జనవరి


<<జనవరి>>
ఆదిసోమమంగళబుధగురుశుక్రశని
123456
78910111213
14151617181920
21222324252627
28293031
2024


జనవరి (January), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో మొదటి నెల. జనవరి నెలలో 31 రోజులు ఉన్నాయి.రోమన్ పురాణాలలో ప్రారంభాలు , పరివర్తనాల దేవుడు జానస్ పేరు మీద జనవరి (లాటిన్లో, ఇయాన్యూరియస్ ) పేరు పెట్టారు[1] .

ముందుపక్క ఒకముఖము, వెనుకపక్క ఒక ముఖము, చేతిలో తాళపు చేతుల గుత్తీ కలిగిన ఒక దేవుడు రోమక పురాణాల్లో కనిపిస్తాడు. అతను పేరు జేనస్ (Janus). మహాయుద్ధాలు జరిగే వేళలలో మాత్రమే రోమనులు ఆదేవుని కోవెలతలుపులు తెరచి పూజిస్తారు. శాంతి సమయాల్లో ఎన్ని యేండ్లయినా సరే ఆకోవెల తలుపులు మూసివేస్తారు. ఏపని చేసేముందు ఓం ప్రథమంగా మనము విఘ్నేశ్వర పూజ చేసేటట్లే రోమనులు ప్రతి కార్యారంభంలోనూ జేనస్ దేవునిని పూజిస్తారు. అతను స్వర్గలోకానికి ద్వారపాలకుడట. అతను కోవెలకు ద్వాదశ ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క మసాధిదేవత రాకపోకలుగ ఏర్పడ్డవట. విఘ్నేశ్వరుని వంటి ఈ జేనస్ దేవుని జ్ఞాపకార్ధమే మొదటినెలకు అతనుపేరే పెట్టారు. పైగా రెండు ముఖాలదేవుడు కాబట్టి గత సంవత్సరపు అనుభవాలను సింహావలోకనం చేస్తూ, కొత్త సంవత్సరపు శుభాశుభఫలితాలను ఆకళించుకొంటూ ప్రజలను హెచ్చరించగలడనే నమ్మకంకూడా ఈనామకరణానికి కారణము అయిఉండవచ్చును.ఈ నెలలో మెదటి రోజు ఆంగ్ల సంవత్సరానికి సుపరిచితం. తెలుగువారి సుప్రసిద్దమైన సంక్రాంతి పండుగకూడా ఈ నెలలోనే వస్తుంది.

మూలాలు

వెలుపలి లంకెలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు