S

S (ఉచ్చారణ: యస్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 19 వ అక్షరం.

రచనా వ్యవస్థలలో వాడకం

S అక్షరం ఆంగ్లంలో ఉపయోగించే అక్షరాలలో ఏడవ అత్యంత సాధారణ అక్షరం, t, n అక్షరాల తరువాత హల్లు అక్షరాలలో ఉపయోగించే మూడవ అత్యంత సాధారణ హల్లు. స్థానం ప్రారంభ, ముగింపులో ఇది చాలా సాధారణ అక్షరం. ఆంగ్లభాషలో s అనేది బహువచన నామవాచకాల యొక్క సాధారణ గుర్తు, ఈ అక్షరాన్ని నామవాచక పదము యొక్క చివర అక్షరంగా చేర్చడం వలన అది బహువచనం అవుతుంది. (ఉదాహరణకు ఆంగ్లంలో Lion ఆనగా సింహం, అలాగే Lions అనగా సింహాలు) ఇది ఇంగ్లీష్‌లో మూడవ వ్యక్తిని సూచించే ప్రస్తుత కాలం యొక్క క్రియల యొక్క సాధారణ ముగింపు. (ఉదాహరణకు he's - అతని యొక్క, her's - ఆమె యొక్క, it's - దీని యొక్క)

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=S&oldid=2952552" నుండి వెలికితీశారు