వియత్నాం యుద్ధం

వియత్నాం యుధ్ధంగా ప్రసిద్ధి చెందిన రెండవ ఇండో చైనా యుద్ధం, లేదా వియత్నాం ఘర్షణ, 1959 నుండి [1]1975 ఏప్రిల్ 30 వరకు వియత్నాం, లావోస్, కంబోడియాలలో జరిగింది. ఈ యుద్ధం కమ్యూనిస్టు ఉత్తర వియత్నాంకు, దక్షిణ వియత్నాం ప్రభుత్వాల మధ్య జరిగింది. యుద్ధంలో ఉత్తర వియత్నాంకు కమ్యూనిస్టు దేశాలు మద్దతునిచ్చాయి. దక్షిణ వియత్నాంకు అమెరికాతో పాటు సీటో (సౌత్‌ఈస్ట్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్ ) సభ్యదేశాలు మద్దతునిచ్చాయి.[2][3]

దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు గెరిల్లా దళం, వియట్‌కాంగ్ ఆ ప్రాంతంలోని కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులపై గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాయి. అదే సమయంలో ఉత్తర వియత్నాం సైన్యం పెద్ద సైనిక పటాలల సహాయంతో సాంప్రదాయక యుద్ధాన్ని సాగించింది. సంయుక్త రాష్ట్రాలు, దక్షిణ వియత్నాం సేనలు తమ వాయుసేనా ఆధిపత్యం, పదాతి దళాలు, ఫిరంగులు, వాయు ముట్టడులతో శోధించి నాశనం చేయటానికి కావలసిన అత్యుత్తమ ప్రేలుడు సామర్ధ్యంపై ఆధారపడ్డాయి.

మూలాలు