా నెమరువేసే జంతువులు, ఇంకా చెదపురుగులు, వాటి పేగుల్లో నివసించే ట్రైకోనింఫా వంటి సహజీవన సూక్ష్మజీవుల సహాయంతో సెల్యులోజ్‌ను జీర్ణించుకోగలవు. మానవ పోషణలో, సెల్యులోజ్ అనేది కరగని జీర్ణం కాని ఆహార పీచుపదార్థం. ఇది మలవిసర్జన సాఫీగా కావడానికి సహాయపడుతుంది.

మూలాలు