పాదరసము

పాదరసం ఒక రసాయన మూలకము. దీని సంకేతము Hg, పరమాణు సంఖ్య 80. దీనిని క్విక్ సిల్వర్ అంటారు. దీని లాటిన్ నామము "హైడ్రార్జిరం" (/hˈdrɑːrərəm/).[4] . ఇది ఆవర్తన పట్టికలో "డి" బ్లాకుకు చెందిన మూలకం. ఇది సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక లోహం. ఇదే పరిస్థితులలో ద్రవరూపంలో ఉండే మూలకం బ్రోమిన్. గది ఉష్ణోగ్రత కంటే కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద సీజియం, గాలియం, రుబీడియం మూలకాలు ద్రవరూపంలోనికి మారుతాయి.

పాదరసం, 00Hg
పాదరసం
Appearancesilvery
Standard atomic weight Ar°(Hg)
  • 200.592±0.003[1]
  • 200.59±0.01 (abridged)[2]
పాదరసం in the periodic table
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium
Cd

Hg

Cn
బంగారంపాదరసంథాలియం
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 6
Block  d-block
Electron configuration[Xe] 4f14 5d10 6s2
Electrons per shell2, 8, 18, 32, 18, 2
Physical properties
Phase at STPliquid
Melting point234.3210 K ​(−38.8290 °C, ​
−37.8922 °F)
Boiling point629.88 K ​(356.73 °C, ​674.11 °F)
Density (near r.t.)13.534 g/cm3
Triple point234.3156 K, ​1.65×10−7 kPa
Critical point1750 K, 172.00 MPa
Heat of fusion2.29 kJ/mol
Heat of vaporization59.11 kJ/mol
Molar heat capacity27.983 J/(mol·K)
Vapor pressure
P (Pa)1101001 k10 k100 k
at T (K)315350393449523629
Atomic properties
Oxidation states−2 , +1, +2 (a mildly basic oxide)
ElectronegativityPauling scale: 2.00
Atomic radiusempirical: 151 pm
Covalent radius132±5 pm
Van der Waals radius155 pm
Color lines in a spectral range
Spectral lines of పాదరసం
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​rhombohedral
Rhombohedral crystal structure for పాదరసం
Speed of sound(liquid, 20 °C) 1451.4 m/s
Thermal expansion60.4 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity8.30 W/(m⋅K)
Electrical resistivity(25 °C) 961n Ω⋅m
Magnetic orderingdiamagnetic[3]
CAS Number7439-97-6
History
DiscoveryAncient Chinese and Indians (before 2000 BC)
Symbol"Hg": from its Latin name hydrargyrum, itself from Greek hydrárgyros, 'water-silver'
Isotopes of పాదరసం
Template:infobox పాదరసం isotopes does not exist
 Category: Mercury (element)
| references
పీడనాన్ని కొలిచే పాదరస స్తంభం

పాదరసం ప్రకృతిలో "సిన్నాబార్ (మెర్క్యురిక్ సల్ఫైడ్)" రూపంలో ఖనిజంగా లభ్యమవుతుంది.

పాదరసం ధర్మోమీటర్లు, బారోమీటర్లు, మానోమీటర్లు, స్పైగ్మో మానోమీటర్లు, తేలియాడే కవాటాలు (ఫ్లోట్ వాల్వులు), మెర్క్యురీ స్విచ్‌లు, మెర్క్యురీ రిలేస్, ఫ్లోర్‌సెంట్ దీపాలు, యితర పరికరాలలో ఉపయోగిస్తారు. పాదరసం మూలకం విషతుల్యం అయినందున దీనిని ధర్మోమీటర్లు, స్పైగ్మోమానోమీటర్లలో వైద్యరంగంలో వినియోగించడం తగ్గించారు. దీని స్థానంలో ఆల్కహాల్ లేదా గాలిన్‌స్టన్ తో నింపబడిన గాజు ధర్మోమీటర్లను, ధర్మిస్టర్ లేదా పరారుణ ఆధారిత ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తున్నారు. అదే విధంగా మెర్క్యురీ స్పైగ్మోమీటర్ల స్థానంలో మెకానికల్ ప్రెజర్ గేజ్, ఎలక్ట్రానికి స్ట్రయిన్ గేజ్ లు వాడుకలోనికి వచ్చాయి. పాదరసాన్ని శాస్త్రీయ పరిశోధనలలో, దంతవైద్యంలో "అమాల్గం" గాను ఉపయోగిస్తున్నారు. పాదరసాన్ని మెర్క్యురీ ప్లోర్‌సెంట్ దీపాలకు ఉపయోగిస్తారు. పాదరస బాష్పాల నుండి విద్యుత్ ప్రసరించినపుడు తక్కువ తరంగదైర్ఘ్యం గల అతినీలలోహిత కాంతి వెలువడుతుంది. దీని కారణంగా గొట్టం ప్రకాశవంతమై దృగ్గోచర కాంతి ఉత్పత్తి అవుతుంది.

నీటిలోకరిగే పాదరస విషతుల్యాలు (ఉదా: మెర్యురిక్ క్లోరైడ్ లేదా మిథైల్ మెర్క్యురీ), పాదరస భాస్ఫాలను పీల్చడం కారణంగా కారణంగా పాదరస విషమయం అవుతుంది.

ధర్మములు

భౌతిక ధర్మములు

ఉత్ప్లవన బలం, తలతన్యత కారణంగా పాదరసం పై తేలియాడుతున్న ఒక పౌండ్ నాణెం (సాంద్రత ~7.6 g/cm3)

పాదరసం భారమైన, వెండి-తెలుపు రంగు గల ద్రవరూప లోహం. ఇతర లోహాలలో పోల్చినపుడు తక్కువ ఉష్ణవాహకత కలిగి ఉంటుంది కానీ మంచి విద్యుద్వాహకం.[5]

దీని ఘనీభవన స్థానం −38.83 °C, బాష్పీభవన స్థానం 356.73 °C, [6][7][8]. ఈ విలువలు ఏవైనా స్థిర లోహాల కంటే తక్కువ.[9] పాదరసాన్ని ఘనీభవనం చెందించినపుడు దాని ఘనపరిమాణం 3.59% తగ్గుతుంది, సాధ్రత 13.69 g/cm3 (ద్రవరూపంలో ఉన్నప్పుడు) నుండి 14.184 g/cm3 (ఘన రూపంలో ఉన్నప్పుడు) కు పెరుగుతుంది. ఘనపరిమాణ వ్యాకోచ గుణకం 0 °C వద్ద 181.59 × 10−6, 20 °C వద్ద 181.71 × 10−6, 100 °C వద్ద 182.50 × 10−6 ఉంటుంది. ఘన రూప పాదరసం స్తరణీయత, తాంతవత లక్షణాలను కలిగి ఉండి కత్తితో కత్తిరించే విధంగా ఉంటుంది.[10]

పాదరసం ఎలక్ట్రాన్ విన్యాసంలో ఎలక్ట్రానులు 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, 5s, 5p, 5d, 6s ఉప స్థిర కక్ష్యలలో ఉంటాయి. ఈ విన్యాసం ఎలక్ట్రాన్ కోల్పోవడాన్ని నిరోధిస్తుంది కనుక పాదరసం జడ వాయువుల వలె ప్రవర్తిస్తుంది. బలహీన బంధాలను ఏర్పరచుకోవడం వలన దీని ద్రవీభవన ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.

రసాయన ధర్మములు

పాదరసం, సజల సల్ఫ్యూరికామ్లం వంటి అనేక ఆమ్లాలతో చర్య జరపదు. కానీ గాఢ సల్ఫ్యూరికామ్లం, నత్రికామ్లము లేదా ఆక్వా రెజియా వంటి ఆక్సీకరణ ఆమ్లాలలో కరిగి సల్ఫేట్, నైట్రేట్, క్లోరైడ్లను ఇస్తుంది. సిల్వర్ (వెండి) వలెనే పాదరసం వాతావరణంలోని హైడ్రోజన్ సల్ఫైడ్ తో చర్యజరుపుతుంది. పాదరసం ఘన రూప గంధకం (సల్ఫర్) తో చర్య జరుపుతుంది.[11]

అమాల్గములు

పాదరస- ఉత్సర్గ వర్ణపటం గల దీపం

పాదరసం బంగారం, వెండి వంటి లోహాలలో కరిగి వాటి అమాల్గములను ఏర్పరచును. ఇందులో ఇనుము మినహాయింపు. ఇనుప పాత్రలను పాదరసం సాంప్రదాయకంగా పాదరసం వర్తకంలో వాడుతారు. ఆవర్తన పట్టికలోని మొదటి వరుసలోని ఇతర పరివర్తన మూలకాలలో మాగనీస్, కాపర్, జింక్ లు అమాల్గములు ఏర్పరచడానికి అయిష్టతను చూపుతాయి. ప్లాటినంతో సహా యితర మూలకాలు పాదరసంతో అమాల్గములు ఏర్పరచవు.[12][13] సేంద్రియ సంశ్లేషణలో సాధారణంగా సోడియం అమాల్గములు క్షయకరణ కారకాలుగా పనిచేస్తాయి. ఈ అమాల్గములు అధిక పీడన సోడియం దీపాలలో వాడుతారు.

స్వచ్ఛమైన పాదరసం అల్యూమినియం మూలకాలు కలసినపుడు మెర్క్యురీ - అల్యూమినియం అమాల్గం ఏర్పరచును. ఈ అమాల్గం అల్యూమినియం లోహాన్ని అల్యూమినియం ఆక్సైడ్ పొర ఏర్పడుటను (క్షయం కాకుండా) కాపాడుతుంది. అయినప్పటికీ కొద్ది మొత్తంలో పాదరసం అల్యూమినియాన్ని క్షయం చెందిస్తుంది. దీని కారణంగా సాధారణ పరిస్థితులలో విమానాలలో పాదరసం అనుమతించబడదు. ఎందుకంటే విమానం యొక్క బహిర్గత అల్యూమినియం భాగాలతో పాదరసం కలసి మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది.[14]

పాక్షిక పరిస్థితులలో ఒక విమానంలో పాదరసం అనుమతించబడదు ఎందుకంటే ఇది విమానంలో బహిర్గతమైన అల్యూమినియం భాగాలతో ఒక మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. పాదరసం పెళుసుదనం ద్రవలోహాల పెళుసుదనం యొక్క సాధారణ రకం.

ఐసోటోపులు

పాదరసానికి అనేక స్థిర ఐసోటోపులు ఉన్నాయి. అందులో అత్యధికంగా (29.86%) లభ్యమయ్యేది 202
Hg
. ఎక్కువ కాలం జీవించే రేడియో ఐసోటోపులు 194
Hg
(అర్థ జీవిత కాలం 444 సంవత్సరాలు), 203
Hg
(అర్థ జీవిత కాలం 46.612 రోజులు). మిగిలిన ఐసోటోపులలో అనేకమైన వాటి అర్థ జీవిత కాలం ఒక రోజు కంటే తక్కువ ఉంటుంది. 199
Hg
, 201
Hg
లను తరచుగా NMR (నూక్లియర్ మాగ్నటిక్ రిజొనెన్స్) - క్రియాశీల కేంద్రకాలలో పరిశోధిస్తుంటారు. వీటి స్పిన్ లు వరుసగా ½, 3⁄2 ఉంటాయి.[5]

వ్యుత్పత్తి

పాదరసం యొక్క నవీన రసాయన సంకేతం Hg. ఈ పదం లాటిన్ పదమైన "హైడ్రార్జిరం" నుండి వ్యుత్పత్తి అయినది. ఈ పదం యొక్క అర్థం "వాటర్-సిల్వర్". ఈ పదార్థం నీరువలె ఉండి వెండిని పోలి ఉండటం వలన ఈ పేరు వచ్చింది. వేగం, చలనశీలత కలిగిన రోమన్ దేవుడైన "మెర్క్యురి" పేరును ఈ మూలకానికి పెట్టారు. ఈ మూలకం పేరు సౌరమండలంలోని మెర్క్యురీ (బుధుడు) తో సంబంధం కలిగి లోహం యొక్క రసవాద సంకేతాలతో కూడా పోలి ఉంటుంది. రసవిజ్ఞానం యొక్క సంస్కృత అర్థం "రసవతం". దీని అర్థం "ద వే ఆఫ్ మెర్క్యురీ".[15]

చరిత్ర

ప్రాచీన కాలం నుండి "మెర్క్యురీ" (బుధుడు) గ్రహాన్ని సూచించే గుర్తు.

పాదరసం సా.శ.పూ 1500 నుండి ఈజిప్టు సమాధులపై కనుగొన్నారు.[16]

చైనా, టిబెట్ లలో జీవితకాలం పోడిగించుకోవడానికి, పగుళ్ళు నయం చేయడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించేవారు. అయితే పాదరసం ఆవిరికి గురికావడం తీవ్రమైన ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు కలిగాయి.[17] చైనా మొదటి చక్రవర్తి అయిన "క్విన్ షి హాంగ్ డి" తాను పరిపాలిస్తున్న రాజ్యంలో ప్రవహిస్తున్న పాదరసం గల నదిలో ఉన్న సమాధిలో ఖననం చేయబడ్డాడు అనే ఆరోపణలున్నాయి. అతడికి అమరత్వం ప్రసాదించుటకు క్విన్ దేశ రసవాదులచే (కాలేయం వైఫల్యం, పాదరస విషమయం, మెడడు చావు కారణంగా) పాదరసం త్రావింపబడి మరణించాడని ఆరోపణలున్నాయి.[18][19]

ఈజిప్టు లోని రెండవ తులునిడ్ పాలకుడు "ఖుమరవేహ్ ఇబ్న్ అహ్మద్ ఇబ్న్ తులున్" (884-896) దుబారా, వృధావ్యయం చేసేవానిగా పేరు పొందాడు. అతడు పాదరసంతో నింపిన ఒక తొట్టెలో గాలితో నింపిన తలగడలపై నిద్రించేవాడు.[20]

2014 నవంబరులో అధిక పరిమాణంలో గల పాదరస నిల్వలను మెక్సికోలోని 1800 సంవత్సరాల నాటి "టెంపుల్ ఆఫ్ ద ఫీచర్డ్ సెర్పంట్" పిరమిడ్ 60 అడుగుల క్రిందిభాగంలో గల గదిలో విగ్రహాలు, చిరుతపులి అవశేషాలతో గల పెట్టెలో కనుగొన్నారు.[21]

ప్రాచీన గ్రీకులు సిన్నాబార్ (మెర్క్యురి సల్ఫైడ్) ను లేపనాలకు వాడేవారు. ప్రాచీన ఈజిప్టియన్లు, రోమన్లు సౌందర్య సాధన సామాగ్రికి ఉపయోగించేవారు. మయ నాగరికతలో పెద్ద నగరంగా ఉండే లామనాయిలో గల మెసమెరిచన్ బాల్‌కోర్టులో పాదరస కొలనును కనుగొన్నారు.[22][23]

సా.శ.పూ 500 లలో ఇతర లోహాలతో కూడిన "అమాల్గం" (పాదరసం యొక్క మిశ్రమలోహాలు) లను తయారుచేయబడ్డాయి.[24]

రసవాదుల ఆలోచన ప్రకారం అన్ని లోహాలు ఏర్పడటానికి మొట్టమొదటి పదార్థంగా పాదరసం ఉండేది. పాదరసంలో సల్ఫర్ వివిధ పరిమాణంలో చేరడం వలన వివిధ లోహాలు ఏర్పడ్డాయని నమ్మేవారు. ఈ సమ్మేళనాలలో స్వచ్ఛమైనది బంగారం అని వారి నమ్మకం.[25]

ఆల్మడెన్ (స్పెయిన్), మోంటే అమియాటా (ఇటలీ), ఇద్రిజ (ప్రస్తుతం సాల్వేనియా) గనులలో అధిక స్థాయిలో పాదరసం లభ్యమవుతుంది. 2500 సంవత్సరాలకు పూర్వం అమాల్డన్ గనులు ప్రారంభమైనవి. 19వ శతాబ్దం చివరివరకు కొత్త నిల్వలు కనుగొనబడ్డాయి.[26]

లభ్యత

పాదరసం భూ పటలంలో లభ్యమయ్యే అరుదైన మూలకం. భూ పటలంలో మిలియన్ భాగాలలో 0.08 భాగాలు ద్రవ్యరాశి పరంగా లభ్యమవుతుంది.[27] పాదరసం భూపటలంలో అత్యధికంగా గల మూలకాలతో చర్య చెందదు. పాదరస ధాతువులు సాధారణమైన రాతిలో మూలకం సమృద్ధిగా అసాధారణమైన గాఢతతోలభ్యమవుతుంది. అత్యధిక పరిమాణంలో గల పాదరస ధాతువులు ద్రవ్యరాశి పరంగా 2.5% పాదరసాన్ని కలిగి ఉంటాయి. అతి తక్కువగా పాదరస ధాతువులు 0.1% పాదరసాన్ని కలిగి ఉంటాయి. పాదరసం ప్రకృతిసిద్ధం లోహంగా (అరుదుగా) లేదా సిన్నాబార్, కార్డెరోయిట్, లివింగ్‌స్టోనైట్, ఇతర ఖనిజాలలో లభ్యవవుతుంది. పాదరసం యొక్క సాధారణ ఖనిజం "సిన్నాబార్" (HgS) [28] పాదరస ఖనిజాలు తరచుగా వేడి నీటి బుగ్గలు లేదా ఇతర అగ్నిపర్వత ప్రాంతాలలో ఉంటాయి.[29]

1558 ప్రారంభంలో ధాతువు నుండి వెండిని పాదరసం ఉపయోగించి సంగ్రహణం చేయుటకు "పాటియో విధానం" కనుగొనబడింది. దీని కారణంగా స్పెయిన్, దానిలోగల అమరికన్ కాలనీల ఆర్థిక వ్యవస్థలో పాదరసం ఆవశ్యక వనరుగా పరిగణింపబడేది. న్యూ స్పెయిన్, పెరూ దేశాలలో లూక్రటివ్ గనుల నుండి సిల్వర్ ను సంగ్రహించుటకు పాదరసాన్ని ఉపయోగించేవారు. ప్రారంభంలో దక్షిణ స్పెయిన్ లోని ఆలమండెన్ వద్ద గల స్పానిష్ క్రౌన్ గనులు పాదరసాన్ని అన్ని కాలనీలకు సరఫరా చేసేవి.[30] నవీన ప్రపంచంలో మూడు శతాబ్దాలలో 100,00 టన్నుల పాదరసాన్ని హకావెలికా, పెరూ ప్రాంతాలలో గల గనుల నుండి తీసారు. 19 వ శతాబ్దంలో పాదరసాన్ని వెండి గనులలో ఉపయోగించుటకు పాటియో పద్ధతి, తరువాత పాన్‌ అమాల్గమేషన్ పద్ధతులకు అధిక డిమాండ్ ఉంది.[31]

ఇటలీ, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో దేశాలలోని పూర్వపు గనులు, ప్రపంచంలో అధిక పరిమాణంలో పాదరసాన్ని ఉత్పత్తి చేసేవి. ప్రస్తుతం అవి పూర్తిగా మైనింగ్ చేయబడినవి. అదే విధంగా స్లోవేనియా (ఇద్రజ), స్పెయిన్ (అల్మడెన్) గనులు పాదరసం ధర తగ్గిపోవడం కారణంగా మూసివేయబడినవి. 1992 లో యునైటెడ్ స్టేట్స్ లో వెవాడా యొక్క మెక్‌డెర్మిట్ గని మూసివేయబడింది. పాదరసం యొక్క ధర వివిధ సంవత్సరాలలో చాలా అస్థిరంగా ఉంది. 2006 లో 76 పౌండ్ల (34.46 kg) ఫ్లాస్కుకు $ 650 ఉంది.[32]

కాలిఫీర్నియాలో సోక్రటీస్ గనులలో గల పాదరసం యొక్క ఖనిజం "సిన్నాబార్".

పాదరస ధాతువైన "సిన్నాబార్"ను గాలిలో వేడి చేయడం , దాని ఆవిర్లను ద్రవీకరించడం వలన సంగ్రహణం చేస్తారు. ఈ చర్యకు రసాయన సమీకరణం.

HgS + O2 → Hg + SO2

2005లో ప్రపంచ పాదరస ఉత్పత్తిలో మూడింట రెండు వంతులు చైనా మొదటి స్థానంలో ఉంది.[33] అనేక ఇతర దేశాలలో కూడా కాపర్ ఎలక్ట్రోవిన్నిగ్ పద్ధతులు , వ్యర్థాల నుండి పాదరసం నమోదు కాబడిన స్థాయిలో ఉత్పత్తి అయినట్లు భావింపబతుతోంది.

పాదరసం అధిక విషతుల్యం అయినందున, సిన్నాబార్‌ను గనులనుండి త్రవ్వకాలు , పాదరసం శుద్ధి విధానాలు ప్రమాదకరమైనవి , పాదరస విష కాలుష్యానికి చారిత్రిక కారణం అవుతున్నవి.[34] చైనాలో జైలులో గల ఖైదీ కార్మికులను 1950లలో సిన్నాబార్ మైనింగ్ అభివృద్ధి చేయడానికి ఉపయోగించేవారు. లుయో క్సై మైనింగ్ కంపెనీ ద్వారా క్రొత్త టన్నల్స్ నెలకొల్పుటకు వేలాది ఖైదీలను ఉపయోగించేవారు.[35] ఈ ఖనిజాన్ని త్రవ్వడానికి కూలీల ఆరోగ్యం పెద్ద ప్రమాదంలో పడుతుంది.

యూరోపియన్ యూనియన్ "ఫ్లోర్‌సెంట్ బల్బు" ల తయారీలో పాదరస వినియోగాన్ని గుర్తిస్తూ 2012 లో చైనాకు సిన్నాబార్ గనులను తిరిగి తెరవ వలసినదిగా పిలుపునిచ్చాయి. దక్షిణ నగరాలైన ఫోషన్, గువాన్‌ఝో లలో పర్యావరణ ప్రమాదాలు ఒక సమస్యగా మారాయి.[35]

రసాయనశాస్త్రం

పాదరసం ముఖ్యంగా I, II ఆక్సీకరణ స్థితులలో ఉంటుంది.

పాదరసం(I) సమ్మేళనలు

తేలికైన ఇతర మూలకాలైన కాడ్మియం, జింకు వలె కాక పాదరసం సాధారణంగా సరళమైన స్థిరమైన లోహ-లోహ బంధాలను ఏర్పరచగలదు. పాదరసం (I) సమ్మేళనాలు డయా అయస్కాత పదార్థాలు. అవి Hg2+
2
డైమరిక్ కాటయాన్లను ఏర్పరుస్తాయి. క్లోరైడ్లు, నైట్రేట్లతో పాటు స్థిర ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి.[36] మెర్క్యురీ (I) క్లోరైడ్ రంగులేని ఘన పదార్థం. ఇది "కలోమెల్" అని పిలువబడుతుంది. దీని ఫార్ములా Hg2Cl2.

మెర్క్యురీ (I) హైడ్రైడ్ రంగులేని వాయుపదార్థం దీని ఫార్ములా HgH.[37]

పాదరసం (II) సమ్మేళనాలు

మెర్క్యురీ (II) అనునది ప్రకృతిలో లభించిన సర్వసాధారణమైన ఆక్సీకరణ స్థితి. నాలుగు పాదరసం యొక్క హాలైడ్లు తెలిసినవే. అవి టెట్రాహైడ్రల్ నిర్మాణాలను కలిగి ఉంటాయి. వాటిలో మెర్క్యురీ (II) క్లోరైడ్ అందరికీ సుపరిచితమైనది. ఇది తెలుపు రంగును కలిగి "ఉత్పతనం" త్వరగా చెందగలదు. HgCl2 సంయోజనీయ బంధాలను ఏర్పరచి టెట్రాహైడ్రల్ నిర్మాణం కలిగిఉంటుంది.

పాదరసం ఆక్సైడ్ లలో ముఖ్యమైన మెర్క్యురీ (II) ఆక్సైడ్. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద లోహానికి గాలి తగిలేటట్టు చేసినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఇది 400 °C వద్ద వేడి చేయడం ద్వారా తిరోగమన చర్య జరిగుతుంది. ఈ చర్యను స్వచ్ఛమైన ఆక్సిజన్ యొక్క ప్రారంభ సంశ్లేషణలో జోసెఫ్ ప్రిస్టిలీ ప్రదర్శించినట్లుగా తెలుస్తుంది.[11]

సున్నితమైన లోహంగా పాదరసం చాల్కొజన్లతో కలసి స్థిరమైన ఉత్పన్నాలను ఏర్పరస్తుంది. అందులో మెర్క్యురీ (II) సల్ఫైడ్ (HgS) ప్రకృతిలో "సిన్నాబార్" థాతువు రూపంలో లభ్యమవుతుంది. జికు సల్ఫైడ్ (ZnS) వలెనే HgS రెండు రూపాలలో స్పటికీకరణం చెందుతుంది. అవి ఎరుపు రంగు గల ఘనాకృతి, నలుపు రంగు గల జింకే బ్లెండ్ రూపం.[5] మెర్క్యురీ (II) సెలెనైడ్, మెర్క్యురీ (II) టెల్లూరైడ్ కూడా సుపరిచితములైన ఉత్పన్నాలే. ఇవే కాకుండా వాటి ఉత్పన్నాలైన మెర్క్యురీ కాడ్మియం టెల్లూరైడ్, మెర్క్యురీ జింక్ టెల్లూరైడ్ లు అర్థవాహకాలుగా పరారుణ శోధక పదార్థాలుగా ఉపయోగపడుతున్నాయి.[38]

మెర్క్యురీ ఫల్మినేట్ అనేది ఒక డిటనేటర్. దీనిని ప్రేలుడు పదార్థాలలో వాడుతున్నారు.[5]

అనువర్తనాలు

ఉష్ణమాపక గాజు బల్బులో ఉన్న పాదరసం

పాదరసాన్ని పారిశ్రామికంగా రసాయనాల ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. విద్యుత్, ఎలక్ట్రానిక్ అనువర్తనాలలో కూడా ఉపయోగిస్తారు. దీనిని ఉష్ణమాపకాలలో అధిక ఉష్ణోగ్రతలను గణన చేయడానికి ఉపయోగిస్తారు. మెర్క్యురీ దీపాలలలో వాయు స్థితిలో ఉన్న పాదరసం ఉపయోగపడుతుంది. పాదరసానికి గల విషతుల్యత కారణంగా ఇతర అనువర్తనాలలో దీని వినియోగం తగ్గించి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తున్నారు.[39]

వైద్యరంగంలో

దంతాలలో అమాల్గం నింపుట

పాదరసం, దాని సమ్మేళనాలు వైద్యరంగంలో ఉపయోగపడుతున్నాయి. దంతాలకు వాడే అమాల్గంలో పాదరసం ముఖ్య అనుఘటకం. థియోమెర్సల్ అనే సేంద్రియ పదార్థం వాక్సిన్ లలో ఉపయోగిస్తున్నారు.[40] ఈ థియోమెర్సల్ అనేది ఇథైల్ మెర్క్యురీ యొక్క మెటబాలిక్ రూపం. ఈ పాదరస ఆధారిత పదార్థాల మూలంగా పిల్లల ఆరోగ్యానికి సష్టం వాటిల్లుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ వీటికి ఆధారం చూపించడానికి శాస్త్రీయ అధ్యయనాలు లభ్యమవలేదు.[41] ఏదేమైనా, థియోమెర్సల్ 6 సంవత్సరాల వయస్సు, అంతకు తక్కువ గల పిల్లలకు వేసే టీకా మందుల నుండి తగ్గించబడింది లేదా తొలగించబడింది.[42]

మరొక పాదరస ఉత్పన్నం "మెర్‌బ్రోమిన్" ఆంటీసెప్టిక్ గా గాయాలు, పగుళ్ళకు కొన్ని దేశాలలో ఉపయోగిస్తున్నారు.

పాదరసం ముఖ్యంగా "సిన్నాబార్" అనే ముఖ్య ధాతువు నుండి లభ్యమవుతుంది. సిన్నాబార్ వివిధ రకాల మందులలో వాడుతారు. దీనిని సాంప్రదాయ చైనీయుల మందులలో వాడుతారు.[43]

నేడు, ఔషధంలో పాదరసం వినియోగం ముఖ్యంగా అన్ని దేశాలలో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో తగ్గింది. 18 వ శతాబ్దం, 19 వ శతాబ్దం చివరలో పాదరసాన్ని ఉపయోగించి పనిచేసే థర్మోమీటర్లు, స్పెగ్మోమానోమీటర్లు ఆవిష్కరించబడ్డాయి. 21వ శతాబ్ద ప్రారంభంలో పాదరస వినియోగాన్ని కొన్ని దేశాలు నిషేధించాయి. 2002లో యు.ఎస్. సెనేట్ పాదరస థర్మామీటర్లను దశల వారీగా విక్రయించుటను తగ్గించుట గూర్చి చట్టం చేసింది. 2003 లో, పాదరసం రక్తపోటు పరికరాలను నిషేధించడంలో అమెరికాలోని వాషింగ్టన్, మైనే రాష్ట్రాలు మొదటి రాష్ట్రాలు అయ్యాయి.[44]

పాదరస సమ్మేళనాలు వివిధ మందులు, ఆంటీసెప్టిక్స్, ఉత్తేజిత లాక్సేటివ్స్, డైపర్-రాష్-ఆయింటుమెంట్లు, కంటి చుక్కలు, ముక్కు స్ప్రేలలో కనుగొనవచ్చును.[45] 

ప్రయోగశాల ఉపయోగాలు

పాదరస థర్మోమీటర్లను అధిక ఉష్ణోగ్రతలను కనుగొనడానికి ఉపయొగిస్తారు. యునైటెడ్ స్టేట్స్ వీటి వినియోగాన్ని 2003 నుండి తగ్గించింది.[46]

పారరసం ద్రవరూప దర్పణ టెలిస్కోప్ లలో ఉపయోగిస్తారు.

ట్రాన్సిట్ టెలిస్కోపు లలో ఒక బేసిన్ లో పాదరసాన్ని నింపి సమతలంగా ఉండేటట్లు చేసి సమతల దర్పణంగా ఉపయోగిస్తారు. ఈ దర్పణాన్ని నిర్దేశిత చట్రంలో సమాంతర, లంబంగా ఉండే అంశాలను కనుగొనడానికి ఉపయోగిస్తారు. ఒక డిస్కులో పాదరసం తిరుగుతూ ఉండటం మూలంగా పుటాకార పరావలయ దర్పణాలు ఏర్పరచవచ్చును. ఈ దర్పణాలనుపయోగించి పరావర్తనం అయిన కాంతి కిరణాలను ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడేటట్లు చేయవచ్చును. ఈ టెలిస్కోపులు తక్కువ ధరలో లభ్యమవుతాయి.[47][48][49]

నిచే ఉపయోగం

వాయు స్థితిలోఉన్న పాదరసాన్ని మెర్క్యురీ వేపర్ లాంపులలో ఉపయోగిస్తారు. దీనిని ప్లోర్‌సెంట్ దీపాలలో కూడా ఉపయోగిస్తారు. తక్కువ పీడనం కలిగిన దీపాల నుండి వర్ణపట రేఖలు సన్నగా ఉంటాయి. వీటిని సాంప్రదాయకంగా ఆప్టికల్ స్పెక్ట్రోగ్రఫీలో ఉపయోగిస్తారు. వాణిజ్య పరంగా ఈ దీపాలను ప్లోర్‌సెంట్ సీలింగ్ కాంతిని పరావర్తనం చెంది ప్రయోజనం కోసం విక్రయిస్తారు.[50]

విషతుల్యం , భద్రత

మెర్క్యురీ, దాని సమ్మేళనాలు చాలా విషపూరితమైనవి, వాటితో మనం జాగ్రత్తలతో వ్యవహరించాలి; పాదరస వ్యర్థాల (థర్మోమీటర్లు లేదా ప్లోర్‌సెంట్ బల్బులలోనివి) వల్ల, పరిసరాలను కాలుష్యం జరగకుండా ఉండాలంటే వాటిని బహిరంగంగా యితర పదార్థాలతో కలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.[51] విడి విడిగా బిందువుల వలె చెల్లాచెదురైన పాదరస వ్యర్థాలను కలిపి ఒకదగ్గరకు చేర్చి సులువుగా తొలగించవచ్చు. ఈ తొలగించిన పదార్థాన్ని డిస్పోజబుల్ పాత్రలో వేయాలి. వాక్యూమ్ క్లీనర్లు పాదరసం వ్యర్థాలను ఎక్కువ చెదరగొట్టడానికి కారణమవుతాయి కనుక వాటిని వాడకూడదు. పాదరసంతో సులువుగా కలసి అమాల్గంగా ఏర్పరచగల సల్ఫర్, జింకు లేదా యితర పౌడర్లను పాదరస వ్యర్థాలపై వేసి ఏర్పడిన పదార్థాన్ని సులువుగా తొలగించవచ్చు.

మెర్క్యూరీ చర్మం, శ్లేష్మ పొరల ద్వారా శోషించబడుతుంది, పాదరస ఆవిర్లు పీల్చడం కూడా ప్రమాదకరం కనుక పాదరస పాత్రలు సురక్షితంగా మూసివేసి ఉంచాలి. మెర్క్యూరీ దీర్ఘకాలికమైన, తీవ్రమైన విషప్రక్రియను కలిగించవచ్చు.

నియంత్రణలు

అంతర్జాతీయం

140 దేశాలు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం చే పాదరస ఉద్గారాలను తగ్గించాలనే ఒప్పందం చేసుకున్నాయి.[52] 2013 అక్టోబరు 10 న ఈ సమావేశం జరిగింది.[53]

అమెరికా సంయుక్త రాష్ట్రాలు

యునైటెడ్ స్టేట్స్ లో, పర్యావరణ సంరక్షణ ఏజెన్సీ పాదరసం కాలుష్యం నియంత్రించేందుకు, నిర్వహించేందుకు అభియోగాలు చేసింది. అనేక చట్టాలు పర్యావరణ పరిరక్షణ కొరకు చేసింది. వాటిలో "క్లీన్ ఎయిర్ చట్టం", "క్లీన్ వాటర్ చట్టం", "రీసోర్స్ కన్సర్వేషన్ అండ్ రికవరీ ఆక్ట్", "సేఫ్ డ్రింకింగ్ వాటర్ చట్టం" ముఖ్యమైనవి. వీటికి అదనంగా 1996లో "మెర్క్యురీ కంటైనింగ్ అండ్ రీఛార్జబుల్ బ్యాటరీ మేనేజిమెంటు ఆక్ట్" ఆమోదించబడింది.[54] ఉత్తర అమెరికాలో 1995 లో మొత్తం ప్రపంచ మానవజన్య ఉద్గారాలలో దాదాపు 11% వాటా ఉంది.[55]

1990 లో ఆమోదించబడిన యునైటెడ్ స్టేట్స్ క్లీన్ ఎయిర్ ఆక్ట్, విషపూరిత కాలుష్యాల జాబితాలో పాదరసాన్ని చేర్చింది.

యూరోపియన్ యూనియన్

యూరోపియన్ యూనియన్‌లో, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో కొన్ని అపాయకరమైన పదార్ధాల యొక్క పరిమితిపై నిర్దేశించాయి. కొన్ని విద్యుత్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నుండి పాదరసం, ఇతర ఉత్పత్తుల్లో పాదరసం మొత్తం 1000 ppm కంటే తక్కువగా ఉండే విధంగా పరిమితం చేస్తుంది.[56] పాకేజింగ్, బ్యాటారీలలో పాదరసం గాఢతకు పరిమితులు ఉన్నాయి.[57] 2007 జూలై లో, యూరోపియన్ యూనియన్ కూడా థర్మామీటర్లు, భారమితి వంటి విద్యుత్ ఉపయోగించని గణన పరికరాలలో పాదరసం నిషేధించింది.[58]

నార్వే

పాదరసం ఉత్పత్తుల తయారీ, దిగుమతి / ఎగుమతిలో పాదరస వినియోగాన్ని నార్వే 2008 జనవరి 1 నుండి పూర్తిగా నిషేధాన్ని అమలు చేసింది.[59] 2002 లో, నార్వేలోని అనేక సరస్సులు పాదరసం కాలుష్యం యొక్క పేలవమైన స్థితిని కలిగి ఉన్నాయి. వాటి అవక్షేపంలో 1 μg / g పాదరసం అధికంగా ఉంది.[60] 2008 లో నార్వే పర్యావరణ అభివృద్ధి శాఖ మంత్రి ఎరిక్ సోలహీం ఇలా అన్నాడు: "అత్యంత ప్రమాదకరమైన పర్యావరణ విషతుల్యాలలో పాదరసం ఒకటి. పాదరస ఉత్పత్తులకు సరిపడే సంతృప్తికరమైన ప్రత్యామ్నాయాలున్నందున వాటిని నిషేధించాలి. "[61]

స్వీడన్

పాదరసం కలిగిన ఉత్పత్తులను స్వీడన్ 2009లో నిషేధించింది.[62][63]

డెన్మార్క్

2008లో డెన్మార్క్ దేశం కూడా శాశ్వత (వయోజన) దంతాలలో మోలార్ మాలిస్టిక్ ఉపరితల పూరణలకు తప్ప పాదరస అమాల్గంలను నిషేధించింది.[61]

మూలాలు

ఇతర పఠనాలు

  • Andrew Scott Johnston, Mercury and the Making of California: Mining, Landscape, and Race, 1840–1890. Boulder, CO: University Press of Colorado, 2013.

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.