గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో

వీడియోగేమ్ సియరీస్

గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో లేదా గ్రాండ్ థెఫ్ట్ ఆటో (Grand theft auto) అనేది డేవిడ్ జోన్స్, మైక్ డైలీ అనే ఇద్దరు స్కొట్ డెవలపర్లు సృష్టించిన ఎక్షన్-ఎడ్వెన్చర్ వీడియో గేమ్ సియరీస్ (క్రీడా శ్రేణి).[2] శ్రేణిలోని తరువాతి అంకాలు నిర్మాణాన్ని పర్యవేక్షించిన వారు ఆంగ్లేయ వీడియోగేమ్ నిర్మాతలు డెన్ హొవ్సర్, సెమ్ హొవ్సర్ సోదరులూ, స్కొట్ వీడియో గేమ్ నిర్మాత లెస్లి బెన్జిస్, అలాగే ఎయరన్ గెర్‌బట్‌లు. ఆంగ్లేయ వీడియోగేమ్ నిర్మాణ సంస్థ రొక్‌స్టార్ నొర్త్ (ఒకప్పుడు డి.ఎం.ఎ డిజైన్) దీన్ని అభివృద్ధి చెయ్యగా, దీని మాతృసంస్థ ఐన అమెరికా నిర్మాణ సంస్థ రొక్‌స్టార్ ఎన్టర్టైన్‌మెన్ట్స్ దీన్ని విడుదల చేసింది. సియరీస్ పేరు గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో అనేది అమెరికా ఆంగ్లంలో కార్ల చోరీలను సూచించడానికి వాడే పదం.

Grand Theft Auto
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III నుండి శ్రేణి యొక్క గుర్తింపు చిహ్నం (2001)
జొన్రా(లు)ఎక్షన్-ఎడ్వెన్చర్
డెవలపర్(లు)
  • రొక్‌స్టార్ నొర్త్
  • డిజిటల్ ఇక్లిప్స్
  • రొక్‌స్టార్ లీడ్స్
  • రొక్‌స్టార్ కెనడ
పబ్లిషర్(లు)రొక్‌స్టార్ గెయ్మ్స్
క్రియెయ్టర్(లు)
  • డేవిడ్ జోన్స్[1]
  • మైక్ డైలీ[2]
ప్లెట్‌ఫొర్మ్(లు)
  • ఎన్డ్రొయ్డ్
  • డ్రీమ్‌కాస్ట్
  • ఫైయర్ ఒ.ఎస్
  • గెయ్మ్‌బోయ్ అడ్వాన్స్
  • గెయ్మ్‌ బోయ్ కలర్
  • ఐఓఎస్
  • మ్యాక్ ఓయస్ టెన్
  • ఎంఎస్-డాస్
  • నిన్టెన్డొ డి.ఎస్
  • నిన్టెన్డొ స్విచ్
  • ఒక్యులస్ క్వెస్ట్ 2
  • ప్లెయ్‌స్టెయ్షన్
  • ప్లెయ్‌స్టెయ్షన్ 2
  • ప్లెయ్‌స్టెయ్షన్ 3
  • ప్లెయ్‌స్టెయ్షన్ 4
  • ప్లెయ్‌స్టెయ్షన్ 5
  • ప్లెయ్‌స్టెయ్షన్ పోర్టబౢ
  • విన్డోస్
  • విన్డోస్ ఫోన్
  • ఎక్స్‌బొక్స్
  • ఎక్స్‌బొక్స్ 360
  • ఎక్స్‌బొక్స్ వన్
  • ఎక్స్‌బొక్స్ సియరీస్ X/S
ఫస్ట్ రిలీస్గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో
28 నవంబరు 1997
లెయ్టిస్ట్ రిలీస్గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద ట్రైలొజి – ద డెఫినిటివ్ ఎడిషన్
11 నవంబరు 2021

ఈ ఆటలన్నీ ఒపెన్ వర్ల్డ్‌లో నడుస్తాయి. ఒపెన్ వర్ల్డ్‌‌లో (Open World, అనువాదం: తెరిచిన ప్రపంచం) ఆటగాడికి ఆటలోని లక్ష్యాలను కొన్ని పరిమితులకు లోబడి, తనకు నచ్చిన రీతిలో చేరుకునే స్వాతంత్ర్యం ఉంటుంది. ఈ ఆటలో కథనం ముందుకెళ్ళడానికి ఆటగాడు కొన్ని ముఖ్య లక్ష్యాలను ఛేదించాలి. ఇవి కాక కథతో సంబంధం లేని కొన్ని ఉపలక్ష్యాలు కూడా ఉంటాయి. ఆటలో ఎక్కువగా చేసే పనులు బళ్ళు తోలడం, తుపాకులతో కాల్చడం. అప్పుడప్పుడూ రోల్-ప్లే (ఆంగ్ల వికీ లంకె), చాటుగా మసులుకోవడం లాంటి పనులతో లక్ష్యాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 బిట్ కాలం నాటి "బీట్ ఎమ్ అప్" (beat 'em up, అర్థం: కొట్టిపడెయ్ వాళ్ళని) వీడియోగేమ్ ఛాయలు కూడా ఈ శ్రేణిలో కనిపిస్తాయి. దీనిలోని ఆటలన్నీ 1960ల నుండి 2010 వరకు కొన్ని నగరాలలో కనిపించిన వివిధ తీరుతెన్నుల ఆధారంగా రూపొందించిన కాల్పనిక నగరాల్లో ఈ ఆటలు నడుస్తాయి. మొదట్లో ఆటలోని పటంలో మూడు నగరాలు ఉండేవి—లిబర్టి సిటీ (న్యూయార్క్ ఆధారంగా తయారైనది), సెన్ ఎన్డ్రియస్ ( సెన్ ఫ్రన్సిస్కో ఆధారంగా తయారైనది) [గమనిక 1], వైస్ సిటి (Vice city, మైయెమి ఆధారంగా తయారైనది). తరువాత వచ్చిన ఆటల్లో, ఒకే ఆటలో మూడూ ఉండేటట్లు కాకుండా, ఒక ఆటలో ఏదో ఒక నగరం ఉండేటట్లు తయారు చేసారు. ఆ ఒక నగరాన్నీ ఇంకా అభివృద్ధి చేసి చేర్చారు. ప్రతీ ఆటలో ఒక నాయకుడు ఉంటాడు. అతను ఆ నగరపు నేర ప్రపంచంలో ఎదగటానికి ప్రయత్నిస్తుంటాడు. అలా ప్రయత్నించడానికి ప్రతీ ఆటలోనూ వేర్వేరు కారణాలు ఉంటాయి. నాయకుణ్ణో, నాయకుడి సంస్థనో మోసం చేసిన వారో, లేక అతని ఎదుగుదలకు అడ్డం పడేవారో ప్రతినాయకులుగా ఉంటారు. చలనచిత్ర పరిశ్రమా, సంగీత రంగాల్లోని చాలామంది దిగ్గజాలు, ఆటలోని పాత్రలకు గాత్రం ఇచ్చారు. వీరిలో మచ్చుకు కొందరు అమెరికా నటులైన రె లియొత్త, విల్యం ఫిశ్ట్నర్, జెయ్మ్స్ వుడ్స్, పీటర్ ఫొన్డలు, అమెరికా చిత్రనిర్మాత డెనిస్ హొపర్, అమెరికా నిర్మాత సెమ్యుల్ జెక్సన్, అమెరికా గాయని డెబి హెరి, అమెరికా సంగీతకారుడు ఎక్స్ల్ రోజ్.[3]

1997లో "గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో"ను విడుదల చేయడంతో ఈ శ్రేణి మొదలైంది. 2020 నాటికి ఈ శ్రేణిలో ఏడు ప్రధాన ఆటలూ, నాలుగు ఎక్స్‌పెన్షన్ పెక‌లూ (Expansion pack) ఉన్నాయి. ప్రధాన ఆటల్లో మూడోది ఐన "గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III" (Grand Theft Auto III) 2001లో వచ్చింది. త్రీ డైమెన్షనల్ సెటింగ్‌ను శ్రేణిలోకి మొదటిసారిగా తీసుకురావడంతో ఈ ఆట, ఆటగాళ్ళను బాగా ఆకట్టుకుంది. కనుక ఈ ఫ్రెన్చైజ్ ప్రస్థానంలో ఈ ఆటను ఒక మైలురాయిగా భావిస్తారు. ఈ ఆట తీరుతెన్నులను తరువాతి విడుదలల్లో కూడా కొనసాగించి, ఈ శ్రేణిలోని తరువాతి ఆటలు కూడా మన్ననలు అందుకున్నాయి. ఇతర ఒపెన్ వర్ల్డ్ ఆటలపై కూడా ఈ శ్రేణి ప్రభావం ఉంది. ఈ శ్రేణి తీరుతెన్నులతో వచ్చిన ఇతర ఆటలను "గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో క్లోన్"‌లుగా (Grand theft auto clone) పిలుస్తారు.

ఈ శ్రేణి విమర్శకుల మనన్నలు అందుకుంది. దీనిలో త్రీడిలో వచ్చిన ఆటలన్నీ కూడా "అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వీడియోగేములు", "అత్యధికంగా అమ్ముడైన వీడియోగేములు" జాబితాల్లో చోటు దక్కించుకున్నాయి. ఇప్పటి వరకు 3.7 కోట్ల యూనిట్ల అమ్మకాలతో ఈ ఫ్రన్చైజ్ అత్యధికంగా అమ్ముడైన వీడియోగేమ్ ఫ్రన్చైజ్‌లలో ఐదో స్థానంలో నిలిచింది. 2006లో ఆంగ్లేయ వార్తాసంస్థ బిబిసి, లన్డన్‌లో కళామందిరం ఐన డిజైన్ మ్యూజ్యం (Design museum)లు కలిసి నిర్వహించిన "గ్రెయ్ట్ బ్రిటిష్ డిజైన్ క్వెస్ట్" (Great British Design Quest) అనే కార్యక్రమంలో విడుదల చేయబడ్డ బ్రిటిష్ డిజైన్ ఐకాన్ (British Design Icon) జాబితాలో చోటు దక్కించుకుంది.[4] 2013లో ద టెలిగ్రాఫ్ అనే ఆంగ్లేయ పత్రిక బ్రిటన్ అత్యంత విజయవంతమైన ఎగుమతుల్లో ఒకటిగా "గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో"ను పేర్కొంది. ఈ ఆటల శ్రేణి దానిలో ఉన్న అశ్లీలతకూ, హింసకూ వివాదాస్పదమైంది.

అంకాలు

సంవత్సరంఆటనిర్మాణ సంస్థఆట లభ్యమయ్యే పరికరాలుయూనివర్స్[5]
హోమ్ కన్సోల్కంప్యూటర్హెన్డ్‌హెల్డ్మొబైల్ఇతర పరికరాలు
ప్రధాన ఆటలు
1997గ్రెన్డ్ థెఫ్ట్ ఓటోడి.ఎమ్.ఎ డిజైన్పి.ఎస్ 1గెయ్మ్ బొయ్ కలర్ (జి.బి.సి)2డి
1999గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో 2
  • పి.ఎస్ 1
  • డ్రీమ్‌కాస్ట్
విన్డోస్జి.బి.సి
2001గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III
  • పి.ఎస్ 2
  • ఎక్స్‌బొక్స్
3డి
2002గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: వైస్ సిటిరొక్‌స్టార్ నోర్త్
  • పి.ఎస్2
  • ఎక్స్‌బొక్స్
  • విన్డోస్
  • మ్యాక్ ఓయస్ టెన్
2004గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: సెన్ ఎన్డ్రియస్
  • పి.ఎస్ 2
  • ఎక్స్‌బొక్స్
  • పి.ఎస్3[A]
  • ఎక్స్‌బొక్స్ 360[B]
  • విన్డోస్
  • మ్యాక్ ఓయస్ టెన్
  • ఎన్డ్రొయ్డ్
  • ఐఓఎస్
  • విన్డోస్ ఫోన్
  • ఫైయర్ ఒఎస్
ఒక్యులస్ క్వెస్ట్ 2[C]
2008గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV
  • పి.ఎస్ 3
  • ఎక్స్‌బొక్స్ 360
విన్డోస్ఎచ్.డి
2013గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో V
  • పి.ఎస్ 3
  • ఎక్స్‌బొక్స్ 360
  • పి.ఎస్ 4
  • ఎక్స్‌బొక్స్ 1
  • పి.ఎస్ 5
  • ఎక్స్‌బొక్స్ సియరీస్ X/S
విన్డోస్
ఇంకా ప్రకటించలేదుపేరు పెట్టవలసి ఉన్న ఆటఇంకా ప్రకటించలేదు
ఎక్స్‌పెన్షన్ పెక్స్
1999గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లన్డన్ 1969రొక్‌స్టార్ కెనడాపి.ఎస్ 1
  • విన్డోస్
  • ఎంఎస్-డాస్
2డి
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లన్డన్ 1961
  • విన్డోస్
  • ఎంఎస్-డాస్
2009గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV: ద లొస్ట్ అన్డ్ డెమ్డ్రొక్‌స్టార్ నోర్త్
  • పి.ఎస్3
  • ఎక్స్‌బొక్స్ 360
విన్డోస్ఎచ్.డి
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద బెలడ్ ఒఫ్ గెయ్ టోని
  • పి.ఎస్3
  • ఎక్స్‌బొక్స్ 360
విన్డోస్
హెన్డ్‌హెల్డ్ గెయ్మ్స్ (Handheld games)
2004గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో అడ్వాన్స్డిజిటల్ ఇక్లిప్స్గెయ్మ్‌బొయ్ అడ్వాన్స్3డి
2005గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లిబర్టి సిటి స్టోరీస్రొక్‌స్టార్ లీడ్స్పి.ఎస్2ప్లెయ్ స్టెయ్షన్ పోర్టబౢ (పి.ఎస్.పి)
  • ఐఒఎస్
  • ఎన్డ్రొయ్డ్
  • ఫైయర్ ఒఎస్
2006గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: వైస్ సిటి స్టోరీస్పి.ఎస్2పి.ఎస్.పి
2009గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: చైనాటౌన్ వార్స్
  • పి.ఎస్.పి
  • నిన్టెన్డొ డిఎస్
  • ఐఒఎస్
  • ఎన్డ్రొయ్డ్
  • ఫైయర్ ఒఎస్
ఎచ్‌డి
కొవ్మ్పలెయ్షన్స్ అన్డ్ రీమాస్టర్స్ (Compilations and remasters)
1999గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: డైరెక్టర్స్ కట్[D]డి.ఎమ్.ఎ డిజైన్ /
రొక్‌స్టార్ కెనడ
  • పి.ఎస్1
  • విన్డోస్
  • ఎం.ఎస్-డాస్
2డి
2003గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద క్లాసిక్స్ కలక్షన్[E]
  • పిఎస్1
  • విన్డోస్
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: డబల్ పెక్[F]రొక్‌స్టార్ నోర్త్
  • పి.ఎస్2
  • ఎక్స్‌బొక్స్
3డి
2005గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద ట్రైలొజి[G]
  • ఎక్స్‌బొక్స్
  • పి.ఎస్ 2
  • విన్డోస్
  • మ్యాక్ ఒఎస్ టెన్
2009గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: డబల్ పెక్[H]రొక్‌స్టార్ లీడ్స్
  • పిఎస్ 2
పి.ఎస్.పి
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ఎపిసోడ్స్ ఫ్రం లిబర్టి సిటి[I]రొక్‌‌స్టార్ నోర్త్
  • ఎక్స్‌బొక్స్ 360
  • పి.ఎస్3
విన్డోస్ఎచ్‌డి
2010గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV: కంప్లీట్ ఎడిషన్[J]
  • ఎక్స్‌బొక్స్ 360
  • పి.ఎస్3
విన్డోస్
2021గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద ట్రైలొజి – ద డిఫినిటివ్ ఇడిషన్[K]గ్రోవ్ స్ట్రీట్ గెయ్మ్స్
  • నిన్టెన్డొ స్విచ్[L]
  • పిఎస్4
  • పిఎస్5
  • ఎక్స్‌బొక్స్ 1
  • ఎక్స్‌బొక్స్ సియరీస్ X/S
విన్డోస్స్విచ్[L]
  • ఎన్డ్రొయ్డ్
  • ఐఒఎస్
3డి
గమనికలు:

ప్రధాన ఆటలు

విడుదలైన సంవత్సరాలు
           2డి యూనివర్స్              3డి యూనివర్స్              ఎచ్.డి యూనివర్స్[5]
1997గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో
1998
1999గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లన్డన్ 1969
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లన్డన్ 1961
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో 2
2000
2001గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో III
2002గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: వైస్ సిటీ
2003గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: డబల్ పెక్
2004గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: సెన్ ఎన్డ్రియస్
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో అడ్వాన్స్
2005గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద ట్రైలొజి
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: లిబర్టి సిటీ స్టోరీస్
2006గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: వైస్ సిటీ స్టోరీస్
2007
2008గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV
2009గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో IV: ద లోస్ట్ అన్డ్ డెమ్డ్
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: చైనాటౌన్ వార్స్
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద బెలడ్ ఒఫ్ గెయ్ టోని
2010
2011
2012
2013గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో V
గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో ఒన్‌లైన్
2014
2015
2016
2017
2018
2019
2020
2021గ్రెన్డ్ థెఫ్ట్ ఓటో: ద ట్రైలొజి - ద డెఫినిటివ్ ఎడిషన్
2022

The Grand Theft Auto series is split into separate fictional universes, named after the primary level of graphics capability used in each era.

ఇవి కూడా చూడండి

గమనికలు

మూలాలు