భూపరివేష్టిత దేశం

భూపరివేష్టిత దేశం సాధారణంగా భూభాగాలచే చుట్టియున్న దేశానికి భూపరివేష్టిత దేశంగా వ్యవహరిస్తారు. దీనికి సముద్ర లేదా మహా సముద్రాల తీరమంటూ వుండదు.[1][2][3][4] ప్రపంచంలో 2008 సంవత్సరం నాటికి ఇలాంటి దేశాల సంఖ్య 44. ఆరు ఖండాలలోని ప్రతి ఖండంలోనూ ఒకటి కన్నా ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గలవు. కేవలం ఉత్తర అమెరికా ఖండం, ఓషియానియాలో భూపరివేష్టిత దేశమంటూ లేదు.

ది వర్‌ల్డ్ ఫ్యాక్ట్ బుక్ ప్రకారం, ప్రపంచంలోని భూపరివేష్టిత దేశాలు. బహు భూపరివేష్టిత దేశాలను 'ఎర్ర రంగు'లో సూచించారు.

ఒక సముద్రము, జలసంధుల ద్వారా మాత్రమే మహాసముద్రాలతో లంకె గలిగి వుంటుంది, ఉదాహరణకు బాల్టిక్ సముద్రం, మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం.

అదేవిధంగా ఒక ద్వీప దేశం నీటి భాగాలతో చుట్టబడివుంటుంది.[5]

భూపరివేష్టిత దేశానికి సరిహద్దుల్లో ఉన్న దేశాలన్నీ కూడా భూపరివేష్టిత దేశాలే అయితే, ఆ దేశాన్ని జమిలి భూపరివేష్టిత దేశం అంటారు. ప్రపంచంలో అలాంటి దేశాలు రెండు ఉన్నాయి. అవి: లైచెన్‌స్టీన్, ఉజ్బెకిస్తాన్.

భూపరివేష్టిత దేశాల జాబితా

ఉప్పు నీటి కాస్పియన్ సముద్రం తీరం కలిగి వున్నది.
ఉప్పు నీటి అరల్ సముద్రం తీరం కలిగి వున్నది.
¤ మొత్తం భూభాగాలచే చుట్టబడిన దేశాలు

దాదాపు భూపరివేష్టితం

క్రింది దేశాలు దాదాపు భూపరివేష్టిత దేశాలు, వీటికి అతి తక్కువ సముద్రతీరం గలదు:

పాద పీఠికలు

ఇవీ చూడండి