2019 పుల్వామా దాడి

పుల్వామా దాడి జరిగిన రోజునే భారత దేశం లో "బ్లాక్ డే " గా పిలుచుకుంటారు #బ్లాక్ డే

2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)[a] సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్ లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది. దాడిచేసినది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్ అని గుర్తించారు.[2][3][4]

2019 పుల్వామా దాడి
2019 పుల్వామా దాడి is located in Jammu and Kashmir
2019 పుల్వామా దాడి
జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగిన ప్రదేశం
ప్రదేశంలేథిపురా, పుల్వామా జిల్లా, జమ్ము కాశ్మీర్, భారతదేశం
భౌగోళికాంశాలు33°57′53″N 74°57′52″E / 33.96472°N 74.96444°E / 33.96472; 74.96444 (దాడి జరిగిన ప్రదేశం)
తేదీ2019 ఫిబ్రవరి 14 (2019-02-14)
15:15 ఇండియన్ స్టాండర్డ్ టైం (యూటీసీ+05:30)
లక్ష్యంసెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన రక్షణ దళ సైనికులు
దాడి రకం
ఆత్మాహుతి దాడి, కారు బాంబు
మరణాలు41 (40 సీఆర్పీఎఫ్ దళ సభ్యులు, 1 ఆత్మాహుతి బాంబర్)
ప్రాణాపాయ గాయాలు
35
నేరస్తులుజైష్-ఎ-మహమ్మద్

నోట్స్

మూలాలు