బెర్నార్డో బెర్టోలుచి

ఇటాలియన్ సినిమా దర్శకుడు, స్క్రీన్ రచయిత

బెర్నార్డో బెర్టోలుచి (1941 మార్చి 16 - 2018 నవంబరు 26) ఇటాలియన్ సినిమా దర్శకుడు, స్క్రీన్ రచయిత. తన 50 సంవత్సరాల సినిమా జీవితంలో ఇటాలియన్ సినిమా గొప్ప దర్శకులలో ఒకరిగా పరిగణించబడుతున్నాడు.[1][2] బెర్టోలుచి తన సినిమాలతో అంతర్జాతీయ ప్రశంసలను అందుకున్నాడు. 1987లో ది లాస్ట్ ఎంపరర్ అనే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి ఇటాలియన్ సినీనిర్మాతగా నిలిచాడు. రెండు గోల్డెన్ గ్లోబ్స్, రెండు డేవిడ్ డి డోనాటెల్లోస్, బ్రిటీష్ అకాడమీ అవార్డు, సీజర్ వంటి అవార్డులను అందుకున్నాడు. సినిమారంగంలో ఇతని కృషికి గుర్తింపుగా, 2011 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ప్రారంభ గౌరవ పామ్ డి ఓర్ అవార్డు అందించబడింది[3] వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ గోల్డెన్ లయన్‌ని కూడా అందుకున్నాడు.

బెర్నార్డో బెర్టోలుచి
బెర్నార్డో బెర్టోలుచి, సుమారు 1971
జననం(1941-03-16)1941 మార్చి 16
పర్మా, ఇటలీ
మరణం2018 నవంబరు 26(2018-11-26) (వయసు 77)
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు1962–2018
జీవిత భాగస్వామి
  • అడ్రియానా అస్తి
    (divorced)
  • క్లేర్ పెప్లో
    (m. 1979)
తల్లిదండ్రులు
  • అటిలియో బెర్టోలుచి (తండ్రి)

జననం

బెర్టోలుచి 1941 మార్చి 16న ఇటలీ, పర్మాలోని, ఎమిలియా-రొమాగ్నా ప్రాంతంలో జన్మించాడు. తండ్రి అటిలియో బెర్టోలుచి కవి, ప్రసిద్ధ కళా చరిత్రకారుడు, సినీ విమర్శకుడు.[4]

సినిమారంగం

బెర్టోలుచి 22 ఏళ్ళ వయసులో దర్శకుడిగా తొలి సినిమా తీశాడు. 1964లో తీసిన రెండవ సినిమా బిఫోర్ ది రివల్యూషన్ అంతర్జాతీయ సమీక్షలను సంపాదించింది, ఫిల్మ్ 4 నుండి "ఇటాలియన్ సినిమారంగ మాస్టర్ పీస్"గా పిలువబడే క్లాసిక్ హోదాను కూడా పొందింది. 1970లో తీసిన ది కన్ఫార్మిస్ట్ సినిమా అంతర్జాతీయ సినిమారంగ క్లాసిక్ గా పరిగణించబడుతోంది,[5] ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంగలో అకాడమీ అవార్డుకు, ప్రతిష్టాత్మకమైన బెర్లిన్ గోల్డెన్ బేర్ కు నామినేట్ చేయబడింది. 1972లో వచ్చిన లాస్ట్ టాంగో ఇన్ ప్యారిస్ సినిమా కొన్ని సన్నివేశాల కారణంగా వివాదాస్పదమైంది, అదనంగా స్క్రిప్ట్ లేని రేప్ సన్నివేశానికి నటి మరియా ష్నీడర్ అంగీకరించలేదు.[6] 1976లో 1900, 1979లో లా లూనా, 1981లో ట్రాజెడి ఆఫ్ ఏ రిడిక్యులస్ మ్యాన్ వంటి సినిమాలు కూడా వివాదాస్పదమైనప్పటికీ ప్రశంసలు పొందాయి.

1987లో చైనీస్ చక్రవర్తి పుయి జీవితం ఆధారంగా తీసిన ది లాస్ట్ ఎంపరర్ అనే బయోపిక్ వాణిజ్యపరంగా విజయవంతకావడంతోపాటు మంచి సమీక్షలను సంపాదించింది, 60వ అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో అవార్డులు అందుకుంది.

బెర్టోలుచి తీసిని సినిమాలు రాజకీయాలు, లైంగికత, చరిత్ర, వర్గ సంఘర్షణ, సామాజిక నిషేధాల ఇతివృత్తాలతో ఉంటాయి.[7][8] అతని దర్శకత్వ శైలి పలువురు ఇతర దర్శకులను ప్రభావితం చేసింది.[5][1] అతని అనేక చిత్రాలు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫిల్మ్ లిస్ట్‌లలో కనిపించాయి.

2011లో బెర్టోలుచి

అవార్డులు

  • 1971: ఉత్తమ దర్శకుడిగా నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు
  • 1973: ఉత్తమ దర్శకుడిగా నాస్ట్రో డి అర్జెంటో
  • 1987: ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డు
  • 1987: ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేకి అకాడమీ అవార్డు
  • 1987: ఉత్తమ దర్శకుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు
  • 1987: ఉత్తమ స్క్రీన్ ప్లేకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు
  • 1987: ఉత్తమ దర్శకుడిగా డేవిడ్ డి డోనాటెల్లో
  • 1987: ఉత్తమ స్క్రిప్ట్‌గా డేవిడ్ డి డోనాటెల్లో
  • 1987: ఉత్తమ దర్శకుడిగా నాస్ట్రో డి అర్జెంటో
  • 1987: ఉత్తమ దర్శకుడిగా డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డు
  • 1997: లోకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గౌరవప్రదమైన ప్రస్తావన
  • 1997: కెమెరామేజ్‌లో దర్శకత్వం వహించడంలో ప్రత్యేక దృశ్య సున్నితత్వం అవార్డు
  • 1997: కెమెరామేజ్‌లో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (విట్టోరియో స్టోరారో) సహకార దర్శకునికి అవార్డు
  • 1998: నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ద్వారా స్వేచ్ఛా వ్యక్తీకరణకు గుర్తింపు
  • 1999: లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - 30వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా[9]
  • 2007: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన కెరీర్‌కు గోల్డెన్ లయన్
  • 2011: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గౌరవ పామ్ డి ఓర్

డాక్యుమెంటరీలు

సంవత్సరంపేరుదర్శకుడుస్క్రీన్ ప్లే రచయితఇతర వివరాలు
1966ఇల్ కెనాలేఅవునుఅవునుడాక్యుమెంటరీ షార్ట్
1971లా సెల్యూట్ ఈ మాలటఅవునుకాదు
1984లడ్డియో అండ్ ఎన్రికో బెర్లింగ్యూర్అవునుఅవును
198912 రిజిస్ట్రీ పెర్ 12 చిట్టిఅవునుకాదువిభాగం: బోలోగ్నా

మరణం

బెర్టోలుచి తన 77 సంవత్సరాల వయస్సులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో 2018 నవంబరు 26న రోమ్‌ నగరంలో మరణించాడు.[10][11]

మూలాలు

బయటి లింకులు