ఇటాలియన్ భాష

ఇటాలియన్ ఒక ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన భాష. చాలా మంది శాస్త్రవేత్తల పరిశీలన మేరకు ఇటాలియన్, సార్డీనియన్ భాషలు లాటిన్ భాషకు అతి దగ్గరగా ఉండే భాషలు. లాటిన్ నుంచి వచ్చిన వల్గర్ లాటిన్ నుంచి ఉద్భవించాయి.[1] ఇది ఇటలీ, స్విట్జర్లాండ్, శాన్ మెరీనో, వాటికన్ నగరంలో అధికార భాషల్లో ఒకటి.

ఇటాలియన్ ఒక ప్రధాన యూరోపియన్ భాష. ఇది యూరప్‌లోని భద్రత, సహకార సంస్థ అధికారిక భాషలలో ఒకటి. యూరోప్ కౌన్సిల్ పని భాషలలో ఒకటి. యూరోపియన్ యూనియన్‌లో 6.7 కోట్ల మంది (మొత్తం జనాభాలో 15%) మాట్లాడే ఈ భాష రెండవ స్థానంలో ఉంది. 1.34 కోట్ల మంది యూరప్ పౌరులు (3%) దీన్ని రెండవ భాషగా మాట్లాడుతున్నారు.[2][3] యూరోపియన్ యూనియన్ లో భాగం కాని దేశాల్లో (స్విట్జర్లాండ్, అల్బేనియా, యునైటెడ్ కింగ్డమ్) కూడా ఈ భాష మాట్లాడే వారిని కలుపుకుంటే మొత్తం 8.5 కోట్లమంది ఉన్నారు.[4]

చరిత్ర

టస్కాన్ మాండలికం నుండి ఇటాలియన్ భాష అభివృద్ధిలో ప్రభావవంతమైన వ్యక్తి పియట్రో బెంబో

మధ్యయుగంలో యూరోపు లో రాయడానికి బాగా కుదురుకున్న భాష లాటిన్. ప్రజల్లో చాలామంది నిరక్షరాస్యులైనప్పటికీ కొద్దిమంది మాత్రం ఈ భాషలో నిష్ణాతులై ఉండేవారు. యూరోపులోనే చాలా ప్రదేశాలకు మల్లేనే ఇటాలియన్ ద్వీపకల్పంలో కూడా స్థానికులు లాటిన్ ప్రాంతీయ మాండలికాలని ఉపయోగించేవారు. ఈ మాండలికాలు కొన్ని శతాబ్దాల పాటు వల్గర్ లాటిన్ అనే భాష నుంచి పరిణామం చెందుతూ వచ్చాయి. ప్రామాణికాలు, బోధనలతో సంబంధం లేకుండా ఇది జరుగుతూ వచ్చింది. ప్రామాణిక ఇటాలియన్ కూడా ఇలాంటి ఒక ప్రాంతీయ మాండలికం నుంచే అభివృద్ధి చెందింది. మిగిలినవన్నీ ప్రామాణిక ఇటాలియన్ కు మాండలికాలు కావు కానీ, సోదర భాషలు అవుతాయి.

5 వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్య పతనం తరువాత ప్రారంభమైన వివిధ ప్రక్రియల ద్వారా ఇటాలియన్ భాష అభివృద్ధి చెందింది. అనేక శతాబ్దాలుగా, ముఖ్యంగా మధ్య యుగాలలో, యూరోపియన్ విశ్వవిద్యాలయాలలో, చర్చిలలో అన్ని అధికారిక చర్యలు, విధానాలలో లాటిన్ సాంస్కృతిక భాషగా ఆధిపత్యం చెలాయించింది. మాతృభాషలో వ్రాసిన మొదటి పత్రాలు కీ.శ .960 నాటిది. కాంపానియాలోని కాపువా నగరానికి సమీపంలో ఉన్న కొన్ని భూభాగాలు బెనెడిక్టిన్ సన్యాసుల ఆశ్రమానికి చెందినవి. సా.శ 13 వ శతాబ్దం ప్రారంభంలో సాహిత్యం, కవితలు ప్రాంతీయ ఇటాలియన్‌ భాషలో లో ప్రచురించడం ప్రారంభమైంది. 13 వ శతాబ్దంలో సిసిలియన్ కవులు రచనలు చేశారు. ఆ తరువాత టుస్కానీకి చెందిన రచయితలలో డాంటే, అలిజియేరి, జియోవన్నీ, బోకాసియో, ఫ్రాన్సిస్కో పెట్రార్చ్ మొదలైన వారు ముఖ్యులు. ఇటాలియన్ భాష సా.శ 1600 లలో ప్రారంభమైంది. భాష రూపం ఎలా ఉండాలి, ఏమి మాట్లాడాలి అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. సా.శ 1900 ల చివరలో చాలా మంది రచయితలు, సంస్కృతికి సంభందించిన వారు టుస్కాన్ నమూనా నుండి ప్రేరణ పొందినప్పటికీ, భాష యొక్క ప్రతి అంశంలో, అనేక సంబంధిత చారిత్రక, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉన్నది. 1861 లో ఇటలీ ఏకీకరణ వరకు శతాబ్దాలుగా వేర్వేరు రాష్ట్రాలుగా విభజించబడింది, ఇవి విదేశీ పాలనలో ఉన్నాయి. 1861 లో ఇటలీ కలిసినప్పుడు, టుస్కాన్‌ను దేశానికి అధికారిక భాషగా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇటాలియన్ జనాభాలో, నిరక్షరాస్యత అధికంగా ఉంది. ఈ నిరక్షరాస్యత 1950 ల వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కొనసాగింది. పర్యవసానంగా మాండలికాలను శతాబ్దాలుగా రోజువారీ భాషగా ఉపయోగించారు. తమను తాము వ్యక్తీకరించడానికి , మాట్లాడానికి ఇటాలియన్ భాషలో స్థానిక మాండలికాలచే ప్రభావితమైన వ్యాకరణ, లెక్సికల్, ఫొనెటికల్ అంశాలను ఉపయోగించినారు.[5]

ఇటాలియన్ భాష గురించి 10 వాస్తవాలు

  • 1861 లో ఇటాలియన్ అధికారిక భాషగా మారింది. టుస్కాన్ మాండలికాన్ని దేశానికి అధికారిక భాషగా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు.
  • ఇటాలియన్ వర్ణమాలలో 21 అక్షరాలు మాత్రమే ఉన్నాయి.చారిత్రాత్మకంగా, ప్రామాణిక ఇటాలియన్ వర్ణమాలలో J, K, W, X , Y వంటి 21 అక్షరాలు మాత్రమే ఇటాలియన్ పదాలలో ఉపయోగించబడవు.తక్కువ గా పాత రచనలలో మాత్రమే ఉపయోగించబడతాయి.
  • ఇటాలియన్ లాటిన్‌కు దగ్గరగా ఉన్న భాషలలో ఒకటిగా పరిగణించబడుతుంది వీటి పదజాలం, ఉచ్చారణ సారూప్యతలను చూసినప్పుడు, ఇటాలియన్ లాటిన్‌కు దగ్గరగా ఉన్న భాషలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే లాటిన్ రోమన్ సామ్రాజ్యం యొక్క అధికారిక భాష, 6 వ శతాబ్దంలో సామ్రాజ్యం పతనం అయ్యే వరకు ఉపయోగించబడింది. లాటిన్ భాష కూడా కాథలిక్ చర్చి , వాటికన్ నగరం యొక్క అధికారిక భాష.
  • ఇటాలియన్ పదాలు ఆంగ్లంలో దుర్వినియోగం చేయబడ్డాయి.
  • ప్రపంచంలో సుమారు 63 మిలియన్ల మంది ఇటాలియన్‌ను వారి మొదటి భాషగా, సుమారు 3 మిలియన్లు ఇటాలియన్‌ను రెండవ భాషగా మాట్లాడతారు. బాబెల్ ప్రకారం, ఇటాలియన్ ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 20 వ భాషలో ఉండి , అత్యధికంగా అధ్యయనం చేయబడిన 4 వ భాష.
  • 19 వ శతాబ్దంలో ఇటలీ నుండి అమెరికా దేశం కు పెద్ద సంఖ్యలో వలసలు రావడంతో, ఇటాలియన్ భాష అమెరికా సెన్సస్ బ్యూరో ప్రకారం సుమారు 709,000 మంది అమెరికన్లు ఇటాలియన్ మాట్లాడతారు, వీరిలో ఎక్కువ మంది న్యూయార్క్, న్యూజెర్సీలో నివసిస్తున్నారు.
  • అలెశాండ్రో వోల్టా ఇటాలియన్ శాస్త్రవేత్త కి .శ .1799 లో వోల్టాయిక్ పైల్‌ అంటే విద్యుత్తును కొలిచే యూనిట్ ను సృష్టించాడుదీంతో ‘వోల్ట్’ అనే పదం ఉద్భవించింది.
  • ఇటాలియన్ పదాలు నాలుగు జతల హల్లులను కలిగి ఉన్నాయి.
  • ఇటాలియన్ భాషలో పొడవైన పదం సైకోనెరోఎండోక్రినోఇమ్యునోలాజియా (“సైకో న్యూరో ఎండోక్రినో ఇమ్యునాలజీ”) , అదేవిధంగా ఇతర వైద్య పదాలు కూడా ఉన్నాయి.
  • ‘అమెరికా’ పేరు అమెరిగో వెస్పుచి పేరు మీద ఉంది. 15 వ శతాబ్దపు ఇటాలియన్ అన్వేషకుడు ఉత్తర,యు దక్షిణ అమెరికా ప్రత్యేక ఖండాలు, ఆసియాలో భాగం కాదని గుర్తించిన మొదటి యూరోపియన్..[6]

మూలాలు