వోల్ట్

వోల్ట్ (చిహ్నం: V) అనేది ఎలెక్ట్రికల్ పొటెన్షియల్, ఎలెక్ట్రిక్ పొటెన్షియల్ భేదము, విద్యుఛ్ఛాలక బలం వంటి భౌతిక రాశులకు వాడబడే ప్రమాణం.[1]ప్రమాణం మొదటి రసాయన ఘటం ఆవిష్కర్త అయిన అలెసాండ్రో వాల్టా యొక్క గౌరవార్థం ఆయన పేరు మీదుగా నామకరణం చేయబడినది.

వోల్ట్
ఒక ప్రామాణిక వోల్ట్‌ గా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ చే అభివృద్ధి పరచబడిన జోసెప్సన్ జంక్షన్ శ్రేణి చిప్
General information
Unit systemSI ప్రమాణము
Unit ofఎలెక్ట్రికల్ పొటెన్షియల్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్
SymbolV 
Named afterఅలెశాండ్రో వోల్టా
SI ఆధార యూనిట్లలో:kgm2s-3A-1
ఎలక్ట్రానిక్ మల్టీ మీటరు

వివరణ

"వోల్టు" అనే ప్రమాణం విద్యుత్ పొటెన్షియల్ ను కొలుచుటకు వాడుతారు. విద్యుత్ పొటెన్షియల్ అనునది ఒక రకమైన పొటెన్షియల్ శక్తి. ఇది ఒక ఒక వాహకంలో ఒక బిందువు నుండి వేరొక బిందువుకు విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహింపజేసే శక్తి.

నిర్వచనము

ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవాహాన్ని ఒక వాహకంలో ఒక బిందువు నుండి వేరొక బిందువుకు చేరవేయడానికి కావలసిన శక్తి ఒక వాట్ అయితే ఆ రెండు బిందువుల మధ్య విద్యుత్ పొటెన్షియల్ భేదము ఒక ఓల్టు అవుతుంది.[2] ఇది రెండు సమాంతర పలకలను అనంతంలో ఒక మీటరు దూరంలో ఉంచినపుడు వాటి మధ్య 1 న్యూటన్/కులూంబ్ విద్యుత్ క్షేత్రం సృష్టించబడితే వాటిమధ్య పొటెన్షియల్ భేదము ఒక ఓల్టుకు సమానమవుతుంది. అదనంగా ఇది ఒక కులూంబ్ విద్యుత్ ఆవేశాన్ని ఒక బిందువు నుండి వేరొక బిందువుకు ఒక వాహకంలో చేరవేయడానికి అవసరమైన శక్తి ఒక జౌల్ అయితే పొటెన్షియల్ భేదము ఒక ఓల్టు అవుతుంది. దీనిని ఎస్.ఐ పద్ధతిలో ఈ క్రింది విధంగా సూచిస్తారు:


ఇది ఆంపియర్ రెట్లు గల ఓంలు (విద్యుత్ ప్రవాహం రెట్లు నిరోధం ఓం నియమం) గా కూడా నిర్వచింపబడుతుంది. వాట్లు/ఆంపియర్ (ప్రమాణ విద్యుత్ ప్రవాహానికి సామర్థం), జౌల్ నియమం, లేదా జౌల్/కులూంబ్ (ప్రమాణ ఆవేశానికి శక్తి) గా కూడా నిర్వచింపబడుతుంది. ఇది ఎలక్ట్రాన్ ఓల్టు / ఎలెమెంటరీ ఛార్జ్ కు సమానంగా ఉంటుంది:

మూలాలు