మార్చి


<<మార్చి>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
12
3456789
10111213141516
17181920212223
24252627282930
31
2024

మార్చి (March), సంవత్సరంలోని ఆంగ్లనెలలులోని మూడవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.

రోమను పురాణాల్లో మార్సు (Mars) అనే యుద్ధ దేవత ఒకడు. ఉగ్రమూర్తి. సదా సర్వకాలములందును ఆయన భేరీభాంకారాలు, శంఖనాదాలూ, సైనికుల అట్టహాసాలూ మొదలైన భీకరవాతావరణంలోనే సంచరిస్తూవుంటాడుట. తెల్లని రెండు గుర్రాలు కట్టిన దంతపుతేరు అతనికి వాహనము. ఈఅపర నరసింహావతారపు శాఉర్యోటాపాలను, కోపతాపాలను స్మరించినంతమాత్రానే రోమనులు గడగడ వణికి పోతారుట. విల్లు, కత్తి, దండము, గద, ఈటె మొదలైన వివిధాయుతాలతోనూ ఈయన వీరవిహారము చేస్తూ ఉంటాడు. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వాన మొదలైనవన్నీ ఈయనవల్లనే ఏర్పడుతున్నవని వీరి నమ్మకము. ఈఉగ్రమూర్తికి ఆదేశస్థులు గొర్రెలు, మేకలు, కోడిపుంజులు మొదలైనవి బలి ఇచ్చి శాంతింపజేస్తూ ఉంటారు. రోమనులు ఇతర దేశాలమీదకు దండెత్తి వెళ్ళినప్పుడు బుట్టడు ధాన్యపు గింజలను కోళ్ళముందు కుమ్మరిస్తారుట, అవి గనుక ఆధాన్యపు గింజలను విరుచుకుపడి తిన్నాయంటే వారు తలపెట్టిన దండయాత్ర జయించినట్లే. ఈశకునాన్ని వారు అతి నమ్మకంగా పాటించేవారు.ఈయన పేరు మీదగనే ఈనెల పేరు వచ్చింది.

మూలాలు

వెలుపలి లంకెలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు