భారత ప్రధానమంత్రుల జాబితా


ప్రధానమంత్రి, భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, దేశ కార్యనిర్వాహక అధికారాలు ప్రధానమంత్రి, ఇంకా అతని మంత్రి మండలికి ఉంటాయి. దేశ పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులచే ఎన్నుకోబడ్డ నాయకుడు రాష్ట్రపతిచే ప్రధానమంత్రిగా నియమించబడతాడు.[1]

భారతదేశ మంత్రులు జాబితా

క్ర.సం.పేరుచిత్రంనుండివరకుపార్టీ
01జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగష్టు 151964 మే 27కాంగ్రెస్
*గుల్జారీలాల్ నందా1964 మే 271964 జూన్ 9కాంగ్రెస్
02లాల్ బహదూర్ శాస్త్రి 1964 జూన్ 91966 జనవరి 11కాంగ్రెస్
*గుల్జారీలాల్ నందా 1966 జనవరి 111966 జనవరి 24కాంగ్రెస్
03ఇందిరా గాంధీ 1966 జనవరి 241977 మార్చి 24కాంగ్రెస్
04మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 241979 జూలై 28జనతా పార్టీ
05చరణ్‌సింగ్ 1979 జూలై 281980 జనవరి 14జనతా పార్టీ
**ఇందిరా గాంధీ 1980 జనవరి 141984 అక్టోబరు 31కాంగ్రెస్
06రాజీవ్ గాంధీ 1984 అక్టోబరు 31,1989 డిసెంబరు 2కాంగ్రెస్***
07వి.పి.సింగ్ 1989 డిసెంబరు 2,1990 నవంబరు 10,జనతా దళ్
08చంద్రశేఖర్1990 నవంబరు 101991 జూన్ 21జనతా దళ్
09పి.వి.నరసింహారావు 1991 జూన్ 211996 మే 16కాంగ్రెస్
10అటల్ బిహారీ వాజపేయి 1996 మే 161996 జూన్ 1భాజపా
11హెచ్.డి.దేవెగౌడ 1996 జూన్ 11997 ఏప్రిల్ 21జనతా దళ్
12ఐ.కె.గుజ్రాల్ 1997 ఏప్రిల్ 211998 మార్చి 19జనతా దళ్
**అటల్ బిహారీ వాజపేయి 1998 మార్చి 192004 మే 22భాజపా
13మన్మోహన్ సింగ్ 2004 మే 222014 మే 25కాంగ్రెస్ సంకీర్ణం
14నరేంద్ర మోడీ 2014 మే 26పదవిలోభాజపా

గమనికలు

1.* ఆపద్ధర్మ
2.** మళ్ళీ అధికారానికి వచ్చారు
3.*** ఇండియన్ నేషనల్ భారత జాతీయ కాంగ్రెస్ చీలి భారత జాతీయ కాంగ్రెస్-ఐ గా మారింది. అదే వర్గం తరువాత ఇండియన్ నేషనల్ భారత జాతీయ కాంగ్రెస్ గా గుర్తింపు పొందింది.

మూలాలు

వెలుపలి లంకెలు