మారిషస్

మారిషెస్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్, (République de Maurice), ఇది ఒక ద్వీప దేశం. ఆఫ్రికా ఖండతీర ఆగ్నేయ తీరప్రాంతంలో 2000 కీ.మీ దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. నైఋతిదిశన, మడగాస్కర్కు పశ్చిమాన 870 కి.మీ. మారిషస్‌కు తూర్పున 560 కి.మీ దూరాన రోడ్రిగ్యూసు, అగలెగా, సెయింటు బ్రాండను ద్వీపాలు కూడా మారిషస్‌లో భాగంగా ఉన్నాయి. ఫ్రెంచి ఓవర్సీసు రీయునియనులో మాస్కరెనె ద్వీపాలతో మారిషస్‌, బ్రాండను భాగంగా ఉన్నాయి. మారిషస్ వైశాల్యం 2,040 చ.కి.మీ. రాజధాని నగరం పోర్టు లూయిసు దేశంలో అతిపెద్ద నగరంగా కూడా ప్రత్యేకత కలిగి ఉంది.

రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్
République de Maurice
Flag of మారిషెస్ మారిషెస్ యొక్క చిహ్నం
నినాదం
"Stella Clavisque Maris Indici"  (Latin)
"Star and Key of the Indian Ocean"
జాతీయగీతం

మారిషెస్ యొక్క స్థానం
మారిషెస్ యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
పోర్ట్ లూయిస్
Coordinates: Unable to parse latitude as a number:2

{
{{#coordinates:}}: invalid latitude

అధికార భాషలు ఆంగ్లం1 తెలుగు
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు en:Mauritian Creole, భోజ్‌పురి, French, Chinese
ప్రజానామము Mauritian
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  అధ్యక్షుడు అనిరుధ్ జగన్నాథ్
 -  ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్‌గులామ్
స్వాతంత్ర్యము ఆంగ్లేయుల నుండి 
 -  Date మార్చి 12 1968 
 -  గణతంత్రం మార్చి 12 1992 
 -  జలాలు (%) 0.05
జనాభా
 -  2006 అంచనా 1,256,7392 (153rd)
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $16.0 billion (119th)
 -  తలసరి $13,703 (51st)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.804 (high) (65th)
కరెన్సీ en:Mauritian rupee (MUR)
కాలాంశం MUT (UTC+4)
 -  వేసవి (DST) not observed (UTC+4)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mu
కాలింగ్ కోడ్ +230
1 [1][2]
2 The population estimate is for the whole republic. For the island of Mauritius only, as at 31 December 2006, it is 1,219,220[3]

ప్రారంభంలో డచ్చి కాలనీ (1630-1710) తరువాత ఫ్రెంచి కాలనీ (1715-1810)గా ఉండి తరువాత బ్రిటిషు కాలనీగా మారి 1968 వరకు బ్రిటిషు ఆధీనంలో ఉండి తరువాత స్వతంత్రం పొందింది. " బ్రిటిషు క్రౌను కాలనీ ఆఫ్ మొరీషియసులో ఒకప్పుడు మారిషస్‌, రోడ్రిగ్యూసు, అగలెగా, సెయింటు బ్రాండను, చాగోసు ఆర్చిపిలాగో, సేచెల్లిసు భాగంగా ఉన్నాయి. 1903 లో సైచెల్లిసును ప్రయేక కాలనీగా రూపొందించిన తరువాత మారిషస్ క్రమంగా అభివృద్ధి చెందడం మొదలైంది. 1965 లో చాగో ద్వీపసమూహం మారిషస్ నుండి తొలగించబడింది. చాగోసు ద్వీపసమూహం మీద సార్వభౌమాధికారం విషయంలో మారిషస్‌, యునైటెడు కిండం మద్య విబేధాలు తలెత్తాయి. 1965 లో మారిషస్ స్వతంత్రానికి 3 సంవత్సరాల ముందు యు.కె. చాగో ద్వీపసమూహాన్ని మారిషస్ నుండి తొలగించింది. యు.కె. క్రమంగా ద్వీపసమూహంలోని స్థానిక ప్రజలను తొలగించి ద్వీపసమూహం లోని అతిపెద్ద ద్వీపం డియాగో గార్షియాను యునైటెడు స్టేట్సుకు లీజుకు ఇచ్చింది. సముద్రతీర పర్యాటకులకు, మాధ్యమం, మునుపటి నివాసులకు చాగో ద్వీపసమూహంలో ప్రవేశించడం నిషేధించబడింది. మారిషస్ ఫ్రెంచి నుండి ట్రొమెలిన్ ద్వీపం మీద సార్వభౌమాధికారాన్ని పొందింది.

మారిషస్ ప్రజలలో బహుళ సప్రదాయాలు, బహుళ మతాలు, బహుళ సంస్కృతులు, బహుళ భాషలకు చెందిన ప్రజలు ఉన్నారు. ద్వీపదేశప్రభుత్వం " వెస్టు మినిస్టరు పార్లమెంటరీ సిస్టం " విధానంలో రూపొందించబడింది. మారిషస్ ప్రజాపాలన, ఆర్ధికం, రాజకీయ స్వాతంత్రాలు అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు వర్గీకరించబడింది. ఆఫ్రికాదేశాల మానవాభివృద్ధి జాబితాలో మారిషస్ ద్వితీయస్థానంలో ఉంది. మాస్కరెనె ద్వీపాలతో మారిషస్ జంతుజాలం, వృక్షజాలం (అనేక అంతరించి పోతున్న జాతులతో) ప్రత్యేక గుర్తింపు పొందుతూ ఉంది.హిందూయిజం అతిపెద్ద మతంగా ఉన్న ఏకైక ఆఫ్రికాదేశంగా మారిషస్‌కు ప్రత్యేకత ఉంది. ప్రభుత్వం ఆంగ్లభాషను ప్రధానభాషగా ఉపయోగిస్తుంది.

తెలుగు వారు

ప్రైవేటు వ్యవసాయదారుల క్రింద కూలీలుగా పనిచేయటానికి 1835 లో కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య అనే ముగ్గురు తెలుగు వారు కాందిశీకులుగా తొలిసారిగా మారిషస్‌లో అడుగుపెట్టారు.ఆ మరుసటి సంవత్సరం గౌంజన్ అనే ఓడలో దాదాపు 30 మంది తెలుగువారు ఆ ద్వీపంలో కాలుపెట్టారు. కాకినాడ సమీపాన వున్న 'కోరంగి' రేవు నుండి బయలు దేరి వచ్చినందుకు వాళ్లని కోరంగివాళ్ళు అని, వారు మాట్లాడే తెలుగు భాషకు 'కోరంగి భాష' అని పిలిచేవారు. 1843 సంవత్సరంలో కోరంగి పికేట్ అనబడే 231 టన్నుల బరువు నాలుగైదు తెరచాపలు గల బార్క్ అనే మాదిరి ఓడ రెండు సార్లు ప్రయాణం చేసి దాదాపు రెండు వందల మందిని మారిషస్ దీవికి చేర్చింది.[4]తెలుగు వారు భాషా సంస్కృతి కాపాడుకొంటున్నారు. సర్ వీరాస్వామి రింగడు తండ్రి తెలుగువాడు, తల్లి తమిళవనిత. తెలుగు భాషా సంస్కృతులపై ఆయన అపారమైన అభిమానం చూపుతారు. ఆంధ్ర విశ్వ విధ్యాలయం డాక్టరేటుతో తెలుగు బిడ్డడైన సర్‌వీరాస్వామి రింగడును సత్కరించింది. అంచెలంచెలుగా వివిధ హోదాలు చేపట్టి, 1986 జనవరి 17 న గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.

పేరు వెనుక చరిత్ర

1502 లో ఇటలీ కార్ట్రాగ్రాఫరు అల్బెర్టో కంటినోచే తయారు చేయబడిన ఒక మ్యాపులో మారిషస్ అని పిలవబడే ఒక ద్వీపం చోటుచేసుకోవడం మొదటి చారిత్రిక ఆధారంగా భావించబడుతుంది.[5][6] 975 లో మారిషస్‌ను అరబు నావికులు డీనా అరోబి అని పిలిచారు. వీరు ఈ ద్వీపాన్ని సందర్శించిన మొదటి వ్యక్తులుగా భావించబడుతున్నారు. 1507 లో పోర్చుగీసు నావికులు జనావాసాలులేని ద్వీపాన్ని సందర్శించారు. ఈ ద్వీపం ప్రారంభ పోర్చుగీసు పటాలలో " సిర్నే " గా పేర్కొనబడింది. బహుశా 1507 దండయాత్ర చేసిన నౌక పేరు నుండి వచ్చింది. మరొక పోర్చుగీసు నావికుడు డొం పెడ్రో మస్కరెన్హాసు, ఆ ద్వీపసమూహం పేరును మస్కరెనె అని పేర్కొన్నాడు.


1598 లో అడ్మిరలు వైబ్రాండు వాను వార్వికు నాయకత్వంలో ఒక డచ్చి బృందం గ్రాండు పోర్టు వద్దకు వచ్చి డచ్చి రిపబ్లిక్కు మద్ధతుదారుడైన మారిస్ వాన్ నాసావు గౌరవసూచకంగా ద్వీపానికి మారిషస్ అని పేరు పెట్టారు. తరువాత ఈ ద్వీపం ఒక ఫ్రెంచి వలసరాజ్యంగా మారింది. తరువాత " ఐలె డి ఫ్రాన్సు " పేరు పెట్టబడింది. 1810 డిసెంబరు 3 న నెపోలియను యుద్ధాల సమయంలో గ్రేటు బ్రిటనుకు లొంగిపోయింది. బ్రిటీష్ పాలనలో ఈ ద్వీపం పేరు తిరిగి మారిషస్ అని మార్చబడింది. మారీసేస్ క్రియోలు భాషలో మోరిసు, ఫ్రెంచి భాషలో మౌరిసు, ఐలె మౌరిసు అని పిలువబడుతుంది.

చరిత్ర

ఆరంభకాల చరిత్ర

మధ్యయుగ కాలంలో మొట్టమొదటగా నమోదు చేయబడిన పర్యటనకు ముందు మారిషస్ ద్వీపం జనావాసరహితంగా ఉండేది. అరబు నావికులు దీనిని డీనా అరోబి అని పిలిచారు.

1507 లో పోర్చుగీసు నావికులు జనావాసాలులేని ద్వీపానికి వచ్చి ఒక మజిలీ స్థావరాన్ని స్థాపించారు. పోర్చుగీసు నావికుడు అయిన " డియోగో ఫెర్నాండెజు పెరీరా " మొరిషియసులో మొట్టమొదటి ఐరోపా దేశస్థుడుగా ప్రవేశించాడు. ఆయన ఈ ద్వీపానికి "ఇల్హా డో సిర్నే" అనే పేరు పెట్టారు. పోర్చుగీసు వారికి ఈ ద్వీపాలలో ఆసక్తి లేని కారణంగా ఇక్కడ దీర్ఘకాలం నివసించలేదు.[7]

డచ్చి మొరీషియసు (1638–1710)

1598 లో " అడ్మిరలు వైబ్రాండు వాన్ వార్వికు " అనే డచ్చి స్క్వాడ్రను గ్రాండు పోర్టు వద్ద దిగి రిపబ్లికు నస్సౌ (డచ్చి: మారిట్సు వాను నస్సా) రాకుమారుడు మారిసు ఙాఅపకార్ధంగా ఈ ద్వీపానికి "మారిషియస్" అనే పేరు పెట్టారు. డచ్చి వారు ఈ ద్వీపాన్ని 1638 లో నివాసితప్రాంగంగా చేసింది. దాని నుండి వారు ఎబొనీ చెట్లను తొలగించి చెరకు, పెంపుడు జంతువులు, జింకలను ప్రవేశపెట్టారు. డచ్చి నావికుడు అబెలు టాస్మాను ఆస్ట్రేలియా పశ్చిమ భాగాన్ని కనుగొనటానికి బయలుదేరాడు. మొదటి డచ్చి స్థావరం ఇరవై సంవత్సరాల కాలం కొనసాగింది. అనేక ప్రయత్నాలు తరువాత జరిగినప్పటికీ ఈ స్థావరాలలో తగినంత అభివృద్ధి చెందనికారణంగా 1710 లో డచ్చి మారిషస్‌ను వదలివేసింది.[7][8]

ఫ్రెంచి మొరీషియసు (1715–1810)

ఇప్పటికే ఐల్ బౌర్బాన్ (ప్రస్తుతం రీయూనియన్) ను నియంత్రిస్తున్న ఫ్రాన్సు 1715 లో మారిషస్ మీద నియంత్రణను తీసుకుంది. దాని పేరును ఐలె డి ఫ్రాంసుగా మార్చింది. 1723 లో బానిసలను "వస్తువుల" గా వర్గీకరించడానికి కోడ్ నోయిర్ స్థాపించబడింది. యజమాని తన "వస్తువులను" కోల్పోయే సందర్భంలో భీమా డబ్బు, నష్ట పరిహారాన్ని పొందగలిగేలా ఈ సంస్థ స్థాపించబడింది.[9]1735 లో ఇక్కడకు చేరుకున్న ఫ్రెంచి గవర్నరు బెర్ట్రాండు-ఫ్రాంకోయిసు మాయ డే లా బౌర్డొనాయిసు చక్కెర ఉత్పత్తి మీద దృష్టి కేంద్రీకరించి సుసంపన్న ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసాడు. మాహె డి లా బోర్డన్ననైసు పోర్టు లూయిసును స్థాపించి నౌకా స్థావరం, నౌకా నిర్మాణ కేంద్రంగా అభివృద్ధి చేసాడు. [7]


అతని పాలనలో అనేక భవనాలు నిర్మించబడ్డాయి. వీటిలో చాలా వరకు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ గృహం, చెటేవు డి మోసై ప్లాయిసరు, పోలీసు బలగాల ప్రధాన కార్యాలయ విభాగం బారక్సు ఉన్నాయి. ఈ ద్వీపం ఫ్రెంచి ఈస్టు ఇండియా కంపెనీ పరిపాలనలో ఇది 1767 వరకు కొనసాగింది.[7]

1767 నుండి 1810 వరకు (ఫ్రెంచి విప్లవం సమయంలో కొంతకాలం మినహా) నివాసులు ఫ్రాన్సు నుండి స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ ద్వీపాన్ని ఫ్రెంచి ప్రభుత్వం నియమించిన అధికారులు నియంత్రించారు. జాకుసు-హెన్రీ బెర్నార్డిను డి సెయింటు-పియర్రు ఈ ద్వీపంలో 1768 నుండి 1771 వరకు నివసించి తిరిగి ఫ్రాన్సుకు వెళ్ళాడు. ఇక్కడ అతను పాల్ ఎట్ వర్జిని అనే ఒక ప్రేమ కథను వ్రాశాడు. ఇది ఫ్రెంచి భాష మాట్లాడే ఐల్ డి ఫ్రాన్సులో ప్రాబల్యత సంతరించుకుంది. ప్రసిద్ధ ఫ్రెంచి గవర్నర్లు వికోమెటు డి సౌలియకు (పోర్ట్ లూయిస్లో చౌస్సీని నిర్మించారు. [10] సవన్నే జిల్లాలో స్థిరనివాసానికి రైతులను ప్రోత్సహించారు) ఆంటోనీ బ్రుని డి'ఎర్రేక్సాయెక్సు హిందూ మహాసముద్రంలో ఫ్రెంచి భారతదేశంలో పాండిచ్చేరికి బదులుగా మారిషస్లో తమ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉండాలి అని కోరుకున్నాడు.[11] ఫ్రెంచి విప్లవ యుద్ధాలలో విజయవంతమైన జనరలుగా ఉన్న చార్లెసు మాథ్యూ ఇసిడోరు డీకాను మొదటి నెపోలియనుకు ప్రత్యర్థిగా ఉన్నాడు. 1803 ఆయన నుండి 1810 వరకు ఇస్లే డి ఫ్రాన్సు, రీయూనియను గవర్నర్గా పరిపాలించాడు. బ్రిటిషు నౌకాదళ కార్టోగ్రాఫరు, అన్వేషకుడు మాథ్యూ ఫ్లిండర్సు ద్వీపంలో జనరలు డీకను నెపోలియను ఆదేశంతో ఈ ద్వీపంలో నిర్బంధించబడ్డాడు. నెపోలియన్ యుద్ధాల సందర్భంగా మారిషస్ బ్రిటీషు వాణిజ్య నౌకలపై విజయవంతంగా దాడులను నిర్వహించిన ఫ్రెంచి కార్సైసుకుపునాదిగా మారింది. 1810 వరకు దాడులు కొనసాగాయి. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు కమోడోర్ జోస్యసు రోలే, ఆర్.ఎన్, ఒక ఆంగ్లో-ఐరిషు నాయకత్వంలో ఒక రాయలు నేవీ పంపబడింది. గ్రాండు పోర్టు యుద్ధంలో బ్రిటీష్వారి మీద ఫ్రెంచి నౌకాదళం సాధించినప్పటికీ ఫ్రెచి బ్రిటిషు మీద సాధించిన ఏకైక విజయంగా ఇది మిగిలిపోయింది. మూడు నెలలు తర్వాత కాప్ మాలెయ్యూక్సులో బ్రిటీషు ల్యాండింగు చేయకుండా ఫ్రెంచి నిరోధించలేకపోయింది. దాడి చేసిన ఐదవ రోజున 1810 డిసెంబరు 3 న ద్వీపం లొంగిపోయింది.[11] స్థిరనివాసులకు వారి ఆస్థులు, భూమి మీద హక్కు, ఫ్రెంచి భాషను ఉపయోగించడానికి, సివిలు, క్రిమినలు నేరాలకు ఫ్రెంచి చట్టం అనుసరించడానికి అనుమతించబడింది.[7]

బ్రిటిషు మొరీషియసు (1810–1968)

The Battle of Grand Port between French and British naval forces, 1810

" సర్ రాబర్టు ఫెర్క్యుహారు " గవర్నరుగా ప్రారంభమైన బ్రిటిషు పరిపాలన వేగవంతమైన సామాజిక, ఆర్థిక మార్పులకు దారి తీసింది. అయితే ఇది రైట్సిటాటేనె సంబంధిత కథనంతో కళంక్తం చేయబడింది. మడగాస్కరు రాజు రాడామా రట్సిటాటేనె రాజకీయ ఖైదీగా మారిషస్‌కు తీసుకురాబడ్డాడు. అతను జైలు నుండి తప్పించుకొని ద్వీపంలోని బానిసలను విడిపించడానికి ఒక తిరుగుబాటు చేశాడు. ఆయన సహచరుడు ద్రోహంతో బ్రిటీషు దళాలకు పట్టుబడ్డాడు. ఆయన తల ఖండించబడి మరణించాడు. ఆయన 1822 ఏప్రెలు 15 న ప్లైను వెర్డులో శిరఛ్చేదం చేయబడ్డాడు. తరువాత భవిష్యత్తు తిరుగుబాటులకు భీతి కలిగించేలా ఆయన తల బానిసల మధ్య ప్రదర్శించబడింది.[12]

1832 లో ప్రభుత్వం నియంత్రణలో లేని అడ్రియను డి'ఇపినే మొదటి మారిషీటు వార్తాపత్రిక (లే సిర్నిఎన్) స్థాపించబడింది. అదే సంవత్సరంలో " ప్రొక్యూరియూరు - జనరలు " బానిస యజమానులకు నష్టపరిహారం లేకుండా బానిసత్వాన్ని రద్దుచేయాలని నిర్ణయంచింది. ఇది అసంతృప్తికి దారితీసి చివరికి తిరుగుబాటుగా రూపాంతరం చెందింది. నివాసులందరూ తమ ఆయుధాలను అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాక ఎటువంటి తిరుగుబాటును అరికట్టడానికి పోర్టు లూయిస్ మధ్యభాగంలో ఒక కొండపై (ఇప్పుడు సిటాడెల్ హిల్ అని పిలువబడుతుంది) ఫోర్టు అడిలైడు నిర్మించబడింది.[10]

1835 లో బానిసత్వం రద్దు చేయబడింది. ఫ్రెంచి ఆక్రమణ సమయంలో ఆఫ్రికా, మడగాస్కర్ నుండి దిగుమతి చేసుకున్న బానిసల కొనుగోలు ద్వారా ఏర్పడిన నష్టానికి పరిహారంగా బ్రిటిషు ప్రభుత్వం నుండి రైతులు రెండు మిలియను పౌండ్ల స్టెర్లింగులను పొందారు. బానిసత్వ నిర్మూలన మారిషస్ సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రజాజీవితాలను ప్రధాంగా ప్రభావితం చేసింది. రైతులు చెరకు పొలాలలో పనిచేయడానికి పెద్దసంఖ్యలో భారతదేశం నుండి కార్మికులను తీసుకువచ్చారు. 1834 - 1921 మధ్యలో ద్వీపంలో సుమారు 5 లక్షల మంది కార్మికులు పనిచేసారు. వారు చక్కెర ఎస్టేట్సు, కర్మాగారాలు, రవాణా, నిర్మాణ ప్రదేశాలలో పనిచేశారు. అదనంగా బ్రిటీషువారు ఈ ద్వీపానికి 8,740 మంది సైనికులను తీసుకుని వచ్చారు.[7] బ్రిటిషు ప్రభుత్వానికి సేవలు అందించడానికి ఒప్పంద సేవకులు ప్రవేశించిన మొదటి కేంద్రంగా ఈ ప్రదేశం గుర్తించబడింది. తరువాత పోర్టు లూయిస్లోని బే వద్ద ఉన్న " అప్రవాసి ఘాటు " ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించబడింది.

19 వ శతాబ్దపు ముఖ్యమైన వ్యక్తి రెమి ఓలియరు మిశ్రమసంతతికి చెందిన పాత్రికేయుడు. 1828 లో మారిషస్‌లో రంగు వివక్షను అధికారికంగా రద్దు చేశాడు. కానీ బ్రిటీషు గవర్నర్లు రంగు వివక్షను చూపుతూ ఇతర వర్ణాల ప్రజలకు వ్యక్తులకు తక్కువ అధికారం ఇచ్చారు. ప్రముఖ అధికారులుగా శ్వేతజాతీయులను మాత్రమే నియమించారు. రాణి విక్టోరియాకు రెమీ ఒలియరు ప్రభుత్వ మండలిలో ఇతర వర్ణాల ప్రజలనును అనుమతించాలని చేసిన వినతి కొన్ని సంవత్సరాల తరువాత సాధ్యమైంది. ఆయన పోర్టు లూయిసును మునిసిపాలిటీగా మార్చడానికి అనుమతించాడు. తద్వారా పౌరులు ఎన్నుకోబడిన స్థానిక ప్రతినిధుల ద్వారా పట్టణాన్ని నిర్వహించగలిగారు. ఆయన కాలంచెదిన తరువాత పోర్టు లూయిసులో ఒక వీధికి పేరు పెట్టబడింది. 1906 లో జార్డిన్ డి లా కంపగ్నిలో ఆయన బస్టు సైజు శిల్పం స్థాపించబడింది. [11] 1885 లో మారిషస్‌లో కొత్త రాజ్యాంగం ప్రవేశపెట్టబడింది. ఇది పాలక మండలిలో ఎన్నుకోబడిన స్థానాలను సృష్టించినప్పటికీ కానీ ఫ్రాంచైజు మాత్రం ప్రధానంగా ఫ్రెంచి, క్రియోలఉ తరగతికి చెందిన ప్రజలకు పరిమితం చేయబడింది.

చాంప్ డే మార్స్ రేస్కోర్స్, పోర్ట్ లూయిస్, 1880

భారతదేశం నుండి తీసుకువచ్చిన కార్మికులకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఇవ్వబడలేదు. జర్మనికి చెందిన అడాల్ఫ్ వాన్ ప్లివిట్జు ఈ వలసదారుల అనధికారిక రక్షకునిగా ఉన్నాడు. ఆయన అనేకమంది కార్మికులతో కలిపి 1871 లో గవర్నరు గోర్డాన్కు పంపిన ఒక వినతిపత్రం రాయడానికి వారికి సహాయపడ్డాడు. భారతీయ వలసదారులు చేసిన ఫిర్యాదులను పరిశీలించడానికి చడానికి ఒక కమిషను నియమించబడింది. 1872 లో బ్రిటీషు క్రౌను నియమించిన ఇద్దరు న్యాయవాదులు ఒక విచారణ జరపడానికి ఇంగ్లండు నుండి పంపబడ్డారు. తరువాత యాభై సంవత్సరాల కాలంలో భారత కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే అనేక చర్యలను ఈ రాయల్ కమిషను సిఫార్సు చేసింది.[11]

1901 నవంబరులో మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వెళుతున్నప్పుడు మారిషస్‌ను సందర్శించారు. ఆయన ఈ ద్వీపంలో రెండు వారాలపాటు ఉన్నాడు. విద్యలో ఆసక్తిని సంపాదించి రాజకీయాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని ఇండో-మారిషియన్ సమాజాన్ని కోరాడు. ఆయన భారతదేశానికి చేరిన తరువాత మారిషీ భారతీయుల దుస్థితిని మెరుగుపరిచేందుకు భారతదేశం నుండి ఒక యువ న్యాయవాది మణిలాల్ డాక్టరును పంపించాడు. అదే సంవత్సరంలో అయిన రోడ్రిగ్సు ద్వీపంతో వేగంగా సంబంధాలు స్థాపించాడు.[13]

1903 లో మారిషస్‌లో మోటారు వాహనాలను ప్రవేశపెట్టారు. 1910 లో మొదటి టాక్సీలను జోసెఫు మెర్వెను నిర్వహించాడు. 1909 లో పోర్టు లూయిసు ఎలక్ట్రిఫికేషను జరిగింది. అదే దశాబ్దంలో ఎగువ ప్లెయిన్సు విల్హెమ్సు పట్టణాలకు విద్యుత్తు సరఫరా చేయడానికి మారిషస్ హైడ్రో ఎలక్ట్రికు కంపెనీ (అచియా బ్రదర్సు నిర్వహించినది) అధికారం కల్పించబడింది.

1910 లు రాజకీయ ఆందోళన కాలంగా గుర్తించబడింది. పెరుగుతున్న మధ్యతరగతి (వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు) చక్కెర చెరకు భూస్వాములు రాజకీయ శక్తిని సవాలు చేయడం ప్రారంభించారు. పోర్టు లూయిసు మేయరు డాక్టరు యూగెను లారెంటు ఈ నూతన బృందానికి నాయకత్వం వహించాడు. ఆయన పార్టీ " యాక్షన్ లిబెరలే " ఎన్నికలలో ఓటువేయడానికి ఎక్కువమంది ఓటు వేయాలని పట్టుబట్టాడు. షెరీగు మాగ్నెట్సు అత్యంత ప్రభావవంతమైన హెన్రి లేక్లెజియో నేతృత్వంలోని " డి ఎల్'ఓర్డె " పార్టీ " యాక్షన్ లిబెరలే " ను వ్యతిరేకించారు.[11] 1911 లో పోర్టు లూయిసులో అల్లర్లు జరిగాయి. తప్పుడు పుకార్ల కారణంగా డాక్టరు యుజెన్ లారెంట్ క్యూరీపీప్లోని ఒలిగార్చ్స్ హత్య చేశాడు. రాజధానిలో దుకాణాలు, కార్యాలయాలు దెబ్బతిన్నాయి. ఒక వ్యక్తి చంపబడ్డాడు. అదే సంవత్సరంలో క్యూరెపైపులో 1911 మొదటి పబ్లికు సినిమా ప్రదర్శించబడింది. అదే సంవత్సరంలో అదే పట్టణంలో " రాయలు కాలేజి " కొరకు రాతి భవనం కట్టబడింది.[13] 1912లో పెద్ద ఎత్తున అందించబడిన టెలిఫోను సౌకర్యాలను ప్రభుత్వం, వ్యాపారసంస్థలు, కొంతమంది గృహస్థులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

1914 ఆగస్టులో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. చాలామంది మౌరిషన్లు ఐరోపాలో జర్మన్లు , మెసొపొటేమియాలో టర్కీకి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా పోరాడారు. కానీ 18 వ శతాబ్దం యుద్ధాల కంటే ఈ యుద్ధం మారిషస్‌కు తక్కువ నష్టాన్ని కలిగించింది. దీనికి విరుద్ధంగా 1914-1918 యుద్ధం చక్కెర ధరల పెరుగుదల కారణంగా గొప్ప సంపదకు కారణంగా మారింది. 1919 లో మారిషస్ షుగరు సిండికేటు ఉనికిలోకి వచ్చింది. మొత్తం చక్కెర ఉత్పత్తిదారులలో ఇది 70% ఉత్పత్తిని సాధించింది.


1920 లో మారిషస్ ఫ్రాన్సు పునరావాసాన్ని ప్రోత్సహించిన "రెట్రోసెషంజం" ఉద్యమం పెరుగుదల కనిపించింది. 1921 ఎన్నికలలో మారిషస్ తిరిగి ఫ్రాంసుకు ఇవ్వాడానికి మద్దతుపలికిన అభ్యర్థులు ఎవరూ విజయం సాధించని కారణంగా ఈ ఉద్యమం త్వరితంగా కూలిపోయింది. యుద్ధానంతర మాంద్యం కారణంగా చక్కెర ధరల్లో పదునైన తగ్గుదల కనిపించి అనేక చక్కెర ఎస్టేట్లు మూసివేయబడ్డాయి. ఆర్థిక వ్యవస్థను నియంత్రించిన చక్కెర ఆదాయం వ్యవస్థ ముగింపుకు వచ్చిందిది. దేశంలోని రాజకీయాలను ఇది ప్రభావితం చేసింది. లె మౌరియెను వార్తాపత్రిక సంపాదకుడైన రౌల్ రివ్ట్ రాజ్యాంగం పునర్నిర్మాణం కొరకు ప్రచారం చేశాడు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశంలో మద్యతరగతి ప్రజలు అధిక పాత్రను పోషించాలని ప్రతిపాదించింది. మరింత సామాజిక న్యాయం కోసం ప్రయత్నించారు ఆర్య సమాజం సూత్రాలు హిందూ సమాజంలో చొరబాట్లు చేయటం ప్రారంభింది. [13]

1930 లో డాక్టరు మారిసు కరే లేబరు పార్టీని ప్రారంభించాడు. పండిటు సహడే గ్రామీణ కార్మిక వర్గంలో కేంద్రీకృతమై ఉండగా ఇమ్మాన్యూల్ అక్వేటీల్ పట్టణ కార్మికులతో సమావేశమయ్యాడు. 1937 లో జరిగిన ఉబా అల్లర్ల ఫలితంగా స్థానిక బ్రిటీషు ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. ఇది కార్మిక పరిస్థితులను మెరుగుపరిచి, కార్మిక సంఘాల నిషేధానికి దారితీసింది.[14][15] 1938 లో మొదటిసారిగా " లేబరు డే " జరుపుకున్నారు. చాంప్ డే మార్సులో భారీ సమావేశానికి హాజరు కావడానికి ద్వీపం అంతటి నుండి 30,000 కంటే ఎక్కువ మంది కార్మికులు రోజువారీ వేతనాన్ని త్యాగం చేసారు.[16]

1939 లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో అనేకమంది మారిషస్లు ఆఫ్రికా సమీప ప్రాచ్య దేశాలలో బ్రిటీషు జెండాను ఆదరిస్తూ జర్మనీ, ఇటాలీ సైన్యాలకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా పోరాడారు. రాయలు ఎయిరు ఫోర్సులో కొంతమంది పైలట్లు, గ్రౌండు సిబ్బందిగా మారడానికి కొంతమంది ఇంగ్లాండు వెళ్లారు. మారిషస్ నిజంగా ఎన్నడూ యుద్ధానికి భయపడలేదు. 1943 లో జర్మనీ జలాంతర్గాములు పోర్టు లూయిసు వెలుపల అనేక బ్రిటీషు నౌకలను ముంచివేసాయి.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో దేశంలో పరిస్థితులు కష్టతరమయ్యాయి; వస్తువుల ధర రెట్టింపు అయినప్పటికీ కార్మికుల జీతాలు 10% నుండి 20% మాత్రమే పెరిగాయి. పౌర అశాంతి అధికరించింది. వలసవాద ప్రభుత్వం వర్తక సంఘాల కార్యకలాపాలను చూర్ణం చేసింది. బెల్లె వూ హరేల్ షుగరు ఎస్టేటు శ్రామికులు 1943 సెప్టెమబరున సమ్మె చేశారు. పోలీసు అధికారులు చివరికి గుంపుపై జరిపిన కాల్పులలో పది సంవత్సరాల అబ్బాయి, గర్భిణి అయిన అంజలీ కోపెనుతో సహా ముగ్గురు కార్మికులు చంపబడ్డారు.[17][18]

1948 ఆగస్టు 9 న మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో లేబరు పార్టీ గెలిచింది. గై రొజెమొంటు నేతృత్వంలో ఈ పార్టీ 1953 లో దాని స్థానాన్ని మెరుగుపర్చింది. ఎన్నికల ఫలితాల బలం సార్వత్రిక ఓటు హక్కు కావాలని పట్టుబట్టింది. 1955 - 1957 లలో లండనులో రాజ్యాంగ సదస్సులు జరిగాయి. మంత్రివర్గ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. 1959 మార్చిన 9 న యూనివర్సలు వయోజన ఓటు హక్కు ఆధారంగా మొదటిసారి ఓటింగు జరిగింది. జనరలు ఎన్నికలలో లేబరు పార్టీ విజయం సాధించింది. ఈసారి సర్ సేవియోసగూరు రాంగులాం నాయకత్వం వహించారు.[19]

1961 లో లండనులో ఒక రాజ్యాంగ రివ్యూ కాన్ఫరెన్సు జరిగింది. రాజ్యాంగ అభివృద్ధి చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1963 ఎన్నికలలో లేబరు పార్టీ, దాని మిత్రపక్షాలు గెలిచాయి. మారిషస్‌లో మతరాజకీయాలు పురోగతిని పొందాయి. అభ్యర్థుల ఎంపిక (పార్టీల ద్వారా) ఓటింగు పరివర్తన (ఓటర్లు) జాతి, కులాల పరిశీలన జరిగిందని కలోనియల్ కార్యాలయం పేర్కొంది.[19] ఆ సమయంలో ఇద్దరు ప్రసిద్ధ బ్రిటీషు విద్యావేత్తలు, రిచర్డు టైట్ముసు, జేమ్సు మీడేలు, ద్వీపంలోని సామాజిక సమస్యల గురించి నివేదికలు ప్రచురించారు. ఇది జనాభా అభివృద్ధిని అడ్డుకునేందుకు తీవ్రమైన ప్రచారానికి దారితీసింది. దశాబ్దం జనాభా పెరుగుదలలో పదునైన క్షీణతను నమోదు అయింది.

( 1968 నుండి)

1965 లో లాంకాస్టరు కాన్ఫరెంసులో బ్రిటీషువారు మారిషస్ కాలనీ నుండి వైదొలుగుతున్నామని స్పష్టం చేశారు. 1959 లో హారొల్దు మాక్మిలను తన ప్రఖ్యాత " విండ్సు ఆఫ్ ఛేంజు స్పీచు " లో బ్రిటను తన కాలనీలకు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడం ఉత్తమం అని అంగీకారం తెలియజేసాడు. ఆ విధంగా స్వాతంత్ర్యానికి మార్గం సుగమం అయింది.[20]

1965 లో లాంకాస్టరు కాన్ఫరెన్సు తరువాత మారిషస్ భూభాగం నుండి చాగోసు ద్వీపసమూహం బ్రిటీషు హిందూ మహాసముద్ర భూభాగంగా విస్తరించబడింది. 1967 ఆగస్టున జనరలు ఎన్నిక జరిగింది. లేబరు పార్టీ, దాని ఇద్దరు సంకీర్ణపార్టీలు ఆధిఖ్యత సాధించాయి. జనవరి 1968 జనవరిలో స్వాతంత్ర్యం ప్రకటించడానికి ఆరు వారాల ముందు 1968 మార్చిలో పోర్ట్ లూయిసులో జరిగిన మారిషస్ అల్లర్లు 25 మంది మరణానికి దారితీసింది.[21][22]

రెండవ ఎలిజబెతు (1968 నుండి 1992 వరకు మారిషస్ రాణి)

1968 మార్చి 12 న స్వాతంత్ర్యం ప్రకటించబడిన తరువాత మారిషస్ ఒక కొత్త రాజ్యాంగంను స్వీకరించింది. సర్ సెవియోసగూర్ రాంగూలం మరిషసు మొట్టమొదటి ప్రధాన మంత్రిగా అయ్యాడు. రెండవ ఎలిజబెతు రాణి దేశానికి దేశాధిపతిగా ఉంది. 1969 లో పాల్ బెరెంగెర్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీ మౌరిషియన్ మిలిటెంట్ ఉద్యమం (ఎం.ఎం.ఎం)స్థాపించబడింది. 1971 లో ఎం.ఎం.ఎం.కు యూనియన్లు మద్దతుతో నౌకాశ్రయంలో సమ్మె జరిగింది. ఇది దేశంలో అత్యవసర పరిస్థితిని కలిగించడానికి కారణం అయింది.[23] లేబరు పార్టీ, మారిషస్ సోషలు డెమొక్రటిక్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం సాంఘిక స్వేచ్ఛ, పత్రికాస్వేచ్ఛకు శ్రీకారం చుట్టింది.[13] పౌలు బరెంగరు మీద రెండుమార్లు జరిగిన హత్యాప్రయత్నాలు విఫలం అయ్యాయి. 1971 నవంబరు 25 న జరిగిన రెండవ హత్యాప్రయత్నంలో డాకు కార్మికుడు, తిరుగుబాటుదారుడు " అజరు అడెలైడె " హత్య చేయబడ్డాడు.[24] జనరలు ఎన్నికలు పోస్టుపోను చేయబడ్డాయి. ప్రజాసమావేశాలు రద్దు చేయబడ్డాయి. 1971 డిసెంబరు 23 న పౌలు బెరెంగరు వంటి ఎం.ఎం.ఎం. సభ్యులు ఖైదు చేయబడ్డారు.[25]

1975 మేలో మారిషస్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన విద్యార్ధి తిరుగుబాటు దేశవ్యాప్తంగా వ్యాపించింది.[26]విద్యార్థులు వారి ఆకాంక్షలను తీర్చని, భవిష్యత్తులో పరిమిత ఉపాధి అవకాశాలు ఇచ్చిన విద్యా వ్యవస్థతో అసంతృప్తి చెందారు. మే 20 న వేలమంది విద్యార్థులు గ్రాండు రివరు నార్తు వెస్టు వంతెనపై పోర్టు-లూయిసులో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పోలీసులతో గొడవపడ్డారు. 1975 డిసెంబరు 16 న 18 ఏళ్ల వయస్సు నుండి ఓటు హక్కును విస్తరించడానికి పార్లమెంటు ఆమోదించింది. ఇది యువ తరం నిరాశను శాంతింపచేయడానికి ఒక ప్రయత్నంగా భావించబడింది. [12]


1976 డిసెంబరు 20 న జరిగిన జనరలు ఎన్నికలలో లేబరు పార్టీ 62 లో 28 స్థానాలను గెలుచుకుంది.[27]కానీ ప్రధాని సర్ సేవియోసగూర్ రాంగులాం గేతన్ దువాలు నాయకత్వంలోని (పి.ఎం.ఎస్.డి) కూటమితో రెండు సీట్ల మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నాడు.


1982 లో ప్రధాన మంత్రి అరుణ్ జుగ్నౌథు, పౌలు బెరెంగరు నేతృత్వంలోని ఎం.ఎం.ఎం.ప్రభుత్వంలో పౌలు బెరెంగరు ఆర్థిక మంత్రిగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఎం.ఎం.ఎం. నాయకత్వంలో సైద్ధాంతిక, వ్యక్తిత్వ విభేదాలు ఏర్పడ్డాయి. 1983 మార్చిలో బెరెంగెరు, జుగ్నౌతు మధ్య అధికార పోరాటం తీవ్రరూపం దాల్చింది. జుగ్నౌతు " అలీన ఉద్యమం " సదస్సులో పాల్గొనడానిక్ న్యూఢిల్లీకి ప్రయాణించాడు. తిరిగి వచ్చిన తరువాత బెరెంగరు ప్రధానమంత్రి నుండి అధికారాన్ని తొలగించే రాజ్యాంగ మార్పులను ప్రతిపాదించాడు. జుగ్నౌతు అభ్యర్ధనతో భారతదేశ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ " ఆపరేషన్ లాల్ డోరా " పేరుతో భారత నావికాదళం, భారత సైన్యంతో కూడిన సాయుధ జోక్యంతో తిరుగుబాటును నిరోధించడానికి ప్రణాళిక చేశాడు.[28][29][30]


1982 జూను ఎన్నికలు జరిగిన తొమ్మిది నెలల తరువాత ఎం.ఎం.ఎం. ప్రభుత్వం విడిపోయింది. ఒక సమాచార మంత్రిత్వ శాఖ అధికారి దీనిని " తొమ్మిది నెలల సోషలిస్టు ప్రయోగం" అని అభివర్ణించాడు.[31]1983 లో జుగ్నౌత్ నేతృత్వంలో కొత్త ఎం,ఎస్,ఎం. పార్టీ విజయం సాధించింది. గౌతన్ దువాల్ వైస్ ప్రధాని అయ్యాడు. ఈ దశాబ్దంలో అనారోడ్ జుగ్నాథ్ పి.ఎం.సి.డి, లేబరు పార్టీ సహాయంతో దేశాన్ని పాలించారు.

ఈ కాలంలో ఇ.పి.జెడ్. (ఎగుమతి ప్రోసెసింగ్ జోన్) రంగంలో వృద్ధి సాధించింది. గ్రామీణ ప్రాంతాల పారిశ్రామికీకరణ ప్రారంభమైంది. ఇది అన్ని జాతుల యువ కార్మికులను ఆకర్షించింది. తత్ఫలితంగా చక్కెర పరిశ్రమ ఆర్థిక వ్యవస్థపై తన పట్టును కోల్పోయింది.1985 లో పెద్ద రిటైల్ చైను దుకాణాలు ప్రారంభించబడ్డాయి. తక్కువ ఆదాయం సంపాదించేవారికి క్రెడిట్ సదుపాయాలను అందించింది. తద్వారా వారు ప్రాథమిక గృహోపకరణాలను కొనుగోలు చేయగలిగారు. పర్యాటక పరిశ్రమలో కూడా ఒక పురోగతి సాధించబడింది. దీంతో ద్వీపమంతా కొత్త హోటళ్లు ఏర్పడ్డాయి. 1989 లో స్టాకు ఎక్స్చేంజు తలుపులు తెరవబడ్డాయి. 1992 లో ఫ్రీపోర్టు ఆపరేషను ప్రారంభించింది.[13] 1990 లో బెరెంగరు అధ్యక్షుడుగా దేశమును రిపబ్లిక్గా చేసేందుకు రాజ్యాంగాన్ని మార్చినందుకు ప్రధాన మంత్రి ఓటును కోల్పోయారు.[32]

రిపబ్లికు (1992 నుండి)

1992 మార్చి 12 న స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మారిషస్ " కామన్వెల్తు ఆఫ్ నేషంసు " ఒక రిపబ్లికుగా ప్రకటించబడింది.[7] గత గవర్నరు జనరలు " సర్ వీరసమి రంగాడో " మొదటి అధ్యక్షుడయ్యాడు.[33] ఇది ఒక తాత్కాలిక నియామకంగా చేయబడింది. అదే సంవత్సరంలో ఆయన స్థానంలో " కాస్సం ఉటీం " అధ్యక్షుడుగా నియమితుడయ్యాడు.[34] రాజ్యాంగం ప్రధాన మంత్రికి రాజకీయ అధికారం కల్పించింది.

అనుకూలమైన డాలరు మార్పిడి రేటుతో ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి ఉన్నప్పటికీ పెట్రోలు ధరలో తగ్గుదల ఆర్ధికరంగాన్ని ప్రభావితం చేసింది. ఫలితంగా ప్రభుత్వం పూర్తి జనాదరణ పొందలేదు. 1984 నాటికి అసంతృప్తి సుస్పష్టం అయింది. వార్తాపత్రికలు, పీరియాడికల్సు సవరణ చట్టం ద్వారా ప్రభుత్వం ప్రతి వార్తాపత్రికను 5 లక్ష రూపాయల బ్యాంకు హామీని కోరింది. పోర్టు లూయిసులో పార్లమెంటు ముందు బహిరంగ ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా 42 నలుగురు పాత్రికేయులు నిరసన ప్రదర్శన చేసారు. వారిని ఖైదు చేసి బెయిలు మీద విడుదల చేశారు. దీనివల్ల ప్రజా వ్యతిరేకత ఏర్పడింది. ప్రభుత్వం దాని విధానాన్ని సమీక్షించవలసిన అవసరం ఏర్పడింది.[13]


విద్యా రంగంలో కూడా అసంతృప్తి కూడా ఉంది. ప్రాధమిక పాఠశాలను వదిలిన విద్యార్ధుల అవసరాలకు తగినంత అధిక-నాణ్యత గల ద్వితీయ కళాశాలలు లేవు. 1991 లో ఒక ప్రధాన విద్యాప్రణాళిక జాతీయ మద్దతును పొందడంలో విఫలమై ప్రభుత్వ పతనానికి దోహదపడింది.[13]

1995 లో " నవీన్ రాంగుళం " ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాడు. 1999 ఫిబ్రవరిలో దేశంలో కొంతకాలం పౌర అశాంతి అనుభవించింది. నాలుగు రోజుల సంక్షోభం తరువాత అధ్యక్షుడు కాస్సం ఉటీం, కార్డినల్ జీన్ మార్గియోటు దేశం పర్యటించి ప్రశాంతతను పునరుద్ధరించారు.[35] సాంఘిక అశాంతికి మూల కారణాలను పరిశోధించడానికి ఒక విచారణ కమిషను ఏర్పాటు చేయబడింది. అశాంతి ఫలితంగా పేదరికం అధికరించింది.[36]


2000 లో ఎం.ఎస్.ఎం. తిరిగి జుగ్నౌతు ఎంఎంఎంతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు. 2002 లో గణతంత్ర రాజ్యంలో రోడ్రిగ్సు ద్వీపం ఒక స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా అవతరించింది. తద్వారా ఈ ద్వీపాన్ని నిర్వహించడానికి తన ప్రతినిధులను ఎన్నుకునే హక్కును పొందింది. 2003 లో ఎం.ఎం.ఎం. పాల్ బెరెంగెర్కు ప్రధాన మంత్రి పదవిని బదిలీ చేసింది. అనరూద్ జుగ్నాథ్ లే రీయుటుకు అధ్యక్షుడిగా పనిచేయడానికి వెళ్లాడు. దేశం చరిత్రలో మొట్టమొదటి ఫ్రాన్కో-మారిషియన్ ప్రీమియర్గా బెరెంగరు ఉన్నారు. 2005 లో నవీన్ రామ్గూలం, లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. రాంగులామ్ 2014 లో అధికారాన్ని కోల్పోయారు. ఆయన తరువాత అనరూదు అధికారం చేపట్టాడు.

2017 జనవరి 21 న అనెరుదు జుగ్నౌతు రెండు రోజుల వ్యవధిలో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఆర్థికమంత్రి (తన కుమారుడు ) ప్రవీణ్ జుగ్నౌతుకు అనుకూలంగా రాజీనామా చేస్తానని ప్రకటించారు.[37] 2017 జనవరి 23 లో ప్రణాళిక ప్రకారం ఈ మార్పు జరిగింది.[38]

2018 లో మారిషస్ అధ్యక్షుడు అమీనే గురిబ్-ఫకిమ్ (ఆఫ్రికన్ యూనియనులోని ఏకైక ఏకైక మహిళా అధిపతి) ఆర్థిక కుంభకోణం ఆరోపణతో రాజీనామా చేశారు.[39] ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు బరెను వైపౌరీ.[40]

భౌగోళికం

మారిషస్ భూభాగ వైశాల్యం 2,040 చ.కి.మీ. ఇది వైశాల్యపరంగా ప్రపంచంలోని 170 వ స్థానంలో ఉంది. మారిషస్ రిపబ్లికులో మారిషస్ ప్రధాన ద్వీపం, అనేక సుదూర దీవులను కలిగి ఉంది. దేశం ప్రత్యేకమైన ఆర్ధిక మండలం (ఇ.ఇ.జెడ్) సుమారు 2.3 మిలియను చదరపు కిలో మీటర్లు (8,90,000 చ.మై) సుమారు 4,00,000 చ.కి.మీ ఉంటుంది. ఇది సీ షెలుతో సంయుక్తంగా ఈ ప్రాంతం నిర్వహించబడుతుంది.[41][42][43]

మారిషస్ ద్వీపం

మారిషస్ ఆఫ్రికా ఆగ్నేయ తీరంలో 2,000 కి.మీ (1,200 మై) దూరంలో ఉంది. 19 ° 58.8 'నుండి 20 ° 31.7' దక్షిణ అక్షాంశం, 57 ° 18.0 'నుండి 57 ° 46.5' తూర్పు రేఖాంశం మధ్య ఉంటుంది. ఇది 65 కి.మీ(40 మై) పొడవు, 45 కి.మీ (30 మై) వెడల్పు ఉంటుంది. దీని భూభాగం 1,864.8 చ.కి.మీ 2.[44][45] ఈ ద్వీపం సుమారు 150 కి.మీ (100 మైళ్ళు)పొడవైన తెల్లని ఇసుక తీరాలతో నిండి ఉంది. ద్వీపాలు చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలోని మూడవ అతిపెద్ద పగడపు దిబ్బ సముద్రం నుండి లాగూన్లు (ఉప్పునీటి మడుగులు) రక్షించబడుతున్నాయి.[46] మారీషయన్ తీరంలో 49 జనావాసాలు లేని ద్వీపాలు ఉన్నాయి. ఇవి అంతరించిపోతున్న జాతుల సహజ ఆశ్రితవనరులుగా ఉపయోగించబడతాయి.

మారిషస్ ద్వీపం సాపేక్షంగా యువ భూగోళికప్రాంతంగా గుర్తించబడుతూ ఉంది. సుమారు 8 మిలియన్ సంవత్సరాల క్రితం అగ్నిపర్వత చర్యకారణంగా ఈ ద్వీపాలు సృష్టించబడ్డాయి. సెయింటు బ్రాండను, రీయూనియను, రోడ్రిగ్సులతో కలిపి ఈ ద్వీపం మస్కరైను దీవులలో భాగంగా ఉంది. ఈ ద్వీపాలు నీటి అడుగున సంభవించిన అతిపెద్ద అగ్నిపర్వత విస్పోటనల ఫలితంగా ఉద్భవించాయి. ఇది ఆఫ్రికా, మడగాస్కర్లతో కూడిన ఖండాంతర భూభాగానికి తూర్పున వేలాది కిలోమీటర్ల దూరం జరిగింది. [47]

ఈ ద్వీపాలలో ప్రస్తుతం క్రియాశీలక అగ్నిపర్వతచర్యలు జరగడం లేదు. ప్రస్తుతం రీయూనియను ద్వీపంలో హాట్స్పాటు విశ్రాంతస్థితిలో ఉంటుంది. సముద్ర మట్టానికి 300-800 మీ (1,000-2,600 అడుగులు) ఎత్తులో ఉన్న చీలిన పర్వత శ్రేణుల వలయంలో మారిషస్ పరివేష్టితమై ఉంది. ఈ తీరప్రాంతాల నుండి భూమి ఒక కేంద్ర పీఠభూమికి 670 మీ (2,200 అడుగులు) పెరుగుతుంది. నైరుతిలో ఎత్తైన శిఖరం నైరుతిలో 828 మీటర్లు (2,717 అడుగులు) వద్ద పిట్టన్ డి లా పెటైట్ రివైర్ నోయిరే ఉంది. ద్వీపం, లావా ప్రవాహాలచే సృష్టించబడిన పగుళ్లలో అనేక ప్రవాహాలు, నదులు ప్రవహిస్తున్నాయి.

A panoramic view of Mauritius Island

రోడ్రిగ్యూసు ద్వీపం

మారిషస్ తూర్పున 560 కిలోమీటర్ల (350 మైళ్ళు) ఉన్న స్వయంప్రతిపత్తమైన ద్వీపం రోడ్రిగ్సు. ఇది 108 చ.కి.మీ ప్రాంతంలో విస్తరించి ఉంది.[47] రోడ్రిగ్యూ ఒక అగ్నిపర్వత ద్వీపం. ఇది మస్కరనే పీఠభూమి అంచున ఒక శిఖరం వరకు విస్తరించింది . ఈ ద్వీపం ఎత్తైన శిఖరంతో కూడిన కేంద్రంలో 398 మీ (1,306 అ) ఎత్తైన లిమోను పర్వతం ఉంది. ద్వీపంలో పగడపు దిబ్బలు, విస్తృతమైన సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి.

చాగోసు ద్వీపసమూహం

చాగోసు ద్వీపసమూహం ఉపరితలం, దీవులతో కూడి ఉంటుంది. ఇది మారిషస్ ప్రధాన ద్వీపానికి సుమారు 2200 కిలోమీటర్ల ఈశాన్యంలో ఉంది. చాగోసు ద్వీపసమూహమునకు ఉత్తరాన పెరోసు బంనోసు, సాలమను దీవులు, నెల్సన్సు ఐలాండు, ది త్రీ బ్రదర్సు, ఈగలు దీవులు, ఎగ్మోంటు దీవులు, డేంజరు ఐలాండు ఉన్నాయి. ద్వీపసమూహపు ఆగ్నేయ భాగంలో డియెగో గార్సియా ఉంది.[48]

అగలెగా ద్వీపాలు

మారిషస్ ఉత్తరంలో 1000 కి.మీ దూరంలో అగలెగా ద్వీపం ఉంది.[47] దాని ఉత్తర ద్వీపం 12.5 కిలోమీటర్లు (7.8 మైళ్ళు) పొడవు, 1.5 కిలోమీటర్లు (0.9 మైళ్ళు) వెడల్పు ఉంటుంది. దాని దక్షిణ ద్వీపం 7 కిలోమీటర్లు (4.3 మైళ్ళు) పొడవు, 4.5 కిలోమీటర్ల (2.8 మైళ్ళు) వెడల్పు ఉంటుంది. రెండు ద్వీపాల మొత్తం వైశాల్యం 26 చ.కి.మీ.

ట్రొమెలిను

ట్రొమిలిను ద్వీపం మారిషస్ ఈశాన్యంలో 430 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫ్రాంసు ప్రకటించినట్లు మారిషస్ ట్రోమెలిను ద్వీపంపై సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది. ప్యారిసు ఒడంబడికలో పేర్కొన్న " డిపెండెంసీ" లలో ట్రోమెలినును ఉందోలేదో అనే విషయం సందేహాస్పదంగా ఉంది. అగలేగ, సెయింటు బ్రాండను, రోడ్రిగ్సు ట్రోమెలిన్ వంటి కొన్ని ద్వీపాలు ప్రత్యేకంగా పేర్కొనబడలేదు.[49] 1990 లో ఫ్రాన్సు, మారిషస్‌ల మధ్య స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా ట్రోమెలిను మీద వాతావరణ స్టేషను ఏర్పాటు చేయడానికి ఫ్రాంసుకు ఒక సాధారణ ఒప్పందం జరిగింది. 1990 జూనులో మారిషస్ అధ్యక్షుడు ఫ్రాంకోయిసు మిట్టరాండు అధికారిక పర్యటన తరువాత మారిషస్‌, ఫ్రాన్సులు ట్రోమెలిను కలిసి-నిర్వహించడానికి ఒక నిర్ణయం తీసుకోబడింది. పది సంవత్సరాల తరువాత అధ్యక్షుడు నికోలసు సర్కోజీ, ప్రధానమంత్రి నవీను రామ్గూలం ఈ విషయంపై చర్చించాడు. 2010 జూనులో సహ-నిర్వాహక ఒప్పందంపై సంతకం చేసి ధ్రువీకరించారు. 2017 జనవరిలో ఫ్రెంచి ప్రభుత్వం సహ నిర్వహణ ఒప్పందం నుండి వైదొలిగింది. ఇది ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీ ఎజెండా నుండి తొలగించబడింది.[50]

ఎస్.టి. బ్రాండను

మారిషస్‌కు ఈశాన్యంలో 402 కి.మీ దూరంలో " సెయింటు బ్రాండను " ఏకాంత ద్వీపం ఉంది. ద్వీపసమూహంలో 16 ద్వీపాలు ఉన్నాయి.

ఆర్ధికరంగం

Sugar cane plantation in Mauritius

1968 లో బ్రిటను నుండి స్వాతంత్రం పొందిన తరువాత పర్యాటకం, వస్త్రపరిశ్రమ, చక్కెర, ఆర్ధిక సేవలు ఆధారంగా తక్కువ ఆదాయం, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి మధ్య-ఆదాయంతో విభిన్న ఆర్ధిక వ్యవస్థతో మారిషస్ అభివృద్ధి చెందింది. స్వాతంత్ర్యం తరువాత మారిషస్ ఆర్థిక చరిత్రను "మారీషయన్ మిరాకిల్", "ఆఫ్రికా విజయం" (రోమెరు, 1992; ఫ్రాంకెలు, 2010, స్టిగ్లిట్జు, 2011) అని పిలుస్తున్నారు.[51]

ఇటీవలి సంవత్సరాలలో సమాచార, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, మత్స్య, ఆతిథ్యం, ఆస్తి అభివృద్ధి, ఆరోగ్యం, పునరుత్పాదక శక్తి, విద్య, శిక్షణ ముఖ్యమైన రంగాలుగా ఉద్భవించాయి. ఇది స్థానిక, విదేశీ పెట్టుబడిదారుల నుండి గణనీయమైన పెట్టుబడిని ఆకర్షించింది.[52]

మారిషస్‌లో ఎటువంటి శిలాజ ఇంధన నిల్వలు లేవు. దేశం శక్తి అవసరాలను తీర్చేందుకు పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడుతుంది. బయోమాసు, హైడ్రో, సౌర, గాలి శక్తి. స్థానిక, పునరుత్పత్తి శక్తి వనరులుగా ఉన్నాయి.[53]మారిషస్‌లో ప్రపంచంలోని అతిపెద్ద ప్రత్యేక ఆర్థిక మండళ్లలో ఒకటిగా ఉంది. 2012 లో సముద్ర ఆధారిత ఆర్ధికవ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.[54]

ఆర్థిక పోటీతత్వం! స్నేహపూర్వక పెట్టుబడి వాతావరణం, మంచి పాలన, స్వేచ్ఛయుత ఆర్థిక వ్యవస్థతో మారిషస్ ఆర్ధికవ్యవస్థ ఉన్నత స్థానంలో ఉంది.[55][56][57] స్థూల దేశీయోత్పత్తి (పి.పి.పి) 2018 నాటికి $ 29.187 బిలియన్ల అమెరికా డలర్లుగా అంచనా వేయబడింది. తలసరి జీడీపీ (PPP) $ 22,909 అమెరికా డాలర్లకంటే అధికం. ఇది ఆఫ్రికాలో అత్యధిక స్థాయిలో ఒకటిగా ఉంది.[55][56][57]

2011 లో ప్రపంచ బ్యాంకు ఆధారంగా మారిషస్ ఎగువ మధ్యతరగతి ఆర్ధిక వ్యవస్థగా వర్గీకరించబడింది.[58] ప్రపంచ బ్యాంకు " 2019 లో " డూయింగు బిజినెసు ఇండెక్సు " ఆధారంగా మారిషస్ ప్రపంచదేశాలలో 20 వ స్థానంలో ఉంది. ఇది వ్యాపారసౌలభ్యతలో 190 స్థానంలో ఉంది.[57][59] మారీషయన్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధారంగా దేశ ఆర్ధికరగం పరిశ్రమ రంగాలలో, అధిక నిపుణుల లోపం, నైపుణ్యం గల కార్మికుల కొరత, వృద్ధాప్య జనాభా, అసమర్థమైన ప్రభుత్వ కంపెనీలు, పారా-స్టేటల్ సంస్థలు వంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నది.[60]

మారిషస్ ఒక స్వేచ్చాయుత మార్కెటు ఆర్థిక వ్యవస్థపై విజయం సాధించింది. ఎకనామిక్ ఫ్రీడం 2013 ఇండెక్సు ఆధారంగా మారిషస్ ప్రపంచంలోని 8 వ అత్యంత స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా, పెట్టుబడి స్వేచ్ఛలో ఆధిఖ్యత పొందిన దేశంగా ఉంది.[61] 183 దేశాల నివేదికలో ఆర్ధిక నిష్పత్తి నియంత్రణ సామర్థ్యత, చట్ట పరిపాలన, పోటీతత్వపు చర్యల మీద ఆధారపడి ఉంటుంది.

ఆర్ధికసేవలు

Port-Louis, the Capital of Mauritius

ఫైనాన్షియల్ సర్వీసెసు కమిషను ఆధారంగా ఫైనాన్షియలు సర్వీసెసు విభాగం మౌరిషసు ఆర్ధికవ్యవస్థకు మూడో ప్రధాన సహాయంగా ఉంది. 2018 నాటికి ఆర్ధిక, భీమా కార్యకలాపాలు దేశ జిడిపిలో 11.8% కు చేరింది.[62] ఆసియా, ఆఫ్రికాల మధ్య వ్యూహాత్మక స్థానంలో ఉన్న మారిషస్ బలమైన నియంత్రణ చట్రం, వ్యాపారం చేయడం, పెట్టుబడి రక్షణ ఒప్పందాలు, అధిక అర్హత కలిగిన ఉద్యోగశక్తి, రాజకీయ స్థిరత్వం, తక్కువ నేర రేటు వంటి అనుకూల అంశాలతో ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టేందుకు మారిషస్ తన స్థానాన్ని పదిలపరచింది. ఆధునిక మౌలికవసతులు, అనేక అంతర్జాతీయ బ్యాంకులు, చట్టపరమైన సంస్థలు, కార్పొరేటు సేవలు, పెట్టుబడి నిధులు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్లకు నిలయంగా ఉంది. ప్రైవేటు బ్యాంకింగు, గ్లోబలు బిజినెసు, ఇన్సూరెన్సు అండు రీఇన్స్యూరెన్సు, లిమిటెడు కంపెనీలు, రక్షిత సెల్ కంపెనీలు, ట్రస్టు అండు ఫౌండేషను, ఇన్వెస్ట్మెంటు బ్యాంకింగు, గ్లోబలు ప్రధానకార్యాలయాల నిర్వహణ వంటివి ఆర్ధికరంగానికి అనుకూలమైన సేవలు అందిస్తున్నాయి. [63][64]


స్వల్ప పన్ను కారణంగా పన్నుల స్వర్గంగా మాధ్యమం మారిషస్‌ను ప్రశశిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి అనుకూలతను ప్రదర్శించేందుకు ఉత్తమమైన పద్ధతులను ఉపయోగించడం, బలమైన చట్టపరమైన, నియంత్రణా విధానాలు ఉపయోగించడం ద్వారా దేశం అంతర్జాతీయ స్థాయి పారదర్శకతతో ఘన ఖ్యాతిని పెంపొందించింది. 2015 జూనులో మౌరియుసు టాక్సు విధానాలలో మ్యూచువలు అడ్మినిస్ట్రేటివు అసిస్టెంసు మీద బహుపాక్షిక కన్వెన్షనుకు మొగ్గుచూపింది. ప్రస్తుతం 127 అధికార పరిధి గల మార్పిడి సమాచార వ్యవస్థ ఉంది. మారిషస్ తూర్పు, దక్షిణ ఆఫ్రికా యాంటీ మనీ లాండరింగు గ్రూపు వ్యవస్థాపక సభ్యదేశంగా, నగదు బదిలీ, ఇతర రకాల ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ముందంజలో ఉంది. కామను రిపోర్టింగు స్టాండర్డు, " ఫారిను అక్కౌంట్సు టాక్సు కాంప్లియను యాక్టు " చట్టం ప్రకారం దేశం సమాచారం పరిమార్పు విధానాన్ని స్వీకరించింది.[65] మారిషస్ ఐరోపా సమాఖ్య నిషేధిత జాబితాలో లేదు.[66] అంతేకాక అంతర్జాతీయంగా ఆమోదించబడిన పన్ను ప్రమాణాలను గణనీయంగా అమలు చేసిన ఒ.ఇ.సి.డి. వైటు జాబితాలో మారిషస్ కనిపిస్తుంది. ఒ.ఇ.సి.డి. వైటు జాబితా బహుళ కోణాల నుండి అధికార పరిధులను చూస్తుంది; పన్ను పారదర్శకత, సరసమైన పన్ను, ఒ.ఇ.సి.డి. బి.ఇ.పి.ఎస్. పరిమితి, పన్నురహిత దేశాల అభ్యర్ధన.[67]

పర్యాటకం

A tropical beach in Trou-aux-Biches

మారిషస్ ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉంది. పర్యాటక రంగం మార్షిసు ఆర్థిక వ్యవస్థకు నాలుగవ సహకారవనరుగా ఉంది. ఈ ద్వీప దేశం ఉష్ణమండల శీతోష్ణస్థితిని ఉత్తేజపరిచే వెచ్చని సముద్రపు జలాలు, తీరాలు, ఉష్ణమండల జంతుజాలం, వృక్షజాలం, బహుళ జాతులకు చెందిన సాంస్కృతిక జనాభాతో నిండి ఉంటుంది.[68]2018 లో 13,99,408 పర్యాటకులు సందర్శించగా తరువాత సంవత్సరానికి 3.6% పెరుగుదలతో 2019 నాటికి పర్యాటకుల సంఖ్య 14,50,000 కి చేరుకుంటుందని భావించారు.[69]

ప్రస్తుతం మారిషస్‌లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు రెండు ఉన్నాయి; అవి ఆప్రవిసి ఘాటు, లే మోర్నే కల్చరల్ లాండుస్కేపు.అంతేకాకుండా " బ్లాక్ రివరు గోర్జెసు నేషనలు పార్కు " ప్రస్తుతం తాత్కాలిక జాబితాలో ఉంది.[70]

రవాణా

2005 నుండి మారిషస్‌లో విద్యార్థులకు, వికలాంగులు, వయోజన పౌరులకు ప్రభుత్వ బస్సు రవాణా ఉచితంగా ఉంది.[71] ప్రస్తుతం మారిషస్ లో రైల్వేలు లేవు. ప్రైవేటు యాజమాన్యం కలిగిన గతకాలపు పారిశ్రామిక రైల్వేలు వదలివేయబడ్డాయి.

అలాగే క్రూజు టెర్మినలును పోర్టు లూయిసు నౌకాశ్రయం అంతర్జాతీయ వాణిజ్యాన్ని నిర్వహిస్తుంది. సివిలు ఏవియేషనుకు ఏకైక అంతర్జాతీయ విమానాశ్రం " సర్ సేవియోసగూర్ రాంగులాం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " విమానప్రయాణ సౌకర్యాలను కలిగిస్తుంది. ఇది జాతీయ వైమానిక సంస్థ ఎయిరు మారిషస్‌కు ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. 2013 సెప్టెంబరులో విమానాశ్రయ అధికారం కొత్త ప్రయాణీకుల టెర్మినలును ప్రారంభించింది.[72] రోడ్రిగ్యూసులో " సర్ గయేటను దువాలు " విమానాశ్రయం డొమెస్టికు సేవలు అందిస్తుంది.

అధిక సంఖ్యలో ఉన్న రహదారి వినియోగదారుల (ప్రధానంగా కారు డ్రైవర్లు) కారణంగా మారిషస్‌కు తీవ్రమైన ట్రాఫికు సమస్య ఉంది. ట్రాఫికు రద్దీ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మెట్రో ఎక్స్ప్రెసు ప్రాజెక్టును ప్రారంభించింది. రైలు పోర్టు లూయిసు నుండి క్యూర్పిపు వరకు మొదలవుతుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ 2019 లో ముగుస్తుంది. రెండవ దశ 2021 లో ముగుస్తుంది.[73]

సమాచార రంగం

2016 లో ఐ.సి.టి విభాగం జి.డి.పి.లో 5.7% వరకు భాగస్వామ్యం వహించింది.[74] 2016 నుండి సైబరు స్టార్.మ్యాన్ నేతృత్వంలో మారిషస్ అంతర్జాతీయ పోటీలలో పాల్గొంది. వారు మారిషస్‌లో 2016 & 2017 గూగులు కోడును నిర్వహించారు. ఇది 2 ఫైనలిస్టులకు, 1 గ్రాండ్ ప్రైజు సాధించడానికి దారితీసింది.[75][76] అంతేకాక వారు టి.ఎల్.ఎస్. 1.3, హెచ్.టి.టి.పి. 451, ఎస్.ఎస్.హెచ్. లలో పని చేస్తున్న ఇంటర్నెటు ఇంజనీరింగు టాస్కు ఫోర్సు (ఐ.ఇ.టి.ఎఫ్) హాకథానులో పాల్గొన్నారు.[77][78]

భూభాగవివాదం

చాగోసు ద్వీపసమూహం

ఈశాన్య ప్రాంతానికి 1,287 కిలోమీటర్ల (800 మైళ్ళు) దూరంలో ఉన్న చాగోసు ద్వీపసమూహంపై మారిషస్ దీర్ఘకాలంగా సార్వభౌమాధికారాన్ని కోరింది. 18 వ శతాబ్దం నుంచి ఫ్రెంచివారు మొట్టమొదటగా ద్వీపంలో స్థిరపడినసమయంలో పరిపాలనాపరంగా చాగోసు మారిషస్‌లో భాగంగా ఉండేది. 1810 లో రెండు దేశాలు ఒప్పందం మీద సంతకం చేసిన తరువాత ఫ్రెంచి కాలనీ " ఐసిల్ డి ఫ్రాన్సు " లో భాగంగా (మారిషస్ పిలిచేవారు) ఇది బ్రిటిషు వారికి ఇవ్వబడింది.[79] 1965 లో మారిషస్ స్వాతంత్రానికి మూడు సంవత్సరాల ముందే యునైటెడు కింగ్డం మారిషస్ నుండి చోగోసు ద్వీపసమూహన్ని సీషెల్సు నుండి ఆల్టబ్రా, ఫారుక్యుహరు, డెస్రోచెసుసు విడదీసి బ్రిటీషు హిందూమహాసముద్ర భూభాగం ఏర్పాటు చేయబడింది. 1965 నవంబరు 8 న ఈ ద్వీపాలు యునైటెడు కింగ్డంలో ఒక విదేశీ భూభాగంగా స్థాపించబడింది. 1976 జూను 23 న సీషెలు స్వతంత్రంలో భాగంగా ఆల్డబ్రా, ఫారుక్యుహరు డెస్రోచెసు తిరిగి సీషెలుకు ఇవ్వబడ్డాయి. బియాటులో ఇప్పుడు చాగోసు ద్వీపసమూహ భూభాగం మాత్రమే ఉంది. యునైటెడు కింగ్డం ద్వీపసమూహంలోని డియెగో గార్సియా ప్రధాన ద్వీపాన్ని యు.ఎస్. సైనిక స్థావరాన్ని స్థాపించటానికి 50 సంవత్సరాల లీజు కింద లీజుకిచ్చింది.[79][80] 2016 లో బ్రిటను ఏకపక్షంగా 2036 వరకు US కి లీజును విస్తరించింది.[81] స్వాతంత్రానికి ముందు కొలోనియల్ భూభాగాలను విడిచిపెట్టడంలో యునైటెడు కింగ్డం యునైటెడ్ నేషన్సు తీర్మానాలు ఉల్లంఘించిందని మారిషస్ గట్టిగా వాదిస్తుంది. మారిషస్ చట్టం, అంతర్జాతీయ చట్టం ఆధారంగా డియెగో గార్సియాతో సహా చాగోసు ద్వీపసమూహం తమకు అధికారం ఉందని మారిషస్ పేర్కొంటుంది.[82] ద్వీపాలు నివసితప్రాంతాలని అంగీకరించడానికి మొదట తిరస్కరించిన తరువాత ఒక శతాబ్ధకాలం ఈ ద్వీపాలలో నివసించిన సుమారు 2,000 చాగోసీయన్లను బ్రిటిషు ప్రభుత్వం బలవంతంగా బహిష్కరించింది. యు.కె. చగోసీయన్లను బెదిరించి వాహనాలతో వారి కుక్కలను చంపి ప్రజలనును నిర్మూలించడానికి కాల్చడం లేదా విషప్రయోగం చేసింది.[83] ఐక్యరాజ్యసమితిలో దాని పార్లమెంటుకు ఇచ్చిన ప్రకటనలలో చాగోసు ద్వీపసమూహంలో ఎటువంటి "శాశ్వత జనాభా" లేదని జనాభాని "కాంట్రాక్టు కార్మికులు" గా మార్చారని యు.కె. నొక్కిచెప్పింది.[84]

1971 నుండి డియెగో గార్సియా పల్లపు ప్రాంతాలు 3,000 యు.కె, యు.ఎసు. సైనిక, పౌర ఒప్పంద సిబ్బందికి నివాసంగా ఉంది. చాగోసియన్లు ఆరిజోలాగోకు తిరిగి వెళ్ళడానికి క్రియాశీలక తిరుగుబాటు కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. వారిని బలవంతంగా బహిష్కరణ చేయడం, తొలగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.[85][86]

కోర్టు శాశ్వత మధ్యవర్తిత్వం

The military base of Camp Justice on Diego Garcia

2010 డిసెంబరు 20 న మారిషస్ చాగోసు మెరైను ప్రొటెక్టెడు ఏరియా (ఎం.పి.ఎ) చట్టబద్ధతను సవాలు చేయడానికి " యునైటెడు నేషన్సు కన్వెన్షను ఆన్ ది లా ఆఫ్ ది సీ " ఆధారంగా యునైటెడ్ కింగ్డంకు వ్యతిరేకంగా పోరాడడం ప్రారంభించింది. 2010 ఏప్రెలులో యు.కె. చాగోసు ద్వీపసమూహం వివాదానికి న్యాయస్థానం మధ్యవర్తిత్వం వహించింది.

మధ్యవర్తులు ఇద్దరూ మారిషస్ సార్వభౌమత్వాన్ని స్పష్టంగా గుర్తించారు. మిగిలిన ముగ్గురిలో ఎవరూ దీనిని నిరాకరించ లేదు. ట్రిబ్యునలులోని ముగ్గురు సభ్యులు దీనిని అధిగమిచడం తమ అధికార పరిధిలో లేదని గుర్తించారు; చాగోసు ద్వీపసమూహం మీద సార్వభౌమాధికారం ఉన్న రెండు దేశాలు ఏవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ట్రిబ్యునలు న్యాయమూర్తులు రూడిగరు వుల్ఫ్రం, జేమ్సు కటేకా ఈ వివాదపరిష్కారం నిర్ణయించడం ట్రిబ్యునలు అధికార పరిధిలో ఉందని చాగోసు ద్వీపసమూహం మీద యుకెకు సార్వభౌమాధికారం లేదని పరిశీలించి నిర్ధారించారు.[87]

  • అంతర్గత యునైటెడ్ కింగ్డమ్ పత్రాలు " ఎం.పి.ఎ " వెనుక ఒక నిగూఢ ఉద్దేశ్యం ఉందని సూచించాయి. 1965 లో "బియాటు", 2010 లో " ఎం.పి.ఎ " ను ప్రకటించడం మధ్య కలతపెట్టే సారూప్యతలు, సాధారణ నమూనా ఉన్నట్లు గుర్తించాయి;
  • 1965 లో మారిషస్ నుండి చాగోసు ద్వీపసమూహాన్ని తొలగించి యు.కె. మారిషస్ ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా అగైరవపరచిందని భావించింది.
  • 1965 లో ప్రీమియర్ సర్ సేవియోసగూర్ రాంగులాం UK ప్రధానమంత్రి హారొల్ద్ విల్సన్ ముప్పును చాగోస్ ద్వీపసమూహాల తొలగింపుకు అంగీకరించకపోతే అతను స్వతంత్రం లేకుండా ఇంటికి తిరిగి రావచ్చని చెప్పాడు; మారీషయన్ మంత్రులు చాగోస్ ద్వీపసమూహాన్ని విడిచిపెట్టినట్లు అంగీకరించారు. ఈ విరమణ స్వీయ-నిర్ణయం అంతర్జాతీయ చట్టం ఉల్లంఘించిందని భావించబడింది;
  • " ఎం.పి.ఎ. " చట్టబద్ధంగా చెల్లదు.

మారిషస్‌కు చాగోసు ద్వీపసమూహాన్ని తిరిగి తీసుకురావడానికి యు.కె. బాధ్యత, మారిషస్ భవిష్యత్తు ప్రయోజనాలకు సంబంధించి, ద్వీపసమూహ భవిష్యత్తు ఉపయోగానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటుంది అని ట్రిబ్యునలు నిర్ణయం నిర్ణయించింది. ట్రిబ్యునలు నిర్ణయం ఫలితంగా ఎం.పి.ఎ. ప్రకటించడానికి ముందు రెండుదేశాలు మధ్యవర్తిత్వ చర్చలలో ప్రవేశించడానికి అంగీకారం లభించింది. సముద్ర పర్యావరణాన్ని రక్షించడానికి "సార్వభౌమాధికారం గొడుగు" కింద అవసరమైన మేరకు తీసుకురావడానికి పరస్పర సంతృప్తికరమైన ఏర్పాటును సాధించటానికి ఇది సహకరిస్తుందని భావించబడింది.[88]

అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు

యు.కె. తొలగింపు చర్య దిద్దుబాటు

2004 లో బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించిన " బ్రిటీషు హిందూ మహాసముద్ర భూభాగం ఉత్తర్వు (బియాటు ఆర్డరు) నిర్ణయాన్ని అనుసరించి చాగోసనియన్లు ద్వీపంలో నివసించడానికి అధికారం నిషేధించబడింది. మారిషస్ చివరకు వివాదాన్ని నిష్పక్షపాతంగా పరిష్కరించాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరింది. " ఇంటర్నేషనలు కోర్టు ఆఫ్ జస్టిసు శాసనం " ఆర్టికలు 36 ప్రకారం ఐ.సి.జె. అధికార పరిధికి లోబడి ఉండాలనేది ఆ దేశం ఎంపిక చేయాలని సూచించబడింది. ఎన్నుకోబడిన ప్రదేశాలలో న్యాయస్థాన అధికార పరిధిని పరిమితం చేయవచ్చు. ఐక్యరాజ్యసమితిలో జారీ చేసిన యు.కె నిబంధన మినహాయించి " 1969 జనవరి 1 లో ఉన్న పరిస్థితులు లేదా వాస్తవాలకు సంబంధించి కామన్వెల్తులో సభ్యదేశంగా ఉన్న దేశానికి ప్రభుత్వంతో ఉన్న వివాదాలకు సంబంధించి ఐ.సి.జె. అధికార పరిధిని " మినహాయించింది. 1969 జనవరి 1 న తాత్కాలిక పరిమితి తొలగింపు సమయంలో ఉత్పన్నమయ్యే అన్ని వివాదాలను మినహాయించటానికి చేర్చబడుతుంది. బ్రిటీషు మినహాయింపు నిబంధన ప్రభావం మారిషస్ చాగోసు వివాదానికి సంబంధించి ఐసిజెకు దాఖలు చేయకుండా నిరోధించింది. ఎందుకంటే ఇది కామన్వెల్తులో సభ్యదేశంగా ఉంది. మారిషస్ కామన్వెల్తును విడిచి వెళ్ళడానికి ముందు. యునైటెడు కింగ్డం ఐ.సి.జె. అధికార పరిధికి మినహాయింపు నిబంధనను సవరించింది. ఫలితంగా ఇది కామన్వెల్త్ నుండి నిష్క్రమించినప్పటికీ కామన్వెల్తు దేశాలు, మాజీ కామన్వెల్తు దేశాల మధ్య వివాదాలను తొలగించడానికి ఐ.సి.జె వివాదస్పద అధికార పరిధికి లోబడి ఉంది.[89]

సలహామండలి అభిప్రాయం

2017 జూన్ 22 న 94 నుండి 15 దేశాల మధ్య యు.ఎన్. జనరలు అసెంబ్లీ 1960 లో దేశ స్వాతంత్య్రానికి ముందు మారిషస్ నుండి చాగోసు ద్వీపసమూహం వేరు చేయమని సలహా ఇచ్చేందుకు ఇంటర్నేషనలు కోర్టు ఆఫ్ జస్టిసును కోరాయి. 2018 సెప్టెంబరులో ఐ.సి.జె. కేసు విచారణ ప్రారంభించింది. 17 దేశాలు భారతదేశం, దక్షిణాఫ్రికా, నైజీరియాతో సహా మారిషస్‌కు అనుకూలంగా వాదించారు.[90][91] చాగోసు ద్వీపసమూహము నుండి తొలగించబడినందుకు యు.కె. క్షమాపణలు చెప్పింది. కానీ వ్యూహాత్మక పగడపు సమూహం సార్వభౌమాధికారంపై ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానం వివాదం తీసుకురావడం మారిషస్ తప్పు అని పట్టుబట్టారు.[92]


2019 ఫిబ్రవరి 25 న ఇంటర్నేషనలు కోర్టు ఆఫ్ జస్టిసు (ఐ.సి.జె) చాగోసు దీవులను మారిషస్ వీలైనంత వేగంగా తిరిగి అప్పగించాలని యు.కె. ను ఆదేశించింది. మారిషస్ నుండి 1965 లో చాగోసు ద్వీపసమూహం నిర్లక్ష్యంగా విడదీయబడిందని భావించబడింది. " ప్రజల స్వేచ్ఛాయుతమైన వ్యక్తీకరణ" మీద ఆధారపడకుండా విడదీయబడిందని ఐ.సి.జె. అధ్యక్షుడు అబ్దులుఖావీ అహ్మదు యూసఫు చెప్పాడు. "ఈ కొనసాగింపు పరిపాలన ఒక పొరపాటు చర్య " అని అదనంగా ప్రకటించాడు. "చాగోస్ ద్వీపసమూహం మీద సార్వభౌమాధికారానికి యు.కె. సాధ్యమైనంత వేగంగా ముగింపు పలకాలని ఐఖ్యరాజ్యసమితి ఆదేశించింది.[93]

జీవవైవిధ్యం

Mauritius ornate day gecko

మారిషస్ ప్రపంచంలోని అరుదైన మొక్కలకు జంతువులకు నిలయం. కానీ మానవ నివాస, స్థానికేతర జాతుల ప్రవేశంతో స్వదేశీయ వృక్షజాలం, జంతుజాలానికి ​​బెదిరింపుగా మారాయి.[85] దేశంలోని అగ్నిపర్వత మూలం, కాలం, ఏకాంతం, ప్రత్యేకమైన భూవైవిధ్యం కారణంగా, మారిషస్ ఒక చిన్న ప్రాంతంలో సాధారణంగా కనిపించని వృక్ష, జంతుజాలలకు వైవిధ్యానికి నిలయంగా ఉంది. 1507 లో పోర్చుగీసు రాకముందే ద్వీపంలో భూసంబంధమైన క్షీరదాలు లేవు. ఇది అనేక ఫ్లైలెసు ఫ్లైసు, పెద్ద సరీసృప జాతుల పరిణామాన్ని అనుమతించింది. మనిషి రాక హానికర అన్యజాతుల పరిచయం, జంతుజాతుల నివాసప్రాంతాల వేగవంతమైన నాశనం, స్థానిక వృక్షజాలం, జంతుజాలం ​నష్టానికి కారణంగా మారాయి. ప్రస్తుతం స్థానిక అడవి 2% కంటే తక్కువగా ఉంది. నైరుతీలో " బ్లాక్ రివరు గోర్జెసు నేషనలు పార్కు ", ఆగ్నేయంలో బాంబుసు పర్వత శ్రేణి, వాయువ్య ప్రాంతంలో మోకా-పోర్టు లూయిసు శ్రేణులలో ఆటవీప్రాంతం కేంద్రీకృతమై ఉంది. కార్ప్సు డి గార్డె, లే మోర్నే బ్రబంటు వంటి ఏకాంత పర్వతాలు, ప్రధాన భూభాగంకంటే వైవిధ్యం కలిగిన అనేక సముద్ర ద్వీపాలలో కూడా అటవీప్రాంతం ఉంది.. 100 కంటే ఎక్కువ జాతుల మొక్కలు, జంతువులు అంతరించిపోయాయి. అనేక జాతులు అంతరించేప్రమాదంలో ఉన్నాయి. ప్రమాదకరమైన స్థితిలో ఉన్న పక్షి, వృక్ష జాతుల పునరుత్పత్తి, జాతీయ ఉద్యానవనాలు, ప్రకృతి నిల్వప్రాంతాలు నివాస పునఃస్థాప కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా 1980 లలో పరిరక్షణ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.[94]

2011 లో " పర్యావరణ సస్టైనబులు డెవలప్మెంటు మంత్రిత్వశాఖ " మారిషస్ ఎన్విరాన్మెంటు అవుటులుక్ రిపోర్టు" ను జారీ చేసింది. ఇది సెయింటు బ్రాండను మెరైను ప్రాంతాన్ని రక్షితప్రాంతంగా ప్రకటించాలని సిఫార్సు చేసింది.

2016 మార్చి నాటికి " మారిషస్ వైల్డులైఫ్ ఫౌండేషను " అధ్యక్ష నివేదికలో " స్ట్రాను బ్రాండను అటోలు " పరిరక్షణకు ప్రోత్సహించడానికి అధికారిక ఎం.డబల్యూ. ఎఫ్. ప్రాజెక్టుగా ప్రకటించబడింది.[95]


ద్వీపంలో అంతరించిపోతున్న క్షీరదాలలో " మౌరిషసు ఎగిరే నక్కలు " మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇటీవల సంవత్సరాలలో అవి పంటల పెంపకానికి ముప్పుగా ఉన్నాయని విశ్వసిస్తున్న కారణంగా ప్రభుత్వం నవంబర్ 2015 నవంబరులో ప్రవేశపెట్టబడిన నిర్మూలన కారణంగా ఇటీవలి కాలంలో మారిషస్ ఎగిరే నక్కలు తీవ్రంగా బెదిరింపుకు గురైయ్యాయి. 2015 కు ముందు తీవ్రమైన తుఫాను లేకపోవడమే పండ్ల గబ్బిలాల పెరుగుదల సంభవించింది. జాతుల స్థితి పరిశీలించిన తరువాత ఐ.యు.సి.ఎన్. వీటి స్థితిని అంతరించిపోయే ప్రమాదం నుండి 2014 లో బలహీనంగా ఉన్న జాతిగా గుర్తించింది. 2018 అక్టోబరు పండ్ల గబ్బిలాలు 20% నిర్మూలన కార్యక్రమం చేపట్టిన కారణంగా 13,000 పండ్లగబ్బిలాలు అంతరించి 65,000 మాత్రం మిగిలి ఉన్నాయి. తిరిగి వాటి స్థితి గతంలో ఉన్నట్లు అంతరించిపోయే ప్రమాదానికి చేరుకుంది.

[96]

డోడో

Mauritius was the only known habitat of the extinct dodo, a flightless bird.

మారిషస్‌లో ఇది అంతకుముందు తెలియని సరికొత్త పక్షి జాతికి చెందినదిగా గుర్తించబడింది. డోడో ఒక పావురం జాతికి చెందిన పక్షి. ఇది నాలుగు మిలియను సంవత్సరాల క్రితం మారిషస్‌లో స్థిరపడింది.[97] డోడో పక్షులను వేటాడే జతువుల దాడి లేని కారణంగా అవి ఎగిరే సామర్థ్యాన్ని కోల్పోయాయి. మారిషస్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి మనుషులు అరబ్బులు. వారిని అనుసరిస్తూ 1505 లో పోర్చుగీసువారు ఈ ద్వీపసమూహానికి చేరుకున్నారు. ఈ ద్వీపాలు సుగంధ వాణిజ్య నౌకలకు మజిలీ ప్రాంతాలుగా మారాయి. 50 పౌండ్లు (23 కిలోలు) వరకు బరువు ఉన్న డోడోపక్షులు నావికులకు తాజా మాంసం వనరుగా స్వాగతం పలికాయి. పెద్ద సంఖ్యలో డోడోలు ఆహారం కోసం చంపబడ్డాయి. తరువాత డచ్చి వారు ఈ ద్వీపాన్ని శిక్షాస్మృతి కాలనీగా ఉపయోగించిన సమయంలో కొత్త జాతులు ద్వీపంలో ప్రవేశపెట్టబడ్డాయి. ఎలుకలు, పందులు, కోతులు భూమిలో ఉండే గూళ్ళు లోని డోడో గుడ్లు తింటాయి. మానవ దోపిడీ, ప్రవేశ జాతుల కలయిక గణనీయంగా డోడో జనాభాను క్షీణింపజేసింది. మారిషషులో మానవుల రాక కారణంగా 100 సంవత్సరాలలో సమృద్ధిగా ఉన్న డోడో ఒక అరుదైన పక్షిగా మారింది. చివరిది 1681 లో చంపబడింది. [98] మోడిషియసు జాతీయ " కోటు ఆఫ్ ఆర్ముసు " (హెరాల్డిక్) మద్దతుదారుగా డోడో పేర్కొనబడింది. [99]

పర్యావరణం, వాతావరణం

Black River Gorges National Park

మారిషస్‌లో పర్వత ప్రాంతాలలో అడవులతో, తీర ప్రాంతాల్లో సాధారణంగా ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంటుంది. సీజనలు తుఫానులు వృక్షజాలం, జంతుజాలానికి వినాశనాత్మకంగా ఉన్నప్పటికీ త్వరగా తిరిగి కోలుకుంటాయి. 2011 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక " ఎయిరు క్వాలిటీ " జాబితాలో మారిషస్ రెండవ స్థానంలో ఉంది.[100]

" ట్రాపికు ఆఫ్ కాప్రికాను " దగ్గర ఉన్న మారిషస్ ఉష్ణమండలీయ వాతావరణాన్ని కలిగి ఉంది. నవంబరు నుండి ఏప్రిలు వరకు వెచ్చని తేమతో కూడిన వేసవి కాలం 24.7 ° సెం (76.5 ° ఫా), జూను నుండి సెప్టెంబరు వరకు సాపేక్షంగా చల్లటి శీతాకాలంలో ఉష్ణోగ్రత 20.4 సెం° (68.7 ° ఫా) . సీజన్ల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం 4.3 ° సెం(7.7 ° ఫా) మాత్రమే ఉంటుంది. వెచ్చని నెలలు జనవరి, ఫిబ్రవరి నెలలలో సరాసరి గరిష్ట ఉష్ణోగ్రతలు 29.2 ° సెం (84.6 ° ఫా) చేరుకుంటాయి. శీతల మాసాలుగా ఉండే జూలై, ఆగస్టు మాసాలలో రాత్రివేళలలో ఉండే సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 16.4 ° సెం (61.5 ° ఫా) ఉంటుంది. వార్షిక వర్షపాతం 900 మి.మీ (35 అం) నుండి తీరంలోని కేంద్ర పీఠభూమిలో 1,500 మి.మీ (59 అం) వరకు ఉంటుంది. వర్షపుకాలం ఖచ్చితంగా గుర్తించబడనప్పటికీ వర్షపాతం అధికంగా వేసవి నెలల్లో సంభవిస్తుంది. సముద్రతీరంలో ఉండే ఉప్పునీటి మడుగులలో ఉష్ణోగ్రతలు 22-27 ° సెం (72-81 ° ఫా) ఉంటుంది. కేంద్ర పీఠభూమి చుట్టుపక్కల తీర ప్రాంతాల కంటే చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ వర్షపాతం రెండు రెట్లు అధికంగా ఉంటుంది. తూర్పు వైపున నుండి వీచే చల్లని గాలులు అధిక వర్షపాతాన్ని తీసుకువస్తాయి. సాధారణంగా జనవరి, మార్చి మధ్య అప్పుడప్పుడు ఉష్ణ మండలీయ తుఫానులు సంభవిస్తుంటాయి. ఇవి భారీ వర్షపాతానికి కారణమౌతూ మూడు రోజులు వాతావరణానికి అంతరాయం కలిగిస్తాయి.[101]

గణాంకాలు

Population pyramid of Mauritius according to 2011 census

2018 జూలై 1 నాటికి మౌరిషియసు రిపబ్లికు జనసంఖ్య 12,65,577. 2018 మధ్య నాటికి మారిషస్‌లో ఆడవారి సంఖ్య మగవారి సంఖ్య కంటే 13,169 అధికంగా ఉంది. మారిషస్ ద్వీపంలో 12,22,268 నివసించగా, రాడిగ్లసు ద్వీపంలో నివసిస్తున్న వారి సంఖ్య 43,035 ఉంది. అగలేగా, సెయింటు బ్రాండనులలో నివసిస్తున్న వారి సంఖ్య మొత్తం 274 మంది.[102] ఆఫ్రికా దేశాలలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాలలో మారిషస్ ఒకటి.

1982 లో రాజ్యాంగ సవరణకు తరువాత జనాభా గణనలో మారిషస్‌ప్రజలు వారి జాతి గుర్తింపులను బహిర్గతం చేయవలసిన అవసరం లేదు. అందువలన మారిషస్ ప్రజలు వారి జాతివివరణకు సంబంధించిన అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. 1972 జనాభా గణాంకాలలో జాతివివరణ చివరిసారిగా అంచనా వేయబడింది.[103][104] మారిషస్‌లో భారతీయ, ఆఫ్రికా, చైనా, ఐరోపా (ఎక్కువగా ఫ్రెంచ్) మూలానికి చెందిన ఒక బహుళ జాతి సమాజం ఉంది.

మతం

మారిషస్ జనాభాలో 48.5% మంది హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో తమిళ, తెలుగు ప్రజలు ఉన్నారు. తరువాతి స్థానంలో క్రైస్తవ మతం (32.7%), ఇస్లాం (17.2%), ఇతర మతాలు (0.7%) ఉన్నాయి. 0.7% తాము నాస్థికులమని వివరించగా, 0.1% ప్రజలు సమాధానం ఇవ్వలేదు.[105] ఆఫ్రికాలో హిందూ ప్రజలు సమిహ్యాపరంగా ఆధిఖ్యతలో ఉన్న ఒకేఒక దేశం మారిషస్.[ఆధారం చూపాలి]

మారిషస్ అధికారికంగా లౌకిక రాజ్యంగా ఉంది. మారిషస్ మతపరంగా వైవిధ్యభరితమైన దేశంగా ఉంది. మతస్వాతంత్ర్యం రాజ్యాంగ హక్కుగా పొందుపరచబడింది.[106] మారిషీ ప్రజల సంస్కృతి ఏడాది పొడవునా జరుపుకునే వివిధ మత సంబరాలలో ప్రతిబింబిస్తుంది. వాటిలో కొన్ని ప్రభుత్వ సెలవులుగా గుర్తింపు పొందాయి.

భాషలు

మారిషస్ రాజ్యాంగం అధికారిక భాష గురించి ప్రస్తావించలేదు. జాతీయ అసెంబ్లీ అధికారిక భాష ఆంగ్లం అని రాజ్యాంగం పేర్కొంది; అయినప్పటికీ ఏ సభ్యుని కూడా ఫ్రెంచిలో సంప్రదించవచ్చు.[107] ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలు సాధారణంగా మారిషస్ వాస్తవ జాతీయ, సాధారణ భాషలుగా పరిగణించబడతాయి. ఎందుకంటే అవి ప్రభుత్వ పరిపాలన, న్యాయస్థానాలు, వ్యాపారం భాషలుగా ఉన్నాయి.[108] మారిషస్ రాజ్యాంగం ఆంగ్లంలో రాయబడింది. సివిలు కోడు, క్రిమినలు కోడు వంటి కొన్ని చట్టాలు ఫ్రెంచిలో ఉన్నాయి.

మౌరిటానియ జనాభా భాషాపరంగా బహుముఖంగా ఉంది; మారీషయన్ క్రియోలు మౌరిషియన్ల మాతృభాషగా ఉంటోంది. చాలామంది ఆంగ్ల, ఫ్రెంచి భాషలలో కూడా నిష్ణాతులు; వారు పరిస్థితి ప్రకారం భాషలను మార్చుకుంటారు.[109] ఫ్రెంచి, ఆంగ్లము విద్యా, వృత్తిపరంగా వాడుకలో ఉన్నాయి. ఆసియా భాషలను ప్రధానంగా సంగీతం, మత, సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. మాధ్యమం, సాహిత్యం ప్రాధమికంగా ఫ్రెంచి భాషలో ఉన్నాయి.

క్రియోలు భాష ఇది కొన్ని అదనపు ప్రభావాలతో ఫ్రెంచి ఆధారితంగా ఉంటుంది. ప్రజలలో ఎక్కువమంది దీనిని స్థానిక భాషగా మాట్లాడతారు. [110] దేశంలోని వివిధ ద్వీపాలలో మాట్లాడే క్రియోలు భాషలు ఎక్కువ లేదా తక్కువగా ఒకేమాదిరిగా ఉన్నాయి: మారిషస్‌, రోడ్రిగ్సు, అగలేగ, చాగోసు దీవుల్లోని ప్రజలు మారిషియన్ క్రియోలు, రోడ్రిగున్ క్రియోలు, అగలేగా క్రియోలు, చాగోసీయన్ క్రియోలు భాషలను మాట్లాడతారు. మారిషస్‌లో మాట్లాడే కొన్ని పూర్వీకుల భాషలలో భోజ్పురి [111] చైనీసు,[112] హిందీ,[113] మరాఠీ,[114] తమిళం,[115] తెలుగు,[116] ఉర్దూ భాషలు ఉన్నాయి.[117] విస్తృతంగా మాతృభాషగా వాడుకలో ఉన్న భోజుపురి, కాలక్రమంలో తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇంటిలో భోజ్పురి ఉపయోగంలో తగ్గుదల ఉంది. ఇది 2000 లో 12% తో ఉండగా 5% క్షీణించింది.[118] స్కూలు విద్యార్థులు ఇంగ్లీషు, ఫ్రెంచి నేర్చుకోవాలి; వారు కూడా ఒక ఆసియా భాష లేదా మారీషయను క్రియోలు ఎంపిక చేసుకోవాలి. బోధన మాధ్యమం పాఠశాల నుండి పాఠశాలకు మారుతుంది కానీ సాధారణంగా క్రియోలు, ఫ్రెంచి, ఆంగ్లం ఆధిఖ్యతలో ఉంటాయి.

విద్య

మారిషస్‌లో విద్యా వ్యవస్థ ముందు ప్రాధమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలను కలిగి ఉంటుంది. ఈ విద్యావిధానంలో రెండు నుంచి మూడు సంవత్సరాల పూర్వ ప్రాధమిక పాఠశాల, ప్రాథమిక పాఠశాల అచీవ్మెంటు సర్టిఫికేటు పొందడానికి అర్హతకలిగించే ఆరు సంవత్సరాల ప్రాధమిక పాఠశాల, పాఠశాల సర్టిఫికేటు పొందడానికి అర్హత కలిగించే ఐదు సంవత్సరాల మాధ్యమిక విద్య, రెండు సంవత్సరాల ఉన్నత పాఠశాల విద్య తరువాత విద్యార్ధులు సర్టిఫికెటు అందుకుంటారు. సెకండరీ పాఠశాలలు "కళాశాల" గా ఉన్నాయి. మారిషస్ ప్రభుత్వం దాని పౌరులకు ప్రీ-ప్రాధమిక నుండి తృతీయ స్థాయికి ఉచిత విద్యను అందిస్తుంది. 2013 లో ప్రభుత్వ వ్యయం సుమారు 13,584 మిలియను రూపాయల అంచనా వేయబడింది. మొత్తం ఖర్చులో 13% విద్యాభివృద్ధికి వ్యయం చేయబడుతుంది.[119] 2017 జనవరి నాటికి ప్రభుత్వం తొలి విద్యాసంస్థల మార్పులను ప్రవేశపెట్టింది. తొమ్మిది సంవత్సరాల నిరంతర ప్రాధమిక విద్యా కార్యక్రమంతో ఇది ప్రాధమిక విద్యా సర్టిఫికెటు (సి.పి.ఇ.) ని రద్దు చేసింది. [1]

కేంబ్రిడ్జి ఇంటర్నేషనలు ఎగ్జామినేషన్సు ద్వారా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం O- లెవెలు, ఎ-లెవలు పరీక్షలను నిర్వహిస్తుంది. తృతీయ విద్యా విభాగంలో మారిషస్‌లోని విశ్వవిద్యాలయాలు, ఇతర సాంకేతిక సంస్థలు ఉన్నాయి. దేశంలోని మారిషస్ విశ్వవిద్యాలయం, టెక్నాలజీ విశ్వవిద్యాలయం ప్రధాన విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యాసేవలు అందిస్తూ ఉన్నాయి.

2015 లో వయోజన అక్షరాస్యత రేటు 92.7% గా అంచనా వేయబడింది. [2]

సంస్కృతి

కళలు

మారిషస్ చిత్రకారులలో వాకో బైసాకు[120] హెంరి లి సిదానరు, మాల్కొల్ము డీ చాజలు ప్రముఖ్యత సంతరించికున్నారు. గాబ్రియల్లె వీచె ప్రముఖ ఇల్లస్ట్రేడు, గ్రాఫికు డిజైనరుగా ప్రఖ్యాతిగాంచాడు.

నిర్మాణరంగం

మారిషస్ విలక్షణమైన భౌగోళిక నిర్మాణం ద్వీపాలను ఐరోపాను తూర్పును కలుపే ఒక వలసవాద వాణిజ్య స్థావరంగా మార్చింది. 17 వ శతాబ్దం నుంచి డచ్చి, ఫ్రెంచి, బ్రిటీషు సెటిలర్లు పరిచయం చేసిన శైలులు, రూపాలు, భారతదేశం, తూర్పు ఆఫ్రికాల ప్రభావంతో అంతర్జాతీయ, చారిత్రక, సాంఘిక, కళాత్మక ప్రాముఖ్యతల ఏకైక హైబ్రీడు నిర్మాణకళకు దారితీసింది. మారిషీయ నిర్మాణాలు వివిధ రకాల డిజైన్లు, సామగ్రి, అలంకార అంశాలని కలిగి ఉన్నాయి. అవి దేశంలో ప్రత్యేకమైనవిగా హిందూ మహాసముద్ర ఐరోపా వలసవాదం చారిత్రక వివరణలను తెలియజేస్తాయి.[121]

దశాబ్ధాలకాలం కొనసాగిన రాజకీయ, సాంఘిక, ఆర్థిక మార్పుల ఫలితంగా మారిషాసు నిర్మాణ వారసత్వం సాధారణ వినాశనం జరిగింది. 1960 - 1980 మధ్యకాలంలో ద్వీపంలోని ఉన్నతమైన చారిత్రక గృహాలు, (క్యాంపాగ్నెసు అని స్థానికంగా పిలువబడేవి) అధిక శాతం అదృశ్యమయ్యాయి. విస్తరించిన పర్యాటక రంగం కారణంగా ఇటీవల సంవత్సరాల్లో తోటలు, గృహాలు, పౌర భవనాల కూల్చివేత చోటు చేసుకుంది. రాజధాని నగరం పోర్టు లూయిసు 1990 ల మధ్యకాలం వరకు మార్పులేనిదిగా ఉంది, కానీ ఇప్పుడు నిర్మాణ వారసత్వం సరికట్టలేని నష్టాన్ని ప్రతిబింబిస్తుంది. అధికరిస్తున్న భూమిధరలు మారిషస్‌లో చారిత్రాత్మక నిర్మాణాల సాంస్కృతిక విలువకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. రైజింగ్ భూ విలువలు అమర్చబడినాయి, నిర్వహణ నిషేధాత్మక ఖర్చులు, సాంప్రదాయక భవనం నైపుణ్యాల స్థిరమైన క్షీణత, సంరక్షణలో పెట్టుబడి పెట్టడం కష్టతరమవుతుంది.[121]

క్రియోలు గృహాలుగా పిలువబడే వాటిలో చారిత్రాత్మకంగా సాధారణ ప్రజల నివసించే ప్రాంతాలుగా మారాయి.[122]

సాహిత్యం

మారిషస్ రచయితలలో మారీ-థెరేసే హంబెటు, మాల్కోం డి ఛాజలు, ఆనంద దేవి, షెనజు పటేలు, ఖలు టొరాబుల్లీ, జె. ఎం. జి. లే. క్లెజియో, అక్విలు గోపీ, దేవు వీరసామి ప్రాధాన్యత వహిస్తూ ఉన్నారు.

2008 లో సాహిత్యంలో నోబెలు బహుమతిని గెలుచుకున్న జె.ఎం.జి. లే క్లెజియో, మారిషీయను వారసత్వం, ఫ్రెంచి-మౌరిటాను డ్యూయెలు పౌరసత్వాన్ని కలిగి ఉంది.

ఈ ద్వీపం లే ప్రిన్సు మారిసు ప్రైజుక్ ఆతిథ్యమిస్తుంది. ఈ బహుమతి ద్వీపం సాహిత్య సంస్కృతితో ఆంగ్ల భాష మాట్లాడే, ఫ్రెంచి మాట్లాడే రచయితల మధ్య వార్షిక ఆధారంగా మారుతుంది.

సంగీతం

మారిషస్ ప్రధాన సంగీత శైలులలో సెగా, దాని వ్యూహాత్మక శైలి, సెగ్గే, భోజ్పురి జానపద గీతాలు, భారతీయ చలన సంగీతం, ముఖ్యంగా బాలీవుడు శాస్త్రీయ సంగీతం, పాశ్చాత్య సాంప్రదాయ సంగీతం, భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రాధాన్యత వహిస్తున్నాయి.

ఆహారం

భారతీయ, క్రియోలు, ఫ్రెంచి, చైనీసు వంటకాలు ఈ ద్వీపానికి ప్రత్యేకమైనవి. మారీషయన్ వంటలో సుగంధ ద్రవ్యాలు కూడా పెద్ద భాగం వహిస్తున్నాయి.

శలవుదినాలు పండుగలు

మారిషస్ శలవుదినాలు మారిషస్ చరిత్ర ఆధారితంగా పలు సాంస్కృతిక ప్రభావాలను కలిగి ఉంటాయి.[123]

మారిషస్‌లో 15 ప్రభుత్వశలవు దినాలు ఉంటాయి. శలవు దినాలన్నీ పండుగల ఆధారితమై ఉండి క్రిస్మసు మినహా మిగిలిన పండుగలలో వార్షికంగా వైవిధ్యం ఉంటుంది. ఇతర శలవుదినాలలో హోలి, రక్షాబంధను, పెరె లావలు పిలిగ్రమేజు మారిషస్ సాంస్కృతిని సుసంపన్నం చేస్తున్నాయి.

క్రీడలు

The Maiden Cup in 2006

మారిషస్‌లో ఫుటు బాలు అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఉంది.[124] జాతీయ జట్టును ది డాడోస్ లేదా క్లబ్బు ఎం. అని అంటారు. మారిషస్‌లో ఇతర ప్రముఖ క్రీడలలో సైక్లింగు, టేబులు టెన్నిసు, గుర్రం రేసింగు, బాడ్మింటను, వాలీబాలు, బాస్కెట్బాలు, హ్యాండ్బాలు, బాక్సింగు, జూడో, కరాటే, టైక్వాండో, వెయిటు లిఫ్టింగు, బాడీబిల్డింగు, అథ్లెటిక్సు ప్రాధాన్యత వహిస్తున్నాయి. వాటరు స్పోర్ట్సులో ఈత, సెయిలింగు, స్కూబా డైవింగు, విండు సర్ఫింగు, కైటు సర్ఫింగు ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి.

1812 నుండి " చాంప్ డే మార్సు రేస్కోర్సు " ప్రారంభించడంతో గుర్రపు పందాలు ప్రజాదరణ పొందాయి. " ఇండియను ఓషను ఐలాండ్జూ గేంసు " రెండవ (1985), ఐదవ క్రీడలకు (2003) మారిషస్ ఆతిథ్యం ఇచ్చింది. 2008 లో బీజింగులో నిర్వహించబడిన వేసవి ఒలింపిక్సులో మారిషస్ తన మొట్టమొదటి ఒలింపికు పతకాన్ని సాధించింది. ఈ క్రీడలలో బ్రూనో జూలీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

గోల్ఫులో మాజీ మారిషస్ ఓపెను, ప్రస్తుత ఆఫ్రాసియా బ్యాంకు మారిషస్ ఓపెను ఐరోపా పర్యటనలో భాగంగా నిర్వహించబడుతున్నాయి.

మూలాలు

బయటి లింకులు