మధ్య ఆసియా

ఆసియాలోని ఉపప్రాంతం

మధ్యాసియా (Central Asia) ఆసియా లోని మధ్యప్రాంతంలో విశాలంగా వ్యాపించియున్న ప్రాంతం. ఈ ప్రాంతం సంచార తెగలకు, జాతులకు ప్రసిద్ధి, దీనిని 'పట్టు రహదారి'గా కూడా అభివర్ణిస్తారు. ఈ ప్రాంతం, ఐరోపా, దక్షిణాసియా, తూర్పు ఆసియా, పశ్చిమాసియాలకు ఒక రవాణా కేంద్రంగానూ, సాంస్కృతిక బదిలీ కేంద్రంగానూ పరిగణింపబడింది.

మధ్య ఆసియా
మధ్యాసియా ప్రపంచంలో ఒక ప్రాంతంగా.

మధ్యాసియా ప్రధానంగా తుర్కిస్తాన్గా పరిగణింపబడుతుంది. నవీన దృక్పథంలో, దక్షిణాసియాలో అవిభాజ్య సోవియట్ యూనియన్ కు చెందిన ఐదు దేశాలు కజకస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు గలవు. దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా లూ ఈ ప్రాంతంలోనే గలవు. వీటికి అదనంగా చైనా ప్రాంతమైన జిన్ జియాంగ్, టిబెట్ లూ గలవు.

చారిత్రాత్మకంగా మధ్య ఆసియా అందులో నివసించే సంచార ప్రజలతో, సిల్క్ రోడ్‌ (పట్టు రహదారి)తో ముడిపడి ఉంది.[1] ఐరోపా, పశ్చిమ ఆసియా, దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల మధ్య ప్రజలు, వస్తువులు, ఆలోచనల కదలికకు ఇది ఒక కూడలిగా పనిచేసింది.[2] సిల్క్ రోడ్ ముస్లిం భూములను ఐరోపా, దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా ప్రజలతో అనుసంధానించింది.[3] ఈ కూడలి స్థానం గిరిజనవాదం, సాంప్రదాయవాదం, ఆధునీకరణ మధ్య సంఘర్షణను తీవ్రతరం చేసింది.[4] ప్రస్తుత ఉజ్బెకిస్తాన్ నుండి తైమురిద్ పునరుజ్జీవనోద్యమ యుగం ప్రారంభమైంది.

ఇస్లామిక్ పూర్వ ప్రారంభ ఇస్లామిక్ కాలంలో మధ్య ఆసియాలో ప్రధానంగా ఇరానియన్లు,[5][6] తూర్పు ఇరానియన్ మాట్లాడే బాక్టీరియన్లు, సోగ్డియన్లు, కోరాస్మియన్లు, పాక్షిక సంచార సిథియన్లు, దహేలు నివసించేవారు. టర్కిక్ ప్రజల విస్తరణ తరువాత మధ్య ఆసియా కజక్, ఉజ్బెక్స్, టాటర్స్, తుర్క్మెన్, కిర్గిజ్, ఉయ్ఘర్లకు కూడా మాతృభూమిగా మారింది; ఈ ప్రాంతంలో మాట్లాడే ఇరానియన్ భాషలను అధికంగా టర్కిక్ భాషలు భర్తీ చేశాయి.

19 వ శతాబ్దం మధ్య నుండి 20 వ శతాబ్దం చివరి వరకు మధ్య ఆసియాలో ఎక్కువ భాగం రష్యన్ సామ్రాజ్యంలో భాగం ఉండేది. సోవియట్ యూనియన్ స్లావిక్-మెజారిటీ దేశాలు, ఐదు మాజీ సోవియట్ "-స్టాన్స్" ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నాయి. ఇది 7 మిలియన్ జాతి రష్యన్లు, 500,000 ఉక్రైనియన్లకు నివాసప్రాంతంగా ఉంది.[7][8][9] స్టాలినిస్ట్-యుగంలో జరిగిన బలవంతపు బహిష్కరణ విధానాల కారణంగా 3,00,000 మంది కొరియన్లు,[10] 1,70,000 జాతి జర్మన్లు ​​ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు.[11]

మధ్య ఆసియా (2019) జనాభాలో 72 మిలియన్ల జనాభా ఉంది. ఇందులో ఐదు రిపబ్లిక్లు ఉన్నాయి: కజకిస్తాన్ (18 మిలియన్లు), కిర్గిజ్స్తాన్ (6 మిలియన్లు), తజికిస్తాన్ (9 మిలియన్లు), తుర్క్మెనిస్తాన్ (6 మిలియన్లు), ఉజ్బెకిస్తాన్ (33 మిలియన్లు) .[12]

వివరణలు

మధ్య ఆసియా రాజకీయ భౌగోళికచిత్రం
ఈప్రాంతం గురించిన మూడు విధములైన ఉహాత్మక సరిహద్దులు
మధ్య ఆసియా వివరణ. మూలావివరణలో ఐదు సోవియట్ దేశాలు హరితవర్ణంలో చిత్రించబడ్డాయి.

భౌగోళిక శాస్త్రవేత్త అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ 1843 లో మధ్య ఆసియాను ప్రపంచంలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా పేర్కొంటూ ఆధునిక ప్రపంచానికి పరిచయం చేసాడు. మధ్య ఆసియా సరిహద్దులు వైవిధ్యమైన పలు నిర్వచనాలకు లోబడి ఉంటాయి. మధ్య ఆసియాలో చారిత్రాత్మకంగా రూపొందిన రాజకీయ భౌగోళిక, సంస్కృతి నిర్వచనాలను పండితులు సాహిత్యంలో విస్తృతంగా ఉపయోగించారు. హంబోల్ట్ నిర్వచనం మధ్య ఆసియాలోని దేశాలన్నీ 5 ° ఉత్తర దక్షిణ అక్షాంశాలు, 44.5 డిగ్రీల రేఖాంశం మధ్య ఉంటుంది.[13] ఈ ప్రాంతం కొన్ని భౌగోళిక లక్షణాలను హంబోల్ట్ మాత్రమే ప్రస్తావించాడు. వీటిలో పశ్చిమంలో కాస్పియన్ సముద్రం ఉత్తరంలో అల్టై పర్వతాలు, దక్షిణంలో హిందూ కుష్, పామిర్ పర్వతాలు ఉన్నాయి.[14] ప్రష్యన్ భౌగోళిక శాస్త్రవేత్త ఈ ప్రాంతానికి తూర్పు సరిహద్దు ఇవ్వలేదు. మధ్య ఆసియా గురించిన వివరణలలో వాన్ హంబోల్ట్ వారసత్వం ఇప్పటికీ కనిపిస్తుంది. ఆయన "సెంట్రల్ ఏషియన్ స్టడీస్" (విస్తృత మధ్య ఆసియా నిర్వచనం ఆధారంగా) అందించే ఒక విశ్వవిద్యాలయం స్థాపించాడు.[15] రష్యా భూగోళ శాస్త్రవేత్త నికోలాయ్ ఖానికోఫ్ మధ్య ఆసియా అక్షాంశ నిర్వచనాన్ని ప్రశ్నించారు. జలభాగం నుండి భూభాగాన్ని వివరించే ఈ ప్రాంతభౌతిక నిర్వచనాన్ని ఖానికోఫ్ పేర్కొన్నాడు. ఈ నిర్వచనాలకు పలు దేశాలు మద్ధతిచ్చాయి: ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఖోరాస్థాన్, తూర్పు తుర్కిస్థాన్ (జిన్జియాంగ్).[16][17][18]

రష్యన్ సంస్కృతికి రెండు విభిన్న పదాలు ఉన్నాయి: Средняя Азия (స్రెడ్న్యయా అజియా లేదా "మిడిల్ ఆసియా". ఈ సంక్షిప్తనిర్వచనంలో సాంప్రదాయక స్లావిక్, మధ్య ఆసియా భూభాగం మాత్రమే పేర్కొనబడ్డాయి. ఇవి చారిత్రక రష్యా సరిహద్దులలో చేర్చబడ్డాయి). Центральная (సెంత్రాల్నియా అజియా లేదా "సెంట్రల్ ఆసియా ". పూర్తివివరణలో చారిత్రాత్మక రష్యాలో ఎప్పుడూ లేని మధ్య ఆసియా భూములు ఉన్నాయి). తరువాతి నిర్వచనంలో ఆఫ్ఘనిస్తాన్, తూర్పు తుర్కెస్తాన్ ఉన్నాయి.[19]

అత్యంత పరిమితమైన నిర్వచనం సోవియట్ యూనియన్ అధికారిక నిర్వచనం ఒకటి. ఇది మధ్య ఆసియా ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజ్స్తాన్లను మాత్రమే కలిగి ఉందని నిర్వచించింది. అందులో కజకస్థాన్ వదిలివేయబడింది. ఈ నిర్వచనం తరచుగా ప్రస్తుతం యు.ఎస్.ఎస్.ఆర్ వెలుపల ఉపయోగించబడింది. 1991 లో సోవియట్ యూనియన్ రద్దు అయిన వెంటనే మాజీ సోవియట్ మధ్య ఆసియా రిపబ్లిక్కుల నాయకులు నలుగురు తాష్కెంట్లో సమావేశమై మధ్య ఆసియా దేశాలలో సోవియట్ చేర్చిన దేశాలతో కజకస్థానును చేర్చాలని ప్రకటించారు. అప్పటి నుండి ఇది మధ్య ఆసియా అత్యంత సాధారణ దేశంగా మారింది.

1992 లో ప్రచురించబడిన యునెస్కో హిస్టరీ ఆఫ్ ది సివిలైజేషన్స్ ఆఫ్ సెంట్రల్ ఆసియా ఈ ప్రాంతాన్ని "ఆఫ్ఘనిస్తాన్, ఈశాన్య ఇరాన్, ఉత్తర, మధ్య పాకిస్తాన్, ఉత్తర భారతదేశం, పశ్చిమ చైనా, మంగోలియా, పూర్వ సోవియట్ దేశాలు మధ్య ఆసియా గణతంత్ర రాజ్యాలు"గా నిర్వచించింది.[20]

ప్రత్యామ్నాయ పద్ధతిలో జాతి ఆధారంగా ఈ ప్రాంతాన్ని నిర్వచించడంలో తూర్పు తుర్కిక్, తూర్పు ఇరానియన్ లేదా మంగోలియన్ ప్రజలు నివసించే ప్రాంతాలు పేర్కొనబడ్డాయి. ఈ ప్రాంతాలలో జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్, దక్షిణ సైబీరియాలోని తుర్కిక్ ప్రాంతాలు, ఐదు రిపబ్లిక్లు, ఆఫ్ఘన్ తుర్కెస్తాన్ ఉన్నాయి. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు, భారతదేశ కాశ్మీర్ లోయలను కూడా చేర్చవచ్చు. టిబెటన్లు, లడక్ కూడా ఉన్నాయి. పేర్కొన్న ప్రజలలో చాలా మంది ఈ విస్తారమైన ప్రాంతంలోని "స్వదేశీ" ప్రజలుగా భావించబడతారు. మధ్య ఆసియాను కొన్నిసార్లు తుర్కెస్తాన్ అని కూడా పిలుస్తారు.[21][22][23]

ఆసియా భౌగోళిక కేంద్రంగా చెప్పుకునే అనేక ప్రదేశాల మధ్య ఆసియాలో ఉన్నాయి. ఉదాహరణకు రష్యన్ ఫెడరేషన్‌లో తువా రాజధాని కైజిల్, చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతానికి రాజధాని అయిన ఓరాంకి ఉత్తరాన 320 కిమీ (200 మైళ్ళు) దూరంలో ఉన్న గ్రామం ఉన్నాయి.[24]

భౌగోళికం

On the southern shore of Issyk Kul lake, Issyk Kul Region.

మధ్య ఆసియా భౌగోళికంగా వైవిధ్యభరితంగా ఉంటుంది. వీటిలో అధిక పర్వతమార్గాలు, పర్వతాలు (టియాన్ షాన్), విస్తారమైన ఎడారులు (కైజిల్ కమ్, తక్లమకన్), చెట్లు లేని గడ్డి మెట్ల ఉన్నాయి. మధ్య ఆసియాలోని విస్తారమైన గడ్డిమైదానాలు తూర్పు ఐరోపా సోపానక్షేత్రాలతో కలిసినప్రాంతాన్ని భౌగోళికంగా యురేసియన్ సోపానక్షేత్రంగా పరిగణించబడతాయి.

మధ్య ఆసియాలోని అత్యధికభూమి అధికపొడిగా ఉంటూ వ్యవసాయానికి చాలా కఠినమైనదిగా ఉంటుంది. గ్రేట్ ఖింగన్ (డా హింగన్) పర్వతాలు గోబీ ఎడారి 77 ° తూర్పు, పామిర్సుపర్వత పాదాలలో 116 ° –118 ° తూర్పు వరకు విస్తరించి ఉంది.

మధ్య ఆసియాలో ఉన్న తీవ్రమైనభౌగోళిక ప్రాంతాలు:

  • మంగోలియాలోని బురుగ్ డెలిన్ ఎల్స్ వద్ద, 50 ° 18 'ఉత్తర అక్షాంశంలో ఉన్న ఇసుకదిబ్బలు ప్రపంచంలోని ఉత్తరకొనలోని ఎడారి ఇసుక దిబ్బలుగా గుర్తించబడుతున్నాయి.
  • మంగోలియాలో 46 ° 17 'ఉత్తర అక్షాంశంలో ఉన్న ఎర్డెనెట్సోగ్ట్ ప్రాంతం .
  • ఉత్తర అర్ధగోళం దక్షిణకొనగా గుర్తించబడుతున్న నాన్ ఫ్రోజెన్ ఎడారి, పార్మఫ్రోస్ట్ మధ్య ప్రపంచంలో అతి తక్కువ దూరం: 770 కిమీ (480 మైళ్ళు).
  • ప్రవేశించలేని యురేషియన్ ధ్రువం.

ఈప్రాంత ప్రజలు అధికంగా పశువుల పెంపకం ద్వారా జీవనం సాగిస్తారు. ఈ ప్రాంత నగరాల్లో పారిశ్రామిక కార్యకలాపాల కేంద్రాలు ఉన్నాయి.

ఈ ప్రాంతంలో అము దర్యా, సిర్ దర్యా, ఇర్తిష్, హరి నది, ముర్గాబ్ నది వంటి ప్రధాన నదులు ఉన్నాయి. అరల్ సీ, సరస్సు బాల్ఖాష్ వంటి ప్రధాన జలాశయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి రెండూ పశ్చిమ-మధ్య ఆసియా ఎండోర్హీక్ బేసిన్లో భాగంగా ఉన్నాయి. ఇందులో కాస్పియన్ సముద్రం కూడా భాగంగా ఉంది.

ఈ రెండు నీటి వనరులకు నీటిని అందించే నదుల నుండి నీటిపారుదల, పారిశ్రామిక ప్రయోజనాల కోసం నీటిని మళ్లించినకారణంగా ఇటీవలి దశాబ్దాలలో ఈ జలాశయాలలోని నీటిశాతం గణనీయంగా తగ్గిపోయాయి. శుష్కమైన మధ్య ఆసియాలో నీరు చాలా విలువైన వనరు కనుక ఇది అంతర్జాతీయ వివాదాలకు దారితీస్తుంది.

చారిత్రాత్మక ప్రాంతాలు

మధ్య ఆసియా ఉత్తరసరిహద్దున సైబీరియా అడవులు ఉంటాయి. మధ్య ఆసియా ఉత్తర భాగం (కజాకస్తాన్)లో యురేషియా పచ్చికమైదానం ఉంటుంది. పడమటి వైపు కజఖ్ సోపానక్షేత్రాలు తూర్పువైపుగా కొనసాగి రష్యన్-ఉక్రేనియన్ సోపానక్షేత్రాలతో కులుస్తూ డున్గారియా ఎడారులను దాటుతూ మంగోలియా సోపానక్షేత్రాలతో విలీనం ఔతుంటాయి. దక్షిణ దిశలో భూమి ఎక్కువగా పొడిగా మారిన కారణంగా సంచారప్రజాల సంఖ్య క్రమంగా క్షీణిస్తుంది. దట్టమైన జనాభా ఉన్న దక్షిణప్రాంతాలు, నీటిపారుదల సాధ్యమైన ప్రాంతాలలో నగరాలు అభివృద్ధి చెందాయి. తూర్పు పర్వతాల వెంట, ఆక్సస్, జాక్సార్టెస్ నదుల వెంట, పర్షియా సరిహద్దుకు సమీపంలో ఉన్న కోపెట్ డాగ్ ఉత్తర పార్శ్వంలో నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రధాన వ్యవసాయక్షేత్రాలు ఉన్నాయి. కోపెట్ డాగ్ ప్రాంతంలో తూర్పున మెర్వ్ ఒయాసిస్ తరువాత ఆఫ్ఘనిస్తాన్లో హెరాత్, బాల్ఖ్ వంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. టియాన్ షాన్ తూర్పు పర్వతాల భౌగోళికపరిస్థితుల కారణంగా మూడు "సముద్రఖాతాలు" సృష్టించబడ్డాయి. వీటిలో అతిపెద్దది తూర్పు కజాఖస్తానులో ఉంది. దీనిని సాంప్రదాయకంగా జెటిసు లేదా సెమిరేచీ అని పిలుస్తారు. దీనిలో బాల్ఖాష్ సరస్సు ఉంది. మధ్యలో చిన్నదిగా ఉండే జనసాంద్రత అధికంగా ఉన్న ఫెర్గానా లోయ ఉంది. దక్షిణాన బాక్ట్రియా ఉంది. తరువాత దీనిని టోచారిస్టన్ అని పిలుస్తారు. దీని దక్షిణసరిహద్దున ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ పర్వతాలు ఉన్నాయి. ఫెర్గానా లోయలో సిర్ దర్యా (జాక్సార్టెస్) నది జన్మిస్తుంది. బాక్టీరియాలో అము దర్యా (ఆక్సస్) నది జన్మిస్తుంది. రెండూ వాయవ్య దిశలో ప్రవహిస్తూ అరల్ సముద్రంలోకి సంగమిస్తాయి. ఆక్సస్ అరల్ సముద్రంలో సంగమించే ప్రాంతంలో ఖ్వరాజ్మ్ అని పిలువబడే పెద్ద డెల్టాను తరువాత ఖివా ఖినాటే ఏర్పడింది. ఆక్సస్ ఉత్తరప్రాంతంలో తక్కువ-ప్రసిద్ధమైనప్పటికీ ప్రాధాన్యత కలిగిన జరాఫ్షాన్ నది ప్రవహిస్తుంది. ఇది గొప్ప వాణిజ్య నగరాలైన బోఖారా, సమర్కాండ్లకు అవసరమైన నీరు అందిస్తుంది. ఫెర్గానా లోయ ముఖద్వారం నుండి తాష్కెంట్ వాయవ్యంగా మరొక గొప్ప వాణిజ్య నగరం అభివృద్ధి చెందింది. ఆక్సస్‌కు ఉత్తరాన ఉన్న భూమిని ట్రాన్సోక్సియానా, సోగ్డియా (పట్టు రహదారి వ్యాపారంలో ఆధిపత్యం వహించిన సోగ్డియన్ వ్యాపారులను సూచించడానికి) అని కూడా పిలుస్తారు.

1759 లో తూర్పున, డున్గారియా, తారిం బేసిన్ చైనా ప్రావిన్స్ జిన్జియాంగ్‌లో విలీనం అయ్యాయి. చైనా నుండి వచ్చిన యాత్రికులు పర్వతాలను వాయవ్య దిశలో ఫెర్గానా లేదా నైరుతి బాక్టీరియా దాటడానికి ముందు తారిం బేసిన్ ఉత్తరం లేదా దక్షిణం వైపు వెళ్లి కష్గర్ వద్దకు చేరేవారు. పట్టు రహదారిలోని ఒక చిన్న శాఖ తాష్కెంట్ సమీపంలో నైరుతి వైపు తిరిగే ముందు టియాన్ షాన్కు చేరడానికి డున్గారియ, జెటిసు మీదుగా కొనసాగింది. సంచారజాతి వలసదారులు మంగోలియా నుండి డున్గారియా మీదుగా నైరుతి వైపు తిరిగే ముందు స్థిరనివాసుల భూములను జయించటానికి పశ్చిమ ఐరోపా వైపు పయనించారు.

ఆక్సస్, జాక్సార్టెస్ మధ్య కైజిల్ కమ్ ఎడారి (పాక్షిక ఎడారి) ఉంది. తుర్క్మెనిస్తాన్లోని ఆక్సస్, కోపెట్ డాగ్ మధ్య కరాకుం ఎడారి ఉంది. ఈశాన్య పర్షియా, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ఖోరాసన్ అని పిలువబడింది. మెర్వ్ చుట్టూ ఉన్న ప్రాంతం మార్వియానా అని పిలువబడేది. అరల్, కాస్పియన్ సముద్రాల మధ్య ఉస్తిర్ట్ పీఠభూమి ఉంది.

పర్షియా నైరుతి దిశలో, కోపెట్ డాగ్ ప్రాంతాలు ఉంది. ఇక్కడ నుండి పెర్షియన్, ఇస్లామిక్ నాగరికత మధ్య ఆసియాలోకి చొచ్చుకుపోయి రష్యన్ ఆక్రమణ వరకు తన ఉన్నత సంస్కృతి శిఖరాగ్రస్థాయికి చేరుకుని ఆప్రాంతాల మీద ఆధిపత్యం చెలాయించింది. దీనికి ఆగ్నేయంలో భారతదేశానికి మార్గం ఉంది. ప్రారంభ కాలంలో బౌద్ధమతం ఉత్తరప్రాంతాలకు వ్యాపించింది. చరిత్రలో చాలావరకు యోధులు, రాజులు, తెగలు ఉత్తర భారతదేశంలో తమ పాలనను స్థాపించడానికి ఆగ్నేయ దిశగా పయనించారు. సంచార విజేతలు చాలా మంది ఈశాన్య నుండి భారతదేశంలో ప్రవేశించారు. 1800 తరువాత వాయవ్య నుండి పాశ్చాత్య నాగరికత రష్యన్, సోవియట్ రూపంలో చొచ్చుకుపోయింది.

చారిత్రక ప్రాంతాల పేర్లు

వాతావరణం

మద్య ఆసియా కోపెన్ వాతావరణ వర్గీకరణ భౌగోళిక చిత్రం

మధ్య ఆసియాలో జలప్రాంతం తక్కువగా ఉండి భూప్రాంతం అధికంగా ఉన్నందున వేసవి నెలలను మినహాయించి తరచుగా ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయి. చాలా ప్రాంతాలలో వాతావరణం పొడిగా ఖండాంతరువాతావరణం ఉంటుంది. వేసవిలో ఎండతీవ్రత, శీతాకాలంలో అధికంగా ఉంటుంది. అప్పుడప్పుడు హిమపాతం కూడా సంభవిస్తూ ఉంటుంది. ఎత్తైన ప్రదేశాల వెలుపలి వాతావరణం పాక్షికశుష్కత నుండి పూర్తిశుష్కంగా ఉంటుంది. తక్కువ ఎత్తులో ఉండే ప్రాంతాలు ఎండలతో మండుతున్న వేసవి ఉంటుంది. శీతాకాలంలో మధ్యధరా సముద్రం నుండి ఈ ప్రాంతాన్ని దాటే అల్ప పీడన వ్యవస్థల కారణంగా అప్పుడప్పుడు వర్షం, మంచు ఉంటుంది. సగటు నెలవారీ అవపాతం జూలై నుండి సెప్టెంబరు వరకు చాలా తక్కువగా ఉంటుంది. శరదృతువులో (అక్టోబరు, నవంబరు) పెరుగుతుంది. మార్చి లేదా ఏప్రిల్‌లో అత్యధికంగా ఉంటుంది. తరువాత మే, జూన్లలో వేగంగా ఎండతీవ్రత అధికరిస్తుంది. గాలులు బలంగా వీస్తూ ఉండి కొన్నిసార్లు ముఖ్యంగా సెప్టెంబరు, అక్టోబరులలో పొడి కాలం ముగిసే సమయానికి దుమ్ము తుఫానులను ఉత్పత్తి చేస్తాయి. తాష్కెంటు, సమర్కాండు, ఉజ్బెకిస్తాన్, అష్గాబాట్, తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్లోని దుషాన్బే ప్రాంతాల మధ్య ఆసియా వాతావరణ విధానాలకు ఉదాహరణగా చెప్పబడే నిర్దిష్ట ఉన్నాయి. వీటిలో మధ్య ఆసియాలోని అత్యంత తేమతో కూడిన వాతావరణం చివరదిగా ఉంది. సగటు వార్షిక అవపాతం 22 అంగుళాలు ఉంటుంది.

భౌగోళికజీవవైవిధ్యప్రాంతాలలో మధ్య ఆసియా పాలియార్కిటిక్ రీల్ములో భాగంగా ఉంది. మధ్య ఆసియాలో సమశీతోష్ణ గడ్డి మైదానాలు, సవన్నాలు, పొద భూములు అధికంగా ఉన్నాయి. మధ్య ఆసియాలో మాంటనే గడ్డిమైదానాలు, పొదలు, ఎడారులు, జెరిక్ పొదలు, సమశీతోష్ణ శంఖాకార అడవులు ఉన్నాయి.

చరిత్ర

ఓరియంటలిజం, స్వర్ణ యుగంలో ప్రపంచ చరిత్రలో మధ్య ఆసియా స్థానం అట్టడుగున ఉన్నప్పటికీ, సమకాలీన చరిత్ర మధ్య ఆసియా "కేంద్రీకృతతను" కనుగొంది.[25] మధ్య ఆసియా చరిత్రను ప్రాంతం వాతావరణం, భౌగోళికం ప్రభావితం చేసాయి. ఈ ప్రాంతం శుష్కత వ్యవసాయాన్ని కష్టతరం చేసింది. సముద్రం నుండి దాని దూరం కారణంగా వాణిజ్యం నుండి ఈ ప్రాంతం కత్తిరించబడింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో కొన్ని ప్రధాన నగరాలు అభివృద్ధి చెందాయి; ఈ ప్రాంతం మీద వెయ్యి సంవత్సరాలుగా సోపానక్షేత్రాల సంచార అశ్వసమూహాలు ఆధిపత్యం వహించాయి.

పచ్చికమైదానాల సంచార జాతులు, మధ్య ఆసియా పరిసరప్రాంతాలలో స్థిరపడిన ప్రజల మధ్య సంబంధాలు చాలాకాలంగా సంఘర్షణలతో నిండి ఉండేవి. సంచార జీవనశైలి యుద్ధానికి బాగా సరిపోతుంది. గడ్డి గుర్రపు స్వారీ చేసేవారు ప్రపంచంలో అత్యంత సైనిక శక్తిగల సమూహాలుగా గుర్తించబడ్డారు. వారిలో అంతర్గత ఐక్యత లేకపోవడం వల్ల మాత్రమే వారిశక్తి పరిమితం చేయబడింది. మధ్య ఆసియా వెంట ప్రయాణించే సిల్క్ రోడ్ ప్రభావం కారణంగా కొంత అంతర్గత ఐక్యత సాధించబడింది. క్రమానుగతంగా మారుతున్న పరిస్థితులలో గొప్ప నాయకులు ఉద్భవించి అనేక తెగలను ఒకే శక్తిగా నిర్వహంచారు. ఈమార్పు దాదాపుగా ఆపలేని శక్తిని సృష్టించింది. ఐరోపా మీద హన్ దండయాత్ర, చైనాపై వు హు దాడులు, యురేషియాలో ఎక్కువ భాగం మంగోల్ ఆక్రమణ ఈ సమైక్యశక్తి సాధనలుగా ఉన్నాయి.[26]

Geographical extent of Iranian influence in the 1st century BC. Scythia (mostly Eastern Iranian) is shown in orange.

ఇస్లామిక్ పూర్వ, ప్రారంభ ఇస్లామిక్ కాలంలో దక్షిణ మధ్య ఆసియాలో ప్రధానంగా ఇరానియన్ భాషలను మాట్లాడేవారు నివసించేవారు.[5][27] పురాతన ఇరానియన్ స్థిరనివాసులలో సోగ్డియన్లు, చోరాస్మియన్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇరానియన్ ప్రజలు సిథియన్లు, తరువాత అలన్స్ వంటి వారు సంచార లేదా పాక్షిక సంచార జీవనశైలిని గడిపారు. తారిం బేసిన్లో కాకసాయిడ్ లక్షణాలతో చక్కగా సంరక్షించబడిన టారిం మమ్మీలు కనుగొనబడ్డాయి.[28]

కివాకు చెందిన ఉజ్బెకిస్థాన్ పురుషుడు 1861-1880

5 వ - 10 వ శతాబ్దాల మధ్య టర్కీ ప్రజల ప్రధాన వలసలు సంభవించాయి. తరువాత టర్కీప్రజల మధ్య ఆసియాలో చాలా వరకు వ్యాపించారు. 751 లో టర్కీప్రజలు తలాస్ యుద్ధంలో టాంగ్ చైనీయులను అరబ్బులు ఓడించారు. ఇది టాంగ్ రాజవంశం పశ్చిమ విస్తరణకు ముగింపుగా మారింది. టిబెటన్ సామ్రాజ్యం దక్షిణ ఆసియాతో పాటు మధ్య ఆసియాలో కొంత భాగాన్ని పాలించే అవకాశాన్ని తీసుకుంటుంది. 13వ - 14 వ శతాబ్దాలలో మంగోలు నమోదితచరిత్రలో మంగోలుప్రజలు సామ్రాజ్యాన్ని అత్యధికంగా విస్తరించి పాలించారు. మధ్య ఆసియాలో ఎక్కువ భాగం చాగటై ఖానాటే నియంత్రణలో పాలించబడింది.

స్థిరపడిన ప్రజలతుపాకీలు వారికి ఈ ప్రాంతం మీద నియంత్రణ సాధించడానికి అనుమతించడంతో 16 వ శతాబ్దంలో సంచార జాతుల ఆధిపత్యం ముగిసింది. తరువాతి కాలంలో రష్యా, చైనా మొదలైన ఇతర శక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించి విస్తరించాయి. ఈ శక్తులు 19 వ శతాబ్దం చివరి నాటికి మధ్య ఆసియాలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. రష్యన్ విప్లవం తరువాత పశ్చిమ మధ్య ఆసియా ప్రాంతాలు సోవియట్ యూనియన్‌లో చేర్చబడ్డాయి. తూర్పు తుర్కెస్తాన్ (జిన్జియాంగ్) అని పిలిచే భాగాన్ని మధ్య ఆసియా తూర్పు భాగాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో చేర్చారు. మంగోలియా స్వతంత్రంగా ఉండి సోవియట్ రాష్ట్రంగా మారింది. 1978 సౌర్ విప్లవం వరకు ఆఫ్ఘనిస్తాన్ యు.ఎస్.ఎస్.ఆర్ ప్రధాన ప్రభావానికి లోనౌతూనే పాక్షికంగా స్వతంత్రంగా ఉంది.

మధ్య ఆసియాలోని సోవియట్ ప్రాంతాలలో అత్యధిక పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల నిర్మాణాలు అభివృద్ధిచెందాయి. అయినప్పటికీ సోవియట్ ప్రాంతాలలో స్థానిక సంస్కృతులను అణచివేసి సామూహిక కార్యక్రమాల విఫలత నుండి వందల వేల మరణాలు సంభవించడం కారణంగా జాతి ఉద్రిక్తతలు, పర్యావరణ సమస్యలు అధికరించాయి. యు.ఎస్.ఎస్.ఆర్ పశ్చిమ ప్రాంతాల నుండి సోవియట్ అధికారులు మిలియన్ల మంది ప్రజలను మధ్య ఆసియా, సైబీరియాలకు మొత్తం వారిజాతీయతలతో సహా బహిష్కరించారు.[29] ."[30] టౌరాజ్ అటాబాకి, సంజ్యోత్ మెహెండాలే అభిప్రాయం ఆధారంగా "1959 - 1970 వరకు సోవియట్ యూనియన్ లోని వివిధ ప్రాంతాల నుండి సుమారు రెండు మిలియన్ల మంది మధ్య ఆసియాకు వలస వచ్చారు. వారిలో ఒక మిలియన్ మంది కజఖస్తానుకు వెళ్లారు.[31]

సోవియట్ యూనియన్ పతనంతో ఐదు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. దాదాపు అన్ని కొత్త దేశాలలో మాజీ కమ్యూనిస్టు పార్టీ అధికారులు స్థానిక శక్తివంతమైన అధికారాన్ని నిలుపుకున్నారు. స్వాతంత్ర్యం ప్రారంభకాలంలో కొత్త రిపబ్లిక్లలో దేనిని క్రియాత్మక ప్రజాస్వామ్య దేశాలుగా పరిగణించలేదు. అయినప్పటికీ ఇటీవలి సంవత్సరాల కాలంలో కిర్గిస్తాన్, కజకస్తాన్, మంగోలియా మరింత సతంత్ర సమాజాల వైపు అధికంగా పురోగతి సాధించాయి. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్కుమెనిస్తాన్ మినహాయింపుగా మిగిలినదేశాలు సోవియట్ తరహాలో పాలనలో అణచివేత వ్యూహాలు ప్రయోగించాయి.[32]

Culture

కళలు

పెట్రొపావ్ ఒ.వి.ఎస్.కె. లోని మసీదు; కజకస్తాన్

ఆసియా కూడలిలో బౌద్ధమతంతో షమానిస్టిక్ విధానాలను అనుసరించే ప్రజలు నివసించేవారు. ఆ విధానంలో టిబెటులో యమలోకాధిపతిన ఆధ్యాత్మిక సంరక్షకుడిగా, న్యాయమూర్తిగా గౌరవించబడ్డాడు. టిబెటన్ బౌద్ధమతం మంగోలియన్ బౌద్ధమతాన్ని ప్రభావితం చేసాయి. 18 వ శతాబ్దంలో చైనా చక్రవర్తి క్వింగ్ కియాన్లాంగ్ టిబెటన్ బౌద్ధమతాన్ని ఆచరించాడు. కొన్నిసార్లు తనస్వంత మతపరమైన ఆరాధన చేయడానికి బీజింగ్ నుండి ఇతర నగరాలకు వెళ్లేవాడు.

బుఖారాలో జరిగిన ఫోరంలో సాది షిరాజీని స్వాగతిస్తున్న కష్గార్‌కు చెందిన యువకుడు

మధ్య ఆసియాలో స్వదేశీ రూపంలో అభివృద్ధిచేయబడిన మౌఖిక కవిత్వం 1000 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉంది. ఇది ప్రధానంగా కిర్గిస్తాన్, కజఖస్తాన్ అకిన్స్, లిరికల్ ఆధ్వర్యంలో అభివృద్ధిచేయబడిన మౌఖిక కవిత్వం అభ్యసిస్తున్నారు. వారు లిరికల్ పోటీలు, ఐతిష్ (అలిం సబాక్) లలో పాల్గొంటారు. ప్రారంభ బార్డిక్ మౌఖిక చరిత్రకారుల నుండి ఈ సంప్రదాయం ఉద్భవించింది. కిర్గిస్తాన్ మూడు-తీగల కొముజ్ వాడుకలో ఉండగా, కజాఖస్తానులో రెండు-తీగల వాయిద్యం, డోంబ్రా వంటి సంగీతవాయిద్యాలు వాడుకలో ఉన్నాయి.

1882లో మధ్య ఆసియాలో మెన్నోనైట్ వలసల సమయంలో రష్యన్ మెన్నోనైట్ ఫోటోగ్రాఫర్ విల్హెల్మ్ పెన్నెర్ ఖినా ఖినాటేకు మారిన తరువాత మధ్య ఆసియాలో ఫోటోగ్రఫీ అభివృద్ధి అయింది. విల్హెల్మ్ పెన్నెర్ సాంకేతిక నైపుణ్యాలను స్థానిక విద్యార్థి ఖుడేబెర్గెన్ దివనోవ్‌తో పంచుకున్నాడు. తరువాత ఆయన ఉజ్బెక్ ఫోటోగ్రఫీ స్థాపకుడు అయ్యాడు.[33]

Mausoleum of Khoja Ahmed Yasawi in Hazrat-e Turkestan, Kazakhstan. Timurid architecture consisted of Persian art.

కొందరు కిర్గిస్తాన్ ఇతిహాస పద్యం మనస్, పాడటం కూడా నేర్చుకుంటారు. మనస్ ను ప్రత్యేకంగా నేర్చుకుని దానిని మెరుగుపరచని వారిని మనస్కిస్ అంటారు. సోవియట్ పాలనలో అకిన్ పనితీరుకు అధికారులు సహకరించినప్పటికీ తరువాత దానికి ప్రజాదరణ తగ్గింది. సోవియట్ యూనియన్ పతనంతో ఇది పునరుజ్జీవనాన్ని పొందింది. అయినప్పటికీ అకిన్లు తమ కళను రాజకీయ అభ్యర్థుల ప్రచారం కొరకు ఉపయోగిస్తున్నారు. 2005 వాషింగ్టన్ పోస్టులో ప్రచురించబడిన ఒక వ్యాసంలో అకిన్స్ ఇంప్రూవైషనల్ ఆర్ట్, పాశ్చాత్య దేశాలలో ప్రదర్శించిన ఆధునిక ఫ్రీస్టైల్ ర్యాప్ మధ్య సారూప్యతను ప్రతిపాదించబడింది.[34]

మధ్య ఆసియాలో రష్యన్ వలసరాజ్యం పర్యవసానంగా యూరోపియన్ లలిత కళలు - పెయింటింగ్, శిల్పం, గ్రాఫిక్స్ - అభివృద్ధి చెందాయి. సోవియట్ పాలన మొదటి సంవత్సరాలలో కనిపించిన ఆధునికవాదం రష్యన్ అవాంట్-గార్డ్ ఉద్యమం నుండి ప్రేరణ పొందింది. 1980 ల వరకు సోవియట్ కళల సాధారణ ధోరణులతో మధ్య ఆసియా కళలు అభివృద్ధి చెందాయి. 90 వ దశకంలో ఈ ప్రాంత కళలు కొన్ని ముఖ్యమైన మార్పులకు లోనయ్యాయి. సంస్థాగతంగా చెప్పాలంటే ఆర్టు మార్కెటు పుట్టుకతో కొన్ని కళల రంగాలు నియంత్రించబడ్డాయి. వీటిలో కొన్ని అధికారిక అభిప్రాయాల ప్రతినిధులుగా కొనసాగాయి. వీటికి అనేక అంతర్జాతీయ సంస్థలు స్పాన్సర్ అదించి సహకరించాయి. 1990-2000 సంవత్సరాలు సమకాలీన కళల స్థాపన విస్తరణ కొనసాగింది. అనేక ముఖ్యమైన అంతర్జాతీయ ఈ ప్రాంతంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. మధ్య ఆసియా కళ యూరోపియన్, అమెరికన్ మ్యూజియంలలో ప్రాతినిధ్యం వహిస్తుంది. 2005 నుండి వెనిస్ బిన్నెలే వద్ద మధ్య ఆసియా పెవిలియన్ నిర్వహించబడింది.

క్రీడలు

Kazakh man on a horse with golden eagle

మధ్య ఆసియాలో ఈక్వెస్ట్రియన్ క్రీడలు సాంప్రదాయ క్రీడలుగా ఉన్నాయి. ఇందులో ఎడ్యూరెంస్ రైడింగ్, బుజ్కాషి, డిజిట్, కిజ్ కుయు వంటి విభాగాలు ఉన్నాయి.

మధ్య ఆసియా ప్రాంతమంతటా బుజ్కాషి సాంప్రదాయ ఆట ఆడతారు. మద్య ఆసియా దేశాలు కొన్నిసార్లు ఒకదాతో కొకటి పోటీపడుతూ బుజ్కాషి పోటీలను నిర్వహిస్తాయి. 2013 లో మొదటి ప్రాంతీయ పోటీ మధ్య ఆసియా దేశాలైన రష్యా, చైనీస్ జిన్జియాంగు, టర్కీల మధ్య జరిగింది.[35] 2017 లో నిర్వహించిన మొదటి ప్రపంచ టైటిల్ పోటీలో కజకిస్తాన్ గెలిచింది.[36]

మధ్య ఆసియా అంతటా అసోసియేషన్ ఫుట్‌బాల్ ప్రాచుర్యం పొందింది. మద్య ఆసియాలోని చాలా దేశాలు ఫుట్‌బాల్ సమాఖ్య ప్రాంతమైన సెంట్రల్ ఆసియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌లో సభ్యదేశాలుగా ఉన్నాయి. అయినప్పటికీ కజఖస్తాన్ యు.ఇ.ఎఫ్.ఎ.లో సభ్యదేశంగా ఉంది.

మధ్య ఆసియాలో రెజ్లింగ్ క్రీడకూడా తగినంతగా ప్రాచుర్యం పొందింది. కజకిస్తాన్ (14 ఒలింపిక్ పతకాలు), ఉజ్బెకిస్తాన్ (7 ఒలింపిక్ పతకాలు), కిర్గిస్తాన్ (3 ఒలింపిక్ పతకాలు) సాధించింది. మధ్య ఆసియా దేశాలు మాజీ సోవియట్ దేశాల మాదిరిగా జిమ్నాస్టిక్సులో విజయవంతమయ్యాయి.

మధ్య ఆసియాలో మరింత సాధారణంగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడలలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఒకటి, కిర్గిజ్ అథ్లెట్ వాలెంటినా షెవ్చెంకో యు.ఎఫ్.సి ఫ్లై వెయిట్ ఛాంపియన్ టైటిల్‌ను సాధించింది.

లిగి ఉంది.

ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ క్రీడ అత్యంత ప్రాచుర్యం పొందింది. 2001 లో ఏర్పడిన ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే దేశాల మీద విజయాలు సాధించింది.

ప్రముఖ కజఖ్ పోటీదారులలో సైక్లిస్టులు అలెగ్జాండర్ వినోకోరోవ్, ఆండ్రీ కాషెచ్కిన్, బాక్సర్ వాసిలీ జిరోవ్, జెన్నాడి గోలోవ్కిన్, రన్నర్ ఓల్గా షిషిగినా, డికాథ్లెట్ డిమిత్రి కార్పోవ్, జిమ్నాస్ట్ అలియా యూసుపోవా, జుడోకా అస్కాట్ జిట్కీవ్, మాగ్జిమ్ టెనాడిఫ్, ఎలిజబెట్ తుర్సిన్బేవా ప్రాధాన్యత సాధించారు.

ప్రముఖ ఉజ్బెకిస్తానీ పోటీదారులలో సైక్లిస్ట్ జమోలిడిన్ అబ్దుజాపరోవ్, బాక్సర్ రుస్లాన్ చాగెవ్, కానోర్ మైఖేల్ కోల్‌గోనోవ్, జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా, టెన్నిస్ ప్లేయర్ డెనిస్ ఇష్టోమిన్, చెస్ ప్లేయర్ రుస్తం కాసిమ్‌ద్జానోవ్, ఫిగర్ స్కేటర్ మిషా జి ప్రాధాన్యత సాధించారు.

ఆర్ధికరంగం

2000-2013 మద్యకాలంలో మద్య ఆసియా జి.డి.పి. అభివృద్ధి తీరు
2005-2013 మద్యకాలంలో మద్య ఆసియా ఆర్థికరంగం అభివృద్ధి తీరు

1990 ల ప్రారంభంలో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి మధ్య ఆసియా రిపబ్లిక్లు క్రమంగా ప్రభుత్వ నియంత్రిత ఆర్థిక వ్యవస్థ నుండి మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు మారుతున్నాయి. అయినప్పటికీ సంస్కరణలు ఉద్దేశపూర్వకంగా క్రమపద్ధతిలో ఎంపిక చేయబడ్డాయి. ఎందుకంటే ప్రభుత్వాలు సామాజిక వ్యయాన్ని పరిమితం చేయడానికి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాయి. మొత్తం ఐదు దేశాలు పోటీతత్వాన్ని మెరుగుపరిచేందుకు నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నాయి. 1019- 2020 లో ఐడబ్ల్యుబి ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్సు (సి.ఐ.ఎస్.లో) కజకిస్తాన్ కూడా చేర్చబడింది.[37] 2019 లో [38] మద్య ఆసియాదేశాలలో ఇలా చేర్చబడిన ఏకైక సిఐఎస్ దేశంగా కజకస్తాన్ గుర్తింపు పొందింది. ముఖ్యంగా వారు పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరిస్తూ వ్యాపార-స్నేహపూర్వక ఆర్థిక విధానాలు ఇతర చర్యల ద్వారా సేవా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ జిడిపిలో వ్యవసాయ వాటాను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. 2005 - 2013 మధ్యకాలంలో తజికిస్తాన్ మినహా మిగిలిన దేశాలలో వ్యవసాయం వాటా పతనం అయింది. పరిశ్రమలు తగ్గిన ప్రాంతాలలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. తుర్క్మెనిస్తాన్లో పరిశ్రమలో వేగవంతమైన అభివృద్ధి కనిపించింది. అయితే మిగతా నాలుగు దేశాలలో సేవల రంగం చాలా పురోగతి సాధించింది.[39]

మధ్య ఆసియా ప్రభుత్వాలు రాజకీయ, ఆర్థిక రంగాలకు వెలుపలి నుండి ఎదురయ్యే ప్రభావాలను తట్టుకుని నిలబడడం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాయి. వాణిజ్య సమతుల్యతను కాపాడుకోవడం, ప్రభుత్వరుణాన్ని తగ్గించడం, జాతీయ నిల్వలను అధికరించడం ఇందులో భాగంగా ఉన్నాయి. 2008 నుండి ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి, అంతర్జాతీయ వాణిజ్యం పునరుద్ధరణలో వైఫల్యం వంటి ప్రతికూల బాహ్య శక్తుల ప్రభావాన్ని వారు పూర్తిగా నిరోధించలేరు. అందుకనే వారు 2008-2009 మద్య సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి తప్పించుకోలేదు. 2008 - 2013 మధ్యకాలంలో మద్య ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి సగటున 7% కంటే ఎక్కువ వృద్ధి చెందినప్పటికీ ఉజ్బెకిస్తాన్‌, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్లలో ఆర్థికాభివృద్ధి కొత క్షీణించింది. అయినప్పటికీ తుర్క్మెనిస్తాన్ 2011 లో 14.7% వృద్ధిని సాధించింది.[39]

2000 ల మొదటి దశాబ్దంలో మద్య ఆసియా రిపబ్లిక్కులలో సంభవించిన విప్లవాత్మకమైన వస్తువుల ఉత్పత్తి కారణంగా ఉత్తమ ప్రయోజనం పొందాయి. కజకస్థాన్, తుర్కుమెనిస్తాన్లలో చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ సొంత నిల్వలు దాదాపు స్వయం సమృద్ధిని కలిగిస్తాయి. కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలలో బంగారు నిల్వలు ఉన్నాయి. కజకిస్తాన్ ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం నిల్వలను కలిగి ఉంది. ఇటీవలి సంవత్సరాలలో పత్తి, అల్యూమినియం, ఇతర లోహాలకు (బంగారం మినహా) ప్రపంచ డిమాండ్ హెచ్చుతగ్గులకు గురైంది. అయినప్పటికీ అల్యూమినియం, ముడి పత్తి దాని ప్రధాన ఎగుమతులుగా ఉన్నాయి. దేశం ప్రాథమిక పారిశ్రామిక ఆస్తిగా తాజిక్ అల్యూమినియం కంపెనీ గుర్తింపు కలిగి ఉంది. వ్యవసాయ మంత్రి 2014 జనవరిలో ఇతర పంటలకు మార్గం సుగమం చేయడానికి పత్తి సాగుక్షేత్రాల విస్తీర్ణత తగ్గించాలనే ఉద్దేశ్యాన్ని వెలిబుచ్చారు. ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్ ప్రధాన పత్తి ఎగుమత్తిచేసే దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు రెండూ 2014 లో ఉత్పత్తిపరంగా ప్రపంచవ్యాప్తంగా వరుసగా ఐదవ - తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి.[39]

గత దశాబ్దంలో ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పెరిగినప్పటికీ మధ్య ఆసియా రిపబ్లిక్కులు ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ముడి పదార్థాల ఎగుమతుల మీద ఆధారపడిన కారణంగా వాణిజ్య భాగస్వామ్యదేశాలలో పరిమితం చేయబడిన ఉత్పత్తులు, అతితక్కువ ఉత్పాదక సామర్థ్యం ఇందుకు ప్రధాన కారణంగా పరిణమించాయి. కిర్గిస్తాన్ జలవనరులు తగినంతగా ఉన్నప్పటికీ వనరులను పేలవంగా పరిగణించడం ప్రతికూలత అధికరించడానికి కారణంగా ఉంది. దాని విద్యుత్తులో ఎక్కువ భాగం జలశక్తి ద్వారా ఉత్పత్తి అవుతుంది.[39]

2010 - 2012 మధ్యకాలంలో కిర్గిజ్ ఆర్థిక వ్యవస్థలో వరుస ఆర్థికసంక్షోభాలు సంభవించాయి. 2010 ఏప్రెలులో ప్రజా తిరుగుబాటుతో అధ్యక్షుడు కుర్మన్‌బెక్ బకియేవ్‌ను పదవి నుండి తొలగించారు. 2011 నవంబరులో అల్మాజ్‌బెక్ అటాంబాయేవ్ ఎన్నిక చేయబడే వరకు మాజీ విదేశాంగ మంత్రి రోజా ఒటున్‌బాయేవా తాత్కాలిక అధ్యక్ష పదవీ బాధ్యత వహించాడు. ఈ రెండు సంవత్సరాల కాలం ఆహార ధరలు అధికరించాయి. 2012 లో ప్రధాన్యతకలిగిన కుమ్టర్ బంగారు గని ఉత్పత్తి 60% క్షీణించింది. ఈ ప్రదేశం భౌగోళికప్రకమ్నలతో బాధించబడింది. జనాభాలో 33.7% మంది 2010 లో సంపూర్ణ పేదరికంలో నివసిస్తున్నారని ప్రపంచబ్యాంకు అభిప్రాయం వెలువరించింది [స్పష్టత అవసరం]. ఒక సంవత్సరం తరువాత ఇది 36.8%కి చేరుకుంది.[39]

ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక వృద్ధిశాతం అధికరించింది. 2013 లో మధ్య ఆసియాలో కజకిస్తాన్ (పిపిపి $ 23,206), తుర్కుమెనిస్తాన్ (పిపిపి $ 14 201) దేశాలలో మాత్రమే తలసరి జిడిపి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సగటు కంటే అధికంగా ఉంది. ఈ ప్రాంతం జనాభాలో 45% మంది నివసిస్తున్న ఉజ్బెకిస్తాన్ తలసరి కొనుగోలుశక్తి $ 5,167 కు క్షీణించింది. కిర్గిస్తాన్, తజికిస్తాన్లలో కూడా కొనుగోలుశక్తి తక్కువగా ఉంది.[39]

ఆసియా ప్రాంతంలో కజకిస్తాతాన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ప్రథమస్తానంలో ఉంది. మధ్య ఆసియాలోని మొత్తం పెట్టుబడిలో 70% కంటే ఎక్కువ కజకస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఆకర్షించింది.[40]

ఆర్థిక ప్రభావం పరంగా మధ్య ఆసియాలో చైనా కీలకమైన ఆర్థికశక్తిగా భావించబడుతుంది. 2013 లో బీజింగులో " బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) " పేరుతో గొప్ప అభివృద్ధి వ్యూహాన్ని ప్రారంభించిన తరువాత చైనాప్రభావం మరింతగా అధికరించింది.[41]

2007 - 2019 మధ్యకాలంలో మధ్య ఆసియా దేశాలు 378.2 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ఆకర్షించాయి. ఈ ప్రాంతానికి పంపిన మొత్తం ఎఫ్‌డిఐలలో కజకిస్తాన్ వాటా 77.7% ఉంది. కజకిస్తాన్ మధ్య ఆసియాలో అతిపెద్ద దేశంగా ప్రత్యేకత కలిగి ఉంది. ఈ ప్రాంతం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) లో 60% కంటే అధికంగా ఉంది.[42]

విద్య - సైంసు - సాంకేతికం

పరిశోధనా నిర్మాణాల ఆధునికీకరణ

మధ్య ఆసియా లోని పరిశోధనాసంస్థలు (" కిర్గిస్తాన్ సైంసు & టెక్నాలజీ " మినహా) ఈప్రాంతంలోని దేశాలన్నింటి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. అలాగే ఈ ప్రాంతంలో జాతీయ అభివృద్ధి పధకాలురచిస్తూ కొత్త హైటెక్ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ అవసరమైన వనరులను సమకూర్చుతున్నాయి. ఈపరిశోధనాసంస్థలు ఈప్రాంతంలో ఎగుమతి మార్కెట్లు అభివృద్ధిపరిచేలా ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. సోవియట్ కాలంలో స్థాపించబడిన అనేక జాతీయ పరిశోధనా సంస్థలు విధానాలు మారుతున్న జాతీయ ప్రాధాన్యతలకు సహరించడంలో విఫలమయ్యాయి. 2009 నుండి మద్య ఆసియా దేశాలు ప్రస్తుత సంస్థలను సమైక్యపరచడానికి చేపట్టిన ప్రక్రిలు జాతీయ పరిశోధనా సంస్థల సంఖ్యను తగ్గించటానికి దారితీశాయి. 2014 లో తుర్కుమెనిస్తాన్ " అకాడమీ ఆఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ విలీనం చేయబడ్డాయి: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోటనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్లతో విలీనం చేయబడి తరువాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ అండ్ మెడిసినల్ ప్లాంట్లుగా మారింది; సన్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ తో విలీనం చేయబడి తరువాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీగా మారింది; ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలజీ స్టేట్ సర్వీస్ ఫర్ సీస్మోలజీతో విలీనం చేయబడిన తరువాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలజీ అండ్ అట్మాస్ఫియరిక్ ఫిజిక్సుగా మారింది. సమస్య పరిష్కారానికి విద్యా పరిశోధనలను ఓరియంట్ చేయడం, ప్రాథమిక, అనువర్తిత పరిశోధనల మధ్య కొనసాగింపును నిర్ధారించడం దీని లక్ష్యంగా చేసుకుని 2012 ఫిబ్రవరిలో ఉజ్బెకిస్తానులో మంత్రుల కేబినెట్ ఉత్తర్వు జారీ చేసిన తరువాత అకాడమీ ఆఫ్ సైన్సెసుకు చెందిన 10 సంస్థలకంటే అధికం పునర్వ్యవస్థీకరించబడ్డాయి. ఉదాహరణకు మేథమెటికల్ & ఇంఫర్మేషన్ టెక్నాలజీ పరిశోధన సంస్థ ఉజ్బెకిస్తాన్ జాతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ కాంప్రహెన్సివ్ రీసెర్చ్ సమర్కాండ్ స్టేట్ యూనివర్శిటీలోని పర్యావరణ సమస్య పరిష్కార ప్రయోగశాలగా మార్చబడింది. ఇతర పరిశోధనా సంస్థలు ఉజ్బెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, సెంటర్ ఆఫ్ జెనోమిక్స్ & బయోఇన్ఫర్మేటిక్స్ వంటి సంస్థలకు అనుసంధానించబడి ఉన్నాయి.[39]

కజకిస్తాన్, తుర్కుమెనిస్తాన్ కూడా మౌలిక సదుపాయాలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా టెక్నాలజీ పార్కులను నిర్మిస్తున్నాయి. 2011 లో తుర్కుమెనిస్తాన్ రాజధాని అష్గాబాట్ సమీపంలోని బిక్రోవా గ్రామంలో టెక్నోపార్క్ నిర్మాణం ప్రారంభమైంది. ఇది పరిశోధన, విద్య, పారిశ్రామిక సౌకర్యాలు, వ్యాపార ఇంక్యుబేటర్లు, ప్రదర్శన కేంద్రాలను మిళితం చేస్తుంది. టెక్నోపార్క్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (సూర్యుడు, గాలి), నానోటెక్నాలజీల సమీకరణ మీద పరిశోధన చేస్తుంది. 2010 - 2012 మధ్య, తూర్పు, దక్షిణ, ఉత్తర కజకిస్తాన్ ప్రాంతాలలో ఓబ్లాస్ట్సు (అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు), రాజధాని నూర్-సుల్తాన్లలో సాంకేతిక పార్కులు ఏర్పాటు చేయబడ్డాయి. తూర్పు కజాకిస్తాన్ ఓబ్లాస్టులలో మెటలర్జీ కొరకు ఒక కేంద్రం కూడా స్థాపించబడింది. అదే విధంగా " ప్లాన్డు కాస్పియన్ ఎనర్జీ హబ్‌" లో భాగమైన ఆయిల్ అండ్ గ్యాస్ టెక్నాలజీస్ సెంటర్. అదనంగా, 2008 లో స్థాపించబడిన ఉమ్మడి స్టాక్ సంస్థ పరాసత్ నేషనల్ సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ హోల్డింగులో భాగంగా కజకిస్థానులో " సెంటర్ ఫర్ టెక్నాలజీ కమర్షియలైజేషన్ " 100% ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తూ ఉంది. ఈ కేంద్రం టెక్నాలజీ మార్కెటింగ్, మేధో సంపత్తి రక్షణ, టెక్నాలజీ లైసెన్సింగు కాంట్రాక్టులు, స్టార్టపులలో పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. కజకిస్తానులో ఈ కేంద్రం టెక్నాలజీ ఆడిట్ నిర్వహించడం, పరిశోధన ఫలితాలు, సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్యీకరణను చట్టపరంగా నియంత్రించాలని యోచిస్తోంది.[39]

Trends in research expenditure in Central Asia, as a percentage of GDP, 2001–2013. Source: UNESCO Science Report: 2030 (2015), Figure 14.3

మద్య ఆసియాదేశాలు సాంప్రదాయవిధానంలో ఉత్పత్తిచేసే రంగాలలో సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. వ్యాపార రంగాన్ని, విద్య & పరిశోధనలను అభివృద్ధి చేయడానికి సౌరశక్తి వంటి ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమాచార రంగం & సమాచార సాంకేతిక పరిజ్ఞానం అధికంగా ఉపయోగించుకుంటాయి. 2013 మార్చిలో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడి ఆదేశంతో " ఆసియా అభివృద్ధి బ్యాంకు", ఇతర సంస్థల నిధులతో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి రెండు పరిశోధనా సంస్థలు సృష్టించబడ్డాయి: ఎస్.పి.యు ఫిజికల్ - టెక్నికల్ ఇన్స్టిట్యూట్ (ఫిజిక్స్ సన్ ఇన్స్టిట్యూట్), అంతర్జాతీయ సౌర శక్తి ఇన్స్టిట్యూట్. 2011 లో ఆర్థిక రంగాలలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి మూడు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి: కజకిస్తాన్లోని నాజర్బాయేవ్ విశ్వవిద్యాలయం (2011 లో మొదటిసారి), అంతర్జాతీయ పరిశోధనా విశ్వవిద్యాలయం, ఉజ్బెకిస్తాన్లోని ఇన్హా విశ్వవిద్యాలయం (2014 లో మొదటిసారి), సమాచార & సమాచార సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రత్యేకత, తుర్కుమెనిస్తాన్లోని ఇంటర్నేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ విశ్వవిద్యాలయం (2013 లో స్థాపించబడింది). కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ రెండూ అంతర్జాతీయ సంబంధాలను సులభతరం చేయడానికి పాఠశాలలో విదేశీ భాషల బోధనను అనుమతిస్తున్నాయి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ రెండూ వరుసగా 2007 - 2012 లో మూడు-స్థాయిలలో; బ్యాచిలర్, మాస్టర్సు, పిహెచ్డి డిగ్రీ పద్ధతిని అవలంబించాయి. క్రమంగా ఇది సోవియట్ విధానంలో విద్యాబోధన చేయబడుతున్న డాక్టర్స్ ఆఫ్ సైన్సుకు ప్రత్యామ్నాయంగా మారింది. 2010 లో కజకిస్తాన్ ఐరోపాలో ఉన్నత విద్యావ్యవస్థలను సమన్వయంచేడానికి రూపొందించబడిన బోలోగ్నా ప్రాసెస్ లోని మధ్య ఆసియా సభ్యదేశంగా అవతరించింది.[39]

పరిశోధనావిభాగంలో ఆర్ధిక పెట్టుబడులు

వ్యాపారరంగం, విద్య & పరిశోధన రంగాలను అభివృద్ధిచేయాలని కోరుకున్న మద్య ఆసియా దేశాల ఆశయానికి ఈ రంగాలలో బలహీనమైన దీర్ఘకాల పెట్టుబడులు ఆటకం కలిగించాయి. దశాబ్ధంకంటే అధికకాలంలో మద్య ఆసియా దేశాలు జి.డి.పిలో 0.2%-03% మాత్రమే పరిశోధన & అభివృద్ధి కొరకు కేటాయించాయి. ఉజ్బెకిస్తాన్ ఈ విధానాన్ని కొంతగా అధిగమిస్తూ జి.డి.పి.లో 0.41% పరిశోధన & అభివృద్ధి కొరకు కేటాయించాయించింది.[39]

మద్య ఆసియా దేశాలలో కజకిస్తాన్ మాత్రమే వ్యాపార సంస్థ, లాభాపేక్షలేని ప్రైవేట్ రంగాలు, పరిశోధన & అభివృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తుంది. అయినప్పటికీ కజకిస్తానులో తీవ్రమైన పరిశోధనాభివృద్ధి జరగడం లేదు: 2013 లో కజకిస్తాన్ జిడిపిలో కేవలం 0.18% మాత్రమే పరిశోధాభివృద్ధి కొరకు కేటాయించింది. కొన్ని పారిశ్రామిక సంస్థలు కజకిస్థానులో పరిశోధనలు చేస్తున్నాయి . యునెస్కో ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ నిర్వహించిన ఒక సర్వే ఆధారంగా దేశంలోని ఉత్పాదక సంస్థలలో ఎనిమిది (12.5%) మాత్ర2012 మేలో ఆవిష్కరణలో చురుకుగా ఉన్నాయని భావిస్తున్నారు. సంస్థలు యంత్రాలు, పరికరాలలో నిక్షిప్తం చేసిన సాంకేతిక కలిగినవి యంత్రాలు పరికరాలను దిగుమతిచేసుకోవడానికి మక్కువచూపుతాయి. సంస్థలు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే లైసెన్సులను, పేటెంట్లను కేవలం 4% మాత్రమే సంస్థలు కొనుగోలు చేస్తాయి. అయినప్పటికీ 1997 లో కంటే 2008 లో సంస్థలు శాస్త్రీయ & సాంకేతిక సేవలకు 4.5 రెట్లు ఎక్కువ కేటాయించిన కారణంగా పరిశోధన ఉత్పత్తులకు గిరాకీ అభివృద్ధికావడం కనిపిస్తోంది.[39]

Central Asian researchers by sector of employment (HC), 2013. Source: UNESCO Science Report: towards 2030 (2015), Figure 14.5

Trends in researchers

మధ్య ఆసియా దేశాలలో కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు మాత్రమే అత్యధిక సంఖ్యలో పరిశోధకులు ఉన్నారు. మిలియన్ జనాభాకు పరిశోధకుల సంఖ్య కజకిస్తానులో 1,046 మంది ఉన్నారు. ఇది ప్రపంచ సగటు (2013 లో 1,083) కు దగ్గరగా ఉంది. ఉజ్బెకిస్తానులో (1,097) పరిశోధకులు ఉన్నారు. ఇది ప్రపంచ సగటు కంటే అధికం.[39]

మధ్య ఆసియా దేశాలలో కజకస్థాను మాత్రమే వ్యాపార సంస్థలు, లాభాపేక్షలేని ప్రైవేట్ రంగాలు, పరిశోధన & అభివృద్ధి కొరకు గణనీయమైన కృషి చేసేన దేశంగా గుర్తించబడుతుంది. ఉన్నత విద్య మీద అధికంగా ఆధారపడిన ఉజ్బెకిస్థాన్ హానికర పరిస్థితిలో ఉంది; 2013 లో మూడొంతుల మంది పరిశోధకులు విశ్వవిద్యాలయాలలో పనిచేస్తుండగా వ్యాపార సంస్థ రంగంలో కేవలం 6% మంది పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది ఉజ్బెక్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పదవీ విరమణకు చేరుకోవడంతో ఈ అసమతుల్యత ఉజ్బెకిస్తాన్ పరిశోధన భవిష్యత్తును దెబ్బతీస్తుంది. సైన్స్, డాక్టర్ ఆఫ్ సైన్స్ లేదా పిహెచ్‌డి అభ్యర్థులందరూ దాదాపు 40 ఏళ్లు పైబడినవారు ఉండగా మొత్తం పరిశోధకులలో సగం మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు; ముగ్గురు పరిశోధకులలో ఒకరు (38.4%) పిహెచ్‌డి డిగ్రీ లేదా దానికి సమానమైన హోదా కలిగినవారు ఉండగా మిగిలినవారు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు.[39]

Central Asian researchers by field of science, 2013. Source: UNESCO Science Report: towards 2030 (2015), Figure 14.4

సోవియట్ యూనియన్ పతనం నుండి కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలలో 40% మహిళా పరిశోధకులు ఉన్నారు. కజకిస్తాన్ పరిశోధకులలో లింగ సమానత్వాన్ని కూడా సాధించింది. కజఖ్ మహిళలు వైద్య & ఆరోగ్య పరిశోధనలలో ఆధిపత్యం చెలాయించారు. 2013 లో 45–55% ఇంజనీరింగ్, టెక్నాలజీ పరిశోధకులు ప్రాతినిధ్యం వహించారు. తజికిస్తాన్‌లో, ముగ్గురు శాస్త్రవేత్తలలో ఒకరు (34%) 2013 లో ఒక మహిళ ఉంది. తాజిక్ మహిళలకు సమాన హక్కులు, అవకాశాలను ఇవ్వడానికి విధానాలు అమలులో ఉన్నప్పటికీ అది పూర్తిగా అర్ధం చేసుకోవడంలో వైఫల్యం కొనసాగుతుంది. 2007 లో ఆమోదించబడిన ఒక చట్టం కారణంగా తుర్కుమెనిస్తాన్ మహిళలకు ప్రభుత్వం పురుషులతో సమానహోదా కల్పించబడింది. డేటా అందుబాటులో లేని కారణంగా పరిశోధన చట్టం ప్రభావం గురించి ఎటువంటి తీర్మానాలు చేయడం సాధ్యపడటం లేదు. తుర్కుమెనిస్తాన్ కూడా ఉన్నత విద్య, పరిశోధన వ్యయం లేదా పరిశోధకుల డేటా అందుబాటులో ఉంచదు.[39]

Table: PhDs obtained in science and engineering in Central Asia, 2013 or closest year

PhDsPhDs in sciencePhDs in engineering
TotalWomen (%)TotalWomen (%)Total per million pop.Women PhDs per million pop.TotalWomen (%)Total per million pop.Women PhDs per million pop.
Kazakhstan (2013)2475173604.42.737382.30.9
Kyrgyzstan (2012)49963916316.610.45463
Tajikistan (2012)33111313.914
Uzbekistan (2011)83842152305.41.611827.0

Source: UNESCO Science Report: towards 2030 (2015), Table 14.1

Note: PhD graduates in science cover life sciences, physical sciences, mathematics and statistics, and computing; PhDs in engineering also cover manufacturing and construction. For Central Asia, the generic term of PhD also encompasses Candidate of Science and Doctor of Science degrees. Data are unavailable for Turkmenistan.

Table: Central Asian researchers by field of science and gender, 2013 or closest year

Total researchers (head counts)Researchers by field of science (head counts)
Natural SciencesEngineering and technologyMedical and health sciencesAgricultural sciencesSocial sciencesHumanities
TotalPer million pop.Number of womenWomen (%)TotalWomen (%)TotalWomen (%)TotalWomen (%)TotalWomen (%)TotalWomen (%)TotalWomen (%)
Kazakhstan

2013

17,1951,0468,84951.55,09151.94,99644.71,06869.52,15043.41,77661.02 11457.5
Kyrgyzstan

2011

2,22441296143.259346.556730.039344.021250.015442.925952.1
Tajikistan

2013

2,15226272833.850930.320618.037467.647223.533525.725634.0
Uzbekistan

2011

30,8901,09712,63940.96,91035.34,98230.13,65953.61,87224.86,81741.26,65052.0

Source: UNESCO Science Report: towards 2030 (2015), Table 14.1

Research output

Scientific publications from Central Asia catalogued by Thomson Reuters' Web of Science, Science Citation Index Expanded, 2005–2014, UNESCO Science Report: towards 2030 (2015), Figure 14.6

థామ్సన్ రాయిటర్స్ వెబ్ సైన్స్ (సైన్స్ సైటేషన్ ఇండెక్స్) ఆధారంగా 2005 - 2014 మధ్య కాలంలో మధ్య ఆసియాలో ప్రచురించబడిన పరిశోధనాపత్రాల సంఖ్య 50% అధికరించిందని అంచనా వేయబడింది. ఈ పరిశోధనకు కజకిస్తాన్ నాయకత్వం వహించింది. కజకిస్తాన్ ఈ పరిశోధనలలో ఉజ్బెకిస్తానును అధిగమించి ఈ ప్రాంతంలో అత్యంత ఫలవంతమైన పరిశోధనా ప్రచురణకర్తగా అవతరించింది. 2005 - 2014 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో వెలువరించబడిన కజకిస్తాన్ శాస్త్రీయ పత్రాల వాటా 35% నుండి 56%కి అధికరించింది. ఈ ప్రాంతంలో ప్రచురించబడిన పత్రాలలో మూడింట రెండు వంతులు విదేశీ సహ రచయితని కలిగి ఉన్నారు. ప్రధాన భాగస్వాముల మధ్య ఆసియా నుండి మాత్రమేగాక రష్యన్ ఫెడరేషన్, యుఎస్ఎ, జర్మన్, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్ నుండి కూడా వచ్చారు.[39]

2008 - 2013 మధ్య 5 కజఖ్ పేటెంట్లు యుఎస్ పేటెంట్, ట్రేడ్మార్కు కార్యాలయంలో నమోదు చేయబడ్డాయి. ఇందులో ఉజ్బెక్ ఆవిష్కర్తలు ముగ్గురు ఉన్నారు. మిగిలిన మూడు మధ్య ఆసియా రిపబ్లిక్లైన కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తానులు ఎటువంటి పేటెంట్లు నమోదు చేయలేదు.[39]

2008 - 2013 మధ్యకాలంలో సైన్స్ రంగాల వారీగా మద్య ఆసియన్ల వ్యాసాల మొత్తం. మూలం: యునెస్కో సైన్స్ రిపోర్ట్: 2030 (2015) వైపు, మూర్తి 14.6

మధ్య ఆసియాలో హైటెక్ ఉత్పత్తులలో కజకిస్తాన్ ప్రధాన వ్యాపారదేశంగా ఉంది. 2008 - 2013 మధ్య కజజస్తాన్ దిగుమతులు 2.7 బిలియన్ డాలర్ల నుండి 5.1 బిలియన్ డాలర్లకు చేరాయి. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ల దిగుమతులు అభివృద్ధి చెందాయి. 2008 లో ఈ ఉత్పత్తుల పెట్టుబడులు $ 744 మిలియన్ల డాలర్లు ఉండగా ఐదు సంవత్సరాల కాలానికి $ 2.6 బిలియన్లకు చేరుకున్నాయి. క్రమంగా ఎగుమతులు మరింతగా అభివృద్ధి చెంది 2.3 బిలియన్ డాలర్ల నుండి 3.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రసాయన ఉత్పత్తులలో (ఔషధాలు కాకుండా) కూడా కజకిస్తాన్ ఆధిపత్యం చెలాయించింది. ఇది 2008 లో మద్య ఆసియా దేశాలలో మూడింట రెండు వంతుల ఎగుమతులు (US $ 1.5 బిలియన్) 83% ఉన్నాయని సూచిస్తుంది. 2013 లో ఈ ఎగుమతులు $ 2.6 బిలియన్లకు చేరుకున్నాయి.[39]

International cooperation

ఐరోపాలో భద్రత, సహకార సంస్థ, ఆర్థిక సహకార సంస్థ, షాంఘై సహకార సంస్థతో సహా పలు అంతర్జాతీయ సంస్థలలో 5 మధ్య ఆసియా రిపబ్లిక్లలో సభ్యత్వం ఉంది. ఈ రిపబ్లిక్కులు మద్య ఆసియా రీజినల్ ఎకనామిక్ కోఆపరేషన్ (CAREC) కార్యక్రమంలో కూడా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆఫ్ఘనిస్తాన్, అజర్బైజాన్, చైనా, మంగోలియా, పాకిస్తాన్ దేశాలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ సహకారాన్ని మరింత అధికరించడానికి 2011 నవంబరు ఈ 10 సభ్య దేశాలు " సి.ఎ.ఆర్.ఇ.సి 2020 స్ట్రాటజీని " అనుసరించాయి. 2020 నుండి దశాబ్దకాలంలో సభ్యదేశాల మద్య పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి రవాణా, వాణిజ్యం, ఇంధనంలో ప్రాధాన్యత ప్రాజెక్టులలో $ 50 బిలియన్ల అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టబడుతున్నాయి. మద్య ఆసియా భూబంధిత దేశాలు తమ రవాణా నెట్వర్కులు ఇంధనం, సమాచారం, నీటిపారుదల వ్యవస్థలను నిర్వహించడం, అభివృద్ధి చేయడం వంటి విషయాలలో ఒకరికి ఒకరు సహకరించుకోవలసిన అవసరాన్ని గ్రహించాయి. కాస్పియన్ సముద్రానికి కజకిస్తాన్, అజర్బైజాన్, తుర్కుమెనిస్తాన్ మాత్రమే సరిహద్దుగా ఉన్నప్పటికీ ఏ రిపబ్లిక్లలో సముద్రంలోకి ప్రత్యక్ష ప్రవేశం లేదు. హైడ్రోకార్బన్ల ప్రపంచ మార్కెట్లకు రవాణాను క్లిష్టతరం చేస్తుంది.[39]

2014 లో బెలారస్, రష్యన్ ఫెడరేషన్‌తో పాటు యురేషియన్ ఎకనామిక్ యూనియన్ వంటి మూడు వ్యవస్థాపక సభ్యదేశాలలో కజకిస్తాన్ కూడా ఒకటిగా ఉంది. అర్మేనియా, కిర్గిజకిస్తాన్ ఈ సంస్థలలో సభ్యదేశాలు అయ్యాయి. సభ్య దేశాల మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీలో సహకారం ఇప్పటికే గణనీయంగా చట్టపరమైన గ్రంథాలలో క్రోడీకరించబడింది. ప్రభుత్వ ప్రయోగశాలలు, విద్యాసంస్థల మధ్య సహకారం మీద పరిమితంగా అదనపుభారాన్ని మోపుతుందని యురేషియన్ ఎకనామిక్ యూనియన్ భావిస్తున్నారు. ఇది వ్యాపార సంబంధాలను ప్రోత్సహించ సైంటిఫిక్ చైతన్యం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇది స్వేచ్ఛాయుతమైన శ్రామిక ప్రవేశం, ఏకీకృత పేటెంట్ నిబంధనలను కలిగి ఉంటుంది.[39][43]

యురేషియన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఇన్నోవేటివ్ బయోటెక్నాలజీ ప్రోగ్రాం (2011–2015) లో కజకిస్తాన్, తజికిస్తాన్ పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బెలారస్, రష్యన్ ఫెడరేషన్ కూడా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో వార్షిక బయో-ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ సమావేశంలో బహుమతులు ప్రదానం చేయబడ్డాయి. 2012 లో 86 రష్యన్ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అదనంగా బెలారస్ నుండి 3, కజకిస్తాన్ నుండి 1, తజికిస్తాన్ నుండి 3, జర్మనీ నుండి 2 శాస్త్రీయ పరిశోధన బృందాలు పాల్గొన్నాయి. ఆ సమయంలో జెనెటికా స్టేట్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్, రష్యన్ ఫెడరేషన్లో మైక్రో ఆర్గానిజం సంస్థల సైంటిఫిక్ డైరెక్టర్ వ్లాదిమిర్ డెబాబోవ్ "బయో ఇండస్ట్రీ" అభివృద్ధి చేయడం అవసరమని నొక్కి చెప్పాడు. " ప్రస్తుతం ప్రపంచం పెట్రోకెమికల్స్ నుండి పునరుత్పాదక జీవ వనరులకు మారుతున్న ధోరణి బలంగా ఉంది" అని ఆయన అన్నాడు. 'రసాయనాల కంటే బయోటెక్నాలజీ రెండు, మూడు రెట్లు వేగంగా అభివృద్ధి చెందుతోంది.[39]

రష్యన్ వెంచర్ కంపెనీ (నిధుల ప్రభుత్వ నిధి), కజఖ్ జెఎస్సి నేషనల్ ఏజెన్సీ మధ్య ఒప్పందం కుదుర్చుకుని 2013 ఏప్రిల్ 3 న కజకిస్తాన్ యురేషియన్ ఎకనామిక్ కమ్యూనిటీ రెండవ ప్రాజెక్టు సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, బెలారసియన్ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ స్థాపనలో పాల్గొంది. ఈ ప్రాజెక్టులు అన్నింటిలో $ 3-90 మిలియన్ల నిధుల పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉంది. ఇది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో అమలు చేయబడుతుంది. కొన్ని ప్రాజెక్టులు సూపర్ కంప్యూటర్లు, అంతరిక్ష సాంకేతికతలు, ఔషధం, పెట్రోలియం రీసైక్లింగ్, నానోటెక్నాలజీలు, సహజ వనరుల పర్యావరణ వినియోగం మీద దృష్టి సారించాయి. ఈ ప్రారంభ ప్రాజెక్టులు ఆచరణీయమైన వాణిజ్య ఉత్పత్తులను సృష్టించిన తర్వాత వెంచర్ కంపెనీ కొత్త ప్రాజెక్టులలో లాభాలను ఆర్జించడానికి తిరిగి పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఈ వెంచర్ కంపెనీ పూర్తిగా ఆర్థిక నిర్మాణం కాదు; పాల్గొనే మూడు దేశాలలో ఉమ్మడి ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి కూడా ఇది రూపొందించబడింది.[39] కజకిస్తాన్ కోవిడ్ 19 సంక్షోభం పరిణామాలను పరిష్కరించడానికి పౌర సమాజ కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరాన్ని గుర్తించింది. [44]

2013 సెప్టెంబరులో యూరోపియన్ యూనియన్ ప్రారంభించిన ప్రాజెక్టులో 4 మధ్య ఆసియా రిపబ్లిక్లు కూడా పాల్గొన్నాయి. యూరోపియన్ యూనియన్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఎనిమిదవ పరిశోధన & ఆవిష్కరణ నిధుల కార్యక్రమం అయిన " హారిజోన్ 2020 " పరిశోధన ప్రాజెక్టులలో మధ్య ఆసియా దేశాలను పాల్గొనేలా ప్రోత్సహించడం. ఈ పరిశోధన ప్రాజెక్టులు యూరోపియన్ యూనియన్, మధ్య ఆసియా రెండూ పరస్పర ఆసక్తికరంగా పరిగణించబడే మూడు సామాజిక సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాయి. అవి: వాతావరణ మార్పు, శక్తి & ఆరోగ్యం. తూర్పు ఐరోపా, దక్షిణ కాకసస్, పశ్చిమ బాల్కన్ల మునుపటి ప్రాజెక్టుల అనుభవాన్ని ప్రేరణగా తీసుకుని ఇంకోనెట్ సి.ఎ నూతన ప్రాజెక్టుల రూపకల్పన చేస్తుంది. మధ్య ఆసియా, ఐరోపాలో సమైక్య పరిశోధన సౌకర్యాల మీద ఇంకోనెట్ సిఎ దృష్టి సారించింది. ఇందులో ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, జర్మనీ, హంగరీ, కజకస్తాన్, కిర్గిజ్స్తాన్, పోలాండ్, పోర్చుగల్, తజికిస్తాన్, టర్కీ, ఉజ్బెకిస్తాన్ దేశాల భాగస్వామి సంస్థల కన్సార్టియం ఉంటుంది. 2014 మేలో యూరోపియన్ యూనియన్ జంట సంస్థల నుండి - విశ్వవిద్యాలయాలు, కంపెనీలు, పరిశోధనా సంస్థల నుండి 24 మాసాల ప్రాజెక్టు అనువర్తనాల కోసం పిలుపునిచ్చింది. వర్క్‌షాపులు వంటి ఉమ్మడి సంఘటనలు ప్రాజెక్టుకు అవసరమైన నిధులగురించి చర్చించి సిద్ధం చేయడానికి, పరస్పర వనరులను సందర్శించడానికి ఇది వీలు కల్పిస్తుంది.[39]

1992 లో ఆయుధ శాస్త్రవేత్తలను పౌర పరిశోధన ప్రాజెక్టులలో నిమగ్నం చేయడానికి, సాంకేతిక బదిలీని ప్రోత్సహించడానికి యూరోపియన్ యూనియన్, జపాన్, రష్యన్ ఫెడరేషన్, యుఎస్ కలిసి సమైక్యంగా అంతర్జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఐ.ఎస్.టి.సి)ను స్థాపించింది. ఒప్పందాల ఆధారంగా కొన్నిదేశాలలో ఐ.ఎస్.టి.సి. శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి: అర్మేనియా, బెలారస్, జార్జియా, కజకస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్. 2014 జూన్ మాసంలో రష్యన్ ఫెడరేషన్ కేంద్రం నుండి వైదొలగాలని ప్రకటించిన మూడు సంవత్సరాల తరువాత ఐ.ఎస్.టి.సి. ప్రధాన కార్యాలయాన్ని కజకిస్తాన్లోని నాజర్బాయేవ్ విశ్వవిద్యాలయానికి తరలించారు.[39] 1998, 2013, 2015 నుండి కిర్గిస్తాన్, తజికిస్తాన్, కజకస్తాన్ వరుసగా ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నాయి.[39]

Territorial and regional data

CountryArea
km2
Population[45]
(2016)
Population density
per km2
Nominal GDP (2017)
GDP per capita
(2017)
HDI (2017)CapitalOfficial languages
Kazakhstan2,724,90017,987,7366.3$160.839 billion$8,8410.788Nur-SultanKazakh, Russian
Kyrgyzstan199,9505,955,73429.7$7.061 billion$1,1440.655BishkekKyrgyz, Russian
Tajikistan142,5508,734,95160.4$7.146 billion$8240.624DushanbeTajik, Russian
Turkmenistan488,1005,662,54411.1$37.926 billion$6,6430.688AshgabatTurkmen
Uzbekistan448,97833,905,800[46]69.1$47.883 billion$1,4910.701TashkentUzbek

గణాంకాలు

Ethnic map of Central Asia.
White areas are thinly-populated semi-desert.
The three northwest-tending lines are the Oxus and Jaxartes Rivers flowing from the eastern mountains into the Aral Sea and in the south the irrigated north side of the Kopet Dagh mountains.
Uzbek children in Samarkand
Children in Afghanistan

మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్లతో సహా మధ్య ఆసియాలో 90 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారని అంచనా. ఇది ఆసియా మొత్తం జనాభాలో 2% ఉంటుందని అంచనా. ఆసియా ప్రాంతాలలో ఉత్తర ఆసియాలో మాత్రమే జనసాంధ్రత తక్కువ ఉంటుంది. ఈ ప్రాంతం ఒక చదరపు కిమీకు 9 మంది జనసాంద్రతను కలిగి ఉంది. ఖండంలోని మొత్తం చదరపు కిమీ 80.5 మందితో పోలిచి చూసినట్లైతే ఇది చాలా తక్కువ.

భాషలు

మధ్య ఆసియాలోని ఆరు మిలియన్ల జాతి రష్యన్లు, ఉక్రేనియన్లు రష్యన్ భాష మాట్లాడుతున్నారు.[47] రష్యన్ భాష మధ్య ఆసియా మాజీ సోవియట్ రిపబ్లిక్కులు అన్నింటిలో సాధారణంగా వాడుకలో ఉంది. మాండరిన్ చైనీస్ ఇన్నర్ మంగోలియా, కింగ్‌హై, జిన్జియాంగ్‌లలో మంగోలియన్ భాష ఆధిపత్యం కలిగి ఉంది.

మాజీసోవియట్ మధ్య ఆసియా రిపబ్లిక్లలోని మెజారిటీ నివాసుల భాషలు టర్కిక్ భాషా సమూహానికి చెందినవి. తుర్క్మెనిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, టర్కీలలో టర్కుమెన్ భాష మైనారిటీ భాషగా మాట్లాడతారు. కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్ అంతటా, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జిన్జియాంగ్లలో తుర్కిక్ భాషల సమూహానికించెందిన కజఖ్ భాష, కిర్గిజ్ భాష, కిప్చక్ భాషా సంబంధింత భాషలు మైనారిటీ భాషలుగా మాట్లాడతారు. ఉజ్బెక్స్తాన్, తజికిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఆఫ్ఘనిస్తాన్, జిన్జియాంగ్లలో ఉజ్బెక్ భాష, ఉయ్ఘుర్ భాషలు మాట్లాడతారు.

మంగోలియన్ భాషతో కూడిన టర్కిక్ భాషలు ఆల్టాయిక్ భాషా కుటుంబానికి చెందినవి కావచ్చు అని భావిస్తున్నప్పటికీ ఇది కొంత వివాదస్పదమైనదని భావిస్తున్నారు. మంగోలియా అంతటా, బురియాటియా, కల్మిక్, ఇన్నర్ మంగోలియా, జిన్జియాంగ్ మంగోలియన్ భాష మాట్లాడతారు.

ఒకప్పుడు మధ్య ఆసియా అంతటా మధ్య ఇరానియన్ భాషలు వాడుకలో ఉండేది. ఒకప్పుడు ప్రధానంగా వాడుకలో ఉన్న సోగ్డియన్, ఖ్వారెజ్మియన్, బాక్టీరియన్, సిథియన్ వంటి భాషలు ఇప్పుడు అంతరించిపోయాయి. ప్రస్తుతం ఇవి తూర్పు ఇరానియన్ కుటుంబానికి చెందినవిగా ఉనికిలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, వాయవ్య పాకిస్తాన్లలో తూర్పు ఇరానియన్ పాష్టో భాష ఇప్పటికీ వాడుకలో ఉంది. ఇతర చిన్న తూర్పు ఇరానియన్ భాషలైన షుగ్ని, ముంజి, ఇష్కాషిమి, సరికోలి, వాఖీ, యాగ్నోబి, ఒస్సేటిక్ భాషలు కూడా మధ్య ఆసియాలోని వివిధ ప్రదేశాలలో వాడుకలో ఉన్నాయి. స్థానికంగా డారి (ఆఫ్ఘనిస్తాన్‌లో), తాజిక్ (తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లో), బుఖోరి (మధ్య ఆసియాలోని బుఖారన్ యూదులచే) అని పిలువబడే పర్షియన్ భాషలు ఈ ప్రాంతాలలో ప్రధాన భాషలుగా వాడుకలో ఉన్నాయి.

ఇండో-యూరోపియన్ భాషా సమూహానిక్ చెందిన తోచారియన్ ఒకప్పుడు జిన్జియాంగ్ లోని తారిమ్ బేసిన్ ఉత్తర అంచున ఉన్న ఒయాసిస్లో ప్రధానంగా ఉన్నప్పటికీ ఇప్పుడు అంతరించిపోయింది.

టిబెటిక్ భాషలతో కూడిన ఇతర భాషలు టిబెటన్ పీఠభూమి అంతటా, కింగ్‌హై, సిచువాన్, లడఖ్, బాల్టిస్తాన్, ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్, నూరిస్తానీ ప్రాంతాలలో నివసిస్తున్న ఆరు మిలియన్ల మందికి వాడుక భాషగా ఉన్నాయి. తూర్పు ఆఫ్ఘనిస్తాన్, గిల్గిట్-బాల్టిస్తాన్, పాకిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, వివాదాస్పద భూభాగం అయిన కాశ్మీర్లలో కూడా షినా, కాశ్మీరీ, పాషాయి, ఖోవర్ వంటి దార్డిక్ భాషలు వాడుకలో ఉన్నాయి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లలో కొరియో-శరం అనే అల్పసఖ్యాక ప్రజలకు కొరియన్ భాష వాడుక భాషాగా ఉంది.[48]

మతం

మధ్య ఆసియా రిపబ్లిక్కులు ఆఫ్ఘనిస్తాన్, జిన్జియాంగ్, బాష్కోర్టోస్తాన్ వంటి పరాధీయ పశ్చిమ ప్రాంతాలలో ఇస్లాం మతం సర్వసాధారణం. ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్లలో గణనీయమైన షియా మైనారిటీలు ఉన్నప్పటికీ చాలా మంది మధ్య ఆసియా ముస్లింలు సున్నీ

ఇస్లాం రాకకు ముందు మధ్య ఆసియాలో బౌద్ధమతం, జొరాస్ట్రియనిజం మతాలు ప్రధానమతాలుగా ఉన్నాయి. మధ్య ఆసియాలోని ఐదు రాష్ట్రాల్లో జరిగే నౌరూజ్ వంటి వేడుకలలో ఇప్పటికీ జొరాస్ట్రియన్ ప్రభావం ఉంది.[49] సిల్క్ రోడ్ ప్రాంతాలలో అభివృద్ధి చెందిన బౌద్ధమతప్రచారం చివరికి చైనాలో భౌద్ధమతం ఆధిక్యత కలిగి ఉండడానికి దారితీసింది.[50] టర్కీ ప్రజలలో ఇస్లాంకు ముందు టెన్గ్రిజం ప్రధానమతంగా ఉంది.[51] టిబెట్, మంగోలియా, లడఖ్, సైబీరియాలోని దక్షిణ రష్యన్ ప్రాంతాలలో టిబెటన్ బౌద్ధమతం ప్రధానమతంగా ఉంది.

మునుపటి శతాబ్దాలలో ఈ ప్రాంతంలో అధికంగా క్రైస్తవ మతం నెస్టోరియనిజం ఆచరించబడ్డాయి. అయినప్పటికీ ప్రస్తుతం కజకిస్తాన్‌లో రష్యన్ ఆర్థోడాక్స్ చర్చికి సభ్యులు అత్యధికసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ నివసిస్తున్న 19 మిలియన్ల జనాభాలో 25% ప్రజలు క్రైస్తవమతాన్ని ఆచరిస్తున్నట్లుగా గుర్తించారు. ఉజ్బెకిస్తాన్‌లో 17%, కిర్గిజ్స్తాన్లో 5% ప్రజలు క్రైస్తవమతాన్ని ఆచరిస్తున్నారు.

ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్లలో ఒకప్పుడు బుఖారన్ యూదులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ సోవియట్ యూనియన్ రద్దు అయినప్పటి నుండి దాదాపు అందరూ ఈ ప్రాంతం నుండి వలస వెళ్ళారు.

సైబీరియాలో కుమలక్ వంటి రూపాలతో సహా షామినిస్టిక్ మతాచారాలు ఆచరించబడుతుంటాయి.

చైనా నుండి కొనసాగిన వలసలు, అలాగే ప్రజలకు హాన్ ప్రజలతో పరిచయం అభివృద్ధి చెందిన కారణంగా చైనా ప్రాంతంలోకి కన్ఫ్యూషియనిజం, దావోయిజం, మహాయాన బౌద్ధమతం, ఇతర చైనీస్ జానపద మతవిశ్వాసాలు స్థిరపడ్డాయి.

దేశాలుజనసంఖ్యక్రైస్తవంముస్లింనాస్థికంహిందూయిజంబుద్ధిజంజానపదమతాలుఇతర మతాలుయూదులు
Pop.%Pop.%Pop.%Pop.%Pop.%Pop.%Pop.%Pop.%
 Kazakhstan18,745,0003,130,41516.7012,034,29064.203,524,06018.8000.0016,8700.1020,6200.1018,7450.1000.0
 Kyrgyzstan6,520,000469,4407.205,626,76086.30286,8804.4000.0000.0019,5600.30117,3601.8000.00
 Tajikistan6,880,000110,0801.66,652,96096.7103,2001.50< 0.10< 0.10< 0.10< 0.10< 0.1
 Turkmenistan5,040,000322,5606.44,687,20093.025,2000.50< 0.10< 0.10< 0.10< 0.10< 0.1
 Uzbekistan27,440,000631,1202.326,534,48096.7219,5200.80< 0.110,000< 0.110,000< 0.10< 0.110,000< 0.1
Total64.625.0004,663,6157.2255,535,69085.944,158,8606.4400.0026,8700.0451,3700.08136,1050.2110,0000.02

కళలు

బౌద్ధ ధర్మానుసారం యముడు, మరణదేవత, టిబెట్కు చెందిన చిత్రం, చికాగో లోని ఫీల్డ్ మ్యూజియంలో ఉంది.

ఇవీ చూడండి

మూలాలు

  • Dani, A.H. and V.M. Masson eds. UNESCO History of Civilizations of Central Asia. Paris: UNESCO, 1992.
  • Mandelbaum, Michael. ed. Central Asia and the World: Kazakhstan, Uzbekistan, Tajikistan, Kyrgyzstan, and Turkmenistan New York: Council on Foreign Relations Press, 1994.
  • Olcott, Martha Brill. Central Asia's New States: Independence, Foreign policy, and Regional security. Washington, D.C.: United States Institute of Peace Press, 1996.
  • Soucek, Svatopluk. A History of Inner Asia. Cambridge: Cambridge University Press, 2000.
  • Marcinkowski, M. Ismail. Persian Historiography and Geography: Bertold Spuler on Major Works Produced in Iran, the Caucasus, Central Asia, Pakistan and Early Ottoman Turkey, Singapore: Pustaka Nasional, 2003.
  • Rall, Ted. "Silk Road to Ruin: Is Central Asia the New Middle East?" New York: NBM Publishing, 2006.
  • Stone, L. A' 'The International Politics of Central Eurasia', (272 pp). Central Eurasian Studies On Line: Accessible via the Web Page of the International Eurasian Institute for Economic and Political Research: https://web.archive.org/web/20071103154944/http://www.iicas.org/forumen.htm
  • Weston, David. Teaching about Inner Asia Archived 2008-04-03 at the Wayback Machine, Bloomington, Indiana: ERIC Clearinghouse for Social Studies, 1989.

బయటి లింకులు