ఐఫోన్

ఐఫోన్ (iPhone) అనేది అమెరికా దేశానికి చెందిన ఆపిల్ సంస్థ ఉత్పత్తి చేసే స్మార్ట్ ఫోన్ల బ్రాండు. ఈ ఫోన్లలో ఆపిల్ సంస్థ స్వంతంగా తయారు చేసిన ఐఒఎస్ (iOS) ను వాడుతారు. మొదటి తరం ఐఫోన్లను మొదటిసారిగా 2007 జనవరి 9 న అప్పటి ఆపిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి స్టీవ్ జాబ్స్ పరిచయం చేశాడు. 2018 నవంబరు 1 నాటికి సుమారు 220 కోట్ల ఐఫోన్లు అమ్ముడయ్యాయని ఒక అంచనా. 2022 నాటికి ప్రపంచ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఐఫోన్ వాటా సుమారు 15.6%.[1]

మల్టి టచ్ కలిగిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఐఫోన్.[2] దీనిని విడుదల చేసినప్పటి నుంచి తెర పరిమాణం కూడా పెరుగుతూ వస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్లు ప్రపంచంలో రెండు అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ప్లాట్ ఫాంలు. ఐఫోన్ విలాసవంతమైన ఉత్పత్తుల (లగ్జరీ) శ్రేణిలోకి వస్తుంది. ఈ ఐఫోన్ల వల్ల ఆపిల్ కు బాగా లాభాలు వచ్చి ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఐఫోన్ విడుదలయినప్పుడు మొబైల్ ఫోన్లలో దీనిని ఒక విప్లవంగా పరిగణించబడింది. తర్వాత వచ్చిన మోడళ్ళు కూడా ప్రశంసలు అందుకున్నాయి.[3]

ఐఫోన్ 15

15వ తరం ఐఫోన్ స్మార్ట్‌ఫోన్ విపణిలోది, ఇది 2023 సెప్టెంబరులో విడుదల చేశారు, ఐఫోన్ 14 మోడల్ మాదిరిగానే, ఐఫోన్ 15 6.1-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 15 ప్లస్ 6.7 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. OLED సూపర్ రెటీనా డిస్ప్లే. గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. డైనమిక్ ఐలాండ్‌తో కొత్త నాచ్ డిస్‌ప్లే, వెనుకవైపు OX టెలిఫోటో సామర్థ్యంతో 8 RAW. 24 మి.మీ., 28 మి.మీ. 38 mm లెన్స్ ఇవ్వబడింది. దీనితో అధిక రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలను తీసుకోవచ్చు. తక్కువ వెలుతురులో కూడా ఫొటోలు తీసేలా డిజైన్ చేశారు. A16 బయోనిక్ చిప్. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఉండే ULB-C పోర్ట్‌తో ఛార్జింగ్ చేయడం ఈసారి కొత్తగా చేర్చారు[4].ఈసారి ఐఫోన్ 15, ప్రో మ్యాక్స్ లో 6.7 మోడల్‌లు నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. టైటానియం వైట్, నేచురల్ టైటానియం, టైటానియం బ్లూ, టైటానియం బ్లాక్ రంగుల్లో వీటిని తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ల వెనుక 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 3 ఫోకల్ లెంగ్త్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఐఫోన్ 15 ప్రోలో 3x ఆప్టికల్ జూమ్, 15ప్రో మ్యాక్స్లో 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.[5]

మూలాలు