ప్లయోసీన్

సిస్టమ్/
పీరియడ్
సీరీస్/
ఇపోక్
స్టేజ్/
ఏజ్
వయసు (Ma)
క్వాటర్నరీప్లైస్టోసీన్గెలాసియన్younger
నియోజీన్ప్లయోసీన్పియాసెంజియన్2.583.600
జాంక్లియన్3.6005.333
మయోసీన్మెస్సీనియన్5.3337.246
టోర్టోరియన్7.24611.63
సెర్రావాలియన్11.6313.82
లాంగియన్13.8215.97
బుర్డిగాలియన్15.9720.44
అక్విటానియన్20.4423.03
పాలియోజీన్ఓలిగోసీన్చాటియన్older
Subdivision of the Neogene Period
according to the ICS, as of 2017.[1]

53.33 లక్షల సంవత్సరాల క్రితం నుండి 25.8 లక్షల సంవత్సరాల క్రితం వరకూ ఉన్న కాలాన్ని భౌగోళిక కాలమానంలో ప్లయోసీన్ ఇపోక్ అంటారు. ఇది సెనోజాయిక్ ఎరా లోని, నియోజీన్ పీరియడ్‌లో రెండవ పీరియడ్. మయోసీన్ ఇపోక్ తరువాత ప్లయోసిన్ వస్తుంది. ప్లయోసీన్ తరువాత ప్లైస్టోసీన్ వస్తుంది..భౌగోళిక కాలమానాన్ని 2009 లో సవరించడానికి ముందు, ప్లయోసీన్‌లో కూడా ఒక గ్లేసియేషన్ (25.88 – 18.06 లక్షల సంవత్సరాల క్రితం వరకూ సాగినది) ఉండేది. సవరణలో దాన్ని ప్లైస్టోసీన్‌లో చేర్చారు.[2]

దీనికంటే పాత భౌగోళిక కాలాల మాదిరిగానే, ప్లయోసీన్ ప్రారంభం, ముగింపులను నిర్వచించే భూమి పొరలు స్పష్టంగానే ఉన్నాయి. కానీ ప్రారంభం, ముగింపుల ఖచ్చితమైన తేదీలు కొద్దిగా అనిశ్చితంగా ఉన్నాయి. ప్లయోసీన్‌ సరిహద్దులను నిర్వచించేందుకు వీలైన ప్రపంచవ్యాప్త ఘటనలేమీ లేవు. వెచ్చని మయోసీన్ కాలం, సాపేక్షికంగా చల్లగా ఉండే ప్లయోసీన్ కాలాల మధ్య ప్రాంతీయ సరిహద్దులే ఉన్నాయి. ప్లైస్టోసీన్ కాలపు గ్లేసియేషన్ల ప్రారంభాన్ని ఎగువ సరిహద్దుగా నిర్ణయించారు.

ఉపవిభాగాలు

ప్లయోసీన్‌ ఉపవిభాగాలు

ICS వారి అధికారిక కాలమానంలో, ప్లయోసీన్‌ను రెండు దశలుగా విభజించారు. అతినూతనం నుండి అతిపురాతనం వరకు ఇవి:

  • పియాసెంజియన్ (36.00-25.80 లక్షల సంవత్సరాల క్రితం)
  • జాంక్లియన్ (53.33-36.00 Ma)

పియాసెంజియన్‌ను కొన్నిసార్లు మలి ప్లయోసీన్ అనీ, జాన్‌క్లియన్‌ను తొలి ప్లయోసీన్ అని పిలుస్తారు.

  • ఉత్తర అమెరికా భూ క్షీరద యుగంలో (NALMA) హెంఫిలియన్ (9-4.75 Ma), బ్లాన్కన్ (4.75-1.806 Ma) ఉన్నాయి. బ్లాంకన్ ప్లైస్టోసీన్ లోకి విస్తరించింది.
  • దక్షిణ అమెరికన్ భూ క్షీరద యుగాలలో (SALMA) మాంటెహెర్మోసన్ (6.8–4.0 మా), చపాద్మలాలన్ (4.0–3.0 మా), ఉక్వియన్ (3.0–1.2 మా) ఉన్నాయి.

బ్రిటన్లో ప్లయోసీన్‌ కాలాన్ని క్రింది దశలుగా విభజించవచ్చు (పాత నుండి కొత్తది): గెడ్‌గ్రేవియన్, వాల్టోనియన్, ప్రీ-లుధామియన్, లుధామియన్, థూర్నియన్, బ్రామెర్టోనియన్ లేదా ఆంటియన్, ప్రీ-పాస్టోనియన్ లేదా బావెంటియన్, పాస్టోనియన్, బీస్టోనియన్ . నెదర్లాండ్స్‌లో ప్లయోసీన్‌ కాలాన్ని క్రింది దశలుగా విభజించవచ్చు (పాత నుండి కొత్తది): బ్రున్‌సుమియన్ సి, రివేరియన్ ఎ, రివేరియన్ బి, రివేరియన్ సి, ప్రెటిగ్లియన్, టిగ్లియన్ ఎ, టిగ్లియన్ బి, టిగ్లియన్ సి 1-4 బి, టిగ్లియన్ సి 4 సి, టిగ్లియన్ సి 5, టిగ్లియన్ సి 6 ఎబురోనియన్. ఈ స్థానిక దశలకు, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రఫీ (ఐసిఎస్) దశలకూ మధ్య పరస్పర సంబంధం ఇంకా తెలియదు.[3]

శీతోష్ణస్థితి

మధ్య-ప్లయోసీన్ వార్షిక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత తేడాలు - పునర్నిర్మించినది
19 వ శతాబ్దపు కళాకారుడి ప్లయోసీన్ ప్రకృతి దృశ్యం

ప్లయోసీన్ మధ్యకాలంలో (33–30 లక్షల సంవత్సరాల క్రితం) ప్రపంచ సగటు ఉష్ణోగ్రత, నేటి ఉష్ణోగ్రత కంటే 2 – 3 °C ఎక్కువగా ఉండేది.[4] కార్బన్ డయాక్సైడ్ ఇప్పటి స్థాయిలో ఉండేది. ప్రపంచ సముద్ర మట్టం ఈనాటి కంటే 25 మీ. ఎక్కువగా ఉండేది.[5] తుది ప్లయోసీన్ కాలం మొదట్లో - 30 లక్షల సంవత్సరాల క్రితం - గ్రీన్లాండ్‌పై విస్తృతమైన గ్లేసియేషను మొదలైంది. అంతకు ముందు వరకు ఉత్తరార్ధగోళంపై మంచు పలక ఉన్నా, అది తాత్కాలికమైనదే.[6] ఈ ఇపోక్ ముగిసే సమయానికి మధ్య అక్షాంశాలపై గ్లేసియేషను ఏర్పడుతోంది. ప్లయోసీన్‌ సమయంలో సంభవించిన ప్రపంచవ్యాప్త శీతలీకరణ అడవుల అదృశ్యం కావడానికి, గడ్డి భూములు, సవానాల వ్యాప్తికీ దారితీసింది.

పాలియోజియాగ్రఫీ

పనామా భూసంధి ఏర్పడిన తరువాత అమెరికాలో జరిగిన వలసల ఉదాహరణలు. ఆలివ్ గ్రీన్ ఛాయలు దక్షిణ అమెరికా మూలానికి చెందిన ఉత్తర అమెరికా జాతులను సూచిస్తాయి; నీలం ఛాయలు ఉత్తర అమెరికా మూలానికి చెందిన దక్షిణ అమెరికా జాతులను సూచిస్తాయి.

ఖండాల చలనం కొనసాగింది. నేటి స్థానాల నుండి 250 – 70 కి.మీ. దూరం నుండి ఇప్పటి స్థానాలకు అవి జరిగాయి. ప్లయోసీన్ సమయంలో ఉత్తర, దక్షిణ అమెరికాలు పనామా భూసంధి ద్వారా కలిసి ఉండేవి. దీంతో రెండు ఖండాల్లోని జంతు జాలాలు అటు నుండి ఇటు, ఇటూ నుండీ అటూ వెళ్ళాయి. దీన్ని గ్రేట్ అమెరికన్ ఇంటర్‌చేంజ్‌ అంటారు. దక్షిణ అమెరికాకే ప్రత్యేకమైన పెద్ద మార్సుపియల్ ప్రిడేటర్, స్థానిక అన్‌గులేట్ జంతుజాలాలు దాదాపు అంతరించిపోయాయి. భూసంధి ఏర్పడటం ప్రపంచ ఉష్ణోగ్రతలపై పెద్ద పరిణామాలను చూపింది. ఎందుకంటే వెచ్చని భూమధ్యరేఖ సముద్ర ప్రవాహాలకు అడ్డంకి ఏర్పడి, అట్లాంటిక్ సముద్రంతో లంకె తెగిపోయింది. చల్లటి ఆర్కిటిక్, అంటార్కిటిక్ జలాలు అట్లాంటిక్ జలాలతో కలిసి అట్లాంటిక్ శీతలీకరణ చక్రం ప్రారంభమైంది. దీంతో అట్లాంటిక్ సముద్రం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చల్లని ఆర్కిటిక్, అంటార్కిటిక్ జలాలు ఇప్పుడు వేరుచేయబడిన అట్లాంటిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతను తగ్గించాయి.

ఐరోపాతో ఆఫ్రికా గుద్దుకోవడంతో మధ్యధరా సముద్రం ఏర్పడింది. టెథిస్ మహాసముద్ర అవశేషం వేరుపడిపోయాయి. మయోసీన్, ప్లయోసీన్‌ల మధ్య సరిహద్దు వద్ద మెస్సినియన్ లవణీయత సంక్షోభం ఏర్పడింది.

సముద్ర మట్టం లోని మార్పుల కారణంగా అలాస్కా, ఆసియాల (బెరింగియా) మధ్య నున్న భూ వంతెనను బయట పడింది.

ప్లయోసీన్‌ సముద్ర శిలలు మధ్యధరా, భారతదేశం, చైనాలలో బాగా బయటపడ్డాయి. వేరేచోట్ల, అవి ఎక్కువగా తీరాల వద్దే బయటపడ్డాయి.

ప్లయోసీన్‌లో దక్షిణ నార్వే, దక్షిణ స్వీడన్ లో సముద్ర మట్టానికి సమీపంలో ఉన్న ప్రాంతాలు పైకి లేచాయి. నార్వేలో ఈ పెరుగుదల, ప్లయోసీన్‌ తొలినాళ్ళలో హార్డన్‌గెర్విడ్డా పీఠభూమిని 1200 మీ. పైకి లేపింది.[7] దక్షిణ స్వీడన్‌లో ఇలాంటి కదలికలు దక్షిణ స్వీడిష్ ఎత్తైన ప్రాంతాలను ఎత్తాయి. దీంతో పురాతన ఎరిడానోస్ నది, దక్షిణ-మధ్య స్వీడన్ మీదుగా ఉండే దాని అసలు మార్గం నుండి మళ్ళింపుకు గురై, స్వీడన్‌కు దక్షిణంగా ప్రవహించడం మొదలు పెట్టింది.[8]

వృక్షజాలం

శీతోష్ణస్థితి చల్లగా, పొడిగా మారడంతో ప్లయోసీన్‌ వృక్షసంపదపై గణనీయమైన ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల జాతులను తగ్గిపోయయి. ఆకురాలు అడవులు విస్తరించాయి. శంఖాకార అడవులు, టండ్రాలూ ఉత్తరాన చాలా భాగం విస్తరించాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలోనూ గడ్డి భూములు విస్తరించాయి. ఉష్ణమండల అడవులు భూమధ్యరేఖ చుట్టూ ఒక చిన్నపాటి పట్టీకే పరిమిత మయ్యాయి. ఆసియా, ఆఫ్రికాల్లో పొడి సవానాలతో పాటు ఎడారులు కనిపించాయి.

జంతుజాలం

సముద్ర, భూ జంతుజాలాలు రెండూ ఆధునికమైనవే. భూచరాలు నేటి కన్నా కొంచెం ప్రాచీనమైనవి. మొట్టమొదటి హోమినిన్లైన, ఆస్ట్రాలోపిథెసీన్‌లు, ప్లయోసీన్‌లో కనిపించాయి.

భూఖండాలు గుద్దుకోవటం అంటే గొప్ప వలసలకు, గతంలో వేరుపడి ఉన్న జాతులు మిళితమవడానికీ తెరదీయడమే. గ్రేట్ అమెరికన్ ఇంటర్‌చేంజ్ అటువంటి మిళిత ఘటనే. మాంసాహారుల మాదిరిగానే శాకాహారులు కూడా పెద్దవయ్యాయి.

క్షీరదాలు

హోమినిన్ కాలరేఖ
view • discuss • edit
-10 —
-9 —
-8 —
-7 —
-6 —
-5 —
-4 —
-3 —
-2 —
-1 —
0 —
తొలి కోతులు
LCA–Gorilla
separation
Possibly bipedal
LCA–Chimpanzee
separation
తొట్టతొలి ద్విపాది
తొట్టతొలి రాతి పనిముట్లు
Earliest exit from Africa
తొట్టతొలిగా నిప్పు వాడకం
తొలి వంట
తొలి దుస్తులు
ఆధునిక మాట
ఆధునిక మానవులు
Axis scale: million years
Also see: Life timeline and Nature timeline

ఉత్తర అమెరికాలో ఎలుకలు, పెద్ద మాస్టోడన్స్, గోంఫోథెరెస్, ఒపోసమ్‌ల జీవనం కొనసాగింది. ఒంటె, జింక, గుర్రం లాంటి గిట్టలు కలిగిన జంతువుల జనాభా క్షీణించిపోయింది. ఖడ్గమృగాలు, మూడు వేళ్ళ గిట్టల గుర్రాలు, ఓరియోడాంట్‌లు, ప్రోటోసెరాటిడ్‌లు, చాలికోథెరెస్‌లూ అంతరించి పోయాయి.బోరోఫాగిన్ కుక్కలు, అగ్రియోథెరియంలు అంతరించి పోయాయి. కాని వీసెల్ ఫ్యామిలీతో సహా ఇతర మాంసాహారులు వైవిధ్యభరితంగా మారాయి. కుక్కలు, చిన్న ముఖం గల ఎలుగుబంట్లు నిలబడ్డాయి. పనామా భూసంధి ఏర్పడటంతో గ్రౌండ్ స్లోత్‌లు, భారీ గ్లిప్టోడాంట్లు, అర్మడిల్లోలు ఉత్తరానికి వెళ్ళాయి.

యురేషియాలో ఎలుకలు నిలదొక్కుకున్నాయి. ప్రైమేట్‌ల విస్తరణ క్షీణించింది. ఆసియాలో ఏనుగులు, గోంఫోథెరెస్, స్టెగోడాంట్లు కొనసాగాయి. ఆఫ్రికా నుండి హైరాక్స్‌లు ఉత్తరానికి వలస వెళ్ళాయి. గుర్రపు వైవిధ్యం క్షీణించింది. టాపిర్లు, ఖడ్గమృగాలు బాగానే ఉన్నాయి. ఆవులు, జింకలు కూడా బానే ఉన్నాయి. కొన్ని ఒంటె జాతులు ఉత్తర అమెరికా నుండి ఆసియాలోకి ప్రవేశించాయి. కుక్కలు, ఎలుగుబంట్లు, వీసెల్స్‌తో సహా ఇతర మాంసాహారులు - హైనాలు, కోర దంతాల పిల్లులు కనిపించాయి.

దస్త్రం:Pliocene.jpg
ఉత్తర అమెరికా యొక్క ప్లయోసీన్‌ క్షీరదాలు

ఆఫ్రికాలో గిట్టల జంతువులు మెండుగా ఉన్నాయి. ప్రైమేట్స్ పరిణామం కొనసాగింది. ఆస్ట్రాలోపిథెసీన్లు (కొన్ని తొలి హోమినిన్లు) ప్లయోసీన్ చివరిలో కనిపించాయి. ఎలుకలు కొనసాగాయి. ఏనుగుల జనాభా పెరిగింది. ఆవులు, జింకలు జాతుల సంఖ్యలో వైవిధ్య పెరిగి పందుల జనాభాను మించిపోయాయి. తొలి జిరాఫీలు కనిపించాయి. గుర్రాలు, ఆధునిక ఖడ్గమృగాలు రంగం లోకి వచ్చాయి. ఎలుగుబంట్లు, కుక్కలు, వీసెల్ (ఉత్తర అమెరికాకు చెందినవి) లు ఆఫ్రికా వేటజంతువులైన పిల్లులు, హైనాలు, సివెట్ల వంటి వాటి సరసన చేరాయి. దీంతో హైనాలు స్కావెంజర్‌లుగా మారక తప్పలేదు.

క్రెటేషియస్ తరువాత మొదటిసారిగా ఉత్తర అమెరికా జాతులు దక్షిణ అమెరికాపై దాడి చేసాయి. ఉత్తర అమెరికా ఎలుకలు, ప్రైమేట్లు దక్షిణ అమెరికా లోని వాటితో కలిసిపోయాయి. దక్షిణ అమెరికా స్థానిక జాతులైన లిటోప్టర్న్, నోటౌంగులేట్‌లు తుడిచిపెట్టుకు పోయాయి. మాక్రాకినెడ్, టోక్సోడాంట్‌లు మాత్రం మనగలిగాయి. చిన్న వీసెల్ లాంటి మాంసాహార మస్టెలిడ్స్, కోటిస్, చిన్న ముఖం గల ఎలుగుబంట్లు ఉత్తరం నుండి వలస వెళ్ళాయి. పచ్చిక మేసే గ్లైప్టోడాంట్లు, జెయింట్ గ్రౌండ్ స్లోత్‌లు, చిన్న కేవియోమార్ఫ్ ఎలుకలు, పంపాథేర్లు, అర్మడిల్లోలు దీనికి విరుద్ధంగా చేశాయి, ఉత్తరానికి వలస వెళ్లి అక్కడ అభివృద్ధి చెందాయి .

ఆస్ట్రేలియన్ క్షీరదాలలో మార్సుపియల్స్ అధిక సంఖ్యలో ఉన్నాయి. వాటిలో వొంబాట్స్, కంగారూలు, భారీ డిప్రొటోడాన్ వంటి శాకాహారులు ఉన్నాయి. మాంసాహార మార్సుపియల్స్ ప్లయోసీన్‌లో వేటను కొనసాగించాయి. వీటిలో డాస్యూరిడ్స్, కుక్కలాంటి థైలాసిన్, పిల్లి లాంటి థైలాకోలియో ఉన్నాయి. మొట్ట మొదటిగా ఎలుకలు ఆస్ట్రేలియా చేరుకున్నాయి. ఆధునిక ప్లాటిపస్ కనిపించింది.

పక్షులు

టైటానిస్

దక్షిణ అమెరికాకు చెందిన ఫోరస్రాసిడ్లు ఈ సమయంలో చాలా అరుదుగా ఉన్నాయి; వీటిలో చివరిదైన టైటానిస్, ఓ పెద్ద ఫోరస్రాసిడ్. ఇది ఉత్తర అమెరికాకు వలస వచ్చి, అక్కడి క్షీరదాలను మించిన ప్రెడేటర్‌గా మారింది. సిగ్నస్, బుబో, స్ట్రుతియో, కార్వస్ వంటి జాతుల పక్షులు బహుశా ఈ సమయంలో ఉద్భవించాయి. వాటిలో కొన్ని ఇప్పుడు అంతరించిపోయాయి.

సరీసృపాలు, ఉభయచరాలు

ఐరోపాలో వాతావరణం చల్లబడటంతో అక్కడి ఎలిగేటర్లు, మొసళ్ళు అంతరించాయి. ఎలుకలు, పక్షులు వృద్ధి చెందడంతో విషపూరిత పాముల జనాభా పెరుగుతూ వచ్చింది. రాటిల్ స్నేక్ మొదటగా ప్లయోసీన్‌లో కనిపించాయి. ఎలిగేటర్ మిస్సిస్సిప్పియెన్సిస్ ఆధునిక జాతి మయోసీన్లో ఉద్భవించి, ప్లయోసీన్‌లో కొనసాగింది; టేనస్సీ లోని చివరి మయోసిన్ నిక్షేపాలలో వీటి నమూనాలు కనబడ్డాయి. ఉత్తర అమెరికాలో హెస్పెరోటెస్టూడో వంటి జీనస్‌కు చెందిన పెద్ద తాబేళ్లు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. మాడ్సోయిడ్ పాములు ఆస్ట్రేలియాలో ఇంకా ఉన్నాయి. అల్లోకాడాటా అనే ఉభయచర ఆర్డర్ అంతరించిపోయింది.

మహాసముద్రాలు

ప్లయోసీన్ సమయంలో మహాసముద్రాలు చల్లబడుతూ ఉన్నప్పటికీ, సాపేక్షికంగా వెచ్చగానే ఉండేవి. ఆర్కిటిక్ మంచు టోపీ ఏర్పడింది. దీంతో శీతోష్ణస్థితి పొడిగా మారింది. ఉత్తర అట్లాంటిక్‌లో చల్లని లోతులేని ప్రవాహాలు పెరిగాయి. అంటార్కిటిక్ నుండి లోతైన చల్లని ప్రవాహాలు ప్రవహించాయి.

సుమారు 35 లక్షల సంవత్సరాల క్రితం పనామా భూసంధి ఏర్పడటంతో క్రెటేషియస్, ప్రారంభ సెనోజాయిక్ కాలాల నుండీ ఉనికిలో ఉన్న, భూమధ్యరేఖ ప్రాంతంలో భూమి చుట్టూ ప్రవహించిన ప్రవాహాలు తెగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాలు మరింత చల్లబరచడానికి ఇది దోహదం చేసి ఉండవచ్చు.

ప్లయోసీన్‌ కాలపు సముద్రాలు సముద్రపు ఆవులు, సీల్‌లు, సముద్ర సింహాలు, సొరచేపలతో కళకళలాడుతూ ఉండేవి.

సూపర్ నోవాలు

సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం, ప్లయోసీన్ ఇపోక్ చివర్లో, భూమి నుండి 130 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నస్కార్పియస్-సెంటారస్ OB అసోసియేషన్ అని పిలిచే ప్రకాశవంతమైన O, B నక్షత్రాల సమూహంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూపర్నోవా పేలుళ్లు సంభవించి, లోకల్ బబుల్ అనే విశేషం ఏర్పడింది అని 2002 లో నార్సిసో బెనెటెజ్ తదితరులు లెక్కవేసారు.[9] ఇంత దగ్గరలో జరిగిన సూపర్‌నోవా కారణంగా భూమి ఓజోన్ పొర నాశనమై సముద్ర జీవజాలం కొంతవరకూ నాశనమై ఉండవచ్చు. (ఇంత పెద్ద సూపర్నోవా తీవ్రత 20000 కోట్ల నక్షత్రాలున్న గెలాక్సీ యొక్క ల్యూమినోసిటీతో సమానం).[10][11] పురాతన సముద్రగర్భ నిక్షేపాలలో లభించిన రేడియోధార్మిక ఐరన్ -60 ఐసోటోపులు ఈ పరికల్పనకు మరింత మద్దతు నిచ్చాయి. ఈ రేడియోధార్మిక ఐసోటోప్‌ సహజంగా భూమిపై లభించదు, అందుచేత సూపర్నోవా నుండే వచ్చి ఉండాలి. పైగా, ఐరన్ -60 అవశేషాలు 26 లక్షల సంవత్సరాల క్రితం ఒక్కసారిగా భారీగా పెరిగినట్లు సూచిస్తున్నాయి. అయితే 10 మిలియన్ సంవత్సరాలకు పైగా ఎక్కువ స్థాయిలో ఉండటంతో ఒకటి కంటే ఎక్కువ సూపర్నోవాలు జరిగి ఉండవచ్చని కూడా సూచిస్తున్నాయి.

2019 లో పరిశోధకులు అంటార్కిటికాలో కూడా ఈ ఇంటర్‌స్టెల్లార్ ఐరన్ -60 ఐసోటోపులను కనుగొన్నారు. ఇవి సౌర వ్యవస్థ నివసించే స్థానిక ఇంటర్‌స్టెల్లార్ మేఘానికి సంబంధించినవని తేలింది.[12]

ఇవి కూడా చూడండి

మూలాలు