మ్యాక్ ఓయస్ టెన్

మ్యాక్ ఓయస్ టెన్[1] యాపిల్ ఇంకోర్పరేటెడ్ తయారు చేసి అమ్మే ఒక ఆపరేటింగ్ సిస్టెం కుటుంబం. వీటిలో అతి నూతనమైనది యాపిల్ తయారు చేసే అన్ని కంప్యూటర్లలో ప్రీ-ఇంస్టాల్ చేసి అమ్ముతుంది. ఇది యాపిల్ ఇంతకుముందు వాడిన మ్యాక్ ఓయస్ (9) కు successor. ఇంతకు ముందు యాపిల్ వాడిన ఆపరేటింగ్ సిస్టెంలకు భిన్నంగా ఓయస్ టెన్ ఉనిక్స్ ఆధారంగా తయారు చేయ బడింది.

మ్యాక్ ఓయస్ టెన్
మ్యాక్ ఓ యస్ టెన్ వి10.5 "లియోపార్డ్" చిత్రపటం
అభివృద్ధికారులుయాపిల్ ఇంకార్పరేటెడ్
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్
పనిచేయు స్థితివాడుకంలో ఉంది
మూల కోడ్ విధానంClosed source (with open source components)
ఇటీవల విడుదల10.5.2 / ఫిబ్రవరి 11 2008
ప్లాట్ ఫారములుx86, x86-64, PowerPC (32-bit & 64-bit)
Kernel విధముHybrid
అప్రమేయ అంతర్వర్తిAqua (GUI)
లైెసెన్స్యాజమాన్య సంబంధమైనది
అధికారిక జాలస్థలియాపిల్ సైట్‌లో మ్యాక్ ఓయస్ టెన్

ఓయస్ టెన్ లో విడుదలైన మొత్త మెదటి వెర్షన్ మ్యాక్ ఓయస్ టెన్ సెర్వర్ 1.0. ఇది 1999లో విడుదలైంది. డెస్క్‌టాపులకు పనికివచ్చే మ్యాక్ ఓయస్ టెన్ వి10.0 మార్చి 2001లో విడులైంది. ఇందులో ప్రత్యేక మార్పు యాపిల్ ప్రవేశ పెట్టిన ఆక్వా యూసర్ ఇంటర్ఫేస్. అప్పటినుండి, 2008వరకు, మరొక ఐదు వెర్షన్లు యాపిల్ విడుదల చేసింది. ప్రతి వెర్షన్లో సెర్వర్, డెస్క్‌టాపులకు వేర్వేరు వెర్షన్లు ఉన్నాయి. ప్రస్తుతపు తాజా విడుదల ఆక్టోబర్ 2007 లో విడుదలైన మ్యాక్ ఓయస్ టెన్ వి10.5 "లియేపార్డ్". మ్యాక్ ఓయస్ టెన్ వెర్షన్లు పెద్ద పిల్లుల పేర్లు పెట్టింది యాపిల్. ఉదాహరణకి మ్యాక్ ఓయస్ టెన్ వి10.4ని "టైగర్" అని పిలుస్తారు.

యాపిల్ ఓయస్ టెన్ ని కొద్దిగా మార్చి, యాపిల్ టీవీ, ఐఫోన్, ఐపాడ్ టచ్‌లకు కూడా వాడుతుంది. ఈ మార్పు చెందిన ఓయస్ ఆ పరికరానికి ఏ ఫీచర్లు అవసరమే అవి మాత్రమే ఉంచుతుంది యాపిల్. కాని కొంత మంది ఆ ఓయస్‌లో కూడా కొన్ని సాఫ్ట్‌వేర్లు ఇంస్టాల్ చేయవచ్చని చెబుతున్నారు.[2]

చరిత్ర

మ్యాక్ ఓయస్ టెన్ మాక్ కెర్నల్ మీద ఆధారపడినది. ఇది వంటిది. వచ్చి స్టీవ్ జాబ్స్ NeXTలో, యాపిల్‌కి దూరంగా ఉన్నప్పుడు డెవలప్ చేసిన ఆపరేటింగ్ సిస్టెం[3]. యాపిల్ 1996లో యాపిల్ ని కొన్నప్పుడు, యాపిల్ తన క్రొత్త ఓయస్ ని ఓయస్ ని OPENSTEP ఆధారంగా చేసుకొని డెవలప్ చేసింది. జాబ్స్ యాపిల్ కి తిరిగి తాత్కాలిక సీయీఓగా తిరిగి వచ్చి, యాపిల్‌ని తీర్చిదిద్దాడు. దీనిని మెదట రాఫ్సొడి అని పేరు పెట్టారు. తరువాత ఓయస్ టెన్ అని పేరు మార్చారు[4].

ఇవి కూడా చూడండి

మూలాలు