కొబ్బరి పాలు

కొబ్బరి పాలు అనేది కొబ్బరికాయ తురుము నుండి వచ్చిన ద్రవ పదార్థం. ఇది ఒక పరిపక్వమైన కొబ్బరికాయ యొక్క కొబ్బరి నుండి తయారయ్యే తీయని, పాలవంటి వంటలో ఉపయోగించే పదార్థం. ఈ పాల రంగు, కమ్మని రుచికి కారణం, అందులోని అధికమైన నూనె పదార్థం, చక్కెరలు. కొబ్బరి పాలు అనే పదం, కొబ్బరి నీరు (కొబ్బరి పానీయం) ఒకటి కాదు, కొబ్బరి నీరు అనేది కొబ్బరికాయ లోపలివైపు సహజంగా ఉత్పన్నమయ్యే ద్రవం.[1] కొబ్బరి పాలు చాలా రుచిగా ఉండటమే కాక, చాలా ఎక్కువ నూనె శాతం ఉంటుంది. ఈ పాలల్లో ఉండే కొవ్వు ఎక్కువగా సంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది.  దక్షిణ తూర్పు ఆసియాలోనుదక్షిణ ఆసియాలోనూ,  దక్షిణ చైనాలోను,  కరేబియా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లోనూ ఎక్కువగా వంటల్లో ఈ పాలను వాడుతుంటారు.

కొబ్బరి పాలు.

తయారీ

తాజా కొబ్బరి కాయ నుండి సంప్రదాయ పద్ధతిలో కొబ్బరిపాల తయారీ

రెండు రకాల కొబ్బరి పాలు ఉంటాయి: చిక్కటివి, పలుచనివి . తురిమిన కొబ్బరిని చీజ్‍క్లాత్ (వడపోత బట్ట) ను ఉపయోగించి నేరుగా పిండడం ద్వారా చిక్కటి పాలు లభిస్తాయి. పిండిన కొబ్బరిని అటుపై వెచ్చని నీటిలో నానబెట్టి, రెండు లేదా మూడు సార్లు పిండినప్పుడు పలుచని కొబ్బరి పాలు లభిస్తాయి. చిక్కటి పాలు ముఖ్యంగా డెస్సర్ట్ (భోజనంలో ఆఖరి అంశం) లు, ఘనమైన, పొడి సాస్‍ల తయారీలో ఉపయోగిస్తారు. పలుచని పాలు సూప్‍ల తయారీ, సాధారణమైన వంటలో ఉపయోగిస్తారు. ఈ తేడా సామాన్యంగా పశ్చిమ దేశాలలో ఉండదు, ఎందుకంటే అక్కడ తాజా కొబ్బరి పాలు సామాన్యంగా ఉత్పత్తి చేయబడవు,, చాలావరకూ వినియోగదారులు కొబ్బరి పాలను డబ్బాలలో కొంటారు. కొబ్బరి పాల డబ్బాల తయారీదారులు సాధారణంగా పలుచని, చిక్కటి పిండిన కొబ్బరిపాలను కలిపి, వాటిలో అదనంగా నీరు కలుపుతారు.

కొబ్బరి పాలను ఇంట్లోనే తురిమిన కొబ్బరిని వేడి నీరు లేదా పాలతో కలిపి, నూనె, సుగంధ పదార్థాలను తొలగించి, తయారుచేయవచ్చు. ఇందులోని క్రొవ్వు పదార్థం సుమారు 17% ఉంటుంది. ఫ్రిజ్‍లో ఉంచి అలాగే ఒదిగేలా వదిలివేస్తే, కొబ్బరి మీగడ పైభాగానికి వచ్చి, పాలనుండి విడివడుతుంది.

కొబ్బరి పాలు పచ్చిగా సైతం త్రాగవచ్చు, లేదా టీ, కాఫీ మొదలైన వాటిలో జంతువుల పాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. తాజా కొబ్బరి పాలకు ఆవు పాలతో సమానమైన స్థిరత్వం, కొద్దిగా తీయని రుచి ఉంటుంది, సవ్యంగా తయారుచేసినట్లయితే, కొబ్బరి వాసన ఉండదు, ఉన్నప్పటికీ ఎంతో తక్కువగా ఉంటుంది. సమశీతోష్ణ పశ్చిమ దేశాలలో, దీనిని ముఖ్యంగా శాకాహారులు లేదా జంతువుల పాలకు అలర్జీలు కలిగిన ప్రజలు ఉపయోగిస్తారు. దీనిని పండ్లతో కలిపి పెరుగుకు ప్రత్యామ్నాయం చేయవచ్చు, సాధారణంగా బేకింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు.

సంప్రదాయ పద్ధతిలో, కొబ్బరిపాలను కొబ్బరికాయలోని తెల్లటి గుజ్జును తురమడం ద్వారా తయారీ చేస్తారు. ఈ తురుముకు కొన్ని నీళ్ళను కలిపి కొవ్వు శాతాన్ని విడదీసాకా మిగిలిన ద్రవ పదార్ధాన్ని పాలగా వ్యవహరిస్తారు. కొబ్బరిని స్వంతంగా చేతితోగానీ, యంత్రాలను ఉపయోగించిగానీ తురమవచ్చు. 20-22శాతం కొవ్వు లభించిన పాలను చిక్కటిపాలు అంటారు. 5-7శాతం కొవ్వు ఉంటే దాన్ని పల్చటి పాలగా వ్యవహరిస్తారు. బట్టలో తురుమును వేసి పిండగా వచ్చిన పాలు ఎక్కువ చిక్కగా ఉంటాయి. ఆ తర్వాత మిగిలిన పిప్పిని మరిన్ని నీళ్ళు పోసి పిండితే పల్చటి పాలు వస్తాయి. స్వీట్లలోను, సాస్లలోను ఎక్కువగా చిక్కటి పాలను వాడతారు. సూప్స్ లో పల్చటి పాలను ఉపయోగిస్తారు. పడమర దేశాల్లో ఈ పాలను చిక్కదనం, పల్చదనం ఆధారంగా వాడటం మనకు కనపడదు. సాధారణంగా తాజా కొబ్బరిపాలు లభించడం అరుదు కాబట్టి, ఎక్కువ మంది ప్యాక్ చేసిన పాలనే వాడుతుంటారు.

కొబ్బరినీళ్ళు ఎక్కువగా లేత కొబ్బరి బొండాల్లో దొరుకుతాయి. కొబ్బరి కాయల్లోనూ లభించినా అది తక్కువ పరిమాణంలోనే ఉంటుంది. పానీయాలను ఎక్కువగా లేత కొబ్బరిని, కొబ్బరినీళ్ళను కలిపి తయారు చేస్తుంటారు.

ఇంట్లో కొబ్బరిపాలను తయారు చేయడానికి కొబ్బరిని తురిమి దానికి సరిపడా పాలనుగానీ, వేడి నీళ్ళనుగాని కలిపి తయారు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొబ్బరిలోని నూనె, వాసన కలిగించే పదార్థాలూ పాల నుండి విడిపోతాయి. కొబ్బరిలో కొవ్వు శాతాన్ని ఆధారం చేసుకుని 17-24శాతం కొవ్వు కలిగిన కొబ్బరి పాలు లభిస్తాయి. కొవ్వు శాతం మనం కలిపే నీళ్ళ వల్ల కూడా మారుతుంటుంది. ఈ పాలను ఫ్రిజ్ లో పెట్టి, కొంతసేపు వదిలేస్తే పై భాగంలో క్రీమ్ లాగా ఏర్పడుతుంది. ఈ స్థితిని నివారించేందుకు వ్యాపారులు తరళీకరణం, స్టెబిలైజేషన్ పద్ధతులను ఉపయోగిస్తుంటారు.

ప్యాక్ చేసిన కొబ్బరి పాలు

ప్యాక్ చేసిన పాలు

కొబ్బరిపాలను తయారుచేసేవారు ఎక్కువగా చిక్కటి, పల్చిటి పాలను కలిపేస్తుంటారు. పాలకు కొన్ని నీళ్ళను కూడా చేర్చి ప్యాక్ చేస్తుంటారు. 

కొబ్బరి క్రీం అవసరమైన వంటల్లో ప్యాక్ చేసిన క్యాన్లో పైన తేలిన క్రీంను కొబ్బరి పాలకు బదులుగా వాడుతుంటారు. వాడే ముందు క్యాన్ ను ఊపడం ద్వారా క్రీం మిగిలిన పాలల్లో కలిసి చిక్కటి పాలు తయారవుతాయి. కొన్ని దేశాల్లో పాల తయారీ సంస్థలు ముందుగానే తరళీకరణాలను కలుపుతుంటారు. దీని వల్ల పాలు కల్తీవి కావనే నమ్మకం కొనుగోలుదారుల్లో కలుగుతుందనేది వారి ఉద్దేశం.

ఒకసారి తెరచి, ఉపయోగించిన కొబ్బరిపాల క్యాన్లను ఫ్రిజ్లో పెట్టాలి.[2] ఇలా ఉపయోగించిన పాలు కొన్ని రోజులు మాత్రమే నిలువ ఉంటాయి. లేకపోతే అవి పుల్లగా మారి పాడయిపోయే అవకాశాలున్నాయి.

వంటలు

వంటల్లో పాల వినియోగం

కొబ్బరి పాలు, బియ్యపుపిండి కలిపి చేసిన పిండితో తయారు చేస్తున్న ఇండోనేషియా వంటకం సెరబి. 
 చల్లార్చిన కొబ్బరిపాలను, పాం చక్కెరను కలిపి తయారు చేసిన ఆకుపచ్చటి పానీయం కెనొడొల్.

తాజా కొబ్బరి పాలు చిక్కాగా, కొంచెం తియ్యటి రుచితో ఉంటాయి. వీటి రుచి కొంచెం ఆవు పాలలా ఉంటుంది. సరిగ్గా తయారుచేస్తే అసలు కొబ్బరి పాలకు కొబ్బరి వాసన ఉండదు. వీటిని పచ్చిగానే తాగేయచ్చు, లేదా కాఫీ, టీలలో మామూలు పాలకు బదులుగా కూడా వాడచ్చు. జంతువుల నుండి వచ్చిన పాల వల్ల అలర్జీ ఉన్నవారు ఆ పాలకు బదులుగా కొబ్బరి పాలనే వాడుతుంటారు. ఈ పాలను పండ్లతో కలిపి పెరుగుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించవచ్చు.

కొబ్బరిపాలు సాధారణంగా చాలా వంటల్లో వాడుతుంటారు. బర్మీస్, కంబోడియన్, ఫిలిప్పినో, ఇండియన్, ఇండోనేషియన్, మలేషియన్, సింగపూరియన్, శ్రీలంకన్, థాయ్, వెయిట్నమీస్, పెరంకన్, దక్షిణ చైనా, బ్రెజీలియన్, కరేబియన్, పోలినేషియన్, పసిఫిక్ ద్వీపాల వంటల్లో ఎక్కువగా వాడే పదార్థం కొబ్బరి పాలు.

కొబ్బరిపాలు కొన్ని కూరల్లో ప్రధాన పదార్థం. ఫ్రిజ్ లో ఉంచిన కొబ్బరిపాలు ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. ఈ పాలు చాలా వంటల్లో మసాలాలను సమతౌల్యం చేయడానికి వాడుతుంటారు. ఇండోనేషియామలేషియాశ్రీలంకథాయ్ కూరల్లో   ఎక్కువగా వాడుతుంటారు. సాస్ తయారుచేసేందుకు కొబ్బరి పాలను పెద్ద మంటపై మరిగించి పాలను క్రీంను, నూనెను విడదీసి, ఆ తరువాత కూరలోకి కావాల్సిని మిగితా దినుసులును, మసాలలను, మాంసం లేదా  కూర లను కలుపుతుంటారు.

దక్షిణ తూర్పు ఆసియా, కరేబియన్ వంటల్లో అన్నంతో కొబ్బరి పాలను కలిపి వండే వంటకం కొబ్బరి అన్నం. ఈ వంట కొబ్బరి పాలతో తయారు చేసే వంటల్లో చాలా ప్రాచుర్యం కలిగినది. నాసి లెమక్ అనేది మలేషియా వంటకం, దీనికి కొబ్బరి అన్నానికి చాలా పోలికలు గమనించవచ్చు. ఇండోనేషియాలో తయారు చేసే కొబ్బరి అన్నాన్ని నాసి లివెట్ అంటారు. సెరబీ అనే పొంగడాల వంటి వంటకంలో కొబ్బరిపాలు, బియ్యపు పిండి ముఖ్యమైన పదార్ధాలు.

బ్రెజిల్ లో కొబ్బరి పాలను ఈశాన్య ప్రాంతపు వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. సాధారణంగా సముద్రపు ఆహారంలోను, స్వీట్లలోను ఉపయోగిస్తారు. బహియా రాష్ట్రంలో ఎక్కువగా కొబ్బరిపాలను, పామాయిల్ ను కలిపి వంటలు చేస్తుంటారు.

కొలంబియాపనామా లలో టిటోట్ అనే వంటకం చాలా ప్రసిద్ధమైనది. ఈవంటలో కొబ్బరి తురుము, కొబ్బరి పాలను, కొబ్బరి నీళ్ళను కలిపి  కొబ్బరి నూనెలో వేయించి, పంచదార కలిపి చేస్తుంటారు. ఈ వంటతో తయారు చేసే కొబ్బరి అన్నం తియ్యగా, గోధుమ రంగులో ఉంటుంది

వెనుజులా లోని జులియా రాష్ట్రంలో వండే మాంసం కూరల్లో కూడా  కొబ్బరి పాలను వాడుతుంటారు. చేపల కూరలో కొబ్బరి పాలను కలిపి వండే వంటకాన్ని మొజిటో ఎన్ కోకో  అంటారు. ప్రముఖ వెనుజులా స్వీట్ మొజిటోలో కూడా ఈ పాలను వాడతారు. ఎర్రోజ్ అనే కొబ్బరి అన్నంలో కూడా ఈ పాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. (ఈ కొబ్బరి అన్నం కరేబియన్ అన్నానికి తేడా ఉంటుంది). In 

పానీయాల్లో

ఈశాన్య ఆసియాలో ప్రముఖమైన శీతల పానీయం కెనొడొల్ లో చల్లారిచిన కొబ్బరిపాలు, ఆకుపచ్చటి జెల్లీ, బియ్యపు పిండి, చిక్కటి పాం చక్కెరతో కలిపి చేస్తారు. ఇండోనేషియా లోని పడమర జావా లో ప్రసిద్ధి చెందిన బన్డ్రెక్, బాజిగర్టి  వంటి వేడి పానీయాల్లోనూ  కొబ్బరిపాలను వాడతారు.

దక్షిణ చైనా లోనూ, థాయ్ వాన్ ప్రదేశాల్లో పల్చటి కొబ్బరిపాలనే పానీయంగా తయారు చేస్తుంటారు. ఈ పానీయాన్ని ఎక్కువగా వేసవికాలంలో తయారుచేసుకుని తాగుతుంటారు. చక్కెర, పాలను, కొబ్బరిపాలలో కలిపి ఈ పానీయాన్ని తయారు చేస్తారు. చైనాలో కొబ్బరిపాలలో నీళ్ళు, పాలు, చక్కెర లేదా కండెన్సుడ్ పాలను కలిపి చల్లటి పానీయాన్ని తయారు చేస్తారు. ఈ పానీయం చైనాలో చాలామందికి ఇష్టమైనది.

బ్రెజిల్ లో కొబ్బరిపాలు, చక్కెర, కేసేస్ అనే మద్య పానీయాన్ని కలిపి    ఒక కాక్ టెయిల్ ను తయారు చేస్తారు. బటిడా డి కోకో గా పిలవబడే ఈ కాక్ టెయిల్ ఆ ప్రాంతంలో చాలా ప్రసిద్ధం.

ప్యుర్టో రికో ప్రాంతంలో స్థానిక పానీయం పిన కోలడా. ఈ పానీయంలో కొబ్బరి పాలను గానీ, కొబ్బరి క్రీం గానీ వాడతారు. క్రిస్మస్ సమయంలో చేసే ప్రత్యేకమైన పానీయం కొక్విటోలో కూడా రమ్ తో పాటు, కొబ్బరి పాలను కూడా కలుపుతారు.

రెన్నెల్, సొలోమన్ ద్వీపాల్లో కొబ్బరిపాలను పులియబెట్టి, ఈస్ట్, ఒక రకమైన రమ్, చక్కెరలను కలిపిన మిశ్రమాన్ని ఒక టిన్నులో పోసి ఒక వారం రోజులపాటు పొదలో దాచి, పానీయాన్ని తయారుచేస్తారు.

ఆరోగ్యంపై ప్రభావం

కొబ్బరిపాలను వేరు చేసేశాకా వచ్చే కొబ్బరి నూనెలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల నూనెను వాడటం ఆమోదయోగ్యం కాదని యునైటెడ్ స్టేట్స్ ఫూడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్[3], వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్,[4] ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ న్యూట్రీషియన్[5], ది యునైటెడ్ స్టేట్స్ డిపార్టమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్విసెస్,[6] అమెరికన్ హార్ట్ అసోసియేషన్[7], బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీసెస్, డైటీషియన్స్ ఆఫ్ కెనడా[8] వంటి సంస్థలు చెబుతున్నాయి.

కొబ్బరి పాలలో అధిక శాతం లారిక్ ఆమ్లం, కొవ్వు ఉంటాయి. ఈ కొవ్వు వల్ల రక్తంలో అధిక సాంధ్రత కలిగిన లిపోప్రొటిన్ కొవ్వు శాతం పెరుగుతుంది[9]. ఇటువంటి మంచి కొవ్వు తల్లిపాల లో, సిబికస్ గ్రంథిలో మాత్రమే దొరుకుతుంది[10].

కొబ్బరిపాలల్లో కొవ్వు ఆమ్లం (ఫ్యాటీ ఆసిడ్) లు ఎక్కువగా ఉండటం వల్ల డైట్ పాటించే వారికి రక్తంలో కొవ్వు నిల్వలు ఉండకుండా కాపాడుతుంది[11].

కొబ్బరి పాలను ఆయుర్వేదంలో ఎంతో ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు, ఆధునిక కాలంలో జఠరాశయంలో, నిర్దిష్ట శరీరభాగాలలో దీనికి రక్తంలో లిపిడ్ల సమతౌల్య గుణాలు, సూక్ష్మక్రిమినాశక ధర్మాలు ఉంటాయని తెలిసింది.[12][13] దీనిని నోటి పూతలను తగ్గించేందుకు సైతం ఉపయోగిస్తారు.[14] ఎలుకలపై చేసిన ఒక పరిశోధనలో, రెండు కొబ్బరి ఆధారిత తయారీలను (కొబ్బరి పాల నుండి తీసిన సహజమైన వెచ్చని నీరు, కొబ్బరి పానీయం విక్షేపం) ఔషధ-ప్రభావిత జఠర వ్రణాలపై రక్షణ ప్రభావాలకై పరిశోధించడం జరిగింది.[15] రెండు పదార్థాలూ వ్రణాల నుండి రక్షణను అందిస్తాయి, ఇందులో కొబ్బరి పానీయం యొక్క 39% ప్రతిగా కొబ్బరి పాలు 54% క్షీణతను కలిగిస్తాయి. అదనంగా, కొబ్బరి పాలలోని సంతృప్త క్రొవ్వుపదార్థం చాలావరకూ లారిక్ ఆమ్లం, ఇది హృదయ సంబంధ వ్యవస్థపై అనుకూల ప్రభావాలు చూపుతుందని తెలిసింది.[16]

కొబ్బరి పంట

1943లో జోన్నెస్ వాన్ ఒవర్ బీక్ కొబ్బరిపాలను వాడుకోవచ్చు అనే విషయాన్ని కనిపెట్టి విదేశీయులకు ఈ పాలను పరిచయం చేయడంతో కొబ్బరి పంటకు డిమాండు పెరిగింది.  ఈ  పంట  ఉత్పత్తి  ముల్లంగి  వంటి ఇతర పంటల ఉత్పత్తి శాతాన్ని అతి తక్కువ సమయంలోనే మించిపోయింది[17]గోధుమలు పెంచే పొలాల్లోనే పక్కన కొబ్బరి మొక్కలను పెంచడం నేర్చుకున్నారు విదేశీయులు.[18]

మధ్యం

రెన్నేల్ ద్వీపం సాల్మన్ ద్వీపాలలో కొబ్బరి పాలు, ఈస్ట్, పంచదారను కలిపి ఒక పాత్రలో ఉంచి, దానిని సుమారు ఒక వారం పాటు పొదలో దాచి, స్థానిక గృహ-మధ్యం తయారు చేస్తారు. ఈ కొబ్బరి రమ్ గురించి ది స్వీట్ యొక్క గీతం పొప్ప జోలో చెప్పబడింది.

బ్రెజిల్‍లో, కొబ్బరి పాలను పంచదార, కచకాతో కలిపి బటిడ దే కోకో అనే కాక్‍టెయిల్ తయారుచేస్తారు.

మొక్కల పెంపకంలో ఉపయోగం

1943లో, కొబ్బరి పాలు మొక్కల పెంపకానికి చురుకుగా దోహదపడతాయని జోహాన్నెస్ వాన్ ఒవర్బీక్ కనుగొన్నాడు. అటుపై ఎన్నో కారణాల వలన ఇది జరుగుతుందని, కానీ ముఖ్య కారణం జియాటిన్ పేరిట పాలలో ఉండే సైటోకైనిన్ అని కనుగొన్నారు. ఇది ముల్లంగి వంటి కొన్ని మొక్కలలో పెరుగుదలను వేగవంతం చేయదు.[19] గోధుమ పండే నేలలో 10% కొబ్బరి పాలు కలపడం ద్వారా దిగుబడి గణనీయంగా పెరుగుతుందని తేలింది.[20]

పానీయాలు

దక్షిణ చైనా, తైవాన్‍లలో, వసంతం, వేసవికాలాలలో తీయని కొబ్బరి పాలు ఒక పానీయంగా వడ్డించడం జరుగుతుంది. కొబ్బరి పాల తయారీ ప్రక్రియలో పంచదార, ఆవిరైన లేదా తాజా పాలు కలపడం ద్వారా ఇది తయారవుతుంది. మరొక చైనీస్ పానీయంలో, నీటితో తయారుచేసి, అటుపై తాజా లేదా ఆవిరైన పాలను 1:1 నిష్పత్తిలో కలిపి, ప్రతి కప్పుకీ ఒక చెంచా ఘనీభవించిన పాలు లేదా పంచదార కలిపి కొబ్బరి పాలు తయారు చేస్తారు. వీటిని చల్లగా ఉన్నప్పుడే వడ్డిస్తారు. దీనిని పచ్చిగానో, లేదా మామూలు నీటితో పలుచగా చేసి కూడా త్రాగవచ్చు.

కొబ్బరి పాలను ఉపయోగించి తయారుచేసే పానీయాలలో ఇవి కూడా ఉంటాయి:

  • పిన్యా కాలడా, దాని మధ్యరహిత రూపం వర్జిన్ పిన్యా కాలడా (కొబ్బరి మీగడ సైతం ఉపయోగించవచ్చు)
  • కాక్విటో కాన్ రాన్

ఇవి కూడా చదవండి

References

బాహ్య లింకులు