బ్యాంకాక్

థాయిలాండ్ యొక్క రాజధాని

బ్యాంకాక్ (ఆంగ్లం: Bangkok) థాయిలాండ్ దేశపు రాజధాని. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే అందమైన నగరం. అయితే బ్యాంకాక్‌ అసలు పేరు అత్యంత పొడవుగా ఉండి గిన్నిస్‌ బుక్‌లోనూ చోటు సంపాదించుకుంది. ఆ పేరు "క్రుంగ్‌ థెప్‌ మహా నాఖోన్‌ అమోన్‌ రతన కోసిన్‌ మహింత్రయుత్తయ మహ దిలోక్‌ పోప్‌ నప్ప రాట్‌ రటచా థాని బురి రోమ్‌ ఉడొమ్‌ రటాచ నివెట్‌ మహా సతాన్‌ అమోన్‌ ఫిమన్‌ అవటాన్‌ సట్‌హిట్‌ సఖ తాట్టియా విట్సనుకమ్‌ ప్రసిట్‌" (థాయ్: กรุงเทพมหานคร อมรรัตนโกสินทร์ มหินทรายุธยา มหาดิลกภพ นพรัตนราชธานีบูรีรมย์ อุดมราชนิเวศน์มหาสถาน อมรพิมานอวตารสถิต สักกะทัตติยวิษณุกรรมประสิทธิ์). ప్రస్తుతం ఇంతపొడవు పేరున్న ఈ నగరం బాహ్య ప్రపంచానికి బ్యాంకాక్‌, కానీ ఆ పొడవు పేరును కుదించి ‘క్రుంగ్‌ థెప్‌ మహా నిఖోన్‌’గా కానీ ‘క్రుంగ్‌ థెప్‌’గా కానీ స్థానికులు పిలుచుకుంటారు.[5]

బ్యాంకాక్ (Bangkok)
กรุงเทพมหานคร
Krung Thep Maha Nakhon
ప్రత్యేక పరిపాలనా యంత్రాంగము
A composite image, the top row showing a skyline with several skyscrapers; the second row shows, on the left, a Thai temple complex, and on the right, a temple with a large stupa surrounded by four smaller ones on a river bank; and the third rowing showing, on the left, a monument featuring bronze figures standing around the base of an obelisk, surrounded by a large traffic circle, with an elevated rail line passing in the foreground, and on the right, a tall gate-like structure, painted in red
A green rectangular flag with the seal of Bangkok in the centre
A round seal bearing the image of Indra riding Airavata among clouds, with the words "Krung Thep Maha Nakhon" (in Thai) across the top
Map of Thailand, with a small highlighted area near the centre of the country, near the coast of the Gulf of Thailand
Location within Thailand
దేశము Thailand
ప్రాంతముసెంట్రల్ థాయిలాండ్
Settledc 15th century
Founded as capital21 ఏప్రిల్ 1782
Re-incorporated13 డిసెంబరు 1972
Founded byరామా 1 రాజు
Governing bodyబ్యాంకాక్ మెట్రోపాలిటన్ పరిపాలనా యంత్రాంగము
Government
 • Typeప్రత్యేక పరిపాలనా ప్రాంతము
 • గవర్నరుసుఖుంబంధ్ పరిబ్రత (ప్రజాస్వామ్య పార్టీ)
Area
 • City1,568.737 km2 (605.693 sq mi)
 • Metro7,761.6 km2 (2,996.8 sq mi)
Elevation1.5 మీ (4.9 అ.)
Population
 (2010 census)[4]
 • City82,80,925
 • Density5,300/km2 (14,000/sq mi)
 • Metro
1,45,65,547
 • Metro density1,900/km2 (4,900/sq mi)
Demonymబ్యాంకాకియన్
Time zoneUTC+7 (Thailand)
Postal code
10###
Area code02
ISO 3166 codeTH-10

కింగ్‌ మాంగ్‌కుట్‌ మహారాజు బ్యాంకాక్‌కు పెట్టిన ఈ పేరు పాలి, సంస్కృత భాషల్లోని పదాలతో కూర్చినది. దీనికి అర్థం ‘దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, తొమ్మిది రత్నాల అద్భుతమైన నగరం, చక్రవర్తి సింహాసనం, రాజభవంతుల నగరం, మానవరూపంలో అవతరించిన దేవతల ఇల్లు, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరం’’.[6]

పల్లెటూరుగా ఉన్న బ్యాంకాక్‌ను 15వ శతాబ్దంలో ఆయుత్తయ రాజులు నగరంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. అప్పటి నుంచి ఆయా రాజులు ప్రధాన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. 1782లో కింగ్ రామ-1 బ్యాంకాక్‌ను రాజధానిగా మార్చుకున్నాడు. ఆయన హయాంలో బ్యాంకాక్‌ను ‘‘క్రుంగ్ థెప్ తవరవాడి సి ఆయుత్తయ" అని పిలిచేవారు.[7]

ఎమరాల్డ్ బుద్ధుని ఆలయం, బ్యాంకాక్, థాయిలాండ్

మూలాలు

బయటి లంకెలు

Bangkok Metropolitan Administration Archived 2014-10-18 at the Wayback Machine