ఇమ్రాన్ ఖాన్ నియాజి

పాకిస్తాన్ ప్రధానమంత్రి, మాజీ క్రికెటరు

ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజి (జననం 1952 అక్టోబరు 5) [2] పాకిస్తానుకు 22 వ[n 1] ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి చైర్మన్. రాజకీయాల్లోకి రాకముందు, ఖాన్ అంతర్జాతీయ క్రికెటరు, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్. అతడి నేతృత్వంలో పాకిస్తాన్ 1992 క్రికెట్ ప్రపంచ కప్‌ సాధించింది.

ఇమ్రాన్ ఖాన్ నియాజి
HI PP
మూస:Unq
Khan in 2019
22nd Prime Minister of Pakistan
In office
18 August 2018 – 10 April 2022
అధ్యక్షుడు
  • Mamnoon Hussain
  • Arif Alvi
అంతకు ముందు వారుNasirul Mulk (Caretaker)
తరువాత వారుShehbaz Sharif
Chairman of the Pakistan Tehreek-e-Insaf
Incumbent
Assumed office
25 April 1996
DeputyShah Mahmood Qureshi
అంతకు ముందు వారుPosition established
Member of the National Assembly
In office
13 August 2018 – 21 October 2022
అంతకు ముందు వారుObaidullah Shadikhel
నియోజకవర్గంNA-95 (Mianwali-I)
మెజారిటీ113,523 (44.89%)
In office
19 June 2013 – 31 May 2018
అంతకు ముందు వారుHanif Abbasi
తరువాత వారుSheikh Rashid Shafique
నియోజకవర్గంNA-56 (Rawalpindi-VII)
మెజారిటీ13,268 (8.28%)
In office
10 October 2002 – 3 November 2007
అంతకు ముందు వారుConstituency established
తరువాత వారుNawabzada Malik Amad Khan
నియోజకవర్గంNA-71 (Mianwali-I)
మెజారిటీ6,204 (4.49%)
Chancellor of the University of Bradford
In office
7 December 2005 – 7 December 2014
అంతకు ముందు వారుBetty Lockwood
తరువాత వారుKate Swann
వ్యక్తిగత వివరాలు
జననం
Imran Ahmad Khan Niazi

(1952-10-05) 1952 అక్టోబరు 5 (వయసు 71)
Lahore, Pakistan
రాజకీయ పార్టీPakistan Tehreek-e-Insaf
(1996–present)
జీవిత భాగస్వామి
Jemima Goldsmith
(m. 1995; div. 2004)
Reham Khan
(m. 2015; div. 2015)
Bushra Bibi
(m. 2018)
సంతానంSulaiman Isa Khan
Kasim Khan
తల్లిShaukat Khanum
తండ్రిIkramullah Khan Niazi
బంధువులుFamily of Imran Khan
నివాసంBani Gala, Islamabad
Zaman Park, Lahore
చదువుKeble College, Oxford (BA)
పురస్కారాలుSee list
సంతకం
మారుపేరుKaptaan (Captain)
వ్యక్తిగత సమాచారం
ఎత్తు1.88[1] m (6 ft 2 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm fast
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 88)1971 జూన్ 3 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1992 జనవరి 2 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 175)1974 ఆగస్టు 31 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1992 మార్చి 25 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీటెస్టులువన్‌డేలుఫస్ట్లిస్ట్ ఎ
మ్యాచ్‌లు88175382425
చేసిన పరుగులు3,8073,70917,77110,100
బ్యాటింగు సగటు37.6933.4136.7933.22
100లు/50లు6/181/1930/935/66
అత్యుత్తమ స్కోరు136102*170114*
వేసిన బంతులు19,4587,46165,22419,122
వికెట్లు3621821287507
బౌలింగు సగటు22.8126.6122.3222.31
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు231706
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు60130
అత్యుత్తమ బౌలింగు8/586/148/346/14
క్యాచ్‌లు/స్టంపింగులు28/–36/–117/–84/–
మూలం: ESPNcricinfo, 2014 నవంబరు 5

ఖాన్ 1952 లో లాహోర్లో ఒక పష్తూన్ కుటుంబంలో జన్మించాడు.[8] 1975 లో ఆక్స్‌ఫర్డ్ లోని కేబుల్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. 1971 లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు.[8] ఖాన్ 1992 వరకు ఆడాడు.1982, 1992 మధ్య జట్టు కెప్టెన్‌గా పనిచేశాడు.[9] క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు. ఈ పోటీలో ఇదే పాకిస్తాన్ యొక్క మొదటి, ఏకైక విజయం.[10] పాకిస్తాన్ యొక్క అత్యుత్తమ ఆల్ రౌండ్ ఆటగాడిగా పరిగణించబడుతున్న ఖాన్ టెస్ట్ క్రికెట్లో 3,807 పరుగులు తీసాడు, 362 వికెట్లు తీసుకున్నాడు.[11] పదవీ విరమణ చేసిన తరువాత, అతను తన యవ్వనంలో ఉండగా బాల్ ట్యాంపరింగ్‌ చేసానని ఒప్పుకున్నాడు.[12] దేశీయ లీగ్ కోచ్‌గా పనిచేశాడు.[13] ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరాడు .[9]

1991 లో, అతను తన తల్లి జ్ఞాపకార్థం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. 1994 లో లాహోర్లో ఒక ఆసుపత్రిని స్థాపించడానికి $2.5 కోట్లు సేకరించాడు. 2015 లో పెషావర్లో రెండవ ఆసుపత్రిని స్థాపించాడు.[14] ఖాన్ తన దాతృత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ, షౌకత్ ఖానుమ్ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిని ఒక పరిశోధనా కేంద్రంగా కూడా విస్తరించాడు. 2008 లో నామల్ కాలేజీని స్థాపించాడు.[15][16] ఖాన్ 2005, 2014 మధ్య బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా కూడా పనిచేశాడు. 2012 లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ గౌరవ ఫెలోషిప్ అందుకున్నాడు.[17][18]

2014 చివరిలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని నిరసనలపై వాయిస్ ఆఫ్ అమెరికా నివేదించింది

ఖాన్ 1996 లో పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.[19] 2002 లో జాతీయ అసెంబ్లీలో మియాన్వాలి సీటు గెలిచి 2007 వరకు ప్రతిపక్ష సభ్యుడిగా పనిచేశాడు. పిటిఐ 2008 లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించింది. తరువాతి ఎన్నికలలో రెండవ అతిపెద్ద ఓటును పొందింది.[20][21] ప్రాంతీయ రాజకీయాల్లో, పిటిఐ 2013 నుండి ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించింది.[22] 2018 లో ప్రధానిగా ఎన్నికైన తరువాత ఖాన్ తన నాయకత్వాన్ని సహచరులకు అప్పగించాడు.[23]

ప్రధానమంత్రిగా, ఖాన్ 2018, 2019 మధ్య పాకిస్తాన్ రూపాయి విలువలో తరుగుదలను సమతుల్యం చేసేందుకు $16 బిలియన్లు అప్పు తీసుకున్నాడు. ఇది పాకిస్తాన్ ఏర్పడిన తరువాత ఓ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అత్యధికం బాహ్య రుణం.[24] అవినీతిపై చాలా మందిపై సవాలు చేసిన ఇమ్రాన్ ఖాన్, ప్రజాస్వామ్య తిరోగమనం, మానవ హక్కుల ఉల్లంఘనల కొనసాగింపు వంటి ఆరోపణలను రాజకీయ ప్రత్యర్థుల నుండి ఎదుర్కొన్నాడు.[25][26] 2030 నాటికి పాకిస్తాన్‌ను ఎక్కువగా పునరుత్పాదకంగా మార్చాలనే లక్ష్యంతో ఖాన్, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడానికి ముందుకు వచ్చాడు.[27] పన్ను వసూలు, పెట్టుబడులను పెంచే విధానాన్ని కూడా ఆయన రూపొందించాడు. విదేశాంగ విధానంలో, అతను భారత్‌తో సరిహద్దు తగాదాలను పర్యవేక్షించాడు. అమెరికా, చైనాలతో సంబంధాలను బలోపేతం చేశాడు. విదేశాలలో పాకిస్తాన్ ప్రతిష్ఠను మెరుగుపరిచాడు.[28]

బాల్యం, విద్యాభ్యాసం

ఖాన్ 1952 అక్టోబరు 5 న లాహోర్లో జన్మించాడు.[2] అతను 1952 నవంబరు 25 న జన్మించాడని కొన్ని కథనాలు సూచిస్తున్నాయి.[29][30][31][32] నవంబరు 25 అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు అతని పాస్పోర్ట్ పై తప్పుగా ప్రస్తావించినట్లు తెలిసింది.[2] అతను సివిల్ ఇంజనీర్ ఇక్రముల్లా ఖాన్ నియాజీ, షౌకత్ ఖానుమ్ ల ఏకైక కుమారుడు. అతడికి నలుగురు సోదరీలు ఉన్నారు.[33] వాయవ్య పంజాబ్‌లోని మియాన్‌వాలిలో దీర్ఘకాలంగా స్థిరపడ్డారు. అతని తల్లితండ్రులు పష్తూన్ జాతికీ, నియాజీ తెగకూ చెందినవారు.[34][35] అతని పూర్వీకులలో ఒకరైన హైబాత్ ఖాన్ నియాజీ, 16 వ శతాబ్దంలో, " షేర్ షా సూరి సేనాధిపతుల్లో ఒకరు. పంజాబ్ గవర్నరు కూడా." [36] ఖాన్ తల్లి బుర్కీ లోని పష్తూన్ తెగకు చెందినది. పాకిస్తాన్ చరిత్రలో అనేకమంది విజయవంతమైన క్రికెటర్లను అందించిన తెగ ఇది.[33] వీరిలో అతని దాయాదులు జావేద్ బుర్కీ, మాజిద్ ఖాన్ లు కూడా ఉన్నారు.[34] తల్లి తరపు వంశీకులు, సూఫీ యోధుడు-కవి, పష్తో వర్ణమాలను తయారుచేసిన పీర్ రోషన్ కు వారసులు.[37] అతని తల్లి తరపు కుటుంబం సుమారు 600 సంవత్సరాలుగా భారతదేశంలోని జలంధర్ లోని బస్తీ డానిష్మండాలో ఉంది.[8][38]

ఖాన్ బాల్యంలో ప్రశాంతంగా, పిరికిగా ఉండేవాడు. తన సోదరీలతో కలిసి సంపన్నమైన, ఉన్నత మధ్యతరగతి వాతావరణంలో పెరిగాడు.[39] అతడికి విశేషమైన విద్యను లభించింది.. అతను లాహోర్లోని ఐచిసన్ కాలేజ్ లోను, కేథడ్రల్ స్కూల్లోనూ విద్యను అభ్యసించాడు.[40][41] ఆపై ఇంగ్లాండ్‌లోని రాయల్ గ్రామర్ స్కూల్ వోర్సెస్టర్ లో చదివాడు. అక్కడ అతను క్రికెట్‌లో రాణించాడు. 1972 లో, అతను ఆక్స్ఫర్డ్లోని కేబుల్ కాలేజీలో చేరాడు. అక్కడ అతను తత్వం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం చదివాడు. 1975 లో పట్టభద్రుడయ్యాడు.[42]

క్రికెట్

ఖాన్ తన 16 వ ఏట లాహోర్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్రవేశం చేశాడు. 1970 ల ప్రారంభంలో, అతను తన సొంత జట్లు లాహోర్ ఎ (1969-70), లాహోర్ బి (1969-70), లాహోర్ గ్రీన్స్ (1970–71), చివరికి లాహోర్ (1970–71) తరపున ఆడాడు.[43] ఖాన్ 1973-1975 సీజన్లలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం యొక్క బ్లూస్ క్రికెట్ జట్టులో భాగం.[42] 1971 నుండి 1976 వరకు కౌంటీ క్రికెట్ ఆడిన వోర్సెస్టర్షైర్లో, అతను సగటు మీడియం-పేస్ బౌలర్గా మాత్రమే పరిగణించబడ్డాడు. ఈ దశాబ్దంలో, ఖాన్ ప్రాతినిధ్యం వహించిన ఇతర జట్లలో దావూద్ ఇండస్ట్రీస్ (1975-1976), పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (1975-1976 నుండి 1980-1981 వరకు) ఉన్నాయి. 1983 నుండి 1988 వరకు అతను ససెక్స్ తరపున ఆడాడు.[11]

ఖాన్ 1971 జూన్ లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.[44] మూడు సంవత్సరాల తరువాత, 1974 ఆగస్టు లో, అతను వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) మ్యాచ్‌లో ఆడాడు. ప్రుడెన్షియల్ ట్రోఫీ కోసం ట్రెంట్ బ్రిడ్జ్‌లో మరోసారి ఇంగ్లాండ్‌తో ఆడాడు.[44] ఆక్స్ఫర్డ్ నుండి పట్టభద్రుడయ్యాక, వోర్సెస్టర్షైర్లో తన పదవీకాలం పూర్తి చేసిన తరువాత, అతను 1976 లో పాకిస్తానుకు తిరిగి వచ్చాడు. 1976-1977 సీజన్ నుండి తన జాతీయ జట్టులో శాశ్వత స్థానాన్ని పొందాడు. ఈ సమయంలో జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లతో ఆడింది.[43] ఆస్ట్రేలియా సీరీస్ తరువాత, అతను వెస్టిండీస్లో పర్యటించాడు. అక్కడ అతను టోనీ గ్రెగ్‌ను కలుసుకున్నాడు. అతను కెర్రీ ప్యాకర్ యొక్క వరల్డ్ సిరీస్ క్రికెట్ కోసం సంతకం చేశాడు.[11] 1978 లో పెర్త్‌లో జరిగిన ఫాస్ట్ బౌలింగ్ పోటీలో, 139.7 కి.మీ./సే వేగంతో బౌలింగు చేసి ఖాన్, జెఫ్ థామ్సన్, మైఖేల్ హోల్డింగ్ ల తరువాత మూడవ స్థానంలో నిలిచాడు. డెన్నిస్ లిల్లీ, గార్త్ లే రూక్స్, ఆండీ రాబర్ట్స్ ల కంటే ముందు స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడుగా నిలబడ్డాడు.[45] 1970 ల చివరలో, రివర్స్ స్వింగ్ బౌలింగ్ టెక్నిక్ యొక్క మార్గదర్శకులలో ఖాన్ ఒకడు. అతను ఈ ఉపాయాన్ని బౌలింగ్ ద్వయం వసీం అక్రమ్, వకార్ యూనిస్ లకు అందించాడు. వీళ్ళిద్దరూ తరువాతి సంవత్సరాల్లో ఈ కళకు పదును పెట్టి, మరింత ప్రాచుర్యం తెచ్చారు.[46]

ఫాస్ట్ బౌలర్‌గా ఖాన్ 1982 లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. 9 టెస్టుల్లో, అతను 62 వికెట్లు ఒక్కో వికెట్టుకూ 13.29 పరుగుల చొప్పున తీసుకున్నాడు. ఇది ఓ క్యాలెండర్ సంవత్సరంలో కనీసం 50 వికెట్లు తీసుకున్న ఏ బౌలర్ సగటు కంటే కూడా తక్కువ.[47] 1983 జనవరి లో, భారత్‌తో ఆడుతున్నపుడు టెస్ట్ బౌలింగ్ రేటింగ్‌ను 922 పాయింట్లు సాధించాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే (ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్లేయర్ రేటింగ్స్ లేవు), ఆ కాలంలో ఖాన్ పనితీరు ప్రకారం చూస్తే ఐసిసి ఆల్-టైమ్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో ఉన్నాడు.[48]

ఖాన్ 75 టెస్టుల్లో ఆల్ రౌండర్ యొక్క ట్రిపుల్ (3000 పరుగులు, 300 వికెట్లు సాధించాడు) సాధించాడు. ఇయాన్ బోథమ్ 72 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. అతడి తరువాత ఇది రెండవ వేగవంతమైన రికార్డు. బ్యాటింగ్ క్రమంలో 6 వ స్థానంలో ఆడుతున్న టెస్ట్ బ్యాట్స్‌మన్గా 61.86 సగటు సాధించాడు. ఆస్థానంలో ఆడే బ్యాట్స్‌మన్‌లలో ఇది ఆల్-టైమ్ బ్యాటింగ్ సగటులో రెండవ స్థానం.[49] 1992 జనవరిలో పాకిస్తాన్ తరఫున శ్రీలంకతో ఫైసలాబాద్‌లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తన సారథ్యంలో చారిత్రాత్మక 1992 ప్రపంచ కప్ విజయం సాధించాక ఖాన్ క్రికెట్ నుండి రిటైరయ్యాడు.[50] అతను తన కెరీర్‌లో 88 టెస్ట్ మ్యాచ్‌లు, 126 ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలతో సహా 37.69 సగటుతో 3807 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 136. బౌలర్‌గా, అతను టెస్ట్ క్రికెట్‌లో 362 వికెట్లు పడగొట్టాడు. అతడు ఈ రికార్డు సాధించిన తొలి పాకిస్తానీ బౌలరు, ప్రపంచంలో నాల్గవ బౌలరు.[11] వన్డేల్లో 175 మ్యాచ్‌లు ఆడి 33.41 సగటుతో 3709 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 102 నాటౌట్. అతని ఉత్తమ వన్డే బౌలింగ్ 14 పరుగులకు 6 వికెట్లు, ఓడిపోయిన మ్యాచ్‌లో ఓ బౌలర్ సాధించిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవి.[51]

రాజకీయాల్లో

1996 ఏప్రిల్ 25 న, ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) అనే రాజకీయ పార్టీని స్థాపించాడు.[34][52] అతను 1997 పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలలో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలలో ఎన్ఎ -53, మియాన్వాలి, ఎన్ఎ -94, లాహోర్ అనే రెండు నియోజకవర్గాల నుండి పిఎటిఐ అభ్యర్థిగా పోటీ చేసాడు. కానీ రెండిట్లోనూ ఓడిపోయాడు [53]

2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసాడు.[54] ప్రారంభ, అధికారిక ఫలితాల ప్రకారం, ఖాన్ పెద్ద ఎత్తున ఓటు రిగ్గింగుకు పాల్పడ్డాడని పిఎమ్ఎల్-ఎన్, ఆరోపించింది.[55][56][57] జూలై 27 న, ఎన్నికల అధికారులు ఖాన్ పార్టీ 269 సీట్లలో 110 గెలిచినట్లు ప్రకటించారు, [23] జూలై 28 న జరిగిన కౌంట్ ముగింపులో, పోటీ చేసిన 270 సీట్లలో మొత్తం 116 స్థానాలను పిటిఐ గెలుచుకున్నట్లు పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల చరిత్రలో ఐదు నియోజకవర్గాలలో పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి అయ్యాడు. అంతకుముందు 1970 లో, జుల్ఫికర్ అలీ భుట్టో నాలుగిట్లో పోటీ చేసి మూడు నియోజకవర్గాల్లో గెలిచాడు.[58][59]

2018 ఆగస్టు 17 న ఖాన్ 176 ఓట్లు సాధించి పాకిస్తానుకు 22 వ ప్రధాని అయ్యాడు. 2018 ఆగస్టు 18 న ప్రమాణ స్వీకారం చేశాడు.[60][61] సోహైల్ మహమూద్‌ను విదేశాంగ మంత్రిగా, రిజ్వాన్ అహ్మద్‌ను సముద్ర రవాణా మంత్రిగా, నవీద్ కమ్రాన్ బలూచ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించడం సహా దేశ బ్యూరోక్రసీలో ఉన్నత స్థాయి పునర్వ్యవస్థీకరణకు ఖాన్ ఆదేశించాడు.[62][63] పాకిస్తాన్ సైన్యంలో అతని మొట్టమొదటి ప్రధాన నియామకంగా, లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ ను కీలకమైన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ స్థానానికి నియమించాడు.[64]

వ్యక్తిగతం

అతనికి బ్రహ్మచారి జీవితంలో అనేక మంది స్త్రీలతో సంబంధాలుండేవి. [65] అప్పుడు అతను లండన్ నైట్క్లబ్ సర్క్యూట్లో చురుకుగా ఉండేవాడు. అతన్ని ప్లేబాయ్ అని పిలిచేవారు.[65][66][67] బ్రహ్మచారి జీవితంలో అతనికి చాలా మంది స్నేహితులు ఉన్నారు.[68] అతని వివాహేతర సంబంధాలలో కొందరు - జీనత్ అమన్, [69] ఎమ్మా సార్జెంట్, సూసీ ముర్రే-ఫిలిప్సన్, సీతా వైట్, సారా క్రాలే, [68] స్టెఫానీ బీచం, గోల్డీ హాన్, క్రిస్టియన్ బ్యాకర్, సుసాన్నా కాన్స్టాంటైన్, మేరీ హెల్విన్, కరోలిన్ కెల్లెట్, [70] లిజా కాంప్‌బెల్, [34] అనస్తాసియా కుక్, హన్నా మేరీ రోత్స్‌చైల్డ్, [71] జెర్రీ హాల్, లులు బ్లాకర్.[72][73]

2009 లో ప్రచురించిన ఒక పుస్తకంలో క్రిస్టోఫర్ శాండ్‌ఫోర్డ్, పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ ఆక్స్‌ఫర్డ్‌లో విద్యార్థులుగా ఉన్నప్పుడు సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారని రాసాడు.[74] 1975 లో భుట్టో తన 21 సంవత్సరాల వయసులో, ఖాన్‌తో సన్నిహితంగా ఉండేది. వారు సుమారు రెండు నెలలు సంబంధంలో ఉన్నారు.[74] అతని తల్లి వారికి పెళ్ళి చేసేందుకు ప్రయత్నించింది కూడా.[74] తమకు "శృంగార సంబంధం" ఉందని ఖాన్ పేర్కొన్నాడు. తరువాత దీన్ని ఖండించి తాము స్నేహితులం మాత్రమే అని చెప్పాడు.[74]

ఇమ్రాన్ ఖాన్ మూడు సార్లు పెళ్ళి చేసుకున్నాడు. జెమీమా గోల్డ్‌స్మిత్ అతడి మొదటి భార్య. ఆమెకు విడాకులిచ్చాక, రేహాన్ని పెళ్ళి చేసుకున్నాడు. ఆమెకూ విడాకులిచ్చాక 2018 లో, బుష్రా బీబీని పెళ్ళి చేసుకున్నాడు.

మూలాలు


ఉల్లేఖన లోపం: "n" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="n"/> ట్యాగు కనబడలేదు