జె.ఆర్.ఆర్.టోల్కీన్

బ్రిటిష్ భావుతికవేత్త మరియు రచయితా

జాన్ రొనాల్డ్ రూయెల్ టోల్కీన్ CBE FRSL (/ˈtɒlkn//ˈtɒlkn/;[a] 3 జనవరి 1892సెప్టెంబర్ 2 1973), ప్రముఖంగా జె. ఆర్. ఆర్. టోల్కీన్ గా ప్రఖ్యాతుడైన, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు, విశ్వవిద్యాలయ ఆచార్యుడు. ఆయన అతి ఎక్కువ ఫాంటసీ కలిగిన ది హాబిట్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది సిల్మరిలియన్ వంటి క్లాసిక్ రచనలు చేసిన రచయితగా ప్రఖ్యాతుడు.

జె.ఆర్.ఆర్.టోల్కీన్స్
సీబీఈ, ఎఫ్ఆర్ఎస్ఎల్
పుట్టిన తేదీ, స్థలంజాన్ రొనాల్డ్ రూయిల్ టోల్కీన్
(1892-01-03)1892 జనవరి 3
బ్లూంఫౌంటైన్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్ (ఆధునిక కాలపు దక్షిణాఫ్రికా)
మరణం1973 సెప్టెంబరు 2(1973-09-02) (వయసు 81)
బోర్న్ మౌత్, యునైటెడ్ కింగ్ డం
వృత్తిరచయిత, విద్యావేత్త, ఆచార్యుడు, భాషా చరిత్రకారుడు, కవి
జాతీయతబ్రిటీష్
పూర్వవిద్యార్థిఎక్సెటెర్ కళాశాల, ఆక్స్ ఫర్డ్
రచనా రంగంఫాంటసీ, హై ఫాంటసీ, అనువాదం, సాహిత్య విమర్శ
గుర్తింపునిచ్చిన రచనలు
  • ద హాబిట్
  • లార్డ్ ఆఫ్ ద రింగ్స్
  • ద సిల్మరిలియన్
జీవిత భాగస్వామిఎడిత్ బ్రాత్ (1916–1971)
సంతానం
  • జాన్ ఫ్రాన్సిస్ (1917–2003)
  • మైకేల్ హిల్లరీ (1920–1984)
  • క్రిస్టొఫర్ జాన్ (జ. 1924)
  • ప్రిస్కిల్లా అన్నే (జ. 1929)
Military career
సేవలు/శాఖబ్రిటీష్ సైన్యం
సేవా కాలం1915–1920
ర్యాంకులెఫ్టినెంట్
యూనిట్లాంకషైర్ ఫ్యూసిలియర్స్
పోరాటాలు / యుద్ధాలుమొదటి ప్రపంచ యుద్ధం
  • సోమె యుద్ధం
J .R .R. Tolkien

1925 నుంచి 1945 వరకూ రాలిన్సన్, బాస్వర్త్ ప్రొఫెసర్ ఆఫ్ ఆంగ్లో-సాక్సన్ గానూ, పెంబ్రోక్ కళాశాల, ఆక్స్ ఫర్డ్ ఫెలోగానూ వ్యవహరించారు. 1945 నుంచి 1959 వరకూ మెర్తాన్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ లిటరేచర్ గా, ఆక్స్ ఫర్డ్ మెర్తాన్ కళాశాల ఫెలో గానూ వ్యవహరించారు. ఆయన ఒకప్పుడు రచయిత సి. ఎస్. లూయిస్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు, వారిద్దరూ సాహిత్య చర్చల సమూహమైన ఇంక్లింగ్స్ లో సభ్యులుగా ఉండేవారు. 28 మార్చి 1972న ఎలిజబెత్ II టోల్కీన్ ను కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ గా నియమించారు.

టోల్కీన్ మరణం తర్వాత, ఆయన కుమారుడు క్రిస్టఫర్, తన తండ్రి రాసుకున్న విస్తృతమైన నోట్సులు, ప్రచురణకు నోచుకోని రాతప్రతులు పరిష్కరించి వరుసగా చాలా రచనలు ప్రచురించారు. వాటిలో సిల్మరిలియన్ వంటి ప్రఖ్యాత రచన కూడా ఒకటి. ద హాబిట్, ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ వంటివాటితో దీన్ని కలపగా కథలు, కవితలు, కల్పనాత్మక చరిత్రలు, కొత్తగా కనిపెట్టిన భాషలు, సాహిత్య వ్యాసాల వంటివాటిలో వేరే ఆర్డా, మిడిల్ ఎర్త్[b] వంటి ప్రాంతాలు కలిగిన కల్పనాత్మక ప్రపంచాన్ని కలిగివుంది. 1951 నుంచి 1955 వరకూ టోల్కీన్ లెజెండరీయమ్ అన్న పదాన్ని ఆయన తన ఈ రచనల్లో ప్రధాన భాగాన్ని గుర్తించేందుకు వ్యవహరించారు.

టోల్కీన్ కు పూర్వం పలువురు రచయితలు ఫాంటసీ రచనలు రాసి ప్రచురించినా,[1] ద హాబిట్, ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ రచనల విజయం ఈ సాహిత్య విభాగం నేరుగా నూతనోత్సాహం పొందడానికి కారణమైంది. తద్వారా టోల్కీన్ ను ఆధునిక ఫాంటసీ సాహిత్య పితామహునిగానూ[2]—లేక, మరింత స్పష్టంగా హై ఫాంటసీ పితామహుడిగానూ పరిగణిస్తున్నారు.[3] 2008లో, ద టైమ్స్ "1945 తర్వాత నుంచి 50 అతిగొప్ప బ్రిటీష్ రచయితలు" అన్న లిస్టులో 6వ వారిగా ప్రకటించింది.[4] ఫోర్బ్స్ 2009లో మరణించిన సెలబ్రెటీల్లో అతి-ఎక్కువ సంపాదిస్తున్నవారిలో 5వ వారిగా ర్యాంకునిచ్చింది.[5]

Notes

Citations