అక్షరం (వర్ణమాల)

వ్రాయి(అక్షరం)ని ఉపయోగించే నుడి (భాష)లలో, ఉదాహరణకు ఇంగ్లీష్ వ్రాయోలి(అక్షరమాల)లోని ప్రతి గుర్తు ఒక అక్షరం. భాష మాట్లాడేటప్పుడు అక్షరాలు శబ్దాలను సూచిస్తాయి.[1] కొన్ని భాషలు రాయడానికి అక్షరాలను ఉపయోగించవు: ఉదాహరణకు చైనీస్ "ఐడియోగ్రామ్స్" ను ఉపయోగిస్తుంది. ఇంగ్లీష్, అనేక ఇతర భాషలలో రచన యొక్క చిన్న భాగం అక్షరం. పదాలను తయారు చేయడానికి మనం అక్షరాలను ఉపయోగిస్తాము. కొన్ని భాషలలో సాధారణంగా ఒక శబ్దం కోసం ఒక అక్షరం ఉంటుంది, ఉదాహరణకు స్పానిష్ భాషలో ప్రతి శబ్దానికి (ఒక ఫోన్‌మే కోసం, ప్రసంగం యొక్క చిన్న భాగం) అక్షరం ఉంటుంది. ఇది చదవడం సులభం. ఇతర భాషలలో, ఉదాహరణకు ఇంగ్లీష్ భాషలో ఒకే శబ్దం కోసం వేర్వేరు పదాలలో వేర్వేరు అక్షరాలను, లేదా వేర్వేరు పదాలలో వేర్వేరు శబ్దాలకు ఒకే అక్షరమును ఉపయోగించవచ్చు. ఇది అభ్యాసకులకు చదవడం కష్టం. ఇవి కొన్ని ఉదాహరణలు:

ఒక జాడీపై పురాతన గ్రీకు అక్షరాలు
స్పానిష్: feliz అనే పదంలో 5 అక్షరాలు, 5 శబ్దాలు ఉన్నాయి.
ఇంగ్లీష్: happy అనే పదంలో 5 అక్షరాలు, 4 శబ్దాలు ఉన్నాయి.
ఆంగ్లంలో మనం మూడు శబ్దాలకు "a" ను ఉపయోగిస్తాము:
  1. a = /æ/ (pad) ప్యాడ్ - ఇక్కడ "a" "యా" గా పలికింది.
  2. a = /ɑ/ (bar) బార్ - ఇక్కడ "a" "ఆ" గా పలికింది.
  3. a = /Ej/ (cake) కేక్ - ఇక్కడ "a" "ఎ" గా పలికింది.
స్పానిష్ భాషలో మనం ఒకే శబ్దం కోసం "a" ను ఉపయోగిస్తాము:
  1. a = /a/ (gato)

ప్రతి వేరు శబ్దానికి వేరు అక్షరం ఉండే భాషలకు ఎక్కువ అక్షరాలు ఉంటాయి, ఉదాహరణకు తెలుగు భాషలో ప్రతి వేరు శబ్దానికి వేరు అక్షరం ఉంది, కాబట్టి తెలుగులో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి, అందువలనే తెలుగు అక్షరాలను నేర్చుకున్న తరువాత తెలుగు చదవడం చాలా సులభం. ఆంగ్లంలో 26 అక్షరాలు మాత్రమే ఉంటాయి, చదవడం కష్టం, కానీ వీటిని గుర్తు పెట్టుకోవడం సులభం.

అక్షరాలు కనిపెట్టక ముందు చిత్రాల రూపంలో వ్రాసేవారు, చిత్రాల రూపంలో వ్రాయడం చాలా కష్టం, చిత్రాల వ్రాత నుంచే సులభ రూపంగా అక్షరాలు ఏర్పడ్డాయి.

వివిధ భాషలలోని అక్షరాలు

ఆంగ్ల అక్షరమాల: A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z.

మూలాలు

ఇవి కూడా చూడండి