మార్లిన్ డీట్రిచ్

మేరీ మాగ్డలిన్ "మార్లిన్" డీట్రిచ్ (/mɑːrˈlnə ˈdtrɪk/, German: [maɐ̯ˈleːnə ˈdiːtʁɪç]; 1901 డిసెంబర్ 27 – 1992 మే 6)[1] జర్మన్-అమెరికన్ నటి, గాయని.[2][3][4][5] 1910ల నుంచి 1980ల వరకూ సాగిన ఆమె సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పటికప్పుడు తనని తాను పునర్ అన్వేషించుకుంటూ ప్రాచుర్యాన్ని నిలబెట్టుకునేది.[6]

మార్లిన్ డీట్రిచ్
1951లో డీట్రిచ్
జననం
మేరీ మాగ్డలిన్ డీట్రిచ్

(1901-12-27)1901 డిసెంబరు 27
బెర్లిన్, ప్రష్యా, జర్మన్ సామ్రాజ్యం
మరణం1992 మే 6(1992-05-06) (వయసు 90)
సమాధి స్థలంబెర్లిన్, జర్మనీ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1919–1984
జీవిత భాగస్వామిరుడాల్ఫ్ సీబెర్
పిల్లలుమారియా రివా

1920ల్లో మార్లిన్ బెర్లిన్‌లో రంగస్థలంపైనా, నిశ్శబ్ద చిత్రాల్లోనూ నటించింది. ద బ్లూ ఏంజెల్ (1930)లో లోలా-లోలా పాత్రలో ఆమె నటన ఆమెకు అంతర్జాతీయ ప్రాచుర్యం, పారామౌంట్ పిక్చర్స్‌తో ఒప్పందాన్ని సంపాదించిపెట్టింది. మొరాక్ (1930), షాంఘై ఎక్స్‌ప్రెస్ (1932), డిజైర్ (1936) వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది. తన ఆకర్షణీయమైన రూపాన్ని, ఆకట్టుకునే శైలిని ఆధారం చేసుకుని ఆ దశలోకెల్లా అతిఎక్కువ సంపాదన కలిగిన నటిగా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినన్నాళ్ళూ అమెరికా వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన తారగా ఆమె అత్యున్నత స్థానంలో నిలిచేవుంది. అడపాదడపా సినిమాల్లో నటించినా 1950ల నుంచి 1970ల వరకూ డీట్రిచ్ తన సమయాన్ని ప్రపంచం అంతా తిరుగుతూ లైవ్-షోల్లో ప్రదర్శనలు చేయడంతో గడిపింది.

యుద్ధ సమయంలో జర్మన్, ఫ్రెంచ్ ప్రవాసులకు ఇళ్ళు నిర్మించడం, ఆర్థిక సహకారాన్ని అందించడం, తుదకు అమెరికన్ పౌరసత్వం ఇవ్వాలని ప్రచారం చేయడం వంటి పనులతో డీట్రిచ్ మానవతావాదిగా పేరొందింది. యుద్ధసమయంలో నైతిక ధైర్యాన్ని నిలబెట్టేలా ముందుండి ఆమె చేసిన కృషికి అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, ఇజ్రాయెల్ దేశాల్లో పలు గౌరవాలు, పురస్కారాలు పొందింది. 1999లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ క్లాసిక్ హాలీవుడ్ సినిమాకు చెందిన అత్యంత గొప్ప తారామణుల జాబితాలో ఆమెకు 9వ స్థానం ఇచ్చింది.[7]

తొలినాళ్ళ జీవితం

రోటె ఇన్సెల్‌లో మార్లిన్ డీట్రెచ్ జన్మస్థానం
డీట్రెచ్ పుట్టిన ఇల్లు

డీట్రిచ్ 1901 డిసెంబరు 27న ప్రస్తుతం బెర్లిన్‌లోని లాబెర్‌స్ట్రేబ్ అనే ప్రాంతంలో స్కూన్‌బెర్గ్‌లోని రోటె ఇన్సెల్‌లో జన్మిచింది.[8] ఆమె తల్లి విల్‌హెల్మినా ఎలిజబెత్ జోసఫైన్ (లేక ఫెల్సింగ్) సంపన్న బెర్లిన్ కుటుంబం నుంచి వచ్చింది, ఆమెకు జువెలరీ దుకాణం, గడియారాలు తయారుచేసే సంస్థ ఉండేవి. ఆమె తండ్రి లూయీస్ ఎరిక్ ఒట్టో డీట్రిచ్ ఒక పోలీసు లెఫ్టినెంట్. డీట్రిచ్‌కు తన కన్నా ఏడాది పెద్ద అయిన ఎలిజబెత్ అన్న సోదరి ఉండేది. డీట్రిచ్ తండ్రి 1907లో చనిపోయాడు.[9] అతని ప్రాణమిత్రుడు, గ్రెనెడియర్స్‌లో మొదటి లెఫ్టినెంట్ అయిన ఎడ్యువార్డ్ వాన్ లోస్క్ స్నేహితుని మరణం తర్వాత విల్‌హెల్మినాను పెళ్ళిచేసుకున్నాడు. కానీ కొద్దికాలానికే మొదటి ప్రపంచ యుద్ధంలో తగిలిన గాయాలతో బాధపడి మరణించాడు.[8] వాన్ లోస్క్ ఎప్పుడూ అధికారికంగా డీట్రిచ్ కుమార్తెలను దత్తత తీసుకోలేదు, కనుక కొందరు భావించినట్టు మార్లిన్ ఇంటిపేరు వాన్ లోస్క్‌గా చెప్పడం సరికాదు, తండ్రి ఇంటిపేరిట డీట్రిచ్‌గానే ఉంది.[10]

11 ఏళ్ళ వయసులో ఆమె మేరీ మాగ్డలీన్ అన్న పేర్లు రెంటినీ కలిపేసి మార్లిన్‌గా పెట్టుకుంది. డీట్రిచ్ 1907 నుంచి 1917 వరకూ ఆగస్టె-విక్టోరియా బాలికల పాఠశాలలో చదివింది,[11] 1918లో విక్టోరియా-లూయిస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. [12] ఆమె వయొలిన్ అభ్యసించింది,[13] టీనేజిలో ఉండగా కవిత్వం, రంగస్థల కళల పట్ల ఆసక్తి కలిగివుండేది. వయొలినిస్టుగా కచేరీలు చేయాలన్న ఆమె ఆశలను మణికట్టు గాయం దెబ్బతీసింది,[14] అయినా 1922లో ఈమె తొలి ఉద్యోగం బెర్లిన్ సినిమా రంగంలోని ఒక నిశ్శబ్ద చిత్రానికి రికార్డు చేసిన పిట్ ఆర్కెస్ట్రాలో వయొలిన్ వాయించడమే. అయితే కేవలం నాలుగు వారాల్లోనే ఉద్యోగం పోగొట్టుకుంది.[15]

సినీ రంగం

తొలినాళ్ళు

రంగస్థలంపై మొట్టమొదట కోరస్ గర్ల్‌గా కనిపించింది.[16] నాటక దర్శకుడు మాక్స్ రీన్‌హార్డ్ట్ నిర్వహించే నాటక అకాడమీకి జరిగిన ఆడిషన్స్‌లో ప్రయత్నించి విఫమైంది.[17] అయితే వెనువెంటనే రంగస్థలంపై కోరస్ గర్ల్‌గానూ, నాటకాల్లో చిన్న పాత్రలూ సంపాదించసాగింది. మొదట్లో ఏ విధమైన ప్రత్యేకత కనబరిచి, ఎవరినీ ఆకట్టుకోలేదు. 1923 నాటి ద లిటిల్ నెపోలియన్ సినిమాలో చిరుపాత్రతో సినిమా రంగంలో అడుగుపెట్టింది.[18]

తర్వాతికాలంలో తాను వివాహమాడిన రూడాల్ఫ్ సీబెర్‌ను 1923లో ట్రాజెడీ ఆఫ్ లవ్ (జర్మన్ టైటిల్ - ట్రాజొడీ డెర్ లీబె) సినిమా సెట్‌లో కలిసింది. 1923 మే 17న బెర్లిన్‌లో ఒక పౌర ఉత్సవంలో డీట్రిచ్, సీబెర్ పెళ్ళి చేసుకున్నారు. [19]

పెళ్ళి తర్వాత 1920 దశకమంతా డీట్రిచ్ రంగస్థలంపైనా, సినిమాల్లోనూ బెర్లిన్, వియన్నా నగరాల్లో పనిచేయడం కొనసాగించింది. రంగస్థలంపై ఫ్రాంక్ వెడెకైండ్ రాసిన పండోరాస్ బాక్స్, [20] విలియం షేక్‌స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ,[20] జార్జి బెర్నార్డ్ షా రాసిన బాక్ టు మెతుసెలా [21], మిస్ అలియన్స్[22] నాటకాల్లో వివిధ స్థాయిల్లోని పాత్రలు ధరించింది. అయితే బ్రాడ్వే, ఎస్ లీట్ ఇన్ డెర్ లుఫ్ట్, జ్వీ క్రావటెన్ వంటి సంగీత భరితమైన మ్యూజికల్స్, రెవ్యూ వంటి రంగస్థల నాటకరూపాల్లోని ఆమె పాత్రలే ప్రేక్షకులను ఆకట్టుకుని పేరుతెచ్చిపెట్టాయి. 1920ల మలినాళ్ళలో డీట్రెచ్ సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు చేయగలిగింది, వీటిలో కెఫె ఎలెక్ట్రిక్ (1927), ఐ కిస్ యువర్ హ్యాండ్, మేడమ్ (1928), ద షిప్ ఆఫ్ లాస్ట్ సోల్స్ (1929) వంటి జర్మన్ చిత్రాలు ఉన్నాయి.[23]

తొలి విజయం

ద బ్లూ ఏంజెల్ (1930)లో తన కెరీర్ మలుపుతిప్పిన పాత్రలో
షాంఘై ఎక్స్‌ప్రెస్' (1932)లో డీట్రెచ్ సౌందర్యాన్ని ఇనుమడింపజేసి చూపడానికి బటర్‌ఫ్లై లైటింగ్‌ని జోసఫ్ వాన్ స్టెర్న్‌బెర్గ్ ఉపయోగించుకున్నాడు.
డిస్ట్రే రైడ్స్ అగైన్ (1939)లో కుడివైపున జేమ్స్ స్టీవార్ట్, మార్లిన్ డీట్రిచ్

1929లో బ్లూ ఏంజెల్ (1930 విడుదల) సినిమాలో గౌరవనీయుడైన ఉపాధ్యాయుడి పతనానికి కారణమైన క్యాబరే గాయని లోలా లోలా పాత్ర డీట్రిచ్‌కి దొరికింది. ఈ పాత్ర ఆమె నటజీవితాన్ని మలుపుతిప్పింది.[24][25] జోసెఫ్ వాన్ స్టెర్న్‌బర్గ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు, ఆ తర్వాతి కాలంలో డీట్రిచ్‌ను "కనుగొన్న" దర్శకుడిగా క్రెడిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో డీట్రిచ్ పేరు వినగానే గుర్తుకువచ్చే పాట - ఫాలింగ్ ఇన్ లవ్ ఎగైన్ ఉంది. ఈ పాటను ఆమె ఎలక్ట్రోలా కోసం పాడింది, తర్వాత 1930ల్లో పాలీడోర్, డెక్కా రికార్డుల కోసం తిరిగి పాడింది.

అమెరికాలో విజయాలు

1930లో ద బ్లూ ఏంజెల్ అంతర్జాతీయంగా సాధించిన విజయం బలం మీద, అప్పటికే హాలీవుడ్‌లో స్థిరపడ్డ జోసెఫ్ వాన్ స్టెర్న్‌బర్గ్ అందించిన ప్రోత్సాహంతోనూ, ద బ్లూ ఏంజెల్ సినిమా అమెరికా పంపిణీదారు పారామౌంట్ పిక్చర్ వారితో ఒప్పందం చేసుకుని డీట్రెచ్ అమెరికాలో స్థిరపడింది. పారామౌంట్ స్టూడియో వారు తమ ప్రత్యర్థులైన మెట్రో-గోల్డ్‌వెన్ మేయర్ స్టూడియో వారి స్వీడిష్ సెన్సేషన్ గ్రెటా గార్బోకు సరైన సమవుజ్జీ అన్న ఉద్దేశంతో డీట్రెచ్‌ని మార్కెట్ చేయాలని ఆశించింది. స్టెర్న్‌బర్గ్ ఆమెను ఒక పచ్చరంగు రోల్స్-రాయస్ ఫాంటమ్ II కారు సహా పలు బహుమతులతో ఆహ్వానించాడు. ఇదే కారు వారిద్దరి తొలి అమెరికన్ సినిమా అయిన మొరాకోలో కనిపించింది.[26]

1930 నుంచి 1935 వరకూ పారామౌంట్ స్టూడియో నిర్మాణంలో వాన్ స్టెర్న్‌బర్గ్ దర్శకత్వం వహించిన 6 సినిమాల్లో డీట్రెచ్ నటించింది. డీట్రెచ్‌తో కలిసి పనిచేస్తూ స్టెర్న్‌బర్గ్ ఆమెకు అందమైన, మార్మికమైన ఫెమ్మె ఫేటల్ అన్న రెండంచుల కత్తిలాంటి అందమైన అమ్మాయి ఇమేజిని సృష్టించాడు. అతను డీట్రెచ్‌ని బరువు తగ్గమని ప్రోత్సహించేవాడు, మెరుగైన నటి అయ్యేందుకు గట్టి శిక్షణను ఇచ్చాడు. కొన్నిసార్లు దాష్టీకంలా, అహంకారపూరితంగా ఉండే అతని దర్శకత్వ పద్ధతులను అప్పటికే చాలామంది నటీనటులు ప్రతిఘటించారు, అయితే డీట్రిచ్ అతని శైలిని ఇష్టపూర్వకంగా అనుసరించింది.[27]

మొరాకో (1930)లో డీట్రెచ్ తిరిగి కేబరే సింగర్ పాత్రలో నటించింది. సినిమాలో ఓ రెండు విషయాలు మాత్రం జనానికి చాలాకాలం పాటు గుర్తుండిపోయాయి: ఈమె ఒక పాటలో ఓ మగవాడి తెల్ల టై కట్టుకుని డ్యాన్స్ చేయడం, మరో స్త్రీని ముద్దుపెట్టుకోవడం. ఆకాలానికి ఈ రెండూ రెచ్చగొట్టే చేష్టలుగా పరిగణించేవారు. ఈ సినిమాతో డీట్రిచ్ కెరీర్‌లో ఏకైక ఆస్కార్ నామినేషన్ సంపాదించింది.

మొరాకో తర్వాత డీట్రిచ్ డిస్‌ఆనర్డ్ సినిమాలో గూఢచారిగా నటించి మరో విజయం స్వంతం చేసుకుంది. డీట్రిచ్ తదుపరి చిత్రం షాంఘై ఎక్స్‌ప్రెస్ 1932 సంవత్సరంలోకెల్లా అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమా. ఇది డీట్రిచ్, స్టెర్న్‌బర్గ్‌ల కాంబినేషన్‌లో అతిపెద్ద కమర్షియల్ విజయంగా నిలిచింది. 1932లోనే బ్లాండ్ వీనస్ అనే రొమాంటిక్ సినిమా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చింది. 1933లో ద సాంగ్ ఆఫ్ సాంగ్స్ సినిమాలో అమాయక జర్మన్ పనిమనిషిగా నటించింది, ఇదే ఆ మూడేళ్ళలో తొలిసారి డీట్రిచ్ స్టెర్న్‌బర్గ్ దర్శకత్వం వహించని సినిమాలో నటించడం. స్టెర్న్‌బర్న్-డీట్రిచ్ కాంబినేషన్‌లో వచ్చిన చివరి రెండు సినిమాలు - ద స్కార్లెట్ ఎంప్రెస్ (1934), ద డెవిల్ ఈజ్ ఎ వుమన్ (1935) - వారిద్దరి కాంబినేషన్‌లో అత్యంత స్టైలిష్ సినిమాలు. అయితే ఆ రెండూ వారిద్దరి సినిమాల్లో అతి తక్కువ లాభాలు ఆర్జించిన సినిమాలుగా మిగిలాయి. డీట్రిచ్ తర్వాతికాలంలో తాను అత్యంత అందంగా కనిపించిన సినిమా ద డెవిల్ ఈజ్ వుమన్ అని పేర్కొంది. తర్వాత పారామౌంట్ పిక్చర్స్ వారు స్టెర్న్‌బర్గ్‌ని ఫైర్ చేయడంతో ఇక ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాలు రాలేదు.

స్టెర్న్‌బర్గ్ లైటింగ్, ఫోటోగ్రఫీని బాగా ఉపయోగించుకుని, డీట్రిచ్‌ని మరింత అందంగా, ఆకర్షణీయంగా చూపాడని పేరుపడ్డాడు. వెలుగు, నీడలతో ఒక విభిన్నమైన ధోరణితో ఆడుకుంటూ స్వంతబాణీ సృష్టించుకున్నాడు. సెట్ డిజైన్, కాస్ట్యూంలపై ప్రత్యేక శ్రద్ధను ఈ ఫోటోగ్రఫీ, లైటింగ్‌కి మేళవించడంతో స్టెర్న్‌బర్గ్-డీట్రిచ్ ద్వయం సినిమా చరిత్రలోనే దృశ్యపరంగా అత్యంత స్టైలిష్ సినిమాలు చిత్రీకరించారు.Thomson (1975) సినీ విమర్శకులు ఇప్పటికీ ఈ ద్వయం చేసిన మాయాజాలంలో స్టెర్న్‌బర్గ్‌కి ఎంత వాటా, డీట్రిచ్‌కి ఎంత వాటా దక్కుతుందన్న విషయం తీవ్రంగా చర్చించుకుంటూనే ఉన్నారు, కానీ వీరిద్దరూ విడివిడిగా పనిచేసిన తర్వాతి దశలో ఇద్దరూ కూడా విడివిడిగా ఆ స్థాయిని అందుకుని, స్థిరంగా నిలుపుకోలేకపోయారని అందరూ అంగీకరిస్తారు.[28] ఒక నటి, దర్శకుడు కలిసి ఏడు సినిమాల పాటు పనిచేయడం, అదొక ప్రత్యేకమైన ట్రెండ్ కావడం ఇప్పటికీ హాలీవుడ్ సినీ చరిత్రలో కాథరీన్ హెప్‌బర్న్, జార్జ్ కుకర్ (వీరిద్దరూ కలిసి 10 సినిమాలు చేశారు) తప్ప మరెవరూ చేరుకోని రికార్డే.[29].[30]

స్టెర్న్‌బర్న్‌తో తన భాగస్వామ్యం విడిపోయాకా ఆమె తొలి చిత్రం ఫ్రాంక్ బార్జాజ్ దర్శకత్వంలో డిజైర్ (1936) కమర్షియల్ విజయం పొందింది, దాంతో రొమాంటిక్ కామెడీలు చేయడానికి ఆమెకి అవకాశం చిక్కింది. ఆమె తర్వాతి ప్రాజెక్టు ఐ లవ్‌డ్ ఎ సోల్జర్ (1936) స్క్రిప్ట్ సమస్యలు, షెడ్యూల్ అవకతవకలు, స్టూడియో దర్శకుడిని తీసేయడానికి నిర్ణయించడం వంటి పలు కారణాలతో సినిమా ఆగిపోయింది.[31]

"బాక్సాఫీస్ పాయిజన్"

డీట్రిచ్‌కు వచ్చిన మితిమీరిన ఆఫర్లు ఆమెను ఆకర్షించాయి, దాంతో పారామౌంట్ స్టూడియో బయట తన తొలి రంగుల సినిమా ద గార్డెన్ ఆఫ్ అల్లా (1936) చేసింది. ద గార్డెన్ ఆఫ్ అల్లా సినిమా నిర్మాత డేవిడ్ ఓ. సెల్జ్‌నిక్ వద్ద, ఆ సినిమాకు గాను రెండు లక్షల డాలర్లు తీసుకుంది. బ్రిటన్‌లో నైట్ వితవుట్ ఆర్మర్ (1937) సినిమాని 4 లక్షల 50 వేల డాలర్ల మొత్తానికి చేసింది. రెండు సినిమాలూ బాక్సాఫీసు వద్ద మాదిరిగా సంపాదించగా, ప్రేక్షకుల్లో ప్రాచుర్యం తగ్గసాగింది. ఈ దశలో డీట్రిచ్ బాక్సాఫీస్ ర్యాంకింగ్స్‌లో 126వ స్థానానికి చేరుకుంది, అమెరికన్ సినిమా పంపిణీదారులు ఆమెకు మరికొందరు నటులు గ్రెటా గార్బో, జోన్ క్రాఫోర్డ్, మే వెస్ట్, కేథరీన్ హెప్‌బర్న్, నార్మా షేరర్, డాలర్స్ డెల్ రియో, ఫ్రెడ్ ఆస్టైర్ వంటి ఇతరులతో కలిపి 1938 మే నెలలో బాక్సాఫీస్ పాయిజన్ (బాక్సాఫీస్ పాలిటి విషం) అని పేరుపెట్టారు.[32]

ఈమె లండన్‌లో ఉండగా నాజీ పార్టీ అధికారులు డీట్రిచ్‌ని కలిసి, థర్డ్ రీచ్‌లో ముందువరుస నటిగా చేసేందుకు జర్మనీ తిరిగివస్తే ఆకర్షణీయమైన పెద్ద కాంట్రాక్టులు ఇస్తామని ఆఫర్ చేశారు. ఆమె తిరస్కరించి, 1937లో అమెరికన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది.[33] 1937లో ఎర్నెస్ట్ లూబిస్క్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ ఏంజెల్‌లో నటించడానికి ఈమె పారామౌంట్‌కు తిరిగివచ్చింది; సినిమా ఫ్లాప్ అయింది. దాంతో పారామౌంట్ వారు డీట్రిచ్‌తో మిగిలిన కాంట్రాక్టును అమ్మేసేందుకు సిద్ధమయ్యారు.

పునర్ వైభవం, తర్వాతి సినిమా కెరీర్

1939లో జోసెఫ్ వాన్ స్టెర్న్‌బర్గ్ ప్రోత్సాహంతో ఈమె ఫ్రెంచీ అనే కౌబాయ్ సెలూన్ గర్ల్ పాత్రలో జేమ్స్ స్టీవర్ట్ సరసన డిస్ట్రే రైడ్స్ అగైన్ అన్న వెస్టర్న్ కామెడీ సినిమా

మూలాలు

నోట్స్

ఆధార గ్రంథాలు

బాహ్య లంకెలు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.