పెడ్రో అల్మోడోవర్

స్పానిష్ సినిమా నిర్మాత.

పెడ్రో అల్మోడోవర్ కాబల్లెరో (1949 సెప్టెంబరు 25)[1] స్పానిష్ సినిమా నిర్మాత. మెలోడ్రామా, హాస్యం, బోల్డ్ కలర్, అలంకరణ, జనాదరణ పొందిన సంస్కృతి, సంక్లిష్ట కథనాలతో ఇతని సినిమాలు గుర్తింపుపొందాయి. ఇతని సినిమాలలో సమస్యలు, కుటుంబం వంటివి అత్యంత ప్రబలమైన అంశాలుగా ఉంటాయి. అంతర్జాతీయ సినిమా నిర్మాతలలో ఒకరిగా ప్రశంసించబడిన అల్మోడోవర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకట్టుకుంటున్నాయి.

పెడ్రో అల్మోడోవర్
పెడ్రో అల్మోడోవర్ (2018)
జననం
పెడ్రో అల్మోడోవర్ కాబల్లెరో

(1949-09-25) 1949 సెప్టెంబరు 25 (వయసు 74)
కాల్జాడా డి కాలట్రావా, స్పెయిన్‌
వృత్తిసినిమా నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1974–ప్రస్తుతం
భాగస్వామిఫెర్నాండో ఇగ్లేసియాస్ (2002–ప్రస్తుతం)

జననం, కుటుబం

పెడ్రో అల్మోడోవర్ కాబల్లెరో 1949 సెప్టెంబరు 25న స్పెయిన్‌లోని కాస్టిలే-లా మంచా ప్రావిన్స్‌లోని సియుడాడ్ రియల్‌లోని ఒక చిన్న గ్రామీణ పట్టణమైన కాల్జాడా డి కాలట్రావాలో జన్మించాడు.[2] అతనికి ఇద్దరు అక్కలు (ఆంటోనియా, మరియా జీసస్), ఒక సోదరుడు (అగస్టిన్) ఉన్నారు.[3] . [4] తండ్రి, ఆంటోనియో అల్మోడోవర్, ఒక వైన్ తయారీదారుడు,[5] తల్లి ఫ్రాన్సిస్కా కాబల్లెరో, లెటర్ రీడర్, ట్రాన్స్‌క్రైబర్.[6]

సినిమారంగం

1986లో, తన తమ్ముడు అగస్టిన్ అల్మోడోవర్‌తో కలిసి ఎల్ డెసియో అనే తన స్వంత సినిమా నిర్మాణ సంస్థను స్థాపించాడు. 1987లో లా ఆఫ్ డిజైర్ సినిమాను నిర్మించాడు. 1988లో వచ్చిన ఉమెన్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ ఎ నెర్వస్ బ్రేక్‌డౌన్ సినిమా, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డుకు ఎంపికైంది.

నటులు ఆంటోనియో బాండెరాస్, పెనెలోప్ క్రజ్‌లతో కలిసి విజయవంతమైన సినిమాలు తీశాడు. టై మి అప్‌! టై మి డౌన్! (1989) హై హీల్స్ (1991), లైవ్ ఫ్లెష్ (1997) అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు..తరువాతి రెండు సినిమాలు ఆల్ అబౌట్ మై మదర్ (1999), టాక్ టు హర్ (2002) అతనికి వరుసగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అకాడమీ అవార్డును పొందాయి. తరువాత వోల్వర్ (2006), బ్రోకెన్ ఎంబ్రేసెస్ (2009), ది స్కిన్ ఐ లైవ్ ఇన్ (2011), జూలియటా (2016), పెయిన్ అండ్ గ్లోరీ (2019), పారలల్ మదర్స్ (2021) మొదలైన సినిమాలు తీశాడు.

అవార్డులు

అల్మోడోవర్ రెండు అకాడమీ అవార్డులు, ఐదు బాఫ్టా అవార్డులు, రెండు ఎమ్మీ అవార్డులు, రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, తొమ్మిది గోయా అవార్డులతోపాటు ఇతర అనేక అవార్టులను అందుకున్నాడు. 1997లో ఫ్రెంచ్ లెజియన్ ఆఫ్ హానర్, 1999లో ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడల్ ఆఫ్ మెరిట్, 2013లో యూరోపియన్ ఫిల్మ్ అకాడమీ అచీవ్‌మెంట్ ఇన్ వరల్డ్ సినిమా అవార్డును అందుకున్నాడు.[7][8] 2019లో గోల్డెన్ లయన్‌ను అందుకున్నాడు.[9][10][11] 2009లో[12][13] హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి, 2016లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరల్ డిగ్రీలను కూడా పొందాడు.

మూలాలు

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.