ఖాట్మండు

నేపాల్ రాజధాని మరియు అతిపెద్ద నగరం

ఖాట్మండు లేదా కాఠ్మండు, నేపాల్ దేశ రాజధాని. 2015లో సంభవించిన భూకంపం లో ఈ నగరం సర్వనాశనమైంది.

ఖాట్మండు మెట్రోపాలిటన్ నగరం
काठमाण्डू महानगर, यें देय्
పైనుండి సవ్య దిశలో: కాఠ్మండు చుట్టుపక్కల కనిపించే తోరణాలు, దెగుతలేజు నేపధ్యంలో కాఠ్మండు దర్బార్ స్క్వేర్, బుద్దనాధ స్థూపం, బాగ్‌మతి నది, బుద్దనీల్‌కంఠ, సింఘ దర్బార్, స్వయంభూనాధ్ ఆలయం రాత్రి వేళ, పశుపతినాథ్ దేవాలయం
పైనుండి సవ్య దిశలో: కాఠ్మండు చుట్టుపక్కల కనిపించే తోరణాలు, దెగుతలేజు నేపధ్యంలో కాఠ్మండు దర్బార్ స్క్వేర్, బుద్దనాధ స్థూపం, బాగ్‌మతి నది, బుద్దనీల్‌కంఠ, సింఘ దర్బార్, స్వయంభూనాధ్ ఆలయం రాత్రి వేళ, పశుపతినాథ్ దేవాలయం
Motto(s): 
My legacy, my pride, my Kathmandu
దేశంనేపాల్
Development RegionCentral
జోన్బాగ్‌మతి జోన్
జిల్లాఖాట్మండు జిల్లా
పేదరిక సూచీIncrease 0.710 High [1]
పేదరిక సూచీDecrease 25.8 Low
అక్షరాస్యత శాతంIncrease 98% High
Established900s BC[2]
Government
 • ముఖ్య కార్యనిర్వహణ అధికారిపూర్ణ భక్త తందుకర్
Area
 • Total49.45 km2 (19.09 sq mi)
Elevation
1,400 మీ (4,600 అ.)
Population
 (2011)
 • Total10,03,285[3]
 • Density20,288.8/km2 (52,548/sq mi)
భాషలు
 • Localనేపాలీ భాష (లేదా నెవర్ భాష), నేపాలీ భాష, షెర్పా భాష, తమంగ్ భాష, గురుంగ్ భాష, మంగర్ భాష, సునువర్ భాష/కిరాంతీ భాష, టిబెటన్ భాష
 • అధికారిక భాషనేపాలీ భాష (లేదా నెవర్ భాష), నేపాలీ భాష, ఆంగ్లం
Time zoneUTC+5:45 (నేపాల్ ప్రామాణిక కాలం)
పిన్‌కోడ్
44600 (GPO), 44601, 44602, 44604, 44605, 44606, 44608, 44609, 44610, 44611, 44613, 44614, 44615, 44616, 44617, 44618, 44619, 44620, 44621
Area code01

పేరు వెనుక చరిత్ర

కాష్ఠమండపం

ఖాట్మండు నగరానికి ఆ పేరు కాష్ఠమండపం ఆలయం ద్వారా వచ్చింది. సంస్కృతంలో కాష్ఠ (काष्ठ) అనగా కొయ్య , మండప్ (/मण्डप) అనగా కప్పబడిన ప్రదేశం అని అర్థం. స్థానిక భాషలో దీనిని మారు సతాల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1596వ సంవత్సరంలో రాజు లక్ష్మీ నరసింగ మల్ల నిర్మించాడు. రెండు అంతస్తులుగా నిర్మింపబడిన ఈ ఆలయంలో పూర్తిగా కొయ్య సామాగ్రినే వాడారు. ఇనుప మేకులు గానీ లేదా ఇతర సామాగ్రి కానీ వాడనేలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దేవాలయానికి కావలసిన చెక్క సామాగ్రి అంతా ఒకే చెట్టు నుండి సేకరించడం జరిగింది[4].

చరిత్ర

ఇక్కడ జరిగిన తవ్వకాల ప్రకారం గతంలో ఇక్కడ నాగరికత వెలిసినట్లు ఆధారాలు లభించాయి. ఈ త్రవ్వకాలలో భాగంగా మలిగావ్లో సా.శ. 185వ సంవత్సరానికి చెందిన ప్రతిమ లభించింది[5]. దండోచైత్య సొరంగంలో బ్రహ్మి లిపిలో లిఖింపబడిన వాక్యాలున్న ఒక ఇటుక లభ్యమైంది. పురాతత్వ శాస్త్రవేత్తలు దీనిని 2000 సంవత్సరం నాటికి సమూరు 2000 సంవత్సరాలక్రిందటినాటిదిగా అంచనా వేసారు[5].

భౌగోళిక ప్రాంతం

ఖాట్మండు నగర పరిధి

అధికారికంగా కాఠ్మండు నగర పరిధి నిర్థారించనప్పటికీ, ఈ నగర పరిధి మూడు జిల్లాలలో విస్తరించి ఉంది . ఈ మూడు జిల్లాలలోనే దేశ జనాభాలో అత్యధిక జనాభా కేంద్రీకృతమై ఉంది. ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పరిపాలనా జిల్లావిస్తీర్ణం (km²)జనాభా (2001 జనాభా లెక్కలు)జనాభా (2011 జనాభా లెక్కలు)జన సాంద్రత (km²)
ఖాట్మండు3951,081,8451,740,9774408
లలిత్‌పూర్385337,785466,7841212
భక్తపూర్119225,461303,0272546
ఖాట్మండు నగర పరిధి 8991,645,0912,510,7882793

వాతావరణం

నేపాల్ లో ముఖ్యంగా ఐదు రకాలైన వాతావరణ ప్రదేశాలు చూడవచ్చు. ఈ కేంద్రాలలో భాగంగా కాఠ్మాండు ఉష్ణ ప్రాంతంలో ( సముద్ర మట్టానికి 1,200–2,300 మీటర్లు (3,900–7,500ft)) విస్తరించి ఉంది. ఈ నగరంలో ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది.

దర్శనీయ ప్రదేశాలు

ప్రముఖులు

చిత్రమాలిక

మూలాలు

బయటి లంకెలు