1943 బెంగాల్ కరువు

1943 నాటి బెంగాల్ కరువు జపాన్ బర్మాను ఆక్రమించిన కాలంలో బ్రిటీష్ పరిపాలనా కాలం నాటి బెంగాల్ ప్రావిన్స్ (నేటి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ఒడిశా, బీహార్లు కలిసిన ప్రాంతం)కు వాటిల్లిన తీవ్రమైన కరువు. ఆకలి చావులు, పోషకాల లోపం, సంబంధిత రోగాలను పరిగణించగా 6 కోట్ల 30లక్షల మంది బెంగాల్ జనాభాలో, దాదాపుగా 30లక్షల మంది కరువు వల్ల మరణించారు,[1][2] మరణించినవారి సంఖ్యను గురించి అంచనాలు 15 లక్షల నుంచి 40 లక్షల నడుమ ఉన్నాయి.[3] దాదాపు సగం మంది బాధితులు 1943 డిసెంబరులో ఆహారం లభించాకా వచ్చిన జబ్బుల వల్ల మరణించారు. See [4] సాధారణంగా ఆహారం పండించడం విపరీతంగా తగ్గి, బెంగాల్ నుండి ఎగుమతులు రెట్టింపు కావడంతో ఈ స్థితి ఏర్పడ్డదని భావిస్తారు. [5] ఐతే అమర్త్య సేన్ ప్రకారం 1943లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏమీ తగ్గకపోగా 1941తో పోలిస్తే పెరిగింది.[3] గత బెంగాల్ కరువుల్లానే, అత్యధిక మరణాల నిష్పత్తి అతిపేద వర్గాలలో కాకుండా చేతివృత్తులవారు, చిరు వ్యాపారుల వర్గంలో నమోదైంది. కరువు కాలంలో ప్రజలు తమవద్ద ఉన్న డబ్బంతా ఆహార ధాన్యాలకే ఖర్చుచేయడంతో, చేతివృత్తులు, చిరువ్యాపారాల వారికి వృత్తి లేకుండా అయిపోయింది. దాంతో వారు పూర్తిగా కరువు పాలబడ్డారు.[6] కరువు సామాజిక, ఆర్థిక విధ్వంసానికి కూడా కారణమైంది, లక్షలాది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి.[7]

1943 బెంగాల్ కరువు
পঞ্চাশের মন্বন্তর
దేశంబ్రిటిషు ఇండియా
ప్రదేశంబెంగాల్
సంఘటనా కాలము1943–44
మొత్తం మరణాలు1.5 to 4 మిలియన్లు
పరిశీలనలుPolicy failure, war

ఇవి కూడా చూడండి

మూలాలు

ఇతర లింకులు