తూర్పు తిమోర్

తూర్పు తిమోర్ (/ˌst ˈtmɔːr/) లేక తిమోర్- లెస్టే (/tiˈmɔːr ˈlɛʃt/), టేటం భాష: తిమోర్ లో రోసె అధికారికంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తిమోర్- లెస్తె (పోర్చుగీసు: " రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్తె " టటం: రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్) [1] మేరీటైం ఈశాన్య ఆసియాలో సార్వభౌమాధికారం కలిగిన దేశం.[2] ఇది తిమోర్ ద్వీపం పూర్వార్ధభూభాగంలో (ఈస్ట్ హాఫ్) ఉంది. దీనికి సమీపంలో అటౌరో ద్వీపం, ఒఎక్యూస్, జాకో ద్వీపం ఉన్నాయి. తిమోర్ వైశాల్యం 15,410 చ.కి.మీ.[3] 16వ శతాబ్దంలో పోర్చుగీస్ తైమూరును తమకాలనీగా మార్చింది. 1975 వరకు ఇది రోర్చుగీస్ తిమోర్‌గా ఉంది. తరువాత తూర్పు తిమోర్ రివల్యూషనరీ ఫ్రంట్ తూర్పు తిమోర్‌ను స్వతంత్రభూభాగంగా ప్రకటించింది. తరువాత తొమ్మిది రోజులకు తూర్పు తిమోర్ మీద ఇండోనేషియా దండెత్తి తూర్పు తిమోర్ భూభాగాన్ని ఆక్రమించింది. తరువాత సంవత్సరం తూర్పు తిమోర్ ఇండోనేషన్ 27 వ భూభాగంగా ప్రకటించబడింది.

Repúblika Demokrátika Timór Lorosa'e
República Democrática de Timor-Leste
Democratic Republic of Timor-Leste
Flag of East Timor East Timor యొక్క చిహ్నం
నినాదం
"Unidade, Acção, Progresso"  (Portuguese)
"Unity, Action, Progress"
జాతీయగీతం
Pátria
East Timor యొక్క స్థానం
East Timor యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Dili
8°34′S 125°34′E / 8.567°S 125.567°E / -8.567; 125.567
అధికార భాషలు Tetum, Portuguese1
ప్రభుత్వం Republic
 -  President José Ramos Horta
 -  Prime Minister Taur Matan Ruak
Independence from Portugal² 
 -  Declared November 28 1975 
 -  Recognized May 20 2002 
విస్తీర్ణం
 -  మొత్తం 15,007 కి.మీ² (158th)
5,743 చ.మై 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  July 2005 అంచనా 947,000 (155th)
 -  జన సాంద్రత 64 /కి.మీ² (132nd)
166 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $1.68 billion (206)
 -  తలసరి $800 (188)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) 0.513 (medium) (142nd)
కరెన్సీ U.S. Dollar³ (USD)
కాలాంశం (UTC+9)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .tl4
కాలింగ్ కోడ్ +670
1 Indonesian and English are recognised by the Constitution as "working languages".
2 Indonesia invaded East Timor on December 7, 1975 and left in 1999.
3 Centavo coins also used.
4 .tp is being phased out.

1999లో ఇండోనేషియా తూర్పు తిమోర్ మీద ఆధిపత్యం నుండి విరమించింది. తూర్పు తిమోర్ 21వ శతాబ్ధపు స్వార్వభౌమాధికారం కలిగిన మొదటి 100 దేశల జాబితాలో ఉంది. 2002 మే 20 నుండి తూర్పు తిమోర్ ఐక్యరాజ్యసమితి దేశాలలో చేర్చబడింది. అలాగే " పోర్చుగీసు భాషా సమూహ దేశాలు "లో తూర్పు తైమూరు కూడా చేర్చబడింది. 2011లో తూర్పు తిమోర్ " ఆగ్నేయాసియా దేశాల అసోసియేషన్ "లో 11వ సభ్యదేశంగా చేరడానికి అభ్యర్ధించింది.[4] ఆగ్నేయాసియా దేశాలలోని క్రైస్తవమత ప్రధాన రెండుదేశాలలో తూర్పు తిమోర్ ఒకటి. రెండవ దేశం ఫిలిప్పీన్స్.

పేరువెనుక చరిత్ర

"Timor of the rising sun"
Sunrise on Mount Tatamailau

తిమోర్ అనే పదానికి మూలం తిమూర్. ఇది పోర్చుగీసు దేశంలో భాగంగా ఉంది కనుక ఇది పోర్చుగీసు తిమోర్ అయింది. పోర్చుగీసులో లెస్తె అంటే తూర్పు అని అర్ధం. అందుకని ఇది తూర్పు తిమోర్ అని పిలువబడింది. తిమోర్ లో రొసా అనేపేరులోలో రొసె అంటే లిత్ భాషలో ఉదయించే సూర్యుడు అని అర్ధం.[5][6] [7] యునైటెడ్ కింగ్డం, జర్మనీ, స్వీడన్ దేశాలతో తూర్పు తైమూరుకు దౌత్యసంబంధాలు ఉన్నాయి. [8]

చరిత్ర

తూర్పు తైమూరులో మూడు అలలుగా వచ్చిచేరిన వలస ప్రజలు ఇప్పటికీ నివసిస్తున్నారు. మానవశాస్త్రకారులు ఆస్ట్రేలియా స్థానిక ప్రజలు (వెడ్డో ప్రజలు)42,000 వేల సంవత్సరాల మునుపు ఇక్కడకు మొదటిసారిగా ప్రవేశించారని భావిస్తున్నారు. తరువాత 40,000 సంవత్సరాల మునుపు న్యూగునియా, ఆస్ట్రేలియా నుండి వచ్చిన ప్రజలు తూర్పు తైమూరు భూభాగానికి వచ్చిచేరారు. క్రీ.పూ. 3,000 సంవత్సరాలలో మలెనేషియన్ల ప్రవేశంతో రెండవ అల వలసలు ఆరంభం అయ్యాయి. ఆరంభకాల వెడ్డో ఆస్ట్రేలియా ప్రజలు ఈ ప్రాంతం వదిలి పర్వతప్రాంతాలకు చేరుకున్నారు. చివరిగా ప్రొటో- మలేయా ప్రజలు దక్షిణ చైనా, ఉత్తర ఇండోచైనా ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. [9] చివరి సారిగా వచ్చిన వారిలో హక్కా వ్యాపారులు కూడా ఉన్నారు.[10] తిమోరెసె స్థానికులు పూర్వీకులు తూర్పు సముద్రంగుండా పయనించి తిమోర్ దక్షిణప్రాంతానికి చేరుకున్న విషయాల గురించిన పురాణ కథనాలు చెప్తుంటారు. కొన్నికథనాల ఆధారంగా తిమోర్ పూర్వీకులు మలయా ద్వీపకల్పం లేక మినాంగ్ కబౌ పర్వతప్రాంతాలు లేక సుమత్రా దీవుల నుండి ఇక్కడకు వచ్చిచేరారని [11] ఆస్ట్రోనేషియన్లు తైమూరుకు వలసవచ్చారు. వీరు ఈ భూమి మీద వ్యవసాయం అభివృద్ధి చేసారని విశ్వసిస్తున్నారు.[ఆధారం చూపాలి] పురాతన మలయా ప్రజలు దక్షిణ చైనా, ఉత్తర ఇండోనేషియా నుండి ఇక్కడకు వచ్చారు. [12]

యురేపియన్ ఆక్రమణకు ముందు

యురేపియన్ ఆక్రమణకు ముందు తిమోర్‌ చైనా, భారతదేశం వ్యాపార మార్గంలో భాగంగా ఉండేది. 14వ శతాబ్దంలో చందనం, బానిసలు, హనీ, మైనం ఎగుమతిచేయబడుతూ ఉండేది. తైమూరులో విస్తారంగా చందనం ఉండడం 16 వ శతాబ్దంలో యురేపియన్ అణ్వేషకులను విశేషంగా ఆకర్షించింది.[13] యురేపియన్లు ఇక్కడకు వచ్చిచేరిన సమయంలో ఇక్కడ పలు చిన్న సంస్థానాలు, రాజ్యాలు ఉన్నాయని యురేపియన్ నివేదికలు తెలియజేస్తున్నాయి..[ఆధారం చూపాలి]

Portuguese Timor Arms (1935–1975) [14]

పోర్చుగీసు ప్రజలు తిమోర్, మలుకు ద్వీపాలలో స్థావరాలను ఏర్పాటుచేసారు. 1769లో తిమోర్ లోని ఒక చిన్న భూభాగంలో బలీయమైన యురేపియన్ ఆక్రమణ ఆరంభం అయింది. తరువాత దిలి నగరం స్థాపించబడి అలాగే పోర్చుగీసు తిమోర్ ప్రకటించబడింది.[15] 1914లో " పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేటరీ " ఆదేశంతో ద్వీపంలోని పశ్చిమభూభాగంలో ఉన్న డచ్ కాలనీ, పోర్చుగీస్ కాలనీ మద్య రక్షణ సరిహద్దు ఏర్పాటు చేయబడింది.[16] తరువాత ఏర్పడిన ఇండోనేషియా, తూర్పు తిమోర్ దేశాలమద్య ఇదే అంతర్జాతీయ సరిహద్దుగా మారింది. తరువాత 19 వ శతాబ్ధపు చివరి వరకు తూర్పు తిమోర్ నిర్లక్ష్యం చేయబడిన వ్యాపార స్థావరంగా మాత్రం నిలిచింది. మౌలికవసతులు, ఆరోగ్యసంరక్షణ, విద్యాసౌకర్యాల కొరకు పరిమితంగా మాత్రమే వ్యయం చేయబడింది. 19 వ శతాబ్దంలో ఈప్రాంతం నుండి ప్రధానంగా చదనం, కాఫీ ఎగుమతులు గణనీయంగా చేయబడ్డాయి. ఈప్రాంతంలో పోర్చుగీసు పాలనలో ప్రజాసౌకర్యాల నిర్లక్ష్యం, దోపిడీ అధికంగా జరిగింది.[17] 20 వ శతాబ్ధపు చివరిల దేశీయ ఆర్థికస్థితి బలహీనపడడం కారణంగా పోర్చుగీస్ కాలనీలద్వారా సంపదను చేర్చడాన్ని తూర్పు తిమోర్ వ్యతిరేకించుంది. [17]

రెండవప్రపంచ యుద్ధం

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపానీయులు ఆక్రమించిన దిలి, పర్వతమయమైన లోతట్టు ప్రాంతాలు గొరిల్లా యుద్ధభూమిగా (1942-43 తిమోర్ యుద్ధం) మారాయి. మిత్రదేశాలు, తూర్పు తిమోర్ స్వయంసేవక బృందాలు జపాన్‌ను ఎదిరించాయి. సంఘర్షణలలో 40,000 - 70,000 మంది తైమూరు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.[18] చివరికి జపానీయులు ఆస్ట్రేలియా, మిత్రదేశాల సైన్యాలను తరిమివేసారు. అయినప్పటికీ రెండవప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి జపానీయులు లొంగిపోయారు. పోర్చుగీసు ఈప్రాంతం తిరిగి ఆధిపత్యం సాధించింది. 1974 పోర్చుగీసు విప్లవం తరువాత పోర్చుగీసు తైమూరు పాలనను వదిలివేసింది. 1975లో రాజకీయ పార్టీల మద్య అంతర్యుద్ధం తలెత్తింది. [19] తైమూరు స్వతంత్రం ప్రకటించిన తరువాత ఇండోనేషన్ ద్వీపసహూహం మద్య కమ్యూనిస్ట్ దేశం బలపడుతున్న ఆందోళనతో పశ్చిమదేశాల మద్దతుతో ఇండోనేషియా 1975 డిసెంబరులో తిమోర్ మీద దాడిచేసింది.[20] యు.ఎన్. సెక్యూరిటీ కౌంసిల్ దాడిని వ్యతిరేకించింది.[21]

A demonstration for independence from Indonesia held in Australia during September 1999

ఇండోనేషియా దాడి

ఇండోనేషియన్ దాడి హింస, క్రూరత్వానికి గుర్తుగా నిలిచింది. దాడి గురించిన పూర్తివివరాల సేకరణ ఫలితాలు 1974-1999 మద్యకాలంలో యుద్ధసంబంధంగా 1,02,800 మంది మరణించారని తెలియజేసాయి. వీటిలో 18,000 మంది యుద్ధకారణంగా మరణించగా 84,200 మంది ఆకలి, అనారోగ్యం కారణంగా మరణించారు. [22] 1975-1999 మద్య తూర్పు తిమోర్ గొరిల్లా సేన ఇండోనేషియాతో పోరాటం సాగించింది.[ఆధారం చూపాలి] దాడిని యునైటెడ్ స్టేట్స్ సమర్ధించింది. [23][24][25]

స్వతంత్రం

José Ramos-Horta, 1996 Nobel Peace Prize winner, second President of East Timor

1991 దిలి మూకుమ్మడి హత్యల తరువాత తైమూరు స్వతంత్రం, తూర్పు తిమోర్ విడుదల ఉద్యమస్ఫూర్తి పోర్చుగీసు, ఆస్ట్రేలియా, పశ్చిమదేశాలలో అభివృద్ధిచెందింది. ఇండోనేషియన్ అధ్యక్షుడు సుహార్తో రాజానామా తరువాత. 1999 ఆగస్టులో పోర్చుగీస్, ఇండోనేషియా అనుమతితో ఐక్యరాజ్యసమితి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టింది. తరువాత తూర్పు తిమోర్‌లో పరిస్థితి చక్కదిద్దడానికి ఇండోనేషియన్ అనుమతితో ఆస్ట్రేలియన్ శాంతిదళం నియమించబడింది. తరువాత 1999 లో తూర్పు తిమోర్‌లో శాంతిదళాలు తొలగించబడ్డాయి.[26] 2000 నాటికి తూర్పు తిమోర్‌లో ఇంటరెఫెక్ట్ తొలగించబడి తూర్పు తైమర్ నిర్వహణ యు.ఎన్ చేపట్టింది.[27] 2002 నాటికి 2,05,000 శరణార్ధులు తిరిగి తూర్పు తిమోర్‌కు చేరుకున్నారు. [28] 2002 మే 20న తూర్పు తిమోర్ స్వతంత్రం నిర్ధారణ చేస్తూ క్సనానా గుస్మావ్ తూర్పు తిమోర్ మొదటి అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు. 2002లో తూర్పు తిమోర్ ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందింది. [29] అధ్యక్షుడు గుస్మోవ్ అధ్యక్ష ఎన్నికలను వ్యతిరేకించిన కారణంగా 2007 అధ్యక్ష ఎన్నికలలో హింసాత్మకచర్యలు చోటుచేసుకున్నాయి. ఎన్నికలలో " జోస్ రామోస్ - హొర్టా " అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు.[30]రామోస్ - హొర్టో మీద జరిగిన కాల్పుల వలన రామోస్ - హొర్టో తీవ్రంగా గాయపడ్డాడు. గుస్మావొ మీద జరిగిన కాల్పులలో ఆయన గాయపడకుండా తప్పించుకున్నాడు. పరిస్థితి చక్కదిద్దడానికి ఆస్ట్రేలియన్ దళాలు పంపబడ్డాయి.[31] 2006 లో పరిస్థితి అదుపుచేయడానికి యునైటెడ్ నేషంస్ యు.ఎన్. సెక్యూరిటీ ఫోర్స్ పంపబడింది. 2011 మార్చి యు.ఎన్. పోలీస్ ఫోర్స్ మీద ఆధిపత్యం రద్దుచేయబడింది. 2012 డిసెంబర్ 31న యునైటెడ్ నేషంస్ పీస్ కీపింగ్ మిషన్ ముగింపుకు వచ్చింది.[32]

Administrative divisions

Administrative divisions of East Timor

తూర్పు తిమోర్ 14 ముంసిపాలిటీలుగా విభజించబడింది. ఇవి అదనంగా 66 ఉప జిల్లాలు, 452 గ్రామాలు, 2,233 కుగ్రామాలుగా విభజించబడ్డాయి. [33][34]

Foreign relations and military

2007లో తూర్పు తిమోర్ " అసోసియేషన్ ఆఫ్ సౌతీస్ట్ ఆసియన్ నేషంస్ " సభ్యత్వం కోరుతూ 2011 మార్చ్‌లో అధికారికంగా అభ్యర్ధనపత్రం సమర్పించింది. [35] ఇందుకు తూర్పు తిమోర్ అభ్యర్ధనకు ఇండోనేషియా మద్దతు ఇచ్చింది.

F-FDTL soldiers standing in formation

" ది తిమోర్ లెస్తె డిఫెంస్ ఫోర్స్ " తూర్పు తిమోర్ రక్షణబాధ్యత వహిస్తుంది. 2001 ఎఫ్.ఎఫ్.డి.టి.ఎల్. స్థాపించబడింది. ఇందులో చిన్న నౌకా దళం, పలు సపోర్టింగ్ యూనిట్లు ఉన్నాయి. ఎఫ్.ఎఫ్.డి.టి.ఎల్. తూర్పు తిమోర్‌ను వెలుపలి దాడుల నుండి రక్షించే బాధ్యత వహిస్తుంది. తూర్పు తిమోర్ అంతర్గత రక్షణకు " నేషనల్ పోలీస్ ఆఫ్ ఈస్ట్ తిమోర్ " బాధ్యత వహిస్తుంది. ఎఫ్.ఎఫ్.డి.టి.ఎల్. విధులలో అవకతవకల కారణంగా అది తొలగించబడింది. విదేశీ సహకారంతో దీర్ఘకాల అభివృద్ధిలో భాగంగా ఎఫ్.ఎఫ్.డి.టి.ఎల్. పునర్నించబడింది.

భౌగోళికం

Com Beach, East Timor

తూర్పు తిమోర్ ఆగ్నేయాసియాలో ఉంది.[36] తిమోర్ ద్వీపంలో " ఆగ్నేయాసియా సముద్రప్రాంతం"లో భాగంగా ఉంది.తూర్పు తిమోర్ లెస్సర్ సుండా ద్వీపాలలో అతి పెద్ద ద్వీపంలో తూర్పు చివరన ఉంది. తిమోర్ సముద్రం ఈ ద్వీపాన్ని ఆస్ట్రేలియా ఖండం నుండి విడదీస్తూ ఉంది. పశ్చిమంలో ఇండోనేషియాకు చెందిన " ఈస్ట్ నుసా టెంగరా " భూభాగం ఉంది. దేశంలో అత్యధికభాగం పర్వతమయంగా ఉంటుంది. 2,963 మీ ఎత్తైన తాతమేలో (రమెలౌ) శిఖరం అత్యంత ఎత్తైన దేశంలో భూభాగంగా గుర్తించబడుతుంది. ఉష్ణమండల వాతావరణం కలిగిన తూర్పు తిమోర్‌లో వేసవి కాలం వేడిగా, తేమతో ఉంటుంది. దేశం వాతావరణం వర్షాకాలం, పొడి వాతావరణంగా వర్ణించబడుతుంది. పెద్ద నగరం, రాజధాని నగరం దిలి. రెండవ పెద్ద నగరం తూర్పున ఉన్న బైకౌ. తూర్పు తిమోర్ 124° డిగ్రీల ఉత్తర అక్షాంశం, 128° తూర్పు రేఖంశంలో ఉంది.

Mountains in Aileu

తూర్పు తిమోర్ తూర్పుతీరంలో పైచౌ పర్వతశ్రేణి ఇరాలలారొ సరసు ఉన్నాయి. ఇక్కడ దేశంలోని మొదటి సంరక్షితప్రాంతం " నినోకోనిస్ సంతనా నేషనల్ పార్క్ " ఉంది. [37] ఇక్కడ అంతరించిపోతున్న " ట్రాపికల్ డ్రై " అరణ్యం ఉంది. ఇందులో పలు అరుదైన జాతిల మొక్కలు, జతువులు ఉన్నాయి.[38] ఉత్తర సముద్రతీరంలో అనేక పగడపు దిబ్బలు ఉన్నాయి.[39]

ఆర్ధికం

East Timor Export Treemap, 2010
A filial of the Portuguese bank Caixa Geral de Depósitos, in Dili
Commerce in Baucau
Fractional coins "Centavos"

తూర్పు తిమోర్ ఆర్థికరగం వస్తువుల ఎగుమతి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడి నుండి కాఫీ, మార్బుల్, నూనె, చందనం ఎగుమతి చేయబడుతున్నాయి.[40]2011లో తూర్పు తిమోర్ ఆర్థికం 10% అభివృద్ధి చెందింది. 2012లో అది కొనసాగింది.[41] తిమోర్‌కు ప్రస్తుతం చమురు, సహజవాయువు ఉత్పత్తి వలన ఆదాయం లభిస్తుంది.అంతేకాక స్వల్పంగా అభివృద్ధిచేయబడిన గ్రామాలలో చేపట్టిన తోటల పెంపకం వలన మరి కొంత ఆదాయం లభిస్తుంది..[42] Nearly half the population lives in extreme poverty.[42]2005లో " తిమోర్ - లెస్తె పెట్రోలియం ఫండ్ " స్థాపించబడింది. దీని విలువ 7 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది.[43]తూర్పు తిమోర్‌ను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " ప్రపంచంలో అత్యధికంగా చమురు మీద ఆధారపడిన ఆర్ధికరంగం కలిగిన దేశం "గా వర్గీకరించింది. [44] పెట్రోలియం ఫండ్ నుండి దాదాపు ప్రభుత్వ బడ్జెట్‌కు అవసరమైన నిధులు సమకూర్చబడుతున్నాయి. 2004 బడ్జెట్ 70 మిలియన్ల అమెరికన్ డాలర్లు, 2011 బడ్జెట్ 1.3 బిలియన్ల అమెరికన్ డాలర్లు, 2012 బడెజెట్ 1.8 బిలియన్ల అమెరికన్ డాలర్.[43][45] పెట్టుబడుల లోపం, మౌలిక వసతుల లోపం, అసంపూర్తిగా ఉన్న చట్టాలు క్రమబద్ధీకరణ చేయబడని పర్యావరణం కారణంగా ప్రైవేట్ రగం వెనుకబడి ఉంది.[45] పెట్రోలు తరువాత అత్యధికంగా కాఫీ ఎగుమతిచేయబడుతుంది. కాఫీ నుండి 10 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం లభిస్తుంది. .[45] తూర్పు తిమోర్ కాఫీ గింజలను కొనుగోలు చేసే సంస్థలలో స్టార్‌బక్స్ కపెనీ ప్రధానమైనది.[46]

Dili's Harbour

2012 లో తూర్పు తిమోర్‌లో 9,000 టన్నుల కాఫీ గింజలు, 108 టన్నుల దాల్చిన చెక్క, 161 టన్నుల కొకొయా పండించబడింది. తూర్పు తిమోర్ కాఫీ గింజల ఉత్పత్తిలో 40 వ స్థానంలో, దాల్చిన చెక్క ఉత్పత్తిలో 6 వ స్థానంలో, కొకొయా ఉత్పత్తిలో 5 వ స్థానంలోనూ ఉంది.[47]2010 డేటా అనుసరించి 87.7% గృహాలకు (321,043) నగరప్రాంత ప్రజలు, 18,9% గ్రామప్రాంత గృహాలకు (821,459) మొత్తంగా 38.2% గృహాలకు విద్యుత్తు సౌకర్యం ఉన్నదని భావిస్తున్నారు.[48]

వ్యవసాయ రంగం

వ్యవసాయ రంగం 80% ఉపాధిసౌకర్యం కలిగిస్తుంది.[49]2009 గణాంకాలను అనుసరించి 67,000 కుటుంబాలు కాఫీని పండిస్తున్నారని భావిస్తున్నారు. ప్రజలలో అత్యధికులు పేదరికంలో జీవిస్తున్నారు.[49] ప్రస్తుతం సరాసరి హెక్టార్‌కు 120 అమెరికన్ డాలర్ల ఆదాయం లభిస్తుంది.[49] 2009 గణాంకాలను అనుసరించి 11,000 కుటుంబాలు పెసలు పండించబడుతున్నాయి. వీరిలో అత్యధికులు వ్యవసాయం జీవనాధారంగా ఎంచుకున్నారు.[49]

వ్యాపారం

ప్రపంచ బ్యాంకు 2013 నివేదికల ఆధారంగా తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో వ్యాపారానుకూల దేశాల జాబితాలో తూర్పు తిమోర్ 169 వ స్థానంలో, చివరి స్థానంలో ఉందని భావిస్తున్నారు.[50]

టెలీకమ్యూనికేషంస్

" వరల్డ్ ఎకనమిక్స్ ఫోరంస్ నెట్వర్క్ ఇండెక్స్ " జాబితా ఆధారంగా తిమోర్ లెస్తె టెలికమ్యూనికేషన్ ఇంఫ్రాస్ట్రక్చర్ సౌకర్యంలో ఆసియా దేశాలలో చివరి ర్యాంకులో ఉందని తెలియజేస్తుంది. [51] పోర్చుగీస్ కాలనీ నిర్వహణ " ఓషనిక్ ఎక్స్ప్లొరేషన్ కార్పొరేషన్ "కు ఆగ్నేయ తిమోర్ సముద్రతీరంలో ఆయిల్, గ్యాస్ అనేషణకు అనుకూల పరిస్థితి కల్పించింది. 1976 లో ఇండోనేషన్ దాడి కారణంగా [ఆధారం చూపాలి] 1989 నుండి " తిమోర్ గ్యాప్ ట్రీటీ " తరువాత వనరులను ఇండోనేషియా, ఆస్ట్రేలియాలు ప, చుకున్నాయి.[52]

సముద్రసరిహద్దు

తూర్పు తిమోర్‌కు స్వాత్రం లభించిన తరువాత కూడా శాశ్వతమైన సముద్రసరిహద్దులు నిర్ణయించబడలేదు. [ఆధారం చూపాలి] 2002 మే 20 న తూర్పు తిమోర్‌కు సంపూర్ణ స్వతంత్రం లభించిన తరువాత జరిగిన ఒప్పందంలో ఆస్ట్రేలియా, తూర్పుతిమోర్ దేశాలు పెట్రోలియం డెవెలెప్మెంటు ఏరియా ఉండాలని ఆదాయంలో 90% తూర్పు తిమోర్ దేశానికి చెందాలని మిగిలిన 10% ఆస్ట్రేలియాకు చెందాలని ప్రతిపాదించబడింది.[53] 2005 ఒప్పందం ఆధారంగా తూర్పు తిమోర్, ఆస్ట్రేలియా సముద్రసరిహద్దుల విషయంలో రెండూ వారి వివాదాలను దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నాయి.[54][55][56] తూర్పు తిమోర్‌లో పేటెంట్ లా రూపొందించబడలేదు.[57]

గణాంకాలు

An East Timorese in traditional dress
Historical populations
సంవత్సరంజనాభా±%
1980 5,55,350—    
1990 7,47,557+34.6%
2001 7,87,340+5.3%
2004 9,23,198+17.3%
2010 10,66,582+15.5%
2015 11,67,242+9.4%
Source: 2015 census[58]

తూర్పు తిమోర్ జనసంఖ్య 1,167,242.[2] జనసంఖ్య అధికంగా దిలి పరిసరాలలో కేంద్రీకృతమై ఉంది. [ఆధారం చూపాలి]మౌబెరె అనే పదం [59] పోర్చుగీసు వారు సాధారణంగా తూర్పు తైమూరు ప్రజలను సూచించడానికి అలాగే నిరక్షరాశ్యులను, చదువురాని వారిని సూచించడానికి కూడా ఈ పదం వాడుతుంటారు. ఇదే పదం " రెవల్యూషనరీ ఫ్రంట్ ఫర్ ఏన్ ఇండిపెండెంట్ ఈస్ట్ తిమోర్ " కూడా సగర్వంగా వాడుకుంటుంది.[60] వీరిని ప్రత్యేక సంప్రదాయ ప్రజలుగా భావించబడుతుంటారు. వీరిలో ఆస్ట్రోనేషియన్ (మలాయో- పాలినేషియన్), మెలనేషియన్ (పాపుయాన్) సంతతికి చెందిన ప్రజలు మిశ్రితమై ఉన్నారు. [ఆధారం చూపాలి] మాలాయో - పాలినేషియన్ సంప్రదాయ సమూహాలలో టేటం అతి పెద్ద సమూహంగా భావిస్తున్నారు.[61] ఉత్తర సముద్రతీరం, దిలిలో 1,00,000, మద్యపర్వత ప్రాంతంలో మాంబై ప్రజలు 80,000, మౌబరా, ల్క్విక ప్రాంతాలలో టుకుడెడే ప్రజలు 63,170, మాంబే, మకసయే తెగల మద్య ఉన్న గలో లీ పేజలు 50,000, ఉత్తర - మద్య తిమోర్ ద్వీపంలో ఉన్న కెమాక్ ప్రజలు 50,000, పంతె మకాసర్ పరిసర ప్రాంతాలలో ఉన్న బైకెనొ ప్రజలు 20,000 ఉన్నారు. [ఆధారం చూపాలి] తిమోర్ ద్వీపంలోని మద్యభాగంలో బునాక్ ప్రజలతో చేర్చి పాపౌన్ సంతతికి చెందిన ప్రజలు 50,000, తిమోర్ ద్వీపం తూర్పు భాగం, ద్వీపం తూర్పు సరిహద్దులో ఉన్న మకసయే ప్రాంతాలలోని లాస్పలోస్ ప్రాంతంలో ఫతాలుకూ ప్రజలు 30,000, [ఆధారం చూపాలి] పోర్చుగీసు శకంలో జాతులమద్య వివాహాలు సాధారణం అయ్యాయి. తిమోర్, పోర్చుగీసు సంతతికి పుట్టిన వారిని పోర్చుగీసు వారు " మెస్టికో " అని పిలిచారు. ద్వీపంలో స్వల్పసంఖ్యలో విదేశాలకు చెందిన చైనీయులు (వీరిలో అత్యధికులు హక్కా ప్రజలు అనేవారు) ఉన్నారు. 1970 మద్యకాలంలో చైనీయులు అనేకమంది ద్వీపం వదిలి వెళ్ళారు.[62]

భాషలు

Major language groups in East Timor by suco

పోర్చుగీస్, టైటం భాషలు తూర్పు తిమోర్ అధికారభాషలుగా ఉన్నాయి. ఇంగ్లీష్, బహసా ఇండోనేషియా వర్కింగ్ భాషలుగా రూపొందాయి. [63] టేటం అస్ట్రోనేషియన్ భాషా కుంటుంబానికి చెందిన భాషలలో ఒకటి. ఇది ఆగ్నేయ ఆసియా అంతటా వాడుకలో ఉంది.[64]2010 గణాంకాలు ఆధారంగా అధికంగా వాడుకలో ఉన్న మాతృభాషలలో ప్రధానమైనది టైటం 36.6% ప్రజలకు మాతృభాషగా ఉంది, మంబై భాష 12.5%, మకసై 9.7%, టేటటం తెరిక్ 6%, బైకెను 5.9%, కెమక్ భాష 5.9%, బెనుక్ భాష 5.3%, టొకొడెడె 3.7%, ఫతలుకు భాష 3.6% మాతృభాషలుగా ఉన్నాయి. ఇతర భాషలు 10.9% ప్రజలకు వాడుక భాషగా ఉంది. పోర్చుగీసు భాష మాట్లాడే ప్రజలు 600 మంది ఉన్నారు.[65] ఇండోనేషియన్ పాలనలో పోర్చుగీసు భాషా వాడుక నిషేధించబడింది. అంతేకాక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ వాణిజ్యంలో ఇండోనేషన్ భాష అధికారభాషగా చేయబడింది.[66] ఇండోనేషన్ ఆక్రమణ సమయంలో టేటం, పోర్చుగీస్ భాషలు తూర్పు తిమోర్ ప్రజలను జవానీస్ సంస్కృతికి వ్యతిరేకంగా సమఖ్యం చేయడానికి ప్రధానమైయ్యాయి.[67] 2002 లో స్వతంత్రం వచ్చున తరువాత పోర్చుగీస్ భాష తిరిగి అధికార భాష చేయబడింది. పోర్చుగీసు భాష ప్రస్తుతం నేర్పించడానికి బ్రెజిల్, పోర్చుగీస్, పోర్చుగీసు భాషలు వాడుకలో ఉన్న సమూహాలు సహకరిస్తున్నాయి.[68] ఇండోనేషియన్, ఇంగ్లీష్ వర్కింగ్ భాషలుగా ఉన్నాయి. టేటం, ఎత్నొలగ్యూ జాబితాలో అడాబె, బైకెనొ, బునక్, ఫతలుకు, గలోలి, హబున్, ఇదాటె, కౌరుయి - మిదిక్, కెమక్, లకలే, మకసయె, మకువా, మబయె, నౌయెటె, తుకుడెడె, వైమా భాషలు స్థానికభాషలుగా చేర్చబడ్డాయి.[69] ఇంగ్లీష్ భాషను 31.4% ప్రజలు అర్ధం చేసుకోగలరని అంచనా వేయబడింది. 2015 గణాంకాలను అనుసరించి పోర్చుగీసు భాషను 36% ప్రజలు మాట్లాడడం, చదవడం, వ్రాయడం చేయగలరని తెలిసింది.[63][70]తూర్పు తిమోర్ " పోర్చుగీస్ భాషా కమ్యూనిటీ ", లాటిన్ యూనియన్‌లో సభ్యత్వం కలిగి ఉంది.[71] అంతరించి పోతున్న పపంచ భాషల అట్లాస్‌ ఆధారంగా అంతరించిపోతున్న దశలో ఉన్న ఆరు భాషలు (అడాబె, హబు, కైరుయి - మిడికి, నౌయేటి, వైమా) తూర్పు తైమూరులో వాడుకలో ఉన్నాయని తెలుస్తుంది.[72]

విద్య

Escola Portuguesa Ruy Cinatti, the Portuguese School of Díli.

2010 గణాంకాల ఆధారంగా తూర్పు తిమోర్ వయోజన అక్షరాశ్యత 58.3% (2001 అక్షరాశ్యత 37.6%).[73] పోర్చుగీసు పాలన ముగింపుకు వచ్చిన సమయంలో అక్షరాశ్యత 95% ఉంది.[74]" ది యూనివర్శిడాడే నసియోనల్ డీ తిమోర్ - లెస్తె (నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ తిమోర్) దేశంలో ప్రధాన యూనివర్శిటీగా గుర్తించబడుతుంది. దేశంలో 4 కాలేజీలు ఉన్నాయి.[75] స్వతంత్రం తరువాత ఇండోనేషియన్, టేటం భాషలు మాధ్యమ భాషల అంతస్తు కోల్పోయాయి. పోర్చుగీసు భాష అభివృద్ధి చేయబడింది. 2001 నుండి 8.4% ప్రాథమిక విద్యార్థులు, 6.8% మాధ్యమిక విద్యార్థులు పోర్చుగీసు మాధ్యమపాఠశాలలకు హాజరు అయ్యారు. 2005 నాటికి ఇది 8.6%, 46.3% అభివృద్ధి చెందింది. [76] ఇండోనేషియా భాష విద్యారగంలో గణనీయమైన పాత్ర వహించింది. ఒకప్పుడు 73.7% ఇండోనేషియన్ భాషామాధ్య విద్యార్థులు ఉన్నారు. 2005 నాటికి ఇండోనేషన్ మాధ్యమ పాఠశాలలు రాజధాని నగరం దిలి, బకౌ, మనాతుతో జిల్లాల వరకు పరిమితమయ్యాయి.[76]

ఆరోగ్యం

2007 గణాంకాలను అనుసరించి తూర్పు తిమోర్ ప్రజల సరాసరి ఆయుఃప్రమాణం 60.7 సంవత్సరాలు.[77] ఫర్టిలిటీ రేట్ 6.[77] 2007 గణాంకాలను అనుసరించి ఆరోగ్యవంతమైన జీవితప్రమాణం 55 సంవత్సరాలు.[77] 2006 గణాంకాలను అనుసరించి ప్రభుత్వం ఒక్కొక వ్యక్తి ఆరోగ్యం కొరకు చేస్తున్న వ్యయం వార్షికంగా 150 అమెరికన్ డాలర్లు. [77] 1974 గణాంకాలను అనుసరించి దేశంలో రెండు ఆసుపత్రులు 14 గ్రామీణ ఆరోగ్యసంరక్షణా కేంద్రాలు ఉన్నాయి. 1994 గణాంకాలను అనుసరించి 11 ఆసుపతత్రులు 330 ఆరోగ్యసంరక్షణా కేంద్రాలు ఉన్నాయి.[75] 2010 గణాంకాలను అనుసరించి తూర్పు తిమోర్‌లో 1,00,000 కాన్పులలో 370 తల్లులు మరణానికి గురౌతున్నారని భావిస్తున్నారు. 2008 లో ఇది 928.6, 1990 లో 1016.3 ఉండేది. శిశిమరణాలు 1000 మందికి 27.[78] మిడ్వైవ్స్ 1000 కాన్పులకు 8 మంది ఉన్నారు. [79] తూర్పు తిమోర్ పొగత్రాగే శాతం 33%. ఇది ప్రపంచంలో అత్యధికం. పురుషులలో 61% మందికి పొగత్రాగే అలవాటు ఉండేది.[80]2003 నుండి తూర్పు తైమూరులో క్యూబన్ తిమోర్ ట్రైనింగ్ ప్రోగ్రాం " ప్రారంభించబడింది. సరాసరి డాక్టర్ల సంఖ్యలో తూర్పు తిమోర్‌లో ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంది. [81]

మతం

The Church of Sãం António de Motael, Dili

2010 గణాంకాలను అనుసరించి 99.9% ప్రజలు కాథలిక్కులను, 2.2% ప్రజలు ప్రొటెస్టెంటిజం లేక ఎవెంజెకలిజం, 0.3% ప్రజలు ఇస్లాం, 0.5% ఇతరమతస్థులు ఉన్నారు.[82]1974 లో 100 గా ఉన్న చర్చీల సంఖ్య 1994 లో 800 లకు చేరుకున్నాయి.[75] ఇండోనేషియన్ పాలనలో చర్చి సభ్యత్వం అభివృద్ధి చెందింది. ఇండోనేషియన్ రాజ్యాంగ భావజాలం ఒకేమతవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇండోనేషియన్ ప్రభుత్వం స్థానిక సంప్రదాయాలను గుర్తించలేదు. గ్రామీణప్రాంతాలలో కాథలిజంతో ప్రాంతీయ సంప్రదాయాలు ఆచరణలో ఉన్నాయి.[83] తూర్పు తిమోర్ రాజ్యాంగం మతస్వాతంత్ర్యానికి అనుమతి ఇస్తుంది. అలాగే చర్చి బాధ్యతలు, రాజ్యాంగ బాధ్యతలు ప్రత్యేకించబడ్డాయి.[84] స్వతంత్రం లభించిన తరువాత దేశం మతపరంగా ఫిలిప్పీన్స్తో చేర్చబడింది. ఆసియాలో క్రైస్తవమతం ప్రధానంగా ఉన్న దేశాలలో ఫిలిప్పీన్ మొదటి స్థానంలో ఉండగా రెండవస్థానంలో తూర్పు తిమోర్ ఉంది. రోమన్ కాథలిక్ చర్చి విభజనలో రోమన్ కాథలిక్ డియోసెస్ మూడు భాగాలుగా విభజించింది. అవి వరుసగా రోమన్ కాథలిక్ డియోసెస్ ఆఫ్ దిలి, రోమన్ కాథలిక్ డియోసెస్ ఆఫ్ బౌకౌ, రోమన్ కాథలిక్ డియోసెస్ ఆఫ్ మలియానా.[85]

సంస్కృతి

Sacred house (lee teinu) in Lospalos

తూర్పు తిమోర్ సంస్కృతి అనేక సంస్కృతులతో ప్రభావితమై ఉంది. ప్రధానంగా పోర్చుగీస్, రోమన్ కాథలిక్, ఇండోనేషియన్ ప్రభావాలు అధికంగా ఉన్నాయి. తూర్పు తిమోర్ స్థానిక ప్రజలలో ఆస్ట్రేషియన్, మెలనేషియన్ సంస్కృతి మిశ్రితమై ఉంటుంది. తూర్పు తిమోర్ సంస్కృతిని ఆస్ట్రోనేషియన్ పురాణాలతో ప్రభావితమై ఉంది. ఉదాహరణగా: వృద్ధాప్యంతో బాధపడుతున్న ఒక మొసలికి ఒకబాలుడు సహకరించాడు. ఆ బాలుని ఋణం తీర్చుకోవడానికి మొసలి దీవిగా మారి దానిని బాలునికి కానుకగా ఇచ్చిందని ఆస్ట్రోనేషియన్ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.[86] వర్ణను సమర్ధించే విధంగా తిమోర్ దీవి మొసలి రూపంలో ఉంటుంది. ఆ బాలుని సంతతి వారే స్థానిక తిమోర్ ప్రజలని విశ్వసిస్తున్నారు. " లీవింగ్ ది క్రొకొడైల్ (మొసలిని వదలడం అంటే ) " అనే సామెత తూర్పు తిమోర్ వాసులను ఈ దీవి నుండి తరిమివేసున బాధాకరమైన సంఘటనను సూచిస్తుంది.

కళలు

తూర్పు తిమోర్‌లో బలమైన [విడమరచి రాయాలి] కవిత్వసంప్రదాయం ఉంది.[ఆధారం చూపాలి] ఉదాహరణగా ప్రధానమంత్రి " క్సనానా గుస్మావో " కూడా గొప్ప కవి. [ఆధారం చూపాలి]. నిర్మాణకళాపరంగా తూర్పు తైమూరులో పోర్చుగీసు శైలి భవనాలు అధికంగా ఉంటాయి. వీటితో సంప్రదాయ టోటెం గృహాలు కూడా ఉంటాయి. వీటిని " లులిక్ " (టెటాం భాషలో పవిత్ర గృహాలు), " లీ టెయిను " (ఫతలుకు భాషలో లెగ్డ్ హౌసెస్, [ఆధారం చూపాలి]హస్థకళలు, సంప్రదాయంగా నేయబడిన స్కార్వు కూడా దేశమంతటా ఉంటాయి. [ఆధారం చూపాలి]. " నేషనల్ ఫిల్ం అండ్ సౌండ్ ఆర్చివ్స్‌ "లో తిమోర్ ఆడియో వీడియో సంగ్రహణలు భద్రపరచబడి ఉన్నాయి.[87] ఎన్.ఎఫ్.ఎస్.ఎ. తూర్పు తిమోర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంటుంది.[88] 2013 లో తూర్పు తిమోర్ చలన చిత్రం " బియాత్రిజ్స్ వార్ " విడుదల అయింది.[89]

ఆహారం

తూర్పు తిమోర్ ఆహారం విధానంలో స్థానిక ఆహారాలైన పోర్క్, చేప, తులసి, చింతపండు, చిక్కుళ్ళు, మొక్కజొన్న, వరి, దుంప కూరగాయలు, ఉష్ణమండల పండ్లు ప్రధానంగా ఉన్నాయి.తూర్పు తిమోర్ ఆహారం అలవాట్లు ఆగ్నేయాసియా ఆహారలతో ప్రభావితమై ఉంటాయి. పోర్చుగీస్ పాలన ఆరంభమైన తరువాత పోర్చుగీసు ఆహారలు కూడా తూర్పు తిమోర్ ఆహారపు అలవాట్ల మీద ప్రభావం చూపాయి. శతాబ్ధాల కాలం సాగిన పోర్చుగీసు పాలన ప్రభావంగా పోర్చుగీసులు వాడిన సుగంధద్రవ్యాలు, ఆహారపదార్ధాలు తూర్పు తైమూరు ఆహార తయారీలో చోటుచేసుకున్నాయి.

క్రీడలు

తూర్పు తిమోర్‌ క్రీడాకారులు " ది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ", " ది ఇంటర్నేషనల్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ ", " ది ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్, యూనియన్ సైక్లింగ్ ఇంటర్నేషనల్, ది ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, ది ఇంటర్నేషనల్ టెబుల్ టెన్నిస్ ఫెడరేషన్, తూర్పు తిమోర్ నేషనల్ ఫుట్ బాల్ టీం పాల్గొంటుంటారు. తూర్పు తిమోర్ అథ్లెట్లు " 2003 సౌత్ ఈస్ట్ ఆసియన్ గేంస్ "లో పోటీ చేసారు. తూర్పు తిమోర్ అథ్లెట్లు వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడలలో పాల్గొంటున్నారు. తూర్పు తిమోర్ లెస్తె 2005 సౌత్ ఈస్ట్ ఆసియన్ గేంస్‌లో మూడు బంగారుపతకాలను సాధించారు. తూర్పు తిమోర్ 2006-2008 ల్యూసోఫోనీ క్రీడలలో పోటీచేసింది. [90] తూర్పు తిమోర్ " 2014 వింటర్ ఒలింపిక్స్ "లో పోటీ చేసింది. వరల్డ్ బాక్సింగ్ టైటిల్ కొరకు ఫైటర్ " థోమస్ అమెరికొ " పోటీ చేసాడు. 1999 లో థోమస్ అమెరికొ హత్యకు గురైయ్యాడు. [91]

వెలుపలి లింకులు