మొదటి పేజీ

ఈ వారపు వ్యాసం
చంద్రయాన్-3

చంద్రయాన్-3, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్ర యాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. చంద్రయాన్-2లో లాగానే ఇందులో కూడా ఒక రోవరు, ఒక ల్యాండరూ ఉన్నాయి. కానీ ఇందులో ఆర్బిటరు లేదు. దాని ప్రొపల్షను మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షను మాడ్యూలు చంద్రుని చుట్టూ 100 కి.మీ. కక్ష్య వరకూ ల్యాండరును రోవరునూ తీసుకుపోతుంది. ప్రొపల్షను మాడ్యూలులో రోవరు ల్యాండర్లతో పాటు స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) అనే పేలోడును కూడా పంపించారు. ఇది చంద్రుని కక్ష్య నుండి భూమిని పరిశీలిస్తుంది. చంద్రయాన్-2 ప్రయోగంలో చంద్రుని కక్ష్య లోకి విజయవంతంగా ప్రవేశించాక, ప్రయోగాంతంలో సాఫ్ట్‌వేరు లోపం కారణంగా ల్యాండరు మృదువుగా దిగక వైఫల్యం చెందింది. ఆ తరువాత ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. చంద్రయాన్ 2023 ప్రయోగం 3 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్-ఎమ్4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ 2023 ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ చేసింది. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో 2023 ఆగష్టు 26న దేశ ప్రధాని నరేంద్రమోడి బెంగళూరుకు చేరుకుని పీణ్యలోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్‌ - 3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేయడంతో పాటు ఇకపై ప్రతియేటా ఈ రోజు (ఆగష్టు 23)ని జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... ప్రముఖ జర్నలిస్టు సాగరిక ఘోష్ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయ్ జీవిత చరిత్ర రచయిత్రి అనీ!
  • ... మత్తును కలిగించే కొకైన్ వ్యసనం కావడానికి అవకాశం ఉన్నందున వైద్యులు కేవలం పరిమిత చికిత్సలకే ఉపయోగిస్తున్నారనీ!
  • ... మాహారాష్ట్రలోని పోహ్రాదేవి తీర్థ క్షేత్రం బంజారా కాశీ క్షేత్రంగా వ్యవహరించబడుతుందనీ!
  • ... సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అనీ!
చరిత్రలో ఈ రోజు
జూన్ 24:
ఈ వారపు బొమ్మ
గుజరాత్ లోని పటాన్ లో 11వ శతాబ్దానికి చెందిన చౌళుక్య వంశానికి చెందిన రాణీ వారి స్నానమందిరం, ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఇదీ ఒకటి

గుజరాత్ లోని పటాన్ లో 11వ శతాబ్దానికి చెందిన చౌళుక్య వంశానికి చెందిన రాణీ వారి స్నానమందిరం, ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఇదీ ఒకటి

ఫోటో సౌజన్యం: క్షితిజ్ చరానియా


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ