తజికిస్తాన్

తజికిస్తాన్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్ (ఆంగ్లం : Tajikistan) (తజక్ భాష : Тоҷикистон), (పర్షియన్ : تاجیکی ) పూర్వపు తజిక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, మధ్య ఆసియాలోని ఒక దేశము. దీనికి ఆఫ్ఘానిస్తాన్, చైనా, కిర్గిజ్ స్తాన్,, ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దులు ఉన్నాయి. దక్షిణంలో ఉన్న పాకిస్థాన్‌ను వాఖన్ కారిడార్ వేరు చేస్తుంది. తజికిస్తాన్ అంటే తజిక్ ల మాతృభూమి అని అర్థం. మద్య ఆసియాలో తజికిస్తాన్ పర్వతమయమైన భూబంధిత సార్వభౌమత్వాధికారం కలిగిన దేశం. 2013 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 8 మిలియన్లని అంచనా. జసంఖ్యాపరంగా తజకిస్థాన్ ప్రపంచదేశాలలో 98 వ స్థానంలో ఉంది. దేశ వైశాల్యం 143100 చ.కి.మీ. వైశాల్యపరంగా తజకిస్థాన్ ప్రపంచదేశాలలో 96వ స్థానంలో ఉంది. తజకిస్థాన్ సంప్రదాయంగా తజిక్ ప్రజలకు స్థానిక ప్రదేశంగా ఉంది. ప్రస్తుతం దేశంలో తజకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రజలు నివసిస్తున్నారు.

Ҷумҳурии Тоҷикистон
జుమ్-హూరీ తోజికిస్తోన్
తజికిస్తాన్ గణతంత్రం
Flag of తజికిస్తాన్ తజికిస్తాన్ యొక్క Coat of Arms
నినాదం
లేదు
జాతీయగీతం

తజికిస్తాన్ యొక్క స్థానం
తజికిస్తాన్ యొక్క స్థానం
రాజధానిదుషాంబే
38°33′N 68°48′E / 38.550°N 68.800°E / 38.550; 68.800
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు తజిక్[1]
ప్రజానామము తజిక్
ప్రభుత్వం యూనిటరి రాజ్యం అధ్యక్ష తరహా పాలన
 -  అధ్యక్షుడు ఇమామ్ అలీ రహ్మాన్
 -  ప్రధానమంత్రి అకీల్ అకిలోవ్
స్వాతంత్ర్యము
 -  సమనిద్ సామ్రాజ్యపు స్థాపకము 875 సా.శ. 
 -  ప్రకటించినది సెప్టెంబరు 9 1991 
 -  పూర్తయినది డిసెంబరు 25 1991 
 -  జలాలు (%) 0.3
జనాభా
 -  జనవరి 2006 అంచనా 6,920,3001 (100వది1)
 -  2000 జన గణన 6,127,000 
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $8.802 బిలియన్ (139వది)
 -  తలసరి $1,388 (159వది)
జినీ? (2003) 32.6 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.673 (medium) (122వది)
కరెన్సీ సొమోని (TJS)
కాలాంశం తజికిస్తాన్ టైమ్ (UTC+5)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .tj
కాలింగ్ కోడ్ +992
1 Estimate from State Statistical Committee of Tajikistan, 2006; rank based on UN figures for 2005.

ప్రస్తుత తజకిస్థాన్ ప్రాంతంలో పూర్వం పలు ఆసియన్ సంప్రదాయాలకు నిలయంగా ఉంది.[2] తర్జం నగరంలో నియోలిథిక్, కాంశ్యయుగం కాలంనాటి ప్రజలు నివసించారు. తరువాత తజకిస్థాన్ పలు మతాలకు, సంస్కృతులకు చెందిన పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. బక్ట్రియా- మర్గియానా (ఆక్సస్ సంస్కృతి), అండ్రొనొవొ సంస్కృతి, బుద్ధిజం, నెస్టోరియన్ క్రిస్టియానిటీ, జొరొయాస్ట్రియనిజం, మనిచీయిజం మొదలైన పలుసంస్కృతులకు చెందిన పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ ప్రాంతం పలు సామ్రాజ్యాలలో భాగమై పలు రాజవంశాల పాలనలో ఉంది. తిమురిడ్ రాజవంశం, రష్యన్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని పాలించాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత 1991 తజకిస్థాన్ స్వతంత్రరాజ్యంగా మారింది. 1992-1997 మద్య కాలంలో తజకిస్థాన్ స్వతంత్రం కొరకు అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నది. యుద్ధం చివర స్థిరమైన రాజకీయ స్థితి నెలకొనడమే కాక దేశాభివృద్ధికి అవసరమైన విదేశీసాహాయం కూడా లభించింది.

తజకిస్థాన్ నాలుగు ప్రాంతాలు కలిగిన ఒక " ప్రెసిడెంషియల్ రిపబ్లిక్ ". తజకిస్థాన్ లోని 8 మిలియన్ల ప్రజలలో అత్యధికులు తజకి సంప్రదాయానికి చెందిన ప్రజలు. వీరు తజకీ భాషను (ఆధునిక పర్షియన్ యాసలలో ఒకటి) మాట్లాడుతుంటారు. రష్యాభాష కూడా ప్రజలలో అధికంగా వా డుకలో ఉంది. దేశంలో 90% భూమి పర్వతమయంగా ఉంటుంది. దేశ ఆర్థికరంగం అధికంగా అల్యూమినియం, పత్తిపంట మీద ఆధారపడి ఉంది. దేశం జి.డి.పి. ప్రపంచదేశాలలో 126వ స్థానంలో ఉంది. కొనుగోలుశక్తి ప్రపంచదేశాలలో 136వ స్థానంలో ఉంది.

పేరువెనుక చరిత్ర

తజకిస్థాన్ అంటే " తజకీల భూమి " అని అర్ధం. స్థాన్ అంటే పర్షియన్ భాషలో ప్రదేశం అని అర్ధం.[3] or "country"[4] తజకీలు ఇస్లామిక్ పూర్వకాలానికి (7వ శతాబ్ధానికి ముందు ) చెందిన గిరిజనులు.[5] 1997 " లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ " తజకిస్థాన్ దేశాధ్యయనం తజిక్ పదం అర్ధం తెలుసుకోవడం కష్టం. 12వ శతాబ్దంలో మద్య ఆసియాలో నివసించిన ప్రజలు టర్కిక్, ఇరాన్ ప్రజలని అన్న విషయం వివాదాంశంగా ఉంది.[5]

చరిత్ర

ఆరంభకాల చరిత్ర

ఈ ప్రాంతపు సంస్కృతులు క్రీ.పూ 4వ శతాబ్ధానికి చెందినవి. వీటిలో కాంశ్యయుగం, బక్ట్రియా- మర్గియానా ఆర్కియాలాజికల్, అండ్రినొవొ సంస్కృతి, సరజం (ప్రపంచ వారసత్వసంపద)లు ప్రధానమైనవి.[6] ఈ ప్రాంతసంబంధంగా నమోదైన చరిత్రలో ప్రారంభకాలానిమి చెందినది క్రీ.పూ 500 సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు.[5] కొంతమంది పరిశోధకులు క్రీ.పూ 7-6 శతాబ్దాలు ఆధునిక తజకిస్థాన్‌లో జరవ్షన్ లోయ అచమెనింద్ సామ్రాజ్యంలో భాగం కాకముందు కాంభోజరాజ్యంలో భాగంగా ఉన్నాయని భావిస్తున్నారు.[7]అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత గ్రేకో-బక్టిరియన్ రాజ్యంలో (అలెగ్జాండర్ తరువాత పాలన) భాగం అయింది. ఉత్తర తజకిస్థాన్ (ఖుజంద్, పంజకెంట్) సొగ్డియాలో భాగంగా ఉండేది. క్రీ.పూ 150 లో నగర- రాజ్యాల కూటమి స్కిథియన్లు, యుయేజీ నోమాడిక్ గిరిజనజాతుల ఆధీనంలో ఉన్నాయి. సిల్క్ రోడ్డు ఈ ప్రాంతం గుండా నిర్మించబడింది. చైనా చక్రవర్తి వూ ఆఫ్ హన్ పాలనా కాలంలో (క్రీ.పూ 141) అన్వేషకుడు ఝంగ్ క్వియాన్ దండయాత్రచేసిన సమయంలో హాన్ సామ్రాజ్యం (చైనా), సిగ్డియానాల మద్య వ్యాపారసంబంధాలు ఉండేవి.[8][9] సొగ్డియన్లు ఈ ప్రాంతంలో వ్యవసాయం, వడ్రంగి పని, గ్లాస్ తయారీ, వుడ్‌కార్వర్స్ పనులు, వ్యాపార సౌకర్యాలు కలిగించడంలో ప్రముఖపాత్ర వహించారు.[10]సా.శ. 1వ శతాబ్దంలో కుషన్ సామ్రాజ్యం (యుయేజీ సముదయకూటమి) ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని 4వ శతాబ్దం వరకు పాలించింది. ఈ కాలంలో ఈ ప్రాంతంలో బుద్ధిజం, నెస్టోరియన్ క్రిస్టియానిటీ, జొరొయాష్ట్రియనిజం, మనియాచిజం ఆచరణలో ఉండేవి. [11] తరువాత హెప్తలైట్ సామ్రాజ్యం (నోమాడిక్ జాతి కూటమి) ఈ ప్రాంతానికి తరలి వచ్చారు. 8వ శతాబ్దం ఆరంభకాలానికి ఈ ప్రాంతానికి అరబ్ ప్రజలు ఇస్లాంను తీసుకువచ్చారు.[11] తరువాత తజకిస్థాన్ ప్రాంతం మద్య ఆసియా, చైనా మద్య వ్యాపార మార్గంగా, ఇస్లామిక్ ప్రధాన ప్రాంతంగా ప్రాముఖ్యత కలిగి ఉంది.అరబ్ పాలనను త్రోసి సనిద్ సామ్రాజ్యం ఈ ప్రాంతంమీద ఆధిక్యత సాధించింది. తరువాత సమర్ఖండ్, భుకారా నగరాలను (ప్రస్తుతం ఈ నగరాలు ఉజ్బెక్స్థాన్లో ఉన్నాయి) విస్తరించింది. ఇవి తజకిస్థాన్ సంస్కృతికి కేంద్రంగా మారాయి. తరువాత వీటిని టిబెట్ సామ్రాజ్యం ఆతరువాత చైనా 650-680 స్వాధీనం చేసుకున్నాయి. 710 ఈ ప్రాంతాలను తిరిగి అరేబియన్లు స్వాధీనం చేసుకున్నారు. కరా- ఖండ్ ఖనటే ట్రాంసోక్సానియాను (అందులో ఆధునిక ఉజ్బెకిస్థాన్,తజకిస్థాన్,దక్షిణ కిర్గొజ్స్థాన్, నైరుతీ కజకిస్థాన్ ఉన్నాయి) స్వాధీనం చేసుకుని 999-1211 మద్య పాలించింది.[12][13] వారు ట్రాంసోక్సానియాలో ప్రవేశించిన తరువాత ఇరానియన్ నుండి వచ్చున టర్కీపాలకుల ప్రభావం మద్య ఆసియాలో అధికరించింది. [14] క్రమంగా కరా- ఖండీలు ఈ ప్రాంతంలోని పర్షియన్- అరేబియన్ ముస్లిం సంస్కృతిలో కలిసిపోయారు.[15] 13వ శతాబ్దంలో జంఘిస్ ఖాన్ మంగోలీ ఖవరెజ్మియా దండయాత్ర తరువాత మంగోలీ సామ్రాజ్యం దాదాపు మద్య ఆసియా ప్రాంతం అంతటినీ తమ అధీనంలోకి తీసుకుంది. దాదాపు ఒక శతాబ్దం తరువాత ఆధునిక తజకిస్థాన్ జగటై కనాటే పాలనలోకి మారింది. తమర్లనే తింరుద్ సామ్రాజ్యస్థాపన చేసి 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తనస్వాధీనంలోకి తీసుకున్నాడు.

16వ శతాబ్దంలో ఆధునిక తజకిస్థాన్ బుఖారాకు చెందిన కనాటేల స్వాధీనంలోకి మారింది. 18వ శతాబ్దం నాటికి కనేటాల పాలన ముగింపుకు వచ్చి ఈ ప్రాంతం బఖారాకు చెందిన ఎమిరేటులు, కనాటే కొకండ్‌ల ఆధీనంలోకి చేరింది. 20వ శతాబ్దం వరకు ఈప్రాంతంలో ఎమిరేటుల పాలన కొనసాగింది. అయినప్పటీకీ 19వ శతాబ్దంలో 2వ ప్రపంచయుద్ధం సమయంలో యురేపియన్ శక్తి (రష్యన్ సామ్రాజ్యం) ఈ ప్రాంతానికి చెందిన భూభాగాలను ఆక్రమించడం ప్రారంభించింది.

రష్యన్ తజకిస్థాన్

19వ శతబ్ధంలో రష్యా సామ్రాజ్యవాదం మద్య ఆసియాలోని భూభాగాలపై విజయం సాధించడానికి దారితీసింది. 1864, 1885 ల మద్యకాలంలో రష్యా క్రమంగా రష్యన్ తజకిస్థాన్ ప్రాంతం మొత్తం మీద (బుఖారా ఎమిరేట్, కనాటే కొకండ్ ఆధిక్యత సాధించింది. రష్యా ఈ ప్రాంతానికి కాటన్ సరఫారా చేయడానికి ఆసక్తి చూపింది. 1870 నాటికి ఈ ప్రాంతంలో ధాన్యం బదులుగా పత్తి పండించబడింది. ఈ వ్యూహం తరువాతి కాలంలో సోవియట్లు అనుకరించి విస్తరించారు. [ఆధారం చూపాలి]1885 నాటికి తజకిస్థాన్ ప్రాంతం రష్యా లేక రష్యాకు చెందిన వస్సాల్ రాజ్యంలో భాగంగా ఉంది. ఎమిరేట్స్ ఆఫ్ బుఖారా ప్రాంతం రష్యా ప్రభావాన్ని అనుభవించింది. [ఆధారం చూపాలి]

Tajik men and boys, 1905-1915

19వ శతాబ్దంలో జదీదిస్టులు ఈ ప్రాంతం అంతటా ఇస్లామిక్ ఉద్యమానికి తెరతీసారు. ఆధునిక భావాలుకలిగిన జదీదిస్టులు రష్యాపట్ల వ్యతిరేకత చూపనప్పటికీ రష్యనులు ఈ ఉద్యమన్ని ఒక బెదిరింపుగా భావించారు. [ఆధారం చూపాలి]1910, 1913 మద్య రష్యన్ బృందాలు కొకనాడ్ కనాటేల వ్యతిరేకతను తగ్గించి పరిస్థితి చక్కదిద్దాలనుకున్నారు. 1916 జూలైలో మొదటి ప్రపంచయుద్ధంలో బలవంతంగా పపాల్గొన చేసినందుకు ప్రదర్శనకారులు ఖుజంద్‌లో రష్యన్ సైనికులపై దాడి చేసిన తరువాత హింసాత్మకచర్యలు అధికం అయ్యాయి. బదులుగా రష్యన్ బృందాలు త్వరగానే పస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ తజకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో ఘర్ష్ణలు కొనసాగాయి. [ఆధారం చూపాలి]

సోవియట్ తజకిస్థాన్

Soviet negotiations with basmachi, 1921

1997లో రష్యాతిరుగుబాటు తరువాత మద్యాసియా అంతటా గొరిల్లాలు (బాస్మాచి) స్వతంత్రాన్ని రక్షించుకోవడానికి బొల్షెవిక్ సైన్యాలతో యుద్ధం చేసారు. 4 సంవత్సరాల యుద్ధంలో బొల్షెవిక్‌లు మసీదులను, గ్రామాలను కాల్చివేసి ప్రజలను అణివేతకు గురిచేసారు. సోవియట్ ప్రభుత్వం లౌకిక వాదాన్ని బలపరుస్తూ ఇస్లాం, జ్యూడిజం, క్రైస్తవమతావలంబనలను నిరుత్సాహపరచడం లేక అణిచివేస్తూ పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో మసీదులు, చర్చిలు, సినగోగ్యూలు మూతపడ్డాయి.[16] తరువాత సంఘర్షణల పర్యవసానంగా సోవియట్ సంఘటిత వ్యవసాయవిధానాల వలన మద్య ఆసియా, తజికిస్థాన్‌ ప్రాంతాలు కరువుతో పీడించపడ్డాయి. కరువు పలువురు ప్రణాలను బలితీసుకున్నది.[17]1924లో ఉజ్బెకిస్థాన్‌లో భాగంగా తజిక్ అటానిమస్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ రూపొందించబడింది. 1929లో తజిక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (తజిక్ ఎస్.ఎస్.ఆర్) గా ప్రత్యేక రిపబ్లిక్ రూపొందించబడింది. అయినప్పటికీ సంప్రదాయక తజిక్ నగరాలైన సమర్కండ్, బుఖారాలు ఉజ్బెక్ ఎస్.ఎస్.ఆర్.లో ఉండిపోయాయి. 1927, 1934 మద్య దక్షిణప్రాంతంలో సంఘటిత వ్యవసాయం, వేగవంతమైన పత్తిపంట అభివృద్ధి చేయబడింది.[18] సోవియట్ సంఘటిత విధానాలు వ్యవసాయదారులలో వ్యతిరేకతను అధికరించి తజికిస్థాన్‌ను వదిలి ఇతరప్రాంతాలకు వలసపోవలసిన పరిస్థితికి నెట్టాయి. కొందరు వ్యవసాయదారులు సంఘటిత వ్యవసాయాన్ని ఎదిరిస్తూబస్మాచీ ఉద్యమాన్ని బలపరిచారు. నీటిపారుదల ప్రాజెక్టులు విస్తరణ కారణంగా కొన్ని చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధి సాధ్యం అయింది.[18]మాస్కో 1927-1934, 1937-1938 మద్య రెండు దఫాలుగా ప్రక్షాళన కార్యక్రమాలను చేపట్టింది. ఫలితంగా తజకిస్థాన్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన అన్నిస్థాయిలకు చెందిన 10,000 మంది బహిస్కరణకు గురైయ్యారు.[19] బహిష్కరణకు గురైనవారి స్థానంలో సంప్రదాయ రష్యా ప్రజలు పంపబడ్డారు. ఫలితంగా రష్యాప్రజలు అన్ని స్థాయిలలో ఆధిక్యత సాధించారు. మొదటి సెక్రటరీ పదవిలో కూడా రష్యన్లు నియమించబడ్డారు.[19] 1926, 1959 మద్య తజకిస్థాన్‌లో రష్యనుల తరలింపు 1% నుండి 13% అధికరించింది.[20] సోవియట్ శకంలో తజికిస్థాన్ కమ్యూనిస్ట్ పార్టీ మొదటి సెక్రటరీ ( 1946-1956 ) గా పనిచేసిన రాజకీయనాయకుడు బొబొజాన్ ఘఫురోవ్ మాత్రమే గుర్తించతగిన దేశీయేతర ఒకేఒక రాజకీయనాయుకుడుగా ఉన్నాడు. [21] ఆయన తరువాత తేసున్ ఉల్బజయేవ్ (1956-61), జబ్బొర్ రసుల్ఫ్వ్ (1961-1982), రహమాన్ నబియేవ్ (1982-1985, 1991-1992) ఈ పదవిని చేపట్టారు. 1939లో మొదటి ప్రపంచయుద్ధంలో తజకిస్థానీయులు నిర్బంధంగా సోవియట్ సైన్యంలో నియమించబడ్డారు. 2,60,000 మంది తజికిస్థానీయులు జర్మని,ఫిన్లాండ్, జపాన్ లతో పోరాటం సాగించారు.[22] రెండవ ప్రపంచ యుద్ధంలో 60,000 (4%), 1,20,000 (4%).[23] 15,30,000 మంది పౌరులు మరణించారు.[24] యుద్ధం తరువాత స్టాలిన్ పాలనలో తజికిస్థాన్‌లో వ్యవసాయం, పరిశ్రమలు విస్తరించబడ్డాయి. [21] 1957-1958 నికిత క్రుస్చేవ్ వర్జిన్ లాండ్స్ కంపాజిన్ సోవియట్ యూనియన్ లోని ఇతర రిపబ్లికన్ల కంటే జీవనస్థితి, విద్య, పరిశ్రమ పరంగా వెనుకబడి ఉన్న తజకిస్థాన్ మీద దృష్టి కేంద్రీకరించింది.[21] In the 1980s, Tajikistan had the lowest household saving rate in the USSR,[25] ఆసమయంలో తజకిస్థాన్ తలసరి ఆదాయం అతి తక్కువగా ఉండేది.[26] అలాగే 1000 మందిలో విశ్వవిద్యాలయ డిగ్రీపుచ్చుకున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉండేది.[27] 1980 నాటికి తజిక్ జాతీయవాదులు అధిక హక్కుల కొరకు పోరాటపిలుపును ఇచ్చారు. 1990 వరకు వాస్తవమైన ఆటంకాలు లేవు. తరువాత సోవియట్ యూనియన్ పతనావస్థకు చేరుకుంది. అలాగే తజికిస్థాన్ స్వతంత్రం ప్రకటించుకుంది.

Tajik men and women rally on Ozodi square in Dushanbe shortly after independence, 1992.

స్వతంత్రం

Spetsnaz soldiers during the Civil War, 1992.

దేశంలో అకస్మాత్తుగా అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతర్యుద్ధంతో పలు వర్గ ఘర్షణలు మొదలైయ్యాయి. .[28] హింసకారణంగా 5,00,00 కంటే అధికంగా నివాసితులు పేదరికం అధికరించడం, పశ్చిమదేశాలు, ఇతర సోవియట్ రిపబ్లిక్కులలో మంచి ఉద్యోగవకాశాలు దేశం నుండి పారిపోయారు.[29] 1992లో నవంబరు ఎన్నికలలో అబ్దుమాలిక్ అబ్దుల్లాజినోవ్‌ను ఓడించి 58% ఓట్ల ఆధిక్యతతో ఓడించి ఎమోమల్లి రహమాన్ అధికారానికి వచ్చాడు. [30] యుద్ధం ముగింపు తరువాత తజకిస్థాన్ పూర్తిగా ధ్వంసం చేయబడిన తరువాత ఎన్నికలు నిర్వహించబడ్డాయి. యుద్ధంలో 1,00,000 మంది మరణించారు. 1.2 మిలియన్ల ప్రజలు దేశీయంగా, పొరుగుదేశాలకు ఆశ్రితులుగా వెళ్ళారు.[28] 1997లో అఖ్యరాజ్యసమితి జోక్యంతో రహమాన్, గెర్డ్ డి మెర్రం నాయకత్వంలో ప్రతిపక్షపార్టీల మద్య శాంతి ఒప్పందం జరిగింది. ఒప్పందంలో 30% యునైటెడ్ తజిక్ అపోజిషానికి మంత్రివర్గపదవులు ఇవ్వడానికి అవకాశం కలిగించింది. [31] 1999 తజకిస్థాన్ అధ్య్క్షక్ష ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో రహమాన్ 98% ఓట్లతో విజయం సాధించడం పరిపక్షాలు, విదేశీపర్యవేక్షకుల విమర్శకు లోనైంది. 2006 ఎన్నికలలో రహమాన్ 79%తో విజయం సాధించి మాడవసారి అధ్యక్షపదవిని అలంకరించాడు. 2006 ఎన్నికలను పలు ప్రతిపక్షాలు నిరాకరించాయి. ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ ఐరోపా ఎన్నికలను విమర్శించింది. కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ పర్యవేక్షకులు ఎన్నికలు చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగాయని నిర్ధారించింది. [32][33] 2010 లో ఒ.ఎస్.సి.ఇ. రహమాన్ పాలనలో మధ్యమాన్ని అణచడం, తీవ్రంగా సెంసార్ చేయడం గురించి మరింతగా విమర్శించింది. తజిక్ ప్రభుత్వం తజక్, విదేశీ వెబ్‌సైట్లను సెంసార్ చేయడం, ప్రచురణా సంస్థల మీద పన్నును అధికరించడం చేస్తుంది. స్వతంత్ర వార్తాపత్రికలు, ప్రచురణాచర్యలు హింసకు గురౌతున్నాయి.[34]2005 వేసవి వరకు రష్యా సరిహద్దు దళాలు తజిక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో నిలుపబడ్డాయి. 2001 సెప్టెంబరు దాడి తరువాత ఫ్రాన్స్ సైనికదళాలు నాటో ఎయిర్ ఆపరేషన్‌కు మద్దతుగా దుషన్‌బే ఎయిర్ పోర్ట్‌లో నిలిచాయి. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ, యునైటెడ్ స్టేట్స్ మేరిన్ దళాల అధికారులు కొన్ని వారాలపాటు సమైక్య శిక్షణ కొరకు అప్పుడప్పుడు తజకిస్థాన్‌కు వస్తుంటారు. 2010లో భారతప్రభుత్వం దుషన్‌బేకు ఆగ్నేయంలో ఉన్న అయ్ని ఎయిర్ బేస్ పునర్నిర్మాణ కార్యక్రమాలను (70 మిలియన్ల అమెరికన్ డాలర్లు) చేపట్టి పూర్తిచేసింది.[35] అది ప్రస్తుతం తజికిస్థాన్ ప్రధాన ఎయిర్ బేస్‌గా ఉపయోగించబడుతుంది. అయని ఎయిర్ బేస్ ఉపయోగం గురించి రష్యా ఆందోళన చెందుతున్నట్లు కొన్ని మాటలు ప్రచారంలో ఉన్నాయి..[36] అలాగే రష్యా దుషంబే వెలుపల బృహత్తర ఎయిర్ బేస్‌ను నిర్వహిస్తుంది.[37]2010లో తజిక్ జైళ్ళ నుండి 25 మంది తీవ్రవాదులు తప్పించుకున్న తరువాత అధికారులు తూర్పుభాగంలోని ఇస్లామిక్ మెటీయరిలిజం గురించి ఆందోళన చెందారు. తరువాత సెప్టెంబరులో రష్త్ లోయ వద్ద 28 మంది తజిక్ సైనికులు తీవ్రవాదుల దాడిలో మరణించారు. [38] మరొక దాడిలో 30 మంది సైనికులు మరణించారు.[39] ఘరం వెలుపల జరిగిన ఘర్షణలో 3 మంది తీవ్రవాదులు మరణించారు. తరువాత 2010 నవంబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రప్రభుత్వం తూర్పు భాగాన్ని ఆధీనంలోకి తీసుకుని రష్త్ లోయలో సైనికచర్య తీసుకొనవలెనని నిర్ణయం తీసుకొనబడింది.[40] 2012 జూలైలో గొర్నొ- బదఖ్షన్ ఘర్షణలు తలెత్తాయి.[41]2015లో రష్యా తజికిస్థాన్‌కు మరిన్ని సైనిక బృందాలను పంపింది.[42]2015 మే మాసంలో తజకిస్థాన్ నేషనల్ సెక్యూరిటీ తీవ్రమైన వెనుకబాటుకు గురైంది. [43]

రాజకీయాలు

Presidential Palace

స్వతత్రం వచ్చిన వెంటనే తజికిస్థాన్‌లో అంతర్యుద్ధం మొదలైంది. రష్యా, ఇరాన్ నేపథ్యంలో పలు వర్గసంఘర్షణలు ఒకరితో ఒకరు పోరాడుకున్నారు. [ఆధారం చూపాలి]. యుద్ధం కారణంగా పరిశ్రమలలో నియమించబడిన 40,000 మందిలో 25,000 మంది రష్యాకు పారిపోయారు. 1997లో యుద్ధం ఉపశమించింది. 1999లో జరిగిన శాంతిపూరితమైన వాతావరణంలో ఎన్నికల తరువాత తజికిస్థాన్ ప్రభుత్వం రూపొందించబడింది.

President of Tajikistan, Emomalii Rahmon has ruled the country since 1994.

[44] అధికారిక రిపబ్లిక్ తజికిస్థాన్ అధ్యక్షపీఠానికి, పార్లమెంటు సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలను నిర్వహిస్తుంది. ఆధిక్యత కలిగిన పార్టీ విధానంలో పాలన నిర్వహించబడుతుంది. " పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ తజికిస్థాన్ " వరుసగా పార్లమెంటులో ఆధిక్యత కలిగి ఉంది. ఎమోమల్లి రహమాన్ 1994 నవంబరు నుండి అధ్యక్ష పీఠాన్ని అలంకరించాడు. కొఖిర్ రసుల్జొడా ప్రధానమంత్రి పదవి బాధ్యత వహించాడు. మతుబ్ఖాన్ దవ్లతొవ్ మొదటి ఉపముఖ్యమంత్రిగా మురొదలి అలిమర్దన్, రుక్వియా కుర్బనివ సహాయ ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు.

2005 పార్లమెంటరీ ఎన్నికలలో ప్రతిపక్షాలు, విదేశీ పర్యవేక్షకుల నుండి పలు ఆరోపణలు ఎదురైయ్యయి. అధ్యక్షుడు ఎమోమలి రహమాన్ ఎన్నికల ప్రక్రియను లంచాలను ఇచ్చి దారిమళ్ళించాడని ఆరోపణలు ఎదురైయ్యాయి. 2010 ఫిబ్రవరిలో ఎన్నికలలో రూలింగ్ పార్టీ (పి.డి.పి.టి) 4 పార్లమెంటరీ స్థనాలను కోల్పోయింది. అయినప్పటికీ తగినంత మెజారిటీ సాధించింది. " ఆర్ఘనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో- ఆపరేషన్ ఇన్ యూరప్" ఎన్నికల పర్యవేక్షకులు ఈ ఎన్నికలు పలు డెమొక్రటిక్ ప్రమాణాలను అతిక్రమిచాయని భావించింది.[45][46] The government insisted that only minor violations had occurred, which would not affect the will of the Tajik people.[45][46] 2006 నవంబరు 6 ఎన్నికలను ప్రధానప్రతిపక్షాలు బహిష్కరించాయి. [44] తజిక్ అధ్యక్షుడు, ఇరాన్ విదేశాంగ మంత్రి సమావేశం తరువాత తజికిస్థాన్ సంఘై కోపరేషన్ ఎన్నికలలో ఇరాన్ సభ్యత్వానికి తజికిస్థాన్ మద్దతు తెలిపంది.[47] పత్రికాస్వతంత్రానికి ప్రభుత్వం అధికారికంగా మద్దతు ఇస్తుంది. అయినప్పటికీ పత్రికలమీద షరతులు విధిస్తూనే ఉంది. " వార్ & పీస్ " ఇంస్టిట్యూట్ నివేదిక అనుసరించి తజిక్ న్యూస్, ఫర్ఘన, సెంట్రాసియా, ప్రాంతీయ, విదేశీ వెబ్ సైట్లను నిషేధించబడ్డాయి అని తెలియజేస్తుంది. పత్రికావిలేఖరులు వివాదాంశమైన వార్తలను అందించడానికి ఆటంకాలు ఉన్నాయి.[48]

భౌగోళికం

Satellite photograph of Tajikistan

తజికిస్థాన్ భూబంధిత దేశం. అలాగే వైశాల్యపరంగా తజికిస్థాన్ మద్య ఆసియాలో అతిచిన్న దేశంగా గుర్తించబడుతుంది. ఇది ఉత్తర అక్షాంశంలో 36°, 41° N (a small area is north of 41°, తూర్పురేఖా ంశం 67° - 75° ఉంది. ఇది పామిర్ పర్వతాలతో నిండి ఉంది.[49] దేశవైశాల్యంలో సముద్రమట్టానికి 3000 మీ ఎత్తున ఉంది. దిగువ భూభాగం ఫర్గన కఫర్నేషన్ లోయ, వఖ్ష్ నదికి (అము దర్యా నుండి ప్రవహిస్తున్నాయి) దక్షిణ తీరంలో ఉంది. దుషంబే కఫర్నేషన్ లోయ దక్షిణంలో ఉంది.

పర్వతంఎత్తుప్రదేశం
ఇస్మాయిల్ సొమొని శిఖరం (అత్యంత ఎత్తైనది)7,495 మీ24,590 అడుగులు    గొర్నొ బదక్షన్ వాయవ్యంలో కిర్గిస్థాన్ దక్షిణ సరిహద్దు.
ఐ.బి.ఎన్. సినా శిఖరం. (లెనిన్ పీక్)7,134 మీ23,537 అడుగులు    ట్రాంస్ అలే పర్వాతావళి ఉత్తర సరిహద్దు. ఇస్మాయిల్ సొమొని శిఖరం ఈశాన్యం.
కొర్ఝనెవ్స్కయ శిఖరం7,105 మీ23,310 అడుగులు    ఇస్మాయిల్ సొమొని శిఖరం ఉత్తరం.ముక్సు నది దక్షిణతీరం.
స్వతంత్ర శిఖరం (రివల్యూషన్ పీక్)6,974 మీ22,881 అడుగులు    గొర్నొ బదక్షన్ మద్యభాగం ఇస్మాయిల్ సొమొని శిఖరం ఆగ్నేయం
అక్డమియా పర్వతావళి6,785 మీ22,260 అడుగులు    గొర్నొ బదక్షన్ వాయవ్య సరిహద్దు
కరి మార్క్ శిఖరం6,726 మీ22,067 అడుగులు    జి.బి.ఒ, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో. కరకొరం పర్వతావళి ఉత్తర కొన.
గొర్నొ శిఖరం6,595 మీ21,637 అడుగులు    వాయవ్య గొర్నొ - బదక్షన్
మయకొవ్స్కి శిఖరం.6,096 మీ20,000 అడుగులు    జి.బి.ఒ నైరుతి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో.
కాంకర్డ్ పీక్.5,469 మీ17,943 అడుగులు    కొరకొరం పర్వతావళి ఉత్తర కొన దక్షిణ సరిహద్దు.
కిజిలర్ట్ పాస్4,280 మీ14,042 అడుగులు    ట్రాంస్ అలే పర్వతావళి ఉత్తర సరిహద్దు.

అము దర్య, పంజ్ నదులు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నాయి. తజికిస్థాన్ పర్వతాలలో ఉన్న గ్లాసియర్లు నదీజలాలకు ప్రధాన ఆధారంగా ఉంది. ఇవి ఆరా సముద్రంలో సంగమిస్తున్నాయి. తజికిస్థాన్‌లో 10కి.మీ పొడవైన నదులు 900 ఉన్నాయి.

పాలనా విభాగాలు

Mountains of Tajikistan

తజకిస్థాన్‌లో 4 పాలనా విభాగాలు ఉన్నాయి. ప్రాంతాలు (ప్రొవింస్ ) ; (విలోయత్) సుఘ్ద్, ఖత్లాన్, స్వయం ప్రతిపత్తి కలిగిన గొర్నొవ్- బదాక్షన్ (జి.బి.ఎ.ఒ),, సుబోర్దినేషన్ రిపబ్లిక్. ప్రతివిభాగం పలు ఉపవిభాగాలుగా (జిల్లాలు) (నొహియా, రైన్) విభజించబడి ఉన్నాయి. జిల్లాలు జమోత్స్ (స్వయంపాలిత గ్రామాలు), గ్రామాలు (క్వాష్లోక్విస్). 2006 గణాంకాలను అనుసరించి 367 జమోత్‌లు ఉన్నాయి.

[50]

విభాగంఐ.ఎస్.ఒ. 3166-2మ్యాప్ సంఖ్యరాజధానిప్రాంతం (చ.కి.మి) [50]పి.ఒ.పి. గణాంకాలు
సుఘ్ద్ఐ.టి.జె-ఎస్.యు.1ఖుజంద్25,4002,233,500
సుబోర్దినేషన్ రిపబ్లిక్ ప్రాంతం.టి.జె-ఆర్.ఆర్.2దుషంబే28,6001,722,900
ఖట్లాన్టి.జె- కె.టి3క్యూర్ఘొంతెప24,8002,677,300
గొర్నొ- బదక్షన్ ప్రొవింస్ (స్వయంప్రతిపత్తి)టి.జె-బి.జె4ఖొరుఘ్64,200206,000
దుషంబే5దుషంబే10724,800

సరసులు

Karakul lake
  • దేశం వైశాల్యంలో దాదాపు 2% సరస్సులతో నిండి ఉంది.
గుర్తించతగిన సరసుల జాబితా;
  • కెరక్కుం రిజర్వాయర్ (కెరక్కుం) (సుఘ్ద్)
  • ఇస్కందర్కుల్ (ఫన్ పర్వతాలు)
  • కులికలోన్ సరసులు (ఫన్ పర్వతాలు)
  • న్యురెక్ ఆనకట్ట (ఖట్లన్)
  • కారాకుల్ (టాజీకిస్తాన్) (మూస:Lang-TG; తూర్పు పామిర్ పర్వతాలు.
  • సరెజ్ సరసు (పామిర్ పర్వతాలు )
  • షదౌ సరసు (పామిర్ పర్వతాలు)
  • జొర్కుల్ (పామిర్ పర్వతాలు )

ఆర్ధికం

A Tajik dry fruit seller

సోవియట్ యూనియన్‌, మద్య ఆసియాలో అత్యంత వెనుకబడిన రిపబ్లిక్ తజికిస్థాన్. [విడమరచి రాయాలి] ప్రస్తుతం 47% తజికిస్థాజ్ జి.డి.పి. విదేశాలలో నివసిస్తున్న తజికిపౌరుల నుండి లభిస్తుంది. (తజికీలు అధికంగా రష్యాలో పనిచేస్తుంటారు). [51][52] దేశం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది. లంచగొండితనం, అసమానమైన ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక నిర్వహణలో అసమర్ధత. విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా అందుతున్న ధనం, అక్యూమినియం, పత్తి అమ్మకాలద్వారా లభిస్తున్న విదేశీ ఆదాయం తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలకు సహకారిగా ఉంటుంది. 2000 లో మునుపటి అంతర్యుద్ధంలో చిన్నభిన్నమైన దేశపరిస్థితి చక్కదిద్దడానికి శాంతిస్థపనకు విదేశీధనసహాయం సహాయకారిగా ఉంది. రెండు సంవత్సరాల తీవ్రమైన కరువు వలన ఆహారపదార్ధాల కొరతను విదేశీ ఆర్థికసహాయం తీర్చింది. 2001 ఆగస్టులో రెడ్ క్రాస్ కరువు బాధిత దేశాలైన తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లకు సహకరించవలసిందిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితికి కూడా సహాయం కొరకు పిలుపును అందించింది. అయినప్పటికీ దేశంలో ఇప్పటికీ ఆహారం సమస్యగానే ఉంది. 2012 జనవరిలో తజకిస్థాన్ ప్రజలలో 6,80,152 మంది ఆహార అబధ్రతతో జీవిస్తున్నారు. వీరిలో 6.70,852 మంది ఫేస్ 3 (నిశితమైన ఆహారం, జీవనోపాధి సమస్య) ఆహార అబధ్రత, 3000 మంది ఫేస్ 4 (హ్యూమనిటేరియన్ ఎమర్జెంసీ) సమస్యలో చిక్కుకున్నారు.[53]

The Tajik aluminium smelting plant, TadAZ, in Tursunzoda, is the largest aluminium manufacturing plant in Central Asia, and Tajikistan's chief industrial asset.

యుద్ధం తరువాత 2000-2007 మద్యకాలంలో తజికిస్థాన్ గణనీయమైన ఆర్థికాభివృద్ధి సాధించింది. తజికిస్థాన్ జి.డి.పి. 9.6% నికి చేరుకుందని వరల్డ్ బ్యాంకు డేటా తెలియజేస్తుంది. ఇది మద్య ఆసియా దేశాలలో తకకిస్థాన్ ఆర్థికస్థితి పరంగా అభివృద్ధి సాధించింది. ప్రత్యేకంగా ఆర్థికంగా క్షీణస్థితితికి చేరిన తుర్క్మేనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ కంటే తజికిస్థాన్ అభివృద్ధి స్థాయికి చేరుకున్నాడు.[54] తజికిస్థాన్ ఆర్థికరంగానికి అల్యూమినియం, పత్తి ఉత్పత్తి, విదేశీ ఉద్యోగుల సంపాదన సహకరిస్తుంది.[55] పత్తి పంట వ్యవసాయంలో 60% ఆక్రమించి ఉంది, 75% గ్రామీణులకు పత్తి పంట మద్దతు ఇస్తుంది, 45% నీటిపారుదల అందుతున్న భూమి పత్తి పంటకు ఉపయోగపడుతుంది. [56] ప్రభుత్వానికి స్వంతమైన తజిక్ అల్యూమినియం కంపెనీ మద్య ఆసియాలో అతిపెద్ద అల్యూమినియం పరిశ్రమగా గుర్తించబడుతుంది. అలాగే ప్రంపంచం లోని అతిపెద్ద అల్యూమినియం పరిశ్రమలలో ఒకటిగా గుర్తించబడుతుంది.[57] తజకిస్థాన్ నదులు వఖ్ష్ నది, పంజ్ నదులు జలవిద్యుత్తుకు ఆధారంగా ఉన్నాయి. ప్రభుత్వం జలవిద్యుత్తు ఉత్పత్తిచేసి దేశీయ వాడకానికి, విద్యుత్తు ఎగుమతి కొరకు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంది. తజికిస్థాన్ లోని న్యూరెక్ డాం ప్రపంచంలోని ఎత్తైన ఆనకట్టగా గుర్తించబడుతుంది.[58] 670 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన సంగ్తుడా-1 జలవిద్యుత్తు కేంద్రంలో 2008 జనవరి 18 నుండి రష్యాకు చెందిన " ఆర్.ఎ.ఒ ఎనర్జీ జెయింట్ " యు.ఇ.ఎస్ పనిచేస్తుంది. [59][60] సంగ్తుడా-2 లో ఇరాన్, జరఫ్షన్ కొరకు చైనాకు చెందిన సినో- హైడ్రో పనిచేస్తున్నాయి. 335 మీ ఎత్తైన రోగన్ పవర్ ప్లాంటు నిర్మాణం పూర్తయితే ప్రంపంచంలో ఎత్తైనదని గుర్తించబడుతున్న న్యూరెక్ ఆనకట్టను అధిగమిస్తుంది.[61][62] సి.ఎ.సి.ఎ. 1000 ప్లాంటు తజికిస్థాన్ నుండి పాకిస్థాన్‌కు ఆఫ్ఘనిస్తాన్ పవర్ ట్రాన్స్‌మిట్ ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్తును తరలించడానికి ప్రణాళిక రూపొందించబడింది.. ట్రాంస్ మిషన్ మొత్తం పొడవు 750 కి.మీ. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేయనున్న ఈ ప్రణాళికలో డబల్యూ.బి,

ఐ.ఎఫ్.సి, ఎడి.బి, ఐ.డి.బి సంస్థలు పనిచేయనున్నాయి. ఈ ప్రణాళిక మొత్తం విలువ 865 మిలియన్ల అమెరికన్ డాలర్లు.[63] మిగిలిన విద్యుత్తు అవసరాలకు చిన్న మొత్తంలో సహజవాయువు, పెట్రోలియం వనరులు, తగినంత బొగ్గు నిలువలు విద్యుత్తు ఉతపత్తికి సహకరిస్తున్నాయి.

Graphical depiction of Tajikistan's product exports in 28 color-coded categories.

2014లో ప్రపంచంలోని అధికంగ విదేశీ వలస ఉద్యోగుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలలలో తజికిస్థాన్ మొదటి స్థానంలో ఉంది. 2014కు ముందు విదేశీ ఉద్యోగుల సంపాదన జి.డిపిలో 45% ఉండగా రష్యాలో సంభవించిన ఆర్థిక సంక్షోభం కాతణంగా 2015 నాటికి అది 40%కి పతనం చెందగలదని భావించారు.[64] రష్యాలోని తజిక్ శ్రామికులు మిలియన్ల తజికిస్థాన్ ప్రజల ఆర్థికస్థితికి ఆధారంగా ఉన్నారు.[65] 2014-2015 రష్యన్ ఆర్థికస్థితి దిగజారడం కారణంగా తజికిస్థాన్ యువకులు రష్యా నుండి మాతృదేశానికి తిరిగి రాగలరని చెప్పింది.[64] 20% తజికిస్థానీయులు 1.25 అమెరికన్ డాలర్ల దినసరి ఆదాయంతో జీవిస్తున్నారని కొన్ని అంచనాలు తెలియజేస్తున్నాయి.

[66] తజికిస్థాన్ నుండి వలసపోవడం, విదేశీసంపాదన ఆర్థికంగా తీవ్రమైన ప్రభావం కలిగించలేదు. 2010 లో తజికిస్థాన్ విదేశీ ఉద్యోగుల ఆదాయం 2.1 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ఇది 2009 కంటే అధికం.[67] 2006 తజికిస్థాన్ వరల్డ్ బ్యాంక్ తజికిస్థాన్ విధానం నివేదికలో తగత కొన్ని సంవత్సరాలుగా జికిస్థాన్ ఆర్థికరంగాన్నీ విదేశీ ఉద్యోగుల ఆగాయం నడిపించి పేదరికాన్ని కొంత తగ్గించిందని వివరించింది.[68] మాదకద్రవ్యాలు చేరవేయడం తజికిస్థాన్ చట్టవిరుద్ధమైన ఆదాయాలలో ఒకటి.[69][70] అంతర్జాతీయ సేవాసంస్థలైన యు.ఎన్.ఒ.డి.సి., యు.ఎస్, రష్యా, ఆఫ్ఘన్ అధికారుల కృషిఫలితంగా చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల తరలింపును అదుపులోకి వచ్చింది.[71] తజికిస్థాన్ హెరాయిన్, ఓపియం జప్తు ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.[72][73] మాదకద్రవ్యాల ద్వారా లభిస్తున్న ధనం ప్రభుత్వాన్ని కలుషితం చేస్తుంది. తజికిస్థాన్ అంతర్యుద్ధంలో రెండువైపులా పాల్గొని ప్రస్తుతం అధికారపదవులు చేపట్టిన వారిలో పలువురికి మాదకద్రవ్యాల వ్యాపారంలో సంబంధాలు ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.[70] యు.ఎన్.ఓ.డి.సి. తజికిస్థాన్‌తో పనిచేస్తూ సరిహద్దు రక్షణలో శిక్షణ ఇస్తుంది. అలాగే సమైక్య సరిహద్దు దళాను నియమించి " తజికిస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఏజెంసీ " స్థాపనలో భాగస్వామ్యం వహించింది.[74] తజికిస్థాన్ " ఎకనమిక్ కోపరేషన్ ఆర్గనైజేషన్ " (ఇ.సి.ఒ) లో శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది.

ప్రయాణవసతులు

Dushanbe railway station

2013 తజకిస్థాన్ ఇతర మద్య ఆసియా దేశాలవలె ప్రయాణవసతులలో ప్రధాన అభివృద్ధి సాధించింది. భూబంధితదేశంగా తజికిస్థాన్‌లో రేవుపట్టణాలు ఏమీ లేవు. అందువలన అత్యధికమైన ప్రయాణాలు రహదారి, రైలు, వాయు మార్గంలోనే జరుగుతుంటాయి. సమీపకాలంగా రేవు ప్రయాణా వసతుల కొరకు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్, పాకిస్థాన్లను చేరుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2009లో పాకిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో 1,300 కి.మీ పొడవైన రహదారి, రైలు నిర్మాణం, అభివృద్ధిపనులు చేపట్టాడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రహదారి, రైలు మార్గం మూడు దేశాలను అనుసంధానిస్తూ పాకిస్థాన్ రేవును చేరేలా నిర్మించబడుతుంది. ప్రతిపాదించబడిన మార్గం దేశానికి తూర్పున ఉన్న గొర్నో - బదఖ్షన్ స్వయంప్రతిపత్తి ప్రాంతం మీదుగా పయనిస్తుంది.[75] 2012లో మూడు దేశాలను అనుసంధానం చేస్తూ రహదార్లు, రైలుమార్గాలు, గ్యాస్, ఆయిల్, నీటిపైపు లైన్ నిర్మించడానికి తజికిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షులు ఒప్పందం మీద సంతకం చేసారు.[76]

రైలు

రైలురోడ్డు మొత్తం పొడవు 680 కి.మీ.[77] రైలు గేజ్ 1530మి.మీ 1,520 mm (4 ft 11+2732 in)ఇది రష్యా గేజ్ పరిమాణం. దేశం దక్షిణప్రాంతంలోని ప్రధాన భూభాగాలను, రాజధానిని పారిశ్రామిక ప్రాంతాలను (హిసార్, వఖ్ష్ లోయలు), ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, కజక్స్థాన్, రష్యాలను అనుసంధానిస్తూ రైలు మార్గం నిర్మించబడుతుంది.[78] అంతర్జాతీయ సరుకు రావాణా ఈ మార్గంలో చేరవేయబడగలదని భావించారు.[79] ప్రస్తుతం నిర్మించబడిన క్వర్ఘంతెప్ప - కులాబ్ రైలు మార్గం కులాబ్ జిల్లా దేశం కేద్రభాగాలను అనుసంధానిస్తుంది.[79]

వాయుమార్గం

The old terminal building at Dushanbe International Airport

2009లో తజికిస్థాన్‌లో 26 విమానాశ్రయాలు ఉన్నాయి.[77] వీటిలో 18 విమానాశ్రయాలకు రన్‌వేలు ఉన్నాయి. అందులో రెండింటికి 3,000 మీ పొడవైన రన్‌వేలు ఉన్నాయి.[80] 2015 ఏప్రిల్ నాటికి దేశం ప్రధాన విమానాశ్రయం దుషంబే నుండి రష్యాలోని ప్రధాన నగరాలు, మద్య ఆసియాకు అలాగే ఢిల్లీ, దుబాయ్, ఫ్రాంక్‌ఫర్ట్, ఇస్తాంబుల్, కాబూల్, ఉరుంక్వి నగరాలకు విమానసేవలు అందించబడుతున్నాయి. రష్యా నుండి ఖుజంద్ వరకు అంతర్జాతీయ విమానాలు నడుపబడుతున్నాయి. కులాబ్, ఖుర్గోంతెప నుండి విమానసేవలు పరిమితంగానే లభిస్తున్నాయి. ఖొరోగ్ విమానాశ్రయం దేశీయ విమానసేవలు అందిస్తుంది. తజికిస్థాన్‌లో రెండు ప్రధాన విమానసేవలు ( సోమన్ ఎయిర్ లైన్, తజిక్ ఎయిర్ లైన్) ఉన్నాయి. అవి

రహదారి

తజికిస్థాన్ రహదార్ల మొత్తం పొడవు 27,800 కి.మీ. ప్రయాణ సౌకర్యాలలో 90% ఆటోమొబైల్స్ పూర్తిచేస్తున్నాయి. సరుకురవాణాలో 80% రహదారి మార్గంలో చేరవేయబడుతుంది. [79]2004లో తజికిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తజిక్- ఆఫ్ఘన్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ నిర్మించబడింది. ఇది దేశాన్ని దక్షిణాసియా దేశాలతో అనుసంధానిస్తుంది. ఈ వంతెనను యునైటెడ్ స్టేట్స్ నిర్మించింది.[81]2014 నాటికి రహదారి, కనుమ మార్గం పూర్తికాగలదని భావించారు. దుషంబే - కుల్మ (చైనా సరిహద్దు), కుర్గాన్- ట్యూబ్- నిఝ్మి ప్యాని (ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు) రహదారుల పునర్నిర్మాణం, పర్వతమార్గాలలో అంజాబ్ కనుమ, షక్రిస్తాన్, షర్ షర్, చొర్మాజక్ కనుమ మార్గాల నిర్మాణం ప్రళాళికలుగా చేపట్టబడ్డాయి. [82][83] వీటికి అంతర్జాతీయ సంస్థలు నిధిసహాయం చేస్తున్నాయి.[79][84]

గణాంకాలు

Tajikistan: trends in its Human Development Index indicator 1970-2010

2009 జూలై గణాంకాలను అనుసరించి తజికిస్తాన్ జనసంఖ్య 7,349,145.[85] వీరిలో 70% 30 సంవత్సరాల లోపు వారు. 30% ప్రజలు 14-30 సంవత్సరాల వయస్కులు.[86] తజికీలు తజిక్ భాషను మాట్లాడుతుంటారు ( పర్షియన్ యాసలలో ఇది ఒకటి). తజికీలు ప్రధాన సంప్రదాయ ప్రజలుగా ఉన్నారు. అయినప్పటికీ ఉజ్బెకీయులు, రష్యన్లు కూడా తగినంత సంఖ్యలో ఉన్నారు. వసల కారణంగా వీరి సంఖ్య క్షీణిస్తుంది. [87] బదఖ్షన్ లోని పమిరి ప్రజలు, స్వల్పసంఖ్యలో యగ్నొబీలు, గణీయమైన సంఖ్యలో ఇస్మైలీలు కూడా తజికీప్రజలుగా భావించబడుతున్నారు. తజికిస్థాన్‌లోని ప్రజందరూ తజికిస్థానీయులుగా పిలువబడుతున్నారు.[85]

Group of Tajik children

1989లో తజికిస్థాన్‌లోని సంప్రదాయ రష్యన్లు 7.6% ఉన్నారు. అంతరుద్ధం తరువాత రష్యాకు వలస వెళ్ళిన కారణంగా వారు ప్రస్తుతం 0.5% కంటే తక్కువగా ఉన్నారు.[88] " రష్యా , సోవియట్ యూనియన్ లోని జర్మన్ చరిత్ర " 1979లో 38,853 మంది తజికిస్థాన్ నుండి వలస వెళ్ళారని తెలియజేస్తుంది.[89]తజికిస్థాన్ ప్రాంతీయ భాష తజికీ అధికారభాషగా ఉంది. సమాచారచేరవేతకు, వ్యాపారానికి రష్యా భాష వాడుకలో ఉంది. రాజ్యాంగం " రష్యాభాష " సంప్రదాయ ప్రజల వాడుక భాష" గా ఆమోదించబడినప్పటికీ 2009 రాజ్యాంగ సవరణ తరువాత రష్యాభాష రద్దుచేయబడింది.[90] పేదరికం ఉన్నప్పటికీ సోవియట్ పాలనలో ఉచిత విద్య ఫలితంగా తజికిస్థాన్ అక్షరా శ్యత అధిక్ంగానే ఉంది. ప్రజలలో 95.5% వ్రాత, చదవే శక్తిని కలిగి ఉన్నారు.[85] ప్రజలలో అత్యధికులు సున్నీ ఇస్లాం మతాన్ని అవలంబిస్తున్నారు. 2009 గణాంకాలను అనుసరించి తజిక్ పురుషులు, పలువురు స్త్రీలు విదేశాలలో (ప్రత్యేకంగా రష్యాలో) పనిచేస్తున్నారు.[91] 70% కంటే అధికమైన స్త్రీలు సంప్రదాయ గ్రామాలలో నివసిస్తున్నారు.[92]

సంస్కృతి

Tajik family celebrating Eid

తజికిస్థాన్ లోని 80% ప్రజలకు తజిక్ భాష మాతృభాషగా ఉంది. ప్రస్తుత తజికిస్థాన్ లోని దుషంబే (రాజధాని), ఖుజండ్, కులాబ్, పంజకెంట్, కుర్గొంటెప, ఖొరుఘ్, ఇస్తరవ్షన్ మొదలైన నగరకేంద్రాలలో ఉజ్బెకీలు, కిర్గీజులు, రష్యన్లు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు.

తజికిస్థాన్ ఆగ్నేయంలో ఉన్న గొర్నొ- బదఖ్షన్ అటానిమస్ ప్రొవింస్‌లో చైనా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పమిరిప్రజలు ఉన్నారు. వీరిని తజికీ సంప్రదాయ ప్రజలుగా భావిస్తారు. అయినప్పటికీ వీరు తజికీ ప్రజలకంటే భాషాపరంగా, సాంస్కృతికంగా వేరుపడి ఉంటారు. తజికిస్థాన్ లోని మిగిలిన ప్రాంతాలలో నివసిస్తున్న అధికమైన సున్నీ ముస్లిములు, పమిరీలు ఉత్సాహంగా ఇస్లామైలీ మతాన్ని అనుసరిస్తుంటారు. అలాగే షుఘ్ని, రుషని, ఖుఫి, వాఖి మొదలైన పలు ఇరానీ భాషలు మాట్లాడుతుంటారు. ఎత్తైన పమిరీ పర్వతంలో ఒంటరిగా నివసిస్తున్న వీరు పలు పురాతన సస్కృతి, సంప్రదాయాలను సంరక్షిస్తుంటారు. దేశమంతటా కనుమరుగౌతున్న జానపద కళలు వీరి వద్ద సజీవంగా ఉన్నాయి.

ఉత్తర తజికిస్థాన్ లోని పర్వతప్రాంతాలలో యఘ్నొబి ప్రజలు నివసిస్తున్నారు. ప్రస్తుతం యఘ్నొబి ప్రజల సంఖ్య 25,000 ఉండవచ్చని భావిస్తున్నారు. 20వ శతాబ్దంలో బలవంతపు వలసలు వీరి సంఖ్యను క్షీణింపజేస్తున్నాయి. వీరు యఘ్నొబి భాషను మాట్లాడుతుంటారు. పురాతనమైన సొగ్డియన్ భాష ఆధునిక రూపమే యఘ్నొబి.

తజికిస్థాన్ కళాకారులు దుషంబే టీ హౌస్ రూపొందించారు. అది 1988లో బౌల్డర్, కొలరాడో సిస్టర్ సిటీకి కాముకగా ఇవ్వబడింది. .[93]

మతం

A mosque in Isfara, Tajikistan

సున్ని ఇస్లాంకు చెందిన హనాఫి స్కూల్ 2009లో అధికారికంగా ప్రభుత్వ అనుమతి పొందింది.[94] తజికిస్థాన్ తనతాను లైకిక రాజ్యంగా ప్రకటించుకుంది. దేశంలో ప్రజలకు పూర్తి మతస్వాతంత్ర్యం ఇవ్వబడింది. ప్రభుత్వం ఈద్- ఉల్- ఫితిర్, ఈద్ అల్ అధా పండుగలకు శలవు దినంగా ప్రకటించింది. యు.ఎస్ స్టేట్ డిపార్ట్మెంటు, పీ రీసెర్చ్ నివేదిక అనుసరించి తజికిస్థాన్ ప్రజలలో 98% ముస్లిములు ఉన్నారు. వారిలో దాదాపు 87%-95% సున్నీ ముస్లుములు, దాదాపు 3% ప్రజలు షియా ముస్లిములు, 7% ఏశాఖను వెల్లడించని ముస్లిములు ఉన్నారని తెలియజేస్తున్నాయి.[95][96] మిగిలిన 2% ప్రజలు రష్యన్ ఆర్థడాక్స్ . కాథలిక్ క్రైస్తవులు, జొరాష్ట్రియన్, బుద్ధిజానికి చెందినవారై ఉన్నారు. అత్యధిక ముస్లిములు రంజాన్ ఉపవాసం ఉంటారు. గ్రామాలలో మాడింట 1 వంతు, పట్టణాలలో 10% ప్రజలు దినసరి ప్రార్థనలలో పాల్గొంటారు. బుఖారన్ యూదులు తజికిస్థాన్‌లో క్రీ.పూ 2వ శతాబ్దం నుండి నివసిస్తుండేవారు. ప్రస్తుతం వారిలో ఎవరూ జీవించి లేరు.

వివిధ మతస్థుల మద్య సంబంధాలు సాధారణంగా సుముఖంగానే ఉంటాయి. ప్రధానమైన ముస్లిం నాయకుల మద్య కొంత భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అల్పసంఖ్యాక మతస్థులు వివక్షకు గురౌతున్నారని నాయకుల భావన. మత సంస్థలు దేశరాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇస్లామిక్ రినైసెంస్ పార్టీ తజకిస్థాన్ అంతర్యుద్ధం (1992-1997) యుద్ధంలో ప్రధాన పోరాటవీరులుగా ఉన్నారు. వారు తజికిస్థన్‌ను ముస్లిం దేశంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు. [97] శుక్రవార ప్రార్థనలు జరిపే మసీదులు పరిమితంగానే ఉన్నాయి.[ఎవరు?]కొందరు ఇది వివక్ష అని భావిస్తున్నారు. .చట్టపరంగా మతసంస్థలు స్టేట్ కమిటీ, ప్రాంతీయ అధికారుల ద్వారా నమోదు చేసుకోవాలి. 10 మంది సభ్యులు ఉండాలి. ప్రాంతీయ ప్రభుత్వాధికారులు ప్రార్థనాప్రదేశాన్ని పరిశీలించాలి. సభ్యులు బహిరంగంగా ప్రార్థనకు మనుషులను సమీకరించకూడదు. నమోదు చేయడంలో వైఫల్యం పెద్ద ఎత్తున జరిమానా చెల్లించడానికి దారితీస్తుంది. అంతేకాక ప్రర్ధనా ప్రాంతాన్ను మూతవేయడం సంభవిస్తుంది. అనుమతి పొందండంలో ప్రాంతీయస్థాయిలో సమస్యలు ఉన్నాయని ప్రజల భావన.[98] 18 సంవత్సరాల లోపు వారు బహిరంగ ప్రార్థనలకు అనర్హులు.[99]

ఆరోగ్యం

A hospital in Dushanbe

తజికీ ప్రభుత్వం ఆరోగ్యసంరక్షణా విధానాలను అభివృద్ధిచేసి విస్తరించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆరోగ్యసంరక్షణ అవసరమైనదానికంటే తక్కువగా, ఔషధాల సరఫరా కొరతతో బలహీనంగా ఉంది. లేబర్, సోషల్ వెల్ఫేర్ 2000లో తజికిస్థాన్‌లో 1,04,272 ఆరోగ్యసేవలకొరకు నమోదుచేసుకున్నారని వెల్లడించింది. వీరు తజికిస్థాన్‌లోని పేదరికంతో బాధపడుతున్న ప్రజలు. తజికిస్థాన్ ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకు ఈ ప్రజలకు సహాయంగా నిలిచి పేదరికాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. [100] 2004 ప్రజారోగ్యం కొరకు ప్రభుత్వం జి.డి.పిలో 1% ఖర్చుచేస్తుంది.[101]2012 గణాంకాలను అనుసరించి ప్రజల ఆయుఃప్రమాణం 66.38 సంవత్సరాలు. [102] 2012 గణాంకాలను అనుసరించి శిశుమరణాల శాతం 1000 మందికి 37.[103] 2011 గణాంకాలను అనుసరించి ప్రతి 1,00,000 మంది ప్రజలకు 170 మంది వైద్యులు ఉన్నారు.[104] 2010 గణాంకాలను ఆనుసరించి 457 పిల్లలు, పెద్దలు పోలియోబారిన పడగా నియంత్రణలోకి తీసుకువచ్చే ముందు వీరిలో 29 మంది ప్రాణాలను విడిచిపెట్టారు..[105]

విద్య

Tajik State National University in Dushanbe.

తజికిస్థాన్‌లో విద్య 11 సంవత్సరాల ప్రాథమికవిద్య, సెకండరీ విద్యావిధానం అనుసరిస్తుంది. అయినప్పటికీ 2016 నుండి ప్రభుత్వం 12 సంవత్సరాల ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలను యోచిస్తుంది. .[106] తజికిస్థాన్‌లో అధిక సంఖ్యలో విద్యాసంస్థలు ఉన్నాయి. ఖుజంద్ స్టేట్ యూనివర్శిటీలో 76 డిపార్ట్మెంట్లు, 15 ఫాకల్టీలు ఉన్నాయి. [106] "తజికిస్థాన్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ లా, బిజినెస్ & పాలిటిక్స్ ", ఖొరుఘ్ స్టేట్ యూనివర్శిటీ, అగ్రికల్చరల్ యూనివర్శిటీ ఆఫ్ తజికిస్థాన్, తజిక్ స్టేట్ నేషనల్ యూనివర్శిటీ, పలు విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో అధికమైన యూనివర్శిటీలు సోవియట్ శకంలో స్థాపించబడ్డాయి. 2008 ప్రాంతీయ విద్య టెర్టియరీ అభ్యసించింన విద్యార్థుల శాతం 17%. సబ్ రీజనల్ సరాసరి (37%) కంటే ఇది తక్కువ. .[107] విద్యాశిక్షణ, వృవిద్యా నిపుణులకు తగినన్ని ఉద్యోగావకాశాలు లేనికారణంగా తజికీలు విద్యను కొనసాగించడం వదిలివేస్తున్నారు.[107]ప్రభుత్వం విద్య కొరకు 2005-2012 కొరకు గి.డి.పి నూండి 3.5% నుండి 4.1% వ్యయం చేస్తుంది.[108] ఒ.ఇ.సి.డి చేస్తున్న వ్యయం (6%) కంటే ఇది తక్కువ. [107] ఐక్యరాజ్యసమితి దేశంలోని విద్యావసారాలకు తజికిస్థాన్ చేస్తున్న వ్యయం చాలదని అభిప్రాయపడుతుంది.[107]అకాడింగ్ యు.ఎన్.ఎస్.ఎఫ్ సర్వే అనుసరించి తజికిస్థాన్ బాలికలలో 25% మంది నిర్భంధ ప్రాథమిక విద్యను అభ్యసించడంలో పేదరికం, బాలికల పట్ల చూపుతున్న వివక్ష కారంణంగా వైఫల్యం చెందుతున్నారు.[109] ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తజికిస్థాన్ అక్షారాశ్యతా శాతం అధికంగానే ఉంది.[101][107]

Sport

Tajikistan is a popular destination amongst mountaineers.

తజికిస్థాన్ పర్వతాలు హిల్ క్లైంబింగ్, మౌంటెన్ బైకింగ్, రాక్ క్లైంబింగ్, స్కీయింగ్, స్నోబోర్డింగ్, పర్వతారోహణ మొదలైన పలు ఔట్ డోర్ క్రీడలకు అవకాశం కల్పిస్తుంది. వసతులు పరిమితంగా ఉన్నప్పటికీ ఫాన్, పామిర్ పర్వతాలకు హైకింగ్ టూర్లు, తజికిస్థాన్‌లో ఉన్న 7,000 శిఖరాలకు దేశీయ, అంతర్జాతీయ పర్యటనలు ఏర్పాటు చేయబడుతున్నాయి.

అసోసియేషన్ ఫుట్ బాల్ తజికిస్థాన్‌లో అత్యంత ప్రాబల్యం సంతరించుకుంది. తజకిస్థాన్ నేషనల్ ఫుట్ బాల్ టీం ఎఫ్.ఎఫ్.ఎ, ఆసియన్ ఫుట్ బాల్ కాంఫిడరేధన్‌లో పాల్గొన్నాయి. తజికిస్థాన్ లోని ప్రముఖ క్లబ్బులు తజిక్ లీగ్ లో పోటీ చేస్తున్నాయి. 2012లో తజికిస్థాన్ క్రికెట్ ఫెడరేషన్ ప్రారంభించబడింది. ఇది తజకిస్థాన్ ప్రభుత్వం తరఫున క్రీడలలో పాల్గొంటుంది. అదే సంవత్సరం దీనికి ఆసియన్ క్రికెట్ కైంసిల్ సభ్యత్వం లభించింది. తజికిస్థాన్ రగ్బీ టీం ఇప్పుడిప్పుడే అభివృద్ధిపధంలో సాగుతుంది.

తజికిస్థాన్ స్వతంత్రం పొదాక తజికిస్థానీ అథెట్లు ముగ్గురు ఒలింపిక్ పతకాలు సాధించారు. వారు వరుసగా రెస్ట్లర్ యూసప్ అబ్దుసల్మొవ్, (2008 రెస్టిలింగ్), సమ్మర్ ఒలింపిక్స్ - మెంస్ ఫ్రీస్ట్రైల్ 84 కి.గ్రా. (నీజింగ్ 2008), జుడోకా రసూల్ (జుడో 2008 సమ్మర్ ఒలింపిక్స్- మెంస్ 73 కి.గ్రా; కాంశ్యం: బీజింగ్), బాక్సర్ మవ్జున చొరీవ (బాక్సొంగ్ 2012 ఒలింపిక్స్- వుమెన్ లైట్ వెయిట్; కాంశ్యం).

గొర్నొవ్ - బదఖ్షన్ అటానిమస్ రీజియన్ రాజధాని ఖొరుగు (తజకిస్థాన్ అత్యధిక ఆటిట్యూడ్ ) వద్ద బండీ క్రీడ నిర్వహించబడుతుంది.[110]

మూలాలు

తజికిస్తాన్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు

ఇవీ చూడండి