షింజో అబే

షింజో అబే (ఆంగ్లం: Shinzo Abe) (1954 సెప్టెంబరు 21 - 2022 జులై 8) ఒక జపనీస్ రాజకీయ నాయకుడు. జపాన్ మాజీ ప్రధాని. అతను 2006 నుండి 2007 వరకు జపాన్ ప్రధాన మంత్రిగా చేసారు. తిరిగి 2012 నుండి 2007 వరకు, అలాగే 2012 నుండి 2020 వరకు జపాన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్షుడిగా పనిచేశాడు. జపాన్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.[1][2] షింజో అబే 2005 నుండి 2006 వరకు జునిచిరో కొయిజుమి ఆధ్వర్యంలో ప్రధాన క్యాబినెట్ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 2012లో కొంతకాలం ఆయన ప్రతిపక్ష నాయకుడి ఉన్నాడు.

షింజో అబే, జపాన్ మాజీ ప్రధాన మంత్రి
2014లో 65వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకల్లో షింజో అబే

హత్య

2022 జూలై 8న నరా నగరంలో ఎన్నికల సందర్భంగా ప్రచార ప్రసంగం చేస్తున్న సమయంలో షింజో అబేను వెనుక నుంచి దుండగులు కాల్పులు జరిపారు. అతను కార్డియోపల్మోనరీ అరెస్టులో ఉన్నట్లు నివేదించబడింది. ఈ హత్యాయత్నం కేసులో 41 ఏళ్ల యమగామి టెట్సుయా అనే వ్యక్తిని మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్టు చేశారు.[3] జపాన్ ప్రభుత్వ మీడియా సుమారు ఐదు గంటల తరువాత షింజో అబే ఆసుపత్రిలో మరణించినట్లు నివేదించింది.[4]

మూలాలు