ఎమైనో ఆమ్లాలు

ఎమైనో ఆమ్లాలు (amino acids) జీవరసాయన శాస్త్రంలో చాల ముఖ్యమైనవి. వీటిని తెలుగులో నవామ్లాలు అంటారు.

అమినీ ఆమ్ల నిర్మాణం

ఈ పేరు వెనక చరిత్ర

మిగిలిన ఆమ్లాలతో పోలిస్తే ఇవి కొత్త జాతి పదార్థాలు. కనుక ఈ జాతికి కూడా ఒక ఇంగ్లీషులో ఒక కొత్త పేరు పెట్టవలసిన అవసరం వచ్చింది. ఈ కొత్త జాతి అణుపుంజములన్నింటిలో కొన్ని ఉమ్మడి లక్షణాలు కనబడ్డాయి. వీటన్నిటికి ఒక చివర -NH2 సమూహం, మరొక చివర -COOH సమూహం ఉండటం ఈ ఉమ్మడి లక్షణం. -NH2 ని ఇంగ్లీషులో ఎమైన్‌ గ్రూపు (amine group) అంటారు. ఈ ఎమైన్‌ (amine) అనే విశేషణం (adjective) అమ్మోనియా (ammonia) అనే నామవాచకం (noun) నుండి వచ్చింది. ఇక రెండవ పక్క ఉన్న -COOH ని ఇంగ్లీషులో కార్బాక్సిల్‌ గ్రూపు (carboxyl group) అంటారు. ఈ కార్బాక్సిల్‌ గుంపు ఉన్న పదార్థాలన్నీ ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటాయి. కనుక వీటి పేర్ల చివర 'ఆమ్లం' అని వస్తే బాగుంటుంది. మాట మొదట్లో ఎమైన్‌-, చివర -ఏసిడ్‌. వెరసి ఎమైనో ఏసిడ్‌.

ప్రాణ్యాల కట్టడికి ఇటికలు

శరీరంలో ఉన్న కణజాలం (tissue) కట్టడికి ప్రాణ్యాలు ముఖ్యం. కణజాలాన్ని ఒక కట్టడం లా ఊహించుకుంటే ఆ కట్టడానికి కావలసిన ఇటికలే నవామ్లాలు. ఈ నవామ్లాలనే ఇటికలు ఒకటి కాదు, రెండు కాదు, ఇరవై రకాలు కనుక వీటితో ఎన్నో రకాల ఆకారాల్లో, ఎన్నో రకాల లక్షణాలతో ప్రాణ్యాలని కట్టడి చెయ్యవచ్చు. అందుకనే పట్టు పురుగు చేసే పట్టు లక్షణాలు వేరు, నెత్తి మీద పెరిగే జుత్తు లక్షణాలు వేరు. రక్తానికి ఎరుపు రంగు ఇచ్చే ప్రాణ్యం లక్షణం ఒకటయితే గోళ్ళకి గట్టితనాన్నిచ్చే ప్రాణ్యం మరొకటి. నవామ్లాలని రకరకాల వరసల్లో అమర్చటం వల్ల సాధ్యపడే రకరకాల ఆకారాలే ఈ లక్షణాల వైవిధ్యతకి కారణం.

నవామ్లాల లక్షణాల పట్టిక

అమినో ఆమ్లం3-అక్షరాల పేరు1-అక్షరం పేరుపక్క గొలుసు ధ్రువత్వంపక్క గొలుసు యొక్క ఆమ్లత్వం లేక క్షారత్వంHydropathy index[1]
అలనీన్AlaAధ్రువత్వం లేదు (nonpolar)మధ్యస్థం (neutral)1.8
ఆర్జినీన్ArgRధ్రువత్వం ఉంది (polar)క్షారత్వం (strongly basic)-4.5
ఆస్పర్టీన్‌AsnNధ్రువత్వం ఉంది (polar)మధ్యస్థం (neutral)-3.5
ఆస్పార్టిక్ ఆమ్లంAspDధ్రువత్వం ఉంది (polar)ఆమ్లత్వం (acidic)-3.5
సిస్టైన్CysCధ్రువత్వం ఉంది (polar)మధ్యస్థం (neutral)2.5
గ్లుటామిక్ ఆమ్లంGluEధ్రువత్వం ఉంది (polar)ఆమ్లత్వం (acidic)-3.5
గ్లుటమీన్GlnQధ్రువత్వం ఉంది (polar)మధ్యస్థం (neutral)-3.5
గ్లయిసీన్GlyGధ్రువత్వం లేదు (nonpolar)మధ్యస్థం (neutral)-0.4
హిస్టిడీన్HisHధ్రువత్వం ఉంది (polar)క్షారత్వం (కొద్దిగా)-3.2
ఐసోలూసీన్IleIధ్రువత్వం లేదు (nonpolar)మధ్యస్థం (neutral)4.5
లూసీన్LeuLధ్రువత్వం లేదు (nonpolar)మధ్యస్థం (neutral)3.8
లైసీన్LysKధ్రువత్వం ఉంది (polar)క్షారత్వం (basic)-3.9
మిథియొనీన్MetMధ్రువత్వం లేదు (nonpolar)మధ్యస్థం (neutral)1.9
ఫినైన్ అలనీన్PheFధ్రువత్వం లేదు (nonpolar)మధ్యస్థం (neutral)2.8
ప్రొలీన్ProPధ్రువత్వం లేదు (nonpolar)మధ్యస్థం (neutral)-1.6
సెరీన్SerSధ్రువత్వం ఉంది (polar)మధ్యస్థం (neutral)-0.8
థ్రియోనీన్ThrTధ్రువత్వం ఉంది (polar)మధ్యస్థం (neutral)-0.7
ట్రిప్టోఫాన్TrpWధ్రువత్వం లేదు (nonpolar)మధ్యస్థం (neutral)-0.9
టైరోజీన్TyrYధ్రువత్వం లేదు (nonpolar)మధ్యస్థం (neutral)-1.3
వేలీన్ValVధ్రువత్వం లేదు (nonpolar)మధ్యస్థం (neutral)4.2

మూలాలు