కియా


కియా లేదా కియా మోటార్స్ కార్పొరేషన్ దక్షిణ కొరియాకు చెందిన అంతర్జాతీయ వాహన నిర్మాణ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం సియోల్ లో ఉంది. ఇది దక్షిణ కొరియాలో దీని మాతృ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్స్ తర్వాత రెండో అతిపెద్ద వాహన ఉత్పత్తి సంస్థ. 2015 డిసెంబరు నాటికి ఇందులో అత్యధిక మైనారిటీ వాటా (33.88%) హ్యుందాయ్ మోటార్స్ చేతిలో ఉంది.

కియా
పరిశ్రమపరిశ్రమ
స్థాపనస్థాపన
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం
Areas served
ప్రాంతాల సేవలు
Websitekia.com Edit this on Wikidata

కియా మోటార్స్ ప్రారంభించిన రెండు సంవత్సరాలలో లాభాలతో నడుస్తుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి 1111 కోట్ల పన్నులతదుపరి లాభంతో కంపెనీ ప్రపంచ మొత్తం ఆదాయంలో 5% భారత విభాగం ద్వారా పొందుతుంది. 2022 లో 300000 వాహానాలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యం, మొత్తం కంపెనీ ప్రపంచ ఉత్పత్తిలో 10 శాతానికి చేరువవుతుంది.[1]

చరిత్ర

ఈ సంస్థ 1944 జూన్ 9 న ప్రారంభమైంది. మొదట్లో క్యుంగ్‌సుంగ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ అనే పేరుతో ఉక్కు గొట్టాలు, సైకిల్ విడిభాగాలు తయారు చేసేది. 1951 లో మొట్టమొదటిసారిగా దేశీయంగా తయారైన సైకిల్ తయారు చేసింది. 1952 లో ఈ సంస్థ పేరును కియా ఇండస్ట్రీస్ గా మార్చింది.[2] తర్వాత 1957 లో హోండా లైసెన్సింగ్ సహాయంతో మోటార్ సైకిళ్ళను ఉత్పత్తి చేసింది. మజ్దా కంపెనీ సహాయంతో ట్రక్కులు (1962), కార్లు (1974) తయారు చేయడం మొదలు పెట్టింది.

1973 లో అన్ని హంగులు కలిగిన సోహరి ప్లాంట్ లో ఇంటిగ్రేటెడ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది.[3]

హ్యుందాయ్ టేకోవర్

1997 లో ఆసియా ఆర్థిక సంక్షోభం కారణంగా కియా సంస్థ దివాలా తీసింది. 1998 లో హ్యుందాయ్ మోటార్స్ తో చేతులు కలిపి వారితో యాజమాన్యాన్ని పంచుకునేందుకు అంగీకరించింది. 1986 నుంచి కియా లో ఆసక్తి చూపిస్తూ వచ్చిన ఫోర్డ్ మోటార్ ను కాదని హ్యుందాయ్ సంస్థ 51 శాతం వాటాను దక్కించుకుంది.[4]

మూలాలు