ఆలివ్ నూనె

ఆలివ్ నూనె ఆలివ్ పళ్ళగుజ్జు నుండి తీయుదురు. ఆలివ్ చెట్టు యొక్క వృక్ష శాస్త్రపేరు ఒలియ యురోపా (Olea europaea). ఇది ఒలిఎసియా కుటుంబానికి చెందిన మొక్క. ఆలివ్ నూనెను వంటలలో, సౌందర్య ద్రవ్యాలలో, సబ్బుల తయారిలో, మందుల తయారీలో వాడెదరు.ఇది మధ్యధరా ప్రాంతానికి చెందిన చెట్టు.

ఆలివ్ నూనె
ఆలివ్ నూనె

సీసాలో ఆలివ్‌ నూనె


క్రొవ్వు సంఘటనము
సంతృప్త క్రొవ్వులుపామిటిక్‌ ఆమ్లం: 13.0%
స్టియరిక్ ఆమ్లం: 1.5%

అసంతృప్త క్రొవ్వులు> 85%
Monounsaturatedఒలిక్ ఆమ్లం: 70.0%
పామిటిక్‌ ఆమ్లం: 0.3–3.5%
Polyunsaturatedలినొలిక్ ఆమ్లం: 15.0%
α-Linolenic acid: 0.5%

ధర్మములు
ద్రవీభవన స్థానం−6.0 °C (21.2 °F)
మరుగు స్థానం300 °C (572 °F)
Smoke point190 °C (374 °F) (virgin)
210 °C (410 °F) (refined)
20 °C వద్ద విశిష్ట గురుత్వం0.911[1]
20 °C వద్ద స్నిగ్దత84 cP
వక్రీభవన గుణకం1.4677–1.4705 (virgin and refined)
1.4680–1.4707 (pomace)
అయోడిన్ విలువ75–94 (virgin and refined)
75–92 (pomace)
ఆమ్ల విలువmaximum: 6.6 (refined and pomace)
0.6 (extra-virgin)
సఫోనిఫికేషన్ విలువ184–196 (virgin and refined)
182–193 (pomace)
Peroxide value20 (virgin)
10 (refined and pomace)
పురాతనకాలంనాటి గ్రీకులోని ఆలివ్ నూనెమిల్లు
పురాతనకాలంనాటి టర్కీలోని ఆలివ్ నూనెమిల్లు
ఇజ్రాయిల్ లోని నవీనమైన కోల్డుప్రెస్‌
పద్ధతిలో నూనెతీయు యంత్రం

ఆలివ్ నూనె యొక్క ప్రాథమిక ఉత్పాదిత చరిత్ర

ఆలివ్ యొక్క మూలస్థానం మధ్యధరాసముద్ర ప్రాంతం (భూమధ్య ప్రాంతం). క్రీ.పూ.8000 సంవత్సరాల నాటికే నియోలిథిక్ మానవులు అడవి ఆలివ్ పండ్లను సేకరించినట్లు తెలియుచున్నది.[2] అడవి ఆలివ్ చెట్టు గ్రీసు లేదా ఆసియా మైనర్‌లో మొదటగా పుట్టినట్లు తెలుస్తున్నది.[3] అయితే ఎప్పుడు ఎక్కడ వీటిని పెంచడం మొదలైనది ఇదిమిద్దంగా తెలియకున్నది.వీటిని మొదట సినాయ్ ద్వీపకల్పం, ఇజ్రాయిల్, అర్మేనియా, మేసోపోటామియా సారవంతమైన నేలలో పెంచడం మొదలైనది.పురాతన త్రవ్వక ఆధారాల ప్రకారం క్రీ.పూ.6000 సంవత్సరాలనాటికి ఆలివ్ నూనెను తీయడం తెలుసు. క్రీ.పూ. 4500 నాటికి ప్రస్తుతపు ఇజ్రాయిల్ ప్రాంతంలో ఆలివ్ నూనెను తీసి వాడినట్లు తెలియుచున్నది.[4] మధ్యధరా ప్రాంతంలో తూర్పు తీరప్రాంతంలో ఆలివ్ పంటను ఎక్కువ మొత్తంలో/విస్తృతంగా సాగుచేసినట్లు తెలియుచున్నది. లభించిన ఆధారాలను బట్టి క్రెట్ (crete) లో క్రీ.పూ. 2500 నాటికి అక్కడ ఆలివ్ చెట్లను పెంచినట్లుగా తెలియుచున్నది.క్రీ.పూ. 2 వేలసంవత్సరాలకు పూర్వమే ఈజిప్టు రాజవంశీయులు క్రేట్ (crete, సిరియా, కనాన్‌ నుండి ఆలివ్ నూనెను [5] దిగుమతి చేసుకోనే వారని తెలుస్తున్నది. అంతేకాదు ఈ ప్రాంతంలో వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా ఆలివ్ నూనె ప్రముఖస్థానాన్నే పోషించినట్లు తెలుస్తున్నది.ఆలివ్ నూనెను ఆహారంగానే కాకుండా ఆకాలంలో మతపరమైన విధులలో, ఔషధాల తయారీలో వాడేవారు.అంతేకాకుండా కాగడాలు వెలిగించుటకు చమురుగాను ఉపయోగించేవారని, సబ్బులను కుడా తయారుచేసారని తెలుస్తున్నది. minoan నాగరికత సమయంలో ఆలివ్ నూనె ఉత్పత్తి ఒక ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన వస్తువుగా పరిగణించారు. హీబ్రూ బైబిల్ లిఖిత నమోదిత ఆధారం ప్రకారం క్రీ.పూ.13 వందల నాటికిఈజిప్టులో ఆలివ్ నూనెను తీసెవారని తెలుస్తున్నది.ఈ కాలంలో ఆలివ్ పండ్లను చేతితో పిండి నూనెను తీసి, ప్రత్యేకమైన పాత్రలలో, అర్చకుల రక్షణలో పర్యవేక్షనలో నిల్వ చేసెవారు.

ఉత్పత్తి దేశాలు

ప్రపంచంలో ఆలివ్ నూనెను ఉత్పత్తి చేయు దేశాలలో స్పెయిన్ (spain) మొదటిది. ఉత్పత్తిఅగు ఆలివ్ నూనెలో 43.8%వరకు స్పెయిన్‌లో ఉత్పత్తి అగుచున్నది. స్పెయిన్‌లో ఉత్పత్తి అగు నూనెలో, అండలూసియా నుంచే 75 % ఉత్పత్తి అవ్వుచున్నది. ఇటలీలో 21 .5 %గ్రీసులో, గ్రీసులో 12 .1 %, సిరియాలో 6.1% ఆలివ్ నూనె ఉత్పత్తి అవ్వుతున్నది. పోర్చుగల్‌ ప్రపంచ ఉత్పత్తిలో 5% ఉత్పత్తి చేస్తున్నది.ఈ దేశపు ప్రధాననూనె కొనుగోలుదేశం బ్రెజిల్. ఆలివ్ ఉత్పత్తి చెయ్యు దేశాలు స్పెయిన్, ఇటలీ, గ్రీసు, సిరియా, టునీషియా, టర్కీ, మొరాకో, అల్జీరియా, పోర్చుగల్, అర్జెంటీనా, లెబనాన్ .[6]

ప్రపంచ వ్యాప్తంగా 2011-12లో ఉత్పత్తిఅయిన నూనె వివరాలు, టన్నులలో[6]

దేశంఉత్పత్తి /టన్నులలోదేశంఉత్పత్తి /టన్నులలో
స్పెయిన్7,820,060ఇటలీ3,182,204
గ్రీసు2,000,000టర్కీ1,750,000
సిరియా1,095,043టునీసియా562,000
మొరాకో1,415,902అల్జీరియా610,776
పోర్చుగల్443,800ఆర్జింటినా22,700
ఈజిప్టు459,650జోర్డాన్16,760

వ్యాపార పరంగా నూనెలోని రకాలు /శ్రేణులు

పండ్లనుండి నూనెను తీసిన పద్ధతిని బట్టి ఆలివ్ నూనెను పలుపేర్ల (grade) లతో అమ్మకం చేయుదురు. ఉదాహరణకు వర్జిను, ఆర్డినరి వర్జిను, ఎక్సుట్రా వర్జిను, లాంప్టే వర్జిను (lampte virgin) అనేపేర్లు. వర్జిను నూనె అనగా కేవలం యాంత్రిక వత్తిడి ప్రయోగించి ఉత్పత్తి చెయ్యబడినది, ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండ ఉత్పత్తి చేసిన నూనె అని అర్థం.లాంప్టే వర్జిన్ అనగా వంటకు పనికిరాదు, కేవలం పారిశ్రామిక ఉప యోగానికి మాత్రమే వినియోగార్హం. ఇటలీలో ల్యామ్‌ప్టే అనగా దీపం/కాగడా అని అర్థం.అనగా కేవలం దీపం వెలిగించటానికి పనికి వచ్చే నూనె .అయితే ఈ నూనెను శుద్ధి (refine ) చేసిన తరువాత మానవ వినియో గానికి వాడవచ్చును. క్రూడ్ ఆలివ్ పోమస్ ఆయిల్ అనగా, స్టోనుమిల్లులో పండ్లగుజ్జు నుండి నూనె తీయగా మిగిలిన పళ్ళగుజ్జు నుండి సాల్వెంట్ ద్రావణాన్ని వాడి సంగ్రహించిన నూనె. ఈ నూనెను శుద్ధి కరించి, రిపైండు ఆలివ్ పోమాస్ ఆయిల్‌, లేదా రుచికి ఇందులో కొంత ప్రమాణంలో వర్జిన్ ఆలివ్ నూనెను కలిపి ఆలివ్ పోమస్ ఆయిల్‌గా అమ్మకం చెయ్యుదురు. ఎక్సుట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనగా ఈ నూనెలో ఫ్రీ ఫాటీ ఆసిడ్ శాతం 0.8%కి మించి ఉండదు.మంచి పండ్ల రుచిని కల్గి ఉండును.మొత్తం ఉత్పత్తి అయ్యే ఆలివ్‌నూనెలో ఈ ఎక్సుట్రా వర్జిన్ నూనె 10% మాత్రమే.ముఖ్యంగా ఈ నూనె మధ్యధరా ప్రాంతదేశాల నుండే (గ్రీసు:80 %, ఇటలీ:65%, స్పెయిన్:30%) ఉత్పత్తి ఆగుతుంది.ఆతరువాత ముద్దను పైబరు డిస్కులో పలుచగా ఉంచి, డిస్కులను ఒకదానిమీద ఒకటి ఉంచి, వాటిని ప్రెస్సులో ఉంచి, డిస్కులోని గుజ్జును అధికవత్తిడితో వత్తడం వలన డిస్కుకున్న రంద్రాల ద్వారా నూనె, తేమ తదితరాలు బయటకు వచ్చ్గును.

నూనె సంగ్రహణ విధానం

మొదటగా ఆలివ్ పండ్లను బాగా గుజ్జుగా చేసి ఆ తరువాత యాంత్రిక లేదా రసాయనిక పద్ధతిలో నూనెను తీయుదురు. ఆకుపచ్చగా ఉన్న పండ్లనుండి తీసిన నూనె కొంచెం చేదుగా ఉండును. బాగాఎక్కువ పండిన, మగ్గిన పండ్ల నుండి తీసిన నూనె పాడైన వాసన కల్గి ఉంటుంది. అందువలన సరిగా పక్వానికి వచ్చిన పండ్లనుండి తీసిన నూనె మాత్రమే వర్జిన్ నూనె. సమంగా పండిన ఆలివ్ పండ్లను సంప్రదాయ పద్ధతి అయినచో రాతి తిరుగలిలను (millstones) ఉపయోగించి, లేదా నవీనపద్ధతి అయినచో ఉక్కుడ్రమ్ములను ఉపయోగించి గుజ్జుగా నూరెదరు.రాతి తిరుగలి/మిల్లు స్టోన్‌ను ఉపయోగించి ముద్దగా చేసినచో, ముద్దను గ్రైండింగు మిల్లు లోనే 30-40 నిమిషాలపాటు అలాగే వదలి, అలావచ్సిన దాన్ని నిల్వటాంకులో కొంత కాలం పాటు తేరుటకై ఉంచేదరు. నూనెకన్న బరువైన మలినాలు, నీరు నిల్వ పాత్రలో అడుగుభాగంలో సెటిల్ అవ్వగా, నూనె పై భాగంలో తేరుకుంటుంది. అయితే ఈవిధానంలో నూనె తేరుకోనుటకు చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం అపకేంద్రిత యంత్రాలను ఉపయోగించి నూనెలోని మలినాలను చాలా త్వరగా తొలగించుచున్నారు. నూతన ఆయిల్ మిల్లులలో ఆలివ్ పండ్లను మొదట ఉక్కు డ్రమ్ములలో ముద్దగా చేయుదురు. ఇలా ముద్దగా చేయుటకు 20 నిమిషాల సమయం పడుతుంది., పిమ్మట మరో 20 -30 నిమిషాలు ఈ ముద్దను మరో కలుపు పాత్రలో బాగా కలుపుతారు. ఆ తరువాత అపకేంద్రిత యంత్రం (centrifuge ) సహాయంతో నూనె, అందులోని నీరు, ఇతర మలినాలను వేరు చెయ్యుదురు. ఈ విధంగా ఉత్పత్తి చేసిన నునేను శుద్ధమైన నూనె అంటారు.కొన్నిసార్లు అవసరమైనచో ఈ నూనెను వడబోత (filter ) చేసేదరు. నూనె తీయగా మిగిలిన పండ్లగుజ్జులో ఇంకను 5-10 % వరకు నూనె మిగిలిఉండును. ఇలామిగిలిన నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్సను విధానంలో సంగ్రహించెదరు.250Cవద్ద నూనెను తిసినచో దానిని కోల్డ్ ఎక్సుట్రాక్సను ఆయిల్ అంటారు.

నూనెలోని కొవ్వు ఆమ్లాలు, సమ్మేళ పదార్థాలు

2.ఆలివ్ నూనెలో సంతృప్త, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిసరాయిడ్సు రూపంలో ఉండును.ఇవి మిశ్రమ ట్రై గ్లిసరాయిడ్‌ ఎస్టర్‌లుగా ఏర్పడి ఉండును. నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు 6-16% వరకు ఉండును . మిగిలిన 90-85%వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిసరాయిడు రూపంలో ఉండును. పామిటిక్, స్టియరిక్ ఆమ్లాలు ఆలివ్ నూనెలో లభించు సంతృప్త కొవ్వు ఆమ్లాలు. అలాగే ఒలిక్, లినోలిక్ ఆమ్లాలు నూనెలో అధికమొత్తంలో లభించు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు. ఒలిక్ ఆమ్లం ఏకద్విబందమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం, లినోలిక్ ఆమ్లం రెండు ద్విబందాలు కలిగి ఉన్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. ఒలిక్ ఆమ్లం నూనెలో 55 -80% వరకు, లినోలిక్ ఆమ్లం 5-20%వరకు ఉండును. నూనెలో మూడు ద్విబందాలున్న α- (0 -1.5%) లినోలెనిక్ ఆమ్లం స్వల్పప్రమాణంలో ఉంది.[7] నూనెలో కొవ్వు అమ్లాలే కాకుండా బహు ద్విబందాలున్న స్క్వాలెన్ (squalene ) అనే హైడ్రోకార్బను, స్టెరోల్ (0.2%పైటో స్టెరోల్, టోకో స్టెరోల్ ) లు ఉన్నాయి. ఆలివ్ నూనెలో ఫేనోలిక్స్‌లు కుడా ఉన్నాయి.[8] ఇవి నూనెలో ట్యరోసోల్ (tyrosol ), హైడ్రాక్సీ ట్యరోసోల్ల ఎస్టర్లుగా లభిస్తాయి.ఆలివ్ నూనెలో కనీసం 30ఫేనోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి.

‘’’ఆలివ్ నూనెలోని కొవ్వు ఆమ్లాల పట్టిక ‘’’[9]

కొవ్వు ఆమ్లంశాతం
పామిటిక్ ఆమ్లం7.5-20 %
స్టియరిక్ ఆమ్లం0.5-5.0%
ఒలిక్ ఆమ్లం55-83 %
లినోలిక్ ఆమ్లం3.5-20 %
α-లినోలెనిక్ ఆమ్లం0.1.5%

ఆలివ్ నూనెయొక్క భౌతికరసాయనిక ధర్మాలు

ఆలివ్ నూనె పాలిపోయిన కొంచెం ఆకుపచ్చని రంగులో ఉండును.[10] సాధారణ వాతావరణ ఉష్ణోగ్రత వద్ద ఆలివ్ నూనె ద్రవరూపంలో ఉండును.దీనియొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత చాలాతక్కువ.నూనెలో అధిక మొత్తంలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటమే ఇందుకు కారణము.ఆలివ్ నూనె యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత -6 0 C.నూనె యొక్క ఉష్ణ వినిమయ శక్తి 8850 కిలో కేలరీలు ఒక కిలో కు.

లక్షణముపరిమితి
విశిష్ట గురుత్వం,20°C0.911
ద్రవీభవన ఉష్ణోగ్రత-6°C
మరుగు ఉష్ణోగ్రత300 °C (572 °F)
స్మోకు పాయింట్190 °C
వక్రిభవన సూచిక1.4677-1.4705 (విర్జిన్)
అయోడిన్ విలువ 75–94
సపోనిఫికేసన్ విలువ184-196
స్నిగ్థత,20°C వద్ద84 cP
పెరాక్సైడ్ విలువ20 (వర్జిన్ నూనె)

ఆలివ్ నూనె ఉపయోగాలు

ప్రస్తుతం ప్రపంచమంతటా ఆరోగ్య పరిరక్షణకు, దీర్ఘకాలము ఆనందముగా జీవించడానికి ఏది మంచో, ఏది చెడో అన్న ఆలోచనలతో మానవ మేధస్సు ఎక్కువ ఆలోచిస్తోంది . నూనెలలో మంచిది ఆలివ్ ఆయిల్.[11] ఒకవిధమైన సీమచెట్టు, దాని యొక్క పండున్ను, దానివిత్తులలోనుంచి నూనె తీస్తారు, నేతికి సమానమైనది. ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనెలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము. మధ్యధరా ప్రాంత దేశాలలో ఈ వంటనూనె ఎక్కువగా వాడతారు. రుచిని, పరిమళాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది .చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్‌ నూనెది ప్రత్యేక స్థానం. చిన్నారులకు మర్ధన చేయడానికి ఎక్కువగా ఈనూనెను ఉపయోగిస్తారు. చర్మానికి వాడే మందులు, ఆయింట్‌మెంట్స్‌ తయారీలోనూ దీనిని ఎక్కువగా వాడుతారు. ఈ నూనెతో చర్మాన్ని మసాజ్‌ చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా, కాంతిగానూ మారుతుంది. చలికాలంలో డ్రై చర్మం కలవారు ఆలివ్‌ ఆయిల్‌ను చర్మానికి ప్రతిరోజూ రాస్తుంటే, చర్మం పగలకుండా ఉంటుంది. చర్మంపై పుండ్లు గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలను పోగొట్టి చర్మం సహజ రంగుతో నిగారింపుగా ఉండేలా చేస్తుంది. చిన్న పిల్లలకు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి శరీరానికి మసాజ్‌ చేస్తే వారి చర్మం మృదువుగా ఉండి అందంగా తయారవుతారు. పీలగా ఉన్న పాపాయిలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే బొద్దుగా అందంగా అవుతారు. గ్రీస్‌కు చెందిన మహిళలయితే.. ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటూ సూచిస్తారు. రోజు స్నానానికి ముందు కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుంటే చాలు.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. దాంతోపాటు.. స్నానపు నీటిలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెనూ వేసుకుంటారు వీరు. ఇక కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుని.. ఆ తర్వాత పంచదారతో రుద్దుకుంటే.. ముడతలు దరిచేరవని వీరి నమ్మకం. ఆలివ్ నూనెలో Extra Virgin, virgin, pure, Extra Light అని నాలుగు ఏకాలుగా దొరుకుతుంది . అందులో మొదటిది ( ఎక్స్ ట్రా వర్జిన్‌ ఆలివ్ ఆయిల్ ) మంచిది.నాలుగు చెంచాల ఓట్‌మీల్ పొడిలో మూడు చెంచాల ఆలివ్‌నూనె కలిపి పాదాలకు మర్థన చేసి అరగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగేస్తే మృతకణాలు తొలగిపోయి పాదాలు మృదువుగా తయారవుతాయి.

వంటకాల్ని రుచిగా మాత్రమే కాదు.. పోషకాలు తగ్గిపోకుండా వండటం.. కూడా తెలిసుండాలి. అందుకు ఏం చేయాలంటే.. ఆకుకూరలు ఉడికించే నీళ్లలో కొద్దిగా ఆలివ్‌నూనె లేదా నిమ్మరసం వేస్తే పోషక విలువలు పోకుండా తగ్గకుండా ఉంటాయి.జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్‌నూనె, ఆముదాలను సమపాళ్ళలో తీసుకుని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించి తరువాత తలస్నానం చేయాలి. బరకగా (rough) మారిన మోచేతులకు కొద్దిగా ఆలివ్‌నూనె రాసి మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మార్పు ఉంటుందిచెంచా గ్లిజరిన్‌, కొద్దిగా రోజ్‌వాటర్‌, రెండుచెంచాల ఆలివ్‌నూనె, కాస్త నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి చేతులకు పూతలా వేసుకోవచ్చు. ఆరాక కడిగేసుకుంటే చాలు... చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.నాలుగుచుక్కల అల్లంరసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. కుదుళ్లు దృఢమవుతాయి.ఆముదం, ఆలివ్‌నూనె వేడిచేసి చేతులను వేళ్లను ముంచి పావుగంటయ్యాక బయటకు తీసి మర్దన చేయడం వల్ల చక్కటి పోషణ అందుతుంది.చక్కగా పెరుగుతాయి.ఆలివ్ నూనె వృద్ధుల్లో స్ట్రోక్ రిస్క్‌ను సగానికి సగం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బోర్డియక్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మూడు ఫ్రెంచ్ సిటీల్లో నివసించే 65 సంవత్సరాల వయసులో గల వారి 8000 వైద్య రికార్డులను పరిశోధించినట్లు మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ప్రచురించబడింది.ఐదేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో వృద్ధుల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం ద్వారా సగానికి సగం తగ్గిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం, అలాగే స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ ఉపయోగించిన వృద్ధుల్లో 41 శాతం స్ట్రోక్ తగ్గిందని పరిశోధనలో తేలింది.


  • ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
  • చర్మం పొడారిపోయినట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్‌ ఆయిల్‌లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్‌చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.
  • ఆలివ్‌ఆయిల్‌ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి.
  • ఆలివ్‌ఆయిల్‌లో టమాటోరసం, క్యారెట్‌జ్యూస్‌, పెరుగుకలిపి మచ్చల మీద రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి.
  • స్నానం చేయబోయే ముందు పిల్లలకు ఆలివ్‌ఆయిల్‌ను ఒంటికి పట్టించి, మృదువుగా మర్దనా చేసి, మెత్తని సెనగపిండితో రుద్ది స్నానం చేయిస్తే పిల్లల లేతచర్మం ఎంతోకాంతిగా వుంటుంది. ఎముకలు దృఢపడతాయి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
  • చలికాలంలో ఆలివ్‌ఆయిల్‌ను ఆరారగా పెదాలకు రాస్తూంటే పెదాలు పగలకుండా మృదువుగానే వుంటాయి.
  • ఆలివ్‌ఆయిల్‌లో తాజా గులాబీపూల రసాన్ని కలిపి పెదాలకు రాస్తుంటే, పెదాలు పగలవు, మంచిరంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
  • ఆలివ్‌ఆయిల్‌ను వెచ్చచేసి, వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి, పది పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే, జుట్టు రాలిపోకుండా వుంటుంది.
  • ఈ ఆయిల్‌లో వెల్లుల్లిపొట్టును కాల్చిన పొడిని కలిపి కానీ లేదా వెల్లుల్లి పొట్టును అలాగే ఆయిల్‌లో కలిపి కాచి కానీ తలకు రాసుకుంటే జుట్టు నల్లబడటమే కాకుండా, త్వరగా జుట్టు నెరవదు.
  • మీ తలలో చుండ్రు అనేది స్కాల్ప్ పొడిబారడం వల్ల లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఆలివ్ ఆయిల్ అనేది యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండే ఎమోలియెంట్. కాబట్టి ఇది రెండు కారణాలను నిరాకరిస్తుంది, మీ చుండ్రు చికిత్సలో సహాయపడుతుంది.
  • ఆలివ్ ఆయిల్‌లో విటమిన్ ఇ ఉంటుంది, ఇది మీ జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది, మీ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. అలాగే, విటమిన్ ఇ మీ స్కాల్ప్‌ను మెరుగుపరుస్తుంది, తద్వారా జుట్టు పెరుగుదలను పెంచడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ఆరారగా రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉంటుంది. కాంతిగానూ, మృదువుగానూ మారుతుంది.
  • ఆలివ్‌ఆయిల్‌లో పసుపుపొడిని కలిపి పాదాల పగుళ్ళకు, వేళ్ళమధ్య పాసిన చర్మానికి రాస్తూంటే ఆ బాధ తగ్గిపోయి, చర్మం చక్కగా ఉంటుంది.
  • ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి పెదాలకు రాయడం వల్ల పెదాలు పగలవు.
  • ఆలివ్‌ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకురాచుకుని, తలస్నానం చేసినట్లయితే వెంట్రుకలు మెత్తగా మారుతాయి. కేశాలు పొడవుగా పెరుగుతాయి.
  • మలబద్ధకంతో బాధపడుతున్న పిల్లలకు ఆలివ్‌ఆయిల్‌తో చేసిన ఆహార పదార్థాలను తినిపిస్తే నయం అవుతుంది లేదా ఆలివ్‌ఆయిల్‌ను వెచ్చచేసి పిల్లల బొడ్డు చుట్టూ మర్దన చేసినట్తెతే మలబద్ధకం తగ్గుతుంది.

ఇవికూడా చూడండి

మూలాలు