వియత్నామీస్ భాష

వియత్నామీస్ వియత్నాం దేశ అధికారిక భాష.

వియత్నామీస్ వియత్నాం దేశ అధికారిక భాష. వియత్నాం ఫ్రెంచ్ కాలనీగా ఉన్నప్పుడు, దానిని అనామక అని పిలిచేవారు. దీనిని వియత్నాంలో 86% ప్రజలు మాట్లాడతారు, ఇది వియత్నామీస్ (కిన్) ప్రజల మాతృభాష, వియత్నామీస్ మాట్లాడేవారు ప్రపంచవ్యాప్తంగా తూర్పు, ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఐరోపాలో ఉన్నారు. చెక్ రిపబ్లిక్‌లో వియత్నామీస్ అధికారికంగా మైనారిటీ భాషగా గుర్తించబడింది. యుఎస్ఏలో దాదాపు 3 మిలియన్ల మంది వియత్నామీస్ మాట్లాడేవారు నివసిస్తున్నారు. ఇది ఆస్ట్రో-ఏషియాటిక్ కుటుంబానికి చెందిన భాష. వియత్నామీస్ భాష మొత్తం చైనీస్ భాష నుండి వచ్చింది . ఇది లాటిన్‌లాగా యూరోపియన్ భాషల మాదిరిగానే ఉంటుంది, పదాలు గ్రీకు భాష నుండి స్వీకరించబడ్డాయి. వియత్నామీస్ భాష మొదట చైనీస్ వర్ణమాలలో వ్రాయబడింది(చైనీస్ లిపిలో) కానీ ఇప్పుడు వియత్నామీస్ రచనా విధానంలో లాటిన్ వర్ణమాలకు అనుగుణంగా ఉంటుంది.[3]

వియత్నామీస్
Tiếng Việt
స్థానిక భాషవియాత్నం
చైనా (డాంగ్సింగ్, గ్వాంగ్జీ)
స్వజాతీయతవియత్నామీస్
స్థానికంగా మాట్లాడేవారు
76 మిలియన్ (2009)e22
భాషా కుటుంబం
ఆస్ట్రోయాసియాటిక్
  • వియెటిక్
    • వియత్-ముయాంగ్
      • వియత్నామీస్
Early forms
వియత్-ముయాంగ్
  • పాత వియత్నామీస్
    • మధ్య వియత్నామీస్
వ్రాసే విధానం
వియత్నామీస్ వర్ణమాల
వియత్నామీస్ బ్రెయిలీ
నామ్ లిపి (చారిత్రక)
చైనీస్ అక్షరాలు (చారిత్రక)
అధికారిక హోదా
అధికార భాష
వియాత్నం Vietnam
[1]
గుర్తింపు పొందిన అల్పసంఖ్యాకుల భాష
చెక్ రిపబ్లిక్
భాషా సంకేతాలు
ISO 639-1vi
ISO 639-2vie
ISO 639-3vie
Glottologviet1252
Linguasphere46-EBA
వియత్నాంలోని స్థానికంగా వియత్నామీస్-మాట్లాడే(మైనారిటీయేతర) ప్రాంతాలు[2]

వర్గీకరణ

జాన్ క్రాఫర్డ్ రచించిన థాయ్ వియత్నామీస్ కాంబోజన్స్ చంపా మోన్ లావో పాలి పదజాలం హెచ్ కోల్‌బర్న్ లండన్ ద్వారా ప్రచురించబడింది

దాదాపు 150 సంవత్సరాల క్రితం వియత్నామీస్‌ ఆస్ట్రోఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందిన మోన్-ఖ్మెర్ శాఖకు చెందినదిగా వర్గీకరించబడింది. ఇందులో కంబోడియాలో మాట్లాడే ఖైమర్ భాష, అలాగే వివిధ చిన్న ప్రాంతీయ భాషలు, తూర్పు భారతదేశంలో మాట్లాడే ముండా, ఖాసీ భాషలు ఉన్నాయి. ముయోంగ్ ఇతర మోన్-ఖ్మెర్ భాషల కంటే వియత్నామీస్‌తో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. "వియెటిక్" అనే పదాన్నిమొదటగా హేస్ (1992) ప్రతిపాదించాడు, జెరార్డ్ డిఫ్లోత్, ఉపవర్గీకరణపై కొంచెం భిన్నమైన ప్రతిపాదనతో ఉపయోగించాడు. ఇందులో "వియట్-ముయాంగ్" అనే పదం వియత్నామీస్ మాండలికాలు, ముయోంగ్‌లతో కూడిన సమూహాన్ని సూచిస్తుంది.[4]

చరిత్ర

వియాత్నం భాష

వియత్నామీస్ వియటిక్ ప్రజలు మాట్లాడే వియటిక్ శాఖ సమూహాలకు చెందిన భాష. వియత్నామీస్ ప్రధానంగా చైనీయులచే ప్రభావితమైంది, 2వ శతాబ్దంలో రాజకీయంగా ఆధిపత్యం చెలాయించింది. 10వ శతాబ్దంలో వియత్నాం స్వాతంత్రం పొందిన తరువాత, పాలక వర్గం సాంప్రదాయ చైనీస్‌ని సాహిత్య అధికారిక మాధ్యమంగా స్వీకరించింది. చైనీస్ ఆధిపత్యంతో చైనీస్ పదజాలం, వ్యాకరణ ప్రభావం సమూలంగా తీసుకోబడింది. అన్ని రంగాలలోని వియత్నామీస్ నిఘంటువు ఒక భాగం సైనో-వియత్నామీస్ పదాలను కలిగి ఉంటుంది. అవి వియత్నామీస్ నిఘంటువులో దాదాపు మూడింట ఒక వంతు, అధికారిక గ్రంథాలలో ఉపయోగించే పదజాలంలో 60% వరకు ఉంటాయి. 19వ శతాబ్దం చివరలో ఫ్రాన్స్ వియత్నాంపై దండెత్తినప్పుడు, ఫ్రెంచ్ క్రమంగా అధికారిక భాషగా చైనీస్ స్థానంలో ఉంది.[5]

వియత్నామీస్ భాష రకాలు:

హెన్రీ మాస్పెరో వియత్నామీస్ భాష కు సంబంధించిన రకాలు

  • ప్రోటో-వియట్
  • ప్రోటో-వియత్నామీస్
  • ప్రాచీన వియత్నామీస్
  • మిడిల్ వియత్నామీస్
  • ఆధునిక వియత్నామీస్
  • ప్రాచీన వియత్నామీస్

భౌగోళికముగా భాష

జాతీయ భాషగా, వియత్నాంలో వియత్నామీస్ భాషను చైనాలోని దక్షిణ గ్వాంగ్జి ప్రావిన్స్‌లోని డాంగ్‌సింగ్‌లో మూడు ద్వీపాలలో (ప్రస్తుతం ప్రధాన భూభాగానికి చేరింది) నివసిస్తున్న వారు మాట్లాడతారు. చైనా ప్రధాని జిన్ కూడా దీనిని మాట్లాడతారు. పొరుగు దేశాలైన కంబోడియా, లావోస్‌లో కూడా పెద్ద సంఖ్యలో వియత్నామీస్ భాషను మాట్లాడేవారు నివసిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్‌, వియత్నామీస్ భాషను అత్యధికంగా మాట్లాడుతున్న వారిలో 5 వ స్థానంలో ఉంది. టెక్సాస్, వాషింగ్టన్‌లలో అత్యధికంగా మాట్లాడే మూడవ భాష, జార్జియా, లూసియానా వర్జీనియాలో నాల్గవది, అర్కాన్సాస్, కాలిఫోర్నియాలో ఐదవది. ఆస్ట్రేలియాలో అత్యధికంగా మాట్లాడే ఏడవ భాషగా వియత్నామీస్ అభివృద్ధి చెందింది.

ఇది కూడా చూడండి

మూలాలు