ఉజ్బెకిస్తాన్

ఉజ్బెకిస్తాన్ గణతంత్రం (Republic of Uzbekistan) మధ్య ఆసియా లోని భూపరివేష్టిత దేశం (నలువైపులా భూమితో చుట్టబడిన దేశము). ఈ దేశానికి పడమర, ఉత్తరాన కజకస్తాన్, తూర్పున కిర్గిజ్ స్తాన్, తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.

ఉజ్బెకిస్తాన్ గణతంత్రం

  • Oʻzbekiston Respublikasi
    Ўзбекистон Республикаси
Flag of ఉజ్బెకిస్తాన్
జండా
Emblem of ఉజ్బెకిస్తాన్
Emblem
Location of ఉజ్బెకిస్తాన్
Location of ఉజ్బెకిస్తాన్
రాజధానితాష్కెంట్
అతిపెద్ద నగరంTashkent
అధికార భాషలుUzbek
గుర్తించిన ప్రాంతీయ భాషలుKarakalpak
జాతులు
(1996)
పిలుచువిధంUzbekistani
ప్రభుత్వంUnitary presidential republic
• President
en:Islam Karimov
en:Shavkat Mirziyoyev
en:Ilzigar Sobirov
en:Diloram Tashmukhamedova
శాసనవ్యవస్థSupreme Assembly
• ఎగువ సభ
Senate
• దిగువ సభ
Legislative Chamber
Independence from the Soviet Union
విస్తీర్ణం
• మొత్తం
[convert: invalid number] (56th)
• నీరు (%)
4.9
జనాభా
• 2013 estimate
30,185,000[2][3] (41వ)
• జనసాంద్రత
61.4/km2 (159.0/sq mi) (136th)
GDP (PPP)2014 estimate
• Total
$123.577 billion[4] (69th)
• Per capita
$4,038[4] (135th)
GDP (nominal)2014 estimate
• Total
$61.720 billion[4] (73వ)
• Per capita
$2,017[4] (136వ)
జినీ (2003)Negative increase 36.8
medium · 95వ
హెచ్‌డిఐ (2013)Steady 0.661[5]
medium · 116th
ద్రవ్యంUzbekistan som (O'zbekiston so'mi) (UZS)
కాల విభాగంUTC+5 (UZT)
• Summer (DST)
UTC+5 (not observed)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+998
Internet TLDen:.uz
  1. Official Uzbek statistics.[ఆధారం చూపాలి]
  2. As the Emirate of Bukhara, Kokand Khanate, and Khwarezm.

ఉజ్బెకిస్థాన్ ఒకప్పుడు గొక్తర్స్ (టర్కిక్ ఖగ్నాటే), తరువాత తింరుద్ సామ్రాజ్యం భాగంగా ఉండేది. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్ ప్రాంతాన్ని 16వ శతాబ్దంలో టర్కీ మాట్లాడే నొమాడ్స్ ఆక్రమించుకున్నారు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం రష్యా సామ్రాజ్యంలో ఉంది. 1924లో ప్రస్తుత ఉజ్బెకిస్థాన్ ప్రాంతం సోవియట్ యూనియన్ సరిహద్దు రిపబ్లిక్‌గా (ఉజ్బెక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్) అయింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత 1991 ఆగస్టు 31న ఉజ్బెకిస్థాన్ " ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ "గా ప్రకటించబడింది. మరుసటి అధికారికంగా స్వతంత్ర దినం జరుపుకుంది.

ఉజ్బెకిస్థాన్ అధికారిక డెమొక్రటిక్,[6] లౌకిక, యూనిటరీ స్టేట్, రిపబ్లిక్ రాజ్యాంగం వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం. దేశ అధికారిక భాష ఉజ్బెకి. ప్రజలలో 85% ప్రజలకు టర్కీ భాష వాడుకలో ఉంది, అయినప్పటికీ రష్యన్ భాష దేశమంతటా వ్యాపించి ఉంది. ఉజ్బెకి ప్రజలు 81%, రష్యన్లు 5.4%, తజకీలు 4%, కజఖ్ ప్రజలు 3% ఇతరులు 6.5% ఉన్నారు. ఉజ్బెకిస్థాన్ ప్రజలలో అత్యధికులు ముస్లిములు [7] ఉజ్బెకిస్థాన్ కామ్ంవెల్త్ దేశాలు, ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్, యునైటెడ్ నేషంస్ (ఐఖ్యరాజ్యసమితి) , షంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యత్వం కలిగి ఉంది.

ఉజ్బెకిస్థాన్ ఆర్ధికరంగం ప్రధానంగా పత్తి, బంగారం, యురేనియం , సహజవాయువు మొదలైన కమ్మోడిటీ ఉత్పత్తి మీద ఆధారితమై ఉంది.

చరిత్ర

Female statuette wearing the kaunakes. Chlorite and limestone, Bactria, beginning of the 2nd millennium BC.
Alexander the Great at the Battle of Issus.

ఉజ్బెకిస్థాన్‌లో మొదటిగా నివసించిన ప్రజలు ప్రస్తుతం కజక్‌స్థాన్ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చిన ఇరానియన్ నోమాడ్‌లని భావిస్తున్నారు. [ఆధారం చూపాలి] వీరు క్రీ.పూ 1వ శతాబ్ధానికి చెందినవారని భావిస్తున్నారు. వీరికి ఇరానియన్ భాషలు వాడుకలో ఉండేవి. వీరు మద్య ఆసియాలో స్థిరపడి నదుల వెంట విస్తారమైన నీటిపారుదల విధానాన్ని స్థాపించారు. [ఆధారం చూపాలి] ఈ సమయంలో బుహొరొ (బుకారా) సమర్క్వండ్ (సమర్కండ్) , తాష్కెంట్ ప్రభుత్వం , ఉన్నత సాంస్కృతిక కేంద్రాలుగా ఉద్భవించాయి. బి.సి 5వ శతాబ్దం నాటికి బాల్ట్రియన్, సొఘడియన్ , యుఫ్హేహి (టొఖరియన్) ఈ ప్రాంతంలో ఆధిక్యత సాధించి ఈ ప్రాంతంలో పాలన సాగించారు.

చైనా పశిమప్రాంతంలో పట్టువ్యాపారం అభివృద్ధి చేసింది. ఈ వ్యాపారాన్ని అవకాశంగా తీసుకున్న ఇరానియన్ నగరాలు వ్యాపార కేంద్రాలుగా వర్ధిల్లాయి. ఉజ్బెకిస్థాన్ ప్రాంతంలోని నగరాలు , ట్రాంసొక్సియానా (మౌవాయుర్నా) (అరబు విజయం తరువాత ఇవ్వబడిన పేరు) గ్రామీణ నివాసిత ప్రాంతాలు , తూర్పు ప్రాంతాం (ప్రస్తుత చైనాలోని క్సింజియాంగ్), సొగడియన్ ప్రాంతాలు ఇఆరానియన్ వ్యాపారవేత్తలు చేసిన వ్యారాభివృద్ధితో సంపన్నమైనాయి. " సిల్క్ రోడ్డు" (పట్టు రహదారి), బుఖారా,, సమరక్వాడ్ అతి సంపన్న నగరాలుగా అభివృద్ధిచెందాయి. ఆ సమయంలో ట్రాంస్క్సియానా అతిపెద్ద ప్రతిభావంతమైన, శక్తివంతమైన అలాగే పురాతన పర్షియన్ ప్రాంతంగా విలసిల్లింది. [8]

అలెగ్జాండర్

Triumphant crowd at Registan, Sher-Dor Madrasah
Russian troops taking Samarkand in 1868.

మక్డోనియన్ పాలకుడు అలెగ్జాండర్ కంక్వర్డ్ సొగడియానా, బచిరాలను జయించాడు. అలెగ్జాండర్ అచమెనింద్ సామ్రాజ్య చక్రవర్తి మూడవ డారిస్ కుమార్తె రొక్సియానాను వివాహమాడాడు. పర్షియన్ సామ్రాజ్యం అచమెనింద్ భూభాగాలు ఆధునిక ఉజ్బెకిస్థాన్‌లో ఉన్నాయి. ఈ విజయం అలెగ్జాండరుకు ప్రాబల్యత తీసుకువచ్చింది. రాజ్యం తరువాత క్రీ.పూ 1 వ శతాబ్ధానికి యుయేజీ ఆధీనంలోకి వచ్చింది. ఉజ్బెకిస్థాన్‌ను పలు సంవత్సరాలు పర్షియన్ పాలకులు పార్ధియన్, సస్సనిద్ పాలకుల ఆధీనంలో ఉంది. అలాగే టర్కీకి చెందిన హెప్తలైట్, గొక్తుర్క్ ప్రజలు కూడా కొంతకాలం ఈ ప్రాంతానికి పాలకులు అయ్యారు.

అరబ్బులు

8వ శతాబ్దంలో అము దర్యా, సిర్ దర్యా నదుల మద్య ప్రాంతం ట్రాంసొక్సియానాను అరబ్బులు (అలి ఇబ్న్ సత్తొర్) జయించారు. అరబ్బులు ఈ ప్రాంతాన్ని పునరుద్ధరించారు. పలు ఇస్లామిక్ స్వర్ణయుగంలో ప్రఖ్యాత పరిశోధకులు ఇక్కడ నివసించి ఈ ప్రాంతం అభివృద్ధికి పాటుపడ్డారు. ఈ కాలంలో కళాకారులు ట్రిగ్నోమెటీ, ఆప్టిక్స్, జ్యోతిషం, కవిత్వం, తాత్వికం, కళలు, సుందర దస్తూరి, ఇతర కళలను అభివృద్ధిచేసారు. ఇది ముస్లిం పునరుద్ధరణకు పునాది వేసింది.

9-10 శతాబ్ధాలలో ట్రాక్సియానా సనిద్ రాజ్యంలో చేర్చబడింది. తరువాత ట్రాక్సియానా టర్కీకి చెందిన కరఖనిదుల ఆధీనం అయింది. అలాగే సెలియుకులు (సుల్తాన్ సనీర్), కర- ఖితన్లు ఈ ప్రాంతం మీద ఆధిక్యత సాధించారు.[9]

చెంఘిజ్ ఖాన్

13వ శతాబ్దంలో చెంఘిజ్ ఖాన్ నాయకత్వంలో మంగోల్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని జయించింది. మంగోల్ విజయం ఈ ప్రాంతంలో మార్పులు తీసుకువచ్చింది. మద్య ఆసియాలో మంగోల్ విజయం ఈ ప్రాంతంలోని ఇరానియన్ భాష మాట్లాడే ప్రజలను ఈ ప్రాంతం వదిలి వెళ్ళేలా చేసింది. తరువాత వచ్చిన మంగోలియన్- టర్కిక్ ప్రజలు ఇరానియన్ సంస్కృతి, వారసత్వాన్ని అణిచివేసింది. బుఖారా, సమర్ఖండ్, కొనేయుర్జెంక్ (ఉర్గెంచ్), ఇతర ప్రాంతాలు మంగోలియన్ దాడుల ఫలితంగా విధ్వంసం అయ్యాయి. ఈ సమయంలో మూకుమ్మడి హత్యలు, అమానుషమైన విధ్వంసం ఈ ప్రాంతాన్ని పీడించాయి.[10]

విచ్చిన్నత

చెంఘిజ్ ఖాన్ మరణం తరువాత 1227లో మంగోల్ సామ్రాజ్యం ఆయన నలుగురు కుమారులు, సభ్యులకు విభజించబడింది. విభజన తరువాత మంగోల్ చట్టాన్ని అనుసరించి పలు తరాలవరకు ఈ ప్రాంతంలో మంగోలు వంశస్థుల పాలన కొనసాగింది. ట్రాంసొక్సియానా పాలన చెంఘిజ్ ఖాన్ రెండవ కుమారుని వారసుడు ఛగతై ఖాన్ ఆధీనంలో ఉండేది. ఛగతై ఖాన్ పాలనలో ఈ ప్రాంతంలో సంపద పెరిగి, శాంతి నెలకొన్నది. అలాగే సమైక్య మంగోలు సామ్రాజ్యం శక్తివంతమైన సామ్రాజ్యంగా నిలిచింది. [11]

Two Sart men and two Sart boys in Samarkand, c. 1910

తైమూర్

14వ శతాబ్దంలో మంగోలు సామ్రాజ్యం విచ్ఛిన్నత చెందింది. ఛగతై భూభాగం మీద వివిధ జాతులకు చెందిన గిరిజన రాజకుమారుల మద్య జరిగిన ఆధిపత్య పోరాటంలో విచ్ఛిన్నమైంది. గిరిజన రాకుమారులలో ఒకడు తైమూర్.[12] తైమూర్ 1380 నాటికి ఈ ప్రాంతం మీద ఆధిక్యత సాధించాడు. చెంఘిజ్ ఖాన్ వారసుడు కానప్పటికీ తైమూర్ ట్రాంసొక్సియానా ప్రాంతంలో సమర్ధుడైన పాలకుడిగా ప్రాబల్యత సంతరించుకున్నాడు. తరువాత తైమూర్ పశ్చిమ, మద్య ఆసియా ప్రాంతాలలోని ఇరాన్, కౌకాసస్, మెసొపొటేమియా, ఆసియా మైనర్, ఏరియల్ సీ ఉత్తర భూభాగంలోని సదరన్ స్టెప్పే ప్రాంతం జయించాడు. చైనాలో మింగ్ సామ్రాజ్యం పాలన కాలం (1405) లో తైమూర్ మరణించే ముందు రష్యా భూభాగాలను కూడా జయించాడు. [11] తైమూర్ ఆక్రమిత నగరాలలో తీవ్రమైన హింస, మూకుమ్మడి హత్యలు చోటుచేసుకున్నాయి.[13]

సాంస్కృతిక అభివృద్ధి

తైమూర్ తాను జయించిన విస్తారమైన భూభాగం నుండి పలు కళాకారుల, విద్యావేత్తలను రాజధాని సమరఖండ్‌లో సమీకరించడం ద్వారా ఈ ప్రాంతాన్ని చివరిగా వర్ధిల్లజేసాడు. వీరి మద్దతుతో తైమూర్ తన సామ్రాజ్యాన్ని సుసంపన్నమైన ఇస్లామిక్ సంస్కృతితో నింపాడు. తైమూర్, ఆయన వారసుల పాలనా కాలంలో సమరఖండ్, ఇతర ప్రాంతాలలో మతపరమైన, ఘనమైన నిర్మాణకళాఖండాల పని చేపట్టబడింది.[14] అమీర్ తైమూర్ వైద్యపరిశోధనలు, భౌతికశాస్త్రం పరిశోధకులు, కళాకారులను పొరుగుదేశాలతో (భారతదేశంతో చేర్చి) పరస్పర మార్పిడి చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టాడు. [15] తైమూర్ మనుమడు ఉలఘ్ బెగ్ ప్రపంచపు ఉత్తమ జ్యోతిష్కులలో ఒకడుగా గుర్తించబడ్డాడు. తైమురిదీలు స్థానికంగా పర్షియన్లు అయినప్పటికీ తైమూరిద్ కాలంలో ట్రాంసొక్సియానా ప్రాంతంలో ఛగతై భాష లిఖితరూపం చేయబడింది. ఛగయియద్ రచయిత " అలి షిర్ నవై " నగరంలో ప్రఖ్యాతి గడించాడు.[11]

నోమాడిక్

తౌమూర్ రాజ్యం తౌమూర్ మరణం తరువాత రెండుగా విభజించబడింది. తింరుదియన్ల అంతర్గతయుద్ధం ఉజ్బెకిస్థాన్ లోని ఆరల్ సీ ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్న నొమాడిక్ గిరిజనులను ఆకర్షించింది. 1501 లో ఉజ్బెకిస్థాన్ సైన్యం ట్రాంసొక్సియానా మీద దండేత్తింది. .[11] ఎమిరేట్ బుఖారా (ఖనాటే బుకారా) లో బానిసవ్యాపారం ప్రాముఖ్యత సంతరించుకుని స్థిరంగాపాతుకుంది.[16] 1821 దాదాపు 25,000 నుండి 60,000 వరకు తజిక్ బానిసలు ఉన్నారని భావిస్తున్నారు. [17] రష్యన్లు ప్రవేశించక ముందు ప్రస్తుత ఉజ్బెకిస్థాన్ ఎమిరేట్ ఆఫ్ బుఖారా, ఖనాటే ఆఫ్ ఖివా మద్య విభజించబడింది.

రష్యా

19వ శతాబ్దంలో రష్యన్ సామ్రాజ్యం మద్య ఆసియా వరకు విస్తరించబడింది. 1942లో ఉజ్బెకిస్థాన్‌లో 2,10,306 రష్యన్లు నివసించారు. [18] 1813లో ఆరంభమైన గ్రేట్ గేం పీరియడ్ ఆంగ్లో-రష్యన్ కాంవెంషన్ (1907) వరకు కొనసాగింది.

1920 ఆరంభంలో మద్య ఆసియా రష్యా ఆధీనంలో ఉండేది. తరువాత సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న బొలోషెవ్కి, ఉజ్బెకిస్థాన్, మద్య ఆసియాలోని ఇతర ప్రాంతాలు తిరుగుబాటు ఆరంభం అయింది. 1924 అక్టోబరు 27న " ఉజ్బెక్ సోవియట్ సోధలిస్ట్ రిపబ్లిక్ " రూపొందించబడింది. 1941 నుండి 1945 వరకు " రెండవ ప్రపంచ యుద్ధం "లో 14,33,230 మంది ఉజ్బెకీయులు రెడ్ ఆర్మీ తరఫున నాజీ జర్మనీతో పోరాడారు. జర్మనీ తరఫున అస్టొజినియన్ ప్రజలు యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో 2,63,005 ఉజ్బెకి సైనికులు ఈస్టర్న్ ఫ్రంట్ (రెండవ ప్రంపంచ యుద్ధం) యుద్ధభూమిలో మరణించారు. 32,670 మంది తప్పిపోయారు.[19] 1991 ఆగస్ట్ 31న సోవియట్ యూనియన్ విచ్చిన్నం తరువాత ఉజ్బెకిస్థాన్ స్వతంత్రదేశంగా ప్రకటించబడింది.సెప్టెమర్ 1 జాతీయ స్వతంత్ర దినంగా ప్రకటించబడింది..

భౌగోళికం

Map of Uzbekistan.

ఉజ్బెకిస్థాన్ వైశాల్యం 447400 చ.కి.మి. వైశాల్యపరంగా ఉజ్బెకిస్థాన్ ప్రంపంచదేశాలలో 56వ స్థానంలోనూ , జనసంఖ్యాపరంగా 42వ స్థానంలోనూ ఉంది.[20] " కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సి.ఐ.ఎస్) " దేశాలలో ఉజ్బెకిస్థాన్ 5వ స్థానంలోనూ, జనసంఖ్యా పరంగా 3వ స్థానంలోనూ ఉంది.[21]

ఉజ్బెకిస్థాన్ ఉత్తర అక్షాంశంలో 37°, 46° తూర్పురేఖాంశంలో 56°, 74° ఉంది. ఉజ్బెకిస్థాన్ తూర్పు పడమరలుగా 1425 కి.మీ, ఉత్తర దక్షిణాలుగా 930కి.మీ విస్తరించి ఉంది. దేశ ఉత్తర, వాయవ్య సరిహద్దులలో కజకస్తాన్, ఆరల్ సముద్రం, నైరుతీ సరిహద్దులో టుర్క్‌మెనిస్తాన్, ఆగ్నేయ సరిహద్దులో తజికిస్తాన్, ఈశాన్య సరిహద్దులో కిర్గిజిస్తాన్ ఉన్నాయి. మద్య ఆసియాలోని పెద్దదేశాలలో ఉజ్బెకిస్థాన్ ఒకటి. అలాగే నాలుగు సరిహద్దులలో మధ్య ఆసియా దేశాలు ఉన్న ఒకే దేశంగా గుర్తించబడుతుంది. ఉజ్బెకిస్థాన్ దక్షిణ సరిహద్దును 150 కి.మీ పొడవున ఆఫ్ఘనిస్థాన్తో పంచుకుంటుంది.

ఉజ్బెకిస్థాన్ శుస్కిత (డ్రై) భూబంధిత దేశం. అంతేకాక ప్రపంచంలో అన్నివైపులా భూబంధిత దేశాల మద్య ఉన్న రెండు దేశాలలో ఉజ్బెకిస్థాన్ ఒకటి. మరొక దేశం లీక్కిన్‌స్టైన్. ఉజ్బెకిస్థాన్‌లో బంధిత జలసముద్రాలు ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్‌ నదులు సముద్రాన్ని చేరవు. ఉజ్బెకిస్థాన్‌ నదీముఖద్వారం సమీపంలో 10% వ్యవసాయభూములు ఉన్నాయి. మిగిలిన దేశం ఎడారి, పర్వతాలతో నిండి ఉంటుంది. ఉజ్బెకిస్థాన్‌ లోని అత్యున్నత శిఖరం ఖజ్రెత్ సుల్తాన్. ఇది సముద్రమట్టానికి 4643 మీ ఎత్తున సుఖందర్యా ప్రాంతంలోని గిస్సార్ పర్వతశ్రేణికి దక్షిణ ప్రాంతంలో తజికిస్తాన్ సరిహద్దులో దుషంబే వాయవ్యంలో ఉంది.[21] ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్‌లో కాంటినెంటల్ వాతావరణం నెలకొని ఉంటుంది. వార్షికంగా వర్షపాతం 100- 200 మి.మీ ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటి గ్రేడ్ చేరుకుంటుంది. శీకాల ఉష్ణోగ్రత 23-9 డిగ్రీల సెంటిగ్రేట్ ఉంటుంది.[22]

పర్యావరణం

Comparison of the Aral Sea between 1989 and 2014.

ఉజ్బెకిస్థాన్ వైవిధ్యమైన సహజత్వంతో నిండిన, సుసంపన్నమైన దేశం. బృహత్తర పత్తి ఉత్పత్తి కేంద్రం ముసుగులో దశాబ్ధాల తరబడి సోవియట్ యూనియన్ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా దేశంలో విపత్కర పరిస్థితులు ఎదురైయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలు దేశంలో అధికరించిన కాలుష్యానికి ప్రధాన కారణం అయ్యాయి. అలాగే దేశంలోని జలం, వాయువు అత్యంత కలుషితం అయ్యాయి.[23] భూగోళంలోని అతిపెద్ద భూబంధిత సముద్రాలు నాల్గింటిలో ఆరల్ సముద్రం ఒకటి. భూమి ఉపయోగించడానికి వాయువులో ఆర్ధత అధికరించడానికి ఇది చాలా సహకరిస్తుంది.[24] 1960 నుండి ఆరల్ సముద్రజలాలు దుర్వినియోగం చేస్తున్న కారణంగా సముద్రవైశాల్యం 50%, జలాలు మూడు భాగాలు క్షీణించాయి. విశ్వనీయమైన అధికారిక ఏజెంసీ లేక ఆర్గనైజేషన్ డేటా సేకరించబడ లేదు. ఇందులోనిజలాలు అధికంగా పత్తిపొలాలకు మళ్ళించబడ్డాయి. పత్తి పంట పెరగడానికి అధిక మొత్తంలో నీరు అవసరం.[25]సోవియట్ ప్రభుత్వం ఆనకట్ట కట్టాడానికి తగినంత నిధి మంజూరు చేయని కారణాంగా 1960 లో సోవియట్ శాస్త్రవేత్తలు, రాజకీయవాదులు ఆరల్ సముద్రజలాలను పత్తిపంటకు ఉపయోగించడానికి మార్గదర్శకం వహించారు. [ఆధారం చూపాలి] ఆరల్ సముద్రతీరంలో ఉజ్బెకిస్థాన్ లోని కరకల్పక స్థాన్ ప్రాంతంలో అధిక శాతం ఉప్పు, కలుషిత మట్టి విస్తరుంచి ఉంది. దేశంలోని జలవనరులలో అత్యధికశాతం వ్యవసాయానికి ఉపకరించబడుతున్నాయి. వ్యవసాయానికి 84% జలాలు ఉపకరించడం కారణంగా సముద్రజలాలలో ఉప్పు శాతం అధికరిస్తుంది. పత్తిపంట పెరగడానికి క్రిసంహారకాలు, ఎరువులు పెద్ద మొత్తంలో ఉపయోగించడం మట్టి కాలుష్యానికి కారణం ఔతుంది. [22] ఉజ్బెకిస్థాన్‌లోని " యు.ఎన్.డి.పి క్లైమేట్ రిస్క్ మేనేజిమెంట్ " దేశం పర్యావణాన్ని చదిద్దాలని అభిలషిస్తుంది.[26]

రాజకీయాలు

The Legislative Chamber of the Supreme Assembly (Lower House).
Islam Karimov, president of Uzbekistan, during a visit to the Pentagon in 2002.

1991లో సోవియట్ యూనియన్ నుండి ఉజ్బెకిస్థాన్‌కు స్వాతంత్ర్యం లభించిన తరువాత నిర్వహించిన ఎన్నికలలో ఇస్లాం కరిమోవ్ ఉజ్బెకిస్థాన్ అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు. 2009 డిసెంబరులో 27లో ఉభయసభలకు నిర్వహించబడిన ఎన్నికల తరువాత 150 మంది సభ్యులు కలిగిన ఓలి మజిల్స్, ది లెజిస్లేటివ్ చాంబర్, 100 మంది సభ్యులు కలిగిన సెనేట్ 5 సంవత్సరాల క్రమంలో ఏర్పాటు చేయబడ్డాయి. రెండవ ఎన్నికలు 2004-05 లో నిర్వహించబడ్డాయి. 2004లో ది ఓలి మజిల్స్ సమఖ్యసభగా ఉండేది. 1994 లో సభ్యులసంఖ్య 69, 2004-05 లో 120, ప్రస్తుతం సఖ్య 150. 2007 డిసెంబరు పార్లమెంటు చట్టం (రిఫరెండంతో) ఇస్లాం కరిమోవ్ పదవీకాలం పొడిగించబడింది. పలువురు అంతర్జాతీయ అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిరాకరించారు. వారు ఫలితాకి ఆమోదముద్ర తెలుపలేదు. 2002 డిసెంబరు రిఫరెండం ఉభయసభల (పార్లమెంటు ఎగువసభ (ఓలి మజిల్స్ ), దిగువ సభ (సెనేట్)) కొరకు ప్రణాళిక రూపొందించింది. దిగువసభ సభ్యులు పూర్తిసమయ లెజిస్లేటివ్లుగా పనిచేస్తారు. దిసెంబర్ 26న ఉభయసభలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి.

మానవహక్కులు

ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ రాజ్యాంగం ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ డెమొక్రసీ " కామన్ హ్యూమన్ ప్రిన్సిపల్ " ఆధారంగా నిర్మితమైనదని దృఢంగా చెప్తుంది.[27] ఉజ్బెకిస్థాన్ తన పౌరునికి రక్షణ, విశ్వసనీయమైన మానవహక్కులు కలిగిస్తుంది. ఉజ్బెకిస్థాన్ అధిక మానవీయ సాంఘిక రూపకల్పనకు చట్టలలో మరిన్ని మార్పులు చేస్తూ ఉంది. 300 చట్టాలకంటే అధికంగా పౌరుల హక్కులు, ఆధారభూతమైన స్వతంత్రం సంరక్ష ణకొరకు రూపొందించబడ్డాయి. [28] 2005 ఆగస్టు 2 అధ్యక్షుడు ఇస్లాం కరిమొవ్ ఉజ్బెకిస్థాన్‌లో 2008 జనవరి1 నుండి మరణశిక్షను రద్దుచేస్తూ సంతకం చేసాడు .[29]

Old Uzbek man from central Uzbekistan.

ప్రభుయ్వేతర సేవాసంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ డాగ్స్, ఇంటర్నేషనల్ హెల్సింకీ ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, కౌంసిల్ ఆఫ్ ది యురేపియన్ యూనియన్ " ఉజ్బెకిస్థాన్ పరిమిత పౌరహక్కులను కలిగి ఉన్న నిరంకుశ దేశంగా " నిర్వచించాయి. [30] అలాగే వారు " ఉజ్బెకిస్థాన్‌లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని" ఆందోళన వెలిబుచ్చారు.[31]నివేదికలను అనుసరించి పెద్ద ఎత్తున హింస, దౌర్జన్యం, అక్రమ నిర్బంధం, స్వతంత్రాన్ని నిరోధించే పలు చర్యలు సంభవించాయని తెలియజేస్తున్నాయి. మతం, ఉపన్యాసాలు, మాధ్యమాలు,సమావేశాలు, సభానిర్వహణ మొదలైన వాటి మీద నిర్ధంధాలు ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం గ్రామీణ స్త్రీలకు బలవంతపు స్టెరిలైజేషన్ మంజూరు చేసిందని భావిస్తున్నారు.[32][33] మతసంస్థల సభ్యులు, స్వతంత్ర పత్రికాసంపాదకులు, హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలకు వ్యతిరేకంగా దౌర్జన్యం చేయడం, నిరోధ చర్యలు తీసుకోవడం పతిపక్ష పార్టీ సభ్యుల మీద నిషేధం విధించడం మొదలైన మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని నివేదికలు తెలియజేస్తున్నాయి." 2005 సివిల్ అంరెస్ట్ ఇన్ ఉజ్బెకిస్థాన్ " సంఘటనలో 100 మంది ప్రజలు మరణించారు. ఉజ్బెకిస్థాన్ మానవహక్కుల చరిత్రలో ఇది ఒక గుర్తించతగిన సంఘటనగా భావించబడుతుంది.[34][35][36] మానవహక్కుల ఉల్లంఘన విషయంలో ఆందోళన కనబరుస్తూ స్వతంత్రంగా పరిశోధన చేయడానికి యునైటెడ్ స్టేట్స్, ఉరేపియన్ యూనియన్, ది యునైటెడ్ నేషన్స్, ది ఒ.ఎస్.సి.ఇ చైర్నన్ - ఇన్- ఆఫీస్, ది ఒ.ఎస్.సి.ఇ ఆఫీస్ ఫర్ డెమొక్రటిక్ ఇంస్టిట్యూషంస్, హ్యూమన్ రైట్స్ అభ్యర్ధన చేసుకున్నాయి.

ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం పౌరుల హాక్కులను నిరాకరించడం, చట్టవిరోధంగా మానవ హక్కుల ఉల్లంఘన చేయడం, ప్రతిస్పందన తెలియజేయడానికి స్వతంత్ర నిరోధం, సభానిర్వహణా స్వతంత్రనిరోధం మొదలైన ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది.[37][38]

నిర్వహణా విభాగాలు

ఉజ్బెకిస్థాన్ 12 పాలనా విభాగాలుగా విభజించబడింది (విలోయత్లర్ ఏకవచనంలో విలోయత్), ఒక అటానిమస్ రిపబ్లిక్ (రెప్పబ్లిక), ఒక స్వతంత్ర నగరం (షహర్) ఉన్నాయి.

Political Map of Uzbekistan
విభాగంరాజధాని నగరంఏరియా
(km²)
జనసంఖ్య (2008)![39] Key
అండిజన్ రీజియన్
అండిజన్ రీజియన్
అండియన్
అండియన్
4,2002,477,9002
'బుఖారా రీజియన్
బుక్ష్సొరొ విలోయతి
బుఖారా
బుక్సొరొ
39,4001,576,8003
'ఫర్గన రీజియన్
ఫర్గొన విలోయతి
ఫర్గొన
ఫర్గొన
6,8002,997,4004
'జిజ్జాఖ్ రీజియన్
జిజ్జాక్ విలోయతి
జిజ్జాక్
జిజ్జాక్
20,5001,090,9005
కరకల్పక్‌ స్థాన్ రిపబ్లిక్
కరకల్పక్ భాష : క్వరక్వల్పక్వస్థాన్ రెస్పబ్లికసి ʻ
ఉజ్బెక్ భాష : క్వొరక్వల్పగ్ రెస్పబ్లికసి
నుకుస్
నొక్స్
నుకుస్
160,0001,612,30014
క్వాష్క్వడర్యో రీజియన్ (కష్కడరియా రీజియన్)
క్వాష్క్వడర్యొ విలొయతి
క్వర్షికర్షి
క్వర్షి
28,4002,537,6008
క్సొరజ్ం రీజియన్
క్సొరజ్ం విలొయతి
ఉర్గెంచ్
ఉర్గెంచ్
6,300 1,517,60013
నమంగన్ రీజియన్
నమంగన్ విలోయతి
నమంగన్
నమంగన్
7,9002,196,2006
నవియి రీజియన్
నవొయి విలొయతి
నవొయి
నవొయి
110,800834,1007
సమర్ఖండ్ రీజియన్
సమఖండ్ విలొయతి
సమర్ఖండ్
సమర్ఖండ్
16,400 3,032,0009
సుర్క్సొడర్యొ రీజియన్
సుర్క్సొడర్యొ వొలోతి
టెర్మెజ్
టెర్మెజ్
20,8002,012,60011
సిడర్యొ రీజియన్
సిర్యొ విలోతి
గులిస్టన్
గులిస్టన్
5,100698,10010
తాష్కెంట్ నగరం
తాష్కెంట్ షహ్రి
తాష్కెంట్
తాష్కెంట్
3352,352,9001
తాష్కెంట్ రీజియన్
తాష్కెంట్ విలోయతి
తాష్కెంట్
తాష్కెంట్
15,300 2,537,50012

తాష్కెంట్ విలోయతి గణాంకాలలో తాష్కెంట్ నగరం గణాంకాలు చేర్చబడ్డాయి.

ప్రొవింసెస్ అదనంగా జిల్లాలు (తుమన్) లుగా విభజించబడ్డాయి.

గణాంకాలు

Newlywed couples visit Tamerlane's statues to receive wedding blessings.
Uzbek children

ఉజ్బెకిస్థాన్ మద్య ఆసియాలో అత్యంత జనసాంధ్రత కలిగిన దేశంగా భావించబడుతుంది. దేశ జనాభా 3,10,25,500.[40] 2008 గణాంకాలను అనుసరించి ఉజ్బెకిస్థాన్‌లో 14 వయసు లోబడినవారు 34.1% ఉన్నారు.[1] 1996 అధికారిక ఆధారాలను అనుసరించి ఉజ్బెకియన్లు 80% ఉన్నారని భావిస్తున్నారు. రష్యన్లతో కలిసి ఇతర సంప్రదాయానికి చెందినవారు 5.5%, తజిక్ ప్రజలు5%, కరకల్ప్కాలు 3%, తాతార్లు 1.5% ఉన్నారు.[1] తజిక్ ప్రజలసంఖ్య గురించిన అభిప్రాయభేదాలు ఉన్నాయి. తజిక్ సంఖ్య తగ్గించబడిందని వారు 20-30% ఉండవచ్చని పశ్చిమదేశీయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.[41][42][43][44] ఉజ్బెకీయులు మద్య ఆసియాకు చెందిన టర్కో- పర్షియన్ ప్రజలతో (సార్ట్) మిశ్రితం అయ్యారు. ప్రస్తుతం ఉజ్బెకీయులు తమ పూర్వీకం మగోలీయులు, ఇరానీయులు అని తెలుపుతున్నారు. [45] ఉజ్బెకిస్థాన్‌లో కొరియన్ సంప్రదాయానికి చెందిన ప్రజలు ఉండేవారు. వీరు 1937-38 లలో స్టాలిన్ చేత బలవంతంగా సోవియట్ యూనియన్ నుండి వెలుపలికి పంపబడ్డారు. ఉజ్బెకిస్థాన్‌లో తాష్కెంట్, సమర్ఖండ్ ప్రాంతంలో స్వల్పసంఖ్యలో అమెరికన్ ప్రజలు ఉన్నారు. దేశంలో 88% ముస్లిములు ఉండగా వీరిలో అత్యధికులు సున్నీ ముస్లిములు, 5% షియా ముస్లిములు ఉన్నారు, 9% ఈస్టర్న్ ఆర్థడాక్స్, 3% ఇతరమతాలకు చెందినవారు ఉన్నారు. ది యు.ఎస్ స్టేట్ డెవెలెప్మెంటు ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం రిపోర్ట్ (2004) 0.2% బౌద్ధులు (కొరియన్ సంప్రదాయ ప్రజలు) ఉన్నారని రెలియజేస్తుంది. ఉజ్బెకిస్థాన్ లోని బుకారాలో నివసిస్తున్న యూదులు వేలాది సంవత్సరాలుగా నివసిస్తున్నారని భావిస్తున్నారు. 1989 గణాంకాలను అనుసరించి ఉజ్బెకిస్థాన్‌లో 94,900 మంది యూదులు నివసిస్తున్నారని భావిస్తున్నారు.[46] 1989 గణాంకాలను అనుసరించి యూదులు 5% ఉండేవారని సోవియట్ యూనియన్ పతనం చెందిన తరువాత యూదులు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఇజ్రేల్‌కు వెళ్ళారు. 2007 నాటికి ఉజ్బెకిస్థాన్‌లో 5000 మంది యూదులు మాత్రమే నివసిస్తున్నారని అంచనా.[47] ఉజ్బెకిస్థాన్‌లో రష్యన్లు 5.5% ఉన్నారు. సోవియట్ కాలంలో తాష్కెంటులో రష్యన్లు, ఉజ్బెకీయులు సరిసమానంగా ఉండేవారు.[48]1970 గణాంకాలను అనుసరించి దేశంలో 1.5 మిలియన్ల రష్యన్లు ఉన్నారని (12%) అంచనా.[49] సోవియట్ యూనియన్ పతనం తరువాత గణనీయమైన రష్యన్లు ఆర్థికప్రయోజనాల కొరకు ఇక్కడ నుండి తరలి వెళ్ళారు. [50]1940లో క్రిమియన్ తాతర్లు, వోల్గా జర్మన్లు, చెచెన్లు, పొంటిక్ గ్రీకులు, కుమాక్స్, పలు ఇతర జాతీయులు మద్య ఆసియాకు తరిలి వెళ్ళారు.[51] 1,00,000 క్రిమియన్ తాతర్లు ఉజ్బెకిస్థాన్‌లో నివసిస్తున్నారు.[52] తాష్కెంటులోని గ్రీకులు 1974 లో 35,000 ఉండగా 2004 నాటికి వీరి సంఖ్య 12,000 కు చేరుకుంది. .[53] మాస్కెటియన్ తుర్కులు 1989 ఫర్గన హిసాత్మక చర్యల తరువాత దేశం వదిలి వెళ్ళారు.[54] ఉజ్బెకిస్థాన్ లోని 10% శ్రామికులు విదేశాలలో (అధికంగా రష్యా, కజక్ స్థాన్) లో పనిచేస్తున్నారు. [55]2003 గణాంకాలను అనుసరించి ఉజ్బెకిస్థాన్ అక్షరాస్యత 99.3% .[1] ఈ సాధన సోవియట్ యూనియన్ విద్యావిధానం కారణంగా సంభవించింది.

మతం

Shakh-i Zindeh mosque, Samarkand.
Mosque of Bukhara.

2009లో యు.ఎస్ స్టేట్ డిపార్ట్మెంటు విడులల చేసిన వివేదిక అనుసరించి ఉజ్బెకిస్థాన్‌లో ఇస్లాం ఆధిక్యత కలిగి ఉంది. దేశంలో ముస్లిములు 90%, రష్యన్లు 5%, ఆర్థడాక్స్ 5% ఉన్నారు.[56] అయినప్పటికీ " 2009 ప్యూ రీసెర్చ్ సెంటర్ " నివేదిక ఉజ్బెకిస్థాన్‌లో 96.3% ముస్లిములు ఉన్నారని తెలియజేస్తుంది.[57] ఒకప్పుడు దేశంలో 93,000 యూదులు ఉన్నారని భావిస్తున్నారు.[58] ఉజ్బెకిస్థాన్ ఇస్లాం దీర్ఘకాలంగా ఆధిక్యతలో ఉన్నప్పటికీ గతంలో ఈ ప్రాంతంలో పలు మతాలు ఆచరించబడ్డాయి. [58] 54% ప్రత్యేకత ప్రతిపాదించబడని ముస్లిములు, 18% సున్నీ ముస్లిములు, 1% షియా ముస్లిములు ఉన్నారు. [59] ఉజ్బెకిస్థాన్‌లో సోవియట్ శక్తి ముగింపుకు వచ్చిన తరువాత హేతువాదం స్థానంలో మతావలంబన చోటుచేసుకుంది.

యూదులు

2000 సంవత్సరాలకు ముందు యూదులు ఈ ప్రాంతంలో స్థిరపడడం ఆరంభం అయింది. 2000 సంవత్సరాలకు ముందు బాబిలోనియన్లు యూదులను ఇజ్రేల్ నుండి తరిమివేసిన తరువాత యూదులు ఇక్కడ స్థిరపడ్డారు. సిల్క్ రోడ్డు పరిసరాలలో నివసిస్తున్న యూదుల మీద ఇతర సంప్రదాయాలు దృష్టి కేంద్రీకరించాయి. యూదులు ఇక్కడకు వచ్చిన తరువాత 1,500 పూర్వం పర్షియన్ల వేధింపుకు గురైయ్యారు.

యూదులు పలు శతాబ్దాలుగా సమయాలలో పాలకుల వలన సంభవించిన కష్టనష్టాలను సహిస్తూ వర్ధిల్లారు. 14వ శతాబ్దంలో తమర్లనే పాలనాకాలంలో సమర్ఖండ్ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆ కారణంగా సమఖండ్ యూదుల ప్రధాన కేంద్రం అయింది. తమర్లనే మరణించిన తరువాత యూదులు ముస్లిముల తీవ్రమైన శతృత్వం, కఠిన నియమాలు,యూదులు ఊరికి వెలుపల యూదుల క్వార్టర్లలో మాత్రమే నివసించాలన్న నిబంధనలు వంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. యూదుల ద్వారాలు, దుకాణాలు ముస్లిముల కంటే దిగువన ఉండాలన్న నిబంధన ఉండేది. యూదులు నల్లటి టోపీలు, కార్డ్ బెల్టు ధరించాలన్న నియమంతో యూదుల వాదన సభలలో చెల్లుబాటు కాకూడదన్న నియమం ఉండేది. [60]

1868లో ఈ ప్రాంతం రష్యన్ల ఆధీనంలోకి మారిన తరువాత యూదులకు ప్రాంతీయ పౌరులకు సమానహక్కులు ఇవ్వబడ్డాయి. ఆ సమయంలో సమఖండ్ ప్రాంతంలో 50,000 మంది యూదులు, బుఖారా ప్రాంతంలో 20,000 మంది యూదుకు ఉన్నారని భావిస్తున్నారు. 1997లో రష్యన్ తిరుగుబాటు తరువాత సోవియట్ పాలన ఆరంభం అయిన తరువాత యూదుల మతజీవితం మీద షరతులు విధించబడ్డాయి. 1935 నాటికి 35 సినగోగ్యులలో ఒక్కరు మాత్రమే సమర్ఖండ్‌లో ఉన్నా డు. అయునప్పటికీ సోవియట్ శకంలో కమ్యూనిటీ జీవితం రహస్యంగా కొనసాగింది. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో సోవియట్ యూనియన్‌కు చెందిన యురేపియన్ ప్రాంతాల నుండి లక్షలాది యూదులు (స్టాలిన్ చేత బహిస్కరించ బడినవారు) ఉజ్బెకిస్థాన్‌కు శరణార్ధులుగా చేరుకున్నారు. 1970 నాటికి ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్‌లో 1,03,000 మంది యూదులు నమోదు అయ్యారు.[60]1980లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ధ్వంసం చేయబడిన ప్రాంతాలలో యూదుల అండిజాన్ క్వార్టర్ ఒకటి. తరువాత యూదులు అధికంగా ఇజ్రేల్, యు.ఎస్ కు వలస వెళ్ళారు. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో కొన్ని వేలమంది యూదులు మాత్రమే నివసిస్తున్నారు. తాష్కెంటులో 7000 మంది, బుఖారాలో 3000, సంర్ఖండులో [61]

భాషలు

A page in Uzbek language written in Nastaʿlīq script printed in Tashkent 1911

ఉజ్బెకిస్థాన్‌లో ఉజ్బెకీ భాష మాత్రమే అధికారభాషగా ఉంది.[62] 1992 దీనీని వ్రాయడానికి అధికారికంగా లాటిన్ లిపిని వాడుతున్నారు. తజిక్ సంప్రదాయ ప్రజలు అధికంగా నివసిస్తున్న బుఖారా, సమర్ఖండ్ నగరాలలో తజిక్ భాష అధికంగా వాడుకలో ఉంది.[41] తజిక్ భాష కాసన్, చస్ట్,ఫర్గన నదీతీరంలో ఉన్న రిష్టన్ లోయ, అహంగరన్, మిడిల్ సిర్ దర్యాలోని బఘిస్తాన్, షహ్రిషబ్జ్, కితాబ్, కఫిరింగన్, చగనియన్ నదీ లోయ ప్రాంతాలలో అధికంగా వాడుకలో ఉంది. ఉజ్బెకిస్థాన్ జనసంఖ్యలో 10-15% ప్రజలలో తజికిభాష వాడుకలో ఉంది.[41][42][43] టర్కిక్ భాషలలో ఒకటైన కరకల్పక్ భాష (కజక్ భాషకు సమీపంలో ఉంటుంది) కరకల్పక్స్థాన్ రిపబ్లిక్‌లో వాడుకభాషగా, అధికారిక భాషగా ఉంది.

రష్యన్ భాష సంప్రదాయక ప్రజల వాడుక భాషగా ఉంది. ప్రత్యేకంగా నగరాలలో సాంకేతిక, సైంటిఫిక్, ప్రభుత్వ, వ్యాపార అవసరాలకు రష్యన్ భాష వాడుకలో ఉంది. రష్యన్ భాష 14% ప్రజలకు వాడుక భాషగా ఉంది. రష్యన్ భాష అత్యధికులకు ద్వితీయభాషగా వాడుకలో ఉంది. గ్రామీణప్రాంతాలలో రష్యన్ భాష మితంగానే వాడుకలో ఉంది. ప్రస్తుతం నగరప్రాంత విద్యార్థులలో కూడా రష్యన్ భాషానైపుణ్యం తక్కువగా ఉంది. 2003 గణాంకాలను అనుసరించి దాదాపు సగంకంటే అధికంగా రష్యాభాషను మాట్లాడే, అర్ధం చేసుకునే శక్తి కలిగి ఉన్నారు. ఉజ్బెకిస్థాన్, రష్యాల మద్య ఉన్న స్నేహపూరిత రాజకీయ వాతావరణం కారణంగా అధికారిగా రష్యాన్ భాష పట్ల నిర్లక్ష్యం వహించడం వదిలి వేయబడింది. [63]1920కి ముందు ఉజ్బెకిస్థాన్ వ్రాతభాషను టర్కీ (పశ్చిమ శాస్త్రవేత్తలు చగటే అంటారు) ఉజ్బెకిస్థాన్ వ్రాయడానికి నస్తా'లీక్వి లిపిని ఉపయోగించారు. 1926లో లాటిన్ అక్షరాలు ప్రవేశపెట్టబడి 1930 వరకు పలు మార్పులకు గురైంది. సోవియట్ ప్రభుత్వం సిరిలిక్ లిపిని ప్రవేశపెట్టింది. సోవియట్ పతనం అయ్యే వరకు సిరిలిక్ భాష వాడుకలో ఉండేది. 1933లో ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం లాటిన్ భాషను తిరిగి ప్రవేశపెట్టింది. 1996లో లాటిన్ ఆధినీకరణ చేయబడి 2005 నుండి పాఠశాలలో సైన్సు బోధించడానికి వాడుకలో ఉంది.[64] పలు గుర్తులు, నోటిసులు (వీధులలోని అధికారిక ఫలకాలు కూడా) ఉజ్బెకి సిరిలిక్ లిపిలో వ్రాయబడుతున్నాయి. [ఆధారం చూపాలి].

ఆర్ధికం

Tashkent
Samarkand

బంగారు నిలువకలిగిన దేశాలలో ఉజ్బెకిస్థాన్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఉజ్బెకిస్థాన్ నుండి వార్షికంగా 80 టన్నుల బంగారాన్ని వెలికితీస్థుంది. ఉజ్బెకిస్థాన్ రాగి నిల్వలు ప్రపంచంలో 10వ స్థానంలో, యురేనియం నిల్వలు ప్రపంచంలో 12వ స్థానంలోనూ ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ యురేనియం ఉత్పత్తి అంతర్జాతీయంగా 7వ స్థానంలో ఉంది. [65][66][67] ది ఉజ్బెకి నేషనల్ గ్యాస్ కంపెనీ, ఉజ్బెక్నెఫ్త్‌గ్యాస్, గ్యాస్ 60 నుండి 70 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తితో అంతర్జాతీయంగా 11వ స్థానంలో ఉన్నాయి. .[ఆధారం చూపాలి] దేశంలో గుర్తించబడని ఆయిల్, సహజవాయు నిల్వలు ఉన్నాయి: ఉజ్బెకిస్థాన్‌లో 194 హైడ్రోకార్బన్ ఉన్నాయి. వీటిలో 98 కండెంసటే, సహజవాయు నిల్వలు, 96 కండెంసతే నిలువలు ఉన్నాయి. [ఆధారం చూపాలి]

ఉజ్బెకిస్థాన్ పెద్ద సంస్థలలో ఉజ్బెకిస్థాన్ ఎనర్జీ సెక్టర్‌కు చెందిన చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ (సి.ఎన్.పి.సి), పెట్రోనస్, ది కొరియా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, గజ్‌ప్రొం, లుకొయిల్, ఉజ్బెకిస్థానెఫ్తెగ్యాస్ ప్రధానమైనవి. [ఆధారం చూపాలి]" కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంస్ స్టేట్స్ " (సి.ఐ.ఎస్ ఎకనమీ)లతో ఉజ్బెకిస్థాన్ ఎకనమీ మొదటి సంవత్సరంలో పతనం అయింది. ఉజ్బెకిస్థాన్ విధానంలో మార్పులు, సంస్కరణలు మొదలైన ఏకీకృత ప్రయత్నం కారణంగా 1995 తరువాత ఉజ్బెకిస్థాన్ ఎకనమీ కోలుకున్నది. [ఆధారం చూపాలి] 1998, 2003 మద్యకాలంలో వార్షికంగా 4% అభివృద్ధి తరువాత 7-8% అభివృద్ధితో ఉజ్బెకిస్థాన్ ఆర్థికరంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఐ.ఎం.ఎఫ్ నివేదిక అనుసరించి [68] 2008 ఉజ్బెకిస్థాన్ జి.డి.పి దాదాపు రెండింతలు అయింది. 2003 నుండి వార్షిక ద్రవ్యోల్బణం 10%ని కంటే తక్కువగా ఉంది. [ఆధారం చూపాలి]ఉజ్బెకిస్థాన్ వార్షిక జి.ఎన్.ఐ తలసరి (1,900 అమెరికన్ డాలర్లు. కొనుగోలు శక్తి (2013) 3,800 అమెరికన్ డాలర్లు).[69] ఉత్పత్తి కమ్మోడిటీల మీద కేంద్రీకృతం చేయబడింది. ఉజ్బెకిస్థాన్ పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలో 7వ స్థానంలో ఎగుమతిలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది.[70] అలాగే బంగారు ఉత్పత్తిలో ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఉజ్బెకిస్థాన్ గణనీయంగా సహజవాయు ఉత్పత్తి, బొగ్గు, రాగి, ఆయిల్, వెండి, యురేనియం ఉత్పత్తి చేస్తుంది.[71]

వ్యవసాయం

ఉజ్బెకిస్థాన్ వ్యవసాయం 26% శ్రామికులకు ఉపాధి కల్పిస్తూ 18% జి.డి.పి అభివృద్ధికి సహకరిస్తుంది.[21] వ్యవసాయ భూములు 4.4 మిలియన్లు (10%) ఉన్నాయి. [1] పత్తి పంట కోత సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటికీ వేతనరహిత ఉపాధ్యాయులుగా వ్యవసాయభూములలో పనిచేయడానికి తరలించబడుతుంటారు.[72] ఉజ్బెకిస్థాన్ పత్తిని దక్షిణకొరియాలో బ్యాంక్ పత్రాలను తయారుచేయడానికి ఉపయోగిస్తుంటారు.[73] ఉజ్బెకిస్థాన్‌లో బాలకార్మికులు టెస్కో మొదలైన పలు సంస్థలలో పనికి నియమించబడుతున్నారు.[74] చి.ఎ.[75] మార్క్స్ & స్పెంసర్, గాప్, హెచ్&ఎం. సంస్థలు ఉజ్బెకిస్థాన్ పత్తిని బహిష్కరించాయి. [76]

ఆర్ధిక సంస్కరణలు

స్వతంత్రం వచ్చిన తరువాత ఆర్థికసవాళ్ళను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. దిగుమతులు తగ్గించడం, సరిపడిన విద్యుదుత్పత్తి స్వయంగా సాధించడం సంస్కరణలలో చోటుచేసుకున్నాయి. 1994 నుండి విజయవంతమైన " ఉజ్బెకిస్థాన్ ఎకనమిక్ మోడెల్ " గురించి ప్రభుత్వ మాధ్యమాలు ప్రకటిస్తున్నాయి. [77] ఆర్థిక స్థబ్ధత, దిగ్భ్రాంతి, పౌపరిజం (భిక్షమెత్తడం) కంటే సంకరణలు చక్కని మార్గమని కూడా ప్రకటించింది. క్రమమైన ఆర్థిక సంస్కరణ వ్యూహం స్థూల ఆర్థిక సంస్కరణలు, నిర్మాణాత్మకమైన సంస్కరణలను పక్కకు నెట్టింది. ప్రభుత్వం మీద సరికొత్తగా బ్యూరోక్రసీ ప్రభావం అధికరించింది. దేశంలో లంచగొండితనం వేగవంతంగా అధికరించింది. 2005 ఉజ్బెకిస్థాన్ లంచగొండితనం అంతర్జాతీయంగా 159 దేశాలలో 137 వ స్థానంలో ఉంది. 2007 ఉజ్బెకిస్థాన్ లంచగొండితనం అంతర్జాతీయంగా 179 దేశాలలో 175 వ స్థానంలో ఉంది. దేశంలోని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ పత్తి, బంగారం, మొక్కజొన్న, గ్యాస్ ఉతపత్తి ద్వారా ఆదాయాన్ని అధికరించ్చని సలహా ఇచ్చింది.[78] సమీపకాలంలో ఉన్నత స్థాయి లంచం సంబంధిత మోసాలు ప్రభుత్వం,స్టెల్లా సొనెరియా మొదలైన అంతర్జాతీయ సంస్థల ఒప్పందాల మీద ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఉజ్బెకిస్థాన్ లోని లంచగొండితనం మోసాల కారణంగా వ్యాపారం బాధించపడుతుందని భావిస్తున్నాయి.[79] ఎకనమిస్ట్ ఇంటెలిజెంస్ యూనిట్ నివేదిక అనుసరించి ప్రభుత్వం ప్రైవేట్ రంగం అభివృద్ధికి వ్యతిరేకంగా ఉందని తెలియజేస్తుంది.[80] ఉజ్బెకిస్థాన్ విదేశీ పెట్టుబడులను తిప్పి కొడుతున్నారు. సి.ఐ.ఎస్ లో తలసరి లోయస్టుగా ఉంది.[81] ఉజ్బెకిస్థాన్‌లో ప్రవేశిస్తున్న సంస్థలు ఉజ్బెకిస్థాన్ మార్కెట్‌లో కరెంసీ మార్పిడి చేయడం శ్రమతోకూడుకున్న పని అని తెలియజేస్తున్నాయి.[82]

ద్రవ్యోల్భణం

ఉజ్బెకిస్థాన్ స్వతంత్రం పొందిన తరువాత 1992-1994 అనియత్రిత ద్రవ్యోల్బణం (1000%)ఎదుర్కొన్నది. ఐ.ఎమెఫ్ పర్యవేక్షణలో క్రమపరిచే విధానాలు చేపట్టింది.[83] 1997 నాటికి ద్రవ్యోల్బణం 50% తీసుకువచ్చింది. 2002 నాటికి 22% వచ్చింది. 2003 వార్షిక ద్రవ్యోల్బణం 10%,[68] నిర్భంధమైన ఆర్థిక విధానాల ఫలితంగా 2004లో ద్రవ్యోల్భణం 3.8% నికి చేరుకుంది. [84] 2006 నాటికి 6.9%, 2007 నాటికి 7,6% ఉంది. [85]

దిగుమతి విధానాలు

ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం విదేశీ దిగుమతులను పలు మార్గాలలో కట్టిదిట్టం చేసింది. అధికమైన దిగుమతి సుంకం అందులో ఒకటి. ప్రాంతీయ ఉత్పత్తులను సంరక్షించడానికి ఎక్సిజ్ డ్యూటీ వివక్షాపూతితంగా అత్యధికంగా ఉంటుంది. అధికారిక అనధికార పన్నులు మిశ్రితమై ఉంటాయి. ఈ కారణంగా వస్తువుల ధరలు 100 నుండి 150% అధికరిస్తుంటాయి. అందువలన దిగుమతి వస్తువులు ప్రజలకు అందుబాటులోకి రావడం శ్రమతో కూడుకున్నది.[86] దిగుమతి ప్రతిబంధన అధికారింగా ప్రకటించబతూ ఉంది. పలు సి.ఐ.ఎస్ సంస్థలు అధికారిక ఉజ్బెకిస్థాన్ దిగుమతి సుంకాలను తప్పించుకుంటున్నది. అత్యావసర వస్తువుల దిగుమతికి ప్రభుత్వం పన్నురాయితీ ప్రకటిస్తుంది.

స్టాక్ మార్కెట్

1994లో ది తాష్కెంటు స్టాక్ ఎక్స్‌చేంజ్ (రిపబ్లికన్ స్టాక్ ఎక్స్‌చేంజ్) ప్రారంభించబడింది. ఉజ్బెక్ జాయింట్ స్టాక్ కంపెనీలు (1250) మొత్తం షేర్లు ఆర్.ఎస్.సిలో విక్రయించబడుతుంటాయి. 2013 జనవరి నాటికి స్టాక్ మార్కెట్టులో నమోదైన సంస్థల సంఖ్య 119. 2012 సెక్యూరిటీల మార్కెట్ విలువ 2 ట్రిలియన్లు. సంస్థల ఆసక్తి అధికరించడం కారణంగా ఈ సఖ్యలో అభివృద్ధి కనిపిస్తుంది. సెంట్రల్ డిపాజిటరీ నివేదిక అనుసరించి 2013 సెక్యూరిటీల మార్కెట్ విలువ 9 ట్రిలియన్లకు చేరుకుంది. 2003 నుండి ఉజ్బెకిస్థానార్ధికరంగం శక్తివంతంగా మారింది. [ఆధారం చూపాలి] అందుకు ప్రపంచ మార్కెట్తులో అధికరించిన బగారం, పత్తి ధరలు, అభివృద్ధి చేయబడిన సహజవాయువు, ఎగుమతులను అధికరించడం, విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య అధికరించడం సహకరిస్తున్నాయి. ప్రస్తుతం దేశజి.డి.పి మిగులు 9%-11% (2003-2005) ఉంది. విదేశీ మారకం, బంగారం నిలువలు రెండింతలు (3 బిలియన్ అమెరికన్ డాలర్లు) అయింది. [ఆధారం చూపాలి] 2010 విదేశీమారకం 10 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. [87] హెచ్.ఎస్.బి.సి. బ్యాంక్ సర్వే అనుసరించి ఉజ్బెకిస్థాన్ ఆర్థికరగం తరువాతి దశాబ్ధాలలో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికరంగాలలో ఒకటిగా (మొదటి 26 ) గుర్తించబడుతుంది.[88]

సంస్కృతి

Traditional Uzbek pottery.
Embroidery from Uzbekistan
Navoi Opera Theater in Tashkent

ఉజ్బెకిస్థాన్ పలు సంప్రదాయ, సాంస్కృతిక ప్రజల మిశ్రితం. వీరిలో ఉజ్బెకీయులు అధికంగా ఉన్నారు. 1995 71% ఉజ్బెకిస్థాన్ ప్రజలు ఉజ్బెకీయులే. అల్పసంఖ్యాకులలో ప్రధానులు రష్యన్లు (8%). తజికీలు (5-30%).[41][42][44][89] కజఖ్ ప్రజలు (4%), తాతర్ ప్రజలు (2.5%), కరకల్పకులు (2%) ఉన్నారు. ఉజ్బెకిస్థాన్ లోని ఉజ్బెకేతర ప్రజలు క్రమంగా క్షీణిస్తున్నారు. రష్యా, ఇతర అల్పసంఖ్యాక ప్రజలు ఉజ్బెకిస్థాన్ వదిలి సోవియట్ యూనియన్‌లోని ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.

ఉజ్బెకిస్థాన్ 1991లో స్వతంత్రదేశం అయింది. దేశంలో ముస్లిం ఛాందసవాదం విస్తరిస్తుందని కొందరు ఆదోళన చెందుతున్నారు. దేశం మతస్వతంత్రం ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉందని భావిస్తున్నారు. 1994లో ఉజ్బెకిస్థాన్ ప్రజలలో సగం మంది ముస్లిములున్నారు.

సంగీతం

Sevara Nazarkhan
Dance of a Bacha in Samarkand between 1905 and 1915
Westminster International University main building in Summer
Silk and Spice Festival in Bukhara

మద్య ఆసియన్ సంప్రదాయ సంగీతం షష్మక్వాం. ఇది 16వ శతాబ్దంలో బుఖారా ఆప్రాంతానికి రాజధానిగా ఉన్న సమయంలో నూతనంగా రూపొందించబడింది. షష్మక్వాం అజబైజని, ముగాం, ఉయుఘూర్ ముక్వాం సంగీతాలకు సామీప్యంలో ఉంటుంది. ఇందులో ఆరు ముక్వాములు (శాఖలు) ఉన్నందున ఈ సంగీతానికి ఈ పేరు వచ్చింది. ఇందులోని శాఖలు ఆరు పర్షియన్ సంప్రదాయ రీతులు శాఖలుగా ఉంటాయి. కచేరీలో మద్య మద్యలో సూఫీ కవిత్వం వచనరూపంలో చోటు చేసుకోవడం దీని ప్రత్యేకత.

వివాహాది శుభకార్యాలలో కూడిన సమయంలో ఈ కచేరీలు శ్రోతలను ఆనందింపజేయడం వలన ఉజ్బెకిస్థాన్‌లో ఫోల్క్- పాప్ శైలి కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉజ్బెకిస్థాన్ సంప్రదాయ సంగీతం పాప్ సంగీతానికీ మద్య ఎంతో వ్యత్యాసం కనిస్తుంది. పురుషులు సోలో సంగీతం వినడంలో ఆసక్తి కనబరుస్తారు. పురుషుల మద్య జరిగే ఉదయం, సాయంకాల సమయాలలో సంగీతం కచేరీలు చోటుచేసుకుంటుంది. సంప్రదాయ సంగీతంలో షాష్ మక్వం ప్రధానమైనది. దీనిని సంపన్నకుటుంబాల మద్దతు లభిస్తూ ఉంది. కొన్ని మార్లు రెండు భాషల మిశ్తితంగా పాటలు రూపొందించబడుతుంటాయి. కొన్ని మార్లు సంగీతంలో పద్యసాహిత్యం కూడా సంగీతంలో చోటుచేసుకుంటుంది. 1950లో ఫోల్క్ సంగీతానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇది రేడియో స్టేషన్లలో ప్రసారం చేయడం నిలిపివేయబడింది. దీనికి ఫ్యూడల్ సంగీతం అని పేరు మార్చి దీని మీద నిషేధం విధించబడింది. జానపద సాహిత్యం వారి స్వంతబాణిలో ప్రచారం చేయబడుతూనే ఉంది. పలువురు ఇది స్వతంత్రమైన అనుభూతిని అందిస్తుందని అభిప్రాయపడుతుంటారు. [ఆధారం చూపాలి]

విద్య

ఉజ్బెకిస్థాన్ అక్షరాస్యతా శాతం 99.3%. అయినప్పటికీ ప్రస్తుతం 15 సంవత్సరాలకు లోబడిన వారిలో 76% మాత్రమే పాఠశాలలో ప్రవేశించారు. 3-6 సంవత్సరాల బాలబాలికలు ప్రి స్కూల్‌లో 20% మాత్రమే హాజరు ఔతున్నారు. ఇది ఇంకా భవిష్యత్తులో క్షీణిస్తుందని భావిస్తున్నారు. విద్యార్థులు సోమవారం నుండి శనివారం వరకు పాఠశాలకు హాజర్ ఔతుంటారు. 9వ సంవత్సర విద్యాసంవత్సరంతో మాధ్యమిక విద్య ముగుస్తుంది. మాద్యమిక విద్య తరువాత వాణిజ్య, సాంకేతిక విద్యను అభ్యసిస్తారు. ఉజ్బెకిస్థాన్‌లో రెండు అంతర్జాతీయ పాఠశాలలు ఉన్నాయి. రెండూ తాష్కెంటులో ఉన్నాయి. అవి తాధ్కెంటు ఇంటర్నేషనల్ స్కూల్ కె- 12. ఇంటర్నేషనల్ కరికులం స్కూల్.

ఉజ్బెకిస్థాన్ విద్యావిధానం తీవ్రమైన లోటు బడ్జెట్ సమస్యను ఎదుర్కొంటుమ్న్నది.విద్యా చట్టవిధానంలో 1992 నుండి సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. అయినప్పటికీ భౌతిక విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. కరికులం రివిషన్ కూడా బలహీనంగా ఉంది. ఉపాద్యాయులకు ఇవ్వబడుతున్న తక్కువ స్థాయి జీతాలు ఇందుకు ప్రధాన కారణగా ఉన్నాయి. భవననిర్మాణం వంటి మౌలిక సదుపాయాలకు తగినంత వ్యయం చేయకపోవడం విద్యానాణ్యత లోపించడానికి మరొక కారణం. విద్యావిధానంలో లంచగొండితనం సంపన్నులు ఉపాధ్యాయులను, పాఠశాల అధికారులను ప్రలోభపెట్టి పాఠశాలలకు, పరీక్షలకు హాజరు కాకుండా హయ్యర్ గ్రేడు సాధించడానికి సహకరిస్తుంది. [90]

ఉజ్బెకిస్థాన్ విశ్వవిద్యాలయాలు వార్షికంగా 6,00,000 మంది పట్టభద్రులను తయారు చేస్తున్నాయి. తాష్కెంటు వెస్ట్ మినిస్టర్ యూనివర్శిటీ, ఇషా యూనివర్శిటీ తాధ్కెంటు ఆంగ్లమాధ్యమంలో విద్యాధ్యయనం చేయడానికి సహకరిస్తున్నాయి.

శలవు దినాలు

  • జనవరి 1: కొత్తసంవత్సరం. (యంగి యిల్ బయ్రమి).
  • జనవరి 14: డే ఆఫ్ డిఫెండర్స్ ఆఫ్ ది మదర్లాండ్. (వతన్ హిమొయచిలరి కుని).
  • మార్చి 8: ఇంటర్నేషనల్ వుమంస్ డే, (క్సల్క్వరొ క్సొటిన్ - క్విజార్ కుంజ్)
  • మార్చి 21: నైరుజ్ (నౌరొజ్ బయ్రమి).
  • మే 9: రొమెంబరెంస్ డే (క్సొతిర వ క్వాదిర్లాష్ కుంజ్.
  • సెప్టెంబరు 1: ఇండిపెండెంస్ డే (ముస్తక్విల్లిక్ కుంజ్).
  • అక్టోబరు 1: టీచర్స్ డే (ఓ' క్వితువ్చి వ మురబ్బియ్లర్).
  • 8 డెసెంబర్ : కాన్‌స్టిట్యూషన్ డే (కాన్‌స్టిట్యూషియా కుంజ్)

వైవిధ్యమైన తేదీ

  • రంజాన్
  • 70 రోజుల తరువాత క్వుర్బన్ హయిత్ ఈద్ అల్- అధ.

ఆహారసంస్కృతి

Palov
Uzbek manti

ఉజ్బెకి ఆహారసంప్రదాయం మీద ప్రాంతీయ వ్యవసాయప్రభావం అధికంగా ఉంది. ఉజ్బెకిస్థాన్‌లో ధాన్యం అధికంగా పండించబడుతుంది. అందువలన రొట్టెలు, నూడిల్స్ ఉజ్బెకీయుల ఆహారంలో అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఉజ్బెకీయుల ఆహారంలో నూడిల్స్ ఆధిక్యత వహిస్తుంది. దేశంలో గొర్రెలు విస్తారంగా ఉన్నందున ఆహారంలో మటన్ ప్రధాన మాంసాహారంగా ఉంది.

ఉజ్బెకిస్థాన్ చిహ్నంగా భావించబడుతున్న ఆహారం పులావ్. బియ్యం, మాంసం ముక్కలు, తురిమిన కేరెట్లు, ఎర్రగడ్డలు కలిపి తయారు చేయబడుతుంది. వివాహనిశ్చయం వంటి సందర్భాలలో అతిధులకు ఒషీ నహార్, నహార్ లేక మార్నింగ్ పులావ్ ప్రతి ఉదయం ఉదయపు అల్పాహారంగా (ఉదయం 6-8 గంటల మధ్య ) వడ్డించబడుతుంది. ఇతర ముఖ్యమైన ఆహారాలలో కొవ్వుతో చేర్చిన పెద్ద మాంసపు ముక్కలను (ప్రధానంగా మటన్), తాజా కూరగాయలు చేర్చి తయారుచేయబడే షుప్రా (షుర్వ్ లేక షొర్వ) అనే సూప్ ప్రధానమైనది. వీటిలో నర్యన్ సూప్, లాఘ్మన్ సూప్ ఉన్నాయి. నూడిల్స్ ఆధారిత వంటకాలు సూప్ లాగా లేక ప్రధాన ఆహారంగా కూడా అందించబడుతుంది. మంటి (డంప్లింగ్), చూచ్వర, సమోసా, స్టఫ్డ్ పొకెట్స్ చిరుతిండిగ లేక ప్రధాన ఆహారంగా తింటారు. కూరగాయలు, మాంసం కలిపి చేయబడిన డిమ్లమ, పలు కబాబులు సాధారణంగా ప్రధాన ఆహారంగా అందించబడుతుంది.

గ్రీన్ టీ జాతీయ వేడి పానీయం రోజంతా సేవిస్తుంటారు. టీ హౌసెస్ (చాయ్ ఖానా) సాంస్కృతిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. తాధ్కెంటులో బ్లాక్ టీకి ప్రాధాన్యత ఇస్తారు. అయినా గ్రీన్ టీ, బ్లాక్ టీలను పాలు, పంచదార లేకుండా సేవిస్తుంటారు. టీ సాధారణంగా ప్రధాన ఆహారంతో సేవించినా అతిథులకు మర్యాదాపూర్వకంగా గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ అందించడం అలవాటు. చల్లని యోగర్ట్ పానీయం అయ్రన్ వేసవి పానీయంగా సేవించబడుతుంది. అయినప్పటికీ ఇది టీ, కాఫీలకు ప్రత్యామ్నాయం కాదు.

మద్యపానం దేశంలో పశ్చిమదేశాలకంటే తక్కువగానే వ్యాపించింది. ముస్లిందేశాలలో ద్రాక్షారసం ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. లౌకిక దేశమైన ఉజ్బెకిస్థాన్‌లో 14 వైనరీలు ఉన్నాయి. వీటిలో 1927లో సమర్ఖండ్‌లో స్థాపించబడిన కువ్రెంకో వైనరీ ప్రబలమైనది. సమర్ఖండ్‌ వైనరీ నుండి ప్రాంతీయ ద్రాక్షపండ్ల నుండి డిసర్ట్ వైన్ తయారు చేయబడుతుంది. ఉజ్బెకిస్థాన్‌లో గుల్యకండోజ్, షిరిన్, అలీటికో, కబర్నెట్ లికర్నొ (లిబర్నొ సౌవిగ్నన్: రష్యన్) డిసర్ట్ వైనులు తయారుచేయబడుతున్నాయి. ఉజ్బెకిస్థాన్ వైన్‌లు అంతర్జాతీయ అవార్డులను గెలిచాయి. వీటిని రష్యా, ఇతరదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

క్రీడలు

ఉజ్బెకిస్థాన్ గత రేసింగ్ సైకిలిస్ట్ " డ్జమొలిడైన్ అబ్దౌజపరోవ్ స్వస్థలం. అబ్దౌజపరోవ్ టౌర్ డీ ఫ్రాంస్ " గ్రీన్ జర్సీ పాయింట్ పోటీ" లో మూడుమార్లు విజయం సాధించాడు. [91] అబ్దౌజపరోవ్ ప్రమాదకరమైన విన్యాసాలు ప్రదర్శించడంలో సిద్ధహస్థుడు కనుక ఆయనకు "తాష్కెంటు టెర్రర్ " అనే మారుపేరు ఉంది.

ఆర్తూర్ టేమజోవ్ " 2000 వేసవి ఒలింపిక్ క్రీడా పోటీ " లలో మల్లయుద్ధం (రెస్ట్లింగ్) విజయం సాధించాడు. అలాగే 2004 వేసవి ఒలింపిక్ క్రీడ " , 2008 వేసవి ఒలింపిక్ క్రీడ , 2012 వేసవి ఒలింపిక్ క్రీడలలో పురుషుల 120 కి.గ్రా పోటీలో బంగారు పతకాలు సాధించాడు.

ప్రొఫెషనల్ బాక్సర్ రుస్లన్ చగెవ్ ఉజ్బెకిస్థాన్ డబల్యూ.బి.ఎ పోటీలలో పాల్గొన్నాడు. 2007 డబల్యూ.బి.ఎ చాంపియన్ పోటీలో నికొలవి వాల్యూవ్‌ను ఓడించి రుస్లన్ చగెవ్ విజయం సాధించాడు. రుస్లన్ చగెవ్ రెండుమార్లు చాంపియన్ షిప్ సాధించిన తరువాత 2009 లో వ్లాదిమీర్ కిలిత్‌స్చొకొ చేతిలో అపజయం పొందాడు.

ప్రపంచ చాంపియన్ మైకేల్ కొల్గ్నొవ్ స్ప్రింట్ కనొయర్ కె.1 500 మీ ఒలింపిక్ పోటీలో కాంశ్య పతకం సాధించాడు. జిమ్నాసిస్ట్ అలెగ్జాండర్ షతిలోవ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ కాంశ్య పతకం సాధించాడు. , జిమ్నాసిస్ట్ ఒక్సన చౌసొవితిన దేశం కోసం మొత్తంగా 70 పతకాలు సాధించాడు.

ఉజ్బెకిస్థాన్ అంతర్జాతీయ కురష్ అసోసియేషన్ స్వస్థలం. ఉజ్బెక్ యుద్ధకళను ఆధునికీకరణ , అంతర్జాతీయీకరణ చేసి రూపొందించిన యుద్ధకళ కురష్.

ఉజ్బెకిస్థాన్‌లో " అసోసియేషన్ ఫుట్ బాల్ " అత్యంత ప్రాబల్యత సంతరిం ఉకుంది. ఉజ్బెకిస్థాన్ ప్రీమియర్ ఫుట్ బాల్ లీగ్ (ఉజ్బెక్ లీగ్) తరఫున 2015 నుండి 16 టీంలు క్రీడలలో పాల్గొంటున్నాయి. ప్రస్తుత చాంపియన్లు (2014) ఎఫ్.సి. పఖ్తకొర్. ఎఫ్.సి. పఖ్తకొర్ 10 ఉజ్బెకిస్థాన్ టైటిల్స్ సాధించి ఉజ్బెకిస్థాన్ ఫుట్ బాల్ బృందంలో ప్రధమ స్థానంలో ఉంది.2014 ఉజ్బెకిస్థాన్ ఫుట్ బాల్ టీం (ప్లేయర్ ఆఫ్ ది ఇయర్) గా ఒదిల్ అఖ్మెదొవ్ గుర్తించబడ్డాడు. ఉజ్బెకిస్థాన్ ఫుట్ బాల్ క్లబ్ కప్ వరుసగా " ఎ.ఎఫ్.సి. కప్ " క్రీడలలో పాల్గొంటూనే ఉన్నారు. " 2011 ఎ.ఎస్.ఎఫ్. కప్ (ఎ.ఎఫ్.సి. కప్) " 2011 లో నసాఫ్ సాధించాడు. మొదటి ఉజ్బెకిస్థాన్ ఇంటర్నేషనల్ క్లబ్ కప్‌గా ఎ.ఎఫ్.సి. కప్‌కు ప్రత్యేకత ఉంది.

1991 లో ఉజ్బెకిస్థాన్‌కు స్వతంత్రం లభించడానికి ముందు ఉజ్బెకిస్థాన్ సోవియట్ యూనియన్‌లోని సోవియట్ యూనియన్ రగ్బీ యూనియన్ టీం, సోవియట్ యూనియన్ నేషనల్ ఐస్ హాకీ టీం, సోవియట్ యూనియన్ నేషనల్ హాకీ టీంలలో ఉజ్బెకీయులు పాల్గొన్నారు. ఉజ్బెకిస్థాన్ సోవియట్ యూనియన్ నుండి విడిపోయిన తరువాత ఉజ్బెకిస్థాన్ తనస్వంత " ఉజ్బెకిస్థాన్ నేషనల్ ఫుట్ బాల్ టీం, ఉజ్బెకిస్థాన్ రగ్బీ యూనియన్ టీం, ఉజ్బెకిస్థాన్ నేషనల్ ఫుత్సల్ టీం వంటి నేషనల్ టీంలను ఏర్పాటు చేసుకుంది.

1991లో ఉజ్బెకిస్థాన్ స్వతంత్రం పొందాక ఉజ్బెకిస్థాన్‌లో టెన్నిస్ క్రీడ అత్యంత ప్రజాదరణ పొందింది. 2002లో ఉజ్బెకిస్థాన్ " ఉజ్బెకిస్థాన్ టెన్నిస్ ఫెడరేషన్ " పేరిట తన స్వంత టెన్నిస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకుంది. ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంటులో డబల్యూ. టి. ఎ. టెన్నిస్ టోర్నమెంటు (తాష్కెం టు ఒపెన్) కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటు 1999 నుండి ఔట్ డోర్ హార్డ్ కోర్టులలో నిర్వహించబడుతుంది. డెనిస్ ఇష్టోమిన్, అక్గుల్ అమన్మురదొవ ప్రఖ్యాత ఉజ్బెకిస్థాన్ టెన్నిస్ క్రీడకారులుగా గుర్తింపబడుతున్నారు.

ఉజ్బెకిస్థాన్‌లో చెస్ క్రీడ కూడా ప్రజాదరణ కలిగి ఉంది. చెస్ క్రీడాకారుడు రుస్టం కసింద్ఝనొవ్ 2004లో ఎఫ్.ఐ.డి.ఇ వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు.

ఉజ్బెకిస్థాన్ అదనంగా జూడో, టీం హ్యాండ్ బాల్, బేస్ బాల్, టీక్వండో, బాస్కెట్ బాల్, ఫుత్సల్ క్రీడలను ఆదరిస్తుంది.

బయటి లింకులు

మూలాలు