యవలు

యవలు ఒక గడ్డి జాతిమొక్క. దీన్ని బార్లీ అనే ఇంగ్లీషు మాటతో ఎక్కువగా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ వాతావరణంలో పండించే ప్రధాన ధాన్యపు రకం ఇది. మానవుడు సాగు చేసిన మొదటి ధాన్యాలలో ఇదొకటి, ముఖ్యంగా యురేషియాలో 10,000 సంవత్సరాల క్రితమే దీన్ని పండించారు.[1] బార్లీని జంతువులకు మేతగా, బీరు వంటి స్వేదన పానీయాలకు అవసరమైన పులియబెట్టిన పదార్థాల వనరుగాను, వివిధ ఆరోగ్య ఆహారాలలో ఒక భాగంగానూ ఉపయోగిస్తారు. దీన్ని సూప్ లలోను, బార్లీ రొట్టెలోనూ ఉపయోగిస్తారు.

యవలు
Barley field
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Poales
Family:
Genus:
Hordeum
Species:
H. vulgare
Binomial name
Hordeum vulgare

2017 లో 14.9 కోట్ల టన్నుల ఉత్పత్తితో మొక్కజొన్న, బియ్యం, గోధుమల తరువాత బార్లీ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో ఉంది.[2]

బార్లీ ప్రసక్తి ఋగ్వేదంలోను ఇతర గ్రంథాల్లోనూ అనేకసార్లు వస్తుంది.[3] హరప్పా నాగరికతలో 5700–3300 సంవత్సరాల క్రితం బార్లీ సాగు జాడలు కనుగొన్నారు.[4]

బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది, రక్తపోటు, కొలెస్ట్రాల్, అధిక బరువుని తగ్గించేస్తుంది.పిల్లలకి బార్లీ నీరు పట్టించడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.

మూలాలు